12, జనవరి 2026, సోమవారం

వీరుడెవరో తెలుసా

  #మహమ్మద్ గజనీకి 

మృత్యువు దారి చూపిన వీరుడెవరో తెలుసా..?

*****************************************


#గుజరాత్ ఇసుక తిన్నెల్లో ఒక మర్చిపోయిన కథ దాగి ఉంది. మహమూద్ గజనీ వంటి క్రూర పాలకుడు తన జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేసిన ఒక అజ్ఞాత హిందూ యువకుడి గాథ ఇది. #సోమనాథ్ ఆలయ విధ్వంసం గురించి అందరికీ తెలుసు, కానీ తన ప్రాణాలను అర్పించి సోమనాథుడికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న ఆ హిందూ యువ వీరుడి పేరు చరిత్రలో ఎవరికీ కనిపించదు. ఇది కేవలం కథ కాదు, విశ్వాసం ప్రతీకార రూపం దాల్చిన ఒక సజీవ సాక్ష్యం..


ఈ కథ సా.శ.1025లో మొదలవుతుంది. మహమూద్ గజనీ తన క్రూరమైన సైన్యంతో గుజరాత్‌పై దండెత్తాడు. 1026 జనవరి ప్రారంభంలో అతడు సోమనాథ్ ఆలయంలోని అపారమైన సంపదను దోచుకోవడమే కాకుండా, పవిత్ర జ్యోతిర్లింగాన్ని కూడా ధ్వంసం చేశాడు. భారతీయ నాగరికత చరిత్రలో ఇది అత్యంత బాధాకరమైన ఘటనలలో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది..


ఆలయ విధ్వంసం తర్వాత, గజనీ లక్షల దీనార్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలను గుర్రాలు, ఏనుగులు, ఒంటెలపై వేసుకుని గుజరాత్ నుండి బయలుదేరాడు. ఎండలు ప్రారంభం అయ్యేలోపు త్వరగా సింధ్ ప్రాంతానికి చేరుకోవాలని అతను కచ్ రణ్ (ఎడారి) మార్గాన్ని ఎంచుకున్నాడు. అది అత్యంత ప్రమాదకరమైన, మండుతున్న ఇసుక మైదానం. అక్కడ చుక్క నీరు గానీ, నీడ గానీ దొరకదు. ఆ సమయంలో ఒక స్థానిక హిందూ యువకుడు గజనీ వద్దకు వచ్చి, తాను మార్గదర్శిగా (Guide) ఉండి దారి చూపిస్తానని చెప్పాడు. ధనాశతోనో లేదా భయంతోనో ఆ యువకుడు దారి చూపడానికి వచ్చాడని గజనీ నమ్మాడు. కానీ ఆ యువకుడికి అది ఒక ధర్మయుద్ధం..


ఆ యువకుడు గజనీ సైన్యాన్ని తీసుకుని రోజుల తరబడి మండుతున్న ఎడారిలో తిప్పాడు. నెత్తిన నిప్పులు కురిపించే సూర్యుడు, అడుగు పెడితే కాళ్లు కాలే ఇసుక. గుర్రాలు, ఒంటెలు అలసిపోయి పడిపోయాయి. సైనికులు దాహంతో అల్లాడిపోయారు. ఎన్ని రోజులైనా నీరు కనిపించకపోయేసరికి గజనీ ఆ యువకుడిని పిలిచి నీరు ఎక్కడ అని నిలదీశాడు. ఆ యువకుడి ముఖంలో భయం లేదు, పైగా ఒక చిన్న చిరునవ్వు ఉంది..


ఆ యువకుడు శాంతంగా ఇలా సమాధానం ఇచ్చాడు: “నా ప్రాణం ఎప్పుడో సోమనాథుడికి అంకితం అయిపోయింది. నేను బతికినా చచ్చినా నాకు పట్టింపు లేదు. కానీ నువ్వు నా దేవుడిని, నా ఆలయాన్ని అవమానించావు. ఆ పాపానికి శిక్ష ఈ ఎడారిలోనే నీకు లభిస్తుంది. మిమ్మల్ని అందరినీ దాహంతో తల్లడిల్లి చనిపోయేలా చేయడానికే నేను కావాలని మిమ్మల్ని ఈ ఎడారి నడిబొడ్డుకు తీసుకువచ్చాను..”


ఈ మాటలు విన్న గజనీ ఆగ్రహంతో ఊగిపోయి తన కత్తితో ఆ యువకుడి శిరచ్ఛేదం చేశాడు. 'జై సోమనాధ్' అంటూ ఆ వీరుడు ప్రాణాలు వదిలాడు కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గజనీ సైన్యంలోని వేలాది మంది సైనికులు ఆ ఎడారిలో దాహంతో అల్లాడి ప్రాణాలు విడిచారు. గజనీ స్వయంగా ప్రాణాలతో బయటపడ్డా, తన సైన్యాన్ని మరియు అహంకారాన్ని ఆ ఇసుకలోనే వదిలేయాల్సి వచ్చింది..


