24, అక్టోబర్ 2023, మంగళవారం

బ్రహ్మ మాకు సరియా?

 బ్రహ్మ మాకు సరియా?

                                     --------------------------------------


            ఉ: " పెక్కు ముఖంబులన్జదివె  వేదము , లంతట  నిద్ర  సోమరై 


                   క్రక్కున  నీటిలోఁ గలిపెఁ ,గ్రమ్మర  నేర్చుట  సామెఱుంగు ,  నీ


                  యెక్కువ  యేమి  బ్రహ్మకని ?  ఏకముఖంబున  సాంగవేదముల్ 

                   

                 ల్దక్కక నేర్చి  బుధ్ధి నచలస్థితిఁ  దాలుతు  రప్పురిన్   ద్విజుల్ .


                     

                        శశాంక  విజయము-2 ఆ - 15 వ:పద్యము:-శేషము వేంకటపతి! 


                      దక్షిణాంధ్రయుగంలో  ఉద్వేలమైన  శృంగార కావ్యద్వయంలో  శశాంకవిజయం మొదటిది. రెండవది ముద్దుపళని రాధికాసాత్వనం. అంత బరితెగించిన కావ్యాలైనా వాటిలోకూడా చక్కని కావ్యగుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువలన రసజ్ఙులైన

పండితులు వానినాదరించి మెచ్చినారు. ప్రస్తుత పద్యము శేషము వేంకటపతి శశాంక విజయములోనిది. కవి ప్రతిష్ఠాన పురమును వర్ణించుచు  అచటి బ్రహ్మణుల తీరుతెన్నుల నీపద్యమున వివరించినాడు.


       అక్కడిబ్రాహ్మణులు    బ్రహ్మ  మాకన్నా  గొప్పవాడేమీ కాడు. అతనికన్నా మేమే యెక్కువ అని గొప్పగా చెప్పుకుంటారట, .

తెలుగు రాష్ట్రాల్లో

 తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న చలి. రానున్న మూడు రోజుల పాటు గజ గజా

======

గత పోష్ట్లల్లో చెప్పిన విధంగానే వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా బంగ్లాదేశ్ వైపుగా వెళ్తోంది. దీని వలన ఉత్తర భారత దేశం నుంచి దిగువకు వస్తున్న పొడి గాలులు నేరుగా మన వైపుగా వస్తోంది. దీని వలన రాష్ట్రంలోని అన్ని భాగాల్లో రాత్రి పూట చలి తీవ్రత భాగా పెరగనుంది. రాయలసీమ​, తెలంగాణలలో భాగా చలి తీవ్రత పెరగనుంది. ఈ పరిస్ధితి మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది.


As you see the Monster Deep Depression near Srikakulam is moving towards Bangladesh, Night temperatures across the entire state is expected to remain below normal. Places along Rayalaseema districts along with Palnadu, NTR, Eluru and Ubhaya Godavari will record less than 18 C temperatures in coming 3 days and time for us to see the first onset of wintery conditions. Visakhapatnam city will remain at comfortable levels of temperature during day and night time. A Hot day will be followed by a cooler night in most places of AP because dry weather will cause Adiabatic Heating and Cooling at same time.

మంగళవారం, అక్టోబరు 24, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, అక్టోబరు 24, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం

తిథి:దశమి మ12.48 వరకు  

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:ధనిష్ఠ మ2.07 వరకు

యోగం:గండం మ3.15 వరకు

కరణం:గరజి మ12.48 వరకు తదుపరి వణిజ రా11.35 వరకు

వర్జ్యం:రా8.49 - 10.18

దుర్ముహూర్తము:ఉ8.17 - 9.03 &

రా10.30 - 11.20

అమృతకాలం:తె5.45నుండి

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30

సూర్యరాశి: తుల

చంద్రరాశి.  ;  కుంభం 

సూర్యోదయం:5.58

సూర్యాస్తమయం: 5.32


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

విష్ణువు-బుద్ధుడు

 ---------

విష్ణువు-బుద్ధుడు

-------------


విష్ణువుకు బుద్ధుడుకి ఏ సంబంధమూ లేదు. దశావతారాల్లోని బుద్ధ అవతారమూ, సిద్దాద్ద గోతమ బుద్ధుడూ ఒకరు కాదు. త్రిపురాసుర వధ సందర్భంగా 8,9 శ్లోకాల్లో దశావతార బుద్ధుడి ప్రసక్తి ఉంది. సిద్దాద్ద గోతమ బుద్ధుడు ఏ రాక్షస వధకూ కారణం కాదు.


