సంప్రదాయ వస్త్ర ధారణ కాకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న యువతులను అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలని యూ.పి పోలీసులకు సి.ఎం యోగి ఆదిత్య నాథ్ ఇచ్చిన ఆదేశాలు మేరకు పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది!!🫡🫡🚩🚩🫡🫡🙏🙏🚩🚩🙏🙏🔥🔥🔥
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
7, నవంబర్ 2023, మంగళవారం
ఆధ్యాత్మిక శిఖరం
*ఆధ్యాత్మిక శిఖరం... శ్రీచక్రం*
భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ మోక్షసాధన లక్ష్యంగా సాగుతుంది. ఇందుకు అనేక ఉపాసన, ధ్యాన మార్గాలను పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు సూచిస్తున్నాయి. వీటన్నిటిలో శ్రీచక్ర పూజ, అర్చన, ఉపాసన అత్యున్నతమైనవి. యోగసాధనకు శ్రీచక్ర ఉపాసన పరమోన్నతమైన మార్గం.
*శ్రీచక్ర ఆవిర్భావం*
శ్రీచక్ర ఆవిర్భావానికి సంబంధించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన ఉంది. దీని ప్రకారం భండాసురుడనే రాక్షసుడిని సంహరించటం కోసం ఇంద్రుడు అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ గొప్ప యాగాన్ని చేస్తాడు. ఫలితంగా, యజ్ఞకుండం మధ్యభాగం నుంచి అమ్మవారు శ్రీచక్రమధ్యగతయై సాక్షాత్కరిస్తుంది. మరొక కథ ప్రకారం ‘రేణు’ మహారాజు అమ్మవారి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఇందుకు మెచ్చిన జగన్మాత, శ్రీచక్రస్థితయై అతనికి ప్రత్యక్షమవుతుంది. ఈవిధంగా శ్రీచక్ర ఆవిర్భావం జరిగినట్లు పురాణాల్లో ఉంది.
*శ్రీచక్ర నిర్మాణం*
*శ్రీచక్రనిర్మాణంలో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి. బిందువు, త్రికోణం, అష్టకోణం, దశకోణాలు (రెండు), చతుర్దశ కోణం, అష్టదళం, షోడశదళం, భూపురత్రయం అనే తొమ్మిది ఆవరణలను వివిధ దేవతలు అధిష్ఠించి ఉంటారు. త్రిపురతాపినీ ఉపనిషత్తులో శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించిన వివరణ ఉంది.*
*శ్రీచక్రం భూప్రస్తారం, మేరుప్రస్తారం అనే రెండు రూపాల్లో మనకు కనిపిస్తుంది. యంత్రరూపంలో, పటం రూపంలో కనిపించేది భూ ప్రస్తారం. కాగా, ఆలయాల్లో అర్చనలు అందుకునే రూపం మేరుప్రస్తార రూపం.* శ్రీచక్రార్చనకు సంబంధించి అనేక అర్చన, ఉపాసనా విధానాలు ఆచరణలో ఉన్నాయి.
గురు పరంపర పద్ధతి ప్రకారం వీటిలో అనేక భేదాలు ఉంటాయి. వీటన్నిటిలో నవావరణార్చన ఎంతో శ్రేష్ఠం.
*శ్రీచక్రంలోని ఆధ్యాత్మిక కోణం ఎంత ఉన్నతమైందో అందులోని గణిత నిర్మాణం కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. సమున్నతమైన భారతీయ వైజ్ఞానిక దృక్పథానికి శ్రీచక్ర నిర్మాణం తార్కాణంగా నిలుస్తుంది. ప్రపంచం మొత్తమ్మీద ద్వి, త్రిజ్యామితీయ పరిమాణాల్లో ఉన్న ఏకైక నిర్మాణం శ్రీచక్రం మాత్రమే. లెక్క తెలియని లక్షల సంవత్సరాలకు పూర్వమే మనదేశం నేటి శాస్త్రవేత్తల ఊహకు సైతం అందని నిర్మాణాలు చేసిందనటానికి శ్రీచక్రం తరగని సాక్ష్యంగా నిలుస్తుంది.*
*రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కెబిఎన్ కాలేజీ, విజయవాడ-1, సెల్: 9032044115*
సంచలన తీర్పు
దేవాలయాలపై మద్రాస్ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. ఆలయ భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయని.. వాటి మీద వచ్చే ఆదాయం దేవాలయాల అభివృద్ధి, హిందువుల కోసమే ఉపయోగించాలంది. ప్రభుత్వాలు దొంగల మాదిరిగా దోచుకొని ఇతర కార్యక్రమాలు ఇతర మతాలకు ఇవ్వకూడదని చెప్పింది.
ఆలయాలకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను తెలిపింది మద్రాస్ హైకోర్టు’1985లో తమిళనాడులో 5 లక్షల ఎకరాలు దేవాలయాల భూములను ఉండేవి.. ప్రస్తుతం 4 లక్షల 50 వేలు మాత్రమే లెక్క చూపిస్తున్నారు.. మరి 50 వేల ఎకరాలు ఏమయ్యాయి లెక్క తీయండి, ఆక్రమంలో ఉంటె తొక్క తీయండి కేసులు పెట్టండి,మళ్లీ 50 వేల ఎకరాలను దేవాలయాలకు అప్ప చెప్పండి... ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలి, దేవాలయ అధికారులు ఆధీనంలో దేవాలయం ఆధీనంలో మాత్రమే ఉండాలి..ప్రభుత్వాలు పనికిరాని చెత్త పెత్తనం చేయకూడదు..హిందువుల కోసం, హిందూ ఆలయాలు అభివృద్ధి హిందూ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
అంతేకాదు..’దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి, ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, దొంగల మాదిరిగా దోచుకొని మరి ఇతర మతాల కోసం క్రైస్తవులు, ISLAMIC కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ప్రభుత్వాల రోజు వారి పరిపాలన కోసం మీ యొక్క భోగాల కోసం హిందువుల దేవాలయాల ఆదాయాన్ని ఎందుకు వాడుతున్నారు..దాతలు హిందూ దేవాలయాలకు హిందూ దేవుడికి భూములు ఇచ్చారు.. దాతలు మీ భోగాల కోసం ఇవ్వలేదు హిందూ ధర్మం కోసం ఇచ్చారు..హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి..దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు, పోస్టులు భర్తీ చేయండి హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వండి అన్యమతస్తులకు కాదు.. సెక్యూలరిజం బొంగు భోషాణం దొంగ ముచ్చట్లు అన్ని మీరు చూసుకోండి కానీ అది హిందూ దేవాలయాలు వాటిని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి..దేశంలో చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవు అందులో ఎంత ఆదాయం వస్తుందో ఎవరికీ తెలియదు కానీ హిందూ దేవాలయాలను మాత్రం దొంగల మాదిరిగా దోచుకుంటున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
దేవాలయాల భూములు దేవుళ్ళ యొక్క సంక్షేమం కోసం కృషి ఇచ్చింది ఎస్సార్ మహదేవన్ అనే జడ్జిగారు.. కొన్ని రోజుల క్రితమే మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది.. హిందూ ధర్మం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు తీసుకొని క్రైస్తవం ఇతర మతాలలో ఉద్యోగాలు తొలగించండి, జీతాన్ని రికవరీ చేయండి కేసులు పెట్టండి అని జడ్జి గారు తీర్పు ఇచ్చారు ఇప్పుడు అదే జడ్జిగారు మళ్లీ హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ కోసం గొప్ప చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది
త్వరలో హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వాధీనంలో నుండి బయటకి రావాలి, ఆక్రమణకు గురైన హిందూ దేవాలయాల భూములన్నీ మళ్ళీ దేవాలయాలకు చెందాలి. ఆలయాలు దేవుడి సాక్షిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడవాలి.. హిందూ దేవాలయాల ఆదాయంతో హిందువులకు మాత్రమే విద్య, వైద్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి కార్యక్రమాలు జరగాలి .
SAVE టెంపుల్స్ అని ఒక గొప్ప ఉద్యమం తమిళనాడులో జరుగుతుంది. భారతదేశ చరిత్ర మొత్తం మలుపుతిప్పే విధంగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
శుద్ధి చేయలేము
శ్లోకం:☝️
*చిత్తమంతర్గతం దుష్టం*
*తీర్థస్నానాన్న శుద్ధ్యతి |*
*శతశోఽపి జలైర్ధౌతం*
*సురాభాండమివాశుచిః ||*
(కాశీ ఖండం - 6/38)
భావం: మద్యంతో నిండిన కుండ వందల సార్లు నీటితో కడిగినా అది పవిత్రంగా మారనట్టు, మనస్సు మలినాలతో (పాపాలతో) నిండి ఉంటే పవిత్ర తీర్థస్నానం చేయడం ద్వారా దానిని శుద్ధి చేయలేము.
పంచాంగం 07.11.2023 Tuesday,
ఈ రోజు పంచాంగం 07.11.2023 Tuesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: దశమి తిధి భౌమ వాసర: మఘ నక్షత్రం బ్రహ్మ యోగ: వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.
