10, నవంబర్ 2020, మంగళవారం

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 10  / Sri Devi Mahatyam - Durga Saptasati - 10 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 3*

*🌻. మహిషాసుర వధ - 1 🌻*


1. ఋషిపలికెను : 

2. అంతట తన సైన్యం నాశనమవడం చూసి సేనాని అయిన చిక్షురమహాసురుడు అంబికతో యుద్ధం చేయడానికై కోపంతో వచ్చాడు. 


3. మేరుపర్వతశిఖరంపై మేఘం ఎలా వర్షం కురిపిస్తుందో అలా యుద్ధంలో అసురుడు ఆ దేవిపై బాణవర్షం కురిపించాడు.


 4. అంతట దేవి అవలీలగా ఆ బాణసమూహాన్ని ఛేదించివేసి, తన బాణాలతో అతడి గుజ్జలను, గుజ్జాలను తోలేవాణ్ణి చంపింది.


5. వెంటనే ఆమె అతని ధనుస్సును, మిక్కిలి ఎత్తైన ధ్వజాన్ని ఛేదించి, విరిగిపోయిన ధనుస్సు గల అతని శరీరాన్ని బాణపు పోటులచేత గ్రుచ్చివేసింది.


6. విల్లు త్రుంపబడి, రథం లేక, గుజ్రాలూ సారథి చంపబడగా ఆ అసురుడు ఖడ్గాన్ని, డాలును ధరించి ఆ దేవిపైకి ఉరికెను.


7. అతివేగంగా అతడు మిక్కిలి పదను గల తన కత్తివాదరతో సింహం తలపై కొట్టాడు. దేవిని కూడ ఆమె ఎడమభుజంపై కొట్టాడు.


8. రాజకుమారా! అతని ఖడ్గం ఆమె భుజాన్ని తాకడంతోనే ముక్కలుగా విరిగిపోయింది. అతడు అంతట కోపంతో కళ్ళు ఎఱ్ఱబారి శూలాన్ని తీసుకున్నాడు.


9. ఆ మహాసురుడు అంతట ఆ శూలాన్ని, జాజ్వల్యమాన తేజోయుక్తమైన దానిని, ఆకాశం నుండి సూర్యబింబాన్ని విసరినట్టు, భద్రకాళి పై  విసిరాడు. 


10. తన మీదికి వస్తున్న ఆ శూలాన్ని చూసి దేవి తన శూలాన్ని విసరగా అది ఆ శూలాన్ని, ఆ మహాసురుణ్ణి నూరు ముక్కలుగా ఖండించింది.


11. మహిషాసురుని సేనానియైన మహావీరుడు వధితుడవడం వల్ల వేల్పులను నొప్పించడానికై చామరుడు ఏనుగునెక్కి (దేవిని) మార్కొనెను. 


12. అతడు కూడా తన భల్లాన్ని అంబికాదేవిపై విసిరాడు, ఆమె వెంటనే ఒక హుంకారంతో (“హుమ్” అను శబ్దంతో) దాన్ని ఎదిరించి అది కాంతివిహీనమై నేలపై పడిపోయేటట్లు చేసింది.


13. తన భల్లం విరిగి నేలకూలడం చూసి చామరుడు కోపంతో ఒక శూలాన్ని విసిరాడు. ఆమె దాన్ని కూడా తన అమ్ములతో త్రుంచివేసింది.


14. సింహం అప్పుడు పైకి ఎగిరి ఏనుగు కుంభస్థలమధ్యలో కూర్చొని, ఆ సురవైరితో బాహు యుద్ధం చేసింది. 


15. పోరాడుతూ వారిరువురూ ఏనుగుపై నుండి దూకి మహా ఘోరంగా యుద్ధంచేస్తూ ఒకరినొకరు మిక్కిలి భయంకరంగా కొట్టుకున్నారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమహాత్మ్యము 


            మొదటి అధ్యాయము 


తే  1

శ్రీకరంబైన నైమిశక్షేత్రమందు 

శౌనకాదిగ  వరలెడి సకలమునులు 

వివిధకథలను సూతుచే వినుచునుండి 

వినయమొప్పగ నడిగిరి వేడు కొనుచు 

               

తే   2

"ఎట్టి వ్రతమును జనములు నిలను సేయ 

కామితార్థంబు కల్గును కలియుగమున 

వినగ కోరిక జనియించె  విబుధవర్య ! 

తెలియపరచుడు వినెదము తీరు గాను      

 

కం   3

మునిసంఘము లీరీతిగ 

ఘను సూతును నడిగినంత కడుయుత్చుకతన్ 

విని సూతుడు చిఱునగవుతొ  

ననెమునులతొ నంతటిటుల యానందముతోన్ ;


ఆ   4

నారదుండు దొల్లి  నారాయణుని జూచి 

యివ్విధంబు నడుగ నెరుగ దలచి

మునిని గాంచి యపుడు ముదమంది శ్రీహరి 

నుడివినట్టి  నుడులు నుడివె దిపుడు      

                     