కొందరు విద్వేషవాదులూ, సరైన అవగాహన లేనివాళ్లూ బుద్ధుడి తరువాతే లేదా బుద్ధుణ్ణి చూసే విష్ణువును  రూపొందించడం జరిగిందని చెబుతూ సనాతన వ్యతిరేక విషాన్ని సమాజంపై చిమ్ముతున్నారు. 


సామాన్య శకానికి పూర్వం 7 శతాబ్దికి చెందిన బోధాయన గృహ్య సూత్రాల్లో విష్ణువు శిల్పాల ప్రసక్తి ఉంది. అంతే కాకుండా ఈ సూత్రాల్లో విష్ణువుపరంగా చెప్పబడ్డ శ్లోకాలు ఉన్నాయి. దీన్నిబట్టి బుద్ధుడికన్నా ఎంతో పూర్వమే  వైదిక సాహిత్యంలో విష్ణువు

ఉన్నట్టు అవగతం ఔతోంది. 


తమిళనాడులోని కంచిలో ఉన్న తిరువెక్కాలో యదోక్తకారీ పేరుతో ఒక విష్ణువు ఆలయం ఉంది. ఈ విష్ణువు ఆలయం తమిళ సంగకాలం నాటికే బాగా ప్రాచుర్యంలో ఉండేది. తమిళ సంగకాలం  

BCE 300. అంటే ఇప్పటికి 2,300 యేళ్లకు క్రితం వచ్చిన సాహిత్యంలో విష్ణువు ఆలయం ప్రస్తావన ఉందని తెలుస్తోంది. నిజానికి ఈ ఆలయం అప్పటికి ఎంత కాలం పూర్వందో? తిరువెక్కాలో యదోక్తకారీ ఆలయంలో విష్ణువు ఆకృతి కళ్లు మూసుకుని ధ్యానంలో శయనిస్తూ ఉంటుంది. సామాన్య శకం 3 వ శతాబ్దిలో వచ్చిన తమిళ సిలప్పదిగారంలో శ్రీరంగంలోని శయన భంగిమలో ఉన్న విష్ణువు రూపం గురించి చెప్పబడ్డది. ఆ ఆలయం కూడా సిలప్పదిగారం కాలానికి పూర్వందే అయుంటుంది కదా?


BCE 304-232 ల అశోకుడుకు ముందే బుద్ధుడు ఉండి వెళ్లిపోయినా BCE 239లో అశోకుడు బౌద్ధ స్థూపం కట్టిన తరువాత కాని బుద్ధుడిపై ప్రచారానికి కదలిక రాలేదు. సామాన్య శకం 1-3 శతాబ్దుల వరకూ సిద్దాద్ద గోతమ బుద్ధుడి గురించి లిఖిత సాహిత్యం లేదు! తొలి లిఖిత బౌద్ధ సాహిత్యం గాంధార భాషలో ఆప్ఘనిస్తాన్ ప్రాంతంలో లభ్యమైంది.  లిఖిత బౌద్ధ సాహిత్యంలో భాగంగా సామాన్య శకం 1-3 తరువాతే బుద్ధుడి ఊహా చిత్రాలు వచ్చి ఉంటాయి. బుద్ధుణ్ణి చూసినవాళ్లు అన్ని వందలయేళ్లు బతికి ఉండి బుద్ధుడి నిజ రూపాన్ని చిత్రించగలిగే అవకాశం లేదు. మనం చూస్తున్నవి బుద్ధుడి ఊహా చిత్రాలే. 


