30, అక్టోబర్ 2023, సోమవారం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం - ద్వితీయ - కృత్తిక - ఇందు వాసరే* (30.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/BLFBnLMCr1M?si=gpxquFEG5iGTQrjT



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Aatagaadu

 https://youtube.com/shorts/_oVDxDfSZAw?si=iqsGj4YwcHzNe1n4


*శ్రీ స్వామివారి వివరణ..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ స్వామివారి వివరణ..*


*(పన్నెండవ రోజు)*


శ్రీ స్వామివారు తన తపోసాధన కొరకు ఆశ్రమం నిర్మించుకోవాలని, అందుకు భూమి కావాలనీ శ్రీధరరావు దంపతులను కోరడం..వారు తర్జన భర్జన పడటం జరుగుతూవుంది..ప్రత్యామ్నాయంగా  పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి..కొన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి.. ఆశ్రమ వాతావరణాన్ని ఈ మాలకొండ మీదే కల్పిస్తే ఎలావుంటుందని దంపతులిద్దరూ తలపోయసాగారు.. కానీ ఈ విషయాన్ని శ్రీ స్వామివారితో ఎలా చెప్పాలా అన్న మీమాంస వాళ్ళిద్దరినీ వెంటాడుతోంది..ఈ ఆలోచన ను తమలోనే దాచుకున్నారు..


వరుసగా ఆరేడు వారాలపాటు శ్రీధరరావు గారొక్కరే మాలకొండ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి..ప్రభావతి గారు ఇంటివద్దే ఉండిపోవాల్సివచ్చింది..మాలకొండ మీదకు రోడ్డు వేసే పని మొదలుపెట్టారు..శ్రీధరరావు గారు ఆ పని మీద వున్నారు..కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మాలకొండ మీదుగా వేరే ఊళ్లకు వెళుతూ శ్రీధరరావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిని కలిసి వెళుతూ వుండేవారు..అలా వచ్చిన వారిలో ఒకరిద్దరికి శ్రీ స్వామివారిని చూపిద్దామని శ్రీధరరావు గారు ప్రయత్నం చేశారు..కానీ అదేమీ చిత్రమో.. శ్రీ స్వామివారు అటు శివాలయం లోగానీ..ఇటు పార్వతీదేవి మఠం లోగానీ కనుపించేవారు కాదు..ఎంత సేపు వేచి చూసినా శ్రీ స్వామివారి జాడే తెలిసేది కాదు..వచ్చిన వారు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిపోయేవారు..అలా రెండు మూడు సార్లు శ్రీధరరావు గారికి అనుభవం అయింది..


ఒకరోజు, శ్రీధరరావు గారొక్కరే పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు..చిత్రం..శ్రీ స్వామివారు ఆ ఆలయం వెలుపల వున్న అరుగుమీద పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..శ్రీధరరావు గారిని చూడగానే నవ్వుతూ.."శ్రీధరరావు గారూ నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా?.." అన్నారు..


శ్రీధరరావు గారు అవాక్కయ్యారు.."అది కాదు స్వామీ..ప్రముఖ వ్యక్తులు ఇక్కడిదాకా వచ్చారు..మీ దర్శనం చేయిద్దామని అనుకున్నాను..మీరు కనిపించలేదు.." అన్నారు..


"ఇక్కడ నేను తపస్సుచేసుకుంటున్నానని అందరికీ ప్రచారం కావడం..నన్ను చూడటం కోసం వారం కాని వారం లో ఈ మాలకొండ ఎక్కడం..నాకోసం కొండమీద పడిగాపులు కాయడం..నన్ను వెతుక్కుంటూ అన్ని గుహలు తిరగడం..ఒకవేళ నేను కనబడితే..కాళ్లకు మొక్కడం..అది వీలుగాకపోతే..నామీదకు చిల్లర డబ్బులు విసరడం..ఇదంతా ఏమిటి?..నా తపోభంగం కావడం తప్ప వేరే ప్రయోజనం ఉందా?.."


