1, ఏప్రిల్ 2021, గురువారం

మద్రాసు ఉమ్మడి రాష్ట్రం

 మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ సూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభసూరులు అని హేళన చేసింది.


 దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు  ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్లారా అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా మొఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ లేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా  నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు.   ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులశ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.


           గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక....రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు.


మిత్రులకు విన్నప్పము, ,ఇ కష్టం మనకు తెలీదు కనీసం మన శ్రీరాములు ,ఘంటసాల గొప్పతనం

మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత

*15. వేదాంగములు : శిక్ష*

 *ఓం నమః శివాయ*:

*42-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*



*15. వేదాంగములు : శిక్ష*


((((((((((🕉))))))))))


*తూర్పుతీరాన్నీ, దానిని ఆనికొని ఉన్న ఆంధ్ర ప్రాంతాన్నీ తీసికొంటే 98% యజుర్వేదాన్ని పాటిస్తారు. మిగిలిన 2% వారు ఋగ్వేదాన్ని. ఆంధ్రలో ''సామవేదం'' వారు లేరనే చెప్పవచ్చు. యజుర్వేదమే ఇక్కడ ప్రమాణమవటం వల్ల ఋగ్వేదంలోని ''ళ'' సహజంగానే ''ద''గా మారంది. తెలుగులో కూడ ఇతర భాషలలోని ''ళ'' 'ద'గా మారింది. ఆంధ్రలో వలె కాకపోయినా తమిళనాడులో కూడ తర్వాతి కాలంలో యజుశ్శాఖాద్యయులు అధిక సంఖ్యా కులైనారు. తమిళనాడులో 80% యజుశ్శాఖేయులు, 15% సామవేదం వారు మిగిలిన 5%  ఋగ్వేదులుగా అనుకోవచ్చు. ఇది ఇప్పటి పరిస్థితే అయినా పూర్వం సామవేదమను సరించే వారే అత్యధికులు తమిళనాడులో సామవేదంలోని 1000 శాఖలను అనుసరించే వారు తమిళనాడులో ఉండే వారనటం తప్పుకాదు.*



*ప్రస్తుతపు కేరళలో వాడుకలో నున్న భాష మళయాళం, తెలుగు, కన్నడములతో బాటు ఈ భాషని  పేర్కొనక బోవటానికి కారణం, పల్లవుల వలె ఇది కూడ ఈ సమీప కాలానికే చెందటం. వెయ్యి సంవత్సరాల క్రితం వరకూ కూడ కేరళ తమిళనాడులోనే ఉండేది - అక్కడ తమిళాన్నే వాడేవారు. ఆ తరువాత మళయాళం తమిళం నుండి జనించింది. తమిళంలోని 'ళ' (zha) తెలుగులో 'ద'గాను, కన్నడంలో 'ళ' గాను మారినా, మళయాళంలో మాత్రం ఆ రూపంతోనే ఉంది. ఇంతకూ చెప్పేదేమిటంటే ఆయా ప్రాంతాలలో వేదాల ఉచ్చారణల ననుసరించి, ప్రాంతీయ భాషలు తమకి ప్రత్యేక లక్షణాలైన అక్షరాలను ఏర్పర్చుకున్నాయి. ఇప్పటి వరకూ  చెప్పినదంతా ద్రావిడులనబడే వారి భూమికి సంబంధించింది. ఇక అఖిలభారత, అంతర్జాతీయ పరిస్థితి దృష్ట్యా పరిశీలన.*



*ఉత్తర భారతంలో ''య'' బదులు ''జ''ని, 'వ'కి బదులు ''బ''ని వాడటం పరిపాటి. వాడుక భాషలోనే కాక కావ్య భాషలో కూడ ఇట్లాగే జరుగుతుంది. 'వ', 'బ'గా మారటం బెంగాలులో బాగా కనబడుతుంది. ''య'' 'జ'గా మారటం ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఇంకా ఉత్తర ప్రాంతాలలో కనబడుతుంది. పాణిని సూత్రమైన ''వ బయోరభేదం'' ('వ', 'బ'లను ఒక దాని స్థానంలో మరొకటి వాడవచ్చు) బాగా ఆచరణలో ఉన్నట్టు బెంగాలులో తెలుస్తుంది. బెంగాలులో 'వ' ప్రతిచోటా 'బ'గా మారుతుంది. అసలు 'వంగ' అన్నదే 'బెంగాలు'గా మారింది. ''వంగవాసి'', ''బంగవాసి''గా మారింది. ఈ తప్పుని వారే గుర్తించారు. ఈ తప్పుని దిద్దటానికి బెంగాలులో ఒక పరీక్షని కూడ పెట్టారు. దాని పేరు ''వంగ పరిషత్‌'' అన్ని ప్రచురణలలోనూ ''బ'' కి బదులు ''వ''ని వాడాలని వారి సంకల్పం. ఆ సంకల్పంలో అప్రయత్నంగా, అనవసరమైన చోట్ల కూడా ''బ''ని ''వ''గా మార్చారు.'బంధు' (అంటే చుట్టం)ని 'వంధు'గా మార్చారు. 'వంగబంధు' సరియైన మాట. అది ''బంగబంధు''గా మారితే దానిని తప్పుగా ఇప్పుడు 'వంగు వంధు''గా మార్చారు. ఉత్తర భారతంలోనూ, మరికొన్ని ప్రాంతాలలోనూ ''వ''కి బదులు 'బ'ని వాడుతారు. బిహార్‌, నిజానికి విహార్‌. ఈ ప్రాంతంలో బౌద్ధ విహారాలు పుష్కలంగా ఉండేవి. ''రాష్‌ బిహారి'' నిజానికి ''రసవిహారి'' ''వ''ని ''బ''గా పలుకటానికి కారణమేమిటి? ఒక శాఖకి చెందిన ఆ ప్రాంతీయులట్లా పలకాలని ప్రాతిశాఖ్య నిర్దేశిస్తుంది. ఈ నియమం వేద మంత్ర పఠనానికి సంబంధించినది - కాని అదే వాడుక భాషకీ, సాహిత్య భాషకీ విస్తరింప బడింది. అంటే, ఆ ప్రాంతంలో ఒకప్పుడు 'శిక్ష' నియమాలను ఎంతో నిష్ఠతో పాటించే వారనమాట.*



*దేశం మొత్తమ్మీద యజుశ్శాఖవారు అత్యధికులు ఉన్నారు. ఈ వేదానికి రెండు పాఠాలు - అంటే కృష్ణ యజుర్వేదం, శుక్లయజుర్వేదం ఉన్నాయని కూడ. దక్షిణ భారతంలో కృష్ణయజుర్వేదం బహుళ ప్రచారంలో ఉంటే, ఉత్తర భారతంలో శుక్ల యజుర్వేద ముంది. శుక్లయజుర్వేదానికి గల అనేక శాఖలలో ఒకటి మాధ్యన్దిన శాఖ. దీనిని ఉత్తర భారతంలో నిష్ఠగా అనుసరిస్తారు. తత్సంబంధమైన ప్రాతిశాఖ్య ప్రకారం ''య'' స్థానంలో ''జ''ని వాడవచ్చు. అట్లాగే ''ష'' స్థానంలో ''క''ని వాడవచ్చు. అందువల్లే దాక్షిణాత్యులు ''యత్‌ పురుషేణ హనిషా'' అంటే ఉత్తర దేశీయులు ''జత్‌'' ''పురుషేణ హవికా'' అంటారు. కాలక్రమేణా ఉత్తరదేశంలో ఈ మార్పు చాలా మాటలకి వ్యాపించింది. ''యమున'', ''జమున''గాను, 'యోగి', 'జోగి'గాను 'యుగ', 'జుగ'గాను, 'యాత్ర', 'జాత్ర'గాను మారాయి. 'ష' 'క'గా మారినప్పుడు 'ఋషి' 'ఋకి'గా మారింది. 'క్ష', 'ష' సన్నిహిత బంధువులు కదా. అందువల్లనే ఉత్తరదేశంలో 'క్ష', 'క' అవుతుంది. 'క్షీరం' 'కీర్‌' అవుతుంది. ఇట్లాంటివే ఎన్నో ఉదాహరణలివ్వ వచ్చు.*



