21, జులై 2022, గురువారం

అదృష్టవంతుడు

 అదృష్టవంతుడు 

ఎప్పుడు ఉషారుగా వుండే రామారావు ఎందుకో ఈ రోజు మూడీగా వున్నాడు.  ఎందుకా అని నేను వెళ్లి ఏమిటి రామారావు ఈ రోజు నీవు ఏదో కోల్పోయినట్లుగా ఏమిటి అట్లా వున్నావు అన్నాను.  ఏమి చెప్పమంటావురా సుబ్బారావు నా భార్య ఆగడాలు రోజురోజుకి ఎక్కువైతున్నాయి.  ఈ రోజు కొట్టినంత పనిచేసింది (నిజానికి కొట్టింది ఆలా చెపితే బాగుండదని) అందుకే దిగులుగా కూర్చున్నాను.  రోజు క్షణక్షణం ఆ ఈశ్వరుని వేడుకొంటున్నాను నా భార్యకు మంచి బుద్దిని ప్రసాదించమని.  కానీ నా కర్మ ఇలా  కాళింది. అదే మా యింటిప్రక్క వెంకటేశ్వర రావు భార్య ఆయనను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళు తరచుగా సినిమాలకు షికార్లకు రయ్యి మని వెళుతుంటే నాకు కడుపులో దేవినట్లవుతుంది అదుష్టవంతుడు అంటే వాడురా అని అని కళ్లనీళ్లు తుడుచుకున్నాడు.  నాకు ఒక నిమిషం మాటలు రాలేదు.  యెంత మంచివాడు రామారావు ఆఫీసులో ఎవరికి ఏ సమస్య వచ్చిన యిట్టె పరిష్కరించే రామారావేనా నేను చూస్తున్నది అని అనుకున్నాను. 

రామారావు కొంత తమాయించుకున్న తరువాత చూడు రామారావు నిజానికి అదృష్టవంతుడు మీ ఇంటిప్రక్క వెంకటేశ్వర రావు కాదు  నీవే. ఆ వెంకటేశ్వర రావే దురదృష్టవంతుడు. అని నేను అనేసరికి ఏరా నన్ను యెగతాళి చేస్తున్నావా అని నవ్వుతు నన్ను చిన్నగా కొట్టాడు. 

చూడు రామారావు నేను నీ నోటితోటె నీవు అదృష్టవంతుడివి అని చెప్పేస్తాను.  ఇప్పుడు చెప్పు ఇందాక నీవు నాతొ ఏమన్నావు అన్నాను.  ఏమన్నాను నా భార్య ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి అన్నాను అని అన్నాడు.  ఆ తరువాత ఏమన్నావు చెప్పు అన్నాను.  ఏమన్నాను నేను ప్రతి క్షణం ఈశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను అన్నాను.  అదే నేనంటున్నాను. నీకు ఈశ్వరుని అనుగ్రహం వున్నది కాబట్టే నీవు అనుక్షణం ఈశ్వరుణ్ణి తలుస్తున్నావు. అన్నాను. ఎన్నో జన్మలను ఎత్తినతరువాత మనకు భగవంతుడు ఇచ్చిన  అపూర్వ వరం లాంటిది  ఈ  మానవ జన్మ ఈ జన్మలోనే మనం భగవంతుడి సన్నిధానం అంటే మోక్షాన్ని పొందగలం.  భగవంతుడు సాధకునికి అనేక అవాంతరాలను కలుగ చేస్తాడు.  అటువంటి అవాంతరమే నీకు వున్న ఈ పరిస్థితి అని ఎందుకు అనుకోవు.  ఒక్కసారి బాహ్య ప్రపంచంచుడు ఎంతమంది ఎన్నిరకాలుగా కస్టాలు, బాధలు అనుభవిస్తున్నారో.  కొందరికి కళ్ళు లేక అంథులుగా వుంటున్నారు, కాళ్ళు లేక, చేతులు లేక అనేకవిధాల నివారణ కానీ, లేని వ్యాధులతో భాదపడుతున్నారు.  కొంతమందికి తినటానికి తిండి, కట్టుకోటానికి గుడ్డ ఉండటానికి ఇల్లు లేక ప్లేటుపారాలమీద, పెద్ద పెద్ద నీళ్ల పైపులలోన, చెట్లకింద జీవనం గడుపుతున్నారు వారిని చూసావా.  ఒక్కసారి ఆలోచించు నీకు వున్న కష్టం వారిముందు ఏపాటిది.  నిజానికి నీ భార్య గయ్యాలే అవవచ్చు నీకు చక్కగా భోజనం వండి పెడుతున్నది, పిల్లలను చక్కగా చేసుకుంటున్నది. ఇంకా ఏమికావాలి.  మనం ఒక్క సత్యాన్ని ఎప్పుడు మారుస్తాం అదేమిటంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి మనస్తత్వాన్ని పోలిన మనిషి ఇంకొకడు ఉండదు.  కాబట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే పరిస్థితులను బట్టి సర్దుకొని పోవటమే. ఏ మనిషి పరిస్థితులను అర్ధంచేసుకుని నడుచుకుంటాడో వాడికి ఎప్పుడు సంతోషమే ఉంటుంది.