శయన స్థితిలో ఉన్న బుద్ధుడి ఊహా చిత్రం రావడానికి కొన్ని వందలయేళ్లకు ముందే శయనస్థితిలో ఉన్న విష్ణువు ఆకృతి తిరువెక్కాలో ఉంది. తిరువెక్కాలో ఉంది అంటే దానికి ఆధారం ఏ రచనో అయుండాలి కదా? విష్ణువు పాల సముద్రంలో శేషుడిపై పవళించి ఉంటాడు అన్న వర్ణన అప్పటికే ప్రజల్లో ఉండి ఉంటుంది. బుద్ధుడు శయన స్థితిలో మనం చూస్తున్న ఊహా చిత్రానికి మూలాలు లేదా ఆధారాలు మనకు సనాతన లేదా వైదిక లేదా పురాణ సాహిత్యంలోనూ, హైందవ ఆలయాల్లోనూ తేటతెల్లంగా తెలియవస్తున్నాయి.


ఆరాధనలు, మూర్తులు, మందిరాల గురించి బుద్దుడు మాట్లాడలేదు; సూచించలేదు. బుద్ధ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఒక దశలో బుద్ధుడికి మందిరాలు, మూర్తులు రావడం బుద్ధ-ద్రోహం. అప్పటికి ప్రచారంలో ఉన్న విష్ణువు రూపంలో బుద్ధుణ్ణి చూపించి ప్రజల్ని బౌద్ధంలోకి లాగే పన్నాగం లేదా ప్రయత్నం జరిగినట్టు స్పష్టమౌతోంది. పౌరాణిక విష్ణువు ఆకృతికి నకలుగా ఒక ఊహా చిత్రణగా శయన బుద్ధుడి ఆకృతి రూపొందింది. ఈ వాస్తవానికి విరుద్ధంగా బుద్ధుడి తరువాతే లేదా బుద్ధుణ్ణి చూసే విష్ణువును రూపొందించుకున్నారు అనడం చదువు, తెలివిడి, తెలివి, బుద్ధి లేకుండా దాష్టికత్వంతో వైదికత్వంపై దాడి చెయ్యడమే. 


బుద్ధుడిని ఆధారంగా చేసుకుని వాస్తవాలకు వ్యతిరేకంగానూ, వక్రీకరణలతోనూ సనాతనంపై దాడి చెయ్యాలనే ప్రయత్నం గర్హనీయం. సత్యాల ముందు ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నం విఫలం అవుతూనే ఉంటుంది. ఆ దాడి చేస్తున్నవాళ్లు అసత్యవాదులు, వర్జనీయమైనవాళ్లు కనుక వాళ్లను ప్రజలు నిరసిస్తున్నారు; వర్జిస్తున్నారు. అంతేకాదు వాళ్లవల్ల బుద్ధుడికి, బౌద్ధానికి కాస్తో కూస్తో ఉన్న పరిగణన కూడా ఈ దేశంలో లేకుండా పోతోంది; వాళ్లవల్ల బుద్ధుడికి పెనుహాని జరుగుతోంది.


మనం వాస్తవాల్ని, చారిత్రిక సత్యాల్ని మననం చేసుకుంటూ అసత్యాలకు, జరుగుతున్న బుద్ధ-హానికర  ప్రయత్నాలకు అతీతంగా బుద్ధుడిని యథాతథంగా పరిగణిద్దాం.


- రోచిష్మాన్

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - దశమి -  ధనిష్ట - భౌమ వాసరే* (24.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/z0zxawQ1ans?si=g7VwrxBtvVeuQect



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...  


*శ్రీ స్వామి వారి పుట్టు పూర్వోత్తరాలు..*


*(ఆరవ రోజు)*


మాలకొండ లో శ్రీ స్వామి వారిని కలిసి, వారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకొని, ఆ సాయంత్రానికి తిరిగి మొగలిచెర్ల గ్రామం చేరారు శ్రీధరరావు ప్రభావతి దంపతులు..శ్రీ స్వామివారి గురించి వివరాలు తెలుసుకుందామని ఇంటికి రాగానే మరలా శ్రీధరరావు గారిని అడిగారు..


