13, డిసెంబర్ 2025, శనివారం

జపం

 జపం చేసేటప్పుడు మాలకు నమస్కరించి ఈ 2 శ్లోకాలు చదవడం వల్ల మాల శుద్ధి అవడమే కాకుండా జపానికి విఘ్నాలు రాకుండా ఉంటాయి.

మాలే మాలే మహామాలే సర్వతత్త్వ స్వరూపిణి చతుర్వర్గస్త్వయి న్యస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ త్వం మాలే సర్వ దేవానాం ప్రీతిదా శుభదా భవ, శివం కురుష్వ మే భద్రే యశో వీర్యం చ సర్వదా.

_డిసెంబరు 13, 2025_* 🌝

  🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

🌞 *_డిసెంబరు 13, 2025_* 🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*హేమంత ఋతువు*

*మార్గశిర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *నవమి* రా7.27

వారం: *స్థిరవాసరే*

(శనివారం)

నక్షత్రం: *ఉత్తర* ఉ9.32

యోగం: *ఆయుష్మాన్* మ3.14

కరణం: *తైతుల* ఉ7.09

&

*గరజి* రా7.27

వర్జ్యం: *సా6.26-8.08*

దుర్ముహూర్తము: *ఉ6.25-7.52*

అమృతకాలం: మర్నాడు

*తె4.37-6.19*

రాహుకాలం: *ఉ9.00-10.30*

యమగండం: *మ1.30-3.00*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *కన్య*

సూర్యోదయం: *6.25*

సూర్యాస్తమయం: *5.24*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

   ☘️🇮🇳🚩🙏🚩🇮🇳☘️

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

సూక్తి

 *నేటి సూక్తి*

*జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన ఆలోచనలు ఇంతకుముందు కంటే తెలివిగా పనిచేస్తాయి.*

 *క్రాంతి కిరణాలు* 

*జీవిత మందున కష్టము* 

*నే విధముగ వచ్చి చేరు నెవరికి తెలుసున్*

*కావించెడు పనులన్నియు*

 *నా వేళను చేయుచుండు నత్యద్భుతమే*

*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

శ్లో𝕝𝕝 *ఏకోఽరీన్ శమయేద్వీరః బహవో న తు భీరవః* |

         *దీప ఏకస్తమో హన్తి ఖద్యోతాః న పరశ్శతాః* ||

తా𝕝𝕝 *లోకంలో ధీరుడైనవాడు ఒక్కడున్నా అతడు శతృవులను అణచివేయగలడు.... భయపడేవారు ఎంతమంది ఉన్ననూ ప్రయోజనం ఉండదు.... దీపం ఒక్కటి చీకటిని పారద్రోలును.... వందలకొద్దీ మిణుగురు పురుగులున్ననూ చీకటి తొలగించబడదుగదా!!*

 ✍️💐🌹🌸🙏

నేటి సూక్తి*

  *నేటి సూక్తి*

*మీ జీవితం సాఫీగా సాగాలంటే మాట, డబ్బు, ఆలోచన మరియు ప్రవర్తన మీ ఆధీనంలో ఉంచుకోవాలి.*

*క్రాంతి కిరణాలు*

*మన నోటి మాట , నడవడి* 

*మన యాలోచన ఘనముగ మారక నున్నన్*

*ధనముల నాశించనిచో*

*మన జీవిత కాలమంత మంచిగ నడచున్*

*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

భాగవత మధురిమలు*

  *శ్రీ పోతన భాగవత మధురిమలు*

(2-244-క)

తప మనఁగ మత్స్వరూపము

తపమను తరువునకు ఫలవితానము నే నా

తపముననే జననస్థి

త్యుపసంహరణము లొనర్చుచుండుదుఁ దనయా!

*భావము:-* పుత్రా! బ్రహ్మదేవ! తపస్సు అంటేనే నా స్వరూపం. తపస్సు అనే వృక్షానికి ఫలాన్ని నేనే. ఆ తపస్సు చేతనే సృష్టి స్థితి లయాలు సర్వం నిర్వహిస్తుంటాను. అంటు బ్రహ్మదేవునికి తపస్సు యొక్క రహస్యాన్ని నారాయణుడు వెలిబుచ్చాడు.