చరిత్ర ఆ వీరుడి పేరును నమోదు చేయలేకపోయినా, అతని త్యాగం అమరమైంది. ఎటువంటి సైన్యం, ఆయుధాలు లేకపోయినా కేవలం తన సంకల్పం మరియు విశ్వాసంతో ఒక గొప్ప ఆక్రమణదారుని గర్వాన్ని అతను అణచివేశాడు. ఈ ఘటన గురించి పర్షియన్ చరిత్రకారుడు మిన్హాజ్-ఎ-సిరాజ్ జుజ్జాని రాసిన ‘తబకాత్-ఎ-నాసిరి’ పుస్తకంలో ప్రస్తావించబడింది. ఇటీవలే సోషల్ మీడియాలో సావిత్రి ముముక్షు (@MumukshuSavitri) చేసిన పోస్ట్ ద్వారా ఈ వీరగాథ మళ్ళీ వెలుగులోకి వచ్చింది..


జై శ్రీరామ్ 🚩🙏


(సేకరణ పోస్టు)

అద్భుతమైన ఉద్యోగం…

 🌟 బ్రేకింగ్ న్యూస్: పిల్లలు చివరకు కనుగొన్నారు — ప్రపంచంలోనే అద్భుతమైన ఉద్యోగం… అది “తాతయ్య” కావడం! 😁🌹🎉


ఒక చిన్నారికి పాఠశాలలో ఒక వ్యాసం రాయమన్నారు —

“నా భవిష్యత్తు ఆశయం” (My aspirations)


అతను రాసాడు —

నేను అధ్యక్షుడు (President) కావాలనుకోవట్లేదు,

డాక్టర్ కావాలనుకోవట్లేదు,

సైంటిస్ట్‌ (Scientist) కావాలనుకోవట్లేదు,

ఏవీ కాదు!


నా భవిష్యత్తు ఆశయం — తాతయ్య కావడం!

ఎందుకంటే తాతయ్యగా ఉండడం అంటే చాలా గొప్ప విషయం! ❤️


ఎందుకంటే నా తాతయ్య —


🌞 ఉదయాన్నే ఆలస్యంగా లేచొచ్చు,

😴 మధ్యాహ్నం నిద్రపోవచ్చు,

📺 సాయంత్రం టీవీ చూసి తొందరగా పడుకోవచ్చు.


📚 హోంవర్క్‌ లేదు,

🎒 వేసవి సెలవుల్లో అసైన్‌మెంట్‌ లేదు,

📘 ట్యూషన్‌ కూడా లేదు.


☘️ ఏ పని లేకపోతే చెట్టు కింద కూర్చొని గాలి తాగొచ్చు,

♟️ లేక పార్క్‌కి వెళ్లి ఎవరో తోడు చెస్‌ ఆడొచ్చు.


🎮 వీడియో గేమ్స్‌ ఎంతసేపైనా ఆడొచ్చు — ఎవరూ ఏమీ అనరు!


☕ ఉదయం కాఫీ,

🍵 మధ్యాహ్నం టీ,

🍷 రాత్రి వైన్‌ — దేవుడిలా ఆనందంగా గడపొచ్చు.


🚌 బస్‌లో ఉచిత ప్రయాణం,

💺 అదృష్టముంటే ఎవరో సీటు కూడా ఇస్తారు.


🚄 హైస్పీడ్ ట్రైన్‌, సినిమాలు — అర్థ ధర!


🍱 తినాలనిపించినది తినొచ్చు —

వేడి వంటలు: ఉల్లిపాయ పకోడీలు, రైస్ కేక్‌, టెంపురా, సూప్‌, టోఫూ, గ్రిల్‌డ్ సాసేజ్‌, రాడిష్‌ కేక్‌ వంటివి.

చల్లని వంటలు: టోఫూ పుడ్డింగ్‌, షేవ్డ్‌ ఐస్‌, పపయా మిల్క్‌, ఐస్‌క్రీమ్‌, జెల్లీ, పుడ్డింగ్‌, మూంగ్‌ బీన్‌ జెల్లీ, చీజ్‌ —

ఎంత తిన్నా ఎవరూ ఆపరు (చాలా తినకపోతే 😉).


🎨 ఏది చేయాలనిపిస్తే అదే చేయొచ్చు —

పాడొచ్చు, డ్యాన్స్‌ చేయొచ్చు, పెయింటింగ్‌ వేయొచ్చు, పియానో లేదా ట్రంపెట్‌ వాయించొచ్చు, పర్వతారోహణ చేయొచ్చు, ట్రెక్కింగ్‌ వెళ్లొచ్చు!


💰 జేబులో డబ్బు ఉంటే, ప్రపంచం చుట్టూ ప్రయాణం కూడా చేయొచ్చు!


✨ తాతయ్యగా ఉండటం అంటే నిజంగా అద్భుతమైన విషయం!