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకమ్‌

మౌనేన కలహం నాస్తి, నాస్తి జగరతో భయమ్‌

కష్టపడే వారికి దారిద్ర్యం ఉండదు, జపం చేసే వారికి పాతకం ఉండదు అలాగే నిశబ్ధంగా ఉండేవారికి పోట్లాటలు వుండవు, జాగర్తగా వుండే వారికి భయం ఉండదు.  కాబట్టి మిత్రమా నీవు అనవసరమైన జగడాలకు వేళ్ళకు, సాధ్యమైనంత వరకు నిశబ్ధంగా వుండు.  కొన్ని మాటలు విన్న వినునట్లు వుండు మితంగా మాట్లాడు. తప్పకుండా నీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు  సుబ్బారావు. దానితో రామారావుకు కొత్త శక్తి వచ్చినట్లైయిన్ది.  తన డ్రాలో వున్నా భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చి నీకు ఏ సందేహం, అశాంతి, భయం కలిగిన గీత చదువు నీకు పూర్తి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పాడు. సంతోషంగా రామారావు ఇంటికి వెళ్ళాడు. ఆలా మూడు నాలుగు రోజులు గడిచాయి.  ఎవరి పనులల్లో వాళ్ళు వున్నారు.  సుబ్బారావు రామారావుతో క్యాజువల్గా గడిపాడు.  నాలుగవ రోజు సుబ్బారావు ప్రొద్దున్నే ఆఫీసుకు వచ్చి ఫైళ్లు   వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నారు. " కృష్ణ భగవానునికి వందనం"  ఈ మాటలు ఎవరు అంటున్నారు అని వెనుకకు తిరిగి చూసాడు వెనుక రామారావు చెందుతులుజోడించి నిలుచున్నాడు.  సుబ్బారావు నిజంగా నాకు పునర్జన్మని ఇచ్చావు నేను ఆత్మహత్య చేసుకోవాలని  అనుకున్నాను. నీ మాటల ప్రభావం వలన గీతాపారాయణ వలన నేను ఏమిటి నాకర్తవ్యం ఏమిటన్నది నాకు తెలిసింది.  ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా వున్నది అని అన్నాడు. ఇప్పుడు చెప్పు నీవు అదృష్టవంతుడవా కాదా అని సుబ్బారావు అడిగాడు.  అవును నిజంగా అదృష్టవంతుడినే అని రామారావు  అన్నాడు . ఆత్మహత్య ప్రయత్నం చేసే ప్రతి మానసిక బలహీనునికి నీలాంటి మిత్రుడు వుంది గీత  చదవమని ప్రబోధిస్తే ప్రతివాని జీవితం  వెలుగుని చూస్తుంది. అని సంతోషంగా అన్నాడు. 

ప్రతి మనిషి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా వుండవు   అట్లా అని ఎప్పుడు ప్రతికూలంగాను వుండవు. స్థితప్రజ్ఞుడు కష్టాలలోను సుఖాలలోను తొణకక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. కానీ ఇది చెప్పినంత సులభం  కాదు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నిత్యం సాధన చేస్తే  ఏదైనా సాధించవచ్చు.

 అనగననగ రాగ మతిశయిల్లుచునుండు

 తినగ తినగ వేము తియ్యగుండు

 సాధనమున పనులు సమకూరు ధరలోన

 విశ్వధాభిరామ వినుర వేమ

కాబట్టి మిత్రమా పరిస్థితులను బట్టి మన ప్రవర్తన మార్చుకుంటే మంచిది. సత్వగుణ సంపత్తి సదా ఉత్తమం.