*ఇక అంతర్జాతీయ స్థాయిలో పరిశీలన. క్రైస్తవం, బైబిల్‌ జన్మించిన పాలస్తీనాకూ, ఇజ్రెయిల్‌, సెమిటిక్‌ దేశాలకూ వెళ్దాము. క్రైస్తవుల ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ - ముస్లిం కొరాన్‌కి మూలం. మొదటి దాంట్లో ఉన్నవి రెండవ దాంట్లో ప్రత్యక్షమవు తూంటాయి. కాని అరేబియాలో ఉచ్ఛారణ మారుతూంటుంది. 'జోసెఫ్‌' 'యూసఫ్‌'గాను, 'జెహొవ' 'యహొవ'గాను మారుతాయి. క్రైస్తవం, ఇస్లాంలకు మాత్రమే పరిమితం కాదు. క్రైస్తవ దేశాలలో కూడ కొన్ని భాషలలోనే 'య' శబ్దం ప్రముఖంగా ఉంటుంది. కొన్నిటిలో 'జ' శబ్దం ఎక్కువౌతుంది. గ్రీస్‌ వెళ్లితే 'జ' శబ్దం స్పష్టమవుతుంది. దీనంతటికీ మూలం వేదాలలో కనిపిస్తుంది.*



 *వేదాలలోని ''యహ్వన్‌'' అన్న దేవత జహోవ (యహోవ), దేపిత - జూపిటర్‌, సంస్కృతంలో అసంపూర్ణమైన హల్లులు మొదట్లో వస్తే మరొక భాషలో చెప్పేప్పుడు దానిని వదిలివేస్తారు ''దౌపతిర్‌'', ''¸°పితర్‌''గాను జూపిటర్‌గాను మారుతుంది. ''యహ్వన్‌'', ''ద్యౌపితర్‌'' లలోని 'య' 'జ'గా మారటం వల్ల 'జెహోవ' జూపిటర్‌ ఏర్పడ్డాయి - దీని అర్థమేమిటి ?ప్రపంచమంతా వేదవిహితమైన విధులు వ్యాప్తమై యున్న రోజులలో, గ్రీస్‌ ప్రాంతంలో ''మాధ్యన్దిన శాఖ'' (యజుర్వేదం) బాగా ప్రాచుర్యంలో ఉండేదని తెలియటం లేదా? వేదపద ఉచ్చారణ ప్రాంతీయ భాషను ప్రభావితం చేసిందా లేక ప్రాంతీయ భాష వేదపద ఉచ్చారణనా?ఒక్కొక్క ప్రాంతంలో వేదాలలోని పదాలే ఆ ప్రాంతపు వాడుక భాషలో, కావ్య భాషలో వాడబడేవి. దీని బట్టి వేదాలన్ని దేశాలలోనూ వ్యాప్తి చెందాయని తెలుస్తుంది.*



*వేదాల శిక్షానియమాలు ప్రాంతీయభాషలకు ప్రధాన ఉచ్ఛారణ లయ్యాయి. దీనికి కారణం ప్రాతిశాఖ్య నియమాలు ఏ ఒక్క ప్రాంతానికీ చెందినవి కాకపోవటం. వేదశాఖ ప్రచారంలో ఉన్న ప్రాంతాలన్నిటి కొరకూ ఏర్పడింది. కాశ్మీరులోనైనా కామరూపం (అస్సాం)లోనైనా జైమిని సామని పఠించేవారు ''ష'' అని పలికితే ఇతరులు ''ద'' అనో ''ళ'' అనో పలుకుతారు.గుజరాతీయైనా, మరాఠీ అయినా, మరేదైనా మాతృభాష కావచ్చు శుక్లయజుర్వేదాన్ని పఠించేవాడు ''ద''నే పలుకుతాడు. ప్రాతిశాఖ్య ఏ ప్రాంతానికీ పరిమితం కాదు, ఉచ్చారణ నియమాలను నిర్దేశిస్తుంది. కాలక్రమేణా ఏ శాఖ ఏ ప్రాంతంలో వాడుకలో ఉంటే, ఆ అక్షరానికి గల ప్రత్యేక లక్షణం ప్రాంతీయ భాషకి కూడ ప్రాకింది.శిక్షా శాస్త్రం గురించి గమనింపదగ్గ మరికొన్ని అంశాలు: వేద శబ్దాలను, ఉచ్చారణ పద్దతులను మార్చరాదన్నాను. శాఖా భేదాల వల్ల చిన్న చిన్న మార్పులను శిక్షాశాస్త్రం అనుమతిస్తుంది. ఆ విధంగానే స్వరస్థాయికి సంబంధించిన మార్పులూ ఆమోద యోగ్యాలే.*



*వేదాలను వల్లించటంలో సంహిత, పద, క్రమ పద్ధతులున్నాయని చెప్పాను. ఆయా భిన్న రీతులని ప్రాతిశాఖ్య అనుమతిస్తుంది. ఇవి శిక్షాశాస్త్ర భాగాలు. ఇదేదో శబ్దాలకి సంబంధించిన చర్చ అని తేలికగా చూడకూడదు. సంస్థితమైనది శబ్దమే. అందువల్లనే వేదపురుషుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిపే నాసిక, శిక్షాశాస్త్రం. సంస్కృతంలోని 50 అక్షరాలు (శబ్దాలు) వేదాలనుండి వచ్చినవే. ''జ్ఞ'' అన్న అక్షరాన్ని విడిగా తీసుకుంటే 51 అవుతాయి. వీటిని ''మాతృక'' అంటారు. ఈ మాటకి చాలా అర్థాలున్నాయి. మాతృ అంటే మాత - దీని అర్థం విశ్వమాత. ఆ పరాశక్తి ప్రతిబింబాలే ఈ 51 అక్షరాలూను. జగత్‌సృష్టి పరాశక్తి వల్లనే జరిగితే, సృష్టికి శబ్దమే మాధ్యమమైతే 51 అక్షరాలూ పరాశక్తి స్వరూపాలే అవుతాయి కదా!*



*శిక్షాశాస్త్రం ప్రకారం ఈ 51 శబ్దాలూ పరాశక్తి శరీరభాగాలే - అంతే కాదు, ఏ అక్షరం ఏ శరీర భాగానికి ప్రతీకో కూడ ఆ శాస్త్రం చెప్తుంది. మన దేశంలో కల శాక్తేయుల 51 స్థావరాలకూ, ఆ విశ్వ దేహపు 51 భాగాలకు సంబంధముంది. శిక్షాశాస్త్రం వేదపురుషుని నాసికగా భావింప బడటమే కాక అక్షరాలన్నీ కలిసి పరాశక్తి - విశ్వమాత - రూపంగా భావింప బడటం ఆ శాస్త్ర ప్రాధాన్యతని మరీ ఎక్కువ చేస్తుంది!*


🕉🌷🕉🌷🕉🕉

ఏది గమ్యం

 (25.03.2021ఈనాడు అంతర్యామి లో వ్యాసం..ఎర్రాప్రగడ రామకృష్ణ)

--------------------------------------

ఏది గమ్యం ?

==========

   నీటిలో మునిగితే- అది స్నానం. నీలో మునిగితే- అది ధ్యానం. నీలోకి నీవు మునిగిపోవడం నీళ్ళలో మునిగినంత తేలిక కాదు. స్నానానికి సాధనతో పనిలేదు. ధ్యానానికి సాధన తప్ప వేరే దారి లేదు. ధ్యానం కుదరడం లేదని ఫిర్యాదు చేసే  చాలామంది చెరువు గట్టున నిలబడి చూసేవారే కాని, నీళ్లలోకి దిగినవారు కారు.


తన వద్ద శిష్యరికం చేసిన పూర్వ విద్యార్థిని పిలిపించి బుద్ధుడు ధ్యానం గురించి అడిగాడు. శిష్యుడికి అది రెండో ఎక్కం లాంటిది. రకరకాల ప్రక్రియలు, ధ్యాన దశల గురించి అప్పటికే విశేషంగా చదివి ఉన్నాడు. పరిశోధనలు చేశాడు. ఆ విద్యలో గట్టి పాండిత్యం సాధించాడు. కనుక బుద్ధుడు అడిగీ అడగ్గానే ఎన్నో సాధనా విధానాలను గడగడా వల్లించాడు. బుద్ధుడు శిష్యుడికేసి ప్రసన్నంగా చూస్తూ ‘మంచిది భిక్షూ! ఇక ధ్యాన సమయంలో నీవు పొందిన అలౌకిక అనుభూతులను కొన్నింటిని వివరించు’ అని అడిగాడు. తెల్లబోయాడు శిష్యుడు. నోట మాట రాలేదు. ‘ఎవరికైనా  ధ్యానం గురించి పాఠం చెప్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని సాధించావే తప్ప నీవు నిజమైన ధ్యానివి కాలేకపోయావు’ అన్నాడు బుద్ధుడు. లోకంలో సాధకులమనుకునే వారిలో చాలామందిది ఇదే పరిస్థితి.

