18, జులై 2020, శనివారం

*అమ్మను విసిగించే చిన్నమ్మాయి! ( తెలుగుతల్లి కెనడా వారి బహుమతి పొందిన కథ)*

రోళ్ళు పగిలే రోహిణీకార్తి ఎండలు. మధ్యాహ్నసమయం. వీధులన్నీ నిర్మానుష్యం. ఇరుగూపొరుగూ... బుద్ధిగా తలుపులేసుకుని ఇళ్ళల్లో కునుకుతీస్తున్నారు. గాలిస్థంభించి..ఆకులు కూడా కదలకుండా... గాడుపులకు తలలు వాల్చేసాయి. నూతిగట్టు మీద దాహానికి అరుస్తున్న కాకి గొంతు తప్పా మారు శబ్దం లేదు.
 అరగంట క్రితమే.... భోంచేసి వంటిల్లు ఎత్తిపెట్టుకుని, అమ్మ    వసారాగదిలో కూర్చుని..పాత నోట్సుపుస్తకంలో మిగిలిపోయిన తెల్లకాయితాలతో చిత్తుపుస్తకాలు కుడుతున్న ఇద్దరు అబ్బాయిలనూ, అష్టా-చెమ్మా ఆడుతున్న ఆడపిల్లలనూ.. గట్టిగా కేకేసి... మధ్యగదిలోకొచ్చి పడుకోమని కేకేసింది. 

అదే అదునుగా... అక్కచేతిలో ఓడిపోతున్న చిన్నమ్మాయి... గవ్వలు విసిరేసి... ఆటంతా కలిపేసి లోపలికి చక్కాపోయింది.  మరి అప్పగారు ఊరుకుంటుందా? చెల్లెలిని తరిమి పట్టుకుని,  వీపు వంచి రెండు గుద్దులేసింది.

చిన్నమ్మాయికి… ప్రతిక్రియకు అవకాశమివ్వకుండానే... అమ్మ మధ్యలోకొచ్చి.. హాలులో తడిదుప్పట్లేసి.. పైన చాపలేసిన పక్కలమీదకు రెక్కలట్టుకుని లాక్కొచ్చి కుదేసింది. 

అన్నగార్లూ, అక్కయ్యా ఫక్కున నవ్వుతుంటే... మా పౌరుషం పొడుచుకొచ్చింది చిన్న దానికి!  చుట్టూకట్టిన వట్టిచాపలను నీళ్ళుచల్లి తడిపి... అమ్మా…. పిల్లలతో పాటూ నడుం వాల్చింది.

 ఫేనుకిందే పడుకున్న చిన్నమ్మాయిని కాళ్లుపట్టి లాగేసి ,దౌర్జన్యంగా మూలకు ఈడ్చేసి... పెద్దన్నయ్య ఆ స్థలంలో…పడుకుండి పోయాడు.  మూసుకున్న కళ్ళ వెనుక వాళ్ళందరి నవ్వులూ ఊహించుకుని చిన్నమ్మాయికి కోపం నషాళానికి అంటింది. 

 నిద్రపోనని భీష్మించుని కూర్చుంది.  అమ్మ కసిరి 
"అయితే వరండా లోకి ఫో" అని అరిచింది.

చిన్నమ్మాయికి ఇట్టిట్టే అలకలు కదా! పైగా అలకలన్నీ అమ్మమీదే! ఎవరి మీద చూపిస్తే ఎవరూరుకుంటారూ?  సరే చేసేది లేక కటకటాల గదిలో కొచ్చింది.  ఎండగాడుపు వెచ్చగా కొట్టింది మొహానికి. పదేళ్ళ వయసున్న లేతచెంపలు ఒక్కసారి భగ్గుమన్నాయి.  అమ్మాయి దుడుకుతనంలో అమ్మాయిలకెక్కువ అబ్బాయిలకు తక్కువ. 

కటకటటాల గదిలో వాళ్ళనాన్నగారు పిల్లలు  పుస్తకాలూ, బొమ్మలూ పెట్టుకోడానికి.. జరుపుకునే తలుపులుండే... చక్కని గూడులు కట్టించారు. చిన్నమ్మాయి శబ్దం చెయ్యకుండా... అక్కగూడు తెరిచిందా.... ఒక్కసారి మనసు భగ్గుమంది. 

తీరువుగా... ఒకపద్ధతిలో సర్దుకున్న పుస్తకాలో పక్క.... తన వాటాకి నాన్నగారు పంచిన పది అమరచిత్రకధలు, గుండ్రటి చాక్లేట్ డబ్బాలో... పూసల బొమ్మలు అల్లే సామాగ్రి..., రెండు అందమైన స్పాంజి గౌనులు వేసుకున్న అమ్మాయి బొమ్మలు...  పెద్దమ్మాయికి..... వాళ్ళ బాబాయిలూ, మేనత్తలూ హైదరాబాదు వెళ్ళినపుడు చార్మినారులో కొనిపెట్టిన రకరకాల పొళ్ళగాజులన్నీ గాజులమల్లారంలా.. ఒక సిల్కుతాడుతో కట్టి...., అలాగే భద్రంగా దాచుకున్న… నాన్నగారు కలకత్తానుండి తెచ్చిన అద్దాల సంచీ....సగం అల్లి ఉంచిన క్రోషియా టేబుల్ మాట్, నీడిల్స్........ ప్రతీది ఒక పద్ధతిలో ఉండవలసిన తీరులో.... ఉండవలసిన స్థలంలో సర్దుకుంది ఆ పెద్దపిల్ల! 

చిన్నమ్మాయి..  అక్కపుస్తకాల లాటులోంచి " నిద్రా సుందరి" అమరచిత్ర కధ లాగింది. చెదిరిపోయిన పుస్తకాలు లోపలికి తోసేసి..... పుస్తకాల గూడుమీద కట్టిన విశాలమైన  స్లాబుల మీద కూర్చుని చదువుకోడానికి ఉపక్రమించింది.

ఆ గచ్చుస్లాబుల వేడికి కింద కాలిపోతున్నా,  లెక్కచెయ్య కుండా చకచకా ఓ పావుగంటలో పుస్తకం చదివేసింది.  అక్కడే బల్లమీదకు గురిచూసి విసిరింది.  కుదురే లేని చిన్నపిల్లకు మళ్ళీ తోచడం మానేసింది! 

తన పుస్తకాల గూడు తెరిచింది.  కుక్కి కుక్కి తోసేసిన పుస్తకాలు, పెన్నిళ్ళ డబ్బాలు, డ్రాయింగ్ పుస్తకాలు,  మెడ్రాసునుండి మేమమావ తెచ్చిచ్చిన రబ్బరుబొమ్మ, దానికోసం టైలర్ అప్పారావుకు ఆవకాయ లంచం పెట్టి తెచ్చిన రరకాల గుడ్డముక్కలతో కుట్టిన గౌనులూ, పంజాబీ డ్రస్సులూ... గవ్వలు, చింతపిక్కలు, మగపిల్లలతో జట్టుకట్టి ఆడే ఏడుపెంకులాట పెంకులు, గెలుచుకున్న గోళీలూ, మందిరం కడదామని సేకరించిన ఇంజక్షన్ సీసాలూ, రెండు గోటీబిళ్ళలు, క్లాసులో ఫస్ట్ ఒస్తే ఇచ్చిన వెండికప్పు, ఇంట్లో వాళ్ళ  ప్రాణాలు తీసేలా... విసిగిస్తూ ... పీపీ అంటూ ఊదే బూరాలూ, అన్నీ ఒక్కసారి మీదపడ్డాయి. 

 విసుగ్గా అన్నీ లోపలికి మళ్ళీ యధావిధి కుక్కేసి, తవ్వకాల్లో దొరికిన ఓ డ్రాయింగుపుస్తకం, పెన్సిల్ పట్టుకుని  రెండుకొండలూ, మధ్యలో సూర్యుడూ, ఓ పెంకుటిల్లూ, వెనకో రెండు కొబ్బరిచెట్లూ, పారే యేరు, నాలుగు పద్మాలూ, పద్మాల సైజులోనే ఓ గూడుపడవ..... ఆకాశంలో ఎగిరే కొంగలబారూ…. చకచకా వేసి పడేసింది!  వేసిందే కానీ…చిన్నమ్మాయికి ఆ బొమ్మ తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఎందుకంటే ఆ డ్రాయింగ్ పుస్తకంలో ఉన్న పదిపేజీల్లో... ఎనిమిది పేజీల్లో ఇదే సీనరీ! 
మరో బొమ్మ వెయ్యడానికి రాని తన అశక్తతకు చింతిస్తూ, మళ్ళీ కటకటాలకు వేలాడుతూ.... బూరా తీసి ఊదుకోసాగింది.   కర్ణకఠోరమైన ఆ శబ్దానికి ఎవరయినా రాకపోరా అన్న ఆశతో!

వచ్చాడు! వాళ్ళ పెద్దన్నయ్య నిద్రకళ్ళతో! వస్తూనే రెండు జెల్లకాయలు పీకి, వేలూపుతూ బెదిరించి మళ్ళీ లోపలికి పోయాడు! చిన్నమ్మాయికి రోషం పొడుచుకుని వచ్చేసింది.  ఈ ఇంట్లో తనింక ఉండలేననుకుంది.  కటకటాల గడి కిర్రుమంటూ జరిపి, కాళ్ళకు చెప్పులేనా లేకుండా బయటకొచ్చింది! 