"ఈ మాల్యాద్రి క్షేత్రానికి ఓ నియమం ఉంది శ్రీధరరావుగారూ..మీకూ తెలుసు..వారం లో ఆదివారం నుంచీ శుక్రవారం వరకూ దైవపూజ..ఒక్క శనివారం నాడు మాత్రమే మానవపూజ అని..నా మూలంగా ఈ సాంప్రదాయం తప్పుతోంది..నన్ను చూడటం కోసం జనాలు ఏరోజు పడితే ఆరోజు ఈ కొండమీద సంచరిస్తున్నారు..ఇది నివారిద్దామనే నేను, నా శేష తపోసాధనకు వేరే ప్రదేశం ఎన్నుకోదలచాను.. అందుకే మిమ్మల్ని భూమి అడిగాను.." అంటూ ఒక్కక్షణం ఆగి..


"ఈ పార్వతీదేవి మఠానికి మార్పులు చేసి, నాకు నివాసయోగ్యంగా చేద్దామని తలపోస్తున్నారా?..


"కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపః "


 అన్నట్లుగా అది సమస్యను మరింత జటిలం చేస్తుందేగానీ.. పరిష్కారం కాదు.." అన్నారు..


శ్రీధరరావు గారు ఆశ్చర్యపోయారు..ఈ ప్రతిపాదన తానూ తన భార్య అనుకున్నది..శ్రీ స్వామివారికెలా తెలిసిందీ?..అనుకుంటూ శ్రీ స్వామివారికేసి చూసారు..శ్రీ స్వామివారి మొహంలో అదే చిరునవ్వు..అదే ప్రశాంతత!..


"మీరు ఇతరత్రా ఆలోచనలు పెట్టుకోకండి..ఇంటికెళ్లి అమ్మతో చెప్పండి..ఇక్కడ ఎక్కువకాలం నేను ఉండటం సాధ్యపడదు..దైవానుగ్రహం ఉన్నంత వరకూ అన్ని సాధనలూ సవ్యంగా సాగుతాయి..ఆ లక్ష్మీనృసింహుడి ఆదేశం అయిన తరువాత ఆలస్యం చేయకూడదు..నా తపోసాధన ఇంతవరకూ ఈ శివపార్వతుల ఒడిలో జరిగిపోయింది..ఇకముందు జరగాల్సిన ప్రదేశం కావాలి..అందుకు మిమ్మల్ని స్థలం అడిగాను..అది దత్తక్షేత్రం అవుతుంది.." అని చెప్పి..పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లిపోయారు..


శ్రీధరరావు గారు తిరిగి మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారితో జరిగిన సంభాషణ అంతా..పూసగ్రుచ్చినట్లు ప్రభావతి గారికి చెప్పేసారు..

"సరే శ్రీవారూ..దైవానుగ్రహం ఎలా వుంటే అలా జరుగుతుంది..అంతగా స్వామివారు చెపుతున్నారు కదా..మన ప్రయత్నం మనం చేద్దాం..మీరే అన్నారుకదా కాలం ఎన్ని మలుపులు తిప్పుతుందో మన జీవితాలను అని..ఆ లక్ష్మీ నరసింహ స్వామి పాదాలను నమ్మి వున్నాము..ఆయన చెంతనే ఈ స్వామివారిని మనం కలిసాము...ఇప్పుడు కూడా ఆ నారసింహుడిదే ఈ భారం.." అని అన్నారు..శ్రీ చెక్కా కేశవులు గారితో కూడా శ్రీ స్వామివారు తపోసాధనకు తమను స్థలం అడిగిన విషయం చెప్పారు శ్రీధరరావు గారు..


ఆ తరువాత మరో రెండురోజుల్లో మళ్లీ మాలకొండ వెళ్లారు శ్రీధరరావు గారు..శ్రీ స్వామివారిని కలిశారు.."అమ్మతో చెప్పావా నాయనా?.." అన్నారు..అవునన్నట్లు తలూపారు శ్రీధరరావు గారు.."మంచిది..అంతా శుభమే జరుగుతుంది.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్ల అనుభవాలు..రేపటినుంచి..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

30-10-2023* *ఇందు వాసరః {సోమ వారం}* *రాశి ఫలితాలు

 *30-10-2023*

*ఇందు వాసరః {సోమ వారం}*

*రాశి ఫలితాలు*

*మేషం*

విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు  కలుగుతాయి. నూతన వ్యాపారములలో ఆశించిన లాభాలు  పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

*వృషభం*

వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు  తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి.  సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణ యత్నాలు కలసిరావు.

