ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
9, అక్టోబర్ 2023, సోమవారం
పంచాంగం 09.10.2023 Monday,
ఈ రోజు పంచాంగం 09.10.2023 Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: దశమి తిధి ఇందు వాసర: ఆశ్రేష నక్షత్రం సిద్ద యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.
దశమి మధ్యాహ్నం 12:37 వరకు.
ఆశ్రేష రా.తె 05:44 వరకు.
సూర్యోదయం : 06:11
సూర్యాస్తమయం : 05:55
వర్జ్యం : సాయంత్రం 05:08 నుండి 06:56 వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:26 నుండి 01:13 వరకు తిరిగి మధ్యాహ్నం 02:47 నుండి 03:34 వరకు.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.
శుభోదయ:, నమస్కార:
*తల్లి ఋణం
*తల్లి ఋణం - తీర్చలేనిది..!!*
🌟 ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు.
🌟 తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో - తల్లి ఇలా అంది .. బిడ్డా, నా రుణం తీర్చుకోవాలీ అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు, నీవు ఒకరోజు రాత్రిపూట పసి బిడ్డగా నా వద్ద పడుకో చాలు అంది. ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు.
🌟 అతనికి నిద్ర రాగానే తల్లి లేపి నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు’ అంది. కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు. రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి ‘ఏమిటమ్మా ఇది’ అన్నాడు. ‘పొరపాటు అయిపోయింది నాయనా’ అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు.
🌟 అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి ‘బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు’ అంది. ‘ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?’ అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు.
🌟 తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. కొడుకు కోపంతో ‘అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా’ అన్నాడు. ‘నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది’ అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు. ‘అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా’ అంటూ నీళ్ళు తీసుకువచ్చి ‘ఇదిగో తాగి చావు’ అన్నాడు.
🌟 తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. ఇది చూసిన కొడుకు ఇక సహించలేక .... అమ్మా !! బుద్ధుందా లేదా ఏమిటిది ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు’ అంటూ ఆగ్రహంతో కేకలేశాడు.
🌟 అప్పుడు తల్లి ..... బిడ్డా చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి.
🌟 నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు - నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు అంది తల్లి.
🌟 ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని ,అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు,ఆమె చేసే సేవలకు,ఆమె త్యాగాలకు, కష్టానికి, సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు.
👉నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు’ అన్నాడు.
అందుకే తల్లిని మాతృదేవోభవ అన్నారు. తల్లి దేవత. తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
నవమాసాలు తన బిడ్డను కడుపులో మోసి, ఎన్నో బాధలకు ఓర్చి, బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తల్లి ఇంకో జన్మ ఎత్తినట్లే.
*దయచేసి తమ పిల్లలకు ఇది పంపించండి🙏
⚜ శ్రీ ఉత్తరస్వామిమలై ఆలయం
🕉 మన గుడి : నెం 202
⚜ ఢిల్లీ : RK పురం
⚜ శ్రీ ఉత్తరస్వామిమలై ఆలయం
💠 దక్షిణ భారత దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఉత్తర స్వామి మలై మందిర్ R.K.పురం సెక్టార్-7లో ఉంది.
మురుగన్‌కు అంకితం చేయబడిన ఈ ఆలయం ప్రత్యేకమైన శిల్పకళను కలిగి ఉంది,
💠 తమిళ, తెలుగు, కన్నడ & మలయాళీ కమ్యూనిటీలకు చెందిన హిందువులు కలిసి పూజించే కొన్ని ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. మందిరంలో ప్రధాన దైవం మురుగన్.
💠 ఉత్తర స్వామి మలై మందిర్ ఒక కొండపై ఉంటుంది.
దీనిని స్థానికంగా మలై మందిర్ అని పిలుస్తారు.
అధికారికంగా ఉత్తర స్వామి మలై ఆలయం అని పిలుస్తారు.
💠 ఒక కొండ శిఖరం పైన ఈ ఆలయం ఉన్న ప్రదేశం నుండి దాని పేరు వచ్చింది - ఒక చిన్న కొండ పైభాగం ('మలై' అనేది కొండకు తమిళం పెరు).
దీనికి చాలా ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది! స్వామినాథన్ (లేదా మురుగన్) ఒక రాత్రి తన భక్తుల కలలో కనిపించాడు మరియు అతని నివాసంగా దట్టమైన ఏకాంత ప్రదేశంలో ఒక చిన్న కొండను సూచించాడు.