ఏమంత పెద్ధవీధి. అటో పది ఇటో పది ఇళ్లూ... వీధి చివరే కాలవగట్టు, గోదారిపాయ!
నేల నిప్పులగుండంలా ఉంది. అలాగే గెంతుకుంటూ, పరుగులు పెడుతూ స్నేహితురాలు,  ప్రేమ ఇంటిదాకా వచ్చి, కాళ్ళుకాలకుండా వాళ్ళ రాధామాధవాల గుబురు నీడలో నించుంది.”  ప్రేమా, రామక్రిష్ణా లేచి వున్నారేమో! తలుపు కొడదామా”! అనుకుంది." అమ్మో! అసలే వాళ్ళమ్మ టీచరు.  తను లేబర్ ఆఫీసరు గారి కూతురయినా ఆవిడకేం లెక్కా పత్రమా.  ఒక్క కసురుతో ఫొమ్మంటుంది" అని స్వగతంలో అనుకుని, రివ్వున ఆ ఎండలోనే… పరిగెట్టి.... కాలవగట్టు మీదున్న క్రిష్ణమందిరానికొచ్చి.... అక్కడ అరుగుమీద కూర్చుంది. 

క్రిష్ణమందిరం ముందు అప్పుడెప్పుడో…వసంతపున్నమికి వేసిన తాటాకుల చలవపందిరి కింద సేదగా కూర్చుంది చిన్నమ్మాయి.

 వేడిగా వస్తున్నా,  గాలి జోరుగా వంటికి తగిలి ప్రాణానికి బాగుంది.  ఆ వయసే అంతేమో! ఎండయినా కొండయినా… లెక్కలేని వయసు!  ఎండిపోయి...బీటలేసిన రేగడితో , మధ్యమధ్య మిగిలిన నీళ్ళ చెలమలతో.... గోదావరి కాలవ శిధిలాలయంలా ఉంది.  అదే గోదారి… కార్తీకమాసం..నిండుసంద్రంలా ఉంటే…తనని సాయం తీసుకుని గుడికొచ్చిన బామ్మ గట్టుమీంచి అరుస్తున్నా లెక్కచెయ్యకుండా కాలవలో బారలేస్తూ ఈత కొట్టడం గుర్తొచ్చి, నిట్టూర్చింది చిన్నమ్మాయి.
“ ఎంత బావుండేవి ఆ కార్తీకస్నానాలు, అట్లతద్దికి వెన్నెలలో కాలవగట్టున ఇసుకలో ఆడిన ఆటలు…. సుబ్బారాయుడి గుడిబయట రావిచెట్టుకు వేసిన తాడెత్తు ఉయ్యాలలు భయం లేకుండా ఆకాశం అందేలా ఊగడం…. మార్గశిరంలో షష్టితీర్ధాలూ….క్రిష్ణమందిరంలో భీష్మేకాదశకి ఎక్కడెక్కడి నుండో వచ్చే భజనబృందాలు….వసంతపంచమికి ఆ లోగిళ్ళంతా రంగురంగల ముగ్గులేసి, జెండాలు కట్టి… గులాలు చల్లుతూ రాధాక్రిష్ణుల పాటలన్నీ తాళాలూ, ఢోలక్ వాయిస్తూ పాడడం….. తనుపాడిన “ గోపాలా రాధాలోల! గిరిధరబాలా నందలాలా” పాటకు బహుమతి రావడం ఇవన్నీఎంత సంతోషమైన దినాలు…!”…. అనుకుంటూ …. ఆటపాటలకు ఆనకట్టేసిన వేసవిరోజుల్ని తిట్టుకుంది!  

కానీ ఇప్పుడా! ఏ హడావిడీ లేదు! అసలు లోకంలో జనాలే లేరా అన్నట్టుంది! కాలవకవతల సామర్లకోట రోడ్డుమీద ఒకటీ అరా సైకిళ్శ మీద కాకినాడ టౌనులోకి పోతున్న అరటిగెలల వాళ్ళూ, తాటిముంజులాళ్ళూ తప్పా పిట్ట లేరు. అంత శూన్యజగత్తులో.... తనొక్కతే మిగిలినట్టు చిన్నమ్మాయికి .... ఎక్కడలేని బెంగా వచ్చేసింది. 

    కాసేపటికి కాలవగట్టుమీద ఇద్దరు అమ్మిలు తట్టలు నెత్తిన పెట్టుకుని నడుచుకుంటూ... వచ్చారు. మందిరం అరుగుమీద కూలపడ్డారు. నెత్తిమీద చుట్టగుడ్డ విప్పి.... మొహాలకు పట్టిన చెమట్లు తుడుచుకున్నారు. 

ఒక తట్టలో ఎండుచేపలూ, రొయ్యిలూనంట... మరొక తట్టలో తాటిముంజెలు ! అప్రయత్నంగా ముక్కు మూసుకుంది చిన్నమ్మాయి. " బేపనోల్లా పాపా!".... అంటూ వాళ్లు నవ్వుతూ అడుగుతుంటే... పౌరుషంగా..." ఆ బ్రాహ్మణుల అమ్మాయినే! " అంటూ మరింత స్పష్టం చేసింది. 

        చిన్నమ్మాయి నిష్ట ఎంతోసేపు నిలబడలేదు. మెల్లగా ముక్కుమూసుకునే చేపల తట్టలోకి తొంగిచూసింది. దానిలో ఉన్న ఒక్కోజీవి పేరూ అడిగింది. ఓ పదినిమిషాలు.... మొత్తం మత్స్యజాతి వేట, గాలమెలా వేస్తారు? జాలంలో ఎలా పడతారూ. , ఎలా ఎండపెడతారూ, ఎలా బజారుకు చేరుస్తారు.... ఇత్యాది..జంతుశాస్త్ర.. ఆర్ధికశాస్త్ర విషయాలన్నీ చేపలమ్మాయితో… చర్చించింది!

 ఇంతలో... ముంజులమ్మాయి "తీసుకో పాపగారూ"...... అంటూ తాటాకుదొన్నెలో అందించిన లేతముంజుల్ని .... మురికిచేతుల్ని.... అమ్మ .. లోపల మల్లుగుడ్డేసి కుట్టిన తెల్లని గ్లాస్కో గౌనుకు ఓసారి తుడిచేసుకుని.... మనసారా తినేసింది! 

ఎండా కాస్త తగ్గుమొహం పట్టింది... చిన్నమ్మాయి వేసవి తాపమూ తగ్గింది. 

          ఇంటికి పోవడానికి లేచింది మెల్లగా. కొత్తమిత్రులకు టాటా చెప్పింది. ఎప్పుడయినా వాళ్ళింటికి రమ్మంది. " ఎందుకు పాపా! సేపలు కొంటావా? "... అంటూ మేలమాడింది చేపలమ్మి. "కాదులే మా అమ్మ ఊరగాయ పెడుతుంది. పాతచీరలు ఇమ్మంటాను! "....... అమ్మ అనుమతి లేనిదే వరాలిచ్చేసి... అటోకాలూ, ఇటోకాలూ ఊపుకుంటూ... పోయింది చిన్నమ్మాయి. 

         ఇంటికి చేరిందే కానీ..కావాలని కటకటాలు లోపలినుంచి గడీ పెట్టేసారు. " ఇప్పుడెలా?" ! 

చెక్కకుర్చీలో కూర్చుని వాళ్ళ బామ్మ... ఊదుకుంటూ... ఇత్తడి ఆపుకోరాలో టీ తాగుతోంది. ఆవిడ బయట నిలబడున్న చిన్నమ్మాయిని మహాకోపంగా చూస్తోంది. 

ఈలోపున అమ్మ వచ్చింది. ముసలమ్మ " దానికి తలుపుతీసేవంటే... నేను నూతిలో దూకుతా! మగరాయుడిలా ఊళ్ళుపట్టి తిరిగి పరువుతీస్తోంది".... అంటూ జారిపోతున్న ముసుగు సవరించుకుంది. 
చిన్నమ్మాయికి నోరెక్కువ! " దూకవే! బోడిముండా! పీడావదులుతుంది! " అని గొణిగింది. 
అంతే తలుపులు తెలుచుకోనూ, వీపు మీద అమ్మ దబదబా నాలుగు బాదనూ అయిపోయింది. 

      చిన్నమ్మాయి పెద్దగా ఇవన్నీ పట్టించుకోదు. కాగితం మంటలా ఒక్క ఏడుపు ఏడ్చి మర్చిపోతుంది. అమ్మది ఆల్సేషన్ ముక్కుకదా! చేపల వాసన పట్టేసింది. " ఈపిల్ల ఎక్కడ తిరిగొచ్చిందో...." అని తల పట్టుకుని..." ఫో! ఇంట్లోకి రాకు. సందులోంచి పోయి.. నూతిదగ్గర స్నానం చేసిరా! ".... అని తోసేసి తలుపులేసేసుకుంది. చిన్నమ్మాయికి మామ్మముందు తలకొట్టేసినట్టయింది.
 నూతిలో నీళ్ళు తోడుకుని నెత్తిమీంచి పోసేసుకుంది. చల్లనీళ్ళు ప్రాణాలకు హాయిగా ఉన్నాయి. అలా నీళ్ళలో నానుతూనే ఉన్న చిన్నమ్మాయిని దెబ్బలాడి వాళ్ళమ్మ.... తువ్వాలు విసిరి తుడుచుకోమంది. 
అలా పెరటిగుమ్మాన పడి లోపలికొచ్చిన చిన్నమ్మాయికి కళ్ళు మిలమిలా సంతోషంతో మెరిసిపోయాయి. 

