14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

అనుబంధం

 🔔 *అనుబంధం* 🔔


*మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!!*


*మన చుట్టూ ఉన్న 7 అద్భుతాలు*


1. *తల్లి*

మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి,మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన తల్లి  1వ అద్భుతం!


2. *తండ్రి*

మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ,సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి 2వ అద్భుతం!


3. *తోడబుట్టిన వాళ్ళు*

మన తప్పులను వెనకేసుకురావాడానికి,మనతో పోట్లాడడానికి,మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు.తోడబుట్టినవాళ్లు 3వ అద్భుతం!


4..*స్నేహితులు*

మన భావాలను పంచుకోవడానికి,మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి, ఏది ఆశించకుండామనకు దొరికిన స్నేహితులు. 4వ  అద్భుతం!


5. *భార్య / భర్త*

ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలనుఎదిరించేలా  చేస్తుంది. కలకాలం తోడు ఉంటూ ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే,ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది.భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  5వ అద్భుతం మన సొంతం!


6. *పిల్లలు*

మనలో స్వార్థం మొదలవుతుంది.మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది.వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి. వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ ఉంటుంది.వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లి తండ్రులు  అసలు ఉండరు...

పిల్లలు..6వ అద్భుతం!


_*అన్ని అయిపోయాయి..

ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?*_


7. *మనవళ్ళు..మనవరాళ్లు*

వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే ఆశపుడుతుంది.వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతంగా మళ్ళీ పసిపిల్లలం..అయిపోతాం.వీరు మన జీవితానికి  దొరికిన.. 7వ అద్భుతం!


*ఇన్ని అద్భుతాలమధ్య తిరుగుతూ,వీటి విలువలు మరిచి బ్రతుకుతున్న మనం మహా అద్భుతం..! కాసింత ప్రేమ చాలు,ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి.చిన్న పలకరింపు  చాలుమనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  

మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం*




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

Panchang



 

మాఘ పురాణం - 16

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷శుక్రవారం 14 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 16 వ*_ 

        _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *విద్యాధర పుత్రిక కథ*


☘☘☘☘☘☘☘☘☘


రాజా ! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగాతీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్దలతో చిరకాలము తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను , వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ *"నాయనా ! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపముకై మెచ్చి పుత్రిక ననుగ్రహించుచున్నానని"* అంతర్దానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను , మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని , తనను చూచినవారికిని , సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుని కూడ నా యింటనే యుంచుకొందునని నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడామెను చూచెను , ఆ రాక్షసుడు, దేవీ భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను , కోరిన రూపము ధరింపగల శక్తిని కూడ సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుదు , శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చుచు *"ఓయీ ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని"* చెప్పి యిచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై యెవరిని లెక్కచేయక ప్రవర్తించుచుండెను.


అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి *"సుందరీ ! నన్ను వరించుమని యడిగెను , ఆమెయు నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరల వచ్చెను , విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగ సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను , విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును , ఈ లోపున నిన్నేమియు భాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా నామెయేమియు మాటలాడలేదు , రాక్షసుడు మరల మరల నడుగగా *'నాకిప్పుడేమి అక్కరలేదు , ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది , దర్శించి పూజించుటకు శివలింగమెచటనున్నదో చూపూ మని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను. ఆశ్చర్యపడి *'అమ్మాయి ! నీవిచటనున్నావేమని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.*


నారదుడామె చెప్పినదంతయును వినెను. అమ్మాయీ ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవీ సరస్సున స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.


విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు సర్వకాల సర్వా వస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును. అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయనుచు భుజించును , కేశవాయనుచు నిద్రించును. నరసింహాయని స్మరించును , హృషీకేశాయని మేల్కొనును , వామనాయనుచు తిరుగును , ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారదమహర్షి వెళ్లెను.


హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి , సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును. అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను. హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను , నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను. రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి , హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను , వానిని భర్తగా వరించెను. హరిద్రధుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులును విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి , అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.