అలా 1961లో మలై మందిర్ ఆవిర్భావం జరిగింది.
దీని నిర్మాణం దక్షిణ భారత ఆలయ వాస్తుశిల్పంలోని చోళ శైలి నుండి ప్రేరణ పొందింది.
💠 ప్రధాన స్వామినాథ స్వామి ఆలయంతో పాటు, ఈ సముదాయంలో శ్రీ కర్పగ వినాయగర్ , శ్రీ సుందరేశ్వర్ (శివుడు) మరియు దేవి మీనాక్షి ఆలయాలు ఉన్నాయి.
ఈ అనుబంధ దేవాలయాలు తమిళనాడులోని మధురైలోని చారిత్రాత్మకమైన మీనాక్షి అమ్మన్ ఆలయంలో చూడగలిగే విధంగా, తమిళ నిర్మాణ శైలిలో పాండ్య శైలి నుండి ప్రేరణ పొందాయి .
⚜ చరిత్ర ⚜
💠 8 సెప్టెంబర్ 1965 అప్పటి భారత ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. భక్తవత్సలం ఆలయానికి పునాది రాయి వేశారు .
💠 7 జూన్ 1973 స్వామినాథ స్వామికి ప్రధాన ఆలయం - శ్రీ స్వామినాథ స్వామి ఆలయం - ప్రతిష్ఠించబడింది మరియు మహాకుంభాభిషేకం నిర్వహించబడింది .
💠13 జూన్ 1990 లో శ్రీ కర్పగ వినాయకుడు, శ్రీ సుందరేశ్వరుడు మరియు దేవి మీనాక్షి ఆలయాలు ప్రతిష్ఠించబడ్డాయి మరియు మహాకుంభాభిషేకాలు నిర్వహించబడ్డాయి.
💠 కంచి కామకోటి పీఠానికి చెందిన శంకరాచార్యులు మరియు తిరుపనందల్‌కు చెందిన అరుళ్నంది తంబిరాన్ స్వామివారి ఆశీర్వాదంతో, స్వామినాథ స్వామి యొక్క ప్రధాన విగ్రహం కోసం రాయిని కనుగొన్నారు.
తిరుచెందూర్ సముద్రతీరంలో ఉన్న శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రస్తుతం ఉన్న మూలవిగ్రహం అరవై సంవత్సరాల క్రితం అదే శిలలోని మరొక భాగం నుండి చెక్కబడినట్లు కనిపిస్తుంది .
💠 మూలవిగ్రహం చేయడానికి ఆ రాయిని మహాబలిపురం తీసుకువచ్చారు .
శ్రీ స్వామినాథ విగ్రహాన్ని చెక్కడానికి దాదాపు ముప్పై నెలల సమయం పట్టింది.
ఏప్రిల్ 1970లో, శంకరాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామివారి ఆశీర్వాదం కోసం విగ్రహాన్ని కాంచీపురం తీసుకువెళ్లారు. ఆయన పని తీరుకు సంతోషించి మూల విగ్రహానికి ప్రత్యేక అభిషేకం , అర్చనలు చేశారు . తర్వాత ఉత్తర స్వామిమలైకి తీసుకొచ్చి ధాన్య వాసంలో ఉంచారు .
💠 7 జూన్ 1973న జరిగిన మహా కుంభాభిషేకం ఈ దశాబ్దంలో జరిగిన అతి పెద్ద కార్యక్రమంగా గుర్తించబడింది.
మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఆ కార్యక్రమం వీక్షించారు.
💠ఇక్కడి యాగశాలలో 47 హోమ కుండాలు మరియు 64 కలశాలను ఏర్పాటు చేశారు మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి 100 మందికి పైగా శివాచార్యులు మరియు వేద పండితులు హోమాలు, పూజలు మరియు ఇతర క్రతువులను నిర్వహించారు.
💠 ఈ ఆలయం 90 అడుగుల ఎత్తైన కొండపై రూ.కోటి వ్యయంతో నిర్మించారు.
💠 స్వామినాథ స్వామి ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
బ్రహ్మస్థాన ప్రతిష్ట చేసిన ఏకైక దేవాలయం ఇదే. మానవ రూపంలో వివరించబడిన దేవతలు సాధారణంగా బ్రహ్మస్థానంలో లేదా గర్భ గ్రహం మధ్యలో ఉండరు .
స్కంద భగవానుడు మాత్రమే దీనికి మినహాయింపు.