        ఎప్పుడు కొందో ఏమో అమ్మ! ..... పెద్ద స్టీలు బేసిన్ నిండా కుప్పగా పోసిన పందిర మల్లెమొగ్గలు. సన్నగా, పొడవుగా... వాళ్ళ అక్కలా అందంగా! సుకుమారంగా! పక్కన అరటాకుల్లో చుట్టి ఉన్న కనకాంబరం మాలలు, మరువం, ధవనం కొమ్మలు!  తెల్ల దూరపుండ, సూదులూ, విస్తరాకులు కలిపికుట్టిన పెద్ద అట్ట! 

" ఓహ్! అమ్మా! మాకు జడలు కుడుతున్నావా ఈవేళ?!".... అంటూ బిగ్గరగా చిన్నమ్మాయి అరిచింది. 

" అవునే! అయితే ఏంటిటా?!"..... అంటూ తిప్పుకుంటూ…వాళ్ళక్క లోపలినుంచి వచ్చింది.
 ఆ మధ్య దాని ఫంక్షనుకు అమ్మమ్మ కొన్న కొత్త పట్టుపరికిణీ వేసుకుని, పౌడరూ, బొట్టూకాటుక పెట్టేసుకుని, ఎర్ర పొళ్శ నెక్లేస్ మెడలో తగిలించుకుని.. , దాని పొడవాటి ఒత్తు జుట్టంతా.... సాపుగా దువ్వేసుకుని రెడీగా ఉంది పెద్దమ్మాయి. 

చిన్నమ్మాయికి గాభరా వచ్చేసింది. తడితలను ఏదో మమ అన్నట్టు తుడిచేసుకుని….. ఆ తడిమీదే ఇంత పౌడరు కొట్టుకుని…ఎండకు బాగా పేలిపోయి, చమటలు పడుతున్న ఆ నుదుటిమీద పొడవుగా ఇంత తిలకం పుల్లతో పైకిలాగింది. “ అమ్మా! ఏం పట్టుపరికిణీ వేసుకోనే! …” అంటూ అరిచింది. అమ్మచెప్పినట్టే… అక్కకు మోకాళ్ళ కిందకు వచ్చేసిన ఎర్రంచు ఆకుపచ్చ లంగా వేసేసుకుని…. పువ్వులు పేరుస్తున్నఅమ్మ దగ్గరకు పరిగెట్టుకొచ్చింది. 

       మొహాన  తెల్లఅట్టల్లా కట్టేసిన పౌడరుతో… ముక్కుమీంచి కారిపోతున్న తిలకంతో… నీరుకారుతున్న పొట్టి జుట్టుతో నించున్న చిన్నమ్మాయిని చూసి అంతా పడీపడీ నవ్వారు. 

చిన్నమ్మాయి ఎక్కడ ఉక్రోషపడుతుందో అని అమ్మ భయపడిపోయీ…. చేతిలో పువ్వులు ఆపట్టాన బేసిన్ లో పడేసి… కూతురు తలంతా పొడిగా తుడిచింది. పౌడరు సరిచేసి… ముక్కుతుడిచిందా… చిన్నమ్మాయి ఎర్రని ముక్కుతో సత్యభామలా ఉందట అమ్మకళ్ళకు. ఆమాటే అంటుంటే…. “ కొండముచ్చు”లా ఉందని గేలిచేసారు మిగిలినవారు. 

            జడకుట్టించుకోడానికి పెద్దమ్మాయి కూర్చోగానే…. అమ్మ.. తనకు తల దువ్వి కుదురుగా పాయలు తీసి.. పైనుండి గట్టిగా బిగిస్తూ… నల్లని పొడావయిన కొరడాలాంటి జడల్లింది… మధ్యలోంచి సిల్కుకుచ్చెల బంగారం జడగంటలు కలుపుతూ… భలే అందమయిన జడవేసింది. ఆ తరవాత అబ్బాయలూ, చిన్నమ్మాయి.. మంచిపొడవైన సౌష్టవపు మొగ్గలు అందిస్తుంటే … చకచక అట్టకు వేసి కుట్టేస్తోంది.

 ప్రతి ఐదువరసల తరువాత.. ఇంట్లోపూసిన చిక్కని కాషాయపు మద్రాసు కనకాంబరాలూ, ధవనం కలిపి బద్దీలు వేసింది. అరగంటలో జడంతా కుట్టీ చివర… మల్లెల సరాలు కూర్చి వాటి చివర దేశవాళీ గులాబీలను వ్రేలాడతీసింది. అంత అందమయిన జడను చూసి…. అమ్మ నేర్పరితనానికి పిల్లల కళ్ళు ప్రశంసగా మెరిసాయి. 
      మగపిల్లలను వంటింట్లో కాసిని పకోడీలు వేసుకురమ్మని పంపి…. అమ్మ పెద్దమ్మాయి జడకు… చకచకా పూలజడ టాకాలు వేసేసింది. కట్టిపెట్టి ఉంచిన బొండుమల్లెల దండ, కనకాంబరాల దండా… జడపైన అర్ధచంద్రకృతిలో అమర్చి… పిన్నులు పెట్టింది. ఆ పైన అమ్మ పుట్టింటారు ఇచ్చిన తెల్లరాళ్ల సూర్య చంద్రులను తలకు అటూయిటూ పెట్టింది. మధ్యలో ముచ్చటయిన నాగరం పెట్టింది.

 పెద్దమ్మాయిని ముందుకు తిరగమని… చుబుకం పట్టుకుని… పొళ్ళ పాపిడిపిందె పెట్టింది. తన మామిడిపిందెల గొలుసు వేసింది. చెవులకు లోలాకుబుట్టలు పెట్టి… నాలుగు పేటల చెంపస్వరాలు పెట్టింది. 

పుల్లతో దిష్టితగలకుండా బుగ్గమీద చిన్ననల్ల అలుగుబొట్టు పెట్టింది. లేచి నిలబడమని… చంద్రకాంతరంగు పట్టుపరికిణీలో… కుందనబొమ్మలా మెరిసిపోతున్న పెద్దమ్మాయిని తనివితీరా చూసుకుంది. చిన్నమ్మాయికి కూడా అక్క తెగనచ్చేసింది. వెళ్ళి గాట్టిగా కావలించుకుంది. “ అబ్బా! బట్టలూ, జడ నలిపేయకే…” అంటూ మురిపెంగా విడిపించుకుంది పెద్దమ్మాయి. 

         ఇప్పుడు చిన్నమ్మాయి వంతు కదా! అన్నలిద్దరూ… పకోడీలూ, మైసూరుపాకూ ప్లేట్లలో సర్ది… అందరికీ తెచ్చారు.

 చిన్నమ్మాయి అల్లప్పచ్చడి కావాలంది. బామ్మ..” కుళ్ళుముండకి అల్లంపచ్చడి!” అంది. చిన్నమ్మాయి వెంటనే… “ బోడిముండకి దోసకాయపచ్చడి” అంది! అమ్మకు కోపం వచ్చింది. విసురుగా ముందుకు తోసింది. చిన్నమ్మాయి ముందుకు పడింది. 

కోపంతో చిన్నమ్మాయి పకోడీల ప్లేటు విసిరేసింది. పకోడీలు పూల బేసిన్ లో పడ్డాయి. అమ్మకు కోపం తారాస్థాయికి చేరుతోంది. అది గ్రహించి … పదిహేడేళ్ళ పెద్దబ్బాయి కలగచేసుకుని… అమ్మకన్నా ముందు చిన్నమ్మాయిని శాంతింప చెయ్యాలని గ్రహించి….” చాలు.దీన్ని ఎవ్వరూ ఏమీ అనడానికి వీల్లేదు. దీనిలా మీకెవరికయినా అన్ని పరిక్షల్లో నూటికి నూరొచ్చాయా? రాలేదు కదా! నోరుమూసుకోండి! “…. అని గద్దించాడు. 

       అమ్మ చిన్నదాన్ని ఒక్క గుంజుగుంజి…తన కెదురు కుదేసింది. పొద్దున్నే బళ్ళకు పంపుతూ… నాలుగేసి బారుజడలు వెయ్యలేక చిన్నపిల్లకు పొట్టిజుట్టు చేయించేసి… రెండు పోనీటెయిల్స్ వేసేది. ఈరోజూ అలాగే రెండు పోనీటెయిల్స్ వేసింది. వాటికి నల్లదారాలతో రెండు పెద్ద సవరాలు కట్టి జడలల్లింది. చకచకా పావుగంటలో మూడుగజాల మల్లెమాలలు సున్నితమైన వేళ్ళను వేగంగా నేర్పుగా తిప్పుతూ అల్లేసింది. వాటిని చిన్నమ్మాయి రెండుజడలకూ నిండుగా చుట్టేసింది. ఆ జడనుండి ఈ జడకు ఉయ్యాలలాగా మాల వేసింది. తలోజడలో తలో గులాబీ గుచ్చింది. 
      