*మాఘపురాణం పదహారవ* 

 *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

🪷14, ఫిబ్రవరి, 2025🪷* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

        *🌹శుక్రవారం🌹*

*🪷14, ఫిబ్రవరి, 2025🪷*   

     *ధృగ్గణిత పంచాంగం*


  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*ఉత్తరాయణం - శిశిరఋతౌః* *మాఘమాసం - కృష్ణపక్షం*

*తిథి : విదియ* రా 09.52 వరకు ఉపరి *తదియ*

*వారం    : శుక్రవారం* ( భృగువాసరే )

*నక్షత్రం : పుబ్బ* రా 11.09 ఉపరి *ఉత్తర ఫల్గుణి ( ఉత్తర )*

*యోగం  : అతిగండ* ఉ 07.30 వరకు ఉపరి *సుకర్మ*

*కరణం : తైతుల* ఉ 09.02 గరజి రా 09.52 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు* 

       *ఉ 09.30 - 10.30 & 05.00 - 06.00*

అమృత కాలం  : *సా 04.13 - 05.57*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.45*

*వర్జ్యం : శేషం ఉ 07.32 వరకు*

*దుర్ముహూర్తం : ఉ 08.53 - 09.39 మ 12.45 - 01.31*

*రాహు కాలం : ఉ 10.55 - 12.22*

గుళికకాళం : *ఉ 08.01 - 09.28*

యమగండం : *మ 03.16 - 04.43*

సూర్యరాశి : *కుంభం*   

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 06.34* 

సూర్యాస్తమయం :*సా 06.10*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.34 - 08.53*

సంగవ కాలం         :      *08.53 - 11.12*

మధ్యాహ్న కాలం  :      *11.12 - 01.31*

అపరాహ్న కాలం   : *మ 01.31 - 03.50*

*ఆబ్ధికం తిధి        : మాఘ బహుళ విదియ*

సాయంకాలం        :  *సా 03.50 - 06.10*

ప్రదోష కాలం         :  *సా 06.10 - 08.38*

రాత్రి కాలం : *రా 08.38 - 11.57*

నిశీధి కాలం          :*రా 11.57 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.54 - 05.44*

_______________________________

        *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   *🪷శ్రీ లక్ష్మీదేవి కవచం🪷*


*ఇందీవరేక్షణాం కామ కోదండ భ్రువ మీశ్వరీం*

*తిల ప్రసవ సంస్పర్ధి నాసికాలంకృతాం శ్రియమ్*


  *🪷ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః🪷*


🌹🪷🌹🌷🛕🌹🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మాఘ పురాణం - 15 వ

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


_*మాఘ పురాణం - 15 వ*_ 

       _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


          *జ్ఞాన శర్మ కథ* 

  *🌷(మాఘపూర్ణిమ)🌷*


☘☘☘☘☘☘☘☘☘


గృత్నృమదుడు జహ్నువుతో నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను , బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నారాకను గోరి తపమాచరించితివి యెందులకు ? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమని యడిగెను. అప్పుడా విప్రుడు *'స్వామీ ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితివి , నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను , కాని నారదమహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది , నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను.*


అప్పుడు శ్రీహరి *'ఓయీ ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే ఇప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ మీరిద్దరును భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమశీలము , గుణములు కలిగియుండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించినందున యీ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమనాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట , భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషముపోయి నీ పుత్రుడు చిరంజీవియగును.


ఓయీ ! మాఘ స్నానము ఆయువును , ఆరోగ్యమును , ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయని వారికి , వారి సంతానమునకు ఆపదలు కల్గును , అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు , బుద్దిమంతులు , ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ , శివుడు , లక్ష్మి , పార్వతి , సరస్వతి , ఇంద్రుడు , వశిష్టుడు , జనకుడు , దిలీపుడు , నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు , మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు , మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును , నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.


బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను , బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా , పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


జహ్ను మునివర్యా ! మాఘవ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను , నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము , సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను.


*మాఘపురాణం పదిహేనవ* 

  *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

వరమై జాతికి మేలొసంగును

 మ.వరమై జాతికి మేలొసంగును సదా పల్గాకులన్ గాంచి దు

ర్భరమౌ వారల నీతి మార్చి సుమతిన్ వర్తింప విజ్ఞానులై,

పరపీడా రతి దుర్గుణాస్పద మసంభావ్యమ్ము నౌనంచు నం

దరి మేలుం గనునట్లు ధర్మ గతి నొందంజే యగా భారతీ!౹౹ 45


ఉ.ఏమని చెప్పినన్ జనులకేమగు? సత్యమటంచు నమ్మ నా

కే మరియాద దక్కునని యీల్గుచు నుందు రసత్య వాదనో

ద్దామముతో నమాయకుల దైన్యములన్ కనిపెట్టి దుర్మదుల్

తామొనరించు ద్రోహము నధర్మము నెన్నగ లేరు భారతీ!౹౹46

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  - ద్వితీయ - పూర్వాఫల్గుణి -‌‌  భృగు వాసరే* (14.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

