13, నవంబర్ 2020, శుక్రవారం

కర్మఫల త్యాగం

 కర్మఫల త్యాగం




చేసే పనిని కర్మగా వర్ణించింది భగవద్గీత. ఇంద్రియాలతో ఆచరించే ప్రతి పనీ కర్మయోగమే. 


చూడటం, వినడం, తాగడం, తినడం... ప్రతిదీ కర్మలోని భాగమే. కర్మల ఫలితమే మనిషి జీవన విధానమని భగవద్గీత అయిదో అధ్యాయం చెబుతోంది.


పూర్వం చేసిన పనులు సంచితమని, వర్తమానంలో ఆచరించేవి ప్రారబ్ధమని, రాబోయే కాలంలో చేయబోయే పనులు ఆగామిగా విభజించారు. కర్మను అనుసరించి ఫలం అందుతుంది.


ధ్వనికి ప్రతిధ్వని, స్పందనకు ప్రతిస్పందన ఎలా సాధారణమో కర్మకు ఫలితం అలాంటిదే. 


రెండు చేతులు చరిస్తే వచ్చే చప్పట్ల శబ్దాన్ని చెవులు అనుభవిస్తాయి. మనసు, శరీరం కలిసి చేసే కర్మల ఫలాన్ని మనిషి పొందుతాడు. 

నవ్వుతూ తప్పుచేస్తే ఏడుస్తూ అనుభవిస్తారు.



కర్మకు పాపపుణ్యాలు లేవు, మంచిచెడులు లేవు. ఫలితానికే సుఖదుఃఖాలు  పరిమితం. మానవ జీవితమే కర్మఫలంగా చెబుతారు.


కార్యాచరణ నిమిత్తమాత్రంగా జరగాలని, అప్పుడే ఫలితం మనల్ని బంధించదని శ్రీకృష్ణుడు బోధించాడు. 


దానినే తామరాకుపైన నీటిబొట్టుగా వర్ణించాడు.


యజమాని దగ్గర పనిచేసే సేవకుడు నిమిత్తమాత్రుడు. తాను చేసే పనుల లాభనష్టాలు, మంచిచెడులకు తాను బాధ్యత వహించడు.


 వాటివల్ల తాను ఏ ప్రయోజనం పొందడు. మనిషి సేవకుడిలా పనిచేస్తూ యజమాని అయిన భగవంతుడికి కర్మఫలాన్ని వదలాలి. అదే కర్మసన్యాస యోగమని గీత బోధ.


కర్మచేయడంపట్ల మనిషికి అధికారం ఉంది. ఫలంలో లేదు. కర్మత్యాగం కన్నా కర్మఫలత్యాగం మనిషిని జ్ఞానమార్గం వైపు మళ్ళిస్తుంది.


రామాయణంలో భరతుడు ‘తండ్రి ఆదేశానుసారం రాజ్యభారం’ వహించాడా? తనకు కాక శ్రీరామపాదుకలకు పట్టాభిషేకం గావించాడు.


 తాను రాజుగా మారక రాజ్యప్రతినిధిగా పాలించాడు. రాజ్యం పరిపాలించే కర్మను ఆచరించింది భరతుడే అయినా, శుభాశుభాల ఫలితాలు శ్రీరాముడికి సమర్పించడం కర్మఫలత్యాగం.


మనిషి బతికినంతకాలం కర్మను ఆచరించక తప్పదు. కర్మనుకాక దాని ఫలాన్ని త్యాగం చేయాలి. మనం ఒకరితో పంచుకునే విధానాన్ని దానం, త్యాగం అంటారు.


దానం కన్నా త్యాగం ఉన్నతమైంది. మనకు అవసరం కానిది, అధికంగా ఉన్నది దానం చేస్తాం. త్యాగంలో నాకేమిటి అనే స్థితి రాదు. 


పావురం ప్రాణాన్ని రక్షించే నిమిత్తం తన శరీరం నుంచి మాంసాన్ని కోసి ఇచ్చాడు శిబి చక్రవర్తి. త్యాగానికి అది పరాకాష్ఠ!