కొయ్యగండ్లు వచ్చిన చెవికన్నాలకు ఆ పుల్లలే ఉంచేసింది. చిన్నమ్మాయికి దాని ఆంజనేయస్వామి బిళ్ళ బంగారుగొలుసు వేసింది. “ ఆ చార్మినార్ గాజులు వేసుకో ఫో!” అంది.

 ఈ తేడాలను చూస్తున్న  చిన్నమ్మాయి మనసు లావాలా కుతకుతలాడుతోంది.

 దానికి తగ్గట్టే… కాళ్ళకు దణ్ణం పెడుతుంటే… బామ్మ పెద్దమ్మాయికి పదిరూపాయిలూ.. ఈవిడికి ఐదే ఇచ్చింది. 
ఆ అవతారాలతో అప్పచెల్లెళ్ళిద్దరూ.. పేటంతా తిరిగారు. పెద్దలకు దణ్ణాలు పెట్టారు. 

అందరూ పెద్దమ్మాయి బుగ్గలు పుణికి, మెచ్చుకుని రూపాయో… రెండ్రూపాయలో చేతిలో పెట్టారు! … చిన్నమ్మాయి బుగ్గలు నొప్పెట్టేలా సాగదీసారు. ఆ రెండుజడల పూలజడను చూసి ముసిముసి నవ్వులు కూడా నవ్వుకున్నారు. 

తన పదేళ్ళ జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదనుకుంది చిన్నమ్మాయి. 

        ఇంటికి వస్తూనే…. రాత్రివంటకి..కత్తిపీట ముందేసుకుని అరటికాయలు తరుగుతున్న అమ్మ ఎదురుగా నిలబడింది. 
అమ్మతలెత్తి చూసింది. 

చిన్నమ్మాయి మౌనంగా.. జడకు చుట్టిన పూలదండలు పరపరా కిందకు లాగింది. దారాలకు ఉరేసినట్టు మల్లెపూలన్నీ విగతగా నేలంతా రాలిపోయాయి!

కసిగా ఇంకా పీకింది! ఇంకా పీకింది. రెండు సవరాలు చేతికేచ్చేంత వరకూ పీక్కుంది! ఆ రెంటినీ పట్టుకుని అమ్మమీదకు విసిరేసింది. 

సన్నని బంగారుగొలుసు మెడనుకోసేలా లాక్కుంటూ ముక్కలు చేసి మూలకు విసిరింది. 

        అమ్మ నిశ్చేష్టే అయ్యింది.
 పిల్లలు బిత్తరపోయారు చెల్లిని చూసి! పక్కనే క్రిష్ణాజినంపై కూర్చుని రుద్రాక్షతావళం తిప్పుతూ… ధ్యానంచేస్తున్న బామ్మకోపం ముంచుకు రాగా,, అసంకల్పితంగానే… చిన్నమ్మాయి మీదకు రుద్రాక్ష తావళం గురిచూసి విసిరింది. 

పిల్ల కంటికి గట్టిగానే తగిలింది. ” అమ్మా! “ అని కన్ను ఒకచేత్తో… పట్టుకుని… చేతికందిన పూలబుట్ట బామ్మ మీదకు విసిరింది. 

అమ్మ భద్రకాళే అయ్యింది. కత్తిపీట పట్టుకుని ఒక్క ఉదుటున లేచి… చిన్నమ్మాయి కేసి రౌద్రంగా ఉరకపోయింది.

 చిన్నమ్మాయి భయంతో పెరట్లోకి పరిగెట్టి… ఉరుకుతూ,ఏడుపుతో  వెక్కుతూ.. పెరట్లో తాతలనాటి నుండీ ఉన్న పొడుగాటి  మావిడిచెట్టును కోతిలా… చకచకా ఎక్కేసింది…. ఓ పక్క పరికిణీ కాళ్ళలో అడ్డుపడుతున్నా! 

కొమ్మ మీంచి కొమ్మ అందుకుంటూ……చిటారి కొమ్మకు చేరి… ఓ పెద్ద కొమ్మమీద పొట్టఆన్చుకుని కరుచుకున్నట్టు కూర్చుంది. అమ్మకు గుండాగిపోయింది చిన్నదాని అఘాయిత్యానికి.

 “ ఎవరయినా చెట్టు ఎక్కేరా… దూకేస్తా!”… అంటూ చిన్నమ్మాయి కీచుగొంతుతో అరుస్తోంది. అమ్మ కూడా కుర్రాళ్ళను చెట్టు ఎక్కకుండా వారించింది. అక్క వచ్చి” దిగవే!.నా అమరచిత్రకధలన్నీనీకే ఇచ్చేస్తా”..నంటూ ఆశపెట్టింది. అయినా దిగలేదు. 

         ఈలోపున వాళ్ళ నాన్నగారు వచ్చిన అలికిడి అయింది. అమ్మ ఇంట్లో గొడవలేవీ నాన్నగారికి చెప్పి విసిగించదు. పూలజడేసుకున్న పెద్దపిల్లను చూసి నాన్నగారు చాలా ముచ్చటపడ్డారు. 

నిలువుటద్దంలో పూలజడ కనిపించేలా ఫోటోలు తీసారు. “ చిన్నదేది” అంటూ చుట్టూ కళ్ళతో వెతికారు. బామ్మగారు ఏదో మాయమాటలు చెప్పి…. మాట మరిపించారు. 

అంతే! ఒక్కసారి...నాన్నగారు ఆయన గదిలోకి వెళిపోతే… ఇహ అన్నీ అక్కడికే. ఇంగ్లీషు పుస్తకాలు చదువుకుంటూ ఉండిపోతారు. 

             వేసవి అవడం వల్ల…. రాత్రి ఎనిమిదింటికి చీకటయింది. 

చిన్నమ్మాయి కిందకొమ్మల మీదకొచ్చి… చెట్టుమీదకి వచ్చి చేరిన పక్షులను పలకరిస్తోంది. అవి నిద్రమత్తులో ఎగరనూ లేక గూళ్ళలో బజ్జునే…. ఏవో కువకువలతో జవాబులిస్తున్నాయి. 

ఎనిమిదింటికి… భోజనాలవేళ… చిన్నదాన్ని పిలుచురమ్మని పిల్లల్ని పంపింది అమ్మ. “ రానంది” చిన్నావిడ. అమ్మ బతిమాలద్దంది. 

భోజనాలయ్యాకా… అమ్మ మర్నాటికని గారెలపప్పు రుబ్బడానికొచ్చింది. ఇంటి చుట్టూ లైట్లేసింది. 

చిన్నమ్మాయి చెట్టుమీంచి అమ్మనే చూస్తోంది. అమ్మపిలిస్తే బావుండుననుకుంటోంది. 

        అమ్మ దీక్షగా పప్పురుబ్బుతోంది. చిన్నమ్మాయికి ఉదయం నుండి తిరిగిన తిరుగుడు తాలూకు అలసట, ఆకలి, దాహం, దుఃఖం, అవమానంతో ఏడుపు తన్నుకొస్తోంది. దాన్ని రోషం ఆపుతోంది. 

కాసేపటికి లైటులు ఆర్పకుండానే అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. 

తమ ఇంటివెనకనే ఉన్న నిర్మానుష్య పురాతన దేవాలయాన్ని చీకట్లో చూస్తుంటే చిన్నమ్మాయికి బెంబేలుగా ఉంది. 

గట్టిగా అరిచి నాన్నగారిని పిలిచి …. తనకు జరుగుతున్న అన్యాయాలూ… మిగిలినవారి దౌర్జన్యం చెబ్దామా అనుకుంటోంది. 
         ఇంతలో… వంటింటితలుపు తెరుచుకుంది. అమ్మ బయటకొచ్చింది. పెరటి వరండా మీద చాప పరిచింది. ఏవో గిన్నెలు సర్దింది. 

చెట్టుకిందకొచ్చింది. పిల్లకు కడుపులోంచి దుఃఖం, ఆనందం ముంచుకొచ్చాయి. “ దిగు” అంది అమ్మ.

 ఆ స్వరంలో కోపం లేదు. దయ, ప్రేమా, మార్ధవం తప్పా. మరింక బెట్టు చెయ్యలేకపోయింది చిన్నమ్మాయి. చకచకా దిగి అమ్మను చేరింది.

 అమ్మ గట్టిగా కావలించుకుంది. అమ్మ కళ్లలో నీళ్లు! నుదుట ముద్దుపెట్టుకుని… చిన్నమ్మాయిని నూతి దగ్గరకు తీసుకెళ్లి చల్లనీటితో చేతులు, మొహం  కడిగి.. తన మెత్తని చీరకొంగుతో తుడిచింది. 

వరండాలో వేసిన చాపమీద రెండు వెండికంచాలు పెట్టింది. ప్రశ్నార్ధకంగా చూసిన చిన్నమ్మాయితో…” రెండోది నాకే!” అంది.

 కూరన్నం, చారన్నం తినగానే… అమ్మ రెండుకంచాల్లో మల్లెపువ్వంటి అన్నం వేసి… కంచాల నిండుగా మీగడపాలు పోసింది. మరో గిన్నెనుండి ముక్కలపులుసులో పులుసుముక్కలన్నీ గరిటతో తీసి… ఇద్దరి కంచాల్లో వేసింది. 

ఇద్దరూ ఒకరి మొహాల్లోకి ఒకరు చూసుకుని ఫక్కున నవ్వుకున్నారు. అది వారిద్దరికే ప్రత్యేకమైన అభిరుచి! 

