25, సెప్టెంబర్ 2024, బుధవారం

*శ్రీ కాళహస్తీశ్వర శతకము

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


  *మునునేఁ బుట్టినపుట్టులెన్ని గలవో మోహంబుచేనందుఁ జే*

  *సినకర్మంబులప్రోవు లెన్నిగలవో చింతిచినం గాన నీ*

  *జననంబే యని యున్న వాఁడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ*

  *ల్చినపుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 47*


*తాత్పర్యము:* *ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ముందు నేను ఎత్తిన జన్మలెన్నో, వాటిలో నేను చేసిన కర్మలెన్నో నాకు తెలియదు...ఎంత ఆలోచించినా నేను తెలుసుకోనలేకున్నను... ఈ జన్మమే పారమార్థికమని భావించుచున్న నాకు ఈ జన్మలో చేసిన నీ ధ్యానపుణ్యముచేత ఇదియే కడగొట్టు జన్మ గావింపుము ప్రభో*


✍️🌷🌷🌹🙏

హైందవం వర్ధిల్లాలి 11*

 *హైందవం వర్ధిల్లాలి 11*




*ఆధునికత మరియు నాగరికత పేరుపై మహోన్నత, ఆరోగ్య హిందూ ఆచారాలను విస్మ రించరాదు* iv):- ఈ మధ్యన రాజకీయ నాయకులు. ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థులకు *భారతీయ మహిళల అవసర మరియు అలంకార వస్తువులు అనగా చీర, జాకెట్టు, గాజులు , బొట్టు పంపుతామని బీరాలు పలుకుతూ* అతివలను అబలులుగా చిత్రీకరిస్తున్నారు.   రాజకీయ నాయకుల ఇటువంటి ప్రకటనలు *అర్థరహితమే* గాకుండా హిందూ సంప్రదాయాలను *కించ పరుస్తున్నట్లుగా* ఉన్నందుకు ఈ ప్రకరణ అవసరమైనది. 


భారతీయ మహిళల గురించి దైవిక, సాంస్కృతిక, చారిత్రక మరియు వర్తమాన సమాచార జ్ఞానము లోపించినవారే  ఇటువంటి అసంబద్ధ ప్రకటనలకు ఒడిగడ్తుంటారు. మహిళలు ధరిస్తున్న పై వస్తువులలో కొన్ని బాహ్య వాతావరణ నుండి రక్షణ నిమిత్తము మరికొన్ని దేహారోగ్య నిమిత్తము అవసరము. 


అనాదిగా ప్రజలు భారతీయ స్త్రీలను శక్తి స్వరూపులుగా, త్రిగుణాత్మక శక్తిగా, ఆది పరాశక్తిగా, అపరకాళీగా భావిస్తున్నారు, భక్తితో సేవిస్తున్నారు, గౌరవిస్తున్నారు.


భారత దేశ చరిత్ర అవగాహన ఉన్న వారికి *రాణి  రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ బాయి, సావిత్రి భాయి ఫూలే, దుర్గాభాయి దేశ్ ముఖ్, సరోజిని నాయుడు, సంఘం లక్ష్మీ బాయి* లాంటి ధీరవనితల సమాచారము ఉంటుంది. 


నేటి స్త్రీలు  సాధారణ వృత్తుల నుండి విద్యావంతులుగా  మరియు ఉన్నత ఉద్యోగస్తులుగా అంటే *అంగన్ వాడి నుండి అంతరిక్ష కార్యక్రమముల వరకు మహిళలు లేని రంగాలు లేవు*. స్వదేశంలోనే గాకుండా విదేశాలలో గూడా గౌరవాలు పొందుతున్నారు.

*మన అత్త్యుమ భారతీయ ధర్మంలోని స్త్రీల, స్త్రీ దేవతా మూర్తుల ప్రధాన వస్త్రధారణలో, అలంకరణల్లో చీర గాజులు అత్యంత ప్రధానమైనవి...చీర గాజులు పూలు కాటుక, బొట్టు,గజ్జెలు, బంగారు ఆభరణాలు లేని స్త్రీలను,  స్త్రీ మూర్తులను  గానీ మనం ఊహించలేము*.


ఈ ఇరవయ్యవ శతాబ్దంలో మహిళలు విద్య, ఉద్యోగ, సాంకేతిక, పరిశోధనా, వైద్య, సాహిత్య, జ్యోతిష్య, వాస్తు, సాహిత్య, కళా రంగ, వ్యాపార వాణిజ్య, రాజకీయ రంగాలలో దక్షులుగా ఉన్నారు, నిరూపించుకున్నారు. వర్తమాన మహిళా శ్రేష్టుల వివరాలు చూద్దాము. ప్రస్తుత  రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, కీ  శే  సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, కిరణ్ బేడీ, కల్పనా చావ్లా (ఇండో అమెరికన్ వొమ్యగామి) మున్నగువారు. *మహిళలు సాహసించని రంగాలు లేవు*. IAS లు గా IPS లు గా ఉన్నతోద్యోగాలు చేయడమే గాకుండా *మహిళలు సైనిక దళాలలో గూడా ప్రధాన స్థానాలలో అనగా  కేంద్ర రైజర్వ్డ్ పోలీసు ఫోర్స్, కోబ్రా  కమాండ్, జడ్ ప్లస్ కమాండో విభాగాలలో కూడా ఉన్నారు*.  


స్త్రీలలో ఉండే సహజ ప్రేమ, కరుణ, దయ, శాంతి స్వభావాలు మానవతా చిహ్నాలే గాని శారీరక, మానసిక దుర్భల లక్షణాలు కనె కావు. *స్త్రీలు బలహీనులు కారు.  శక్తి స్వరూపిణులు.  వారు ధరించే  మరియు ఉపయోగించే చీర, జాకెట్టు,  కుంకుమ, గాజులు ఇత్యాది అవసరం మరియు అలంకార వస్తువులు బలహీనతకు సూచనలు కావు*. హైందవ సంప్రదాయాలు పాటించవలసినవే.  మహిళల గురించి  వారి అవసర మరియు అలంకార వస్తువుల గురించి అవాకులు చవాకులు కూడదు.  *కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు.

*(సశేషం)*

26. " మహా దర్శనము

 26. " మహా దర్శనము "--ఇరవై ఆరవ భాగము --ఉపనయనము- 2


26. ఇరవై ఆరవ భాగము  -- ఉపనయనము- 2



         బుడిలులు కులపతుల ముఖములు చూచి , వారు ’ సరియే’ అని తలలూపగా , మరలా కొనసాగించినాడు :


         " ఇదంతా అయిన తర్వాత  వటువు  ,  ’ ఈ గోత్రము వాడినైన నేను అభివాదనము చేసెదను ’ అని ఆచార్యుడికి అభివాదనము చేసి , తన ఎడమ చేతితో ఆచార్యుడి ఎడమ పాదమును , కుడి చేతితో కుడి పాదమును తాకి నమస్కరించును . పాదములనుండీ ఎల్లపుడూ తేజస్సు రక్షకమై వెలువడుతూ ఉండును . కాబట్టి పాదములను ముట్టినవాడు అనుగ్రాహ్యుడగును . ఇటుల పాదాభివందనము చేసి వటువు ఆచార్యుని ’ నాపై కృపతో సావిత్రిని నాకు చెప్పవలెను ’ అని ప్రార్థించును . అప్పుడు ఆచార్యుడు , ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుకొని , రెండింటినీ తన కుడి తొడపై పెట్టుకున్న వటువును , తన కుడివైపు తొడపై కూర్చోబెట్టుకొని , ఆ అంజలిని తన చేతిలోకి తీసుకొని  ప్రణవ  వ్యాహృతుల పూర్వకముగా సావిత్రిని అనుగ్రహించును . అందులోనూ ఒక రహస్యముంది . పాదముల నుండీ రక్షకమై బయల్వెడలు తేజస్సు , అరచేతులనుండీ కూడా బయల్వెడలు చుండును. అయితే , నిస్సంకల్పముగా వెడలునది రుద్రుడై ఇతరులను చంపును . : అందుకే ,   సంకల్ప పూర్వకముగా వటువు యొక్క అంజలిని తన అంజలిలోకి తీసుకొనునది . 