మొదటిసారి శ్రీ స్వామివారిని మాలకొండలో చూసిన తరువాత, శ్రీధరరావు గారు, స్వామివారి గురించి, మాలకొండ స్థానికులవద్ద కొంత సమాచారం సేకరించారు..ముఖ్యంగా కామినేని యాగంటి అనే అతను శ్రీ స్వామివారి అవసరాలు చూస్తూ వుండేవాడు..యాగంటి ది పెద్ద సంసారం..శనివారం నాడు కొండమీద, కొండక్రింద మెట్ల దారి ప్రక్కన కొబ్బరికాయలు..పూజాద్రవ్యాలు..మాలకొండకు వచ్చే భక్తులకు కావాల్సిన ఇతర సామాగ్రి అమ్ముకునే దుకాణం నడుపుకుంటూ..తన సంసారం నెట్టుకొచ్చేవాడు..శ్రీ స్వామి వారు మాలకొండకు వచ్చిన తరువాత ఆయన కు సేవ చేస్తున్నాననే భావంతో మెలిగేవాడు..స్వామి వారు యాగంటిని ఒక గృహస్తుగా చూసేవారు..


యాగంటి ద్వారా శ్రీధరరావు గారికి శ్రీ స్వామివారి గురించి ఒక అవగాహన ఏర్పడింది..ఈలోపల శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య నాయుడు స్వామివారి కోసం రావడం..శ్రీధరరావు గారు పరిచయం కావడం..వారి కుటుంబం గురించిన పూర్తి వివరాలు చెప్పడం జరిగింది..


కడప జిల్లా సిద్దవటం తాలూకా ఇసుకుపల్లె గ్రామంలో తుమ్మల వేముల నాయుడు మోతుబరి రైతు..పెద్దమనిషిగా కూడా పేరు తెచ్చుకున్నవాడు..భార్య వెంకట సుబ్బమ్మ భర్తకు తగ్గ ఇల్లాలు..ఐదుగురు సంతానం..అందరూ మొగపిల్లలే.. పెద్దకుమారుడు వెంకట కృష్ణయ్య నాయుడు..రెండవకుమారుడు రామకృష్ణ నాయుడు, మూడవకుమారుడు రాజగోపాల నాయుడు..


నాలుగవ కుమారుడు వేణుగోపాల నాయుడు..ప్రస్తుతం మనం "శ్రీ స్వామివారు"గా పిలుచుకుంటూ వున్న వ్యక్తి ఇతనే..1944 వ సంవత్సరం లో వెంకట సుబ్బమ్మ గర్భాన జన్మించారు..భవిష్యత్ లో అవధూతగా మారి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించడానికి తన నాలుగవ సంతానమైన ఈ బాలుడు కారణం కాబోతున్నాడని ఆ తల్లికి అప్పుడు తెలియదు..తెల్లని మేనిఛాయతో.. తేజస్సు కలసి బోసి నవ్వులు చిందించే ఈ బాలుడు అల్పాయుష్కుడని కూడా ఆ దంపతులకు తెలీదు..తాము ఒక అవధూతకు జన్మ నిచ్చి, తమతో పాటు..తమ వంశాన్ని  కూడా తరింపచేసామని...వేముల నాయుడు, వెంకట సుబ్బమ్మ దంపతులకు తెలియదు.. 


ఐదవ కుమారుడు పద్మయ్య నాయుడు..