ఈ క్షేత్రం సహస్రార క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది మరియు ఏడవ పాడై వీడుగా కవులచే గానం చేయబడింది.
తిరుచెందూర్,
తిరుప్పరంకుండ్రం,
స్వామి మలై,
పళని,
పజముదిర్చోలై మరియు తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య భగవానుని ఆరు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు మూలధార, స్వాదిస్థాన, మణిపూరక, అనాహత, విశుధి మరియు అజ్ఞా చక్రాలు అనే ఆరు కేంద్రాలను సూచిస్తాయి.. బ్రహ్మరంధ్ర క్షేత్రంలోని సహస్రారం ఏ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో లేదు... ఇక్కడి ఉత్తర స్వామి మలై ఆ శూన్యాన్ని భర్తీ చేసింది.
💠 బద్రి, ద్వారక, కంచి, పూరి మరియు శృంగేరి అనే ఐదు మఠాల శంకరాచార్యులు దర్శించిన ఏకైక క్షేత్రం ఈ ఉత్తర స్వామి మలై.
దేవత క్రింద సర్వ వశీకరణ యంత్రం పొందుపరచబడిన ఏకైక ఆలయం కూడా ఇదే . ఈ యంత్రం ఈ గొప్ప పుణ్యక్షేత్రానికి కులం, మతం, జాతి, మతం లేదా జాతీయతతో సంబంధం లేకుండా అందరినీ ఆకర్షించే బలమైన అయస్కాంత క్షేత్రం.
💠 ఈ ఆలయం నైరుతి ఢిల్లీలోని సెక్టార్ 7, RK పురంలో ఉంది మరియు ధౌలా కువాన్ మెట్రో స్టేషన్ నుండి 3 కిలోమీటర్ల దూరం
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - దశమి - ఆశ్రేష - ఇందు వాసరే* *(09-10-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
🙏🙏
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-69🌹*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-69🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*కళ్యాణకట్ట*
తిరుమల శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించే స్థలాన్ని కళ్యాణకట్ట అని పిలుస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. స్వామివారికి తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఎన్నేళ్ల క్రితం మొదలైందో నిర్దిష్టంగా తెలియదుగానీ.. రెండున్నర శతాబ్దాల క్రితం కొండ కిందే తలనీలాల సమర్పణ జరిగేదని చెబుతారు. చంద్రగిరి సమీపంలోని కళ్యాణీ నదీ తీరంలో వెలసిన క్షురక కేంద్రాలకే కళ్యాణకట్ట అని పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. కళ్యాణకట్టకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..
శ్రీవారి పాదాల చెంత ఉండే ప్రసిద్ధ నది స్వర్ణముఖి. ఈ నదికి సంబంధించిన పురాణాలు, ఐతిహాసాలు ఎన్నో ఉన్నాయి. అయితే స్వర్ణముఖి నదికి చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది. స్వర్ణముఖి నదికి ఉపనది కల్యాణి నది.
కల్యాణి నది ఒడ్డున శ్రీనివాస మంగాపురం ఆలయం వుంది. పూర్వం తిరుమలకు సామూహికంగా మాత్రమే భక్తులు వెళ్ళేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణీ నదీ తీరంలో కళ్యాణ కట్టలు వెలిశాయి. యాత్రికులు తమ తలనీలాలను ఈ కళ్యాణకట్టలోనే సమర్పించి కళ్యాణీ నదిలో స్నానం చేసి కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకునేవారు.
కళ్యాణీ నదీ తీరంలో మంగలికట్టలు వెలిశాయి కాబట్టి వారికి కళ్యాణకట్టలు అనే పేరు వచ్చింది. తిరుమలలో మంగలి కట్టలు వెలిశాక శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ కట్టలు అంతరించాయి. అందుకే తిరుమలలోని మంగలి కట్టలకు కళ్యాణ కట్టలు అనే పేరు స్థిరపడింపోయింది.
నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం ఎక్కువగా వుండడం వల్ల తనకు చాలా యిబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసుకి మొరపెట్టుకుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న స్వామివారి సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా స్వామివారి నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అతి పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది. వెంటనే తన నొసటిపై ఉన్న వెంట్రుకలను శ్రీవారికి అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసుడు మేల్కొని చూడగా నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చి భక్తులు తమ తలలాలను సమర్పిస్తారని, అవి నీలాదేవికి చేరుతాయని వరమిచ్చాడట. ఇదే కాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వేంకటేశ్వరుడు బీబీనాంచారీని పెళ్ళి చేసుకొనేటప్పుడు ఆమెకొక వరం ఇచ్చాడట. ఎగువ తిరుపతికి జుట్టుతో వచ్చేవాళ్ళు తనవారని, గుండు చేయించుకున్నాక తిరిగి వెళ్ళే వాళ్ళు నీవాళ్ళని ప్రమపూర్వకంగా మాటిచ్చాడట.