          " గాయత్రి యొక్క మూడు పాదములనుండీ మూడు వేదములను ఇచ్చి , ఆచార్యుడు మరలా , ’ నీ హృదయము నా వ్రతములో చేరనీ ! నీ చిత్తము నా చిత్తానుసారమవనీ . ! నువ్వు నామాటను వినువాడగుము . బృహస్పతి నిన్ను నాకు ఇవ్వనీ " అని ప్రార్థన చేసి , బృహస్పతి నుండీ అతడిని తీసుకొనును. అనంతరము రక్షణార్థమై శృంఖలను కట్టును .( దీనినే మేఖల అంటారు , మగవారికి కట్టునది శృంఖల అయితే ఆడువారికి కట్టునది మేఖల )   : అప్పటి మంత్రములలో ఇది ప్రధానమైనది , " ఈ శృంఖల చెడ్డ మాటలనుండీ కాపాడుచూ మనలను పవిత్రము చేస్తూ సుఖకరముగా ఉండుగాక ! ప్రాణాపానముల నుండీ బలమును తీసుకురానీ ! సౌభాగ్య సంపన్నమైన శృంఖల దేవతలకు ప్రియమవనీ ! "  ముంజ దర్భలతో చేయబడిన శృంఖలను( మొల త్రాడు ) ఇలాగ ప్రార్థన చేయుటకన్నా ఇంకా అవమానము ఉంటుందా ? అంటారేమో . స్వారస్యమంటే అదే ! అందరూ కట్టెపుల్ల అని తిరస్కారముతో చూచు దానిని మనము ’ సమిధ ’ అంటాము . ఎక్కడ చూసినా దొరకెడు మంట ను మంత్రపూతము చేసి ’ అగ్ని ’ అంటాము . సదా సర్వత్రా వీస్తున్న గాలిని సర్వ కర్తయైన " మాతరిశ్వ ’ అంటాము . ఎక్కడో మునిగిపోయే సూర్యుడిని ’ ఆదిత్య ’ మొదలుగానూ , ’ ఆత్మా జగతః తస్థుషశ్చ ’ - జంగమ స్థావరముల ఆత్మ- అంటాము . ఇలాగ ముంజదర్భను మొలత్రాడుగా చేసి కట్టుకుంటే ఏమేమి చేయవచ్చును అంటే మమ్మల్ని చూడండి , అసూయపడు ఇతరుల దుర్భాషణముల నుండీ మనలను కాపాడును . అదెలాగు ? ఆ దుర్భాషల శక్తిని తగ్గించి దానిని సహించ గల మన శక్తిని ఎక్కువ చేయడము ద్వారా ! . మీరు రాజపుత్రుల శిక్షణమును చూసినారు కదా ? వారి ఒళ్ళు ఉక్కు శకలమై , సహన శక్తియే రూపము పొందినదా అన్నట్టూ , బాణ ఖడ్గముల ఆఘాతములను ఎదిరించునది . దాని వలెనే ఇది కూడా ! అలాగ ఇది మనలను పవిత్రము చేయును . మన ప్రాణాపానముల నుండే బలమును సంగ్రహించి మనకు ఇచ్చును . దేవతలను పిలుచుకు వచ్చును , అనగా , మనకు దేవతలు వచ్చి పోవుటను చూడగల శక్తిని ఇచ్చును . అయితే ఇదంతా ఎప్పుడగును ? ఆ ముంజదర్భ శృంఖలలో ప్రాణ ప్రతిష్ఠ చేసి కట్టినపుడు మాత్రమే . దీనికంతకునూ పూర్వ సిద్ధత కావలెనా , వద్దా ? " 


         బుడిలుల మాటకు ఎవ్వరూ ప్రతి చెప్పలేక పోయినారు . అప్పుడు బుడిలులు మరలా కొనసాగిస్తూ అన్నారు , " ఆచార్యుడిది అదృష్టము . పూర్వపుణ్యము అతనికి జాతవేదుడి నొకడిని కొడుకుగా ఇచ్చినది . ఏదైనా కొంచము ఎక్కువ తక్కువయితే , ’ అహ , అది అలాగు కాదు  ’ అని చెప్పగల చైతన్యముందా బాలుడిలో . ఇప్పుడే విప్రుడైనాడన్న తర్వాత ఇక చెప్పవలసిన దేమున్నది ? దానివల్లనే ఆచార్యుడికి పూర్వ సిద్ధత ను గురించి చెప్పితిని . ఏమిటి ఆచార్యా ?  నాపైన కోపము వచ్చెనా ? " 


         ఆచార్యుడు వినయ పూర్వకముగా , " మాకు కొంత తెలిసిననూ , ఇంత వివరముగా తెలియదు . తమరు అనుజ్ఞ ఇచ్చినది మాకు అనుగ్రహమైనది . " అన్నాడు . 


         బుడిలులు అంతా ముగిసినది అని ధ్వనించేటట్లు అన్నాడు , " సరే , ఇక దండ గ్రహణము . అనంతరము వ్రతోపదేశము . అక్కడికి ఉపనయనములోని ప్రధాన కర్మలన్నీ ముగిసినట్లే . దాని తర్వాత మూడు రాత్రులైనా వ్రతమైన తర్వాత మేధా జననము . చూడు , మేధా జననము సరిగా అయితే , ఏక సంతగ్రాహి యగును . అటుల కాకుండిన , త్రివేది , చతుర్వేదులు అగుటకు అవకాశమేది ? అది చాలదన్నట్టు , పురాణేతిహాసాలు , వేదాంగములు , ఇతర శాస్త్రాలు , వీటన్నిటినీ సమన్వయము చేసుకొని , ఒకదానికొకటి అవిరోధము అగునట్లు చూచుకొనుట , ఆ తరువాత తనకు తగ్గ సాధనమిది , తన సిద్ధి ఇదీ అని నిర్ధారణ చేసుకొని గృహస్థుడగుట --ఇంత ఉన్నపుడు వీటిని వదలగలమా ? "


         అందరూ మౌనముగా ఉన్నారు . కులపతులిద్దరూ ఆనందముతో కళ్ళ నీరు తిరుగాడుతుండగా ఏదో భావనలో యున్నారు . అప్పుడు శాండిల్యుడు తండ్రి వద్దకు వచ్చి , ఏదో గుసగుసలాడి , లేచి బుడిలులకు నమస్కారము చేసి పలికెను , " తమరు చెప్పినదంతయూ నిజమే , ఔను , అయితే ఇదంతా ఆస్తికులైన బ్రాహ్మణులకు మాత్రమే . నాస్తికులైన వారి గతి యేమి ? అబ్రాహ్మణుల గతి యేమి ? వర్ణాశ్రమ ధర్మమే లేని దేశముల వారి గతి యేమిటి ? " 


          బుడిలులు నవ్వి అన్నారు , " వారి స్థితియేమిటి అంటే , మన సమాజములోని పలు దారులను యోచించి చెప్పవలెను . మొదటిది , మనము జన్మాంతరములను ఒప్పుకున్నవారము . దేవతలున్నారు అనువారము . ధర్మము జగత్తుకంతటికీ ఒకటే అయిననూ , దేశ కాల పరిస్థితులను బట్టి భిన్నముగా కనపడునది యనువారము . బ్రాహ్మణుడైనా , అబ్రాహ్మణుడైనా తనకు విహితమైన , తనకు విధించబడిన కర్మను చేసిన , ఒకటే ఫలము లభించును అనువారము . విహితమైన కర్మములో దోషములున్ననూ అన్య కర్మలకన్నా శ్రేష్ఠము అనువారము . దానితోపాటు , విహిత కర్మ త్యాగము వలన ప్రత్యవాయము కలుగును అని చెప్పు వారము .