అహోబలపండితీయము

 అహోబలపండితీయము


అహోబలపండితీయము, ఈ గ్రంథాన్ని రాసినకవి గాలి ఓబళయ్య.విచిత్రం ఏమిటంటే ఈయన తన తెలుగు పేరును సంస్కృతీకరించుకొని ప్రభజనం (గాలి )అహోబలుడు (ఓబళయ్య ) గా మార్చుకున్నాడు.ప్రభజనం అహోబలుడు అయ్యాడు ఇతను గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా సంతరాపూరు వాస్తవ్యుడును, ఆగ్రామ కరణములలో ఒక్కడై ఉండెను. చిన్నతనమున విద్యావాసనలేక హాలిక వృత్తి (పొలము దున్నువాడు) నుండెను. నియోగి బ్రాహ్మణుడు. భరద్వాజ గోత్రుడు. తండ్రి నరసింహయ్య, తల్లి లక్ష్మీదేవమ్మ. తన ఇంటిపేరు ప్రభంజనవంశ మని అహోబలపండితీయమున ఈతడు వ్రాసుకొనెను. తనతండ్రి మొదలగు కరణములు గ్రామముపై వసూలయిన సర్కారుసొమ్మును హరించి జమీందారుల ఒత్తిడికి పరారుకాగా రాజభటులు ఈతనిని పట్టుకుపోయి ప్రభువు ఆజ్ఞమేరకు కారాగృహమున పెట్టిరి. ఈతడు చదువరి కాకపోయినను పాటలు శ్రావ్యముగా పాడగలవాడైయుండెను. కారాగృహమున ఒకనాడు పాడుచుండగా ప్రభువు మొదలగువారు విని అతనిని పిలిపించి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొనగా, తనను విడిపించినచో తన మేనమామాగు పోలూరి మాధవసోమయాజులు గారియొద్దకు బోయెదననియు మనవిచేసి వేడికొనెను. మాధవసోమయాజులు గారు జగద్విదుతులు అగుటచే ప్రభువువిని సంతసించి అతనిని విడిపించెను. అంతనాతడు తనతల్లితోగూడ వినుకొండ తాలూకా గోకనకొండ (గోకర్ఞగిరి) గ్రామమునకు మేనమామ ఇంటికి చేరెను. మామగారింట స్త్రీలతోసహా అందరూ సహజ విద్వాంసులగుటచే వారందరు ఈతనితో పరిహాసమాడుటచే, రోషపడి ఇంటినుండి దేశాటనకేగుదనని మామగారికి చెప్పగా వారు వలదని వారించి "నీకొక మంత్రము చెప్పెదను" దానిని జపించుకొను. మని నృసింహ మంత్రమునుపదేశించెను. అంతట నీతడచటగల ఒక కొండ గుహయందు చేరి తపము సేయగా స్వామియొక్క మనుజాకృతిని వచ్చి యేమో నాలుకపై రాసి ఇంటికి బోదమురమ్మని ఒకరాత్రికి ఆతనిని తీసుకువచ్చి, ఇంటివారు తలుపు తీయగా ఆతడు అదృశ్యమాయెను. ఓబళయ్య నాటినుంచి కుశాగ్రబుద్ధికలిగి మామగారి వద్ద విద్యనభ్యసించి పండితుడై నవద్వీపము మొదలగు చోట్ల మిక్కిలి విద్యాభ్యాసము చేసెను. మేనమామనే తనగురువని అహోబలపండితీయములో పేర్కొనెను. శ్రీరామ భక్తుడై "అహోబలపండితీయము" , ' "కవిశిరోభూషణము" అనుపేర నన్నయ భట్టీయం నకు వ్యాఖ్యానం "అభినవ నన్నయసూరి" అని బిరిదుగాంచెను. పిదప ' "కాళిందీపరిణయము" అను ఆరు ఆశ్వాసముల పద్యకావ్యమును వ్రాసెను. ఇది ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రికయందు ప్రకటింపబడింది. కాని గ్రంథ అన్యగతహస్తమై గ్రంథపాతమేరపడి మొదటి భాగము పెల్లగింపబడి మగుటంచేసి పీఠిక వృత్తాంతములు తెలియకున్నవి. ' "కాళిందీపరిణయము" మొకటి పద్యకావ్యము 1895 సం. శ్రీ రా.బ.పనప్పాకం అనంతాచార్యులు గారి వలన వైజయంతీ పత్రిక యందు ప్రచురితమయినది.