కర్మఫలాన్ని త్యాగంచేయడం అసాధారణ విషయం. 


మనిషి తాను చేసే పనిలో ఎంతో కొంత లాభాన్ని ఆశిస్తాడు. స్వార్థంతో చేసే పనిలో తన శక్తియుక్తులను ధారపోస్తాడు. కర్మపరిపక్వత చేరినప్పుడు ఫలితాన్ని త్యాగంచేయడం యోగులకే సాధ్యం.


త్యాగఫలం ఒక యోగం. ఫలత్యాగం మోక్షసాధనం. మోహాన్ని క్షయింపజేయడమే మోక్షం!

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 13  / Sri Devi Mahatyam - Durga Saptasati - 13 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 4*

*🌻. శక్రాదిస్తుతి - 1 🌻*


1-2. ఋషి పలికెను : 

అతి వీర్యసంపన్నుడు, దురాత్ముడు అయిన ఆ మహిషాసురుడూ, ఆ సురవైరి యొక్క సైన్యమూ దేవి చేత వధింపబడినప్పుడు ఇంద్రాది దేవగణాలు భక్తి వినమ్రములైన కంఠాలతో భుజాలతో, ఆనంద పులకాంకురరమ్యములైన శరీరాలతో దేవిని స్తుతించారు. 


3. "తన శక్తిచేత ఈ జగత్తునందంతటినీ వ్యాపించి ఉండేదీ, సర్వదేవగణాల శక్తి సమూహం యొక్క మూర్తరూపమైనట్టిదీ, సర్వదేవతలచేతా, మహర్షుల చేతా ఆరాధింప దగినదీ అయిన అంబికకు మేము సభక్తికంగా ప్రణమిల్లుతున్నాం. మాకు ఆమె శుభాలను ప్రసాదించుగాక!


4. "ఎవరి అసమాన బలప్రభావాలను బ్రహ్మవిష్ణుమహేశ్వరులు వర్ణింపజాలరో, ఆ చండిక సర్వజగత్తునూ పరిపాలించుటలోనూ, అమంగళం వల్ల కలిగే భయాన్ని నాశనం జేయడంలోనూ తన బుద్ధిని వినియోగించుగాక! 


5. "పుణ్యపురుషుల ఇళ్ళల్లో సంపదగానూ, పాపాత్ముల ఇళ్ళల్లో అశుభముగను, విద్వాంసుల హృదయములందు బుద్ధి జ్ఞానముగను, సత్పురుష హృదయములందు శ్రద్ధగను, సత్కుజుల హృదయములందు లజ్జగను ఏ దేవి స్వయముగా నిలిచి ఉండునో, ఆ దేవివగు నీకు ప్రణమిల్లుచున్నాము. నీవు జగత్తును పరిపాలింతువు గాక!


6. "దేవీ! తలచడానికి అలవికాని (మనస్సుకు అందని) ఈ నీ రూపాన్ని గాని, రాక్షసులను నశింపజేసే నీ వీర్యాతిశయం గాని, దేవాసుర యుద్ధాలన్నింటిలో నీవు చేసే అత్యద్భుత చర్యలు గాని వర్ణించడం మాకెలా సాధ్యం? 


7. "సర్వజగత్తులకు నీవు కారణమవు! నీవు త్రిగుణాత్మికవుడో అయినా వాటిలోని దోషాలు నీ యందు కానరావు! హరిహరాదులు కూడా నిన్ను ఊహించలేరు! అందరికీ నీవే ఆధారం! ఈ జగత్తంతా నీలో ఒక స్వల్పభాగం నుండి ఉత్పన్నమైంది. నిజంగా నీవు సర్వాధికయైన (వేఱుపఱుపబడని )* ఆద్య ప్రకృతివి* . 


8. "దేవి, యజ్ఞాలన్నింటిలో ఏ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల సమస్తదేవగణాలు తృప్తి పొందుతారో, ఆ స్వాహా మంత్రానివి నీవు. పితృదేవతా గణానికి తృప్తినిచ్చే స్వధాజీ మంత్రానివి నీవు. కాబట్టి జనులు నిన్ను (యజ్ఞాలలో స్వాహా, స్వధా అని) పలుకుతారు.