(రచన... ఎర్రాప్రగడ రామకృష్ణ)

నిజానికి ధ్యానమంటే గాఢమైన అనుభూతే తప్ప, ఆలోచన కానేకాదు. ధ్యానంలో ఆలోచించడానికి ఏమీ లేదు. వెదురుబొంగు లోపల దట్టంగా అలముకున్న గుజ్జు, పోగులు పూర్తిగా కాలిపోయి, ఖాళీ అయ్యాక- వేణువు కావడానికి సిద్ధమవుతుంది.  ముసురుకున్న ఆలోచనలను తుడిచేశాక, ధ్యానం తానుగా మనసులోకి  వచ్చి చేరుతుంది. ఆపై నెమ్మదిగా గుండెల్లో ప్రశాంతత ఆవరిస్తుంది. ఆనందం వరిస్తుంది. శరీరం గొప్ప శక్తి కేంద్రమై తరిస్తుంది. ఈలోగానే  ఆలోచనలు తిరిగి దాడి చేస్తాయి. పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి. అవి చాలా బలమైనవి. వాటిని ప్రతిఘటిస్తే మనిషి విఫలమవుతాడు. పారిపోతే దొరికిపోతాడు. వాటితో ఘర్షణ వృథా! సాధకుడు వాటిని స్వేచ్ఛగా లోనికి  అనుమతించాలి. చిరునవ్వుతో పలకరించాలి. ఆలోచనలకు దారివ్వడమంటే మనసును మచ్చిక చేసుకోవడమని అర్థం. ఆ సాక్షీభూత స్థితిలో మనిషికి, మనసుకు మధ్య స్నేహం కుదురుతుంది. ఆలోచనలనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. వేగంగా కదిలిపోతూ ఉంటాయి. వాటంతటవి తొలగిపోయేవరకు మనిషి ఓపిక పట్టాలి.


ఆ సంధి  సమయంలో మనిషికి సహనమే గొప్ప వరం. ధ్యానం కోసం వేచి చూసే స్థితికి చేరుకోవడం విజయంలో తొలిమెట్టు. ఆ స్థితిలో మనసులోకి వచ్చి పోతున్నా పట్టించుకోని విషయాలే స్వయంగా మనిషిని ధ్యానంలోకి తోసేస్తాయి. పరిశీలనలోంచి మనసును అనుభూతిలోకి, ఆస్వాదన లోకి నెట్టేస్తాయి. లీలగా మనిషి ధ్యానంలో లీనమవుతాడు.    

సాధన  క్రమంలో ఒళ్ళు జలదరించడం, ఆవలింతలు రావడం, అకారణమైన ఆనందమేదో గుండె తలుపు తట్టడం గాని  జరిగితే- అవన్నీ ధ్యానంలో పురోగతికి సూచనలని  మనం గ్రహించాలి. పరమహంస యోగానందజీ  చెప్పినట్లు వాటి  ప్రోత్సాహంతో మరింత లోతులకు ప్రయాణం సాగించాలి. ఆ అనుభూతులు వాటంతటవే రావాలి తప్ప మనం ఎదురు చూడకూడదు,  వాటికోసం ప్రయత్నించకూడదు. వైకుంఠపాళిలో  నిచ్చెనల్లాంటివవి. ధ్యానానికి గమ్యం- ఆ నిచ్చెనలు కావు... పరమపద సోపానం!

--- ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి.

రెండు ఇడ్లీలు*

 *రెండు ఇడ్లీలు*

_(రచన-గండ్రాజుల ప్రవీణాఉదయ్)_

*వేదవతి  ప్రతిరోజు  తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లీలు పెడుతూ  వచ్చేది.*  

*_ఆకలితో ఉన్నవాళ్లు  ఎవరైనా  తింటారులే..అని._*


*రోజూ ఆ దారివెంట  వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం ఏదో  చిన్నగా  గొణుక్కుంటూ  వెళ్లడం  జరిగేది.* 

*ఒకరోజు వేదవతి గోడ  పక్కనే  నిలబడి అతను  ఏమి అంటున్నాడో  వినాలని  అనుకున్నది.*  


*అతను చెప్తున్న మాటలు....* 

*"నువ్వు చేసిన  పాపం నీ దగ్గరే ఉంటుంది.* 

*నువ్వు చేసే పుణ్యం  వచ్చి నిన్నే  చేరుతుంది."*  


_ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు. రోజు ఇడ్లీ  పెడుతున్నాను. తీసుకు  పోతున్నాడు._ 


*"నువ్వు మహాలక్ష్మివి  చల్లగా ఉండమ్మా! అని చేతులెత్తి మొక్కక పొయినా పర్లేదు.... ఇడ్లీలు బావున్నాయని  చెప్పకపోయినా పర్లేదు.... కనీసం ధన్యవాదాలు అమ్మా!" అని చెప్పడం  కూడా  తెలియలేదా  ఇతనికి?*  


_ఏదో ఆ చెత్త వాగుడు  వాగిపోతున్నాడు. అని చాల కోపంతో  రగిలిపోయింది.  అయినా ఇడ్లీలు పెట్టడం మాత్రం మరిచిపోలేదు._


*రోజురోజుకి అతనిపై  పెరుగుతున్న  కోపం  అతనిని  చంపేయాలి..  అనేంతగా  మారిపోయింది.*  


*ఒకరోజు ఆ ఇడ్లీలపై  కాస్త విషం చల్లి పెట్టబోయింది. కానీ మనసు ఒప్పుకోలేదు... చేతులు వణకడం  మొదలెట్టాయి. ఆలోచన మొదలయింది.* 

*ఛ.. ఛ* వద్దులే... అతను అలా ఉంటే  నేను ఎందుకు ఇలా మారిపోయాను.  అని ఆ ఇడ్లీలు పడేసి  మంచి ఇడ్లీలే పెట్టింది. 


*ఆ వ్యక్తి  ఇడ్లీలు తీసుకుని  మళ్ళీ అవే మాటలు చెప్తూ  వెళ్ళాడు. కొట్టాలన్నంత కోపం  వచ్చినా తనను  తాను  సమాధాన  పరుచుకుంది.*  


*_ఆ రోజు మిట్ట మధ్యాహ్నం  ఎవరో తలుపు కొట్టినట్టు   ఉంటే వెళ్లి  తలుపు తీసింది. ఎదురుగా మురికి  బట్టలతో ఓ యువకుడు.🙎‍♂️అతను ఎవరో కాదు సొంతంగా ఉద్యోగం  చేసుకుంటానని ఇల్లు వదిలి  అలిగి  వెళ్లిన తన కొడుకే._* 


*అమ్మా! ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించారు.*  💰

*చేతిలో చిల్లి గవ్వ లేదు. బాగా ఆకలి కళ్ళు తిరిగి పడిపోయాను.*  

*ఎవరో ఓ ముసలాయన రెండు ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు. నా ప్రాణాలు  కాపాడాడు.  అని చెప్పాడు.*  👨🏾‍🦯


*ఆ మాటలు వినగానే  ఆమెకు  వణుకు  పుట్టేసింది.*  

*విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే నా కొడుకుకి  నేనే  యముడినై  ఉండిఉంటానే  అని కంటతడి  పెట్టుకుంది.*  


*ఇప్పుడు ఆమెకు  ఆ ముసలాయన మాటలక అర్థం  తెలిసింది.*  


*"నువ్వు చేసిన పాపం నీతోనే  ఉంటుంది* 

*నువ్వు చేసే మంచి నిన్ను  వెతుకుని  వచ్చి చేరుతుంది."*


_అందరికీ అన్ని అర్థం అవ్వవు._  

_అర్థం అయ్యేంతవరకు  ఎవ్వరమూ  ఎదురుచూడము._


*చేసిన ధర్మం  ఎప్పుడూ   ఏదో ఒక రూపంలో  మనకు  వచ్చిచేరుతుంది*


*ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకుందాం.*


*మనం తెలియక చేసే తప్పులనుండి  బయట పడే ఒకేఒక్క మార్గం... మంచి చేయడం మాత్రమే!*


*ధర్మాన్ని కాపాడుదాం- అది మనల్నీ కాపాడుతుంది.*


🙏🙏🙏🙏🙏 *(సేకరణ -వెలిశెట్టి నారాయణరావు)*

కోవిడ్ వాక్సిన్ ,,, అపోహలు

 కోవిడ్ వాక్సిన్ తీసుకున్నా కూడా పాజిటివ్ వచ్చింది లేదా వస్తున్నది అనే దాని మీద ఉన్న అపోహలు గురుంచి వాస్తవం తెలుసుకుందాము. 