*శ్రీ కసాపురం ఆంజనేయ స్వామిని* స్తుతిస్తూ శుభోదయం.

*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

సమాజ చైతన్యానికి

  SSV SANSKRIT NEWS CHANNEL

సమాజ చైతన్యానికి పిలుపు — భారత గురుశిష్య పరంపరను రక్షిద్దాం

ఈరోజుల్లో మనం ఏ దిశగా వెళ్తున్నామో ఒకసారి మన హృదయం ప్రశ్నించుకోవాలి.

కాఫీలకి, చాయీలకి, ప్యాకెట్ పాలకి, మద్యం, సిగరెట్లు, గుట్కా, రెస్టారెంట్లు, క్లబ్బులు, సినిమాలు, మాదకద్రవ్యాలు, అశ్లీల పాటలు, అశ్లీల నృత్యాలు, అశ్లీల చిత్రాలు—ఇవి అన్నీ సమాజంలో అదుపు తప్పిన అలవాట్లుగా పెరుగుతున్నాయి.

ఇవి కేవలం రూపాయల వృథానే కాదు…

మన భారతీయ గురుశిష్యులు మానసికంగా బానిసలు అవుతున్నాయన్నది అత్యంత బాధాకరం.

మనసులోని వెలుగు క్రమంగా చీకటిలో కలిసిపోతోంది. విలువలు క్షీణిస్తున్నాయి. నాగరికత కదులుతోంది. సంస్కృతి పతనం అంచులపై నిలబడి ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు కాదు…

మనమందరం మొత్తం చైతన్యం కలిగి నిలబడాల్సిన సమయం ఇది.

విద్యాలయాలు — మన భవిష్యత్తు పునాది

విద్యాలయాలు చిన్నారుల, యువత యొక్క మానసిక నిర్మాణానికి ఆలయాలు.

ఇక్కడి నుంచే భవిష్యత్తు భారత దేశం తీర్చిదిద్దబడుతుంది.

కానీ ఈ పవిత్ర ప్రాంగణాల్లో కూడా అనవసర ప్రభావాలు చొరబడుతున్నాయి.

అందుకే విద్యాసంస్థల్లో కొన్ని అత్యవసరమైన మార్పులు వెంటనే రావాలి.

1. యోగ – ధ్యానం తప్పనిసరి చేయాలి

యోగం, ప్రాణాయామం, ధ్యానం — ఇవి శరీరానికి ఆరోగ్యం, మానసికానికి ప్రశాంతత, మనస్సుకు ఏకాగ్రతనిస్తాయి.

వీటిని చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో అలవాటు చేయడం అత్యవసరం.

యోగం తెలుసుకున్న పిల్లాడు వ్యసనాలకు, అశ్లీలతకు, వ్యర్థ జీవనశైలులకు దూరంగా ఉంటుంది.

2. సద్గురువుల ఉపన్యాసాలు – మంచి సాహిత్య పరిచయం

రోజుకు కొద్దినిమిషాలైనా విద్యార్థులకు సద్గురు వాక్యాలు, నైతిక విలువలు, మంచి పుస్తకాల ప్రాముఖ్యత వినిపించాలి.

పాఠశాలలు ‘అధ్యాత్మిక–సాంస్కృతిక బోధన’ అనే ప్రత్యేక క్లాస్‌ను ప్రవేశపెట్టాలి.

పిల్లలకు ఏది మంచిది? ఏది చెడు?

ఏదిని అనుసరించాలి? ఏదిని దూరం పెట్టాలి?

ఈ విచక్షణా జ్ఞానం తప్పనిసరిగా నేర్పాలి.

3. శ్లోకపారాయణం — మనసుని పరిశుద్ధం చేసే మార్గం

భగవద్గీత, రామాయణం, ఆదిత్యహృదయం వంటి శ్లోకాల పారాయణం

పిల్లల్లో ధైర్యాన్ని, నీతిని, శాంతిని, చురుకుదనాన్ని పెంపొందిస్తుంది.