         ఇక , నాస్తికుల , అబ్రాహ్మణుల , వర్ణాశ్రమ ధర్మ రహితుల వారి స్థితి యేమిటి ? అనుమాట -- నాస్తికులకు భవిష్యత్తు ఉంటే కదా , వారు అది అలాగుండవలెను , ఇలాగుండవలెను అనవలసినది ? నాస్తికులలో కూడా భవిష్యత్తు ఉంటుంది అనువాడు , దానికి అనుకూలమగునట్లు రూపించు విధానమును తానే వెదకుకొనును . అలాగు , తన బుద్ధినీ , అది విధించిన ప్రమాణములనూ అనుసరించువాడిని మనము ’ అసురుడు ’ అంటాము . వాడికి మీమాటే అవసరము లేదు . అటువంటివి చర్చకు వస్తే వాటి రూపమే మారిపోవును . ఇక బ్రాహ్మణుల స్థితి , ఫలముల ఐక్యతను  బోధిస్తూ , సమాజమనెడి వృక్షములో ఒకదానినొకటి ఆశ్రయించుకొని బ్రతుకవలెను అను మతములో , వ్యవహారమున కోసమై బ్రాహ్మణ , బ్రాహ్మణేతర భేదముందే కానీ , పారమార్థికంగా  కాదు . 


        ఇక , వర్ణాశ్రమ ధర్మము లేని వారి స్థితి యేమిటి ? అంటే , వారిలో వర్ణాశ్రమ రూప వ్యవస్థ లేకున్ననూ , వారిలో ఉత్తమాధమ ధర్మము లేదు అనవద్దు . వారిలో కూడా ఉఛ్చ నీచ భేదములుంటాయి . అది అధికారము వలన కావచ్చు , ఐశ్వర్యము వలన కావచ్చు , ప్రేయో మార్గమును ఎక్కువగా పట్టి , కామహేతుకముగా వారు నడచినా , అప్పుడపుడు వారిలో కూడా ఎవరో ఒకడు పుడతాడు ., అతడు దైవ సాక్షాత్కారము పొంది , తన లోకమును దైవము వైపుకు తిప్పుటకు పెనుగులాడును . ఆ లోకమంతా అతనికి తల వంచి అతని ధర్మమును అంగీకరించినను , మరలా తనకు తోచినట్లే ప్రవర్తించుట సాధారణము . మొత్తానికి చెప్పవలెనంటే , ... నీ పేరేమి ? మరచాను ? "  


" నన్ను శాండిల్యుడు అంటారు "


         " శాండిల్యా , మనము దేశమును ఊషరమనీ ( చవిటి నేల )  , నదీ మాతృకమనీ , దేవమాతృకమనీ అంటాము . అయితే , దైవానుగ్రహ వంచితమని , ఊషరము , అప్రత్యక్షముగా దైవమాతృకమైనది . నదీ మాతృకము , ప్రత్యక్షముగా వర్షము వలన పెరుగునది . దైవమాతృకమంటే అర్థమైనదా ?  ఒకసారి భయంకర క్షామము వచ్చి , పన్నెండు సంవత్సరములు వానలే లేక గంగాది సరిత్తులలో కూడా నీరే లేకపోయినదట . అప్పుడు అత్రి పత్ని యైన అనసూయ తాను , గంగనూ , సర్వులనూ అనుగ్రహించినదట ! ఇది మనకు అర్థమవుతుందా ? అలాగే , నాస్తిక , అబ్రాహ్మణ , వర్ణాశ్రమ రహిత దేశముల వారి స్థితులు సామాన్యముగా అర్థము కావు . కాబట్టి , మనకు అనుసరించ వలసిన దేమిటనిన , ’ బ్రాహ్మణుడు సర్వధా సర్వథా మైత్రుడై నేను చూచునదంతా భద్రము కానీ , నేను చెప్పునదంతా భద్రము కానీ , అని అంతటినీ భద్రీకరణ చేయువాడై , స్పర్శశీలుడై బ్రతుకవలెను . ఇంకొకమాట , సావధానము , మనము నాస్తికులను అసురులు అనిననూ , ప్రాజాపత్యులు అంటాము . అంటే , వారు కూడా మన దైవ సంతానమే . అలాగే , మనుష్యుడు మాత్రమే కాదు , పుట్టిన ప్రతియొక్క భూతమూ లోనూ ఈశ్వరాంశ ఉన్నది . కాబట్టి , ఒకదానివల్ల ఇంకొకదానికి బాధ కలుగకుండా నడుచుకోవలెను . అంతేనా , నువ్వు దినదినమూ సంధ్యావందనములో చెప్పునదేమిటయ్యా ? ’ సర్వేషామవిరోధేన బ్రహ్మ కర్మ ’ అని కదా ? బ్రహ్మ కర్మ ఎవరికీ విరోధము కాకూడదు . ..."  మరి , బ్రాహ్మణులు చేయు చాలా కర్మలు ఇతరులకు విరోధములగుచున్నాయి కదా ? " అంటావా ? 


         " ఇది కూడా అడగవలెనా , ప్రపంచం మొత్తం లో చీకటి వెలుగులు ఒకదానినొకటి తిరస్కరించకుండా బ్రతుకుటెట్లు ? అదే వాస్తవిక స్తితియని , దాన్నే లక్ష్యముగా చేసుకోరాదు . సర్వభూత హితము కోరునపుడు గురి కొంచము హెచ్చుతగ్గులు కావచ్చును . ఒకటి ఆదర్శవాదము , ఇంకోటి వాస్తవవాదము . మనము ఆదర్శవాదులము . 


        " చెప్పుతూ ఉంటే ఇంకో పదిరోజులైనా అవుతుంది , శాండిల్యా , అయితే , ఇంటిలో బియ్యము కావలసినంత ఉన్నా , దినుసులు బళ్ళకొద్దీ నిండి ఉన్నా , భోజనము చేయునపుడు కొంతే తిన్నట్లే ఇది కూడా . ఆవు ఎంత గడ్డి తిన్నది అన్నదానిపైనే దాని వెల అని పెద్దపెద్ద గురువులు చెప్పేవారంట  ! . అలాగే , పర్వతములవంటి ఆదేశములను గురించి మాట్లాడుతూ , ఆచారములో దానిలో ఒక అంశమును కూడా పాటించనివాడికి బ్రాహ్మణ ధర్మమెందుకు ? చివరి మాటగా చెప్పెదను , విను . ఇవన్నీ కేవలము ఆదర్శాలు మాత్రమే అని వాటికో నమస్కారము చేసి వదిలేసిన వాటిని తన ఆచరణ లోకి తెచ్చుటకు త్రికరణశుద్ధిగా ప్రయత్నించువాడు బ్రాహ్మణుడు . శ్రేయస్సు - ప్రేయస్సులలో శ్రేయస్సు కోసము ప్రేయస్సును బలి ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నవాడు బ్రాహ్మణుడు . విశ్వమంతా ఒకటి . తన కర్మ స్వల్పమైనదిగానీ , పెద్దది ఐనా కానీ , దానివలన  విశ్వస్థితి మారితీరును అని నమ్మినవాడు బ్రాహ్మణుడు . విశ్వానికి బయట అవ్యక్తముగా నున్న సత్యమును సతతమూ లక్ష్యముగా పెట్టుకొన్నవాడు బ్రాహ్మణుడు . ఇతరులు అర్థకామములు జీవనపు లక్ష్యములు అంటే , ఇహములో ధర్మము , పరములో మోక్షము అను మహా లక్ష్యమున్నవాడు బ్రాహ్మణుడు . చాలా , ఇంకా చెప్పవలెనా ? "


శాండిల్యుడు మరలా నమస్కారము చేసి , " పరమానుగ్రహమైనది " అని చేతులు జోడించినాడు . 