వాక్సిన్ తీసుకున్న తరువాత మన శరీరం లో యాంటీ బాడీలు ఉత్పత్తి కావడానికి హీన పక్షం 28 రోజులు పడుతుంది. 28 రోజు మళ్ళీ రెండవ డోసు తప్పక తీసుకోవాలి. రెండవ డోసు తీసుకున్నాక మరో 15 లేదా 20 రోజుల కి మన శరీరం యాంటీ బాడీలని పూర్తిగా ఉత్పత్తి చేసుకుంటుంది. 

వాక్సిన్ తీసుకున్న తరువాత కనీసం 2 నెలలు సిగరెట్,ఆల్కహాల్,జర్దా పాన్, గుట్కా లాంటివి అసలు తీసుకోకూడదు అంటే 2 నెలలు పూర్తిగా వాటికి దూరంగా ఉంటేనే వైరస్ యాంటీ బాడీలు పూర్తిగా ఉత్పత్తి అయ్యి మనకి వైరస్ నుండి రక్షణ కల్పిస్తుంది. తాజాగా మొదటి డోసుకి రెండో డోసుకి మధ్య 28 నుండి 60 రోజులు గాప్ ఉంటే మంచి ఫలితాలని ఇస్తున్నట్లు తెలుస్తున్నది. 

ఇమ్రాన్ ఖాన్ వాక్సిన్ తీసుకున్న రెండో రోజే కోవిడ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి చైనా వాక్సిన్ పనిచేయలేదు అనే ప్రచారం వాస్తవం కాదు. నిజానికి వాక్సిన్ తీసుకున్న తరువాత సెల్ఫ్ క్వారంటయిన్ లో నెల రోజులు ఉంటే వాక్సిన్ ప్రభావం బాగా ఉంటుంది. మొదటి డోసుకి రెండో డోసుకి మధ్య కాలంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అలాగే వీలున్నంత వరకు జన సమూహం లో తిరగకుండా ఉండాలి అప్పుడే వాక్సిన్ ప్రభావం చూపిస్తుంది అంతే కానీ ఇవాళ వాక్సిన్ వేసుకున్నాను కాబట్టి రేపటి నుండి మనకి వైరస్ శోకదు అనేది అపోహ మాత్రమే !

రెండు రోజుల క్రితం ఒక మహిళ ఆడపిల్లకి జన్మనిచ్చింది అయితే డాక్టర్లు పుట్టిన బిడ్డకి పరీక్షలు జరపగా ఆ బిడ్డలో కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. సదరు మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే వాక్సిన్ తీసుకున్నది అంటే తల్లి వాక్సిన్ తీసుకుంటే పుట్టిన బిడ్డలో యాంటీ బాడీలు సహజ సిద్ధంగా వచ్చేశాయి.

లక్ష్మీదేవి జయంతి*_

  లక్ష్మీదేవి జయంతి*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి , స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివశించే ప్రాంతాల్ని , ప్రదేశాల్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుని , ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని , సంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాలల్లో లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాం.


క్షీరసాగర మధనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు , అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది.


విష్ణుపురాణంలో వేరొక గాథ కనపడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ *ఖ్యాతి చేసిన తఫః ఫలమే* లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది.


లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు , చదవవలవసిన మంత్రాల గురించి పురాణాలలో అనేకచోట్ల అనేక కథలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు *కనకధారాస్తవం* పఠించాడని , అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి.

అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ , ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవజీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్దలతో పూజచేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్ళను , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుదాం.


లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు , ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించిందని చెపుతారు.


జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుండి , తామస మన్వంతరంలో భూమినుండి , రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి , చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతోంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీజయంతిని మనం జరుపుకుంటున్నాం. వైవస్వతంలో శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది.


పూర్వం ఒకసారి దూర్వాస మహా ముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి , కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై *”నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక”* అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు.


దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణువేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని విష్ణువువద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మధనం ద్వారా అమృతాన్ని ఉద్బవింపచేసి , ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు.


క్షీరసాగరమధనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా , తరువాత సురభి అనే కామధేనువు , ఉచ్ఛ్వైశ్రవం అనే అశ్వం , పిమ్మట ఐరావతం , కల్పవృక్షం , వీటన్నింటి తరువాత క్షీరాబ్ధి నుంచి ఉత్తరఫల్గుణి నక్షత్రంలో శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాధ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తుంటాం.


భక్తిశ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరిసంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది. బలము , మేధస్సు , ఆరోగ్యం ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి.

పాకవేదం

 విశాఖ పట్నం నుంచి లక్ష్మి గాయత్రి గారు వ్రాసిన ఈ కథనం అద్భుతః 🙏

బఫె భోజనాలు, బిర్యానీ మసాలాలతో విసిగి వేసారిన జనానికి, ఒక్కసారి పాతకాలపు పెళ్లి రుచి చూపించారు.


కథావల్లరి - 3

    

                            పాకవేదం


"బాపన్నగారమ్మాయికి పెళ్లి కుదిరిందిటా...విశేషాలేమిటి పంతులు గారూ..?!"

"పెళ్లి ఎక్కడ చేస్తున్నారు పంతులు గారూ... దసపల్లా లోనా.. డాల్ఫిన్ లోనా"

"మనందరికీ బస్సు వేయిస్తారా లేదా బాపన్న గారు... ముందది చెప్పండి పంతులు గారూ.. "

                       విశాఖపట్నానికి అత్యంత సమీపంలో ఉన్న పల్లెటూరది. బాపన్న గారు ఆ ఊళ్లో పేరు మోసిన భూస్వామి. ఆయనకి ఉన్న సంతానమల్లా కూతురు జానకి ఒక్కర్తే. జానకి పేరే పాత పేరు. అందరూ లాస్య, షర్మిల లాంటి పేర్లు పెట్టుకుంటున్న రోజుల్లో బాపన్న గారు కూతురికి 'జానకి' అని తన తల్లి పేరు పెట్టుకున్నారు. పిల్లని పద్ధతిగా పెచుకొచ్చారు. జానకి కూడా తండ్రికి తగ్గ కూతురే. చదువులో సరస్వతే గాని ఫ్యాషన్ల రాణి మాత్రం కాదు. అన్ని రకాల ఆధునిక దుస్తులూ వేసుకుంటుంది.. కాని ఎక్కడా అసభ్యత కనబడనివ్వదు. నల్లని, ఒత్తైన నిడుపాటి కురుల్ని చక్కగా జడ వేసుకుని మల్లెలూ, మొల్లలూ, కనకాంబరాలూ పెట్టుకుంటుంది. పండుగలకి చక్కగా పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని రుక్మిణీదేవిలా అమ్మవారి గుడికి వెళుతూ ఉంటుంది. 