ప్రతి రోజు ప్రార్థన తరువాత 5 నిమిషాల శ్లోకపఠనం చేయడం విద్యాసంస్థల్లో తప్పనిసరి చేయాలి.

4. సంస్కృతం – ఆంగ్ల భాషలా తప్పనిసరి చేయాలి

సంస్కృతం అనేది మానవుడు మెరుగైన మనిషిగా మారేందుకు దోహదపడే భాష.

ఈ భాషను కేవలం బోధించటం కాదు… అనివార్యంగా నేర్పాలి.

ప్రతి పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయులు ఉండాలి.

Speaking Sanskrit (సంభాషణ సంస్కృతం) ను తప్పనిసరి చేయాలి.

ఇంట్లో సంస్కృతం మాట్లాడే శిష్యులను తయారు చేయాలి.

సంస్కృతాన్ని వ్యవహారిక భాషగా మార్చుకోవాలి.

ఇలానే మన కుటుంబాలు, పాఠశాలలు, సమాజం ఒకే శబ్దంతో మాట్లాడే రోజులు దగ్గరపడతాయి.

5. సంస్కృత మాధ్యమ పాఠశాలలు – దేశ అభివృద్ధికి నూతన దిశ

భారతదేశంలో సంస్కృత మాధ్యమ పాఠశాలలు ఏర్పాటు చేయడం అత్యవసరం.

ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు:

ఉద్యోగ అవకాశాలు

సంస్కృత బోధనలో కొత్త మార్గాలు

పరిశోధనా వ్యవస్థలు

సంభాషణ సంస్కృతం ప్రచారం

అన్నింటికీ ద్వారాలు తెరవబడతాయి.

సంస్కృత మాధ్యమం భారతదేశ భవిష్యత్తును మరింత వెలుగులోకి తెస్తుంది.

ఈ దేశం సాంప్రదాయ సౌందర్యానికి, వేదజ్ఞాన వైభవానికి పునరుజ్జీవనం లభిస్తుంది.

ముగింపు – ఇది కేవలం వ్యాసం కాదు, సమాజానికి హెచ్చరిక

ఈరోజు మనం పిల్లలను కోల్పోతున్నాం కాదు…

పిల్లలద్వారా మన భవిష్యత్తును కోల్పోతున్నాం.

విలువలు, నీతి, ధర్మం, సంస్కృతి, వినయం — ఇవన్నీ తిరిగి విద్యాలయాల్లోకి రావాలి.

సంస్కృతం, శ్లోకాలు, యోగం, మంచి సాహిత్యం — ఇవే యువతను రక్షించగల శక్తులు.

ఇది SSV SANSKRISSV SANSKRIT NEWS CHANNEL 

డాక్టర్ రాజేన్ద్రప్రసాదః 

సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవలసిన అత్యవసర అవసరం

తెలంగాణ ముఖ్యమంత్రిగారికి వినమ్ర వినతి

గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు.

మన భారతదేశ సంస్కృతి అనేది వేలాది ఏళ్ల చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అమూల్యమైన వారసత్వం. ఈ పరంపరలో యగ్నయాగాలు, వేదపఠనం, శ్లోకాల ఉచ్చారణ, సాంప్రదాయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, హరికథ–బుర్రకథలు వంటి అనేక కళారూపాలు నిర్మించబడ్డాయి.

శిశువయసు నుంచే పిల్లల్లో భక్తి, దేశభక్తి, వినయం, విలువలు, నీతిని పెంపొందించేవి.

పూర్వం ప్రతి సంస్థ, ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలో ‘యాన్యువల్ డే’ వంటి వేడుకలు జరిగేటప్పుడు పెద్దలు–చిన్నలు కలిసి యజ్ఞయాగాలు చేసి, తరువాత దేశభక్తి గీతాలు, దైవభక్తి పాటలు, సాంప్రదాయ సాహిత్యాలు వినిపించేవారు.

పిల్లలు ఆ వాతావరణంలో పెరిగి మానవత్వం, భక్తి, శిల్పం, శాస్త్రం, శాంతి, స్వయం నియంత్రణ వంటి లక్షణాలను సంపాదించేవారు.