        అన్నాలు తినేసాకా… సామాన్లన్నీ నూతిచప్టా దగ్గర పడేసింది అమ్మ. 

తులసికోట గూటిలో ఉన్న దీపంలో నూనెపోసి… వత్తి ఎగదోసింది. 

చాపమీద కాళ్ళు కిందకు వేలాడేలా కూచుంది. చిన్నమ్మాయిని… చేతులు చాచి.. “ ఇలా రా!” అని పిలిచింది. ఒళ్ళోకి లాక్కుని… గట్టిగా కౌగిలించుకుని…. బుగ్గలంతా ముద్దుపెట్టుకుంది. 

పక్కనే కిటికీలో పెట్టిన బసంతమాలతి లోషన్ తీసి… చమటకాయలతో పేలిపోయిన నుదురూ, చెంపలూ, వీపుకు మృదువుగా రాసింది. 

ఆ పట్టుపరికిణీ తీసేసి, దండెం మీద ఆరేసున్న నూలు గౌను వేసింది. 

బాదం చెట్టు ఆకులు విసెనకర్రలు విసురుతూ వేసవితాపం తీరుస్తున్నాయి. అమ్మా- చిన్నమ్మాయి ఆ చుక్కల ఆకాశాన్ని చూస్తూ  బోలెడు కబుర్లు చెప్పుకున్నారు.

“ అన్నలూ, అక్కా మరో ఐదేళ్ళకు బయటకు వెళ్ళిపోతారుగా! మరి వాళ్ళకు కాస్త ఎక్కువ చూసి పంపాలి కదా నేను! ఆ తరవాత మనిద్దరమే మిగులుతాం. అప్పుడు అమ్మ అచ్చంగా నీదే! అన్నీ నీవే! మనిద్దరం కలిసి సినిమాలు చూడచ్చు, పుస్తకాలు చదవుకోచ్చు, మామయ్యల ఊర్లు వెళ్ళచ్చు, నువ్వు వేసవిసెలవల్లో రోజూ పూలజడ వేయించుకోచ్చు. నా నగలన్నీ నీకే కదా! చిన్నతల్లీ! నువ్వు మా అమ్మవురా! నా కోసమే మళ్ళీ పుట్టావు. నాలాగే… బోల్డంత బుర్రతో, అల్లరితో!” …. అంటూ అమ్మ చెప్తుంటే… నిద్రకూరుకుపోతున్న కళ్ళతో అమ్మ నడుం మీంచి తన ఎడమ కాలుతిప్పి….” అమ్మా! ఎందుకు నేను మీ అమ్మను?”… అని అడిగింది చిన్నమ్మాయి. “ మా అమ్మకు కూడా నీలాగే ఇట్టు కోపం. ఒకరోజు నేను విసికించానని … నా పదేళ్ళప్పుడు ఎత్తి వీధిలోకి విసిరేసింది!”….. అని పకపకా నవ్వింది అమ్మ. 

చిన్నమ్మాయికి నవ్వు రాలేదు. పదేళ్ళ అమ్మకు తన లేత చేతులతో నడుం రాయసాగింది! 

ఇలా పెళ్ళయే వరకూ అమ్మను దేనికో దానికి… అలకలతో, కోపాలతో విసికిస్తూ, సాధిస్తూనే ఉంది చిన్నమ్మాయి. పెళ్ళవడంతోనే అమ్మమీద అలకలూ, విసుకులూ ఆయనమీదకు మళ్ళినా అమ్మంత శాంతమూర్తే దొరికాడు చిన్నమ్మాయికి! 

అమ్మ చెప్పినట్టు అక్కా, అన్నలూ నిజంగానే వెళ్ళిపోయారు….. చాలా దూరం… అమెరికాకు! బామ్మా వెళ్ళిపోయింది! నాన్నగారూనూ! 

ఇప్పుడు చిన్నమ్మాయికి ఏభైయేళ్ళు. అమ్మకు ఎనభై అయిదు.

 అమ్మ మరుపులతో, అలకలతో, ముదిమి బాధలతో….తనతోనే ఉండిపోయిన  చిన్నమ్మాయిని విసికిస్తూనే ఉంటుంది. 

చేతిలో ఏముంటే అది మీదకు విసురుతుంది. అన్నం తిననంటుంది. మందులు ఉమ్మేస్తుంది.

 కానీ చిన్నమ్మాయికి అస్సలు కోపం రాదు.
నవ్వుతూ… ప్రేమగా… అమ్మతల తన బొజ్జకు ఆన్చుకుని… వీపంతా మోయిశ్చరైజర్ రాస్తుంది. డైపర్స్ మారుస్తుంది సహాయకురాలి సాయంతో.  

స్పాంజిబాత్ చేయించి… మెత్తని గుడ్డలతో తుడుస్తుంది. మల్లెపువ్వంటి పక్కేసి… మల్లెచెండులా పడుకోపెడుతుంది అమ్మను. 

       అయితే మొన్ననే ఈమధ్య …..చిన్నమ్మాయి మళ్ళీ అమ్మను తెగ విసికించింది… అమ్మను అంతిమయాత్రకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ… అమ్మ చల్లని చెయ్యిని పట్టుకుని వదలకుండా!! 

 *ధన్యవాదాలతో* 
 *శశికళా ఓలేటి* .