                   ఆంధ్రా యూనివర్సిటీ కాలేజీలో సీటు తెచ్చుకుని, ఇంజనీరింగ్ టాప్ ర్యాంక్ లో పాసైన జానకికి ఉద్యోగం కూడా వచ్చేసింది. అందులో జాయిన్ అవకముందే సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఆ ముందు రోజునే పెళ్లి చూపులయాయి. ముహూర్తాలు పెట్టే పండితులు వేరే ఉన్నా, అమ్మాయి భక్తిగా కొలిచే అమ్మవారి గుడి పూజారి గదా అని రామయ్య పంతుల్ని కూడా చూపులకి ఆహ్వానించారు బాపన్న. మొత్తం తతంగం అంతా పూర్తి అయి, రామయ్య పంతులు ఇల్లు చేరే సరికి రాత్రి తొమ్మిదైంది. తెల్లారి ఆయన గుడికి వచ్చిన దగ్గర నుంచీ జనం వస్తూనే ఉన్నారు... బాపన్న గారమ్మాయి పెళ్లి గురించి తలో ప్రశ్నా వేస్తూనే ఉన్నారు. వాళ్లని కాస్త ఆగమని, అమ్మవారి పూజాదికాలు గబగబా కానిచ్చేశాడు పంతులు. తీరిగ్గా మంటపంలోకి వచ్చి కూచుని, "చెప్పుకోవాలే గాని పెద్ద కథర్రా. మహా పసందైన కథ" అన్నాడు. 

     "చెప్పండి.. చెప్పండి" జనం ఆయన చుట్టూ చతికిలబడ్డారు

          "బాపన్నగారు ఎంత పద్ధతి మనిషో మనకి తెలిసిందే కదా. ఆయనకి కాబోయే వియ్యంకుడు మరో నాలుగాకులు ఎక్కువ. పెళ్లి ఏ దసపల్లా లోనూ కాదు. ఇక్కడే.. మనందరి మధ్యనే... "

     శ్రోతల ఆశ్చర్యానికి మేర లేదు. 

   "అవునర్రా... నిన్న బాపన్న గారూ, ఆయన వియ్యంకుడూ మాట్లాడుకున్న మాటలు వింటుంటే నాకు ఒళ్లు గరిపొడిచిందనుకోండి. పెళ్లి వైశాఖ మాసంలో.. ఇక్కడే. తాటాకు పందిరేసి ఇంటి ముంగిట్లోనే. అచ్చంగా ఒకప్పటి పెళ్లిళ్లు ఎలా జరిగేవో అలాగే. ఒక్క స్వీటు ముక్క కూడా బజార్లో కొనరు. పెళ్లికి పదిహేను రోజుల ముందే వియ్యంకుడు గారు రంగాజమ్మ గారి బృందాన్ని ఇక్కడికి పంపిస్తారుట. రంగాజమ్మ గారంటే వంటావిడ. జానకి అత్తవారి ఊళ్లోనే ఆవిడా ఉంటుందిట. రంగాజమ్మ, ఆవిడ తమ్ముడు, కొడుకు, కోడలు, ఇంకా మరో ఇద్దరు కుర్రాళ్లు.. వీళ్లంతా కలిసి ఒక బృందం. మర కత్తిపీటలు, మామూలువి పెద్ద పెద్ద కత్తిపీటలు,పనసకాయ కత్తులు, బూందీ చట్రాలు ఇలాంటి సామగ్రి అంతా వాళ్ల దగ్గర ఉంటుందిట. ఐదారువందల మంది జనానికి అవలీలగా వండి వారుస్తారుట. లడ్డూలు, అరిసెలు, బూరెలు వగైరా వంటలు అద్భుతంగా చేస్తారుట. పనసపొట్టు కూర, కందా బచ్చలి, వాక్కాయ పప్పు, ఆవ పెట్టిన పులిహోర ఇలాంటి పాతకాలం వంటలు వీళ్లు చేసినట్టు ఎవ్వరూ చెయ్యలేరుట. 

                     పెళ్లికి పదేను రోజుల ముందొచ్చి వాళ్లు ఆవకాయ, మాగాయ, తొక్కుపచ్చడి వగైరాలు పెడతారుట. అప్పడాలు, వడియాలు కూడా ఇంట్లోనే తయారు చేస్తారుట. పెళ్లి దగ్గర పడనిచ్చి లడ్డూ, సున్ని, మైసూర్ పాక్, చక్కిలాలు, కారం బూందీ చేస్తారుట. పెళ్లి కార్యక్రమాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఆ రెండ్రోజులూ మన ఊరు ఊరంతటికీ బాపన్న గారింట్లోనే భోజనాలు. "మనిద్దరికీ డబ్బుకి లోటు లేదు. మన అభిరుచి మేరకు ఇలా చేద్దాం" అని వియ్యంకులిద్దరూ మాట్లాడుకున్నారు. "మీక్కావలిస్తే సిటీలో మళ్లీ రిసెప్షన్ ఇద్దాం" అని పెళ్లి కొడుకుతో వాళ్ల నాన్న అంటే ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా... వాళ్ల ఫ్రెండ్స్ కూడా హొటళ్లూ, బిర్యానీలతో విసిగెత్తిపోయి ఉన్నారుట... "వాళ్లకి కూడా ఇవే నచ్చుతాయిలే నాన్నా" అన్నాడు. 

అథారిటీ సంగతి"

                  రామయ్య పంతులు చెప్పడం పూర్తి చేసిన మరుక్షణం నుంచే జనం రంగాజమ్మ బృందం కోసం ఎదురు చూపులు ప్రారంభించారు. 

                      అనుకున్న రోజు రానే వచ్చింది. తెల్లని మల్లుచీర కట్టుకుని, వేలిముడి వేసుకున్న రంగాజమ్మా, పెద్ద కత్తిపీట పుచ్చుకుని అత్తగారి అడుగుజాడల్లో నడుస్తూ ఆవిడ కోడలూ, నామం దిద్దుకుని ఓ భుజం మీద కండువా, ఇంకో భుజం మీద పనసకాయ కత్తీ పట్టుకుని ఆవిడ తమ్ముడూ, మర కత్తిపీటలు పట్టుకుని కుర్రాళ్లూ దిగారు. 

                     బాపన్నగారూ, ఆయన వియ్యంకుడూ ఏర్పాటు చేసిన ప్రకారం అప్పటికే మాడుగుల నుంచి ఆవాలు, బందరు నుంచి మిరపకాయలు, అనకాపల్లి నుంచి బెల్లం దిమ్మలు, సామర్లకోట నుంచి పప్పునూనె, నూజివీడు నుంచి రసాలు, బంగినపల్లి కాయలు ఇంకా ఇతర సామగ్రి వచ్చేశాయి. 

     "అత్త లేని కోడలుత్తమురాలూ ఓయమ్మా.. "అంటూ ఆవాలు, మిరపకాయలు దంపి, ఆవకాయ పని ముగించారు. ఊరంతా తలా కాస్తా రుచి చూసి "హా" అంటూ లొట్టలేశారు. 

              రంగాజమ్మ బృందాన్ని చూస్తూనే ప్రేమలో పడిపోయిన ఊరి జనం, వాళ్ల చేతి ఆవకాయ రుచి చూశాక దాసోహం అంటూ తలో పనీ అందుకుని సాయం చెయ్యడం ప్రారంభించారు. 

                     ఆవకాయలతో బాటే కారం అప్పడాలు, పెసర అప్పడాలు రంగాజమ్మా, కోడలూ వత్తి ఇస్తూ ఉంటే మిగిలిన వాళ్లు ఆరబెట్టి, బొత్తులు పెట్టారు. మినపప్పు నానబోసి రుబ్బి గుమ్మడి వడియాలు, పులుసులూ కూరల్లోకి చిట్టొడియాలూ పెట్టారు. సగ్గుబియ్యం ఉడికించి పల్చగా అప్పడాలంతేసి సగ్గుబియ్యం వడియాలు పెట్టారు. 

                        ఆవకాయలు, అప్పడాలు, వడియాల పని అయాక, బాపన్న గారి పెరట్లోనే దగ్గరుండి గాడిపొయ్యి తవ్వించింది రంగాజమ్మ. వేసవి ఎండకి ఎండిన కట్టెల్ని పొయిలో పెట్టి, శుభ ముహూర్తం చూసి ఇంత కర్పూరం వేసి వెలిగించగానే, హోమాగ్నిలా ఝామ్మంటూ మంటలు లేచాయి. గాడిపొయ్యి దగ్గర వంతుల వారీగా పిండివంటలు చేసే పని రంగాజమ్మ, ఆవిడ తమ్ముడిదే. మిగిలిన వాళ్లు పిండి కలపడం, ఉండలు చుట్టడం వగైరా పనులు చేసేవారు. 