ఆ ఐదుగురు సంతానంలో నాలుగవ వాడైన వేణుగోపాల నాయుడి కి చిన్నతనం నుంచే..అంటే..ఐదేళ్ల ప్రాయంలోనే దైవం మీద ఆసక్తి కలిగింది..అప్పుడు ఆ బాలుడి మనసులో పడిన భక్తి బీజం..క్రమంగా వేళ్లూనుకుని..అతని జీవితాన్నే మలుపుతిప్పేసింది..అందరు పిల్లలూ ఆటలాడుకొనే సమయంలో..ఈ పిల్లవాడు మాత్రం దీర్ఘమైన ఆలోచన లో వుండేవాడు..ఎక్కువగా ఏకాంతంగా గడిపేవాడు..విభిన్నంగా కనిపిస్తున్న వేణుగోపాల నాయుడి ప్రవర్తన కు  తల్లిదండ్రులకు కొద్దిగా ఆందోళన కలిగించినా..దైవం పట్ల అతనికున్న భక్తి ప్రపత్తులు చూసి మురిసిపోయేవారు..అన్నలందరూ చదువుకుంటూనే..తండ్రికి వ్యవసాయం లో చేదోడు వాదోడుగా వుండేవారు..ఇంటి పని, పాడి పని, పిల్లల పెంపకం తో వెంకట సుబ్బమ్మ కు తీరుబడి ఉండేది కాదు..


శ్రీ స్వామి వారి కి (వేణు గోపాల నాయుడు) ఎనిమిది, తొమ్మిదేళ్ల ప్రాయంలో తండ్రి వేముల నాయుడు మరణించారు..పెద్దవాడైన వెంకట కృష్ణయ్య నాయుడు, రెండవ వాడైన రామకృష్ణ నాయుడు మీదే సంసార భాధ్యతలు పడ్డాయి..సహజంగానే కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు మరణించడంతో..సంసారం కొద్దిగా ఒడి దుడుకులకు లోనయ్యింది..ఇసుకుపల్లె లో వుండే పొలం రామకృష్ణ నాయుడు కి ఒప్పచెప్పి, తల్లిని, తమ్ముళ్లను  తీసుకొని వెంకట కృష్ణయ్య నాయుడు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం "తూర్పు ఎర్రబల్లె " గ్రామానికి వలస వచ్చాడు..అక్కడే పొలం తీసుకొని వ్యవసాయం ప్రారంభించాడు..కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు త్వరలోనే ఆర్ధికంగా నిలద్రొక్కుకున్నాడు..


ఊరు మారినా..శ్రీ స్వామివారి పరిస్థితి లో మాత్రం మార్పు లేదు..చదువు మీద ధ్యాసే లేదు..భక్తి మార్గమే తన ముక్తి మార్గమని ఆ వయసులోనే తెలిసిపోయింది..ఆధ్యాత్మిక గ్రంథం కనబడితే చాలు..వెంటనే చదివే వారు..ఒక్కసారి చదవగానే..మొత్తం గ్రంథం కంఠస్తం అయిపోయేది..అదే బడికి వెళ్లి తరగతిలో బలవంతాన కూర్చోబెట్టినా..ఒక్క ముక్కా బుర్రకెక్కేది కాదు.."ఇది కాదు!".."ఇది కాదు!" అనుకుంటూ.. తన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించే చదువు కావాలి తనకు..అది చూపించే మార్గదర్శి కోసం స్వామివారు ఎదురుచూడ సాగారు..


అవధూత గా మారే తొలి అడుగు..మోక్షసాధనలో మొదటి మెట్టు... రేపు...


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380. & 99089 73699).

నవదుర్గలు

 శ్లోకం:☝️నవదుర్గలు

*ప్రథమా శైలపుత్రీ చ*

  *ద్వితీయా బ్రహ్మచారిణీ*

*తృతీయా చంద్రఘంటేతి*

   *కూష్మాండేతి చతుర్థికీ |*

*పంచమా స్కందమాతేతి*

   *షష్ఠా కాత్యాయనేతి చ*

*సప్తమా కాళరాత్రీ చ*

   *అష్టమాచేతి భైరవీ*

*నవమా సర్వసిద్ధిశ్చాత్*

    *నవదుర్గా ప్రకీర్తితా ||*


నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.