🌼 ప్రేరణ:

తాతయ్యలు తామెంత సంతోషంగా ఉన్నారో వారికి కూడా తెలియదు! 😄


🌹👍 ఈ గ్రూప్‌లో ఉన్న అన్ని తాతయ్యలకూ, అమ్మమ్మలకూ హృదయపూర్వక నమస్కారాలు! 💖


— “Being a Grandfather is the ultimate dream job!” 😁

చేతులు కాలినాక ఆకులు

   







చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభంలేదు


*Sugar side effects వచ్చిన తర్వాత చింతించి లాభంలేదు* 



మధుమేహం - *షుగర్ /sugar* సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం

#########################

ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.

—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.

—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.

—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు

–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.

—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.

—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.

—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.

—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.

-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.

—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.

—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.

—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.

“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును

ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు


పొడపత్రి ఆకు

నేలవేము సమూలం

తిప్పతీగ లావుది

మానుపసుపు బెర డు

నేరేడు గింజలు

మోదుగపువ్వు,

లోద్దుగ బెరడు,

వేగిస బెరడు

నేలతంగేడు,

మారేడు,

ఉసిరి

నల్లజిలకర

కలోంజీ 

కటుకరోహిణి

సప్తరంగి

ఒద్ది బెరడు

శిలాజితు

వంగభస్మము


Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.

సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి

🏀సూచన: 

మీరు  తయారుచేసుకోలేనప్పుడు. 

మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము. 

1250+100 courier for one month


❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️

ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

:

సుఖ-దుఃఖాలని

విబుధ వరుడు!

  *తే.గీ.* 

భారత వివేక విజ్ఞాన విబుధ వరుడు!

దేశ దేశాల వైదుష్య దివ్య ధనుడు!

రామకృష్ణుని చరణాల రమ్య ఘనుడు!

వేద వేదాంత సార సవిస్తరుండు!

గత్వాగోగణపృష్టతః

  గత్వాగోగణపృష్టతః విపినమాహారగ్రహీతానిదం

గోపాలాన్వయమాగతోత్వమితిపుణ్యంప్రాప్నువంతోవయం

సత్సంపన్న సుబంధమచ్యుతమిదమస్మాభిః తవశ్రీకరం

ప్రేమ్నా త్వాంలఘునామభిఃవయమబోధామహ్యమర్యాదయాऽ

స్మాన్ క్షమస్వపరందదాతుకృపయా!గోవింద!కోపం త్యజ!



పశువులవెనుక నడవిలోనశనము దిను

గోప కులమున పుణ్యపు గొప్ప నీవె 

కొరతలేని గోవిందుడ! పరను ఇచ్చే

నిన్ను చిన్నపేరుల బిల్చి యున్న మాకు 

బాలలకునీకుబంధము బాయదెపుడు

నిత్యపద్య నైవేద్యం

 *నిత్యపద్య నైవేద్యం-2096 వ రోజు*

*మంచిమాటకు మంచి పద్యం-365. సేకరణ, పద్యరచన,  సహజకవి, డాక్టర్ అయినాల  మల్లేశ్వరరావు* , తెనాలి, 9347537635, *గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ,తెనాలి*


*మంచి మాట:*

అదృష్టమంటే ఆస్తిపాస్తులు కాదు. చేతి నిండా పని, కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలు పంచుకునే సన్నిహితులు ఉండటం. 

  

 *తేటగీతి*

చేతి నిండుగ పనియున్ను చేయుటకును, 

కడుపు నిండుగ తిండియు గడచుటకును, 

కంటి నిండుగ నిద్రయు.. కలుములనగ 

మనసుదీరగ వినువయ్య *మల్లి* మాట.

పంచాంగం

  



పరులోడినచో నవ్వకు

  *నేటి సూక్తి* 


 *ఇతరుల ఓటమిని చూసి నవ్వేవారు జీవితంలో ఏదీ సాధించలేరు, తన ఓటమిలో కూడా నవ్వేవారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు.*


*క్రాంతి కిరణాలు*


 *కం.పరులోడినచో నవ్వకు* 

*పరాభవ విజయము రెండు పరిపాటేగా*

*అర నిమిషమ్మున మారును* 

*నర జీవితమందు మార్పు నడుచుచు నుండున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

సంక్రాంతి పండుగ

  2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ 

జనవరి 15న రావడం ప్రారంభమయింది.


అంతకుముందు1935 నుండి 2007వరకు జనవరి 

14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాత

కు మారుతుంది.

 

1935 నుండి 2007 వరకు జనవరి 14న,

2008 నుండి 2080 వరకు జనవరి 15న,

2081 నుండి 2153 వరకు జనవరి 16న 

సంక్రాంతి పండుగ వస్తుంది.


ఎందుకిలా అంటే, సాధారణంగా, సూర్యుడు ధనూ

రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిననాడే మకర 

సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు 

నుండి మిధునరాశికి ప్రవేశించేదాకా ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా వ్యవహరిస్తారు.


ఇక, సూర్యుడు ప్రతీసంవత్సరం మకరసంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. 

స్థూల గణన ఆధారంగా ఇది 3 సంవత్సరాలకు 

ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.


ఈ లెక్కన, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం, 72 ఏళ్లకు

ఒకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. 

జనవరి 16న సంక్రాంతి రావడం మొదలవుతుంది