ఇదే కాక ఒకప్పుడు వీరారాదన ఉండేది వీరోచితంగా మరణించే వారికి స్వర్గలోక ప్రాప్తి, రంభా సంయోగం లభిస్తుందని భావించేవారు. రాజుకోసం, రాజ్యమ్కోసం ఆత్మబలులు చేసుకునేవారు, అగ్నిగుండంలో ప్రవేశించేవారు, తలలు నరికించుకునేవారు. మరణించిన వేరునికి వీరలగల్లును ప్రతిష్టించి పూజించేవారు. వీరగల్లె వీరకల్లు అంటే వీరునికి చెందిన రాయి. ఈ వీరారాధన తిన్నగా వైదిక మతంలో ప్రవేశించింది. వీర శైవం, వీ వైష్ణవంగా రూపుదిద్దుకుంది. తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ప్రసాదాలు అమ్మే చోట తలలు నరుక్కుంటున్న వీరగల్లులున్నాయి ఇప్పటికీ ఉన్నాయి. శైవుల్లో వీర శైవుల్లు బయల్దేరారు. శివుని వ్యతిరేకించేవాళ్ళను చంపడం, శివుని కోసం ఆత్మార్పణమ చేసుకోవడం, శ్రీశైలంలో కనుమూరి పద్ధతిలో కొండకొమ్ము మీద నుంది దూకడాన్ని పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రలో కూడా పేర్కొన్నారు. శివరాత్రి రోజు వేలాది మంది ఎడతెరిపి లేకుండా కనుమూరి కొండకొమ్మ మీద నుంది దూకి ఆత్మార్పణం చేసుకునేవారు. అలాగే గుడి ముందు శిరచ్చేద యంత్రాలతో తలలు నరికించుకునేవారు. ఆ కొయ్య శిరచ్చేద యంత్రాలను మద్రాసు ఎగ్మోరులోని మ్యూజియంలో నేటికీ చూడవచ్చు.
మరికొంతమంది కత్తులతో తలలను నరికించుకొని శివునికి 'తలపండు'నూ సమర్పించేవాళ్ళు. రెడ్డి రాజుల్లో అనవేమారెడ్డి శ్రీశైలం ఆలయం ముందు ఇలాంటి వారి కోసం వీర శిరోమండపాన్ని నిర్మించాడు. ఆ మండపం ఈనాటికీ చెక్కుచెదరకుండా ఉంది. కొంతమంది చేతులు నరుక్కునేవారు, మరికొంతమది అనేక అవయవాలను సమర్పించేవారు, ఇంకా కొంతమంది తమ వీపులలోని మాంసాన్ని కోసి శివునికి సమర్పించేవాళ్ళు. అలా ఆనాడు తలను పండుగా భావించి, తలను నరికించుకొని దేవునికి సమర్పించేవారు. దానివల్ల శైవులు అయితే కైలాసానికి, వైష్ణవులు అయితే వైకుంఠానికి చేరుకునేవారు. అలాంటి ఆచారం కాలక్రమేణా గుండు గీయించుకోవడం వరకు వచ్చింది. తలకు ప్రధానమైనవి కురులు. కురులను సమర్పిస్తే దేవునికి తలను సమర్పించిన దానితో సమానం.
జానపద విజ్ఞానం ప్రకారం చూస్తే తల వెంట్రుకలు ఎవరికైనా అపూర్వం. తల వెంట్రుకల మీద ఎన్నో జానపద కథలు ఉన్నాయి. మనిషి అందానికి ప్రతీక తల వెంట్రుకలు. తల వెంట్రుకల సౌదర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే విధానం జానపదుల్లో కనిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలను సంపదతో పోల్చి కేశసంపద అని అంటారు. ఆరోజుల్లో ఎంత పొడవు కురులు ఉంటే అంత విలువ ఉండేది.