ఇటీవల ఒక వేదపండితుడు తన భార్య, అత్తగార్లు పెట్టిన  వేదనలు భరించలేక ఆత్మహత్య ప్రయత్నంచేయగా తీవ్ర అనారోగ్యగ్రస్తుడు అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడని పెట్టిన పోస్టుకు భాదతో స్పందించి వ్రాసిన కధనం ఇది. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

ఆభరణం ఏది?!

 *ఆభరణం ఏది?!*

                  

*ఓం శ్రీ కృష్ణ సద్గురవే నమః


*మనుషులలో కొందరికి మంచి రూపం ఉంటుంది. కొందరికి గుణం ఉంటుంది. ఈ రెంటిలో ఏది గొప్పది అనే ప్రశ్న ఉదయిస్తుంది.


*రూపమా? గుణమా?.


*అందమైన రూపం అందరినీ ఆకట్టుకుంటుంది కనుక అదే ముఖ్యమని కొందరు, మంచితనం ఉంటే చాలు అందరూ అతని దగ్గరకు వస్తారు అని మరి కొందరు వాదులాడుకుంటారు.


*వీటిలో ఏది ముఖ్యమో వివరించే సుభాషితం ఒకటుంది.


*నరస్యాభరణం రూపం

రూపస్యాభర ణం గుణమ్‌

గుణస్యాభరణం జ్ఞానమ్‌

జ్ఞానస్యాభరణం క్షమా


*మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం.


*పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది.


*అంటే మంచి అందగాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు.


*వినయం అనేది మనిషిలో ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి. కొందరు ఓటమి చవి చూసి నప్పుడో, బాధలలో మునిగి పోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు. అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు. కించ పరుస్తారు. మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు.


*అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీనులను గేలి చేయడం తగనిది.

ఇందుకు మహారాజులైనా మినహాయింపు కాదు. సామాన్యులు, గర్వాతిశయంతో తన కన్న ఏదో విధంగా తక్కువగా ఉన్న వారిని కించపరిచారంటే అది వారి మూర్ఖత్వం అని సరిపెట్టుకోవచ్చు. కాని అసామాన్యులే అలా ప్రవర్తిస్తే అజ్ఞాని అని అనుకోలేం.


*అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట.


*ఒక చక్రవర్తి. యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశయిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రి ఆయనకు ఆసమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు… కళ్లునెత్తికెక్కాయని. అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.


*‘మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును’ అన్నాడు.


*అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు.


*తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి   ‘ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు’ అన్నాడు.


*పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు.


*‘ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండదు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు’ అన్నాడు మంత్రి మళ్ళీ.


*పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు.


*వెంటనే ఆలోచించాడు. మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్రల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది.  జ్ఞానోదయమయింది. వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, ‘గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్లగా ఉంచుతుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి’ అన్నాడు.


*ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు… మౌర్య చంద్ర గుప్తుడు.   ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.

విష్ణు సహస్రనామం

 మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది! భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు. 


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"  


స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు. 


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.  


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.  


"అదేలా" అని అందరూ అడిగారు. 


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. 


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు. 


ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

పాము కరిచిన

 ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేయండి ప్రాణాలు కాపాడండి!


వ‌ర్షాకాలం…పాములు బ‌య‌ట సంచ‌రించే స‌మ‌యం. ఇలాంటి టైమ్ లోనే మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పాముల్లో 15 % పాములే విషాన్ని క‌లిగి ఉంటాయి. మ‌న ఇండియాలో 5 జాతుల పాములు మాత్రం అత్యంత విష‌పూరిత‌మైన‌వి. అవి కాటేస్తే 3 గంట‌ల్లో మ‌ర‌ణం సంభ‌వించే అవ‌కాశ‌ముంది. కాబ‌ట్టి ఆ గ్యాప్ లోనే మ‌నం ఏదైనా చేసి పాము కాటేసిన వ్య‌క్తిని కాపాడాలి.


కాటేసిన పాము…విష స‌ర్ప‌మా? కాదా? : 

మొద‌ట నిర్థార‌ణ చేసుకోవాల్సిన అంశ‌మిదే.. విష స‌ర్పం కాటేస్తే… కాటేసిన ప్రాంతంలో 2 గాట్లు ప‌డ‌తాయి. అదే విషంలేని పాము కాటేస్తే…మూడు కంటే ఎక్కువ గాట్లు ప‌డ‌తాయి.