కం.    5

సురముని నారదు డొకపరి 

హరినామము బాడుకొనుచు నవనకి జనియున్   

నరు లచ్చట పలువెతలతొ 

కరమరుదుగబ్రతుకుచుండ  గాంచెను వ్యధతోన్ 


సీ.   6

ఈతి బాధలతోడ నిక్కట్లు పడుచును

                 నకనకలాడెడి నరుల గాంచె 

తనురుగ్మతలతోడ తల్లడిల్లుచు మిగుల 

                 నడయాడుచుండెటి నరుల గాంచె 

ఆత్మశాంతియులేక  నలమట నొందుచు 

                 నలుగుచుండెడి పెక్కు నరుల గాంచె 

ఋణ విత్త బాధల కృశియించి బ్రతుకున

                 నానా వెతలనున్న నరుల గాంచె 

    తే

    నరులు పడియెడి బాధలు నారదుండు 

    కన్నులారంగ జూచియు కడు వ్యదొంది 

    మానవుల బాధ పోగొట్ట మదిని దలచి 

    కదలె వైకుంఠపురముకు గాంచ హరిని 


కం.   7

నారదు డట జని కాంచెను 

నారాయణు శేషతల్పు నవ్యామ్బరునిన్ 

నీరద తను సంకాసుని 

శ్రీరమ సంసేవ్య పాదు శ్రీత మందారున్ 


కం.   8

నారద సంయమి యంతట 

నారాయణు నెదుట నిలిచి నతమస్తకుడై 

ధారాళ మైన నుడులతొ 

యీ రీతిగ ప్రస్తుతించె యీప్సిత మదితోన్ 


మ ద్వి.  9

"శ్రీకరా !శుభకరా !శ్రీచిద్విలాస!

శ్రీ లక్ష్మి సంసీవ్య ! శ్రీ వత్స చిహ్న ! 

కామితార్థ ప్రదాత ! కౌస్తుభ భూష !

వాసుదేవా ! హరీ ! వైకుంఠ వాస  !

శంఖ గదా చక్ర శార్ఙ్గ సంకాశ !

యభయ వరద హస్త యాస్రితపోష !

దేవదేవ ! వరద ! దివ్య ! జీవాత్మ !

దేవవంద్య ! వినుత ! తేజితదేహ !

పరమపురుష ! విష్ణు ! పావననామ !

జయము నారాయణా ! జగదీశ ! విష్ణు !

మాధవా ! కేశవా ! మధుకైటబారి !

శ్రీధరా !గోవింద! శ్రీహృషీకేశ !

వాసుదేవా ! హరే ! వామన ! విష్ణు ! 

యనిరుద్ధ ! ప్రద్యుమ్న ! యచ్యుతా ! దేవ !

నారాయణా ! విష్ణు ! నళినాయ తాక్ష !

పురుషోత్తమా ! దివ్య ! పుండరీకాక్ష !

పాహిమాం పాహిమాం పరమాత్మ! దేవ !

గో విప్ర రక్షకా ! గురుమీన రూప !

కౌస్తుభ మణిహార ! కచ్ఛప రూప !

గోపాల పాలకా ! క్రోడంబ రూప !

నారాయణా ! హరీ ! నరహరి రూప !

వందిత విక్రమా ! వామన రూప !

పృధివీశబలహరా  ! భృగురామ రూప !

రాజీవలోచనా ! రఘురామ రూప !

పాలితయాదవా !బలరామ రూప !

శ్రీచిద్విలాస యో శ్రీకృష్ణ రూప !

వినుతింతు మనసార విష్ణు స్వరూప !

కామితార్థప్రదాత !కరుణించు మమ్ము 

జయము నారాయణా ! జయము యో దేవ !"


కం.   10

సురముని నారదు స్తుతులను 

సిరినాథుడు విష్ణు వినియు స్థిఱ నగవులతోన్ 

పరికించుచు యాతని గని 

కరుణతొ యిట్లనియె నపుడు కడు శాంతమునన్ 


తే.   11

"విమలమానస నారదా ! యేల యిపుడు *

కూర్మితోడను నీవిట కొచ్చినావు ? 

తెల్పు నీకోర్కె యేదైన దీర్తు నిపుడె 

తేటతెల్లంబుగా నీవు దెల్పవయ్య "


కం.   12

నారాయణు డా విధముగ 

కారుణ్యము తోడ బలుక, కడు పులకితు డై 

నారదు డన్తట  భక్తితొ 

యీ రీతిగ బలికె మిగుల వినయము తోడన్ 


సీ  13

"సర్వజ్ఞు డవునీవు సర్వేశ !పరమేశ !

              నీ వెఱుంగని దేది నీరజాక్ష !

మర్త్య లోకమునందు మనుజులుపెక్కురు 

              పలుయోనులందున ప్రభవమొంది 

వివిధ యిడుములందు విధిదప్పి పడుచుండి 

               యనుభవించుచునుండె యమితవగపు 

పాపకర్మలతోడ పలురోగములతోడ 

               పీడింప బడుచుండె పెక్కురీతి 

యమిత బాధల క్లేశాల యనుభవమున 

మహిని జీవించుచున్నట్టి మానవులకు 

బాధలను బాప నేదైన పరమపథము 

బోధజేయగ గోరుదు పురుషశ్రేష్ఠ !"


కం 14

ముని నారదు డావిధముగ 

వినయంబున ప్రభునిగాంచి వేదన తోడన్ 

జనముల బాధలు దెలుపగ 

విని మనమున మెచ్చుకొనియు విష్ణుండనియెన్ 


కం  15

"మునివర ! నీ యభిమతమును 

విని సంతస మొందినాను వేడుక యయ్యన్ 

జగముల క్లేశము బాపగ 

మనమందున దలచు నిన్ను మది శ్లాఘింతున్ 


తే గీ 16

లోక కల్యాణమును గోరి తేకువగను 

యమిత యావేదనంబున యడుగ జూచి 

సంతసంబయ్యె నాకెంతొ సంయమీంద్ర ! 