*మిధునం*

శ్రమాదిక్యాతతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రతి చిన్న వ్యవహారానికి  ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో  అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది.

*కర్కాటకం*

చేపట్టిన పనులలో ఆటంకాలు  తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో  కొన్ని సమస్యల నుండి బయట పడగలరు. విద్యా సంబంధిత కార్యక్రమాలకు  ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారమున  మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

*సింహం*

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం  అందుతుంది. బంధు, మిత్రులతో   ఏర్పడిన వివాదాలు తొలగుతాయి.  వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.  క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

*కన్య*

కీలక వ్యవహారాలలో సోదరులతో  భేదాభిప్రాయాలు కలుగుతాయి. స్త్రీసంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండటం  మంచిది. భాగస్వామి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.

*తుల*

జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలలో వాహనప్రమాద సూచనలుఉన్నవి. నూతన కార్యక్రమాలు  ప్రారంభానికి అవరోధాలు  తప్పవు. దూరప్రాంత బంధువుల నుండి కొన్ని  విషయాలు తెలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో  అధికారులతో సమస్యలు కలుగుతాయి.

*వృశ్చికం*

సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. అన్నిరంగాల వారికి తగిన  గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల  నుండి సహాయ సహకారాలు అందుతాయి. బందు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత  పురోగతి సాధిస్తారు.

*ధనస్సు*

మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో నైపుణ్యంతో అందరిని  మీ మాటకు తీసుకొస్తారు. మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు. వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. 

*మకరం*

మిత్రులతో  వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  సంతాన  వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ద వహించాలి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

*కుంభం*

గృహమున ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిత్రులకు   ధన  సహాయం అందిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలను పొందుతారు.

*మీనం*

అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. విలాస వస్తువుల కోసం ధన వ్యయం  చేస్తారు.  క్రయవిక్రయాలలో లాభలు అందుకుంటారు. వృత్తి వ్యాపార లావాదేవీలు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున తొందరపాటు  నిర్ణయాలు మానుకోవాలి.

🕉️

పోతనగారి సూర్యోదయ వర్ణనం!


పోతనగారి  సూర్యోదయ వర్ణనం! 


             కం:  అరుణహరి నఖర  విదళిత


                    గురు తిమిరేంద్ర  కుంభకూట  వినిర్ము


                    క్త  రుధిర మౌక్తికముల  క్రియ


                    సురపతి దిశఁ   గెంపు తోడఁ  జుక్కలు  మెఱసెన్;  


                      భాగ-  దశ-స్కం;  1302  పద్యము-  పోతన  మహాకవి;


       సీ:   పౌలోమి  తన బాలు  పాన్పుపైఁ  గనుపట్టఁ


                                     బన్నిన  బవడంపు  బంతియనఁగ ;


             నాయురర్ధముల  వ్యయంబు  లొత్తిలి  చాటు


                                               కాల జాంఘకు  చేతి  గంట  యనఁగ :


             ఘనజంతు  జీవిత   కాలరాసులు  విధిఁ గొల్వ


                                                    నెత్తిన  ఘన  హేమకుంభమనఁగ;


              పశ్చిమ దిక్కాంతఁ  బరగఁ  గైసేయుచో


                                               ముందర  నిడుకొన్న  ముకురమనఁగ; 


     గీ:  కోక తాపోప శమన  దివ్య  ఘుటిక  యనఁగ,


           పద్మినీకాంత  నోముల  ఫలమనంగ ,


           మూడు మూర్తుల  సాకారంపు  ముద్దయనఁగ


          మిహిర  మండల  ముదయాద్రి  మీద  నొప్పె!  


                 భాగ-  దశ-స్కం;  1303  పద్యం ;  బమ్మెఱ పోతన మహాకవి!


                         ఎందరో కవులు  తమకావ్యాల్లో  సందర్భాను సారంగా  సూర్యోదయ  సూర్యాస్తమయ  దృశ్యాలను  వర్ణించారు.

ఒక్కొక్క కవిది  ఒక్కొక్కబాణి.  పోతన వర్ణించిన  సూర్యోదయ దృశ్యమిది.