విష స‌ర్పం కాటేస్తే ఏం అవుతుంది?:


విషపు పాము కరిస్తే….కరిచిన చోట నుండి విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది….ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. దీంతో బాడీ అంతా పాయిజ‌న్ అయ్యి మ‌నిషి మ‌ర‌ణిస్తాడు.


ఏం చేయాలి?


పాము కాటేసిన ప్రాంతానికి కాస్త ‌పైన గుండె వైపు ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌కుండా తాడుతో బలంగా క‌ట్టాలి.!


పాము క‌రిచిన గాట్ల వ‌ద్ద సూదిలేని సిరంజీని పెట్టి రక్తాన్ని బ‌య‌ట‌కు గుంజాలి….ఇలా రెండు మూడు సార్లు చేయాలి. మొద‌ట‌గా న‌ల్ల‌ని చెడు ర‌క్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది!


హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేయాలి. ఇలా చేస్తే పాము క‌రిచిన వ్య‌క్తి త్వ‌ర‌గా కోలుకుంటాడు.!


NAJA-200 5ML బాటిల్ ధ‌ర‌ 10 రూపాయ‌లు ఉంటుంది. ఈ సీజ‌న్ లో ప్ర‌తి ఒక్క‌రి దీన్ని కొనుక్కొని ద‌గ్గ‌ర పెట్టుకుంటే మంచిది!

20, జులై 2022, బుధవారం

మాధుర్యాన్ని

 శ, ష, స  అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.


    *యద్యపి బహునాధీషే*

        *తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |*

    *స్వజనః శ్వజనో మా భూత్*

        *సకలం శకలం సకృత్ శకృత్ ||*


భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన అనగా  (మన వాళ్ళు) 

అన్న శబ్దాన్ని శ్వజన అంటే (కుక్కలు) అనకుండా


, సకలం అనగా (సర్వం) అన్న శబ్దాన్ని శకలం అంటే (ముక్కలు) అని పలకకుండా, 


సకృత్ అనగా (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ అంటే (మలము) అని పలకకుండా ఉండడానికే కాక 


తదితర పదాలను కూడా సక్రమముగా పలకడానికి  ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.  


నాగరిక ప్రపంచం -కళ్ళని -కల్లు ట

                               శిరీష-షిరీష ట

                                 వేళ-వేల ట

                                 కళ-కల ట

                               పళ్ళు-పల్లు ట

                               కాళ్ళు-కాల్లు ట

ఇంకా ఎన్నెన్నో.....అపస్వర శబ్దాలు.....వినలేని అపస్వరాలు..ముఖ్యంగా టీవీల వల్ల..


విదేశాలలో ఉన్న తెలుగు వారు ..చక్కటి భాషా

ప్రావీణ్యతతో రాణిస్తున్నారు..


కొంతమంది తెలుగువారే.. సగం తెలుగు -సగం ఆంగ్లము మాట్లాడడంలో మాతృభాషకు ఇచ్చే విలువలు వారికే తెలియాలి


వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్ఛచరించాలో తెలుసుకోలేరు. ఉచ్ఛారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.


అందుకనే, వ్యాకరణ సిద్ధి ఉంటేనే,వాక్‌ సుద్ధి

వస్తుంది .మన నాలుక శుభ్ర పడుతుంది.

వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది.


అందుకేనేమో పవన సుతుడు శ్రీ హనుమ ,

శ్రీ సూర్య నారాయణుని సన్నిధి లో సకల విద్యలు 

నేర్చుకొని ,నవ వ్యాకరణ విద్యను అభ్యాసానికి

వివాహముచేసుకొని (వివాహితుడే అర్హుడు కనుక) నవ వ్యాకరణ పండితుడై  ,భవిష్యత్‌

బ్రహ్మ గా ప్రకటించ బడ్డాడు.


మాతృభాషలో మాధుర్యాన్ని నింపండి🙏

కేన్సరు వ్యాధి నివారణ శ్లోకం

 ॐ           కేన్సరు వ్యాధి నివారణ శ్లోకం 

           (Shloka for Cure of Cancer)


    ఇది "శ్రీమద్ నారాయణీయం" లోని ఎనిమిదవ దశకంలోని పదమూడవ శ్లోకం. అత్యంత శక్తివంతమైనది. 

    కేన్సర వ్యాధిని నిర్మూలించేదిగా, కంచి పరమాచార్య సూచిస్తూ అనుగ్రహించినది. 