9. “దేవి! నీవు భగవతివి, మోక్షహేతువు, ఊహింప శక్యం కాని మహాతపస్సులకు హేతువైన పరావిద్యవు * నీవు. మోక్షార్థులు, ఇంద్రియాలను చక్కగా వశపరుచుకున్నవారూ, (పర) తత్త్వంలో (పరమ సత్యం) ఆసక్తులు, దోషాలన్నింటినీ పోగొట్టుకున్నవారూ అయిన మునులు (పరావిద్యవైన) నిన్ను అభ్యసిస్తారు. 


10. "నీవు శబ్దబ్రహ్మానికి ఆత్మవు. అతినిర్మలమైన ఋగ్యజుర్వేదశ మంత్రాలకు, పఠించేటప్పుడు వినడానికి ఉద్దేశించడం వల్ల రమ్యంగా ఉండే సామవేదమంత్రాలకు నీవు ఉనికిపట్టువు. నీవు వేదత్రయ స్వరూపిణవైన భగవతివి. సంసార జీవనోపాయమవు నీవు. సర్వలోక దుఃఖాలను పోగొట్టే మహాశ్రేష్ఠురాలవు నీవు.


11. “దేవీ, సర్వశాస్త్రాల సారమూ తెలుసుకునే 'మేధ' వు (ధారణాశక్తి గల బుద్ధివి) నీవు. దాటశక్యం కాని సంసారసాగరాన్ని దాటించే అసమానమైన 'నావ' వైన దుర్గవు నీవు. విష్ణుహృదయంలోనే నివాసమేర్పరుచుకున్న శ్రీ లక్ష్మి)వి నీవు. శివునిలో శాశ్వతంగా నిలిచిన గౌరివి కూడా నీవే.


12. “చిరునగవుతో కూడి, నిర్మలమూ, పరిపూర్ణ చంద్రబింబం వంటిదీ, అపరంజి వన్నెతో మనోజ్ఞంగా ఉండేటటువంటిది నీ ముఖము! కాని దానిని చూచి మహిషాసురుడు కోపోద్దీపితుడై వెంటనే దానిని కొట్టాడు; ఇది మిక్కిలి ఆశ్చర్యకరం.


13. "కోపయుక్తము, బొమముడితో భయంకరము, ఉదయిస్తున్న చంద్రబింబం వలె ఎఱ్ఱని కాంతి గలది అయిన నీ ముఖాన్ని చూడడంతోనే మహిషుడు ప్రాణాలు విడువకుండా ఉండడం ఇంకా చిత్రం! కోపంతో ఉన్న మృత్యువును దర్శంచి ఎవరు జీవించి ఉండగలరు!


14. "దేవీ! ప్రసన్నవు కమ్ము. నీవు సర్వాధికవు. కనుక పూనితివేని నీవు క్షణంలో (లోక) కల్యాణార్థం (అసుర) కులాలను నాశనం జేయగలవు. మహిషాసురుని అపార సైన్యాలు తుదముట్టింప బడినప్పుడే ఇది తెలిసింది.


15. “సర్వాదా శుభకారిణివైన నీవు ఎవరిపై ప్రీతి పూనుతావో, వారు దేశసమ్మానమును పొందుతారు; వారిదే ధనం; వారిదే కీర్తి; వారి ధర్మకార్యాలు నశించవు; వారే కృతార్థులు; వారికి అనుకూలురైన ఆలుబిడ్డలు, భృత్యులు ఉం టారు 🌹 🌹 🌹🌹

8.6 దైవం

 **అద్వైత వేదాంత పరిచయం**


8.6 దైవం :


 ఈ సందర్భంలో యింకో అంశాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. భక్తి అంటే దేవుని మీద ఆరాధన అన్నాం. కాని దేవుడు ఎవరో తెలియకపోతే, అతని మీద భక్తి ఎలా ఏర్పడుతుంది? ముక్కూమొహం తెలియని వ్యక్తి మీద ప్రేమ ఎలా పుడుతుంది? అందుకే ఇప్పుడు పెళ్ళికి ముందే ప్రేమిస్తున్నాను’ అంటారు, పెళ్ళి చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా ఎక్కువ అర్థం చేసుకుని, ‘ నాకర్థమయ్యాడు, అందుకే ప్రేమించ లేకపోతున్నాను,’ అంటారు. దేవుని విషయంలో కూడా అంతే. దేవుడి స్వభావం తెలియందే 

ఎలా ప్రేమిస్తాము?