                 బలరామ  కృష్ణులు  మేనమామ  పిలుపున  మధురలో   విడిసిన  సందర్భమున  నీవర్ణనమున్నది.


                   రెండు  పద్యాలుగా  మనమిప్పుడు  చెప్పుకో బోతున్నాం. మొదటిది కందపద్యం!


            మొదటి పద్యభావం:  అరుణోదయం  సిహంలా  ఉన్నదట. అది  రాత్రియనే మదపుటేనుగు  కుంభస్ధలం  బ్రద్దలుకొడుతున్నదట. ఆసందర్భంలో  ఆకుంభస్ధలం  నుండిరాలే ముత్యాలవలె తారకలు సంధ్యారాగంలో  చూపరులకు

కాననౌతున్నవట! 


                  రాత్రి అనేఏనుగు.  అరుణోదయమనే సింహము.  నక్షత్రములనే  ముత్యములు. ఇవీపోలికలు:


              రాత్రియనే  మత్తేభంమీద అపుణోదయ  సింహంలఘించింది  కుంభస్థలం ఛేదించింది. అంతే అందులో ఉన్న ముత్యాలు రాలిపడుతున్నాయి. ఆదృశ్యాన్ని తలపిస్తోంది. తొలివెలుగురేఖలు తూర్పున ఉదయిస్తుంటే.


          (సముద్రం.  మొసలినోరు  .ఏనుగు కుంభస్థలం . ముత్యాలకు  నెలవులని  కవిసమయం )


                 

                    ఇఁక  రెండవ పద్యానికి వద్దాం!   ముందు భావం  చెప్పుకుందాం!


                           "  తూరుపు దిక్కున   కనబడుతున్న  అరుణకాంతి  శచీదేవి (పౌలోమి) తనకొమరుడాడుకునుటకు  వేలాడదీసిన పగడాల  బంతి యా,యనునట్లుగను,


                           ఆయుః పరిమాణముల  లెక్కలు  వినిపించుటకు కాలమనే  గణకుడు వాయించే  చేతిలోనిగంట యా,యనునట్లును,


                       

                       ప్రాణుల  ఆయుఃప్రమాణమును  కొలుచుటకై  బ్రహ్మగారు  యెత్తిపట్టుకొన్న   బంగరు కుండ యా ,యనునట్లుగను,


                 పశ్చిమ  దిక్కనే వనిత  యలంకరణమునకై  తనయెదుట  నిలుపుకొన్న  నిలువు  టద్దమా,యనునట్లుగను,


                 చక్రవాకముల  విరహతాపమును దీర్ప కాలవైద్యుడిచ్చిన  మందుమాత్రయా ,యనునట్లును,


,,                  పద్మినీ కాంత(తామరపూవు)  నోచిన  నోముల  ఫలమా ,యనునట్లుగను,


,                   లోకాలనేలు  ముగురు మూర్తుల  ఆకారపు  మద్దయా ,  యనునటులను


                                  సూర్యమండలము  ఉదయాద్రిపై  ఒప్పారెను.


                    విశేషాంశములు;  ముందు కంస వధ జరుగ నున్నది. తత్ సూచనలను  యీపద్యమున కవి నిపుణముగా  ప్రవేశపెట్టి

నాడు. గణకుడు గంటలు మ్రోగించుట  మనలోకొందరికి పరిచయమే. ఆస్తుల వేలంపాటలలో అమీనా  పాట పూర్తయిందని చెప్పటం

కోసం ఒకటోసారి (గంట ) రెండోసారి (గంట)  యీవిధంగా హెచ్చరస్తాడు.అదిగో ఆగంటమాదిరి అరుణుడున్నాడట!


                       పల్లెలలో  ధాన్యకొలవటానికి  లోహాలతో  చేసిన పాత్రలుంటాయి. ప్రాణుల ఆయువునుకొలిచే కొలపాత్రలా 

అరుణోదయమున్నదట.  

             చంటి పిల్లలు ఆడుకుంటానికి  ఉయ్యాలపైన రంగురంగుల  బంతులు కడుతూ ఉండేవారుగదా  ఆమాదిరిగా శచీ

దేవి తన కొమారునకు ఆటలనిమిత్తం కట్టిన పగడాల బంతిలా అరుణుడున్నాడట.


