7, ఫిబ్రవరి 2023, మంగళవారం

సామాన్యుడి ఆవేదన

 *అయినా నేను ఇంకా పన్ను చెల్లించాలా?ఎందుకు?*


*నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు*

*జీతం ఇచ్చారు, ఆదాయపు పన్ను అన్నారు. ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు, ఇచ్చాను*


  *మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు, ఇచ్చాను.రీఛార్జ్ చేశా, పన్ను ఇచ్చా, డేటా పన్ను ఇచ్చా, విద్యుత్తు పన్ను ఇచ్చా, ఇంటి పన్ను ఇచ్చా, టీవీ బిల్లు పై పన్ను, పిల్లల ఫీజుల పై పన్ను అన్నీ ఇచ్చాను. కారు కి పన్ను అన్నారు. పెట్రోలు పై పన్ను అన్నారు, చెల్లించా, ‘సేవ’ అన్నారు- పన్ను అన్నారు, రోడ్డుపై పన్ను అన్నారు, ‘టోల్‌ పై’ పన్ను అన్నారు, ఆపై లైసెన్స్ మేడ్ ‘ట్యాక్స్’ వచ్చింది. ఇచ్చాను. అన్నీ కిక్కురుమనకుండా అన్నీ ఇచ్చాను.*

          *తప్పు చేస్తే పన్ను- చెల్లించా, రెస్టారెంట్‌లో తిన్నా - పన్ను చెల్లించా, పార్కింగ్ పన్ను చెల్లించా, నీరు తీసుకున్నా-పన్ను చెల్లించా, రేషన్ కొనుగోలు చేశా- పన్ను చెల్లించా, బట్టలు కొనుగోలు చేశా- పన్ను చెల్లించా,పుస్తకాలు తీసుకున్నా- పన్ను ఇచ్చా, మరుగుదొడ్డికి వెళ్లా- పన్ను చెల్లించా, మందులు తీసుకున్నా- పన్ను చెల్లించా, గ్యాస్ ఇచ్చారు-పన్ను చెల్లించా. వందల కొద్దీ వస్తువులు తీసుకుని పన్ను కట్టి, ఫీజులు, బిల్లులు, వడ్డీలు కట్టి, ఎక్కడో ఫైన్లు, లంచాల పేరుతో డబ్బులు చెల్లించి, పొరపాటున ఏ  డ్రామా నో ఆడి, ఇంతా అంతా ‘ఆదా’ చేసి మరీ మీకు పన్ను కట్టా.*


      *కానీ ఆ జీతం నుండి ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి ? ఎవరయినా జవాబు చెప్తారా?*

 

          *మేము  జీవితాంతం పని చేసి, పన్నులు కట్టిన  తర్వాతకూడా,  సామాజిక భద్రత లేదు, ఉచిత  వైద్య సౌకర్యం లేదు, ఉచిత  ప్రజా రవాణా లేదు, అధ్వాన్నమైన రోడ్లు, వీధి దీపాలు వెలగవు, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, పండ్లు, కూరగాయలు విషపూరితమైనవి, ఆసుపత్రుల చికిత్సలు అందనంత ఖరీదైనవి,* 

           *ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణం కూడా మమ్మల్ని దెబ్బతీస్తుంది, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, ప్రమాదవశాత్తు ఊహించని విపత్తులు, వాటిల్లో ప్రతిచోటా కూడా మీకు పన్నులు మాకు అప్పులు.*


*కానీ ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి?*


*అవినీతిలోకి, ఎన్నికల్లోకి, సోమరిపోతులని తయారుచేయడానికి సంక్షేమం పేరిట ఇచ్చే ఉచితాలకి, ధనవంతుల సబ్సిడీల్లోకి, మాల్యా లాంటివారు దోచుకొని పారిపోవటానికి, ధనికుల ప్రకటించే మోసపూరిత ‘దివాలాలు’ పూడ్చటానికి, స్విస్ బ్యాంకుల్లోకి, నాయకుల బంగ్లాలు, కార్లు, జీతాలు సౌకర్యాలకి, ఎమ్మెల్యేలను కొనడంలోకి, మాకు కథలు చెప్పి జండూ బామ్ రాయడానికి ఖర్చు పెట్టారు.*

 

*ఇప్పుడు ఎవరైనా చెప్పండి, దొంగ ఎవరో?*


*మనమంతా కూడా ఈ దేశస్థులమే అయినాసరే, ఎంతకాలం అయినా ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాము.కదా!*


ఇది ఓక సామాన్యుడి ఆవేదన

6, ఫిబ్రవరి 2023, సోమవారం

భగవద్గీత

🙏💐🌹🙌Establishment of Supreme Court bench in AP for South India is our prime 🙌🌹💐👍


🌹భగవద్గీత🌹              


రెండవ అధ్యాయము. సాంఖ్యయోగము నుండి 65 వ శ్లోకo.

                  

ప్రసాదే సర్వదుఃఖానాం

హానిరస్యోపజాయతే ౹

ప్రసన్నచేతసో హ్యాశు  

బుద్ధిః పర్యవతిష్ఠతే ౹౹(65)


ప్రసాదే , సర్వదుఃఖానామ్ ,

హానిః , అస్య , ఉపజాయతే  ౹

ప్రసన్నచేతసః , హి , ఆశు ,

బుద్ధిః , పర్యవతిష్ఠతే ౹౹(65)


ప్రసాదే = అంతఃకరణ ప్రసన్నత ప్రాప్తించినంతనే ;

అస్య = ఇతనియొక్క ;

సర్వదుఃఖానామ్ = సమస్త దుఃఖములకును ;

హానిః ఉపజాయతే = అభావము కలుగును, సమస్త దుఃఖములు తొలగిపొవును;

ప్రసన్నచేతసః = ప్రసన్న మనస్కుడైన కర్మయోగి యొక్క ;

బుద్ధిః = బుద్ధి ;

ఆశు హి = శీఘ్రముగానే (వెంటనే) ;

పర్యపతిష్ఠతే = పరమాత్మ యందే పూర్తిగా స్థిరమగును.


తాత్పర్యము :- మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖము లన్నియును నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి, పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. (65)

       

      ఆత్మీయులందరికి శుభోదయo

               Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi

5, ఫిబ్రవరి 2023, ఆదివారం

మాఘ పౌర్ణమి*

 *నేడు మాఘ పూర్ణిమ. మాఘ పూర్ణిమ ప్రత్యేకత*


*మాఘ పౌర్ణమి*


హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడు. 


చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి. మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.

*"మా - అఘం''* అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.


*"మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ*

*బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''*


*"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా ... బ్రాహ్మీముహూర్తము  నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును''*  అని అర్థం.


అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.


*☘మాఘం అమోఘం :☘*


మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. *"మా'' అంటే మహాలక్షీ. "ధవుడు* అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత , వాగ్దేవి , జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని *"శ్రీపంచమి''* అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.


*"శుద్ధలక్ష్మీ మోక్షలక్షీ జయలక్ష్మీః సరస్వతీ*

*శ్రీర్లక్ష్మీః వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''*


మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ *"శ్రీపంచమి''* నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు *"అక్షరభ్యాసం''* జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి *"రథసప్తమి''* పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్ధశిని *"శివరాత్రి''* పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి , మాఘశుద్ధ ఏకాదశి *"భీష్మ ఏకాదశి''* పర్వదినం చేశాడు.


త్రిమతాచార్యులలో ఒకరైన *"మధ్వాచార్యుడు''* ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని *"మధ్వనవమి''* గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు , వేడుకలు చేస్తారు.


జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని *"కేతువు''* పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత , మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు *"మఖ''* నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి *"మాఘమాసం"* అనే పేరు వచ్చింది. అందుకే మాఘం - అమోఘం .

 

*☘పితృయజ్ఞానికి ప్రాధాన్యత :☘*


మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు *"పైతృకాలకు''* ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే , ఆదివారం , అమావాస్య , శ్రవణనక్షత్రం , వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని *"అర్ధోదయ పుణ్యకాలం''* అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య , శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక , ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం. 


*☘మాఘపూర్ణిమ - మహామాఘి :☘*


మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే *"మాఘమాసం''*. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం *"మాఘపూర్ణిమ''* నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను *"మహామాఘి''* అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ *"మాఘ పూర్ణిమ''* అత్యంత విశేషమైనది. ఈ *"మహామాఘి''* శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి. 


*సముద్ర స్నానం ఎందుకు చేయాలి?*


 *"నదీనాం సాగరో గతిః''*


సకల నదీ , నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల , ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే , ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. 

అఘాది , జడత్వాలు ఆయన తత్త్వం.

సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా *"ఆషాఢ పూర్ణిమ , కార్తీక పూర్ణిమ , మాఘపూర్ణిమ , వైశాఖ పూర్ణిమ''* లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. *"స్నానం''* అంటే *"షవర్ బాత్''* చేయడమో , *"స్విమ్మింగ్ పూల్''* లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి , కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ చాదస్తం అని విసుక్కోవద్దు. చాదస్తం కాదు , సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.


సూర్యోదయకాలం నుంచి , సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు , సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని , ఔషదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి *"నడుము మునిగే వరకూ ఎందుకు? నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి"* అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర , నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి , సోమశక్తులు , ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా , ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో *"మాఘ పూర్ణిమ''* స్నానం ముఖ్యమైనది.


సముద్రం , నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ , చెరువుల వద్దగానీ *"గంగ , సింధు , కావేరి , కృష్ణ , గౌతమి''* నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి , కర్రలా తేలినా ఫలితం శూన్యం. 


*☘మాఘ పూర్ణిమ స్నానఫలం :☘*


1 . *ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.*


2 . *బావి నీళ్ళతో స్నానం చేస్తే , 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.*


3 . *చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.*


4 . *సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


5 . *పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


6 . *సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


7 . *గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


8 . *ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.*


9 . *సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.*


ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే , మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ *"అంత్యపుష్కరిణీ స్నానాలు''* అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే , మాఘమాసం , మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.

 


*☘మాఘస్నానం చేస్తున్నప్పుడు :-☘*


*దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ*

*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం*

*మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*

*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''* 


అని పఠించి , మౌనంగా స్నానం చేయాలి , అంటే *దుఃఖములు , దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా ! అచ్యుతా ! మాధవా ! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు* అని అర్థం. 

ఆ తరువాత ...

*"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ*   

*త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''*


అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే *"ఓ పరంజ్యోతి స్వరూపుడా ! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక''* అని అర్థం.

ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత , పితృతర్పణాది నిత్యకర్మలు(తండ్రి గతించిన వారు మాత్రమే ఈ పితృతర్పణలకు అర్హులు)పూర్తిచేసుకుని , ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత , దానధర్మాలు చేయాలి. వస్త్రములు , కంబలములు (దుప్పటులు), పాదరక్షలు , గొడుగు , తైలము , నెయ్యి , తిలపూర్ణఘటము , బంగారము , అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత , అవకాశం ఉన్నవారు *"నేతితో తిలాహోమం''* చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.

 

*☘తిలల (నువ్వులు)కున్న ప్రత్యేకత :☘*


నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని , వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు. శ్రీమహావిష్ణువు యొక్క స్వేదబిందువులే *"తిలలు''* ... అనగా నువ్వులు.

తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే , శివునకు ఏకాదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చెక్కరకు , మూడువంతులు తిలలు కలిపి  శ్రీహరికి నివేదన చేసి , అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.

మాఘపూర్ణిమనాడు *"తిల పాత్రదానము''* చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే , ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి , వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి -


*"వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం*

*బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే''* అని సంకల్పించి -


*"దేవదేవజగన్నాథ వంఛితార్ధ ఫలప్రద*

*తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం''*


అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము , జాతకరీత్యా శనిదోష , పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి. 


*☘చివరగా ఓ మాట☘*


మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ , ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని , అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా ! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు , అమావాస్యకు సముద్రానికి *"పోటు''* ఎక్కువగా ఉంటుంది. *"పూర్ణిమ''* దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం. 

జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథినాడు రవి , చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి , చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి , చంద్రులకు , సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ! ఇక ఆలస్యం ఎందుకు ? మాఘస్నానాలకు ఉపక్రమించండి. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని , ఆనందాన్ని అందుకుని తరించండి.


*ఓం నమో భగవతే వాసుదేవయ* మంత్రాన్ని జపించడం మంచిది.


*☘️మాఘ పూర్ణిమ వ్రత కథ..☘️*


పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగరంలో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపాడు. బ్రాహ్మణుడు అతనికి పిల్లలు లేరు. ఒక రోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివని అవహేళన చేశారు. అప్పుడు ఎవరో ఆమెను కాళీక దేవిని  16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఆరాధనతో కాళీక దేవిని 16 రోజుల ఆరాదించడంతో కాళికాదేవి వారికి కనిపించింది. తల్లి కాళీకాదేవి బ్రాహ్మణ భార్యకు  గర్భం పొందటానికి  వరం ఇచ్చింది. మీ శక్తిని అనుసరించి ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది.


ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయండంతో ఆమె గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళికాదేవి చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది. కాళికాదేవి దయవల్ల దేవదాస్ అనే కుమారుడికి అతని ఇంటికి ఒక కుమారుడు జన్మించాడు. దేవదాస్ పెద్దయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్లాడు. కాశీలో వారిద్దరికి ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాస్ తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తరువాత కాళీ తన ప్రాణాలను తీయడానికి వచ్చెను  కానీ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు , కాబట్టి కాళికా దేవిని ఏమి చేయలేకపోయను. అప్పటి నుండి , పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం ద్వారా , ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరుతాయి.


                          *స్వస్తి*

సద్బోధ

 .


                 *సద్బోధ*

                 ➖➖➖



 *దేవుడి పాదాల చెంతపడి ఉన్న పువ్వులు     దేవుడి మెడలో దండై హారంగా కొలువున్న పూలని చూసి అసూయగా అడిగాయి….    “మీరూ, మేమూ ఒకటే కదా! మరి మీరు దేవుడి మెడలో,   మేము దేవుడి పాదాల దగ్గర ఉన్నాం. మీ గొప్పతనం ఏంటి? మేం చేసిన పాపం ఏమిటి?”  అని.*


*దండలో ఉన్న ఒక పువ్వు చిన్నగా నవ్వి చెప్పింది… “దేవుని మాలలో చేరడానికి మమ్మల్ని సూదిలో గుచ్చి మాగుండా దారాన్ని నింపుతారు. ఆ నొప్పి భరించి నిలబడటం వల్లనే మాకు దేవుడి మెడలో చోటు దక్కింది.     మీరు భరించలేక కిందపడి పోయారు. అందుకే మీకా స్థానం దక్కింది” అని వివరించింది.*


*అందుకే ఎవరైనా మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఆ స్థానాన్ని చేరుకోవడానికి ఎంత నొప్పిని అనుభవించి ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకుని; మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి తప్ప అసూయ చెందకూడదని అర్థం*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*


         లోకాః సమస్తాః సుఖినోభవన్తు!

అజ్ఞానాన్ని కవివాక్కు మాత్రమే పోగొట్టగలదు

 శ్లోకం:☝️కవి ప్రశంస

*ఉదయంతు శతాదిత్యాః*

 *ఉదయంత్విందవః శతం l*

*న వినా కవివాక్యేన*

 *నశ్యత్యాభ్యంతరం తమః ll*


భావం: వంద సూర్యబింబాలు ఉదయించవచ్చు, నురు పూర్ణ చంద్రోదయాలు కావచ్చు. కానీ మానవ హృదయాల్లోనున్న అజ్ఞానాన్ని కవివాక్కు మాత్రమే పోగొట్టగలదు.ఏక కాలికమైన అంశాన్ని సార్వకాలికం చేసేవాడు కవి. వ్యక్తిగతమైన అంశాన్ని సమాజగతం చేసేవాడు కవి. క్షణికమైన దానిని శాశ్వతం చేసే వాడు కూడ కవే. బ్రహ్మానందంతో ఇంచుమించు సమానమైన ఆనందాన్ని తన కావ్యం ద్వారా పాఠకునికందిచే వాడు కూడా కవే!🙏

4, ఫిబ్రవరి 2023, శనివారం

ధర్మమార్గంలోనే

 .            *|¦¦|సుభాషితమ్|¦¦|*


(మహాభారతం/'గృహోపనిషత్')


శ్లోకం:


*'"ధర్మాగతం ప్రాప్యధనం యజేత*

*దద్యాత్సదైవాతిధీన్ భోజయేచ్ఛ*

*అనాధదానశ్చ  పరైరదత్తం*

*సైషా గృహస్థోపనిషత్ పురాణీ"!!'*


 ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి....సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దైవకార్యాలకు, దానానికి వెచ్చించాలి.... ఇతరుల ధనాన్ని ఎన్నడూ అపహరించరాదు..... ఇతరులు దానం చేసిన దాన్నితీసుకోవచ్చు.....ఇంటికి విచ్చేసిన అతిథులను సాదరంగా సత్కరించి, భోజన సమయమైతే తప్పక వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి....'అతి ప్రాచీనమైన గృహస్థోపనిషత్ ఇదే!!

సద్బోధ

 .


                        *సద్బోధ*

                        ➖➖➖


*ఎవరు భగవంతుని యొక్క దివ్యమైన జన్మనూ, కర్మనూ యథార్థంగా తెలుసుకుంటున్నారో అట్టివారు మరణానంతరం ఆయననే పొందుతున్నారు.*


*అనురాగం, భయం, క్రోధం విడిచిన వారూ, ఆయన యందే లగ్నమై ఉన్న మనస్సు కల అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సుచే పవిత్రులై భగవంతుని స్వరూపమును పొందియున్నారు.*


*ఆధ్యాత్మిక అనుభవం నిత్యజీవితంలోని అనుభవాలకు దూరంగా ఎక్కడో లేదు. మన నిత్యజీవన విధానం ఆధ్యాత్మికతతో కలిసి ఉన్నది.*


*అయితే ఆ రెంటినీ జత చేసేవి ఆదర్శం పట్ల భక్తి, ప్రార్థనలే. ఈ ప్రార్థన ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తితో కూడుకుని ఉండరాదు.*


*ప్రార్థన అవగాహనతో కూడుకుని ఉండి మన అజ్ఞానాన్ని తొలగించేదిగా ఉండాలి. హృదయ వైఖరిని గ్రహిస్తూ మనస్సుని శుద్ధి చేసేందుకు ఉపక్రమించాలి.*


*పవిత్ర హృదయాన్ని పొందగలగడం కన్నా అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది. అటువంటి హృదయం దర్పణంలా ప్రకాశిస్తూ మనలను ప్రతిబింబింపజేస్తుంది.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                      


          లోకాః సమస్తాః సుఖినోభవన్తు!

శివుడు ఎక్కడ ఉన్నాడు!?

శివుడు ఎక్కడ ఉన్నాడు!?
ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తాలుగా పది వాయువుల రూపంలో లోపల ఉండి, సమస్తం నిర్వహణ చేస్తున్నాడు. ఆయన శివుడు.* 

 *ఆకలిలో, ఆవులింతలో, తేనుపులో, దాహంలో, నిద్రలో, అన్నిటిలో శివుడు ఉన్నాడు. శివుడు ఎక్కడున్నాడు అని అడగవద్దు. లేనిది ఏది? అని అడగాలి. అంతటా శివుడు ఉన్నాడు. చూడాలనిపిస్తే...*

*బ్రహ్మాండ మావి స్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగ మౌలి విలసత్ పూర్ణేందు వాన్తామృతైః-* 

️ శివలింగరూపంలో ఉన్నాడు. ఇన్ని మనకు ఇచ్చినవాడి మీద నీళ్ళు పోస్తే పొంగిపోతాడు. *మన చల్లదనం, లోకం చల్లదనం, శివలింగపు చల్లదనంలో ఉన్నాయి.* ఆయన ఇచ్చిన నీళ్ళే పొయ్యడానికి నీకు సమయం లేదంటే పైన పాత్రలోపోసి వెళ్ళిపో. అందులో నుంచి చుక్కచుక్క పడుతుంటే ఇక్కడ చల్లగా ఉండి నిన్ను చల్లగా ఉంచుతాను అంటాడు. అంతటి ఉదారుడు. *ఆయన అరూపరూపి.* 

 ఎందులోనుంచి వస్తున్నదో, ఎందులోకి వెడుతున్నదో చూపించమంటే చూపించలేం. కోపంతో చేసే పని కనబడుతుంది. కోపాన్ని చూపించగలమా? దేని నుండి వచ్చి, దేనిలో ఉండి, దేనిలోకి వెడుతున్నదో చూపించలేం. కనక ఆ మూడిటి గుర్తే లింగం. ఎందులోనుంచి బయటికి వచ్చి ఎందులోకి లయమైపోతున్నదో అదే శివలింగం ఉన్నదీ, వెళ్లిందీ, లయమైపోయిందీ ఆయనయందే అయితే ఆయనే స్థితికారుడు. ఆయనకూ, విష్ణువుకీ తేడా లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. వాళ్లిద్దరూ ఒకటై ఉన్నారు. ఇది శివలింగ స్వరూపమన్న భావన కలిగి పొంగు కలగగానే ఆయన చల్లబరిచేస్తాడు. *ఎక్కడెక్కడ వేడెక్కిపోతుంటుందో అక్కడ శివలింగానికి అభిషేకం చెయ్యమన్నారు. ఏ కోరిక తీరాలన్నా, ఏ సమస్య ఉన్నా అభిషేకం చేసుకోవాలి.* 

️ కస్తూరి నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం, మారేడు దళాలతో అభిషేకం చేస్తే సమస్తమైన భోగభాగ్యాలు. ఆవుపాలతో చేస్తే జ్ఞానం. పంచదారతో చేస్తే అహంకారం పోతుంది. నేతితో చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఒక్కొక్క ప్రత్యేకపరిస్థితిలో ఒక్కొక్క రకంగా అభిషేకం చేసి తీర్థమిస్తారు. శివాభిషేక తీర్థంతో వ్యాధులు నయంచేసిన మహాపురుషులున్నారు. అంత శక్తి కలిగినది శివలింగం. అటువంటి శివలింగం ఏది ఉందో ఆ మహానుభావుడే *మృడః.*

 *అపవర్గ ప్రదో*- *అపవర్గ ప్రదో* అనగా ఆయనే మన దుఃఖాన్ని తీసేస్తాడు. దుఃఖం ఎప్పుడు పోతుంది? జ్ఞానం కలిగి ఇది నేను కాదని తెలుసుకోగానే దుఃఖం పోతుంది. జ్ఞానం, మోక్షం ఆయన ఇచ్చేస్తాడు. *అనంతః* - శివలింగభావనకి అంతమూ, అంతూ ఉండవు. ఏది చేస్తున్నా శివసంబంధంగా చెయ్యకుండా ఉండలేం. ఆర్తి కలగాలి గానీ అన్నీ చేసేవాడు ఎక్కడైనా కనపడతాడు. 

 *కాళహస్తీశ్వర శతకంలో...*

*నిన్నే రూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ* 
*చన్నో కుంచమొ, మేక పెంటికయొ యీ సందేహముల్ మాన్చి నా* 
*కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే* 
*చిన్నీరేజ విహారమత్తమధుపా శ్రీకాళహస్తీశ్వరా!*

*నీ రూపంబు దలంపగా దుదమొదల్ నేఁ గాన నీవైనచో* 
*రారా రమ్మని యంచు బిల్వవు వృథారం భంబు లింకేటికిన్!* 
*నీర న్ముంపుము మిఁక ని పాలమికనిన్నే నమ్మినాడం జుమీ* 
*శ్రీరామార్చితపాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!*

️ నీ ఆద్యంతాలు తెలియటం లేదు. రామచంద్రమూర్తి చేత అర్చన చేయబడిన శివా, నీవే చెప్పాలి. ఆర్తి కలిగితే శివుడు వచ్చేస్తాడు.

️ *నీరూపు మోకాలొ..* -  
అర్జునుడు శివాభిషేకం చెయ్యాలని శిబిరంనుండి తొందరగా వెళ్ళిపోతుంటే, శ్రీకృష్ణుడు ఎక్కడకి వెళుతున్నావని అడిగాడు. ఈ రోజు శివరాత్రి కదా! అందుకొరకు అభిషేకం చేసుకోవడానికి వెళుతున్నానని చెప్పాడు. శివుని కొరకు ఎక్కడికో వెళ్ళడమేమిటి? ఆయన అంతటా ఉన్నాడని తన మోకాలు చూపాడు. అక్కడ అర్జునునికి శివలింగదర్శనమైంది.

 *స్త్రీ చన్నో...* - 
ఒక మహారాజు తెల్లవారితే మహాశివరాత్రి అనగా ఆ రాత్రి ఒక నర్తకి ఇంటికి వెళ్ళి, ఆమెతో భోగమనుభవించి పడుకున్నాడు. చీకటి విచ్చుకోకముందు వెళ్ళిపోదామనుకున్నాడు. బాగా నిద్ర పట్టింది. ఆయన నిద్రలో ఉండగా గంటలు వినపడుతున్నాయి. పూజలు చేసేస్తున్నారు. గవాక్షంలోకి వెళ్ళి చూస్తే అభిషేకం కొరకు ప్రజలు గుంపులుగా వెళుతున్నారు. అప్పుడు బయటికి వెళితే అందరూ గుర్తిస్తారు. రాజు నర్తకి ఇంట్లో ఉన్నాడని అంటారు. శివుని ఎలా ఆరాధన చెయ్యాలా అని బెంగపెట్టుకుని అటూ ఇటూ చూస్తే, *నిద్రిస్తున్న రాజనర్తకి స్తనం, ఆమె వెల్లకిలా పడుకోవడంలో శివలింగంలా దర్శనమైంది.* ఆర్తితో ఆమె స్తనంలో శివలింగాన్ని చూసాడు.

*నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్ర్యంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః*

అంటూ అభిషేమంత్రం చెప్పి నీళ్ళుపోసాడు. ఆయన భక్తికి శివుడు లొంగిపోయాడు. అక్కడే ఉన్న నీటిపాత్ర తీసుకుని ఆమె స్తంభించిపోయింది. *స్త్రీ చన్నులోనుండి వచ్చి ఆచంటేశ్వరుడు అయ్యాడు.* 

*భక్తికి లొంగిపోయే నిన్ను ఏమని, ఎక్కడున్నావని చెప్పాలి?*

️ *కుంచమో...* - 
ఒక వైశ్యునికి శివుడంటే మహాప్రీతి. కాని వ్యాపారకారణానికి ఎప్పుడూ బోర్లించని కుంచం బోర్లించి వచ్చినవారితో మాట్లాడుతూ తెల్లని బియ్యాన్ని తీసుకుని తడిపి పక్కన ఉంచుకుని, వాటితో కుంచాన్ని శివలింగంగా భావించి,

*ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః* 
*ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః* 
*ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః* 
*ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః* 
*ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః* 
*ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః* 
*ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః* 
*ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః* 
*ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః* 
*ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః* 
*ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః*

అంటూ శివనామాలతో పూజ చేస్తుండేవాడు. కొన్నాళ్ళకు అది శివలింగమైపోయింది. 

 *మేక పెంటికయొ..*   
మేకలు కాచుకునే ఒక భక్తుడికి, ఒకసారి శివాలయంలో వేదమంత్రాలతో అర్చకులు అభిషేకం చేస్తుంటే, తాను కూడా శివలింగానికి అలా అభిషేకం చెయ్యాలని కోరిక కలిగింది. మేకల పాలుతీసి శివలింగమెలా? అని ఆలోచిస్తూ వెళుతుంటే, ఒక మేక,  పెంటికలు గుత్తిగా విడిచి పెడుతున్నది. అందులోనుండి దొర్లి దొర్లి ఒక పెంటిక నిలబడి ఉంది. అతనికి అది శివలింగం వలె కనపడి, అతను మేక పాలను ఆవుపాలవలె భక్తితో *శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ* అంటూ దాని మీద పోసేసాడు. అతని భక్తికి ఆ మేక పెంటిక శివలింగమైంది. *కాటం అంటే మేక పెంటిక. కాటంలో నుండి పుట్టాడు కనక కాటేశ్వరుడయ్యాడు. క్రమంగా మోటుగా ఉందని కోటేశ్వరుడు అయ్యాడు.*

️ *సందేహముల్ మాన్పినా కన్నారన్ భవదీయ మూర్తి సగుణాకారంబుగా జూపవే!-* 
భక్తికి ఇంత లొంగిపోయావు కదా ఈశ్వరా! నిన్నెక్కడ ఉన్నావని చెప్పను? ఎలా అభిషేకం చెయ్యను? నిన్ను చూడాలని ఉంది, కనపడవా? అని ధూర్జటి గుండెలు బాదుకుని ఏడ్చాడు. శివుడు మోక్షమిచ్చి, సమస్తమైన కోర్కెలు తీర్చగలిగినవాడు. శివుడు శివుడే, శివలింగం శివలింగమే. అటువంటి మహానుభావుడు అనంతః అపవర్గప్రదః - ఆయన మోక్షం ఇవ్వగలవాడు. మృడః - సమస్తమైన కోరికలూ తీర్చకలిగినవాడు. 

*ఎక్కడ లేడు...*
*అన్నింటా ఉన్నాడు...*
*దర్శించగలిగితే.....*
.
ఈశ్వర ఉన్నత స్థానంలో నేనుండాలనే కోరిక కోరుకొవాలని నిన్నేతుక్కుంటూ వస్తే "స్మశానంలో కనపడ్డావ్"..నువ్వెంత ఉన్నత స్థానానికి వెళ్ళినా,
రావాల్సిన స్థానం ఇదేనని కాటి కాపారితో                        చెప్పించావ్... ఇంకా నిన్నేం అడగాలిరా శివ

ఎన్నో,,,, వేల కోరికలు కోరుకొని          గుడిబయటికొస్తుంటే ప్రసాదంగా "బూడిదిచ్చారు"
నేను నీకేమిచ్చిన,నువ్వు సొంతంగా ఏది పొందినా..                       నా శరీరం మీద ఎప్పుడు ఉండేది,నీ శరీరం                  ఎప్పటికైనా పొందేది ఇదేనని పూజారితో                 చెప్పించావ్...ఇక నిన్నేం అడగమంటావురా శివ

కోపాన్ని అధీనంలో ఉంచుకునే వారమడుగుదామని వస్తే, పూల బాణం వేసినందుకు మన్మధుణ్ణి భస్మం చేసావని,తలుపుకి అడ్డుగా నిలబడ్డందుకే కొడుకు తల నరికేసవని చెప్పారు...! అది విని వెనక్కి వెళ్లిపోవడం తప్ప
   ఎం చెయ్యగలనురా శివ

ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు 
నీకు చెప్పుకుందామని వస్తే,,,
ఆయనే గొంతులో విషాన్ని పెట్టుకొని మింగలేక ,
కక్కలేక కష్టపడుతున్నాడనే మాటలు విన్నాను,,,, 
ఇక నేను చెప్పుకోవాలనుకోవడం
మూర్కత్వమే కదారా శివ

రాక్షసులు అంతమవ్వాలనే
వరం ఇమ్మని అడగుదామని వస్తుంటే,,,, 
నీ దర్శనం చేసుకొని ఆనందంతో తాండవం చేసుకుంటూ వస్తున్న రాక్షసులు నాకు ఎదురు పడ్డారు,,, నాకు నువ్వెంతో,వాళ్ళు అంతే అనుకొనే నిన్ను ఇంకేం అడుగుతామురా శివా

తృప్తి,ముక్తి పొందాలని నీ దెగ్గరికి వస్తే..
ఆ రెండిటికోసం నువ్వే కల్లు తాగుతూ,
గంజాయి పిలుస్తున్నావని తెలిసింది,,, 
ఇంకా నా నోటా,మాటెలా వస్తుందిరా శివా

మనశ్శాంతిగా ఉండే జీవితం కోసం నీ దెగ్గరికి వస్తే, నువ్వే దానికోసం ఎముకలు కొరికి చలున్న హిమాలయాల్లో,ఎవరు రాని ప్రదేశంలో ధ్యానం చేసుకుంటున్నావని చెప్పారు,,,,
అడగటానికి ఇంకేముంటుందిరా శివ

కానీ,నువ్వంటే ఇష్టం,,,,

"ఆడవాళ్ళని,మగవాళ్ళని వేరు చేసి చూసే మాకు,,,, గంగని తలపై పెట్టుకొని,పార్వతికి శరీరంలో సగ భాగం ఇచ్చి,,, ఆడవాళ్లంటే,మగవాళ్ళకి వ్యతిరేకం కాదు, మగవారిలాగే ఆడవాళ్లు కూడా ఈసృష్టిలో ఒక భాగం అనే విషయం చెప్పావు చూడు,,, అందుకే నువ్వంటే వ్యసనం"

"మేడలో పాముని వేసుకొని,
అది తినే ఎలుకని, కొడుక్కి వాహనంగా ఇచ్చి,
పాముని తినే నెమలిని ఇంకో బిడ్డకి వాహనంగా చేర్చి,
నువ్వెక్కి తిరిగే నందిని తినే సింహాన్ని పార్వతికి ఆసనంగా మార్చి,అవన్నీ ఒకే దెగ్గర ఉండేలా చేసి,,,, ఇవే జాతి వైరం లేకుండా పక్క, పక్కన
బ్రతుతున్నాయి,
మరి జ్ఞానమున్న మనుషులు మీ పరిస్థితేంటి అని ప్రశ్నిస్తున్నావు కదా " అందుకే నువ్వంటే వ్యసనం

"సాగర మధనంలో విషం వచ్చినప్పుడు అందరికంటే ముందుగా అక్కడికి చేరింది నువ్వే,అమృతం వచ్చినప్పుడు అక్కడికి రానిది కూడా నువ్వే,,,,, ఫలితం ఎవ్వరు సుఖంగా అనుభవించినా పర్లేదు,కానీ దాని తాలూకు కష్టం మొత్తం మనమే అనుభవించాలనుకునే నీ ఆలోచనకి నేను వ్యసనపరుడనే "

"కోపం ప్రతి జీవి లక్షణం ,కానీ,అది అవలక్షణం అవ్వకూడదనే విషయాన్నీ మాకు తెలియడానికి నీ జీవితాన్నే చాలసార్లు ఉదాహరణగా చుపించావ్ కదా అందుకే నీకు వ్యసనపరుణ్ణి"

" అర్హతలేని వాళ్లకి అవకాశమిస్తే 
ఏమవుతుందో "ఒక రాక్షసుడికి తల మీద 
చెయ్యి పెడితే భస్మమై పోవాలనే వరాన్ని ఇచ్చి,,,,
ఒక రాక్షసుడికి చావే లేకుండా వరాన్ని ఇచ్చి,,,, 
నువ్వు పడిన బాధనే మాకొ గుణపాఠంలా చెప్పావ్           కదా అందుకే నువ్వంటే నాకు అలవాటైనవ్యసనం

"మనం చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరిచేసుకొని అవకాశం ఉంటుందని అవకాశం వస్తుందని,,,,           "మాములు బాలుడి తల ఆవేశంతో నరికి,
తర్వాత ఆలోచనతో ఏనుగు తల అతికించి,,,,            అందరూ ముందుగా, పూజించాల్సినంత గొప్ప
స్థాయికి.ఆ బాలున్ని పంపి అందరికి నాయకుడిగా ఉండే వినాయకుణ్ణి చేసావు కదా...
"అందుకే నువ్వొక ఇష్టమైన వ్యసనం

"కల్లు తాగినా ,గంజాయి పీల్చినా,,
ఒక్కసారి కూడా తప్పుగా ప్రవర్తించిన సందర్భం లేకుండా,ఆ వెంటనే ధ్యానం చేసుకుంటూ,,,,
"మన జీవితపు, శాశ్వత ఆనందాన్ని
తాత్కాలికంగా మార్చేది,లోక వ్యవహారం,,,,
తాత్కలిగంగా చేసినా,,,  
శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేది ధ్యానం" అని,,,
ఆ అలవాట్లు , అనుభవించి మాలాంటి వాళ్ళకి అర్ధమయ్యేలా చేసావు కదా "
అందుకే నువ్వొకమహా మహా ఇష్టమైన వ్యసనం

నీ గురించి ఎంత చెప్పిన తరిగేది కాదు,,,, ఎందుకంటే నీ గురించి చెప్పడం కూడా నీ చెర్యే కదా,,
"శివుడు ఆశ్చర్యం కలిగించే శక్తులు ఉన్నవాడు కాదు,అర్ధం చేసుకుంటే అద్భుతం
అనిపించే వ్యక్తిత్వం ఉన్నవాడు",,,, 
"శివుడి భక్తుడు ఉండ్డాల్సింది భక్తుడిగాననే కాదు,సత్యనిష్ఠతో నిత్య విద్యార్థిగా"

"శివుడు పూజించాల్సిన దేవుడో 
లేక నమ్మాల్సిన దేవుడో కాదు,,,, 
అర్ధం చేసుకోవాల్సిన దేవుడు.

_దొరకునా ఇటువంటి సేవ..!_*

 *_దొరకునా ఇటువంటి సేవ..!_*


🌸🌸🎼🎼🌸🌸


వెండితెరను స్వర్ణమయం

చేసిన కళాతపస్వి..

మహా మనస్వి..

అపార తేజస్వి..

చిరయశస్వి..


ఇక లేరంటే..తిరిగి రారంటే..

గుండెకు గాయం కదా..

అదెప్పటికీ నయం కాదా..!


ఒక్కసారి కళ్ల ముందు 

తిరుగుతున్న రీళ్లు..

సినిమాలు కావవి 

దృశ్యకావ్యాలు..

అపురూపంగా నర్తిస్తున్న

*_సిరిసిరిమువ్వ.._*

అద్భుతంగా అభినయిస్తున్న

*_సీతామాలక్ష్మి.._*

కళ్ళెదుట కూర్చుని పాడుతున్న *_శంకరశాస్త్రి.._*

అభినయపరాకాష్ట

_*సాగరసంగమం..*_

పురోగమన భావాల

జలనిధి *_సప్తపది.._*

అపూర్వ చిత్రరాజాల

సినీమా రుషి

దర్శకత్వ ఖుషి..

*_స్వయంకృషి.._*


కాశీనాథుని ఆగమనమే

తెలుగు సినిమాకి

*_శుభోదయం.._* 

*_శుభసంకల్పం.._*

*_శుభప్రదం.._*

పెరిగిన దర్శకుల 

*_ఆత్మగౌరవం.._*

కళాఖండాల ఆవిర్భావానికి

వెలుగురేఖ _*శుభలేఖ*_

వెండితెరపై అందంగా

పరచుకున్న

*_సిరివెన్నెల..._*

దర్శక దిగ్గజం

ప్రతి సినిమా ఒక _*స్వాతిముత్యం..*_

మహానటులు 

*_చిన్ననాటిస్నేహితులు_*

ఎందరో మహానుభావులు

ఆయన విజయాల్లో

_*సూత్రధారులు..*_

గొప్ప సినిమా

ఆయన *_జీవనజ్యోతి_*


మొత్తంగా సినిమా

విశ్వనాధుని *_జీవితనౌక_*

మంచి సినిమా కోసం 

ఆర్రులు చాచిన 

అభిమానులకు

ఆయన *_ఆపద్బాంధవుడు..!_*


మనకు ఎన్నో కళాఖండాలను అందించిన

అభిమాన దర్శకుడు

కళాతపస్వి విశ్వనాథ్ కు 

ఆయన సినిమా పేర్లతోనే అక్షరనీరాజనం..


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

       విజయనగరం

      9948546286

సూత్రధారులు

 సీసమాలిక:

*సూత్రధారులు* లేక శోకించె నటనమ్ము 

నటనసూత్రము నేర్పు నాథుడేడి? 

*స్వాతిముత్యము* వంటి సంస్కృతీ విలువల 

సందడించగ నేడు సాధువేడి? 

*సిరిసిరిమువ్వ* ల చెలిమి జేయగ ధాటి 

నడుము బిగించెడు నాథుడేడి? 

*స్వర్ణకమల* దీప్తి *సాగరసంగమ*

ముల *స్వయంకృషి* బర్వు పురుషుడేడి? 

సినిమాల రంగాన *సిరివెన్నెల* ను బూచి 

తిమిరాల బోగొట్టు తేజమేది? 

*శంకరాభరణపు* సమ్మోహరాగాల 

*శ్రుతిలయల* ను గూర్చు ప్రోఢ యేడి? 

తే.గీ.

ఇన్ని హంగుల భంగుల నెన్నదగిన 

పూర్ణుడై నిలచు *కళాప్రపూర్ణు* డఱుగ 

లేడు లేడెట గన సాటి లేడు లేడు  

విశ్వనాథుని సరిజోడు విశ్వమందు 

 *~శ్రీశర్మద* 

*+91 8333844664*