8, జనవరి 2026, గురువారం

జీవిత

  🤘 *జీవిత  *👌


         మిమ్మల్ని కూల్చాలనుకున్న ప్రతీ దెబ్బనీ మిమ్మల్ని గట్టిగా నిలబెట్టే ఆయుధంగా మార్చుకోవాలి.


 🏹  *నిత్య సత్యం* 🏑


        కన్నీళ్లలో దాగిన ధైర్యాన్ని గుర్తించ గలిగితే ఓటమి కూడా విజయానికి మార్గం చూపుతుంది..


శుభ గురువారం 🌹Happy Thursday.

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్

సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ।। 34 ।।


ప్రతిపదార్థ:


అకీర్తిం — అపకీర్తి; చ — మరియు; అపి — కూడా; భూతాని — జనులు; కథయిష్యంతి — అంటారు; తే — నీ యొక్క; అవ్యయామ్ — ఎప్పటికీ ఉండిపోయే; సంభావితస్య — గౌరవప్రదమైనవానికి; చ — మరియు; అకీర్తిః — అపకీర్తి; మరణాత్ — మరణము కన్నా; అతిరిచ్యతే — అధికమైనది.


  తాత్పర్యము :


జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది.


 వివరణ:


గౌరవప్రదమైన వ్యక్తులకు సామాజిక ప్రతిష్ఠ చాలా ముఖ్యమైనది. క్షత్రియులకు సహజముగా ఉన్న గుణములు (ప్రకృతి త్రిగుణములు) వారికి కీర్తి, గౌరవం చాలా ముఖ్యమైన వాటిగా భావింపచేస్తాయి. వారికి అగౌరవం, అపకీర్తి అనేవి మరణం కన్నా నీచమైనవి. ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా కనీసం ఈ నిమ్న స్థాయి జ్ఞానము వల్ల నైనా ప్రేరణను పొందవచ్చు అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇది గుర్తు చేస్తున్నాడు.


యుద్ద భూమి నుండి పిరికితనముతో పారిపోయిన సైనికుడిని సమాజం నుండి వెలివేస్తారు. తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఇంతటి అపకీర్తి, అగౌరవం అర్జునుడికి కలుగవచ్చు.

08-01-2026 గురువారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏


08-01-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని పనులలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆటంకాలు తొలగుతాయి.



---------------------------------------


వృషభం


ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి.

---------------------------------------


మిధునం


వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. సంతాన అనారోగ్య విషయంలో సమస్యలుంటాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------


కర్కాటకం


చిన్ననాటి మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------


సింహం


దాయదులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

---------------------------------------


కన్య


ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు అదనపు పనిబారం తప్పదు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

---------------------------------------


తుల


ధన వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలసివస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో వివాదాలు రాజి చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు.

---------------------------------------


వృశ్చికం


కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు.

---------------------------------------


ధనస్సు


స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరంగా మరింత పురోగతి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------


మకరం


ఉద్యోగాలలో పనితీరుకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.

---------------------------------------


కుంభం


ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. మీప్రవర్తన వలన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------


మీనం


దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

---------------------------------------

1950-70 లో పుట్టిన వాళ్ళ జ్ఞాపకాల దొంతర

 *1950-70 లో పుట్టిన వాళ్ళ జ్ఞాపకాల దొంతర*


SSC పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం మనది . అద్దెకి బుక్స్ (నవలలు ) తెచ్చుకుని చదువుకున్న తరం మనది. సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టిన కాలం మనది.


గెజిటెడ్ ఆఫీసర్లు అయినా, కాలేజీ లెక్చరర్స్ అయినా సైకిళ్లు తొక్కుకుని ఆఫీస్ లకు వెళ్లిన రోజులవి. అందుకే డ్రాయింగ్ రూమ్ జిమ్ములలో సైకిల్ తొక్కే అవసరం పడేది కాదు.


చేబదుళ్లకి కాదేదీ అనర్హం. పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో చెక్కర అయినా, స్పున్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ అయినా.


అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు. రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం క్యూ లో నిలబడి డ్యూయెట్లూ, పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి.


*ఇంటి ముందుకు* కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులాడించే వాడు, ఎలుగు బంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు. మేకప్పులు అంటే తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు. గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు. మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు. బస్టాండ్ లో చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ. ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ.


వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు. "దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఇయర్ పిన్లు, రబ్బర్ గాజులు, రిబ్బన్లహో". అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు. "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం". అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, ముందు చూపించినా గంగాళం కాకుండా, ఆఖర్న చూపించిన గిన్నె ఇచ్చి పోయేవాళ్లు. గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి. కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం. పరుపులేకుతాం. గిన్నెలకి సొట్టలు తీస్తాం. బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం. అరువు మీద చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు. ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ, ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ సరేసరి.


మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు... సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..


రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది. భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది. రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!


అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే, దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం.. తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం.... ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు కున్నాం!


రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మనది . ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూనూ.


*ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు*.... *ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న గుర్తులు*.


ఇప్పటి కాలం పిల్లలకు

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

వీధిలో పిల్లల అల్లరి లేదు

తాతలు ఇచ్చే చిల్లర లేదు

ఏడు పెంకులు ఏమైపోయే

ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని నేటి జీవితం

మానవాళికే మాయని మరక.

అందుకే మన తరం అదృష్టవంతులమ్*!


*1950 -70 లో పుట్టిన మనం ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మన తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు*.


ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది. *పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.*


దాదాపు అందరం భట్టిపంతుల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మన లో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు కూడా లేకుండా నడిచిన వాళ్ళమే!


ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు. ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.


మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *పావలా/అర్ద రూపాయి ఇచ్చి నేల, బెంచి టిక్కెట్ కొనుక్కుని తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.


మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట, రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం.


*ఈ నాటికీ దాదాపు మనం అందరం* ✌🏻*55- 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే! అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్న వాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకున్న వాళ్ళమే*.


*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్ని మనమే చూసుకున్నట్టు ఉంది.కదా. 👍మీ శ్రేయోభిలాషి 🎉నాటి తరం పిల్లలం - నేటి తరం పెద్దలం ✍️- భవిష్యత్తరం ఆదర్శ నీయులం 🎁

లక్ష్మీదేవి

  *లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడని విషయాలు*.


(అంటే డబ్బు నిలకడ ఉండక ధననష్టంకు కారణం అయ్యే విషయాలు)


*విప్రకీర్ణాని ధాన్యాని*


👉 నిర్లక్ష్యంగా ధాన్యాన్ని ఇళ్లలో చెల్లాచెదురుగా ఉంచడం


*అపావృతం పయో౽తిష్ఠత్*


👉 పాలపై మూత పెట్టకపోవడం


*ఉచ్చిష్టాశ్చాస్పృశన్ఘృతమ్*


👉 ఎంగిలి చేతితో నెయ్యిని ముట్టడం


*భక్ష్యమాసీదానావృతమ్*


ఆహారపదార్థాలపై మూతలు పెట్టకపోవడం


*ఉచ్చైశ్చాభ్య వదన్రాత్రౌ*


👉 రాత్రుళ్ళు పెద్దగొంతుతో అరుస్తూ గొడవలు..వాదనలు చేసుకోవడం


*ద్రవ్యోపకరణం సర్వం నాన్యవైక్షత్కుటుంబినీ*


👉 గృహిణులు ఇంటివస్తువులను సరిగ్గా ఉంచుకొనక చిందరవందరగా పారేసుకోవడం


*అవర్తన్కలహాశ్చత్ర దివారాత్రం గృహే గృహే*


👉 రాత్రి పగలు ఎప్పుడూ కలహాలు చెలరేగుతుండడం


👉 ఈ లక్షణాలు కనిపిస్తూ ఉన్నప్పుడు లక్ష్మీ ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది.


*సప్తదేవ్యో జయాష్టమ్యః వాసమేష్యంతి తే౽ష్టధా*


👉 లక్ష్మీ ఉన్న దగ్గరే జయలక్ష్మీతో కలిపి అష్టలక్ష్మిలు నివసిస్తూ ఉంటారు.


👉 వాళ్ళుకూడా లక్ష్మీ దేవినే అనుసరిస్తారు.

ఇతరులను నిందించడం లేనిపోని చాడీలు చెప్పడం

*మహాభారతం*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం - షష్ఠి - పూర్వాఫల్గుని -‌‌ గురు వాసరే* (08.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

7, జనవరి 2026, బుధవారం

గొంతు సంబంధ సమస్యలకు

 గొంతు సంబంధ సమస్యలకు నివారణా యోగాలు -


 * శొంటి కొమ్మును చూర్ణం చేసి తేనెతో కలిపి సేవించిన గొంతు నొప్పి తగ్గును.

 * తేనెలో కొంచం మిరియాల చూర్ణం వేసి తీసుకుంటే బొంగురుపోయిన గొంతు మాములుగా అగును.

 * మామిడి ఆకుల కషాయం అరకప్పు తీసుకుని అందులో చెంచా తేనె కలుపుకుని తాగాలి . అలా ఉదయం , సాయంత్రం రెండుపూటలా మూడు రోజుల పాటు తీసుకున్న గొంతు బొంగురు పోవును . 

 * ముల్లంగి రసాన్ని పూటకు పావుకప్పు తీసుకుంటున్న గొంతు బొంగురు పోవును . 