పెద్దలు మంచి మాటలు చెప్పి, జీవితంలో నిలిచిపోయే మార్గదర్శకత్వం అందించేవారు.

అదే విధంగా కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, రామాయణ–మహాభారతాల ఆధారిత నాటికలు పిల్లల్లో ఆధ్యాత్మికతను, నైతికతను, చరిత్రజ్ఞానాన్ని పెంపొందించేవి.

ప్రస్తుత పరిస్థితి – ఆందోళనకర దృశ్యం

కాలం మారుతున్న కొద్దీ పాఠశాల–కాలేజ్ స్థాయి వేడుకల రూపం పూర్తిగా మారిపోయింది.

ఈ రోజుల్లో ‘ఫ్రెషర్స్ పార్టీ’, ‘యాన్యువల్ డే’ పేరుతో కొన్ని సంస్థల్లో అశ్లీల పదాలతో నిండిన పాటలు, 

అనుచిత నృత్యాలు, భయంకరమైన అశ్లీల ప్రదర్శనలు నిర్వహించడం కొంతమంది నిర్వాహకుల అలవాటైపోయింది.

ఇది చూస్తూ పిల్లలు నైతిక విలువలను మరచిపోతున్నారు.

మన హిందూ సంస్కృతి, భారతీయ విలువలు, కుటుంబ ధర్మాలు, సాంప్రదాయ సౌందర్యాలు మెల్లిగా నశిస్తున్నాయి.

పాఠశాల అనేది పిల్లల్లో సంస్కారం నింపే ఆలయం కావాలి. కానీ ఈ విధమైన అశ్లీల ప్రదర్శనలు ఆ విద్యాలయాల పవిత్రతను చెడగొడుతున్నాయి.

కావున ప్రభుత్వం తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు

1. పాఠశాలల్లో అశ్లీల సినిమా పాటలు, డాన్స్‌లపై తక్షణ నిషేధం

పిల్లల ఎదుగుదల, మానసిక వికాసం, నైతిక విలువల పరిరక్షణ కోసం

అశ్లీల పాటలు, అసభ్య నృత్యాలకు పాఠశాల–కాలేజీలలో పూర్తిస్థాయి నిషేధం విధించాలి.

ఈ విషయంపై మీరు వెంటనే ప్రత్యేక జి.ఓ. విడుదల చేసి, అన్ని విద్యాసంస్థలకు కఠినమైన సర్కులర్ ఇవ్వడం అత్యవసరం.

2. స్వచ్ఛమైన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రోత్సాహం

ప్రతి పాఠశాలలో క్రింది అంశాలను తప్పనిసరి చేయాలని మన వినతి:

దేశభక్తి గీతాలు

దైవభక్తి పాటలు

గురుభక్తి – మాతృభక్తిని పెంపొందించే కార్యక్రమాలు

కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ వంటి సాంప్రదాయ కళారూపాలు

రామాయణం, మహాభారతం ఆధారిత నృత్యనాటికలు

యజ్ఞయాగాది పూజల ప్రదర్శనలు వినిపించాలి చూపించాలి

సద్గురువులు, పండితులు ఇచ్చే సత్ప్రవచనాలు వినిపించాలి

ఇవి పిల్లల నైతిక వికాసానికి అమూల్యమైనవి.

3. సంస్కృత భాషను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి

సంస్కృతం భారతీయ సంస్కృతికి మూలాధారం. అందువల్ల:

పాఠశాలల్లో సంస్కృతాన్ని ఆంగ్లం లాగానే అనువాద ఆధారిత పద్ధతిలో సులభంగా నేర్పాలి.

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సంభాషణ–సంస్కృతం బోధించే గురువులను నియమించాలి.

పిల్లలకు శ్లోకాలు మంత్రాలు స్తోత్రాలు సూత్రాలు అనేవారంగా నేర్పించాలి. పిల్లలను గొప్ప భక్తులను కవులను పండితులను ఋషులను చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతాన్ని రాజ్యాధికార భాషగా చేయాలనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలి.