వినుము దెల్పెద నీకొక్క విమల పథము 


కం 17

వినుమో నారద ! తెల్పెద 

మనమందున కలతమాని మదిస్థిమితమునన్ 

జనులందఱు సుఖ శాంతుల 

మనగల రీ పుణ్య వ్రతము మఱి చేయంగన్ 


తే గీ  18

కామితార్ధ ప్రదాయిని కల్పతరువు 

"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు"

యిహమునందున సుఖశాంతు లిచ్చితుదకు 

పరమునందున మోక్షపుప్రాప్త మిచ్చు

ధార్మికగీత - 76

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲 

                          *ధార్మికగీత - 76*

                                    *****

      *శ్లో:- అరా  వప్యుచితం కార్యం ౹*

             *ఆతిథ్యం  స్వయమాగతే  ౹*

             *ఛేత్తు:  పార్శ్వగతాం ఛాయామ్ ౹*

             *నోపసంహరతే  ద్రుమః  ౹౹*

                                  *****

*భా:- అల్పులకు తన, పర అనే భావం నరనరాన జీర్ణమై ఉంటుంది. ఉదారచరితులు లోకమంతటిని తమ కుటుంబంగా భావిస్తుంటారు. శత్రువైనా సరే ఈర్ష్యాద్వేషాలను, భేషజాన్ని ప్రక్కన పెట్టి, మన ఇంటికి తనంతట తానుగా ఒక మెట్టు దిగి వచ్చినపుడు చుట్టంగా భావించి, చక్కని అతిథి మర్యాద చేయడం మంచిపని. అది విజ్ఞతకు, విచక్షణకు శుభసూచకము. ఎలా అంటే  మహావృక్షం కూడా తనను పెద్దగొడ్డలితో  కట్టెలనిమిత్తం నరకడానికి వచ్చిన వాడికి కూడ ప్రక్కనే బాసటగా ఉన్న తన   నీడను ఉపసంహరించుకోవడం లేదు. చల్లదనాన్ని  ఇవ్వడం మానుకోదు. ఫలాలను తినవద్దనడం లేదు. పూలను కోసుకోవద్దనడం లేదు.  కర్ణుడు తన ప్రాణాలకు ముప్పని తెలిసినా కవచ కుండాలాలను శత్రుభావనతో వచ్చిన  ఇంద్రునికి ఇవ్వడం మానుకోలేదు. ఆవులు, గేదెలు తమను చంపే వాడికి కూడా పాలివ్వడం మానుకోవుగదా! లోకంలో ఉదారులకు తన,పర భేదం లేకుండా సాయపడడమే సహజగుణమని సారాంశము. చంపదగినవాడికి కూడా మేలు చేసి పంపడమే మేలని వేమన ఉద్భోధించడం  గమనార్హము*.

                                  *****

                   *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

*బ్రౌన్ పుట్టినరోజు 10.11.1798*



 *బ్రౌన్ పుట్టినరోజు 10.11.1798* 


ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ 1817, ఆగస్ట్‌ 13. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి!


(నవంబర్ 10, 1798 ) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.


12 డిసెంబర్‌ 1884న అవివాహితుడిగానే తన 87వ యేట లండన్‌లోనే కన్ను మూశారు.

కుటుంబం - సంసారం వంటి బంధనాల్లో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా తెలుగు భాషా సాహిత్యాలకు, తెలుగు ప్రజలకు తనను తాను అర్పించుకున్న మహనీయుడు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌! డాక్టర్‌ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి కడపలో బ్రౌన్‌ స్మారక గ్రంథాలయం నెలకొల్పారు. బ్రౌన్‌ జీవితం - సాహిత్య కృషి గురించి పరిశోధించి, విషయాలు తరువాతి తరాలవారికి అందించారు. జానుమద్దిగారితో గతంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, కొన్ని సాహిత్య సభల్లో ఆయన్ని కలుసుకోగలగడం మరువలేని జ్ఞాపకాలు! బ్రౌన్‌ను తనలో ఆవహింపజేసుకున్నవాడిగా ఆయన కనబడేవారు. ప్రతి రంగంలోనూ త్యాగధనులు ఉంటారు. వారి కృషిని కనీసం స్మరించుకోవడం మనుష్యులైన వారి కనీస కర్తవ్యం.


Stay Safe. 👍

Ghanta Surender 😊

శివానందలహారీ

 🙏శివానందలహారీ 🙏


ఉపేక్షా నోచేత్కింన హరసి భవద్ధ్యాన విముఖాం

దూరాశాభూయిష్టా0 విధిలిపి మశక్తో యది భవాన్

శిరస్తద్వైధాత్రం స నఖలు సువృత్త0 పశుపతే

కథంవా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితమ్ 



తాత్సార మేలయ్య ? తరుణేందుశేఖరా !

             కరుణేక్షణలనన్ను గావుమయ్య  

త్వన్మధు నామంబు తలపని దుష్టుడన్

             నా లలాటము మీది నలువ లిపిని

భవదీయ కరముచే బలవంతముగ నైన

              విశ్వేశ ! తుడువుము వేగిరముగ

సర్వేశ ! యారీతి సాధ్యంబు కాదని

              భక్తుడౌ నాతోడ బలుక బోకు

మటుల గాకున్న నాడు దురాగ్రహమున

 ధాతృ పంచమ శిరమును తగు బలాన 

చేతి గోటితో  నేరీతి చెండి తీవు ?