    ఇది రోజూ 108 సార్లు, 45 రోజులు క్రమం తప్పక చదివితే, 

    కేన్సర వ్యాధి నుండీ, పూర్తిగా కోలుకొంటారు. 


    This shloka from Srimad Narayaneeyam (Dasakam 8, Sloka 13) is a very powerful shloka that has been advised by HH Sri Sri Sri Kanchi Maha Periyava for curing cancer. 

    One who recites this sloka 108 times continuously for 45 days gets completely cured from cancer. 


अस्मिन् परात्मन् ननु पाद्मकल्पे

त्वमित्थमुत्थापितपद्मयोनि: ।

अनन्तभूमा मम रोगराशिं

निरुन्धि वातालयवास विष्णो ॥१३॥ 


అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే 

త్వమిత్థముత్థాపిత పద్మయోనిః 

అనన్తభూమా మమ రోగరాశిం 

నిరున్ధి వాతాలయవాస విష్ణో! 

          8/13 


వాతాలయ నివాసా! కృష్ణా! 


   "పద్మ"మనబడు ఈ మహాకల్పమున, 

    "పద్మజన్ముడు" అని పేర్కొనబడు చతుర్ముఖని వెలువరించిన పరమాత్ముడవు నీవు. 

    నీవు సర్వవ్యాపివి. 

    నీ మాహాత్మ్యము అనూహ్యమైనది నాయనా! 

    అట్టి నిన్ను నన్నావరించియున్న రోగరాశి వేదనలనుండి నాకు ముక్తిని ప్రసాదించవలసినదిగ వేడుకొనుచున్నాను తండ్రీ! 


O Vishnu Dweller of Guruvaayur! 

O Supreme Lord of incomprehensible powers, in this age known as the Paadma Kalpa! 


    Thou thus brought into existence the Creator Brahmaa. 


O Lord Vishnu, who has manifested in the temple of Guruvaayur! 

    please eradicate my ailments. 


                    =x=x=x= 


సేకరణ : 

రామాయణం శర్మ 

     భద్రాచలం

వారణాసి వెళ్లేవారికి

*🕉️కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు...!* 

వారణాసి వెళ్ళే వాళ్ళు  ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి.  

సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300 నుంచి ఛార్జ్ చేస్తారు.  తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150 నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా మనిషికి 20ఛార్జ్ చేస్తారు.  మధ్యాహ్నం భోజనం, ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది.
               
ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ స్వామి దర్శనం చేసుకొని, అక్కడ నుంచి వారాహి అమ్మ దర్శనానికి వెళ్ళండి. ఉదయం 9 గంటలలోపే వారాహి అమ్మ దర్శనం.  ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు. వారాహి అమ్మ గ్రామ దేవత.  

అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగరలో ఉంటుంది.  అమ్మ దర్శనం చేసుకొని, విశాలాక్షి అమ్మ గుడి దగర నుంచి విశ్వనాథుని గుడికి 
2 నిముషాలలో కాలి నడకన వెళ్లొచ్చు. 

1వ నంబర్ గేట్ నుంచి వెల్లినట్లైతే సాక్షి గణపతినీ దర్శించుకోవచ్చు.  డుంది గణపతి గుడి  లోపల ఉంటుంది.  స్వామి వారి దర్శనం 4 వ నంబర్ గేట్ నుంచి త్వరగా అవుతుంది. స్వామి దర్శనం చేసుకొని వచ్చాక లోపల అన్నపూర్ణమ్మ అమ్మ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పూజారికి 100 ఇస్తే అమ్మ వారిని తాకనిస్తారు.  

అన్నపూర్ణమ్మ గుడి లోపలి నుంచి అన్న ప్రసాదానికి దారి ఉంటుంది.  కచ్చితంగా అక్కడ భోజనం చేయాలి.  గుడిలో మనకి అమ్మ ప్రసాదంగా ఒకతను, కొంచెం బియ్యం, ఒక coin (కాసు) ఇస్తారు.  100 రూపాయలు ఇవమంటారు.  50 రూపాయలు ఇచ్చినా కొందరు తీసుకుంటారు.  ఆ కాసు మన ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి.  బియ్యం మన  ఇంట్లో మనం తెచుక్కున్న బియ్యం బస్తాలలో కొంచెం వేసుకొని మిగతాది బీరువాలో దాచుకోవాలి.  