                బాపన్నగారి కోరిక మేరకు పంచదార లడ్డూ, బెల్లం లడ్డూ రెండూ చేశారు రంగాజమ్మ అండ్ పార్టీ. పచ్చకర్పూరం ఘుమఘుమలకు స్వచ్ఛమైన నేతి గుబాళింపు జోడై, లడ్డూ నోట పెట్టిన వారికి స్వర్గం అరడుగు దూరంలో కనిపించింది. నేతి తడితో మెరుస్తూ తయారైన మైసూర్ పాక్ దాని రుచి ముందు మైసూరు రాజ్యం కూడా దిగదుడుపే అనిపించేసింది. బెల్లంతో చేసిన మినపసున్ని, ఒక్కటైనా తినకపోతే జన్మ ఎందుకు అనిపించింది అందరికీ. చక్కిలాల కరకర, బూందీలో జీడిపప్పు మిసమిస జీవితం పసందుగా ఉందనిపించాయి.

                   ఇలా ముందస్తు ఏర్పాట్లు పూర్తయి, పెళ్లివారు తరలి వచ్చారు. ఊరు ఊరంతా వాళ్లకి స్వాగతం పలికి, తమ ఇళ్లన్నీ విడిదిగృహాలే అనుకోమన్నారు. సింహాచలం నుంచి వచ్చిన మరో నలుగురు పండితులతో బాటు రామయ్య పంతులు కూడా పెళ్లి పౌరోహిత్యం స్వీకరించాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు తలో పనీ అందుకున్నారు. మొదటిరోజు కత్తెర స్నాతకం - తోట సంబరం సంబరంగా ముగిశాయి. తమ ఆడపడుచు పెళ్లి జరుగుతున్నంత ఆనందంగా ఊరి జనం పెళ్లి పనుల్లోనూ, కార్యక్రమాల్లోనూ పాలు పంచుకున్నారు. వాక్కాయ పప్పు, పనసపొట్టు కూర, గుత్తి వంకాయ, గోంగూర పచ్చడి, ముక్కల పులుసు, ఆవడలు, బొబ్బట్లు, పాయసంతో తొలిరోజు విందు జరిగింది. 

                      మర్నాడు పెళ్లికొడుకు శ్రీరామ్ జానకి మెడలో తాళి కట్టిన తరువాత అందరికీ కొబ్బరి బొండాలు కొట్టి ఇచ్చారు. కందా బచ్చలి కూర, అరటికాయ బెల్లం వేసిన కూర, మావిడికాయ పప్పు, కొబ్బరి, మావిడి కలిపి పచ్చడి, పులుసు, ఆవ పెట్టిన పులిహోర, బూరెలు, చక్రపొంగలి, లడ్డూ, బంగినపల్లి మామిడి పండు ముక్కలు, కమ్మని పెరుగు.. వీటితో పెళ్లి భోజనం చేసి ఊరంతా భుక్తాయాసంతో బ్రేవ్ మంటూ త్రేన్చింది. 

                 పెళ్లి జరిగిన మర్నాడు కొత్త కోడల్ని తీసుకుని పెళ్లివారు బయల్దేరారు. ఊళ్లో ముఖ్యమైన వాళ్లు కొందరు కార్ల దగ్గరకి వచ్చి జానకికి వీడ్కోలు పలికారు. మిగిలిన వాళ్లంతా ఇంకా పెళ్లి భోజనపు మత్తు వదలనట్టు ఇళ్లల్లో పడుకున్నారు. 

                    మరో రెండు రోజుల్లో బాపన్న గారి ఇంట్లో అన్నీ సర్ది పెట్టి, మంచిరోజు చూసి గాడిపొయ్యి కూడా మూసి పెట్టి రంగాజమ్మ బృందం తిరుగు ప్రయాణమైంది. వాళ్లు సొంత కష్టంతో కొనుక్కున్న మెటడార్ వ్యాన్ లో కత్తులూ కత్తిపీటలూ అన్నీ సర్దుకోబోయేసరికి ఊరు ఊరంతా అక్కడ హాజరైంది. రంగాజమ్మ బృందాన్ని కూర్చోబెట్టి సామానంతా ఊరిజనమే సర్దారు. 

    "ఈ మర కత్తిపీటతో ఆయన అంతలేసి మావిడికాయల్ని ఎంత చులాగ్గా టకటకా తరిగేశారో.. మళ్లీ అన్ని ముక్కలూ ఒక్కలాగే వచ్చాయ్"

    "దీని పేరే పనసకాయ కత్తి ట. ఆ పెద్దమ్మ గారు దీంతో పనసకాయని ఎంత చిన్న ముక్కలుగా కొట్టారో... అసలు కత్తి కదులుతున్నట్టే అనిపించేది కాదు. పెద్దయ్యగారు నేర్పారంట ఆమెకి అలా తరగడం"

   "ఈ చట్రంతో పెద్దమ్మ గారు మిఠాయి బూందీ కొట్టి పెట్టేస్తే కోడలు గారు ఎంత చకచకా ఉండలు కట్టేదో... ఆవిడ చేతులు మంట పెట్టవా అని నేను అనుకునేదాన్ని గానీ ఆవిడ నవ్వుతూనే ఉండేది"

                ఊరివాళ్ల మాటలు వింటూ ఆనందంతో కంటనీరు పెట్టుకున్నారు రంగాజమ్మ బృందం. 

        బాపన్నగారు కూడా వాళ్లకి వీడ్కోలు పలుకుతూ, "ఒకప్పటి పాక వైభవాన్ని మళ్లీ మా కళ్లకూ నోటికీ చూపించారమ్మా. మిమ్మల్ని పంపినందుకు మా వియ్యంకుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను. మీకు మా అందరి తరఫునా ధన్యవాదాలు" అంటూ చేతులు జోడించారు. 

              రంగాజమ్మ బృందం ఆనందబాష్పాలతో తిరిగి నమస్కారాలు చేస్తూ సాగిపోయింది. 

                       ******************

లక్ష్మీ గాయత్రి 

విశాఖపట్నం

31, మార్చి 2021, బుధవారం

ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం -

 ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం  - 


     ఇప్పటివరకు మనం అనుకుంటున్నట్టుగా సూక్ష్మక్రిములను కనుగొన్నది పాశ్చత్య శాస్త్రజ్ఞులు మాత్రం కాదు.  వారికంటే కొన్ని వేల సంవత్సరాల మునుపే మన పూర్వీకులకు సూక్ష్మక్రిముల పైన మరియు అవి కలుగచేసే వ్యాధుల పైన సంపూర్ణ అవగాహన కలదు. ఈ విషయాల గురించి నేను తెలుసుకొవడానికి కొన్ని అత్యంత పురాతన ఆయుర్వేద గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు వాటిలో కొన్ని చోట్ల ఈ సూక్ష్మక్రిమి సంబంధమైన అనేక విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఆ విలువైన సమాచారాన్ని మీకు కూడా తెలియచేయుటకు ఈ పోస్టు పెడుతున్నాను .


         సుశ్రుతునకు సూక్ష్మక్రిములుకు సంబంధించిన పరిజ్ఞానం అపారంగా ఉన్నది అని చెప్పవచ్చు. రోగానికి కారణం అయ్యే సూక్ష్మక్రిములను గురించిన జ్ఞానమునకు "భూతవిద్య " అని పేరుకలదు . అష్టాంగహృదయములో ఇది ఒక ప్రత్యేక భాగముగా పరిగణించబడినది. భూతవిద్యా లక్షణమును చెప్పునప్పుడు దేవాసుర , గంధర్వ , యక్ష , రక్ష , పితృ , పిశాచ , నాగ అనే భూత గ్రహాలుగా సూక్ష్మజీవులను వర్ణించాడు. కొన్ని మంత్రగ్రంధాలలో పైన చెప్పిన పేర్లు కలవారు వేరే లోకమునకు సంభంధించినవారుగా దుష్టశక్తులుగా వర్ణించి వారు మానవులను పట్టి పీడించువారుగా ఉన్నది. కాని సుశృతుడు దీనికి ఒప్పుకోడు వారు దేవాసుర , గంధర్వులు ద్యులోక వాసులు వారు భూలోకమునకు వచ్చి మనుష్యులతో కలిసి ఎన్నటికీ నివసించరు అని ఆయన అభిప్రాయం .