 అందుకని మనం దేవుని స్వభావం గురించి టూకీగా చర్చిద్దాం. శాస్త్రం దేవుణ్ణి గురించి మూడు నిర్వచనాలు యిస్తుంది, సాధకుని పరిపక్వతని బట్టి, మేధాశక్తిని బట్టి. ఆ మూడు స్థాయిలు ఏమిటో చూద్దాం.


8.6.1 మొదటి నిర్వచనం :దేవుడు సృష్టికర్త. సంస్క ృతంలో జగత్‌కర్తా ఈశ్వర: అంటారు. నిమిత్తకారణం అని కూడా అంటారు. దీన్ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఏమిటది? ఏ అందమైన వస్తువుని చూసినా, దాని వెనుక దాన్ని సృష్టించిన మేధావి ఉంటాడు. ఆ వస్తువు ఎంత బ్రహ్మాండంగా 

ఉంటే, అతని తెలివితేటల్ని అంతగా కీర్తిస్తాము. అంటే ఒక మామూలు వస్తువుని తయారుచేయటానికి ఒక మానవ మేధస్సు కావాలంటే, ఇంత క్రమబద్ధంగా ఉన్న, ఇంత లాభదాయకంగా ఉన్న ఈ అద్భుతమైన జగత్‌ వెనుక ఎవరు ఉన్నట్టు? ఎవరో కలుపుమొక్కని ఇలా నిర్వచించారు` ‘కలుపు మొక్క యొక్క లాభం యింకా కనుగొనలేదు’. అది అనవసరం కాదు,కాని మనకే యింకా దాని ప్రయోజనం తెలియలేదు అంతే.అంటే సృష్టిలో అనవసరమైన వస్తువంటూ ఏదీ లేదు. సృష్టి ఇంత లాభదాయకంగా, ఇంత అద్భుతంగా ఉందంటే, దాని వెనుక ఎవరో తెలివైన సృష్టికర్త 

ఉన్నారన్నమాట. ఆ తెలివైన జగత్‌కర్త ఈశ్వరుడు. ఈశ్వరుడిని జగత్‌కర్తగా భావిస్తే, ఆ ఈశ్వరుడిని ఒక వ్యక్తిగా భావిస్తాము. ఎందుకంటే మనకి తెలిసిన తెలివైన వ్యక్తి మనిషి. అందుకని చాలా తెలివైన వ్యక్తిగాదేవుడిని ఊహించుకుంటాం. అతనిని సర్వజ్ఞునిగా, సర్వశక్తిమంతుడిగా ఊహించుకుంటాం. మనచుట్టూ కనబడడు కాబట్టి అతన్ని మేఘాలపైన వున్నట్టు ఊహించుకుంటాం. ఈ దేవుడు మనకి వ్యక్తిగత దేవుడు. మనకి తోచిన నామ, రూపాలు ఇచ్చుకుంటాం.రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి,శివుడువగైరా. ఈ దేవుడిని మనం ఏకరూప ఈశ్వర అందాం. ఒక రూపం దాల్చినదేవుడు.ఆరంభ దశలో ఉన్న భక్తుడికి ఈ దేవుడు.