దీర్ఘకాల దృష్టిలో భారతదేశ స్థాయిలో సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి మీ ప్రతిపాదనగా పంపించాలని అభ్యర్థించుకుంటున్నాము.

ముగింపు

మన మూలసంస్కృతి, మానవ విలువలు, భారతీయ ఆత్మీయతను కాపాడుకోవడం ప్రతి ప్రభుత్వ ప్రాధమిక బాధ్యత.

పిల్లలు దేశభక్తి, ధర్మభక్తి, మానవత్వం, క్రమశిక్షణతో ఎదగాలంటే విద్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాలు శుభ్రమైనవిగా, శాస్త్రీయ–సాంస్కృతిక పరిరక్షణకు దోహదపడేవిగా ఉండాలి.

కావున, పైన పేర్కొన్న సూచనలపై గౌరవ ముఖ్యమంత్రిగారు దృఢ నిర్ణయం తీసుకొని జి.ఓ. విడుదల చేస్తారని మనసారా ఆశిస్తూ నిర్వహించుచున్న వినమ్ర అభ్యర్థన ఇది.

మంచినే చూపెట్టాలి మంచినే వినిపించాలి మంచి మాటలనే పలికించాలి మంచి చేష్టలనే చూపించాలి

పిల్లలతో అయ్యప్ప మాలలు శివ మాలలు నరసింహస్వామి మాలలు హనుమంతుని మాలలు వేయించి భజనలు చేయించాలి పూజలు నేర్పించాలి

ఇట్లు

డాక్టర్ రాజేంSSV SANSKRIT NEWS CHANNEL 

డాక్టర్ రాజేంద్రప్రసాదః

సంస్కృతభాషా గురుశిష్య సంఘః (రాజ్యరాష్ట్ర అధ్యక్షః)

SSV Sanskrit News Channelద్రప్రసాదః

సంస్కృతభాషా గురుశిష్య సంఘః (రాజ్యరాష్ట్ర అధ్యక్షః)

SSV Sanskrit News ChannelT NEWS CHANNEL తరఫున

సమాజ పునరుజ్జీవనానికి, ధర్మ కాపాడటానికి చేసిన వినయపూర్వక పిలుపు.

ముకుందమాల

  ముకుందమాల-. సౌందర్యమాల 

••••••••••••••••••••••

        సామాన్యముగా గ్రంథవ్యాప్తికిగ్రంథమందలి విషయముసార్వజనీన 

ముగా నుండుట ముఖ్య కారణము. విషయ వైశద్యమునకు దోడు సరసమైన శైలియు గూడిన ఇక చెప్పవలసిన పనియులేదు. బంగారానికి సువాసన అబ్బినట్లే ద్రాక్షాపాకమునబడిన వాల్మీకి వ్యాసకాళిదాసాది కృతులు సర్వ వ్యాపకమగుటయు , నారికేళ పాకమువంటి బిరుసు పాకమున బడిన భారవి శ్రీహర్షాదుల గ్రంథాలుకేవలంవిద్వాల్లోక వ్యాప్తం. ఇది విద్వాoసులు ఎరిగిన విషయమే. వేమన , పద్యాలు , సుమతి , కృష్ణ , దాశరథి శతకాలు తెలుగునాట బహుళ వ్యాప్తి చెందినవి. కానీ నూర్లకొద్ది నున్నశతకాలు వీటిలా ఎన్నివ్యాప్తి చెందినాయి ? నిజముగాఁజూచిన అర్థాలంకార వస్తుధ్వని భూషితములే గాక యవికొన్ని చిత్రాలంకార విచిత్రములై యున్నవే. మరి ! వ్యాప్తిలేకుండుటకు ఏమి కారణము ? వాని శైలి సర్వజనాకర్షకముగా ఉండకుండుటయే. చెప్పవలసిన విషయమును సూటిగా పాఠకుని హృదయమున హత్తుకొనునట్లు చెప్పలేకపోవుటయే. పోతనభాగవతమునకుగల ప్రచారము తక్కిన గ్రంథ రాజములకు లేకపోవడమే ప్రధాన కారణము. " ముకుందమాల విశ్వభారతమున వ్యాపించి తావులు గుబాళించుటకు మూలకారణము దాని సారళ్యమే. కాశ్మీరములో జనించిన కుంకుమపూవువలె కాశీలో ప్రవహించు గంగవలె కేరళలో ఉదయించిన ఈ ముకుందమాలయు సర్వభక్త సేవ్యమైనది. అకృత్రిమముగా , అప్రయత్నముగా భక్తాగ్రేసరుడగు శ్రీ కులశేఖరుని పరిపక్వ హృదయమునుండి వెల్లి విరిసి ముకుందుని కంఠ సీమ వనమాలయై మెరిసినది ఈ కుందమాల. పుష్పపరిమళమును గ్రహించుటకు పండిత పామర లొక్కతీరున సమర్థులైనట్లు లలితములైన ముకుందమాలను ఆ బాలగోపాలము ధరించి ఆనందింపగలిగిరి.