         బుడిలులు , " నా మాటలను వినియే సంతోషముతో పరమానుగ్రహమైనది అంటున్నారు . మన యాజ్ఞవల్క్యుడు ప్రవచనము ప్రారంభించనీ ! అప్పుడు ఏమి చెపుతాడో చూడవలెను ! . కేవలము నా నోటి మాటగా వచ్చిన మహా దర్శనమును సాక్షాత్కరించి ఇవ్వగల మహానుభావుడతడు . " అన్నారు . వారికి ఆమాట అంటూ కంట నీరు వచ్చినది . 

Janardhana Sharma

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - అష్టమి - ఆర్ధ్ర -‌‌ సౌమ్య వాసరే* (25.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

24, సెప్టెంబర్ 2024, మంగళవారం

Panchaag

 


పరిమళ వైద్యము

 ఆయుర్వేదము నందలి భాగమైన పరిమళ వైద్యము గురించి సంపూర్ణ వివరణ -


     పరిమళ ద్రవ్యముల చరిత్ర అత్యంత పురాతనమైనది. రమారమి మూడువేల సంవత్సరాల క్రితమే వేదములలో వర్ణింపబడిన  " పరోమ" విధానమున పరిమళ పుష్పముల యొక్క మరియు సుగంధద్రవ్యముల యొక్క ప్రస్తావన కలదు.  ఋషులు పరిమళభరితమైన ధూపము దేవతలను ఆవాహనకు ఉత్తమ సాధనగా భావించిరి. ఆనాడు హోమధూపమును వాతావరణము నందలి కల్మషము ప్రక్షాళణ చేయుటకు , దుర్గన్ధమును , రోగాసాంక్రమిక క్రిములను పారద్రోలుటకు సాధనాభూతముగా ఉపయోగించేవారు. 


              వరాహమిహిరుడు తన బృహత్సంహిత నందు పరిమళ ద్రవ్యముల గురించి వివరించెను. ఆనాడు శ్రీగంధం ఎక్కువుగా వాడుక నందు ఉండేది. జాజి , దవనం , మరువం , కస్తూరి , కర్పూరం , కుంకుమపువ్వు మున్నగు వస్తువులు కూడా ఉపయోగించేవారు .


      ప్రముఖ మరాఠ కవి గంగాధరుడు  "గంధసార - గంధపాత" అను గ్రంథముల యందు పరిమళ ద్రవ్యముల గురించి తెలుపుచూ వాని తయారీ మరియు వినియోగించే విధానం గురించి వివరించాడు. దాదాపు 1500 సంవత్సరముల నాటి పంచతంత్రమున విష్ణుశర్మ సుగంధద్రవ్యముల వర్తకము , బంగారు వర్తకము కంటే లాభసాటిది అని చెప్పుటను గమనిస్తే ఆకాలము నందు వాటిపై ప్రజలకు గల ఇష్టాన్ని మనం గమనించవచ్చు .


         ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ దేశము నందలి కుమ్రాన్ గుహలలో తవ్వకాలు జరిపినపుడు పురాతన శాస్త్రవేత్తలకు ఒక పాతనూనె సీసా కనిపించింది. ఆ సీసాను పరిశోధించినప్పుడు అది 2000 సంవత్సరాల పూర్వమునకు చెందినది అని తేలింది . అప్పటి మహారాజులు పరిమళద్రవ్యముగా ఆ సీసా నందలి తైలమును వాడేవారు అని బయటపడినది. ఇన్ని సంవత్సరాలు గడిచినను ఆ సీసా నందలి పరిమళద్రవ్యము ఘుమఘుమలాడుచుండెను. 


                   ప్రాచీన కాలము నందు భారతదేశము , పర్షియా , ఈజిప్టు సుగంధద్రవ్యముల తయారీలో అగ్రగాములుగా ఉండెను . వారు ఆకులు , పువ్వులు , వ్రేళ్లు దంచి చమురులో నానబెట్టి పరిమళద్రవ్యములు తయారుచేసెడివారు. పరిమళ వస్తువులు రోగనివారణలో ప్రముఖ పాత్ర వహించునని ఆయుర్వేద తంత్రకర్త చరకుడు తన చికిత్సాసారమున తెలిపి గంధము , గోరింట , వట్టి వేళ్లు , తామర , కలువలు మున్నగు వానితో సిద్ధము చేసిన తైలములతో చికిత్స చేయు విధానమును వివరించెను. 


                   సుఖాంతి అను పుష్ప పరిమళము నిర్ణీత సమయమున నిత్యం వాసన చూసుట వలన ఉబ్బసం వంటి శ్వాశకోశ వ్యాధులు నయం అగును. చంద్రమోహ పుష్పముల సుగంధము మానసిక వ్యాధులకు విరుగుడుగా పనిచేయును . పవనాలి అనే పుష్పముల సుగందము రక్తపోటుకు విరుగుడుగా పనిచేయును . ఈ పువ్వులన్నియు హిమాలయముల యందే లభించును. కొన్ని రకాల పుష్ప సుగంధములను లోపలికి పీల్చుట చేత తలనొప్పి నుండి గుండెపోటు వరకు అనేక రోగములను నయం చేయవచ్చు .


           తరవాతి పోస్టు నందు మనదగ్గర లభించే కొన్ని రకాల పుష్పాల యొక్క సువాసనలు పీల్చుటచేత నయం అయ్యే రోగాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను.


    

      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

*శ్రీ శనీశ్వర రాహు-కేతు ఆలయం*

 🕉 *మన గుడి : నెం 450*




⚜ *కేరళ : ఎరమత్తూరు : అలెప్పి*


⚜



💠 హైందవ భక్తులు అత్యంత భయంతో మాత్రమే చూసే గ్రహం శనీ. 

 కష్టకాలంలో భక్తులు ఎక్కువగా భయపడే శనిదేవుడిని పూజించే ఆలయాలు చాలా అరుదు.  

పాప గ్రహంగా భావించే శనిని పూజించే ఆలయం కేరళలో ఉంది. 

 కేరళలోని ఏకైక శనీశ్వర దేవాలయంగా పేరొందిన ఇరమతుర్ శని ఆలయాన్ని సందర్శించడం శుభప్రదమని నమ్ముతారు. ఇక్కడ శని దోషాలను వదిలించుకోవడానికి భక్తులు వస్తారు.


💠 ఈ ఆలయంలో శనీశ్వరుడే కాకుండా ఆదిగురువు త్రిమూర్తి స్వరూపుడు, పితృదోష నివారిణి అయిన శ్రీ దత్తాత్రేయ భగవానుడు, శనీశ్వరుడు మిత్రులైన రాహు-కేతువులు, సిద్ధపంచముఖి హనుమంతుడు కలవు.


💠 ఆలయ ప్రధాన దైవం కాకివాహన శనీశ్వరుడు

హిందూ పురాణాలలో, శని గ్రహాన్ని శని అని పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో గ్రహానికి ప్రత్యేక హోదా ఇవ్వబడినందున, శనిని 'ఈశ్వరుడు' లేదా 'శనీశ్వరుడు' అని పిలుస్తారు.


