27, డిసెంబర్ 2023, బుధవారం

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 2*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*సంజయ ఉవాచ*


*దృష్ట్వా తు పాణ్డవానీకం*

*వ్యూడం దుర్యోధనస్తదా |*

*ఆచార్యముపసంగమ్య*

*రాజా వచనమబ్రవీత్ ||*


*భాష్యము:*

ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మికదృష్టి సైతము లోపించెను. ధర్మవిషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండియు ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా తెలిసియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై యుండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసికొనగలిగెను. 


కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనెంచి, పవిత్రస్థలముచే పవిత్రులైన అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరుగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవసేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజ్జస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతియైన ద్రోణాచార్యుని చెంతకు చేరేనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రత ననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసివచ్చెను. కనుకనే రాజకీయవేత్త యనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కాని పాండవ సేనా వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగపరచలేకపోయెను.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పెద్దల పరిహాసాలు

 శు భో ద యం 🙏


పెద్దల పరిహాసాలు 


                                     మన యిళ్ళలో  పెళ్ళిళ్ళు  జరిగినపుడు  పెళ్ళికి వచ్చినవారు  ఒకరితో నొకరు యెన్నిపరిహాసాలో!  యెన్నెన్ని

వినోదాలో! చెప్పటానికి వీలా? అలాటి సందర్భంలో  ఒకవేళ  జగత్పాలకులైన  త్రిమూర్తులే  అలాంటి  వ్యవహారం నడిపితే యెలాఉంటుంది?  దానిని  ఊహించే  శ్రీమతి  గంటికృష్ణవేణమ్మగారు  తాము విరచించిన  "గిరిజా కళ్యాణము"- అనేకావ్యలో  ఒక

చక్కని ఘట్టం చిత్రించారు. గిరిజా కళ్యాణానికి  విష్ణుమూర్తి  సకుటుంబంగా  విచ్చేశాడు. వివాహం జరిగాక  భోజనాలు జరుగుతున్న సందర్భం. శివుడు విస్తరిలో ఉన్నపదార్ధాలను అటునిటు కదుపుతున్నాడట!


                 అప్పుడు విష్ణువు  శివుడు ఒకరినొకరు  వేళాకోలా లాడుకొన్నారట! ఎలా?  ఇదిగో ఇలా---


      విష్ణువు  శివునితో--   "  విసము తిన్న నోట  కసవయ్యెఁగాబోలు 


                                        భక్షణంబులెల్ల   పార్వతీశ!


                                       అట్టి దివ్యమైన  ఆహారములు  లే

            

                                      వటంచు   పల్కె  విష్ణుఁ డభవు తోడ ..


                           విష్ణువు  శివునితో  యిలా అంటున్నాడు. "  ఏమయ్యా!  ఈబూరెలూ ,గారెలూ, అవీ  నీకు నచ్చినట్లు  లేదే? 

కాలకూటం తిన్న నోటికి  యీభక్ష్యాలన్నీ  గడ్డిలాగ  రుచిలేనివై కనబడుచున్నవేమో? ఏంచేస్తాం?  అన్నాడు.


                                దానికి  సమాధానంగా శివుడు ఇలా అంటున్నాడు.


              "  నిక్కము  నీవుపల్కినది   నీరజనాభ!  ఇటెందు మ్రుచ్చిలన్


                 చిక్కదు  వెన్న !  తెత్తు మన  చిక్కవు  యెంగిలి కాయలెందు, నీ


                 కెక్కడ  దెత్తుమయ్య? అవి ;  ఇప్పు డటంచు  శివుండు  నవ్వగా


                 నక్కడ  పంక్తి  భోజనము నందు  ఫకాలున   నవ్విరందరున్ "!


                         నిజమేనయ్యా  విష్ణూ! నువ్వుచెప్పింది.  ఇక్కడెక్కడా  దొంగతనంచేద్దామన్నా   వెన్న దొరకదు.  తెద్దామన్నా  యెంగిలి కాయలుదొరకనే దొరకవు.  ఎక్కడనుండి  తేగలం మరి !  అని  శివు డనగానే  బ్రహ్మ, ఇంద్రాది దేవతలు  ఫకాలున  నవ్వారట !


                        మనదృష్టిలో  యిది పరిహాసమేయైనా  కవిదృష్ట్యా  ఇది  నిందాస్తుతి!

  

                                              దీని  అంతరార్ధం యేమిటంటే- లోకాలను నాశనంచేసే  కాలకూట  విషాన్ని  కంఠాన ధరించి, అందరినీ కాపాడిన వాడు శివుడని  విష్ణువు ప్రస్తుతించితే ,వెన్నదొంగిలి నెపంతో గోపికలనుధ్ధరించినవాడనీ,, శబరి యెంగిలిపండ్లను తిని భక్తపరాధీనుడైన వాడు విష్ణు వనీ  శివుడు విష్ణువును ప్రశంసించాడు..


                                       బాగుంది కదూ?


                                                                                       స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷💐💐🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷

Chendan wood


 

Places to visit in hyderabad


 

Uthamulaku


 

Indowood


 

Railway in America


 

బుధవారం / రాశిఫలాలు*

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*27-12-2023 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుతుంది.

---------------------------------------

వృషభం


వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

మిధునం


స్థిరస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కర్కాటకం


కుటుంబసభ్యులతో స్వల్పవివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

సింహం


వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయం ఉత్సాహనిస్తుంది.  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.

---------------------------------------

కన్య


ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

తుల


చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

---------------------------------------

వృశ్చికం


ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

---------------------------------------

ధనస్సు


వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అధికారుల నుండి విమర్శలు తప్పవు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

మకరం


వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. నిరుద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

కుంభం


ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్ధిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి.

---------------------------------------

మీనం


కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కొందరి ప్రవర్తన చికాకు పరుస్తాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

Karmala valana kaadu

 


Dubai to Sharjah ferry