శ్రీల ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷

ఈ శ్లోకంలో "ఎల్లప్పుడూ మేల్కొని మరియు అజ్ఞానం నుండి విముక్తి" అనే అర్థం వచ్చే అనిద్రం అనే పదం చాలా ముఖ్యమైనది. 

భగవద్గీత (15.15)లో చెప్పబడినట్లుగా, మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ: భగవంతుడు అందరికీ తెలివిని ఇచ్చేవాడు మరియు అందరినీ మరచిపోయేలా చేస్తాడు కూడా. 

లక్షలాది మరియు కోట్లాది జీవులు ఉన్నాయి, మరియు భగవంతుడు వారికి దిశలను ఇస్తాడు. 

అందువల్ల అతనికి నిద్రించడానికి సమయం లేదు, మరియు అతను మన కార్యకలాపాల గురించి ఎప్పుడూ అజ్ఞానంలో ఉండడు. 

ప్రభువు ప్రతిదానికీ సాక్షి; 

ప్రతి క్షణం మనం ఏమి చేస్తున్నామో అతను చూస్తాడు. 

భగవంతుడు కర్మల వలన ఏర్పడే శరీరంచే కప్పబడడు. 

మన శరీరాలు మన గత కర్మల (కర్మణ దైవ-నేత్రేణ) ఫలితంగా ఏర్పడతాయి, కానీ దేవాడిదేవుడైన భగవంతునికి భౌతిక శరీరం లేదు, అందువల్ల ఆయనకు అవిద్య, అజ్ఞానం లేదు. 

అతను నిద్రపోడు, కానీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా మరియు మెలకువగా ఉంటాడు.

(శ్రీమద్ భాగవతం, స్కందము.8

అధ్యాయం.5, వచనం.27)

హరే కృష్ణ 

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

కరుణించు సర్వవేళల

  *జై శ్రీమన్నారాయణ*

*1. కం . కరుణించు సర్వవేళల*

*కరుణించును సర్వజనుల కాంచుచు నుండున్*

*కరుణాకరుడగు విష్ణువు*

*పరమాత్మగ నమ్ముకొనుము వదలక నెపుడున్*

 *2. కం.దామోదరుడగు విష్ణువు*

*నామంబును మరవకుండ నాలుక పైనన్*

*నే మాత్రము విడవకెపుడు*

*ధీమాగా బ్రతకవచ్చు తెలివిగ నెపుడున్*

*3. కం.నీవే గతి యని నమ్మితి*

*నీవున్నను నాకు చాలు నిలుపుట కొరకై*

*నీవే నా రక్ష యనుచు*

*జీవితకాలంబు నంత సేవలు చేయన్*

 *4. కం. జీవాత్మల రక్షించెడు*

*దైవానివి నీవు మాకు దారిని చూపన్*

*సేవింతు సర్వకాలము* 

 *దేవాలయము చేరినాను దీనుడ నగుచున్*

*5 

కం. భగవంతుని నామంబును* 

*నగణితముగ జపము చేసి యాచారముతో*

*పగలను ద్వేషము వీడిన* 

*సుగమం బౌద్ధ పరమ పదము చొప్పున దొరుకున్*

*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*