నీకు సాధ్యంబు గానిదింకేమి యుండు ?   15 # *




విరించిర్దీర్ఘాయు ర్భవతు భవతా తత్పరశిర

శ్చతుష్కం సంరక్ష్యం న ఖలు భువి దైన్యం లిఖితవాన్ 

విచార: కో వా మాం విశద కృపయా పాతి శివ దే 

కటాక్షవ్యాపార  స్స్వయ మపి చ దీనావనపరః 



తరగగా మిగిలిన తలలు నాలుగు గల్గి

             బ్రహ్మ  నీచేతిలో బ్రతికి పోయి

దీర్ఘాయువును పొంది తేజరిల్లుచు నుండి

             సృష్టి కార్యంబును చేయుచుండె

మావంటి కొందఱి మనుజుల నొసట తా

              వదలక దైన్యమున్ వ్రాయుచుండె

నరయగా మాకది నుపకార మెట్లగు ?

              నుపకారముగ మాకు నుండు నెపుడు

దైన్య మొందియు మేమున్న తరుణ మందె

దీన రక్షణ జేసెడి దీక్ష నున్న

విమలమౌ తావక కటాక్ష వీక్షణంబు

రక్షణము సేయు మమ్ముల తక్షణంబు  16 #



✍️ గోపాలుని మధుసూదన రావు

దివ్య ఔషధం శొంఠి గృతం.

దివ్య ఔషధం శొంఠి గృతం. 

నాకు కడుపులో మంట, తిన్నది అరగటంలేదు, నాకు గ్యాసు, నాకు కడుపులో నొప్పి, నాకు మోషన్ సరిగా అవటం లేదు. నాకు కడుపు ఉబ్బరం. నీరసంగా వుంటున్నది కానీ ఆకలి కావటంలేదు. అన్నం చూస్తే వెగటుగా వుంటున్నది, అన్నం తినాలని అనిపించటం లేదు. ఈ రకమైన బాధలు అన్ని కానీ కొన్ని కానీ లేక ఏదో వక్కటి కానీ లేనివాళ్లు నూటికి 50 మంది కన్నా ఎక్కువగా ఉంటారంటే ఆశ్చర్య పడవలసిన పనిలేదు.  మీకు జీర్ణాశయానికి సంబందించిన ఏ సమస్య ఐనా సులువుగా ఇంట్లోనే తయారుచేసుకునే మందుతో పరిష్కరించుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా. కానీ ఇది నిజం నూటికి నూరు పాళ్ళు మీకు ఉపయోగ పడుతుంది. మీరు చేసుకొని వాడి మీ తోటివారికి కూడా వాడమని చెప్పండి. 

శొంఠి అంటే తెలియని వారు వుండరు. ఇది మామూలు అల్లంను ప్రాసెస్ చేసి తాయారు చేసిందని మనలో చాలామందికి తెలియక పోవచ్చు. కానీ ఇది కూడా అల్లం యొక్క ఔషధ రూపం అని చెప్పవచ్చు. అల్లం కూడా చాల విధాలుగా మనకు ఆరోగ్య కరం. కానీ శొంఠి ఇంకా చాల ఉపయోగకరం. 

ఇప్పుడు శొంఠి గృతానికి కావలసిన పదార్ధాలను చూద్దాం. 

శొంఠి పొడి. దీనిని మనం సూపర్ మార్కెట్లలో కొనుక్కోవచ్చు లేదా శొంఠిని తీసుకొని దానిని మెత్తని పొడిగా మిక్సీ పట్టి కూడా తయారు చేసుకోవచ్చు. 

ఇక గోగృతం అంటే ఆవు నెయ్యి. మీకు నమ్మకంగా మార్కెటులో దొరికితే కొనండి. లేకపోతె రాందేవ్ బాబా స్టోరులో మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభిస్తుంది అక్కడ తీసుకోండి. . 

కొంత సింధవ లవణం లేక మాములు ఉప్పు. 

తయారు చేసే విధానం. 

మీరు శొంఠి గృతం యెంత చేయాలని  అనుకుంటున్నారో అంతకు సగం ఆవు నెయ్యి మిగిలిన సగభాగం శొంఠి పొడి తీసుకొని రెంటిని పూర్తిగా కొంచం సైన్ధవ లవణం కానీ మాములు ఉప్పుకాని కలిపి మొత్తం ఒక పేస్టులాగా చేయండి దానిని ఒక గాజు సీసాలో తీసుకోండి. ఈ మిశ్రమాన్నే శొంఠి గృతం అని అంటారు. 

ఉపయోగించే విధానం. 

మీరు రోజు భోంజనఁ చేసే ముందు ఒక చెంచా శొంఠిగృతం తీసుకొని దానిని కొంచం అన్నంలో కలిపి ఒక ముద్దగా చేసి దానిని మొదటి ముద్దగా తినండి తరువాత మీ పూర్తి భోంజనం చేయండి. 

మీరు ఈ విధంగా వాడిన తరువాత రెండు మూడు రోజులలో మీ అనారోగ్యం నయం అవుతుంది. శొంఠి జీర్ణ వ్యవస్థను బాగు పరుస్తుంది. ఆవు నెయ్యి చాలా మంచిది అది మీ ఆహరం పేగులలో సాఫీగా ప్రయాణించటానికి మరియు మీకు మంచి కోలాస్త్రలును అనిడిస్తుంది. ఈ రెంటి మిశ్రమము మీకు చాలా మంచిగా పనిచేస్తుంది. రోజు ఉదయం భోజనములో ఒక చెంచా రాత్రి భోజనములో ఒక చెంచా మాత్రమే వాడండి. పిల్లలకు వారి వయస్సును పట్టి అరచెంచా లేక అంతకన్నా తక్కువ వాడండి. 