 * చిన్న అల్లం ముక్క బుగ్గన పెట్టుకుని రసం మింగుచున్నను గొంతు బొంగురు పోవును . 

 * రాత్రి సమయం నందు నిద్రించుటకు పూర్వం ఒక గ్లాసు వేడివేడి పాలలో ఒక చిన్న స్పూన్ మిరియాల చూర్ణం కలుపుకుని తాగుచున్న గొంతులో రొంప, గొంతు బొంగురు పోవును .

 * గొంతులో మంట, నుస ఉంటే లవంగ మొగ్గ నోటిలో వేసుకొని రసం మింగుచున్న తగ్గును.

 * చిన్నపిల్లలకు గొంతులో మంట, నుస ఉంటే వారితో అప్పుడప్పుడు లేత కొబ్బరి తినిపిస్తున్న తగ్గును.

 * గొంతులో టాన్సిల్స్ వాపు వచ్చినపుడు ఉల్లిగడ్డ దంచి ఆ రసం పైన పూయుచున్న వాపు తగ్గును.

 * లేత కొబ్బరి వేర్ల కషాయం కాని మెంతుల కషాయం తో పుక్కిలిస్తున్న గొంతు మంట తగ్గును.

 * టాన్సిల్స్ ఇబ్బంది ఉన్నప్పుడు తాంబూలం లో వాడే కాచు చూర్ణం చేసి పూటకు పావు స్పూన్ చూర్ణం కొంచం తేనెతో కలిపి లోపలికి తీసుకోవాలి లేదా అరకప్పు నీటిలో కలిపి తాగాలి ఇలా రోజు చేయుచున్న టాన్సిల్స్ వాపు క్రమక్రంగా తగ్గును.

  


 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 



గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

         


          కాళహస్తి వేంకటేశ్వరరావు  

     

     అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

               

                  9885030034

పంచాంగం

  


సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *వాణీ రసవతీ యస్య* 

         *యస్య శ్రమవతీ క్రియా* l

         *లక్ష్మీః దానవతీ యస్య*

         *సఫలం తస్య జీవనమ్* ll


తా𝕝𝕝 *ఎవడి మాటలు ప్రియకరమై, పరహితమై ఉండునో, శ్రమతో కూడిననూ కర్తవ్యనిష్ఠతో క్రియలను ఆచరించునో, సంపదలు దానధర్మములకై వినియోగించబడునో అతడి జన్మ సార్థకమగుచున్నది... ఫలప్రదమగుచున్నది...*.


✍️VKS ©️ MSV🙏

దాన_మహిమ

  #దాన_మహిమ..❄️🌿🚩


ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ‘

ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.


‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే 

అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు. శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.


గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ

రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః


దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా..


గోదానం....గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.


భూదానం .....కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.


తిలదానం...తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.


హిరణ్య (సువర్ణ)దానం.....హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

.

ఆజ్య(నెయ్యి)దానం...ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.


వస్త్రదానం....శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.


ధాన్యదానం...;జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.


గుడ(బెల్లం)దానం....రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.


రజత(వెండి)దానం....అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.


లవణ(ఉప్పు)దానం....రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు


ఇతర దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు.......!!!!

1. బియ్యాన్ని దానం చేస్తే.........పాపాలు తొలగుతాయి.

2. వెండిని దానం చేస్తే........... మనశ్శాంతి కలుగుతుంది.

3. బంగారుని దానం చేస్తే.........దోషాలు తొలగుతాయి.

4.పండ్లను దానంచేస్తే............బుద్ధి,సిద్ధి కలుగుతాయి.

5. పెరుగును దానం చేస్తే.......ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే.........రోగాలు పోతాయి.....ఆరోగ్యంగా ఉంటారు.

7. పాలు దానం చేస్తే..........నిద్రలేమి ఉండదు.

8. తేనెను దానం చేస్తే..... సంతానం కలుగుతుంది.

9.ఉసిరికాయలు దానం చేస్తే...... మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.

10. టెంకాయ దానం చేస్తే......... అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

11. దీపాలు దానం చేస్తే........కంటిచూపు మెరుగుపడుతుంది.

12.గోదానం చేస్తే.......ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు

లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే.......బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది.ఈశ్వరలోక

దర్శనం కలుగుతుంది.

14. వస్త్ర దానం చేస్తే...........ఆయుషు పెరుగుతుంది.

15. అన్నదానం చేస్తే..............పేదరికం తొలగిపోయి .ధనవృద్ధి కలుగుతుంది.ఓం శనైశ్చ రాయనమః


🌹 లోకాస్సమస్తాః సుఖినోభవంత🌹

🙏🏼 సమస్త సన్మంగళాని భవంతు 🙏🏼

  🌿 *_శుభమస్తు_* 🌿