💠 'శని' అనే పదం సంస్కృత పదం 'శనైః చరహ' అంటే 'నెమ్మదిగా కదిలేవాడు' నుండి వచ్చింది. శని అనేది భౌతిక ప్రపంచాన్ని సన్యాసం లేదా పరిత్యాగానికి సూచిక.


💠 భారతీయ జ్యోతిషశాస్త్రంలో, శనీశ్వరుడు క్రమశిక్షణ, అధికారం, వృద్ధాప్యం, సన్యాసం, కష్టాలు, కార్మికులు, ఆలస్యం, ఆశయం, నాయకత్వం మరియు అధికారం, సమగ్రత, కీర్తికి ప్రధాన గ్రహ దేవతగా సూచించబడ్డాయి.


💠 నవగ్రహాలలో (తొమ్మిది గ్రహాలు) శనీశ్వరుడు నెమ్మదిగా కదులుతున్న గ్రహం .

రాశిచక్రంలో శని యొక్క గ్రహాల స్థానాల ప్రకారం, వివిధ రాశులలో జన్మించిన వ్యక్తులు శనీశ్వరుడు ఆపాదించబడిన మంచి / చెడు ప్రభావాలను అనుభవిస్తారని చెప్పబడింది.


💠 శనిచే పాలించబడే వ్యక్తులు (జనన జాతకాలలో అనుకూలమైన స్థానాల్లో శనీశ్వరుడు ఉండటం) వారు భౌతిక సుఖాల కోరికను నియంత్రించడానికి మరియు ఉన్నత సంకల్పానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే, అత్యధిక విజయాన్ని పొందవచ్చు మరియు అజేయంగా మారవచ్చు. 

శనీశ్వరుని గ్రహప్రభావాల సమయంలో, స్థానికుడు సత్కార్యాలు చేస్తే, వృద్ధులను గౌరవిస్తూ, తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు మరియు పేదలకు దానం చేస్తే, అపారమైన సంపదను మంచి కీర్తితో పొందవచ్చు. 


💠 శని ప్రతికూల స్థానాల్లో ఉన్నప్పుడు అత్యంత హానికరమైన గ్రహంగా పరిగణించబడుతుంది, కానీ నిస్సహాయులు మరియు పేదల పట్ల దయ చూపడం, తప్పు చేసేవారిని క్షమించడం మరియు భౌతిక ఆస్తులు మరియు సౌలభ్యాల పట్ల అనుబంధాలను వదులుకోవడం ద్వారా దాని కోపాన్ని నిరోధించవచ్చు.


💠 శ్రీ శనీశ్వరక్షేత్రంలో నిర్వహించబడే సంస్కృత కర్మలు

వేదపాఠశాల

విద్యారంభం

అన్నప్రాశం

చిత్రరాంతి మహాహవనం

గృహప్రవేశనం


💠 శని దోషం నుండి ఉపశమనం కోరుకునే వారు శనీశ్వర ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసి, పై పరిహారాలు చేయాలి.


💠 ఇరమత్తూరు శనీశ్వర దేవాలయం అరుదైన విశేషాలకు, నమ్మకాలకు ప్రసిద్ధి.  

శని దోషాల నుంచి విముక్తి పొందాలంటే ఇక్కడికి వచ్చి పూజిస్తే సరిపోతుందని విశ్వాసం.  

శనిదోష భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ప్రార్థనలు మరియు పూజలు నిర్వహిస్తారు.


🔆 *ఆలయ చరిత్ర*


💠 మతవిశ్వాసాలు, ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే ఈ ఆలయం చాలా పురాతనమైనది.  పురాతన కాలంలో బ్రాహ్మణులు కలిసి ఉండే ప్రదేశం ఇది.  

పూజలు, ఆచారాలు, త్యాగాలు వారి జీవితంలో భాగమయ్యాయి.  

ఇక్కడ అనేక యాగాలు జరిగాయని నమ్ముతారు.  

60 సంవత్సరాల క్రితం వరకు, ఈ ప్రాంతం సమీపంలోని మఠంలో భాగంగా ఉండేది.  

వీరు తమిళనాడు నుండి వలస వచ్చి ఇక్కడ శని ఆరాధనను ప్రారంభించినట్లు వారి ద్వారానే ఇక్కడ పూజలు కొనసాగుతున్నాయని నమ్ముతారు. 

  

💠 చెన్నితల అనే గ్రామం పేరు కూడా ఇక్కడి శని దేవాలయం నుండి వచ్చిందని నమ్ముతారు.  

శని నివాసమైన శనితల నుండి చెన్నితల వచ్చారు.


💠 అనేక పూజలు మరియు ఆచారాలు నిర్వహించబడే ఈ ఆలయంలో శని మరియు ఆదివారాల్లో మాత్రమే ప్రజల ప్రవేశం అనుమతించబడుతుంది.  


💠 ఆలయ సమయాలు ఉదయం 6.30 నుండి 10.30 వరకు మరియు సాయంత్రం 5.30 నుండి 7.15 వరకు.


💠 శనిదేవుడు ముఖ్యమైన పూజలు ఇక్కడ ప్రధానంగా జరుగుతాయి.  

మకర మాసంలో బృహత్ అగ్నిహోత్ర మహావనం, తిలమషన్నం, పొంగళ, బలివైశ్వదేవయాజ్ఞ, మేధాసూక్త సరస్వతీహవనం, శనిదోష నివారణ క్రియలు, కాలసర్పేష్టి హవనం మొదలైనవి ఇక్కడ ప్రధాన పూజలు.


💠 ఇక్కడ కుడుంబ దోషం, అపమృత్యు దోష నివారణ, ఏడు తరాల శాపాలు, పాప దోషాల హరణం, కండకశని, అష్టమాసని, మృత్యు దోష నివారణ మొదలైన వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


💠 ఈ ఆలయం అలప్పుజా జిల్లాలోని ఇరమత్తూర్ నయన్యంబలం జంక్షన్‌లో ఉంది.  నాదల అనేది ఆలయం ఉన్న ప్రదేశానికి పేరు.  చెన్నితాల సమీప ప్రధాన పట్టణం. 

పూర్తి శ్లోకాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

     *బ్రాహ్మణానా మనేకత్వం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం:~*


*గజానాం మంద బుద్ధిశ్చ*

*సర్పాణా మతి నిద్రతా।*


*బ్రాహ్మణానా మనేకత్వం*

*త్రిభిర్లోకోపకారకమ్॥*


*భావం:~*


*1) ఏనుగులకు మందబుద్ధి,,*


*2) సర్పములకు అతినిద్ర,*


*3) బ్రాహ్మణులకు ఐక్యత లేకుండుట*


*ఈ మూడు లక్షణాలు లోక ఉపకారం చేయటానికే। అని ఈ శ్లోకం భావం*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కవితా మాధుర్యం

 


భావ  కవితా  మాధుర్యం !


            చ: "  అలరుచు మల్లికా పరిణయంబని  వచ్చిరి  పువ్వుఁబోండ్లు ,  కో


                    యిల  సవరించె  గొంతు ,  తమయేలికకై  విరి తేనె పానకం 


                    బళి తతి గూర్చె , పుప్పొడుల  నత్తరులన్  బవనుండు  చేర్చె, కో


                      మల  జలజాత  పత్రముల   మాటున   నేటికి   దాగినాఁడవో ?