గమనిక: ఇది చాలా సురక్షితమైన మందు ఐనా మీరు వాడటం వలన మీకు ఏమైనా సైడు ఎఫెక్ట్స్ వస్తే ఈ రచయిత భాద్యత లేదు గమనించండి. 

ఇది ఉపయోగించి లబ్ది పొందిన మిత్రులు మీ అనుభవాన్ని షేర్ చేస్తే సంతోషంగా ఉంటుంది, మరియు  నలుగురికి ఉపయోగ పడుతుంది. మరొక వైద్య విదితో ఇంకోసారి కలుదాం. 

మీ 

సి. భార్గవ శర్మ 

ఓం తత్సత్. 

సర్వ్యజన సుఖినో భవంతు. 

జీవిత పాఠాలు

 *జీవిత పాఠాలు. 

ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శకం కావచ్చు... లేదా హెచ్చరికగానూ ఉండవచ్చు. ప్రతి జీవితం ఎలా జీవించాలో, జీవించకూడదో తెలియజేసే ఒక పాఠం అవుతుంది. నేర్చుకోవాలన్న ధ్యాస ఉండాలేగానీ... ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.

పుస్తక పఠనం ద్వారా ఎంత నేర్చినా, మనుషులను చదివినప్పుడు నేర్చుకున్నంత సాధ్యపడదు. ప్రతి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం.

నాన్ననుంచి క్రమశిక్షణ, అమ్మనుంచి సందర్భోచిత నాయకత్వ లక్షణాలు, మామ్మనుంచి మనశ్శక్తి, తాతయ్యనుంచి అప్పగింతలు, తోబుట్టువులనుంచి క్షమ, మరపు... ఎన్నో నేర్చుకోవచ్చు. మనిషి కళ్లు తెరిచిన దగ్గర్నుంచీ నేర్వదగ్గ పాఠాలు బోలెడు.

మీరా నుంచి భక్తి, హనుమనుంచి సమర్పణ భావం, మహాత్మాగాంధీ సంకల్పబలం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమెలాగో స్టీవ్‌ జాబ్స్‌నుంచి, ఎడిసన్‌ నుంచి పట్టువిడవని సాధన... ప్రతి జీవితం జ్ఞానసముపార్జనకు అద్భుత అవకాశం కల్పిస్తుంది. మనిషి తనలో ఉండే విద్యార్థిని సజీవంగా ఉంచడమనేది కీలకం. లోపల ఉండే అన్వేషకుడు నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. ఎవరినుంచైనా, దేనినుంచైనా, ఏ పరిస్థితిలోనైనా నేర్చుకోవడమన్నది విడవకూడదు. చాలామందిలో పాఠశాల రోజులతోనే నేర్చుకోవడం ఆగిపోతుంది. అటువంటి బతుకు నిరర్థకంగా తయారవుతుంది.

మనిషిలో శక్తిసామర్థ్యాలు పెరగాలంటే, ఆరోగ్యంగా ఎదగాలంటే- అధ్యయనం జీవితాంతం సాగాలి. అది శ్వాస తీసుకోవడంలా, తుదిక్షణాల వరకు నిలవాలి.

ఆటపాటల్లో మునిగితేలే పిల్లల్ని చూస్తే వర్తమానంలో జీవించడమంటే ఏమిటో బోధపడుతుంది.

ఎదురయ్యే సంఘటనల నుంచి గ్రహించేదంతా అనుభవం అవుతుంది. అది పరిపక్వతను పెంచుతుంది.

ప్రాముఖ్యం లేని సంఘటనలు సైతం అద్భుతమైన అవకాశాలై జీవితంలో గొప్ప అనుభవాలుగా నిలుస్తాయి. ఎందరికో మార్గదర్శకం అవుతాయి. ఐన్‌స్టీన్‌, ఆర్కిమెడిస్‌, న్యూటన్‌ పరిశోధనలు మానవ జీవనశైలినే మార్చేశాయి. ఆ పరిశోధనలన్నీ ఏ మాత్రం ప్రాధాన్యం తోచని అనుభవాలుగా మొదలై వెలుగులోకి వచ్చినవే.

కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు అవగతమవుతుంది మనిషికి... పరిపక్వతకు ఒక అడుగు తక్కువలో ఉందన్న విషయం. పరిస్థితులకు తలకిందులైపోయి, చెదిరిపోయి, ఉద్విగ్నతకు లోనై నిరుత్సాహపడితే నేర్చుకునేది ఏమీ లేకపోగా- అవే పరిస్థితులు పునరావృతమవుతుంటాయి.

జీవితం ఎప్పుడూ ముందు పరీక్ష పెడుతుంది. ఆ తరవాతే పాఠం నేర్పుతుంది. కొందరికి నెలలు, ఏళ్లు పడితే... మరికొందరికి జీవితకాలం సరిపోదు.

అనుభవాలు రకరకాలు. జయాపజయాలు, మంచి చెడులు, అనుకూల ప్రతికూలాలు... ప్రతి అనుభవం ఒక పరీక్షే. అవన్నీ ‘నేటి’నుంచి ఎలా ఉండనుందో తెలియని రేపటికి తీసికెళ్ళేందుకు మనిషిని సిద్ధం చేయడం కోసమే.