                    పశ్చమ దిగంగన  అలంకారం   చేసికోవటానికి   ముందు నిలుపుకొన్న  అద్దంలా ఉన్నాడట.

సూర్యోదయం జరిగేది తూర్పుననే , కానీ  అది  పశ్చిమ దిశాభి ముఖంగానేకదా! చక్కగాఉందివర్ణన.


                  చక్రవాకములని  ఒకరకం పక్షులున్నవట. వాటికి రాత్రి వియోగం  పగలు  సమాగమం.రాత్రంతా  పడిన విరహ తాపం తగ్గటంకోసం అవివేసుకునే  ఔషధ గుళిక లాగ అరుణుడున్నాడట. 


                    ఆడవారు సౌభాగ్యంకోసం  యెన్నో నోములు నోచుతూ ఉంటారు  .పద్మినిచేసిన నోములఫలమా  యనేవిధంగాఅరుణోదయమైనదట.


                            త్రిమూర్త్యాత్మక  స్వరూపం  సూర్యభగవానుడు. బ్రహ్మ  విష్ణు  మహేశ్వరులకు  ప్రతిరూపమని వేదములుఘోషిస్తున్నాయి. 


                              ఆవిధంగా  సూర్యోదయమైనదంటారు  పోతనగారు!


                                                  స్వస్తి!🌷🙏🙏🌷🙏🙏🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷

మానవులు మాత్రము

 యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్ధేః పరంగతః |

తావుభౌ సుఖమేధేతే క్లిశ్యత్యంతరితోజనః||


ఈ ప్రపంచంలో రెండురకములవారు సుఖముగా ఉంటారు 

1మూఢులుఏమియు తెలియనివారు సుఖముగ ఉందురు

2 జ్ఞానులు (పరమహంసలు) బుద్ధికి అతీతమైన పరమాత్మనుపొంది వారు సుఖముఉందురు.

వీరిద్దరికి మధ్యన సంశయముతో వ్రేలాడే మానవులు మాత్రము దుఃఖముల పాలగుచుందురు🙏

సోమవారం, అక్టోబరు 30, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


సోమవారం, అక్టోబరు 30, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి:విదియ రా11.29 వరకు  

వారం:సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:భరణి ఉ6.12 వరకు తదుపరి కృత్తిక తె6.00వరకు

యోగం:వ్యతీపాతం రా8.10 వరకు

కరణo:తైతుల మ12.00 వరకు తదుపరి గరజి రా11.29వరకు

వర్జ్యం:సా6.06 - 7.41

దుర్ముహూర్తము:మ12.06 - 12.52 & మ2.24 - 3.09

అమృతకాలం:తె3.38 - 5.14

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00

సూర్యరాశి  : తుల

 చంద్రరాశి : మేషం 

సూర్యోదయం:6.01

సూర్యాస్తమయం:5.27


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

కైలాసగిరి నుండి కాశికై

 కైలాసగిరి నుండి కాశికై

కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్షవాటికై 

దయచేసినావయా 

హర హర హర హర 

హర హర హర హర 

హర హర హర హర

హర హర హర హర

lకైలాసగిరిl


విరిసె జాబిలి మల్లెరేఖగా 

కురిసె తేనియల మువ్వాకగా

దరిసి నీ దయ 

నిండు గోదావరీ నది 

ఝరులాయెరా హర

హర హర హర హర 

హర హర హర హర 

హర హర హర హర

హర హర హర హర

lకైలాసగిరిl


ముక్కోటి దేవతల నేతరా 

ముల్లోకముల కిష్టదాతరా

వెలిబూది పూతరా 

నలవిసము మేతరా 

హర హర హర హర 

హర హర హర హర 

హర హర హర హర

హర హర హర హర

lకైలాసగిరిl


                    - దేవులపల్లి కృష్ణశాస్త్రి

           గానం - బి వసంత

సుభాషితమ్

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


శ్లో"   *_సంసారసాగర విశాల కరాళకామ_౹*

*_నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య_౹* 

*_మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య_౹*

 *_లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్_౹౹*


_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్ - 03_


 భా: ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను....వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని..... కావున, *ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క రక్షణను [శరణును] నాకు ప్రసాదించుము*...

Panchaang