                              

                             ప్రకృతికి  ప్రణయాన్ని  అనుసంధానం చేయటమే  భావకవితా తత్వం. సర్వ ప్రకృతియు  భావకవులకు  ప్రణయమూర్తిగానే  దర్శనమిస్తుంది. అందుకే  ప్రకృతితో  కలసిపోవాలని  వారియారాటం. కృష్ణశాస్త్రి  స్వభావ కవియైనను,

భావకవిగా స్థిరపడినాడు. కలంకదలించి ప్రకృతిలోని  రమణీయమైన ప్రణయ తత్వాన్ని  తనకవితలో ఆవిష్కరించాడు  కవితా చిత్రాలుగా. అందులో  ఒక అక్షర చిత్రం  పై పద్యం.


                           గాలికి తలలూపే పూలబాలలు, విలాసంగా,కులాసాగా పచారులుచేసే తుమ్మెదలూ, కొమ్మపై గొంతుసారించే  కోయిలలు. గాలికి రేగే పరాగాలు. సరాగమాడుతూ ఉంటే,

ఆసుందర ప్రకృతి యంతా వారికి  పెళ్ళిపందిరిగా  ఊహాలోకంలో  తళుక్కున మెఱసింది. అంతే  పైపద్యం అవతరించింది  కవితా

చిత్రాంగా .


              భావము: మల్లికకు పెళ్ళియని సంతోషపడుతూ  పూలన్నీ పేరంటాళ్ళై  విచ్చేశాయి. కోకిల గొంతు సవరించి సన్నాయి వాయి

స్తోంది. తమదొరకోసం తేనెటీగలు  పానకం సిధ్ధంచేశాయి. అత్తరు ,గంధము మొ:నవి సమీరుడు ,సమీకరించి తెచ్చాడు. అన్నీ సిధ్ధం చేసి కొన్నాం ఓపెళ్ళికొడుకుగారూ( తుమ్మెదరాజా!)  మీరెందుకండీ  లేత తామర ల చాటున దాగినారు.  రండి రండి ,యని పెండ్లికొమరుని 

యాహ్వానిస్తున్నారు కవిగారు.


            పెళ్ళి యేర్పాట్లు  చక్కగా వర్ణించారు శాస్త్రి గారు. మల్లిక పెళ్ళికూతురు, తుమ్మెదరాజు పెండ్లికొమరుడు. పూలన్నీ పెళ్ళికి పేరంటాండ్రు .కోకిల కూతలు సన్నాయిలు. తేనె పానకం  పూలపుప్పొడుల గంధాలు. ఇలా యెదురు సన్నాహానికి కావలసిన వన్నీ సర్దుబాటు చేశారు. పెళ్ళిళ్ళలో  వరుడు అలగటం దాగుకోవటంకూడా ఒక భాగమే  దానిని కూడా  శాస్త్రిగారు విడిచి పెట్టలేదు.


                            ఈవిధంగా  ఒక  చంపక  మాలతో  మనోజ్ఙంగా  మల్లికకు తుమ్మెద వరునితో  వివాహం 


                                           జరిపించేశారు. ఎంత  ముచ్చటగా ఉందీపద్యం! 


                                                ఇదండీ భావ  కవితా  మాధుర్యం!


                                                         స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

25. " మహా దర్శనము

 25. " మహా దర్శనము " --ఇరవై ఐదవ భాగము--ఉపనయనము --1


25. ఇరవై ఐదవ భాగము-- ఉపనయనము --1



          చైత్ర శుద్ధ చతుర్థిన దేవరాతుని ఇంట్లో దేవతా సమారాధన. రాజధానిలోనున్న సర్వులకూ సంతర్పణ ఆహ్వానము వెళ్ళింది . "బ్రాహ్మణ భోజనము అయినవెంటనే రాజువారికి వర్తమానమును పంపవలెను . అంతవరకూ మహారాజులు ఉపవాసముతో వేచియుంటారు " అని భార్గవుడు అందరినీ తొందర చేయుచున్నాడు . 


         సకాలములో బ్రాహ్మణులు భోజనానికి కూర్చున్నారు . రాజ భవనమునకు ఆచార్యుడూ , భార్గవుడూ స్వయముగా వెళ్ళి చెప్పి వచ్చినారు . ఆ దినము సూర్యుడు దిగే సమయమునకు వైశంపాయనులు , ఉద్ధాలకులు , బుడిలులూ , భార్గవులూ , దేవరాతులూ అందరూ ఒక చోటికి చేరినారు . ఎక్కడో ఉన్న మహిదాసులను కూడా పిలిపించుకున్నారు . ఆరు మందీ కూర్చొని , మరుసటి దినము చేయవలసినదానిని గురించి ముచ్చటించుకుంటున్నారు . 


        దేవరాతుడు  ప్రసన్నముగా నవ్వుతూ , " బుడిలులు పురోహితులన్న తర్వాత యజమానుని భారము తగ్గిపోయింది . మీరు చెప్పినట్లు చేస్తే చాలు , అంతే కదా ? " అన్నాడు . 


         బుడిలులు అతని నవ్వుకు ఉత్తరముగా ఒక నవ్వు నవ్వినా , గంభీరముగా , " ఏమయ్యా , కలియుగపు బ్రాహ్మణుల  వలె అంతటినీ పురోహితుల నెత్తిపై వేస్తానంటున్నావే ? అలాగ కారాదు . ఇక్కడ ఎంతైనా , నువ్వు యజమానుడవు . నేను నీ ఋత్త్విజుడను . కాబట్టి , రేపు జరగవలసినదంతా ఈ దినమే నిర్ధారించుకో . ఇది తర్క పాదము కాదు , క్రియాపాదము . ఏమంటావు ? " అన్నారు . 


         వైశంపాయనులు అన్నారు , " సరే , ఆచార్యా , బుడిలులు అనుజ్ఞనిచ్చినారు , సరిపోయింది . ఏదో మొక్కుబడిగా , తూతూ మంత్రముగా ఉపనయనమని చేసి , మంత్రములు చెప్పి , కర్మము ముగించుట ఒక విధము . అయితే , మాతా పితరుల నుండీ వచ్చిన జన్మమును శుద్ధి చేసి , ఇంకొక మంత్ర జన్మమును ఇచ్చి , తల్లిదండ్రుల వంశములు రెండింటినీ ఉద్ధారమగునట్లు చేసి , వటువును కూడా ఉద్ధరించుట మన పద్దతి . నువ్వు అధ్వర్యుడవై వచ్చినపుడు , దేవతా సాక్షాత్కారము చేసుకొని , హోమము చేసి దీక్షితుడిని ఉద్ధరించుట కన్నా ఎక్కువ కార్యమిది . " 


        ఉద్ధాలకులు అన్నారు : " ఇది, ఎంతైనా , వటువు రెండవ జన్మ యెత్తు సందర్భము . మీరు కూడా , తెలిసినవారు , ఆస్తికులు , శ్రద్ధావంతులు . కాబట్టి పూర్వభావియై , ఏమేమి చేయవలెనో తెలుసుకొని ఉండండి , తప్పేమి? " 


         దేవరాతుడు భార్గవుని ముఖము చూచినాడు . అతడు మహిదాసునికి సైగ చేసి చూపించినాడు . మహిదాసుడు తలయెత్తి చూసి , తనవైపుకు చూస్తున్న ఆచార్యుని చూసి , " అవశ్యము , పెద్దవారు చెప్పినది సరిగ్గా ఉంది " అన్నారు . ఆచార్యుడు సమాహితుడై కూర్చున్నాడు . 


         ఆ వేళకు మహిదాసుని కొడుకు శాండిల్యుడు వచ్చినాడు . మహిదాసుడు వాడిని పిలచి  బుడిలుడు మాట్లాడుతున్న విషయమును చెప్పి , " కూర్చో , విను , ఈ మహానుభావుల మాటలు వినే భాగ్యము మరలా ఎన్నటికో "  అన్నాడు .