తాను చేసే పొరపాట్లవల్ల మనిషి లోతైన పాఠాలు నేర్చుకుంటాడు. అపజయాలు గుర్తుండిపోయే పాఠాలు నేర్పుతాయి. విజయం ప్రేరణనందిస్తే, పరాజయం బోధకుడి పాత్ర పోషిస్తుంది. మనిషి పొరపాట్లకు మానసికంగా చలించిపోతే ‘రేపు’ కొత్తగా ఉండదు. బతుకు భారమనిపిస్తుంది.

జీవితం ఒక ఆట. లెక్కకు మించిన అవకాశాలను, సవాళ్లను దారిపొడుగునా విసురుతూనే ఉంటుంది. పట్టుదల ఉంటే వాటినందుకుంటూ జీవితాన్ని మెరుగుపరచుకుంటూ మనిషి ముందుకు సాగిపోగలుగుతాడు. 

(ఈనాడు అంతర్యామి)

✍🏻మంత్రవాది మహేశ్వర్

భీమేశ్వర జ్యోతిర్లింగము

 *🚩భీమేశ్వర జ్యోతిర్లింగము🚩*


భీమేశ్వర జ్యోతిర్లింగం గూర్చి ప్రార్థనా శ్లోకంగా ఒకమాట చెప్తారు.


యం డాకినీశాకినికాసమాజై నిషేవ్యమాణం పిశితా శనైశ్చ!


సదైవ భీమాదిపదప్రసిద్ధం, తమ్ శంకరం భూతహితం నమామి!!


ఇక్కడ ఉండే శంకరుడిని భీమలింగము అని పిలుస్తారు. శివాష్టోత్తరంలో ‘భీమః’ అన్న నామము ఉన్నది. ‘భీమః’ అనే నామం విష్ణుసహస్రనామ స్తోత్రంలో కూడా ఉన్నది. ఇది చాలా చిత్రాతిచిత్రమయిన స్వయంభూలింగము.


లింగపురాణం వాయువు పేరును ‘ప్రభంజనః’ అని పేర్కొంది. ఆయన గట్టిగా వీస్తే పెద్దపెద్ద వృక్షములు కూడా కూకటి వేళ్ళతో క్రిందపడిపోతాయి. ఆయన ప్రభంజనుడు. అటువంటి వాడికి శంకరుడు ‘నీవు జీవులలో ఉండి వాళ్ళ కార్యములన్నీ నిర్వర్తించాలి’ అని చెప్పాడు. వెంటనే వాయువు జీవులలోకి వెళ్ళాడు. ప్రభంజనుడై వాయువు  శరీరములు నిలబడడానికి పది రకములయిన కర్మలను లోపల ఉండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే బ్రతుకే లేదు.


పూర్వకాలమునందు సహ్య పర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసుని పేరు కర్కటుడు. ఆయన భార్య పేరు పుష్కసి. ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది. ఆమె పేరు కర్కసి. పెరిగి పెద్దదయి యౌవనంలోకి వచ్చింది. తగిన సంబంధం చూడాలి. విరాధుడు అనేవాడిని ఈమెకు తగిన వరునిగా నిర్ణయించి పెళ్ళి చేశారు. కొంతకాలమునకు రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఈవిడకి వైధవ్యం వచ్చింది రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది. ఈ విషయం తెలుసుకుని కుంభకర్ణుడు ఈమె దగ్గరికి వచ్చాడు. కదళీ వనంలో వున్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడకి కుంభకర్ణుడి వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టినవాడు అపారమయిన బలవంతుడు అవాలని ఆమె కోరుకుంది. తన కొడుకు తన భర్త విరాధుడిని, కుంభకర్ణుని సంహరించిన రాముడిని సంహరించగల శక్తిమంతుడు కావాలని ఆమె కోరిక. అందుకని ఆ పిల్లాడిని ‘భీమః’ అని పిలవడం ప్రారంభించింది. భీమః అంటే గొప్పబలం ఉన్నవాడని అర్థం.


వాడు పెరిగి పెద్ద రాక్షసుడు అయ్యాడు. వాడు ఒకనాడు తల్లిని “నాన్నగారు ఎక్కడ” అని అడిగాడు. అపుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు. నీవు విష్ణువును సంహరించాలి’ అని చెప్పింది. విష్ణువు గురించి లోకములనన్నింటిని వెతికి వెతికి విసిగిపోయాడు. ఎవడయినా భగవంతుని పాదములు పట్టుకున్న వాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు. ఇలా భక్తులన్దరినీ చెణకుతూ వెళ్ళిపోతుండగా ఒకానొకప్పుడు కామరూప రాజ్యమును పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజును ఓడించి తీసుకు వచ్చి కారాగారంలో పెట్టాడు.


సుదక్షిణుడు పార్థివ లింగం పెట్టి రోజూ లింగార్చన చేస్తూండేవాడు. మనస్సుతోనే ఆయన అన్నీ సృష్టించి శివపూజ చేస్తుండేవాడు. అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి ఈవిషయం రాజుకు చెప్పారు. వీడికి ఎక్కడ లేని కోపం వచ్చి నాకన్నా గొప్పవాడు ఎవడు? ఇప్పుడే ఈ లింగమును కత్తితో నరికేస్తాను అని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షిణుడు పరమేశ్వరా! నీవు ఆవిర్భవించి వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు.


ఎప్పుడయితే తన చేతిలో ఉన్న చంద్రహాసమును విసిరాడో అంతటా నిండి నిబిడీ కృతమయి ఈ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపమును పొంది పార్థివ లింగంలోంచి బయటకు వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్ళే వాళ్ళని ఉపేక్షించను అని ఉత్తరక్షణం వాడిని కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు ‘భీముడు’ అని చెప్పుకున్నాడు. భీముడు అనగా అద్వితీయ పరాక్రముడు.