       సుశ్రుతుడు సూక్ష్మజీవుల గురించి వివరిస్తూ వాటిని గ్రహములగా పిలుస్తూ ఈ విధముగా చెప్పుచున్నాడు. కోట్లకొలది అసంఖ్యాకముగా ఉన్న ఈ గ్రహములు రక్తము , మాంసములను భుజించి వృద్ది అగుచుండెను . అవి మహాపరాక్రమము కలిగినవి. అయినను అవి సూర్యుని వెలుగుకు జడిసి రాత్రుల యందు సంచరించుచుండును . చీకటి , నీడగల తావుల యందు పగలంతా ఉండును. ఈ సూక్ష్మక్రిములు నేలమీదను , అంతరిక్షము నందు , అన్ని దిక్కుల లోను పాడిపడిన చీకటి గృహముల యందు నివాసము ఉండును. ఈ సూక్ష్మక్రిములు ఒకొక్క కాలము నందు విజృంభించి జనులను పీడించునని సుశృతుడు తెలియచేసెను .


         వ్రణసంబంధ ఇన్ఫెక్షన్స్ గురించి సుశృతుడు వివరించుతూ ఈ సూక్ష్మక్రిములకు మాంస , రక్తం ప్రియం అగుటచేత గాయములలోకి తరచుగా ప్రవేశించి సమస్యలను కలుగచేయునని తెలుపుతూ ఈ రోగకారణమగు సూక్ష్మక్రిములను మూడు ప్రధాన గణములుగా గుర్తించారు. 


            ఇప్పుడు సుశృతుడు రోగహేతుకారణాలైన సూక్ష్మజీవులను మూడు రకాలుగా వర్గీకరించారు. వాటి గురించి మీకు వివరిస్తాను.  అవి 


 1 -  పశుపతి అనుచరులు .


 2 -  కుబేర అనుచరులు .


 3 -  కుమార అనుచరులు .


 *  పశుపతి అనుచరులు  -


      మనస్సు , ఇంద్రియములను వికలమొనర్చి  భ్రమ , ప్రలాప , ఉన్మాదములను కలిగించును. 


 *  కుబేర అనుచరులు  - 


       ఇవి యక్షరక్షో గణములకు చెందిన క్రిములు . శారీరక బాధలను మాత్రమే కలిగించును.


 *  కుమార అనుచరులు  -


       పసిపిల్లలను వశపరుచుకొని బాధించును . వీటినే బాలగ్రహములుగా పిలుస్తారు . 


         పైన చెప్పినవిధముగా సుశ్రుతుల వారు సూక్ష్మక్రిములను మూడు రకాలుగా వర్గీకరించారు . మలేరియా జ్వరమునకు రురుజ్వరం అని తక్ష్మ జ్వరం అనియు అధర్వణవేదములో వ్యవహరించబడినది. ఈ జ్వరమును కలిగించే సూక్ష్మక్రిములు ఉండు నివాసస్థలము గురించి చెప్పుతూ  గుడ్లగూబ , గబ్బిలము , కుక్క , తోడేలు , డేగ , గద్ద  ఈ జంతుపక్షి శరీరాల్లో మలేరియా క్రిములు ఎల్లప్పుడూ ఉండి వాటి మలముతో బయటకి వచ్చి జనులు తాగే నీటిలో కలిసి మనుష్యులకు సంక్రమించునని ఉన్నది.


           ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కొన్నింటిలో ఈ విధముగా ఉన్నది. క్రిములు శరీరం నందు ప్రవేశించినంత మాత్రాన రోగము రాదు . శరీరము నందు ఓజస్సు మిక్కిలిగా అభివృద్ధిచెందిన ఊర్జశక్తి అన్ని రకముల క్రిములను జయించుచున్నది. ఇక్కడ మనశరీరములోని రోగనిరోధక శక్తి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. శరీరానికి హితమైన ఆహారం సేవించకుండా విరుద్ద ఆహారాలను సేవించువారికి , ప్రకృతివిరుద్ధ నియమాలు పాటించువారికి క్రిములు బాధించును గాని  అగ్నిదీప్తి చక్కగా ఉండి యవ్వనంలో ఉన్నవారికి , స్నిగ్ధ శరీరులకు , వ్యాయమం చేయుచుండువారికి , శరీరబలం అధికంగా ఉన్నవారికి క్రిములు ఏమి చేయలేవు .


               క్రీ . శ 18 వ శతాబ్దములో మైక్రోస్కోప్ యంత్రము కనిపెట్టబడిన పిమ్మట సూక్ష్మజీవులను కనుగొన్నారు అని మన పాఠ్యపుస్తకాలలో చదువుతున్నాం .కాని కొన్నివేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు ఈ సూక్ష్మక్రిమి విజ్ఞానం సంపాదించారు. మన మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు వారు తమ మనోనేత్రముతో అన్నింటిని దర్శించగలరు మరియు కనుగొనగలరు. మైక్రోస్కోప్ గురించి దానికి పాశ్చాత్యులు కనుగొన్నారు అని గొప్పగా చెప్పుకుంటాం కాని అధర్వణవేదము నాలుగోవ కాండ ఇరవైవ సూక్తములో పిశాచక్షయ మంత్రములో మైక్రోస్కోప్ వంటి "బిబిర్హిని " అను ఒక దివ్య ఔషధి లభించినట్టు కశ్యప మహాముని ఈ ఔషదీ సహయముతో భూమి మరియు అంతరిక్షంలో వ్యాపించి ఉన్న సర్వరోగ క్రిములను చూడగలిగెను అని ఈ మంత్రం చెప్పుచున్నది. క్రీ .శ  మూడొవ శతాబ్దములో బింబసారుని ఆస్థాన వైద్యుడు అయిన జీవకునికి ఇట్టి మహత్తర ఔషధి లభించెనని గ్రంధస్థం చేయబడి ఉన్నది. దీని సహాయముతో నేటి ఎక్సరే యంత్రము వలే శరీర అంతర్భాగము నందలి శరీరభాగాలను చూస్తూ పేగులలో చిక్కుకున్న రాళ్లను తీసివేశారు అని ఎన్నో పురాతన గ్రంథాలలో కలదు.


                           సమాప్తం 


    మరింత విలువైన సమాచారం నేను రాసిన గ్రంథముల యందు సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. 


     గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

వడ్లు గురించి

 వడ్లు గురించి సంపూర్ణ వివరణ - 4 . 


 15 - దినసరులు - 


       ఇవి ఒక రకమయిన వడ్లు . మూడున్నర నెలలకు ఒకసారి ఇవి పండును. వీటి అన్నం స్నిగ్దముగా రుచిగా ఉండును. వాతాన్ని , పిత్తాన్ని హరించును . మలమూత్రబద్ధాన్ని తొలగించును. కొన్ని జబ్బులకు ఇది వాడరాదు. 


 16 -  దుగ్గ నసరులు - 


       వీటి అన్నం బలవీర్య పుష్టికరము . వాతాన్ని పుట్టించును . 


 17 -  నివ్వరులు  - 


      రక్తపిత్త రోగమును నయం చేయును . అగ్నిదీప్తిని పెంచును. జీర్ణశక్తికి మంచిది . 


 18 -  పాంసుగులు లేక ప్రాసంగులు  - 


       ఇవి ఒకరకమయిన వడ్లు . ఇవి మిక్కిలి బలకరమైనవి. మంచి రుచిని కలిగి ఉండును. వాతాన్ని , పిత్తాన్ని హరించును . చలువ చేయును . శ్లేష్మకరములు.


 19 -  పెద్ద వడ్లు  - 


       వీటి అన్నం మంచి రుచి కలిగి ఉండును. కాని అగ్నిమాంద్యం కలిగించును. శరీరానికి మంచి బలాన్ని ఇచ్చును. 


 20 -  బడిపిళ్లు  - 


       ఈ అన్నం అగ్నిమాంద్యం , వాతాన్ని పుట్టించును . అతిగా తినటం మంచిది కాదు. 


       తరవాతి పోస్టు నందు మిగిలిన అతిముఖ్య రకాల గురించి వివరిస్తాను.  మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

వడ్లు గురించి సంపూర్ణ వివరణ - 5 . 


 21 - బైలవడ్లు - 


         ఇవి మెట్ట భూముల్లో పండును. వెగటుగా ఉండును. కఫమును , వాతమును హరించును . అగ్నిదీపనమును కలిగించి ఆకలిని , రుచిని పుట్టించి శరీరానికి మంచి చేయును . 


 22 - మద్దిగడ్డలు - 


        వీటి అన్నము శ్వాసకాసలు , ఉదరవ్యాధులు , మలమూత్ర బంధనం , గుల్మములు మున్నగువానిని పోగొట్టి అగ్నిదీపనం కలిగించును. ఇవి కొంచం చేదుతో కూడి తియ్యదనం కలిగి ఈ అన్నం ఉండును. 


 23 - రాజనాలు - 


         ఇవి శ్రేష్టమైన జాతికి చెందిన వడ్లు . వీని అన్నం స్నిగ్దముగా , రుచికరంగా , బలవీర్య కాంతిప్రదమై ఉండును. పిత్తమును హరించును . నేత్రవ్యాధులకు హితకరము . ఆకలి పుట్టించి , దాహమును అణిచి మలమూత్రబద్ధకము తొలగించి , బుద్దికి మంచి చురుకుదనం ఇచ్చును. 


 24 - ఱెక్క పాంసుగులు - 


        ఱెక్క పాంసుగులు అనేవి ఒక జాతి వడ్లు . వీటి అన్నం వీర్యమునకు పుష్టిని ఇచ్చి నేత్రవ్యాధులు , అతిసారములు , నిస్సత్తువ పోగొట్టును . ఇవి లఘుత్వము , రుచి , అన్నహితువు కలిగించును . 


 25 - వంక సన్నాలు లేక వంకలు - 


       వీటి అన్నం వాతమును పుట్టించును . అజీర్ణ విరేచనాలు కలిగించును. కాని పైత్యాన్ని పోగొట్టును అని అందురు. వీర్యపుష్టిని ఇచ్చును. 


          వడ్లలో చాలా రకాలు ఉన్నాయి . వాటన్నినీ వివరింపసాధ్యం కాదు కనక కొన్ని అతి ముఖ్యమైన వాటి గురించి మీకు వివరించటం జరిగింది. 


      మరింత సంపూర్ణ మరియు విలువయిన సమాచారం నేను రచించిన గ్రంథాల యందు మీకు లభ్యం అగును . 


                             సంపూర్ణం 

   


   గమనిక -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

సుబ్రహ్మణ్యుని పాదములను స్మరిస్తే

 సుబ్రహ్మణ్యుని పాదములను స్మరిస్తే మనస్సుకు శాంతి కలుగుతుంది 🙏🌼🌿*


ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు.

అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి
వారి దర్శనము అయ్యింది.
వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు.
ఈ భుజంగ స్తోత్రము ద్వారా..ఎన్నో దోషాలు పోగొట్టుకోవచ్చు.
మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి,
అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి .
దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు,
ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది,
దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు.

ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం,
కుష్ఠ రోగం మొదలైనవి.
అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు.

ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.చివరిలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉన్నది, వీలుంటే ఒకసారి భక్తితో పటించండి

ఈ సంసారము అనే మహా సముద్రము నుండి
మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు.

అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో.

అంతటి శక్తి ఈ *'తిరుచెందూర్'* క్షేత్రమునకు ఉన్నది.

*అలానే శరవణభవ అనే నామానికి ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం*

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే “శరవణభవ”…
ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.

శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు

షడాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.

శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు అని ‘శరవణభవ’కు గూఢార్థం.

*శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం*

సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ
మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా।
విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి:॥

నజానామి శబ్దం నజానామిచార్థం
నజానామి పద్యం నజానామి గద్యం।
చిదేకా షడాస్యా హృదిద్యోతతే మే
ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్॥

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహం।
మహీ దేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలం॥

యదా సన్నిధానం గతామానవామే
భవామ్భోధిపారం గతాస్తేతదైవ।
ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే
తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం॥

యథాభ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః
తథైవాపదః సన్నిధౌ సేవతాంమే।
ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం॥

గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాః
తదా పర్వతే రాజతే తేధిరూఢాః।
ఇతీవ బృవన్ గంధశైలాధిరూఢః
సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు॥

మహామ్భోధితీరే మహాపాపచోరే
మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే।
గుహాయాం వసంతం స్వభాసాలసన్తం
జనార్తిం హరంతం శ్రయామో గుహంతం॥

లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే
సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే।
సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం
సదాభావయే కార్తికేయం సురేశమ్॥

రణద్ధంసకే మంజులే త్యన్తశోణే
మనోహారి లావణ్య పీయూషపూర్ణే।
మనః షట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కందతే పాదపద్మే॥

సువర్ణాభ దివ్యాంబరై ర్భాసమానాం
క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్।
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద! తే దీప్యమానామ్॥

పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ
స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్।
నమస్యామ్యహం తారకారే! తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగమ్॥

విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్
నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్।
హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్
సదాతే ప్రచండాన్! శ్రయే బాహుదండాన్॥

సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః
సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్।
సదా పూర్ణబింబాః కలం కైశ్చ హీనాః
తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యమ్॥

స్ఫురన్మందహాసైః సహంసానిచంచత్
కటాక్షావలీ భృంగసంఘోజ్జ్వలాని।
సుథాస్యంది బింబాధరాణీశ శూనో
తవాలోకయే షణ్ముఖామ్భోరుహాణి॥

విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రమ్
దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు।
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేత్
భవేత్తే దయాశీల కానామహానిః॥

సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా
జపన్మంత్ర మీశో ముదా జిఘ్నతే యాన్।
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః॥

స్ఫురద్రత్న కేయూర హారాభిరామః
చల త్కుండల శ్రీలస ద్గండభాగః।
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః॥

ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య
హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురంకాత్।
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్॥

కుమారేశసూనో! గుహస్కందసేనా
పతే శక్తిపాణే మయూరాధిరూఢ।
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్॥

ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే
కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే।
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతంమే దయాళో భవాగ్రే గుహత్వమ్॥

కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్
దహచ్ఛింధి భిన్ధీతి మాంతర్జయత్సు।
మయూరం సమారుహ్య మా భైరితి త్వమ్
పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రం॥

ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా
ప్రసాద్య ప్రభో ప్రార్ధయే నేకవారం।
నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే
నకార్యాంతకాలే మనాగప్యుపేక్షా॥

సహస్రాండ భోక్తాత్వయా శూరనామా
హతస్తారక స్సింహవక్త్రశ్చ దైత్యః।
మమాంత ర్హృదిస్థం మనః క్లేశమేకం
నహంసి ప్రభో! కింకరోమి క్వయామి॥

అహం సర్వదా దుఃఖభారావసన్నో
భావాన్దీన బంధుస్త్వదన్యం న యాచే।
భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం
మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్॥

అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహః
జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః।
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణా త్తారకారే ద్రవంతే॥

దృశి స్కందమూర్తిః శృతౌ స్కందకీర్తిః
ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్।
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సంతులీనా మమాశేషభావాః॥

మునీనా ముతాహో నృణాంభక్తి భాజాం
అభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః।
నృణామంత్యజానామపి స్వార్ధదానే
గుహాద్దేవ మన్యం న జానే న జానే॥

కలత్రం సుతాబంధువర్గః పశుర్వా
నరోవాథ నారీ గృహేయే మదీయాః।
యజంతో నమంతః స్తువంతో భవంతమ్
స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార॥

మృగాః పక్షిణోదంశకాయే చ దుష్టాః
తథా వ్యాధయో బాధకా యే మదంగే।
భవ ఛ్చక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే
వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల॥

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం
సహేతే న కిం దేవసేనాధినాథ।
అహం చాతిబాలో భవాన్ లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ॥

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం
నమశ్చాగ తుభ్యం నమః కుక్కుటాయః।
నమః సింధవే సింధు దేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు॥

జయానందభూమన్ జయాపారధామన్
జయామోఘకీర్తే జయానందమూర్తే।
జయాశేషసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తిదానేశసూనో॥

భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః
పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య।
సుపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః
లభేత్ స్కంద సాయుజ్యమంతే నరః సః॥

ఇతి జగద్గురు శ్రీ ఆదిశంకారాచార్య విరచిత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సంపూర్ణం

*ఓం శరవణభవ*