రామాయణమ్.. 3

ఆ విషయం ఎరుక పరచటానికే తాను వచ్చినాడు ,అదే విషయం వాల్మీకి మునిపుంగవుడడిగినాడు! .
.
వాల్మీకి ముని ప్రశ్న విని ,నీలాకాశంలో పండువెన్నెల పరచుకున్నంత హాయిగా ఒక చిరునవ్వు వెలయించారు నారద మహర్షి! అవును ! ఆ మహాపురుషుడిగురించి ఆలోచించగనే ఎవరి హృదయం వికసించదు!
(.రమయతీ ఇతి రామః రాముడి గురించిన తలపురాగానే హృదయకవాటాలు భేదించుకొని ఆనందం బహిర్గతమవుతుంది)
.
తాను బ్రహ్మగారి వద్దనుండి తెలుసుకొన్న విషయాన్ని వాల్మీకి మహర్షికి విశదపరుస్తున్నారు విశ్వసంచారి!.
.
ఓ మహర్షీ నీవు అడిగిన గుణములతో కూడిన ఒకే ఒక మహాపురుషుని గురించి నీకు తెలియచేస్తాను! సావధానచిత్తంతో వినవయ్యా!
.
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామోనామ జనైః శ్రుతః
నియతాత్మా మహవీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ!
.
ఇక్ష్వాకు వంశ ప్రభువులలో "రాముడు " అనే పేరుగల మహాపురుషుడున్నాడని జనులంతా విని ఉన్నారు!
ఆయన కాంతిమంతము,శక్తివంతమూ అయిన శరీరం కలిగి అన్ని ఇంద్రియములను తన వశంలో ఉంచుకొన్నవాడు!.
.
ఆయన బుద్ధిమంతుడు,నీతిమంతుడు,సర్వశాస్త్రపాండిత్యము ,
మహదైశ్వర్యము గలవాడు!
ఆయన రూపం చూడచక్కనిది మనోహరమయినటువంటిది
 ఏ శరీర భాగం ఎంత ఉండాలో అంత కొలిచి నట్లుగా సృష్టించాడు బ్రహ్మ!
ఉన్నతమైన మూపులు (వాటి ఎముకలు బయటకు కనపడవు)ఎంత పెద్ద విల్లునయినా మోయగల మూపులువి!,
.
బాగా బలిసి మోకాళ్ళవరకు వ్రేలాడే బాహువులు,శంఖం వంటి కంఠము, ఎత్తైన చెక్కిళ్ళు,
.
విశాలము, కఠినము అయిన వక్షస్థలము, సర్వ లక్షణ శోభితమైన శిరస్సు !  
.
చూడగనే ఆకర్షించి చూపులు కట్టిపడవేయగల మనోహర సుందర రూపము!.
.
ఆయన అరిందముడు! అంతర్గతశత్రువులను ,బాహ్యశత్రువులను మర్దించినవాడు.
( కామ,క్రోధ,లోభ,మద,మోహ,మాత్సర్యము లు అంతర్గత శత్రువులు).
.
రక్షితా జీవలోకస్య ధర్మస్యపరిరక్షితా! ...సమస్త ప్రాణికోటిని కాపాడుతూ ధర్మాన్ని పరిరక్షించేవాడాయన!.
.
వేదవేదాంగ రహస్యములు ,ధనుర్వేదము ఆయనకు కరతలామలకము!.
.
తల్లి కౌసల్య ఆనందాన్ని పెంపొందించేవాడు ,సముద్రమంత గాంభీర్యము కలవాడు హిమాలయాలంత ధైర్యము కలవాడు!.
.
లోకంలోని నదులన్నీ ఏవిధంగా అయితే సముద్రాన్ని చేరటానికి ఆరాటపడుతూ పరుగులు పెడుతుంటాయో అదే విధంగా లోకంలోనిసమస్తమునిసంఘాలు,జానపదులూ,నాగరికులు,
సమస్తప్రాణికోటి ఆ మనోహర సౌందర్యమూర్తిని కనులారా దర్శించి తరించాలని ఆయన ఉన్న చోటికి ఉరుకులు పరుగుల మీద వెడుతుంటారు!
.
ఆయన శ్రీ రాముడు!
రామాయణం. 4
..
రామకధ మొత్తం వాల్మీకి మహర్షికి వివరంగా చెప్పి ఆయన చేత పూజలందుకొని ఆకాశమార్గాన దేవలోకం చేరుకున్నారు నారద మహర్షి .
.
వాల్మీకి మౌని హృదయం అవధులులేని ఆనందంతో పొంగిపొర్లిపోయింది.
.
 అవును !!!!!
అతడే ఆనందం ! అతడే పరబ్రహ్మము ! ఆనందమే పరబ్రహ్మము ! 
ఆ రామ బ్రహ్మము గూర్చి విన్న ఎవరి మనసు మాత్రము ఆనందంతో నిండిపోదు! ఆనంద స్వరూపుడుగదా ఆయన! .
.
శిష్యులతో కలసి ప్రాతఃసంద్యావందనమాచరించడానికి 
తమసానదీ తీరం చేరుకున్నారు మహర్షి వాల్మీకి! 
.
ఆ నదీ తీరం మనోహరంగా ఉన్నది! సమున్నతంగా పెరిగిన ఎన్నో జాతుల ఫలవృక్షాలు ,
వాటి మీద స్థిరనివాసమేర్పరచుకొన్న రకరకాల పక్షిజాతులు అవి చేసే కిలకిలారావాలు కడు రమణీయంగా ఉన్నది ఆ ప్రదేశం! 
.
ప్రకృతికాంత ఎన్నో హొయలు ఒలకబోస్తున్నదక్కడ!
.
నిర్మలంగా, స్ఫటికమంతస్వచ్ఛమైన నీటిప్రవాహంతో కనులకింపుగా ఉన్నది తమసా నదీ ప్రవాహం!
.
తమస ఎలా ఉన్నదంటే.
.
అకర్దమిదం తీర్దం భరద్వాజ నిశామయ
రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యధా
.
ఒక మంచి వాడి మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఏ కల్మషమూ లేకుండా ఎలా ఉంటుందో అలాగే ఏ మాత్రమూ బురదలేకుండా నిర్మలమనోహరంగా ఉన్నవట!  తమసాజలాలు!
.
అత్యంత రమణీయంగా కనపడుతున్న ఆప్రదేశంలో స్నానమాచరించాలని నిశ్చయించుకొన్నారు మహర్షి 
.
అలా రేవులో దిగి చుట్టూ చూస్తున్నారాయన !
.
 ఒక చెట్టుమీద రెండు క్రౌంచపక్షులు ప్రపంచాన్ని మరచి క్రీడిస్తున్నాయి సరససల్లాపాలలో మునిగి తేలుతున్నాయవి ! 
.
ఆ సమయంలో ఎక్కడనుండి వచ్చిందో రివ్వున  ఒకబాణం వచ్చివచ్చి మగపక్షి గుండెల్లో సర్రున దిగబడింది .
అంతే!అప్పటిదాకాఉన్న వాటి 
ఆనందం క్షణాల్లో మటుమాయమయిపోయింది . మగపక్షి రక్తపుమడుగులో పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచింది .
.
 మగని శరీరం చుట్టూతిరుగుతూ హృదయ విదారకంగా రోదిస్తున్నది ఆడపక్షి!.
.
ఆ దృశ్యం మహర్షి మనస్సును తీవ్రంగా కలచివేసింది ! చుట్టూ చూశారాయన ఒక బోయవాడు విల్లమ్ములు చేతబూని ఏదోసాధించిన వానిలా విజయగర్వంతో వస్తూ కనపడ్డాడు !
.
అప్రయత్నంగా మహర్షి నోటి వెంట ఒక శ్లోకం వెలువడ్డది!
.
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః
యత్ క్రౌఞ్చమిథునాదేకమ్ అవధీః కామ మోహితమ్
.
రతిసమయంలోఆనందంగా కూడి ఉన్న పక్షుల జంటను విడదీసి నీవు శాశ్వతమైన అప్రదిష్ట మూటకట్టుకున్నావు !
(అని అర్ధము.)
.
అప్రయత్నంగా తన నోటినుండి వెలువడిన ఆ పదముల కూర్పునకు మహర్షి ఆశ్చర్యచకితులయ్యారు!

ఆ కూర్పును ఒక సారి పరిశీలించారు!
.
అవి నాలుగు పాదములతో కూర్చబడి వున్నాయి!
వీణపై కూర్చి నృత్యగీతవాద్యాదులతో పాడటానికి ఒక క్రమపద్ధతిలో లయబద్ధంగా కూడా ఉన్నాయి! 
.
ఆ విషాద ఘటన మదిలో కదలాడుతూ ఉండగా భారమైన మనస్సుతో ఆశ్రమం చేరుకున్నారు మహర్షి!
.
ఆయన అలా వేదన లో ఉండగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినారు!
.
 బ్రహ్మదేవునకు నమస్కరించి అర్ఘ్యపాద్యాదులొసగి ఒక ఆసనముపై ఆయనను కూర్చుండబెట్టి వినయముగా ఆయన చెంతన మహర్షి నిలుచున్నారు.
.
ఈ పనులన్నీ చేస్తున్నా కూడా ఆయన మనసులో క్రౌంచపక్షులను బోయవాడుకొట్టిన ఉదంతం ,తానుపలికిన పలుకులు మెదులుతూ వున్నాయి .
అన్యమనస్కంగా వున్నారు మహర్షి.
.
ఆయన అవస్థ గమనించిన విరించి చిరునవ్వు నవ్వుతూ మహర్షీ నీ నోటినుండి వెలువడినది శ్లోకమే! సందేహములేదు!  అది నా ఇచ్ఛవలననే నీ నోటినుండి వెలువడినది! 
.
ఆ శ్లోకం ఉన్న రీతిలోనే నీవు రామకధను రచియించవయ్యా! ........
అని చెపుతున్నారు చతుర్ముఖుడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
.

సద్గురువులకు ఎందుకు నమస్కరించాలి?

శ్రీరామ.
శ్రీ కంచి పరమాచార్యులవారు మొదలైన సద్గురువులకు ఎందుకు నమస్కరించాలి?