ఇందులో తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. ఆ రాక్షసుని కక్ష విష్ణువు మీద. ఇక్కడ పరమశివుడు వచ్చాడు. యథార్థమునకు విష్ణురూపం రావాలి కదా! అయితే శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు? అంటే భగవంతుని రెండు పేర్లు చెప్తారు – వామదేవ, వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు. వామదేవ అంటే పరమశివుడు. ఈ రెండు పేర్లలో మారిన అక్షరములు ‘మ’ ‘సు’. ఇప్పుడు ‘సు’ పక్కన ‘మ’ పెట్టండి. ‘సుమ’ అవుతుంది. ‘సుమం’ అంటే పువ్వు. పువ్వు అనగా జ్ఞానం. జ్ఞానం కలిగి తెలుసుకుంటే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు అవుతారు. నామములు, రూపములు మారాయి. తత్త్వరీత్యా ఉన్నది ఒక్కటే పదార్ధం. శివలింగమును పూజించి రాముని జోలికి వెళ్ళినా, రావణాసురుని పది తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు. శివ స్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్నా, శ్రీమహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయమును ఆపడు.   ఉన్నది ఒక్కటే పదార్థము. ‘ఏకోదేవః సర్వభూతాంతరాత్మా స్రవభూతాభివాసః సాక్షీచేతోకేవలోనిర్గుణస్యా’ అంది వేదం. ఆ ఉన్న ఒక్క పదార్థము అవసరమును బట్టి రూపమును మారుస్తుంది.  భీమః –  ఏమి కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదయినా ఇవ్వగలిగిన వాడు.  ఆ స్థితిలో వచ్చి రాక్షససంహారం చేసి తన భక్తుడయినవాడికి రాజ్యాధికారం ఇచ్చి, తదనంతరం మోక్షమునిచ్చినవాడు.


ఒక్కసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి ‘డాకిన్యాం భీమశంకరం’ అని ఒక్క నమస్కారం చేస్తే భీముడు శంకరుడు శుభం చేస్తాడు. ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ  ఎటువంటి దుఃఖములు రాకుండా కాపాడి రక్షిస్తాడు.

తల్లితండ్రుల గొప్పదనం

 *తల్లితండ్రుల గొప్పదనం గురించి  శాస్త్రాలలో చెప్పబడిన విధానం.*

======================


01. ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.


02. ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి0


03. ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.


04. సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి.


05. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.


06. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.


07. ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం


08. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.


09. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే  అని ధర్మశాస్త్రం చెబుతోంది.


10. తల్లిని మించిన దైవం లేదు - గాయత్రిని మించిన మంత్రం లేదు.

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏

నామ స్మరణం..ముక్తిమార్గం!*

 🚩🛕 *హిందూ ఆధ్యాత్మిక వేదిక*🚩🛕

=======================


*నామ స్మరణం..ముక్తిమార్గం!*


రాబోయే కాలంలో ఎలాంటి సంఘటనలు, ఉపద్రవాలు సంభవిస్తాయో బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. మనకు తెలియని మరో సంగతి ఏంటంటే, ద్వాపర యుగం ముగిసిన తరువాత రాబోయే కలియుగంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో కృష్ణ భగవానుడు కూడా ముందే చెప్పాడు. కలి ప్రభావం వల్ల మనుషుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో, పాపకర్మలు ఎలా పెరిగిపోతాయో ఆయన తన అవతార సమాప్తిలో చెప్పాడు. అంతేకాదు, కలి ప్రభావం నుంచి బయటపడి, పాపకర్మలను అధిగమించి, పుణ్యకార్యాలవైపు ఎలా వెళ్లాలో కూడా సూచించాడు.


*ద్వాపర యుగాంతం...*


శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఉద్ధవుడిని పిలిచాడు. తన నిర్యాణం తరువాత కలి ప్రవేశం జరుగుతుందనీ, ఏడో రాత్రి లోపల ద్వారకానగరం అంతా సముద్రమయం అయిపోతుందనీ చెప్పాడు. కలి ప్రవేశించిన తరువాత మనుషుల ఆలోచనా ధోరణి, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. అయినప్పటికీ భగవంతుణ్ణి చేరుకోవడం మాత్రం సులభసాధ్యమంటూ కలియుగం గురించి ఇలా వివరించాడు కృష్ణుడు. ఉద్ధవా! కలి ప్రవేశించగానే రెండు విషయాల పైన ఈ ప్రపంచం ఆధారపడుతుంది. ఒకటి కోపం. రెండవది విపరీతమైన కోర్కెలు. వీటివల్ల మనుషుల్లో ఆయుర్దాయం తగ్గుతుంది. విపరీతమైన కోర్కెలతో సంతృప్తి లేకుండా మనుషులుంటారు. తద్వారా ప్రశాంతత కరువై, తీవ్రమైన వ్యాధులు ప్రబలుతాయి. ఒక పక్క దైవభక్తి తగ్గుతుంది. మరోపక్క ఏ దేవతామూర్తి కోర్కె తీరుస్తుందంటే అటు పరుగులు పెడతారు. అంతేగాని దేవుడొక్కడే అంటే ఒప్పుకోరు. మతాల ఆధారంగా పరమాత్మ పట్ల భేదం చూపిస్తారు. సర్వాంతర్యామి అయిన భగవంతుడిలో రూపాన్ని బట్టి రకరకాల భేదాలు చూపి, కొట్టుకుంటారు. భక్తిలేని వాడు దేవుడి పనులను, గుడి నిర్మాణాలను చేపడ్తాడు. 