1. ఆశ్వయుజ శు.పాడ్యమి

    శైలపుత్రీ : బాలా త్రిపురసుందరి

    నైవేద్యం : కట్టు (కట్టె) పొంగలి

2. ఆశ్వయుజ శు.విదియ

    బ్రహ్మ చారిణి : గాయత్రి

    నైవేద్యం : పులిహోర

3. ఆశ్వయుజ శు.తదియ 

    చంద్రఘంట : అన్నపూర్ణ

    నైవేద్యం : కొబ్బరి అన్నము

4. ఆశ్వయుజ శు.చవితి

    కూష్మాండ : కామాక్షి

    నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు

5. ఆశ్వయుజ శు.పంచమి

    స్కందమాత : లలిత

    నైవేద్యం : పెరుగు అన్నం

6. ఆశ్వయుజ శు.షష్టి

    కాత్యాయని : లక్ష్మి

    నైవేద్యం : రవ్వ కేసరి

7. ఆశ్వయుజ శు.సప్తమి

     కాళరాత్రి : సరస్వతి

     నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నం

8. ఆశ్వయుజ శు.అష్టమి

    మహాగౌరి : దుర్గ

    నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)

9. ఆశ్వయుజ శు.నవమి

     సిద్ధిధాత్రి : మహిషాసుర మర్దిని

     నైవేద్యం : పాయసాన్నం

10.ఆశ్వయుజ శు.దశమి

      రాజ రాజేశ్వరి

      నైవేద్యం : పాయసాన్నం

పంచాంగం 24.10.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 24.10.2023  Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష: దశమి తిధి భౌమ వాసర: ధనిష్ఠ నక్షత్రం గండ యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.


దశమి మధ్యాహ్నం 03:12 వరకు.

ధనిష్ఠ  మధ్యాహ్నం 03:25 వరకు .

సూర్యోదయం : 06:15

సూర్యాస్తమయం : 05:45

వర్జ్యం : రాత్రి 10:02 నుండి 11:30 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:33 నుండి 09:19 వరకు తిరిగి రాత్రి 10:45 నుండి 11:35 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00  నుండి 04:30 వరకు 


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

భక్తిసుధ

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


 ॥శ్లో॥

*మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం*

*వర్షిష్ఠాంతే వసదృషిగణై రావృతం బ్రహ్మనిష్ఠైః*

*ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందరూపం*

*స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే !!*


_- *శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - ధ్యాన శ్లోకము* _- 1


॥భావం॥ ఆత్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వేదవిదులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు *శ్రీదక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను*.




॥శ్లో॥

*వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం*

*సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ !*

*త్రిభువనగురు మీశం దక్షిణామూర్తి దేవం*

*జనన మరణ దు:ఖచ్చేద దక్షం నమామి !!*


_- *శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - ధ్యాన శ్లోకము* _- 02


॥భా॥ మర్రిచెట్టు క్రింద కూర్చొని తనచుట్టూ ఉన్న మహర్షులకు ఆత్మవిద్యను అందిస్తూ జనన మరణాలతో కూడిన సంసారదు:ఖాలను నిర్మూలిస్తూ ముల్లోకాల చేతనూ గురువుగా కొలవబడే 

*శ్రీ దక్షిణామూర్తికి నమస్కృతులు*.

సుభాషితమ్

 🕉️  *_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_*  🕉️


𝕝𝕝 శ్లో 𝕝𝕝 

*సహస్రం పూర్వజాతానాం సహస్రం చ జనిష్యతామ్।*

*స్వవంశజానాం మర్త్యానాం ఉద్ధరేద్యస్త్రిపుణ్డ్రధృక్॥*


𝕝𝕝తా𝕝𝕝 ఎవడైతే విభూతిని తన నుదుట ధరించునో అతడి వంశంలో వెయ్యితరాలకు పూర్వం జన్మించినవారు, భవిష్యత్తులో జన్మించబోయే వెయ్యితరాలవారు ఉద్ధరింపబడుదురు. _!!  (సుభాషితరత్నకోశః)