ఫోన్స్, వాల్లెట్స్ అనుమతించరు.  ఒకవేళ తీసుకు వెళ్తే 4 వ నంబర్ గేట్ దగర దేవస్థానం వారి  ఫ్రీ లాకర్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు.  సాయంత్రం 6 నుంచి 7 వరకు స్పర్శ దర్శనం ఉంటుంది.  7 కి హారతి సేవ ఉంటుంది.  స్వామి దర్శనం ఆదివారాలు సోమవారాలు బాగా రద్దీగా ఉంటుంది. 

దర్శనాలు అయిపోయాక మధ్యాహ్నం 1 నుంచి లోకల్ టెంపో మాట్లాడుకొని అన్ని చూసుకోవచ్చు.  దుర్గమ్మ గుడి, గవ్వలమ్మ,  మందిరం, బెనారుస్ యూనివర్సిటీలో టెంపుల్స్ హనుమాన్ టెంపుల్  ఇవన్నీ లోకల్ టెంపుల్స్ కి మనం మాట్లాడుకునే ఆటో వాళ్ళు చూపిస్తారు.   మనిషికి 300 వరకు ఛార్జ్ చేస్తారు.  అవి అన్నీ చూసుకునే సరికి సాయంత్రం 6 అవుతుంది.  అక్కడ కు దగ్గర్లో ఉండే ఏదైనా ఘాట్ లలో గంగ హారతి చూసుకోవచ్చు.  దశాశ్వమేధ ఘాట్, కేదార్నాథ్ ఘాట్ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉంటాయి.
              
రెండవ రోజు ఘాట్లలో స్నానాలు చేసి పడవలు మాట్లాడుకుని 64 ఘాట్లు వెళ్ళటానికి,12 గంటలకి మణికర్ణిక ఘాట్ లో స్నానాలు చేయవచ్చు.   

మణికర్ణిక ఘాట్లో స్నానాలు చేస్తే పితృ దేవతలకి మోక్షం లభిస్తుంది అంటారు.  స్నానం చేసే సమయంలో మనసులోని కోరికలు నెరవేరుతాయి అంటారు.  

మణికర్ణిక ఘాట్ విశ్వనాథ గుడి 4 వ నంబర్ గేట్ నుంచి కొంచెం ముందుకి నడుస్తూ వెళ్తే కుడి చేతి వైపు  పెద్ద అర్చ్ కనిపిస్తుంది. దానిలో నుంచి నడుచు కుంటు వెళ్తే ఘాట్ కి వెళ్తాం.  దాదాపు ఘాట్లు అన్ని పక్క పక్కనే ఉంటాయి. 

వీలైతే కాలభైరవ టెంపుల్ నుంచి వచ్చేప్పుడు మహా మృత్యుంజయ గుడి, ఓంకారేశ్వర మకరేశ్వర్, ఆకరేశ్వర గుడులు చూసుకోవచ్చు.  జంగం బాడీ మఠం దాటాక తిలబందేశ్వర్ గుడి ఉంటుంది.  కుదిరితే లోలార్కు కుండ్ చూసుకోండి.  హిందువులు అక్కడ ఎక్కువగా పుణ్య స్నానాలు ఆచరిస్తారు. 

 సూర్య భగవానుడు గుడి చిన్న గుడులు అక్కడ పక్కనే ఉంటాయి.  దర్శనం చేసుకోండి. తర్వాత శివుని దర్శనం చేసుకోండి.
సదా మీ సేవలో....

ప్రయాణికుడు:

 

ప్రయాణికుడు: 

(గమనిక: ఇది కేవలం 60 సం. దాటిన పురుషుల కోసం వ్రాసిన  వ్యాసం.  ఇతరులు  చదవటం నిషిద్ధం. )