 ఈ క్రింది శ్లోకము మనము నిత్యము పఠించేదే!
శ్లో// గురర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః /గురు:సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః //
(గురువే బ్రహ్మదేవుడు.గురువే విష్ణుమూర్తి, గురువే భగవంతుడైన శివుడు.గురువు ఈ త్రిమూర్తులకన్నా శ్రేష్ఠ తత్వమైన సాక్షాత్తూ పరబ్రహ్మ.ఆ గురువుకు నమస్కరిస్తున్నాను ).
ఈ భావనతో గురువును మనలో ఎంతమంది చూస్తున్నారు?
అయితే గురువును ఈ భావనతో సేవించాలని శాస్త్రం చెబుతున్నది.
ఎందుకోసం?
వారు అనుగ్రహించి మనలను సన్మార్గంలో నడిపించడం కోసం.
మహాభారతం ఉద్యోగ పర్వంలో ఒక శ్లోకం ఈ విధంగా ఉన్నది:
శ్లో// షడేతే హ్యవమన్యన్తే నిత్యం పూర్వోపకారిణమ్/
ఆచార్యం శిక్షితా:శిష్యా:, కృత దారాశ్చ మాతరమ్/
నారీం విగత కామాస్తు, కృతార్థాశ్చ ప్రయోజకమ్/
నావం నిస్తీర్ణ కాన్తారాః, ఆతురశ్చ చికిత్సకమ్//
(విద్య నేర్చుకున్న శిష్యుడు గురువును, భార్య వచ్చిన వాడు తల్లినీ, కామం ఉడిగిన వాడు స్త్రీని, పని పూర్తి అయినవాడు సహాయం చేసిన వారినీ, ఏరు దాటిన వాడు నావను, రోగము నయమైన వాడు నయం చేసిన వైద్యుణ్ణీ,--ఈ అరుగురూ తమకు పూర్వం ఉపకారం చేసిన వారిని విస్మరించి,అవమానిస్తారు),అని.
వీరికి కృతఘ్నతా దోషం సంక్రమిస్తుంది.
అన్ని పాపాలకంటే కృతఘ్నత గొప్ప పాపం.
సూర్యభగవానుడు కృతఘ్నులను హింసిస్తాడు అని "ఆదిత్యహృదయము" లో వాల్మీకిమహర్షి చెప్పారు.
 "కృతఘ్నఘ్నాయ దేవాయ"  (కృతఘ్నులను నశింపజేసే అదిత్యునకు నమస్కారము),అని.
పాపాత్ములను సూర్యభగవానుడు శిక్షిస్తాడు అన్న విషయం వేదము కూడా ఈ విధముగా తెలియజేస్తున్నది.
"అరుణము"  లోని "కశ్యపాదుదితా స్సూర్యా:పాపాన్నిర్ఘ్నన్తి సర్వథా" మొదలైన మంత్రములు, పాపములను చేసిన వారిని సూర్యుడు, కొందరిని చేతులు లేనివారుగాను, కొందరిని కాళ్ళు లేనివారుగాను,
 కొందరిని కళ్ళు లేనివారుగాను, ఈవిధముగా,సంపూర్ణ అవయవములు లేనివారిగా పుట్టించి హింసిస్తాడు.
మంచి నీళ్ళు కూడా లభించని నరకములు అనే స్థానాల్లో జన్మించేటట్లు చేస్తాడు.
స్వేదజములైన నల్లి, దోమ,ఈగ లాంటి జన్మలు, ఉద్భిజ్జములైన చెట్లు చేమలు లాంటి జన్మలు వచ్చేటట్లు చేస్తాడు", అని ఈ మంత్రములకు అర్థము. 
అందువల్ల పాపకర్మలు చేయవద్దని వేదశాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి.
పాపకర్మలు చేయకుండా మనకు తగిన బోధ చేసేది గురువు.
సన్మార్గంలో వుంటూ, తెలియకుండా కృతఘ్నత లాంటి పాపములు చేసినవారిని కూడా గురువు తగువిధముగా హెచ్చరించి వారిని దుష్కర్మ ఫలితాలు అనుభవించకుండా సకాలములో ఉద్ధరిస్తారు.
కృతఘ్నతా దోషము పాలుగాకుండా, ఒక సత్పురుషుని, శ్రీ కంచి పరమాచార్యులవారు అనుగ్రహించిన  సంఘటన ఒకటి ఇప్పుడు చెప్పుకుందాము.
 అనంతపురంలో  "మొదలి శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు"  అనే వేద విద్వాంసులు ఉండేవారు.
వారు అనేకమంది శిష్యులకు వేదము చెప్పేవారు.
సంస్కృతములో కూడా గొప్ప పండితులు.
అనంతపురం, ప్రభుత్వ కళాశాలలో సంస్కృత భాషోపన్యాసకులుగా ఉద్యోగం చేసే వారు.
మా బావమరిది శ్రీ అమ్మనమంచి శివప్రసాదు,అనంతపురం వైశ్యాబాంక్ లో పనిచేస్తుండగా వీరి సాంగత్యం లభించి, వీరి శిష్యులైనారు.
వీరిదగ్గర "అరుణము", మొదలైనవి అధ్యయనం చేశారు.
వారికి శ్రీ శర్మగారు స్వయముగా చెప్పినదే ఈ వృత్తాంతమంతా.
శ్రీ శాస్త్రిగారు  నిత్యము " సప్తశతి"పారాయణ చేసేవారు.
 అనేకమంది చేత చండీయాగములు చేయించారు. 
ఆగమ శాస్త్ర పండితులు కూడా కాబట్టి  అనేక దేవాలయ ప్రతిష్టలు కూడా నిర్వహించారు.
నెల్లూరు దగ్గరవున్న" పెంచలకోన" లో శ్రీ విజయేశ్వరి అమ్మవారు అనేకసార్లు వీరిచేత  తమ ఆశ్రమంలో చండీయాగములు చేయించారు. 
ఒకసారి శ్రీ కంచి పరమాచార్యులవారు అనంతపురంలో పదిరోజులు బస చేశారు.
శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు రోజూ వారిని దర్శించుకునేవారు.
కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీ స్వామివారు వీరితో మాట్లాడేవారు కాదు.
అందరితో మాట్లాడుతూ, ప్రత్యేకంగా, ఆ ఊరిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన వీరితో మాత్రం  శ్రీ స్వామివారు మాట్లాడక పోవడము అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించేది.
శ్రీ స్వామి వారు తనతో మాట్లాడక పోవడముతో శ్రీ శర్మగారు ఎంతో మనస్తాపం చెందారు.
కారణము తెలియక వారికి రోజు రోజుకు దుఃఖము అధిక మవుతుండేది.
ఇలా పదిరోజులు గడిచినై.
శ్రీ స్వామివారు అక్కడనుండి "ధర్మవరము" నకు ప్రయాణమయినారు.
శ్రీ శర్మగారు చింతాగ్రస్తులయినారు.
ఏమైనా సరే, శ్రీ స్వామివారు మాట్లాడేదాకా వారిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.
"నేను ఎప్పుడు వస్తానో తెలియదు.అప్పటివరకు సెలవు మంజూరు చేయ వలసినది" అని కళాశాలకు సెలవు చీటీ పంపించి, శ్రీ స్వామివారి వెంట ధర్మవరము వెళ్లారు.
శ్రీ స్వామివారు నదీ స్నానం ఆచరిస్తుండగా అక్కడ నిలబడి " అఘమర్షణ " సూక్తము మొదలైన స్నాన మంత్రములు చదివారు.
 మంత్రములు చదవటం పూర్తి అయినా, శ్రీ స్వామివారు, ఇంకా స్నానం చేస్తూనే ఉన్నారు.
శ్రీశర్మగారు కొంత తటపటాయిస్తూ "రుద్రము" చదవటం మొదలుపెట్టారు. 
శ్రీ స్వామివారు చదవమని చేయి ఊపి సైగ చేశారు.
పది రోజుల తరువాత అదే మొదటిసారి శ్రీ స్వామివారు, శ్రీ శర్మగారివంక చూడటము. 
శ్రీ శర్మగారు మహదానంద భరితులయినారు.
సాయంకాలము ఊరి వారందరితో కూడిన సభ జరుగుతున్నది.
శ్రీ స్వామివారు వున్నట్లుండి శ్రీ శర్మగారిని పేరు పెట్టి పిలిచి, వేదికపైకి రమ్మన్నారు.
శ్రీ శర్మగారు వేదికపైకి వెళ్లి శ్రీ స్వామివారికి నమస్కరించారు.
శ్రీ పరమాచార్యులవారు వీరితో సంస్కృతములో సంభాషణ ప్రారంభించారు.
" మీరు మీ గురువులను విస్మరించారు.
 మీ కుటుంబము వారందరికి శ్రీ శృంగేరీ జగద్గురువులతో ఎన్నో తరములనుండి అనుబంధము ఉన్నది.
మీకు చిన్న తనములో నత్తి వల్ల మాటలు సరిగా రాకపోవడంతో మీ ఇంట్లో వారందరు దిగులు పడ్డారు.
మీ తాతగారు,మిమ్ములను, శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములవారి సన్నిధికి  తీసుకు వెళ్లి విషయం విన్నవించారు.
జగద్గురువులు మీ నోరు తెరవమన్నారు.
ఎంతో అనుగ్రహంతో మీ నాలుకమీద వారి అమృతదృష్టి ప్రసరింపజేసి,చిరునవ్వు నవ్వుతూ " ఈ అబ్బాయి గొప్ప పండితుడు అవుతాడు. చాలా ప్రఖ్యాతి సంపాదిస్తాడు" అని ఆశీర్వదించారు.
ఆ క్షణం నుండీ మీకు నత్తి పోయింది.
స్పష్టమైన ఉచ్ఛారణ వచ్చింది.
వేదము, సంస్కృతము అధ్యయనం చేసి మంచి పండితులైనారు.
అటువంటి సద్గురువులను మీరు విస్మరించారు", అన్నారు.
శ్రీ శర్మగారు నిశ్చేష్టులైనారు.ఒక్కసారిగా వారికి గతమంతా గుర్తుకు వచ్చింది. తనను తన తాతగారు, శృంగేరీ తీసుకువెళ్లడము,జగద్గురువులు ఆశీర్వదించడము,తన విద్యాభ్యాసము, క్రమంగా శ్రీ జగద్గురువులను మరచి పోవడము అన్నీ జ్ఞప్తికి వచ్చినవి.
ఎంతో సిగ్గు పడ్డారు.
సాష్టాంగ నమస్కారము చేసి తాను శ్రీ శృంగేరీ జగద్గురువులను విస్మరించి గొప్ప పాపం చేశానని, మీరు నన్ను కాపాడాలని, శ్రీ పరమాచార్యులవారిని  వేడుకున్నారు.
శృంగేరీ వెళ్తానన్నారు.
ఆ తరువాత వారిద్దరూ అనేక విషయములు మాట్లాడుకున్నారు.
శ్రీ శర్మగారి సందేహాలు ఎన్నో శ్రీ స్వామివారు తీర్చారు.
వారిని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి అనుజ్ఞ ఇచ్చి పంపారు.
శ్రీ శర్మగారు అప్పటినుండి శ్రీశృంగేరీ వారితో తమ అనుబంధం కొనసాగించారు.
అనేకమందికి,వేదము, సంస్కృతము చెప్పారు. అనేక గ్రంధాలు రచించారు. 
అనేక సత్కార్యాలు చేసి జన్మ చరితార్ధము చేసుకొన్నారు.
దేహత్యాగ పర్యంతము ఏటువంటి రుగ్మతా లేకుండా సంపూర్ణ ఆరోగ్యముతో వున్నారు.
కృతఘ్నతా మహా దోషం నుండి తనను కాపాడిన శ్రీ పరమాచార్యులవారిని ఆ జన్మాంతమూ, స్మరించుకుంటూనే ఉండేవారు.
కేవలము తమ భక్తులనే కాదు, సన్మార్గంలో ఉండే వారందరినీ  శ్రీపరమాచార్యులవారు ఇలా
 కాపాడుతారు. 

శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః.
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

ఓం నమో భగవతే వాసుదేవాయ 
నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్
ఓం నమో శ్రీ వేంకటేశాయ

ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్  
*శని:*
నీలాంజన సమాభాసం                                              రవి పుత్రం యమాగ్రజమ్                                     
ఛాయామార్తాండ
సంభూతం 
తం నమామి శనైశ్చరం
*రాహు* :- 
అర్ధకాయం మహావీరం                                                  చంద్రాదిత్య విమర్దనం                                  
సింహికాగర్భ సంభూతం                                          తం రాహుం ప్రణమామ్యహమ్
*కేతు*:
పలాశ పుష్ప సంకాశం                                 
తారకాగ్రహ మస్తకమ్                                         
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం                                                        తం కేతుం ప్రణమామ్యహమ్ 
*ఓం శ్రీ గురుభ్యోనమః*
బంధుమిత్రులకు శుభాభినందనలు,
సమస్త సన్మంగళాని భవన్తు,
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,
శుభపరంపరాప్రాప్తిరస్తు,
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు 
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు 

పురాణ సంబంద 49 పుస్తకాలు(PDF)


మీకు కావలసిన  పురాణాలు  యొక్క బుక్స్ లింక్స్ ఇక్కడ విన్నాయి 
పురాణ సంబంద 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో.

గరుడ పురాణం www.freegurukul.org/z/Puranamulu-1
దేవీ భాగవతం www.freegurukul.org/z/Puranamulu-2
విష్ణు పురాణం www.freegurukul.org/z/Puranamulu-3
సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం
శివ పురాణము www.freegurukul.org/z/Puranamulu-5
భవిష్య మహా పురాణము
దేవీ భాగవతం www.freegurukul.org/z/Puranamulu-7
సంపూర్ణ కార్తీక మహాపురాణం
శివ పురాణం www.freegurukul.org/z/Puranamulu-9
పురాణ పరిచయము www.freegurukul.org/z/Puranamulu-10
బ్రహ్మ పురాణము-1,2,3
మార్కండేయ పురాణం www.freegurukul.org/z/Puranamulu-12
శ్రీ దత్త పురాణం www.freegurukul.org/z/Puranamulu-13
హరి వంశ పురాణం www.freegurukul.org/z/Puranamulu-14
లక్ష్మీ నరసింహ పురాణం
సంపూర్ణ దేవీ భాగవతము
కల్కి పురాణము-1,2 www.freegurukul.org/z/Puranamulu-17
బసవ పురాణం www.freegurukul.org/z/Puranamulu-18
అష్టాదశ పురాణ కథా విజ్ఞాన సర్వస్వము
శివ పురాణము – ధర్మ సంహిత
కన్యకా పురాణం www.freegurukul.org/z/Puranamulu-21
శివ రహస్య ఖండము-1,2
మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణ సార సంగ్రహము www.freegurukul.org/z/Puranamulu-23
భాగవత,వామన, మార్కండేయ మహాపురాణాలు
మార్కండేయ పురాణము
శ్రీ పరమేశ్వరి-దేవీ భాగవత వచనము
సూత సంహిత -స్కాంద పురాణాంతర్గతము
ఆంధ్ర స్కాందము-1 www.freegurukul.org/z/Puranamulu-28
మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-బ్రహ్మఖండము www.freegurukul.org/z/Puranamulu-29
స్కాందపురాణ సారామృతము
దేవాంగ పురాణం www.freegurukul.org/z/Puranamulu-31
అగ్ని పురాణం www.freegurukul.org/z/Puranamulu-32
మత్స్య మహాపురాణము
మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-ప్రకృతి ఖండము www.freegurukul.org/z/Puranamulu-34
వైశాఖ పురాణము www.freegurukul.org/z/Puranamulu-35
పురాణ వాంగ్మయం www.freegurukul.org/z/Puranamulu-36
విష్ణు ధర్మోత్తర మహాపురాణము -1
స్కాంద పురాణంతర్గత కార్తీక పురాణం
నారదీయ పురాణము www.freegurukul.org/z/Puranamulu-39
పద్మ పురాణము-భూమి ఖండము
మత్స్య మహా పురాణము-1
స్కాంద పురాణతర్గత బ్రహ్మోత్తరఖండం
మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-ఉత్తరార్ధము
మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-పూర్వార్ధము
సూత పురాణము www.freegurukul.org/z/Puranamulu-45
కైశిక మహత్యము www.freegurukul.org/z/Puranamulu-46
శివ తాండవము www.freegurukul.org/z/Puranamulu-47
దేవల మహర్షి చరిత్ర -వచన దేవాంగ పురాణం
ప్రధమాంధ్ర మహాపురాణము

పురాణముల పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి.

ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినవి

1. సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?

ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.

2. శ్రీకృష్ణపరమాత్ముడు నెమలి ఫించాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు?

కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలుతో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు. అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.

ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది.  పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.

3. మాతృ, పితృ, ఆచార్య, దైవ ఋషి రుణాలంటే?

పశుపక్షాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే బైటికి తరిమెయ్యరు. తల్లీ, తండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి, పెళ్లి కూడా చేసి ధర్మ, అర్థాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు. తల్లీ, తండ్రీ రుణం, ఎంత సేవచేసినా తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వారని బిడ్డల్లా చూసుకోవటమే.

మల ముత్రాలకు కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను సంపాదనతో నిస్వార్తముతో పెంచి పెద్ద చేసిన తండ్రి ఋణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నేర్పినందుకు గురు ఋణాన్ని, మనకి బుద్ధినీ, కర్మనీ ఇస్తున్న దైవ ఋణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా, సకల శాస్త్రాలనూ, ధర్మాలనూ గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి.తిరిగి తాను వివాహం ద్వారా అన్ని రుణాలన్నీ తీర్చి, తరిగి తాను ఋణ పడటమే మానవ జన్మ.

4. హారతి వల్ల లాభము ఏమిటి?

గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన పోతుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.

5.చిన్న పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు?

చినారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దదిష్టిని లకీ, పిల్లలకీ విభిన్నపద్ధతులలో తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టి తీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపినా నీటితో దిష్టి తీస్తుంటారు. బయటజనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టితీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు.

చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటంవల్ల చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కొంత అస్వస్థతకు గురిఅవుతారు. అందుకే వివాహవేడుకలలోను, పుట్టిన రోజువేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళలో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతతోపాటు ధైర్య గుణంవస్తుంది.

6. ఎలాంటివేళల్లో భోజనాన్ని తినకూడదు?

గ్రహణం సమయమున అనగా సూర్యగ్రహాణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహాణానికి 9 గంటల ముందుగా ఎటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోకూడదు.

7. ‘ఏడు’ సంఖ్య మంచిదా కాదా?

తిరుమల తిరుపతిలో కొండలు 7. ప్రత్యక్షదైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7, పాతాళం క్రింద లోకాలు 7, భువర్లోకాలు 7. అలాగే ద్వీపాలు 7. పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7. అగ్ని దేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. సప్తస్వరాలు కూడా ఏడే. 7 సంఖ్యమంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మనకోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకిలభిస్తుంది.

8. దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?

దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము. ఆవు నెయ్యితో వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వరాలూ, అష్టభోగాలు సిద్ధిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. అలాగే ఆముదంతో వెలిగించి చేసే దీపారాధన వలన దాంతాయి. వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు. శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము.

9. లక్ష్మీదేవి తామర పువ్వులోనూ, ఇరుప్రక్కలా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది?

సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం. ఇక ఇరుప్రక్కలా వున్న ఏనుగులకు అర్థం ఏమిటంటే శ్రీమహాలక్ష్మీ ధనబలము గజబలమంతటిదని అర్థం చేసుకోమని పరమార్థం.

10. తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి?

అద్దాల మంటపానికి ఉత్తరం దిక్కున ఉండి ఈ పూలబావి. స్వామి వారికి సమర్పించిన తులసీ, పూలదండలు, పువ్వులు ఎవ్వరికి ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు.

ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగ మార్గం ద్వారానే ఆ వెంకటేశ్వరస్వామిని శరణువేడాడు. స్వామి వారు ఆ ఆపద సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుడ్ని చూసి శ్రీమహాలక్ష్మీ సిగ్గుతో శ్రీమహా విష్ణువు వక్షస్థలంలో చేరింది. అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి రహస్యంగా దాక్కుందని పురాణాల గాధ.

11. ఉత్తరం దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు?

మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగివున్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉంది మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.

12. స్త్రీ తన కన్నా వయసు ఎక్కువ ఉన్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?

 స్త్రీకి సిగ్గు ఎక్కువ. కనుక ప్రేమతోలాలించి, బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదావ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు. కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.

13. పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా? కాదా?

పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.

14.విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా?

శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. ధూమశకటాలు నడుస్తాయని, ముఖానికి రంగేసుకున్న వారు దేశనాయకులవుతారనీ, భర్తలేని స్త్రీ రాజ్యమేలుతుందనీ, త్రాగే మంచినీళ్ళు కొనుక్కుంటారనీ…ఆయన చెప్పిన వన్నీ జరిగాయి. విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగం అంతమయిపోయినట్టే. అంత ఎత్తున కృష్ణమ్మ ఎగిస్తే ఇక భూమి మీద ఏం మిగులుతుంది?

15. కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి?

ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము. మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు; కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాదు కొబ్బరీ, ఆదివారము ఉసిరీ తినరాదు.

16. మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?

సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నిమయం పనికి రాదు.
(సేకరణ)