దశమి ఈ రోజు పూర్తిగా ఉంది.
మఘ సాయంత్రం 04:22 వరకు.
సూర్యోదయం : 06:20
సూర్యాస్తమయం : 05:38
వర్జ్యం : రాత్రి 01:20 నుండి 03:08 వరకు.
దుర్ముహూర్తం : పగలు 08:36 నుండి 09:21 వరకు తిరిగి రాత్రి 10:43 నుండి 11:34 వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు
యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
పూజాకార్యక్రమాల సంకల్పము.
**********
*శుభోదయం*
*********
సంధ్యా వందన మరియు
ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ. 07.11..2023
మంగళ వారం (భౌమ వాసరే)
**************
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరదృతౌ
ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే దశమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
భౌమ వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరత్ ఋతౌ ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే దశమ్యాం
భౌమ వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.6.04
సూ.అ.5.24
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం
కృష్ణ పక్షం దశమి పూర్తి.
మంగళ వారం.
నక్షత్రం మఘ సా. 4.44 వరకు.
అమృతం మ. 2.05 ల 3.51 వరకు.
దుర్ముహూర్తం ఉ.8.19 ల 9.04 వరకు.
దుర్ముహూర్తం రా.10.28 ల 11.18 వరకు.
వర్జ్యం రా. 1.37 ల 3.23 వరకు .
యోగం బ్రహ్మం సా. 4.36 వరకు.
కరణం వనజి సా.6.21 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.
రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు.
గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు.
యమగండ కాలం ఉ. 9.00 ల 10.30 వరకు.
***********
పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ దశమి.
.**********
*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,
(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)
S2,/C92, 6 -3 -1599/92,బి
Sachivalayanagar,
Vanasthalipuram,
Rangareddy Dist, 500 070,
80195 66579.
.**********
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
మంగళవారం నవంబరు 7, 2023
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
మంగళవారం నవంబరు 7, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - బహళ పక్షం
తిథి:దశమి పూర్తి
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:మఖ సా4.44 వరకు
యోగం:బ్రహ్మం సా4.35 వరకు
కరణం:వణిజ సా6.23 వరకు
వర్జ్యం:రా1.36 - 3.22
దుర్ముహూర్తము:ఉ8.19 - 9.05 &
రా10.28 - 11.18
అమృతకాలం:మ2.04 - 3.51
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి: తుల
చంద్రరాశి : సింహం
సూర్యోదయం:6.04
సూర్యాస్తమయం: 5.24
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
మాట్లాడితే సత్యం
🕉️ ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🕉️
అవ్యాహృతం వ్యాహృతాయ ఆహుః సత్యం వదేత్ వ్యాహృతం తద్ద్వితీయమ్| ప్రియం వదేత్ వ్యాహృతం తత్ తృతీయం ధర్మ్యం వదేత్ వ్యాహృతం తచ్చతుర్థకమ్||
"మాట్లాడటం కంటే మౌనం మేలు. మాట్లాడితే సత్యం మాట్లాడటం రెట్టింపు మేలు. ఆ సత్యం ప్రియంగా మాట్లాడటం మూడురెట్లు మేలు.
ఆ సత్యప్రియాలు ధర్మంతో కలిసి ఉంటే అది నాలుగురెట్లు మేలు".
*07-11-2023* *రాశి ఫలితాలు
*07-11-2023*
*రాశి ఫలితాలు*
*భౌమ వాసరః మంగళ వారం*
*మేషం*
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
*వృషభం*
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో భూవివాదాలు కలుగుతాయి. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు.
*మిధునం*
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
*కర్కాటకం*
సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.
*సింహం*
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభలా బాటలో పయనిస్తాయి. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి.
*కన్య*
రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.
*తుల*
పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు.
*వృశ్చికం*
చేపట్టిన పనులు శ్రమాదిక్యాతతో కానీ పూర్తి కావు.కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వ్యాపారాలు ప్రారంబానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.
*ధనస్సు*
సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి.
*మకరం*
సంతాన విద్యా విషయాలపై ద్రుష్టి సారిస్తారు. రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భూ సంభందిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.
*కుంభం*
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది.
*మీనం*
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులులో వ్యయప్రయాసలు అధికమౌతాయి. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగములు సామాన్యంగా సాగుతాయి.
🕉️
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం - దశమి - మఘా - భౌమ వాసరే* *(07-11-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/IwI8X_i-XE0?si=B_633xNKvIGTLhak
🙏🙏