వేదాల్ని, యజ్ఞ యాగాదుల్ని ధిక్కరిస్తారు. అర్హత లేనివాళ్లు ఆయా పనుల్లో నిష్ణాతులమంటారు. యోగ్యత, పాండిత్యం వల్ల మనుషులు గౌరవింపబడరు. డబ్బు ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్లనే గౌరవిస్తారు. ఇంద్రియాలకు బానిసలవుతారు. తద్వారా అంతశ్శుద్ధి కోల్పోతారు. ఇంద్రియాలతో మనకు ఏదైతే సుఖాన్నిస్తుందో అది మన జన్మను పాడు చేస్తుందనే జ్ఞానాన్ని కోల్పోతారు. అయితే కలియుగంలో దైవనామం చెప్పినంత మాత్రాన వాళ్లకు పుణ్యం లభించి, పాపకర్మల నుంచి విముక్తులవుతారు. అందుకే బదరికాశ్రమం వెళ్లి, నా మూర్తిని ఆశ్రమంలో ఉంచు. ప్రతిరోజూ భగవన్నామం కొంతసేపైనా చెప్పు. కొన్ని పూలు ఆ మూర్తిపై వేయి. అప్పుడు ఆ మూర్తి అహంకారాన్ని తగ్గించి, పుణ్యం వైపు నడిపిస్తుంది. పాపకర్మల నుంచి విముక్తులవడానికి కలియుగాన ఉన్న సులభమార్గమిది. 


*పరమాత్మను చేరే మార్గం..*


పాపకర్మలన్నీ పెరిగిపోయినప్పటికీ కలి ప్రభావం నుంచి బయటపడి, భగవంతుని చేరుకోవడానికి మనం చేయాల్సిన కర్మల గురించి సూచనలు చేశాడు కృష్ణ భగవానుడు. 

దైవ నామస్మరణ, ఎక్కువసార్లు అనవసర విషయాలు మాట్లాడకుండా మౌనం పాటించడం, దైవపూజ, ఇంద్రియ నిగ్రహం, జపం.. వీటిని పాటిస్తే చాలు పాపాల నుంచి విముక్తులమై ఆయన అనుగ్రహం పొందవచ్చు. అంతేకాదు, కోర్కెలను తీర్చుకునే మార్గాలూ ఇవే. అయితే అమ్మో! ఇన్ని చేయాలా అని అన్పిస్తుంది మనకు. కానీ ప్రతిరోజూ దైవనామం స్మరించే సమయాన్ని పెంచుతూ పోవాలి. సాధారణంగా మనం ఏదో ఒక కోర్కె తీరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. కాని ఇది సరైన పద్ధతి కాదు. అంతశ్శుద్ధి, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలి. నామస్మరణతోనే కరుణించే స్వామి వాటిని మనకు ప్రసాదిస్తాడు. అంతశ్శుద్ధితో భక్తి దానికదే వస్తుంది. భక్తి చింతనతో మనకు కావాల్సింది కోరుకుంటే చాలు ఆయనే ఇస్తాడు. అయితే సర్వాంతర్యామి అయిన భగవంతుడికి నాకు కావాల్సిందేమిటో తెలియదా! ప్రత్యేకించి కోరుకోవడమెందుకు.. అని కూడా అన్పించొచ్చు. కాని మన తోటివారితో, స్నేహితులతో ఎందరితోనో మనకు ఫలానా సమస్య ఉందనీ, కష్టం ఉందనీ చెప్పుకుంటూ ఉంటాం. మానవమాత్రులెవరూ తీర్చలేని కష్టాన్ని కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు. ఆయన జగద్రక్షకుడు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండే రక్షకుడితో చెప్పుకుంటే బాధ తగ్గుతుందీ, కష్టమూ తీరుతుంది. ఆయా సమస్యల నుంచి విముక్తులమూ అవుతాం. 


*ఇంద్రియ నిగ్రహం.. ఇలా సాధ్యం!*


వివాహం అయిన స్త్రీ తల్లితో సమానమనే భావన కలియుగంలో తగ్గిపోతుంది. పరస్త్రీలు, పర పురుషులపై మోహం కలగడం కలియుగ లక్షణం. దీనికి వివాహంతో సంబంధం లేదు. కలి ప్రభావం వల్ల కలిగే ఈ మోహాల నుంచి బయటపడడానికి కూడా సులువైన మార్గం ఉంది. ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు మోహం కలిగితే - ఇంత అందంగా ఉన్న ఈ అమ్మ కన్పించి కరుణించింది. పొద్దున్నే మా అమ్మ జగన్మాత కనిపించి ఆశీర్వదిస్తున్నది అని అనుకోవాలి. అదేవిధంగా పరపురుషుని పట్ల మోహం కలిగినప్పుడు స్త్రీలు - కృష్ణా! నీ జగన్మోహనాకార దర్శనం ఇచ్చావా తండ్రీ! అని అనుకోవాలి. ఇలాంటప్పుడు పాపచింతన కాస్తా పుణ్యం వైపు దారితీస్తుంది. పాపకర్మలను పుణ్యకర్మలుగా మార్చుకునే సాధనం ఇది. క్రమంగా మనసుకు ఇది అలవాటై పోతుంది. ఇక పాపకర్మల వైపు మనసు మళ్లదు. అలాంటి వాళ్ల మనసు నిర్మలంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు.