5, సెప్టెంబర్ 2023, మంగళవారం

మంగళవారం, సెప్టెంబర్ 05, 2023 రాశి ఫలాలు

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*మంగళవారం, సెప్టెంబర్ 05, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం*

*తిధి*      :  *షష్ఠి రా8.46* వరకు


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

మేషం


ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట  పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

వృషభం


ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార విషయంలో  ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప  ఆటంకాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------

మిధునం


ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

---------------------------------------

కర్కాటకం


విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం  కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

---------------------------------------

సింహం


ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

---------------------------------------

కన్య


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో  శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

---------------------------------------

తుల


సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల  వాతావరణం ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. 

---------------------------------------

ధనస్సు


ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. 

---------------------------------------

మకరం


చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక    ఆరోగ్యసమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------

కుంభం


ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. 

---------------------------------------

మీనం


బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం చికాకుగా  ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కలి యుగం

 *కలి యుగం ఎందుకు 4,32,000 సంవత్సరాలు? ఎందుకు కేవలం అంతే?*


జీవాత్మ మూడు గుణాల్లో తిరుగుతుంటుంది. ప్రతీ గుణంలో ఆరు మంచి గుణాలు,ఆరు చెడు గుణాలు ఉంటాయి.


అంటే  తమో గుణంలో 12 గుణాలుంటాయి.

రజో లో 12 ఉంటాయి.

సత్వంలో  12 ఉంటాయి.


మొత్తం గుణాలు 36.

ఈ 36 నవగ్రహల ప్రభావం చేత ప్రతీ గంటకు ఈ గుణాలు మారుతూ తిరుగుతూ ఉంటాయి.అంటే జీవాత్మే ఆ గుణాలలో తిరుగుతుంది.


పగటి కాలం 12 గంటలు.

ఒక గంటకు ఈ 36 గుణాలు ఎన్ని సార్లు తిరుగుతాయంటే....


36×12=432 సార్లు,గంటకు.


పరమాత్మునికి పగలు వేయి యుగములు. కావున 


గంట గుణాలు432×1000= 4,32,000.సంవత్సరాలు.


దీనికి రెండింతలు ద్వాపర

8,64,000.


దానికి మూడింతలు త్రేత 

12,96,000.


మొదటి దానికి నాలుగింతలు

కృత.

4,32,000×4= 17,38,000 సంవత్సరాలు.


త్రిగుణాలు తిరిగేదాన్ని బట్టి పగటి కాలాన్ని బట్టి యుగ నిర్ణయం చేసాడు దేవుడు.

 

మొత్తం నాల్గు యుగాలు కలిపి

43,20,000సంవత్సరాలు అవుతుంది. 


ఈ నాల్గు యుగాలు 250 సార్లు  జరుగుతాయి.

అంటే 

43,20,000 సంవత్సరాలు×250మార్లు =108,00,00,000. అంటే 

108 కోట్ల సంవత్సరాలు.


108 కోట్ల సంవత్సరాలు గుణాలు ఆడుకుంటాయి.రాత్రిళ్ళు ఈ గుణాలు నిద్రిస్తాయి.


108 కోట్ల సంవత్సరాల తరువాత మాత్రమే భౌతిక ప్రళయం ఉంటుంది.

త్రైత జ్ఞానం నుండి.


శ్రీ కృష్ణ శ్రీ ప్రభోదానంద యోగేేశ్వరాయనమః 🙏🙏🙏

రామాయణమ్ 315

 రామాయణమ్ 315

...

రావణా జనస్థానంలో జరిగిన రాక్షస సంహారం గుర్తు తెచ్చుకో ! .వాలి వధను కూడ స్మరించుకో .బుద్ధిగా సన్మార్గంలో ప్రయాణించు.రామచంద్రుని ధనుష్ఠంకారము వినాలని అనుకోవద్దు.

.

నీ లంక ను వాజి రధ కుంజరాలతో సహా నాశనం చేయడానికి నేనొక్కడనే సరిపోదును....కానీ అది రాముని ప్రతిజ్ఞ!

.

సర్వ ఋక్ష వానర సమక్షములో రాముడు ప్రతిజ్ఞ చేసినాడు కావున నిన్ను నేను వదిలిపెడుతున్నాను.

.

సీత ,సీత అని కలవరిస్తున్నావే ఆమె నీ లంకకు కాళరాత్రి ,

నీ పాలిటి కాలపాశం

 అని తెలుసుకో!.

.

సీతదేవి తేజస్సు చాలును నీ లంక భస్మమయిపోవడానికి .

రాముని క్రోధం సృష్టించే విలయం నీ ఊహకు అందనిది!.

.

అందాల నెలవంక లాంటి నీ లంక సమస్తం దహించివేయబడుతుంది.

భస్మరాసులు మాత్రమే మిగులుతాయి.

.

మిత్రులు మంత్రులు

హితులు,సుతులు

జ్ఞాతులు,భ్రాతలు

సుతులు,హితులు

భార్యలు,భోగాలు ...అంతా నాశనం సర్వలంకా వినాశనం జరుగుతుంది జాగ్రత్త !

.

ఇకనైనా తెలివితెచ్చుకొని నీ లంకను కాపాడుకో !

.

హనుమంతుడి ఈ ఉపదేశానికి రావణుడికి తీవ్రమైన క్రోధం పెల్లుబికింది.కన్నులు క్రోధారుణిమతాల్చాయి!

.

వూటుకూరు జానకిరామారావు

తపన..ఆర్తి..*

 *తపన..ఆర్తి..*


"ఎల్లుండి శనివారం నాటికి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి రావడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నామండీ..కానీ ఇంతలోనే అవాంతరం ఎదురైంది..మా వారికి ఆఫీస్ లో ఏదో ఎంక్వయిరీ ఉన్నదట..అందువల్ల రాలేకపోతున్నాము..మళ్లీ వీలుచూసుకొని తప్పకుండా వస్తాము.." అని బెంగుళూరుకు చెందిన మహేశ్వరి గారు ఫోన్ చేసి చెప్పారు.."అయితే..మీకొఱకు బుక్ చేసి ఉంచిన రూమ్ ను వేరే వాళ్లకు కేటాయించమంటారా.."? అని అడిగాను.."వేరే వాళ్లకు ఇచ్చేయండి..ఈసారి మేము వచ్చేముందుగా మీకు తెలుపుతాము..ఈసారికి మాకు అదృష్టం లేదనుకుంటాము.." అన్నారు మహేశ్వరి గారు..మహేశ్వరి గారి కొఱకు తీసివుంచిన రూమ్ ను వేరే వాళ్లకు ఇచ్చేసాము..


శనివారం ఉదయం పది గంటల సమయం లో శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ముందు కారు వచ్చి ఆగింది..అందులోనుండి మధ్యవయస్కులైన దంపతులు దిగారు..వారితోపాటు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా దిగారు..మందిరం లోపలికి వచ్చి..సిబ్బంది ఉన్న టేబుల్ వద్ద నిలబడి.."ఇక్కడ ప్రసాద్ గారంటే ఎవరు?." అని అడిగారు..మా సిబ్బంది నా వైపు చూపించారు..ఆ దంపతులు నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ మొన్న మీకు కాల్ చేసి, మేము రావటం లేదు..మా కోసం ఉంచిన రూమ్ ను వేరేవాళ్లకు ఇవ్వండి..అని చెప్పిన మహేశ్వరిని నేనే..వీరు మావారు రాజరత్నం..వాడు మా అబ్బాయి కార్తీక్..అమ్మాయి సుధారాణి..మావారికి ఆఫీస్ లో పని ఉన్నది అని చెప్పాము కదండీ..కానీ ఆ ఆఫీసర్లు రావడం లేదని నిన్న మధ్యాహ్నం తెలిపారట..మొగలిచెర్ల వెళ్లి ఆ అవధూత మందిరాన్ని చూసి వద్దాము..అని మావారు చెప్పారు..అందుకని వెంటనే బైలుదేరాము..మీకు వీలుంటే మాకోసం ఒక రూమ్ ఇవ్వగలరా?.." అన్నారు.."అమ్మా..ఏవీ ఖాళీ లేవు..కాకుంటే..కామన్ రూమ్ ఒకటి ఉన్నది..సుమారు ఇరవై మంది వరకూ అందులో ఉండొచ్చు..మీరు కాకుండా..మరెవరైనా వస్తే..అందులో మీతో పాటు వుంటారు..ప్రస్తుతానికి అదొక్కటే మార్గం..అందులో వుండండి.." అని చెప్పాను.."సరేలేండి..సర్దుకుంటాము.."అన్నారు..


రూమ్ కు వెళ్లి స్నానాదికాలు ముగించుకొని వచ్చారు..సాయంత్రం జరిగే పల్లకీసేవ గురించి వివరాలు అడిగి..అందులో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు..మధ్యాహ్నం అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చి.."ప్రసాద్ గారూ..మీతో మాట్లాడాలి..మాకు సమయం ఇస్తారా.."? అని అడిగారు.."ఇప్పుడు ఖాళీగానే వున్నాను..చెప్పండి.." అన్నాను.."నేను చెపుతాను.." అని రాజారత్నం గారు అన్నారు.."చెప్పండి.." అన్నాను.."మా ఆఫీస్ లో నాకూ..నా పైన ఉన్న అధికారులకూ మధ్య విబేధాలు ఉన్నాయండీ..నేను ఎంత పని చేసినా..ఏదో ఒక లోపం చూపి నన్ను వేధిస్తున్నారు..నేను లంచం తీసుకోను..నా పని వరకూ నిజాయితీగా చేస్తుంటాను..అది వారికి నచ్చటం లేదు..అందువల్ల నన్ను టార్గెట్ చేసుకొని వేధిస్తున్నారు..నాకు మానసికంగా వత్తిడి గా ఉంది..వేరే డిపార్ట్మెంట్ కు వెళదామని ప్రయత్నం చేసాను..నిన్న కూడా నన్ను వేరే చోటుకి బదిలీ చేయమని అప్లికేషను ఇచ్చాను..తీసుకున్నారు..తరువాత చూస్తాం అన్నారు..ఈ పరిస్థితులు మార్చమని అందరు దేవుళ్లకూ మొక్కుకున్నాను..ఈ మధ్య సోషల్ మీడియా లో ఈ స్వామివారి గురించి చదివి..ఇక్కడికి రావాలని నిశ్చయం చేసుకున్నాను..ఇంతవరకూ నా సమస్య చెప్పాను..ఇక రెండోది వినండి..వీడు మా అబ్బాయి..ఇంజినీరింగ్ పూర్తి చేసాడు..క్యాంపస్ లోనే సెలెక్ట్ అయ్యాడు..ఈరోజుకు సరిగ్గా రెండు నెలల తరువాత ఉద్యోగం లో చేరాలి..కానీ ఈ మధ్య తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు..డాక్టర్లకు చూపించాము..మామూలు వైరల్ ఫీవర్ అని చెప్పారు..కానీ..తగ్గడం లేదు..వీడి గురించి కూడా స్వామివారికి విన్నవించుకోవాలని అనుకున్నాము.." అన్నాడు..


"రేపు ఉదయం ప్రభాతసేవ తరువాత స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, మీ సమస్య అక్కడ చెప్పుకోండి..మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది.." అని చెప్పాను..సాయంత్రం పల్లకీసేవ లో ఆ కుటుంబం పాల్గొన్నది..అందరూ స్వామివారి మంటపం లో నేల మీదే పడుకున్నారు..తెల్లవారుజామున రాజారత్నం, మహేశ్వరి గార్లు స్నానం చేసి వచ్చి మందిరం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేశారు..వాళ్ళ అబ్బాయి కార్తీక్ మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసాడు..తన సోదరుడి తోపాటు అమ్మాయి కూడా అన్ని ప్రదక్షిణాలు చేశారు..ఆ కుటుంబం మొత్తం అత్యంత భక్తి తో మసలుకున్నారు..స్వామివారి ప్రభాతసేవ పూర్తి కాగానే..రాజారత్నం గారి కుటుంబం స్వామివారి సమాధి దర్శించుకున్నారు..స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చారు..


"ప్రసాద్ గారూ..వచ్చేవారం కూడా మేము ఇక్కడకు వస్తామండీ..అలా మొత్తం మూడు వారాలు వస్తాము..ఈ క్షేత్రం లో ఎక్కడలేని ప్రశాంతత ఉన్నది..ఇక మేము బైలుదేరుతామండీ..వచ్చేవారం ఆపై వారం కూడా మాకు రూము వద్దు..మంటపం లోనే పడుకుంటాము..స్వామి సన్నిధి లోనే పడుకుంటే..స్వామికి దగ్గరగా ఉన్నట్టు ఉంది.." అని చెప్పి వెళ్లిపోయారు..


ఆ తరువాత గురువారం మధ్యాహ్నం రెండు గంటల వేళ.."ప్రసాద్ గారూ..నేను రాజారత్నం మాట్లాడుతున్నాను..స్వామివారి దయతో నాకు బదిలీ అయింది..నేను కోరుకున్న డిపార్ట్మెంట్ కే నన్ను మార్చారు..మరో మాట..అక్కడినుంచి వచ్చిన తరువాత మా అబ్బాయి అనారోగ్యం కూడా లేదు..ఉషారుగా వున్నాడు..ఎల్లుండి శనివారం మేము వస్తున్నాము..ఇంకా ఇంటికి కూడా ఫోన్ చేయలేదు..మీరు స్వామివారి దగ్గరే వుంటారు కనుక..మొట్టమొదట మీకే చెపుతున్నాను.." అన్నారు..


అనుకున్న విధంగానే రాజారత్నం గారి కుటుంబం మూడు వారాలూ వచ్చారు..మొదటి వారం లోనే వారి సమస్యలు తీరిపోయినా..ముందుగా మొక్కుకున్న విధంగా మూడు శనివారాలూ వచ్చి పల్లకీసేవ లో పాల్గొని..మంటపం లో నేల మీదే పడుకొని..ప్రక్క ఆదివారం ఉదయం ప్రదక్షిణాలు చేసి..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లారు..


స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అనే తపన..ఆర్తి..ఉన్నవాళ్లను స్వామివారు తప్పకుండా కాపాడుకుంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

వార్ధక్యంలో


*కం*

రక్కసుడై చెలరేగుచు

గ్రక్కున ప్రాణాలుతీయు కర్కశుడైనన్.

చిక్కని(చిక్కగ) వార్ధక్యంబున

ఠక్కున చిరుచీమకరువ ఠారును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! రాక్షసుడు గా చెలరేగుచూ వెంటనే ప్రాణాలు తీయగల కఠినాత్ముడైననూ వృద్ధాప్యం తో కృశించినపుడు చిన్న చీమ కరువగానే మరణభీతుడగును.

*సందేశం*:-- చేతనత్వమున్న యవ్వనంలో ఎంతటి చేటుపనులు చేసిన నూ వార్ధక్యంలో అనుక్షణం భయంతో నే బతకాలి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

తప్పని గుర్తించినపుడు

తప్పకనాతప్పు నెల్ల తక్కించదగున్.

తప్పని యెరిగియు పరిపరి(మరి యా)

తప్పొనరించంగ శిక్ష తప్పదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తప్పు అని గుర్తించిన తరువాత తప్పకుండా ఆ తప్పును తిరిగి చేయరాదు. తప్పని తెలిసిన తరువాత కూడా అదే తప్పు చేస్తే శిక్ష తప్పదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

రాధపిలుపు

 వేణుగానం!


"ఏది మరొక్కసారి,హృదయేశ్వర!,గుండెలు పుల్కరింపఁగా/

ఊదగదోయి!ఊదగదవోయి!సుధామయ యుష్మదీయ వే /

ణూదయ రాగడోలికల నూయలలూగుచు విస్మృతిలో విలీనమై /

పోదును; నాదుక్రొవ్వలపుపువ్వుల ముగ్ధపరీమళమ్ముతో;


కరణామయి-ఉదయశ్రీ-

జంధ్యాలపాపయ్యశాస్త్రి.


        ఈపద్యంవింటే రాధికయేగాదు మనంగూడా తన్మయులమైపోతాం.శాస్త్రిగారి కవితాశక్తియలాంటిది!

         హే హృదయేశ్వరా! కృష్ణా! మరోసారి వేణువూదవా! మరోసారి,ఆఁహః కాదుకాదు మరోసారి,బృందావనిలోనీవు వేణువూదుతుంటే,ఆవలపుగానంలో నాతనువూ మనసూ మరచి తన్మయస్ధితిలోలీనమై, నాతొలివలపుల తీయనియూహలు మదిలో నూగుచుండగా,నీకోసంఈ రాధపరవసిపోతుంది.నీకోసం పలవరిస్తుంది.

మరొక్కసారి వేణువు నూదవయ్యా!కృష్ణా! నాకోసం,కాదుకాదు, మనకోసం;

          ఇదీ ఈపద్యంలోని రాధపిలుపు.శాస్త్రిగారి పద్యంలో వలపు రవంతైనా మీకు అందించగలిగానా నాజన్మధన్యమే!

                             స్వస్తి!

సంబంధం కోసం

 


పెండ్లిడుకు వచ్చిన యువకుడు పెళ్లి చేసుకోవడం కోసం సొంత కులంలో పెళ్లి సంబంధం కోసం వెతుకుతుంటే అబ్బాయి ఏమీ చదువుకున్నాడు?  ఎంత సంపాదిస్తాడు? ఏ ఊరిలో ఉద్యోగం చేస్తాడు? సొంత ఇల్లు ఉందా? ఎన్నేకరాల భూమీ ఉంది? ఎంత ఆస్తి ఉంది? ఎంతమంది సంతానం? ఆడపడుచులు ఎంతమంది? పెళ్లయ్యాక అత్తమామలతో కలిసే ఉండాలా? ఇట్లా సవాలక్ష ప్రశ్నలతో తక్కెడలో తూకం వేసి.., బంధువులతో, స్నేహితులతో, అబ్బాయి వాళ్ళ ఊరిలో తెలిసిన వాళ్ళతో అబ్బాయి గురించి, అబ్బాయి కుటుంబం గురించి సీబీఐ, ఈడి మాదిరి ఎంక్వయిరీ చేసి పెళ్లి సంబంధం ఖాయం చేసుకుంటారు కదా? 


మరీ సొంత కులం కాదు కదా కనీసం సొంత మతం కూడా కానీ వాడు, ఉద్యోగం, డబ్బులు లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటాం అంటే ఇంట్లో డబ్బులు, నగలు దొంగతనం చేసి, అడ్డొచ్చిన సోదరిని చంపి పెళ్లి చేసుకుందాం అనే స్థాయికి ఎలా వచ్చారు..? 


ఒరే.    తల్లి  తండ్రులు అనే గాడిదలు సంపాదన మీద మాత్రమే కాదురా సంతానం బయట ఏమీ వెలగబెడుతున్నారు కాస్త చూడండి. లేదంటే కుటుంబం రోడ్డున పడుతుంది. సంవత్సరాల మీ  సంపాదన బూడిద పాలవుతుంది.


Ps: ఎవరి మనోభావాలైన దెబ్బతింటే మడిచి జేబులో పెట్టుకోండి.

పంచాంగం 05.09.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 05.09.2023 Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస కృష్ణ పక్ష: షష్థి తిధి భౌమ వాసర: భరణి  నక్షత్రం వ్యాఘాత యోగ: వణిజ  తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం. 


షష్థి మధ్యాహ్నం 03:52 వరకు.

భరణి పగలు 09:02 వరకు.

సూర్యోదయం : 06:06

సూర్యాస్తమయం : 06:23

వర్జ్యం : రాత్రి 09:12 నుండి 10:49 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:33 నుండి 09:23 వరకు తిరిగి రాత్రి  11:04 నుండి 11:51 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

ప్రయత్నాన్ని విరమించడమే అపజయమని

 శ్లోకం:☝️

  *నేతా యస్య బృహస్పతిః*

*ప్రహరణం వజ్రం సురాః సైనికాః*

 *స్వర్గో దుర్గమనుగ్రహః ఖలు*

  *హరేరైరావణో వారణః |*

*ఇత్యాశ్చర్యబలాన్వితోఽపి*

  *బలభిద్భగ్నః పరైః సఙ్గరే*

*తద్వ్యక్తం నను దైవమేవ శరణం*

  *ధిక్ ధిక్ వృథా పౌరుషమ్ ||*


భావం: బృహస్పతి వంటి దేవగురువు, ఎదురులేనట్టి వజ్రాయుధం, సేనావాహినిలో ఉన్నవారంతా దేవతలు, కోట చూడబోతే స్వర్గం, ఐరావతం అనే ఏనుగు, అన్నిటిని మించి శ్రీహరి అనుగ్రహం. ఇన్ని ఉండి కూడా ఇంద్రుడు యుద్ధంలో ఓడిపోయాడు. అదీ శత్రువులైన దానవులచేతిలో! ఎందువల్ల? ప్రయత్నలోపంవల్ల!

ప్రయత్నాన్ని విరమించడమే అపజయమని భావం.

గుణవంతుడికి

 🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄

 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*కుపితోఽపి గుణాయైవ*

*గుణవాన్భవతి ధ్రువమ్।*

*స్వభావమధురం క్షీరం*

*క్వథితం హి రసోత్తరమ్॥*


𝕝𝕝తా𝕝𝕝 గుణవంతుడికి కోపము వచ్చిననూ.... అది మేలు కలిగించేదే! స్వభావసిద్ధంగా తియ్యగా ఉండే పాలు మరిగిననూ.....మరింత తియ్యదనాన్నే పొందుతాయికదా!!