         బుడిలులు ఆరంభించినారు :  " ఇది , అంటే ఈ ఉపనయనము అనేది , అగ్ని, వాయు , ఆదిత్యుల తేజస్సును  సంగ్రహించు కార్యము . దేహములో అగ్ని , వాయు , ఆదిత్యులు ఉన్నారు . నోరు , నాసిక , కన్నులలో వారు ఉండి వ్యాపారమును చేయుచుండుట యే కొద్ది మందికో తప్ప ఎవరికీ తెలియదు . ఈ ముగ్గురే భౌతిక ప్రపంచములో భూమి , అంతరిక్ష , ఆకాశములలో ఉన్నారు . ఈ ముగ్గురు దేవతల అనుగ్రహమును తండ్రి కొడుకుకు సంపాదించి ఇచ్చు సంస్కారము ఈ ఉపనయనము . ఉపనయనమైన వెంటనే వటువు స్వతంత్రుడగును . స్వయముగా అగ్ని , వాయు ఆదిత్యులను ఆరాధించువాడగును . రేపటి దినము మొదటి పని అగ్నిని ఆరాధించుట. రెండవది , ప్రాణమునకు పదే పదే వచ్చి ఆవరించు అశౌచమును పోగొట్టుటకు ఆచమనము చేయుటను నేర్పుట. మూడవది , ఆదిత్యుని చూపించి , అతని సావితృ  కిరణమును సంగ్రహించి దానిని హృదయము నందు నింపుకొనుట . ఈ ముగ్గురు దేవతలను వేరే వేరే అనుకొని కర్మ చేసి కృతకృత్యుడయితే కర్మకాండలో కృతార్థుడగును . వీరంతా ఒకరే అనుకొని చేస్తే జ్ఞాన కాండమగును . ఇలాగ , రేపటి దినమున జరగబోవు కార్యము , కాండద్వయమునకు బీజమును ఆపాదించునది . "


         శాండిల్యుడు లేచి బుడిలులకు నమస్కారము చేసినాడు . : ఈ మాటలన్నీ మాకు ఏదో ఒక రీతిలో పరిచితములే . అగ్ని , ఆదిత్య , వాయువులు మేము అహర్నిశలూ అనుసంధానము చేసుకొను దేవతలు . వారిని వేరే వేరేగా చూచుట , ఒక్కటిగా చూచుట , ఇది మాకు అర్థముకాని విషయము . కాబట్టి నామీద కృపతో దీనిని ఇంకొంచము వివరముగా చెప్పండి " అని ప్రార్థించినాడు . 


         బుడిలులు అటులనేనని తలయూపి చెప్పనారంభించినారు : " ఈ ఉపనయనము చేసుకున్నవాడు ద్విజుడవుతాడు . గురు , వేద , వ్రత , దేవతా సామీప్యమును పొందును . ఈ ఒక్క కర్మలో మాత్రమే , ఆచార్యుడు , శిష్యుడూ ఇద్దరూ కర్మాధికారులుగా ఉండునది . ఆచార్యుడు కావలసినవాడు పన్నెండు వేలసార్లు గాయత్రీ మంత్రజపము చేస్తేనే , అతడికి శిష్యునికి ఉపదేశము చేసే అధికారము వచ్చేది . కాబట్టి మన ఆచార్యులు మొన్నటినుండీ పట్టుదలతో కూర్చొని , పన్నెండు వేల సార్లు గాయత్రి జపము చేసినారు . రెండవది , ఆచార్యుడూ , శిష్యుడూ ఇద్దరూ కృఛ్రమును - అదికూడా మూడు సార్లు - చేసుకోవలెను . ( కృఛ్రము అంటే , మూడు దినములు పగటి పూట మాత్రమే , మరి మూడు దినములు రాత్రి పూట మాత్రమే భోజనము చేసి, ఇంకో మూడు దినములు అయాచిత భోజనము చేసి , తరువాత మూడు దినములు ఉపవాసముండుట. దీనినే సాంతపన వ్రతము అని కూడా అంటారు ) ఆచార్యుడు అజ్ఞాతముగా సంభవించిన పాపపు ప్రాయశ్చిత్తముగాను ,  శిష్యుడు కామాచారము , కామమైన కామ భక్షణాది దోషములకు ప్రాయశ్చిత్తముగానూ !.  తరువాత , దేవతలనూ , పితరులనూ పూజించి , వటువుకు చౌల భోజనములను చేయించి , ఆచార్యుని వద్దకు సుముహూర్తములో పిలుచుకు వస్తారు . అనగానేమి ? ప్రాణమునకు అన్నమునిచ్చి , దానిని సంతృప్తి పరచిన తరువాతనే మిగిలిన కార్యక్రమము . ఇదంతా అర్థమయిందా ? "  


" అయింది , తరువాతివి అనుజ్ఞనియ్యవలెను . " 


         " అనంతరము ఆచార్యుడు శిష్యుడి కోసమై హోమము చేయుటకు లౌకికాగ్నిని తెప్పించి దానిని మంత్రాగ్నిగా చేయును . దానిలో హోమము చేసి వటువుకు కౌపీన ధారణము చేసి  , వాడికి రెండవ జన్మ రానియ్యమని , మాతృ గర్భమునందున్న ఉల్బము ( మాంసపు తిత్తి ) ను పోలియుండు కొత్త బట్టలను ధరింపజేసి , కప్పును . అప్పుడు చెప్పు మంత్రములకు దేవతలు ఎవరో తెలుసా ? మిత్రావరుణులు . మిత్రావరుణులంటే ఎవరు ? పగటికీ , ప్రాణవృత్తికీ దేవత మిత్రుడు ( సూర్యుడు ) . రాత్రికీ , అపాన వృత్తికీ దేవత వరుణుడు . అంటే , రాత్రింబగళ్ళనూ  ప్రాణాపానములనూ అనుసంధానము చేయునది ఈ కౌపీన వస్త్ర ధారణ..... ఆ ? "


         " అనంతరము యజ్ఞోపవీత ధారణము . యజ్ఞోపవీత ధారణ మంత్రమునకు అధిదేవత ఆ పరమాత్మయే ! ఆ మంత్రపు అర్థమేమి ?  " ఓ యజ్ఞోపవీతమా !  మమ్మల్ని అవిద్యాది దోషములనుండీ తప్పించు . నువ్వు ప్రజాపతితో పాటూ పుట్టినవాడవు . మమ్మల్ని , యజ్ఞ స్వరూపుడైన విష్ణువు వద్దకు పోవునట్లు చేయి . బలిష్ఠుడవైన నిన్ను ధరించుట వలన నాకు బ్రహ్మ వర్ఛస్సు లభించనీ ! అని దాని అర్థము . తరువాత , ఆచమనము . ఆచమనము అంటే ఏమిటి ? ప్రాణమును కప్పుకొనుట / రక్షించుకొనుట . అంటే , ప్రాణానికి సంజీవని వంటిది ఆచమనము . ఆ తరువాత , తన కుడిచేతిని పట్టుకొని తనను నడిపించవలెనని , పవమానాగ్ని , ప్రజాపతులకు హోమము చేయును . అంటే , అగ్నిని గురించి , ప్రాణాగ్నుల జనకుడైన విరాట్పురుషుడిని గురించి హోమము చేయును . అర్థమైనదా ? " 