🙏🙏🙏

సేకరణ

🙏 శివానందలహారీ 🙏 ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్దాం సగమనాం విచిత్రా0 పద్మాభ్యా0 ప్రతిదివస సన్మార్గఘటితామ్ స్మరారే ! మచ్చేత స్పుటపటకుటీ0 ప్రాప్య విశదాం జయ ! స్వామిన్ ! శక్త్యాసహ శివగణై స్సేవిత విభో ! సద్ధైర్య మనియెడి స్తంభాళి తోడను త్రయగుణ దేహ బంధములతోడ , స్వేచ్చాను గమనమై చిత్ర విచిత్రమై పద్మ సదృశ చిత్ర పంక్తి తోడ ప్రతిదిన చింతిత బ్రహ్మ భావము తోడ రాజ మార్గము నందు రక్తి తోడ నమలమౌ నాయొక్క యంత రంగంబను స్పుట పటపు కుటీర మిటను గలదు శంకరా ! నీవు పార్వతీ సహితు డగుచు నస్మదీయ కుటీరమ్ము నందు జొచ్చి సురిచిరానంద భోగాల చొక్కుమయ్య సకల గణ భక్తిసంసేవ్య సర్పభూష ! 21 # ప్రలోభాద్యై రర్థాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తస్స న్ర్భమతి బహుదా తస్కరపతే ! ఇమంచేతశ్చోరం కథ మిహ స హే శంకర ! విభో ! తవాFధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ అమిత ప్రలోభంబు ననయంబు పొందియు నర్థాప హరణంబు నాచరించ మచ్చిత్త మనియెడు మహితమౌ చోరుండు ధనికుల గృహముల దరిని జేర సతతంబు యత్నించి సంరంభ మొనరించు నడ్డు యాపును లేక యవధి లేక యీ చిత్తమను చోరు నేరీతి నిలిపుదు చెడు కార్యముల నెల్ల చేయకుండ చిత్త మనియెడి నీ చోరు శీఘ్రముగను పట్టి బంధించి నీ వశవర్తి జేసి పరమ నిర్దోషి నైనట్టి భక్తు నన్ను కరుణతోడుత రక్షించు కామదహన ! 22 # ✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

 🙏 శివానందలహారీ 🙏


ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్దాం సగమనాం

విచిత్రా0  పద్మాభ్యా0 ప్రతిదివస సన్మార్గఘటితామ్

స్మరారే ! మచ్చేత స్పుటపటకుటీ0 ప్రాప్య విశదాం

జయ ! స్వామిన్ ! శక్త్యాసహ శివగణై స్సేవిత విభో ! 



సద్ధైర్య మనియెడి స్తంభాళి తోడను

              త్రయగుణ దేహ బంధములతోడ ,

స్వేచ్చాను గమనమై చిత్ర విచిత్రమై

              పద్మ సదృశ చిత్ర పంక్తి తోడ 

ప్రతిదిన చింతిత బ్రహ్మ భావము తోడ

              రాజ మార్గము నందు రక్తి తోడ

నమలమౌ నాయొక్క యంత రంగంబను

              స్పుట పటపు కుటీర మిటను గలదు

శంకరా ! నీవు పార్వతీ సహితు డగుచు

నస్మదీయ కుటీరమ్ము నందు జొచ్చి

సురిచిరానంద భోగాల చొక్కుమయ్య 

సకల గణ భక్తిసంసేవ్య సర్పభూష !        21 #


ప్రలోభాద్యై రర్థాహరణ పరతంత్రో ధనిగృహే 

ప్రవేశోద్యుక్తస్స న్ర్భమతి బహుదా తస్కరపతే !

ఇమంచేతశ్చోరం కథ మిహ స హే శంకర ! విభో !

తవాFధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ 



అమిత ప్రలోభంబు ననయంబు పొందియు

            నర్థాప హరణంబు నాచరించ

మచ్చిత్త మనియెడు మహితమౌ చోరుండు

             ధనికుల గృహముల దరిని జేర

సతతంబు యత్నించి సంరంభ మొనరించు

             నడ్డు యాపును లేక యవధి లేక

యీ చిత్తమను  చోరు నేరీతి నిలిపుదు

              చెడు కార్యముల నెల్ల చేయకుండ

చిత్త మనియెడి నీ చోరు శీఘ్రముగను

పట్టి బంధించి నీ వశవర్తి జేసి 

పరమ నిర్దోషి నైనట్టి భక్తు నన్ను

కరుణతోడుత రక్షించు కామదహన !         22 #


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

దేవం




 

జలపాతాలు










 

టెక్నికల్








 

శిక్షణ








 

మోసం







 

ప్రవచనములు