60 సంవస్త్సరాలు దాటాయి అంటే మీరు ఒక ప్రయాణికుడు అని అనుకోవాలి.  మీరు పూర్తిగా ప్రయాణసన్నాహాలలోనే ఉండాలి. కొంతమంది అప్పుడే రైల్వేస్టేషనుకి వచ్చి వున్నారు.  కొంతమంది స్టేషనుకు  వెళ్లే మార్గంలో వున్నారు, కొంతమందికి ఎక్కవలసిం రైలు స్టేషనులో ప్లాటుఫారం మీదకు వచ్చి వున్నట్లే, కొంతమంది రైల్లో కూర్చొని రైలు సిగ్నలుకోసం వున్నట్లుగా భావించాలి. ఏక్షణంలో నయినా మీరు కూర్చున్న రైలుకు జెండా ఊపటం ప్రయాణం మొదలుకావడం జరగవచ్చు .  మీరు ఇంకా ఇల్లు, సంసారం, సంఘం అంటు కూర్చుంటే ప్రయోజనం లేదు.  ఎప్పుడైతే స్టేషనుకు ప్రయాణం అయ్యామో అప్పుడు ఇంటికి తాళం వేశామా, అన్ని తలుపులు వేశామా, చిన్నవాడు వంటరిగా వున్నాడు వాడు తిండి ఎలా తింటాడో ఇలాంటి అనేక సందేహాలు ఎలా వస్తాయో ఇప్పుడు ఈ ప్రయాణంలో కూడా రావచ్చు.  కానీ ఇప్పుడు వెళ్లే ప్రయాణం ఒకవైపే అంటే నిష్క్రమణే మరల తిరిగి రావటం అనేది ఉండదు.  కాబట్టి ఈ ప్రయాణం పూర్తిగా సాఫీగా జరగాలంటే ఒక్కటే మార్గం. 

ఈశ్వరానుగ్రహం: 

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.  అది ఎంతవరకు నిజమో కానీ  నేను ఒక్కటి మాత్రం సంపూర్ణంగా విశ్వసిత్తాను దైవానుగ్రహం కోసం ప్రార్ధించటానికి కూడా దైవానుగ్రహం కావలి అదేంటి అని అనవచ్చు కానీ ఇది నిజం మనకు దైవానుగ్రహం లేకుంటే మనస్సు ఎప్పుడు కూడా దేముడిమీదకు వెళ్ళదు.  అందుకేనేమో మన మహర్షులు వినాయక చవితి నాడు సిద్ది వినాయకుడిని పూజించటానికి ముందు పసుపు గణపతి పూజ చేయాలని నియమము పెట్టారు అని నాకనిపిస్త్తుంది.  నిజానికి మనం పూజించేది వినాయకుడినే కదా ఆయనే విఘ్నధిపతి కదా మరి ఇంకా పసుపు వినాయకుడిని ఎందుకు పూజించాలి అనే సందేహం మనకు వస్తుంది.  కానీ అందులోని మర్మం ఏమిటంటే చేసే సిద్ది వినాయక పూజ అనే దైవ కార్యం కాబట్టి ఆ దైవకార్యం నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా విఘ్నాధిపతి అయిన విగ్నేశ్వరుని అనుగ్రహం కావాలని మన మహర్షులు సూచించారు. కాబట్టి ఆయన పూజ కూడా నిర్విఘ్నంగా సాగటానికి మనం పసుపు గణపతి పూజ చేస్తాం.  అలానే మనం దైవానుగ్రహం కోసం ప్రార్ధించటానికి దేముడిని ప్రార్ధించాలి, భగవంతుడా నేను నిత్యం నిన్ను మరువకుండా ఉండేటట్లు నాకు అనుగ్రహాన్ని ఇవ్వు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వు అని కోరాలి. మనం ఏదైనా పరీక్ష వ్రాసేటప్పుడు చివరి గంటకు ముందుగా చివరిగుంట మోగుతుందని తెలపటానికి ఒక సన్నిద్ధ గంటను మ్రోగిస్తారు. అప్పుడు అభ్యర్థి తానూ వ్రాసిన జవాబు పత్రాన్ని పూర్తిగా చూసుకొని సరిచేసుకునే వీలుంటుంది.  కానీ ఇక్కడ ఎప్పుడు ప్రయాణం మొదలవుతుందో తెలియనే తెలియదు.  కాబట్టి సదా మనం మన చివరి మజిలీకోసం సన్నద్ధులం కావాలి. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ఎప్పుడు సన్నిద్ధంగా వుండే విద్యార్థి ఏవిధంగానయితే పరీక్ష చక్కగా వ్రాయగలడో అదేవిధంగా సాధకుడు ఎల్లప్పుడూ ఆ పరబ్రహ్మ జ్యాసలోనే ఉండాలి. సదా నిధి జాసలో వుండే సాధకునికి మోక్షం తప్పనిసరి. నిత్యానందుడైన సాధకునికి  ఈ భూమి మీద కావలసింది ఏమి ఉండదు.  కేవలం కైవల్యం మినహా.  కాబట్టి మిత్రమా ఇప్పుడే లే నీ నిరంతర సాధన మొదలుపెట్టు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