         " అప్పుడు ఆచార్యుడు , సూర్యాత్ముడూ , అగ్న్యాత్ముడూ యై , తన ముందున్న కుమారుడు శుచి కావలెనని సూర్యదేవతా ప్రీతి కోసము అంజలి క్షాళనము చేయును ( చేతులు కడుగును ) . అప్పుడు చెప్పే మంత్రపు అర్థము ఏమిటి ? ’ మేము సవితృదేవుని వైపు వారము . శ్రేష్ఠమూ , సర్వమునూ ఇచ్చునదీ , శత్రు నాశకరమూ అయిన ఆతని ధనమును పొందెదము గాక " అని . ఇక్కడ శత్రు నాశకరము అంటేనేమి ? శత్రువంటే కామము . కామము లేకుంటే పూర్ణము కాగల చేతనమును ,  కామము అపూర్ణము చేయును అన్నతర్వాత , ఇక కామమున కన్నా   పెద్ద శత్రువుంటుందా ? ఈ మంత్రమును చెప్పి, తన పాత్రలోని నీటిని వటువు పాత్రలోకి , వటువు చేతులనుండీ  ఆచార్యుడు వదలును . దీనివలన ఏమగును ? ఆచార్యుని దేహములోనున్న శక్తి నీటి ద్వారా వటువును చేరును . అప్పుడు వటువు దానిని గ్రహణము చేసి శిష్యుడగును . అలాగ , అప్రత్యక్షముగా సిద్ధమైన శిష్యత్వమును ప్రత్యక్షము చేసుకొనుట హస్త గ్రహణము . అది కూడా అటులనే ! సవితృ దేవుని అనుజ్ఞతో అశ్వినీ దేవతల బాహువులనుండీ , పూషుని హస్తములతో, " హే , ఇంతటి దేవా , నీ హస్తమును పట్టుకొనెదను " అని మంత్రము . మరలా రెండు సార్లు పాత్రలో నుండీ నీరు దోసిళ్ళతో శిష్యుడి పాత్రకు వదలినపుడు " సవితృడు నీ హస్తమును పట్టుకున్నాడు .  అగ్ని నీకు ఆచార్యుడైనాడు " అని చెప్పును . దీన్ని క్రియాపదము అంటారా ? లేక పొద్దు గడుపుటకు ఆడే మాటలంటారా ? "


        ఈ సారి మహిదాసుడు మాట్లాడినాడు ,  "  అగునా మరి ? ఆచార్యుడైన వాడు తనలో అశ్వినులనూ , పూషుడినీ , అగ్నినీ ఆవాహించుకోక పోతే ఈ శిష్యత్వము సిద్ధమగునా మరి ? కాబట్టి ఇది క్రియా పదమే , సందేహము లేదు ".


         బుడిలులు కొనసాగించినారు : " అనంతరము వటువును వ్రతపతియైన ఆదిత్యునికి ఇచ్చెదను అని సంకల్పించి , ఆచార్యుడు వటువును ఆదిత్యునికి చూపి , " సవితృ దేవుడా ! ఈ బ్రహ్మచారి నీవాడు . వీడిని కాపాడు ’ అని వటుదానము చేయును . అనంతరము శిష్యాచార్యులు ఇద్దరూ అగ్ని వద్ద పరస్పర అభిముఖముగా నిలచి , ఆచార్యుడు ’ నువ్వు భాస్కరుడి బ్రహ్మచారివి . ప్రాణుడి బ్రహ్మచారివి . భాస్కరుడు భాస్కర రూపుడవైన నిన్ను ఉపనయనము చేసినాడు ( తనవద్దకు చేర్చుకున్నాడు ) ఆ భాస్కరుడికి నిన్ను ఇచ్చెదను "  అని ప్రతిజ్ఞ చేయును . తదనంతరము , వాడిని ’ శ్రేయస్వి యవనీ ’ అని పూర్వాభిముఖముగా చేసి ’ ధీరులూ , కవులూ అయినవారు మనఃపూర్వకముగా వీడిలో దేవతలు ఉండునట్లు చేసి రెండవ జన్మను ప్రసాదించగలరు ’ అని వాడి భుజములను తాకి , తరువాత వాడి హృదయమును తాకును . తాను భుజముల ద్వారా అనుగ్రహించిన దేవతాంశములు వాడి హృదయములో ఎప్పటికీ నిలచి ఉండనీ అని దాని రహస్యము . 


         " అప్పుడు ఆచార్యుడు కుమారుడిని దక్షిణములో కూర్చోబెట్టుకొని వాడిచేత అగ్ని కార్యమును చేయించును . వటువు అగ్ని దేవునితో , " ఓ జాతవేదుడా , అనగా , పుట్టినపుడే సర్వమునూ తెలిసికొనియే పుట్టు అగ్ని దేవుడా ! నేను నీకు సమిధలను ఆహుతినిచ్చెదను .   నువ్వు సమిధల వలన వర్ధిల్లునట్లే , మనము -గుర్తుంచుకో , ’ నేను ’ కాదు , -మనము బ్రహ్మవర్ఛస్సు తో , అనగా ధ్యానముతో వర్ధిల్లెదము . " అని సమిధాదానము చేయును . అనంతరము అగ్నికి అరచేతులను చూపించి , మూడు సార్లు , నీ తేజస్సు నాకు కూడా రానీ ! యని తన ముఖమును తుడుచుకొనును . అక్కడ కూడా ఒక రహస్యముంది . అగ్ని , వాయు , ఆదిత్యులు ముఖ , నాసిక , చక్షువులలో ఉందురు . అగ్నియొక్క తేజస్సు ఆ ముగ్గురిలోనూ కనపడనీ ! యని ఒక అభిప్రాయము . "


          అంతా తలలూపారు. బుడిలులు మరలా  , :   అనంతరము అగ్నిని ఉపస్థానము చేసి , అనగా లేచి నిలబడి స్తుతి చేసి ’ నాకు మేధనూ , ప్రజ్ఞనూ ఇవ్వు . అగ్ని తన తేజస్సునూ , ఇంద్రుడు ఇంద్రియమునూ , సూర్యుడు ప్రకాశమునూ ఇవ్వనీ ! . హే అగ్ని దేవుడా ! నీ దయవలన నేను తేజస్విగనూ , వర్ఛస్విగనూ , హరస్విగనూ , దానపాత్రుడిగనూ ( దానమునకు అర్హుడు ) కానిమ్ము . ’ అని ప్రార్థించి అనంతరము రుద్రుడిని రక్షణార్థము వేడుకొనును . రుద్రుడనగా మరేమిటో , మరెవ్వరో కాదు , ’ ప్రాణానాం గ్రంధిరసి రుద్రః’.   ప్రాణములు ఒకదానినొకటి సంధించిన వెంటనే చెలరేగిపోవును . అదే రుద్రుడు . మన ఇంద్రియముల నుండీ బయలువెడలు వృత్తులన్నీ ప్రాణములే . మనము కార్యాంతరములో నున్నపుడు మనసు అందులో నిమగ్నమై ఉన్నందువలన , వృత్తులు  మననుండీ బయటికి వెదజల్ల బడుతున్నది మనము చూడలేము . అలా చూచినవారికి రుద్ర దర్శనమగును. ఆ రుద్రుడు పుట్టిన వెంటనే , ’ దేనిని చంపవలెను ? , దేనిని ఘాతము చేయవలెను ? ’ అనియే కార్యోన్ముఖుడగును . కాబట్టి ఆ రుద్రుడిని , " ఓ రుద్రా ! , మా పిల్లలను , మనవలనూ చంపవద్దు  , మా గోవులను , అశ్వములనూ చంపవద్దు . మా వీరులను చంపవద్దు . నీకు హవిస్సులను ఇచ్చి ప్రసన్నుడిని చేసుకొనెదము ’ అని రుద్రుని నుండీ రక్షా యాచన చేయును . అక్కడ రక్షను తీసుకొని యథా స్థానములలో ఉంచుకొనును . " 

Janardhana Sharma