ఈ కవి తరువాత రాజాశ్రయమున మైదవోలు, నారాయణపురం అను అగ్రహారములు సంపాదించినట్లు తెలియుచున్నది. ఇందు నారాయణపురము వినుకొండ తాలూకా గోకనకొండ సమీపమున గుండ్లకమ్మ ఒడ్డుననుండి ఏటిపోటునకు కొట్టుకుపోయినట్లు చెప్పెదరు. ఈరెండు గ్రామములగూర్చి ఈ కవి తన కావ్యములలో ఉదహరించెను. ఈతడు గోకనకొండ కొండగుహయందు తాను తపస్సు చేసినచోట నృసింహాలయము కట్టించి ప్రతిష్ఠించెను. ఇది ఇప్పటికి ఉంది.

ఈ కవి కాలమును నిర్ణయించుటకు సరైన ఆధారములు లభించలేదు. కాని ఈతని కుమారుడు రామభద్రప్పశాస్త్రులు శా.శ 1670 శుక్లనామ సం. శ్రావణ శు. 15లున శ్రీ రాజా మల్రాజు రామారాయుణుడు గారి వలన వినుకొండ తాలూక ముమ్మడివరము అగ్రహారమును పొందెను. ఇందును బట్టి అహోబిలపండితుడు రమారమి 300 క్రిందటి వాడయి ఉండవచ్చును. ఈ కవి వంశస్థులు ఇప్పటికిని ముమ్మడివరము అగ్రహారమందునారు. ఈ వంశమువారు ముమ్మడివరము, నర్సరావుపేట తాలూక కొణిదెనమజరా మర్లాయపాలెము సంతరావూరు గ్రామమందుకలరు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఉపవాసం

 సేకరణ 👇

ఉపవాసం మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఒక ఆనవాయితీ.. ప్రతిదీ భక్తికి ముడి పెట్టీ మనకు తెలియకుండానే శాస్త్రీయ ఫలితాలను పొందేలా చేసారు..

వివేకానందుడు అన్నట్టు సైన్స్ పెరిగినా కొద్ది హిందుత్వ  లోని గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది.. 

అందుకు ఈ కింది ఉదాహరణ సరిపోతుంది..


జపనీస్ సెల్ బయాలజిస్ట్ యోషినోరి ఒహ్సుమీ 2016లో మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు, కణాలు వాటి కంటెంట్‌ను ఎలా రీసైకిల్ చేస్తాయి మరియు పునరుద్ధరిస్తాయి, ఈ ప్రక్రియను ఆటోఫాగి అని పిలుస్తారు. ఉపవాసం ఆటోఫాగీని సక్రియం చేస్తుంది, ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది మరియు కణాల పునరుద్ధరణపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.


కొందరు వ్యక్తులు 24 గంటల కంటే ఎక్కువ కాలం ఉపవాసం ఉంటారు.⌛ఆటోఫాగి అనేది ఒక సహజ ప్రక్రియ, దీనిలో కణాలు విచ్ఛిన్నమై దెబ్బతిన్న లేదా పాత భాగాలను రీసైకిల్ చేస్తాయి. ఇది సెల్యులార్ రీసైక్లింగ్ సిస్టమ్, ఇది కణాలు తమ ఆరోగ్యాన్ని మరియు పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.


ఆటోఫాగి కణాలు తమ ఆరోగ్యాన్ని మరియు పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది కణాలు క్యాన్సర్‌గా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ మరియు అల్జీమర్స్ వ్యాధి వంటి పరిస్థితుల నుండి రక్షించడంలో సహాయపడవచ్చు!


ఆటోఫాగి అనేది మీ శరీరంలో అన్ని సమయాలలో జరుగుతుంది కానీ మీరు ఒక్కోసారి అడపాదడపా ఉపవాసం చేసినప్పుడు, ప్రక్రియ త్వరగా జరుగుతుంది - కాబట్టి గుర్తింపు పొందిన వైద్యుడిని సంప్రదించండి. వ్యాయామం లేదా కీటోజెనిక్ ఆహారం ద్వారా కూడా ఆటోఫాగిని ప్రేరేపించవచ్చు

Copy paste

పూర్వజన్మలో

 పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు...!

ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు...

ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. 

ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...

మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.

ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు...

మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.

మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో ఎదురవుతారు...


ఉదాహరణకు ఒక జరిగిన కథ...

కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.

తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.


ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. 

పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు.అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని.. 

అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...

ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. 

ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.

నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...

ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.

ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి...

కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.

అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము... 

ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం,అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.