అందుకే ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా జుట్టు పెంచి, పూలను అలంకరించుకునేవాళ్ళు. మనిషి కురుల మీద చూపించే మమకారం మరి దేనిమీదా చూపించడు. అద్దంలో చూసుకున్నా కురులనే చూసుకుంటారు. అంత విలువైన వెలకట్టలేని కురులను శ్రీవారి మీద భక్తితో వాటిని తృణప్రాయంగా భావించి స్వామివారికి సమర్పించడం గొప్ప విషయం. తాము అంద విహీనంగా మారినా ఫరవాలేదు. తమ అందంకన్నా శ్రీవారి భక్తి మిన్న అనే ఆనందంలో తరించాలనే ఉద్దేశ్యంతో స్వామివారికి తలనీలాలను సమర్పిస్తారు. కాలం గడిచేకొద్దీ గుండు గీయించుకోవడం మొక్కుబడిగా మారిపోయింది. మొదట గుండు గీయించుకుని కులదైవానికి సమర్పిస్తారు. ఆ తర్వాత రకరకాల మొక్కుబడులతో తిరుమలకు వచ్చి గుండు గీయించుకోవడం ఆనవాయితీగా మారింది.
కళ్యాణీ నదీ తీరంలో కళ్యాణకట్టలో వెలిశాయి. అప్పట్లో తిరుమల శ్రీవారి దర్సనానికి వచ్చే భక్తులు. ఇక్కడే తలనీలాలు సమర్పించి కళ్యాణీ నదిలో స్నానం చేసి, కళ్యాణ వేంకటేశ్వరున్ని దర్సించుకునేవారట. అప్పుడే తలనీలాలు తీసే కేంద్రాలకు కళ్యాణకట్టలు అని పేరు వచ్చిందట. ఆపై అదే పేరు స్థిరపడింది కళ్యాణ వేంకటేశ్వరున్ని దర్శించుకున్న అనంతరం..తిరుమలలో ఏవైనా ఉత్సవాలున్నా, ప్రత్యేకంగా అక్కడిదాకా వెళ్లాలనుకున్నా గుంపులు, గుంపులుగా వెళ్ళేవారట. ఈ ప్రయాణంలో తప్పిపోకుండా ఉండేందుకు తప్పిపోయిన వారు కలుసుకునేందుకు గుంపులో ముందు, వెనుక బాగా ఊదేవారట.
ఇప్పటికీ మైసూరు ప్రాంతం నుంచి వచ్చే భక్తులు బాకా ఊదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీనివాసపురంలో కళ్యాణకట్టలు మెల్లగా కనుమరుగయ్యాయి. తిరుమలలోని చంద్రగిరి రస్తా పక్కనున్న మంగలిబావి వద్ద కళ్యాణకట్టలు ఏర్పాటయ్యాయి. ఊరికి దూరంగా ఉండే ఈ కళ్యాణకట్టలు క్రమంగా ఆలయ సమీపానికి మారాయి. ముందుగా తిరుమల నడిబొడ్డున ఉన్న రావిచెట్టు కింద తలనీలాలు తీసేవారట. ఆ తరువాత పక్కనే ప్రత్యేక భవనం నిర్మించారు. పెరుగుతున్న భక్తులరీత్యా అదీ చాలకపోవడంతో ప్రస్తుతమున్న కళ్యాణకట్టను నిర్మించారు. వందల మంది క్షురకులు నిత్యం పనిచేస్తున్నారు.
*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
నవగ్రహా పురాణం🪐* . *48వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *48వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*బుధగ్రహ జననం - 11*
క్షణంలో బ్రహ్మ నారద సహితంగా చంద్రమందిరం వద్ద ప్రత్యక్షమయ్యాడు. అధర్మమనీ , హితవు పలికాడు.. ఉశనుడితోనూ , వృషపర్వుడితోనూ సంప్రదించాడు. చంద్రుడు చేసినది ధర్మవిరుద్ధమైన కార్యమనీ , అధర్మకార్యాన్ని సమర్ధించడం ఇంకా అల్పకారణంతో దాయాదులు మారణకాండకు సిద్ధపడడం మంచిదికాదన్నాడు.
ఇంద్రుడితోనూ , బృహస్పతితోనూ మాట్లాడాడు. ఆవేశపడవద్దని సూచించి , చంద్ర మందిరంలోనికి వెళ్ళాడు.
బ్రహ్మదేవుడిని చూడగానే తారా , చంద్రుడూ చేతులు జోడించి , నమస్కరించారు.
*"మీరిద్దరూ ధర్మాన్ని విస్మరించి , కామానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒకరికి భర్తా , ఒకరికి గురువూ అయిన బృహస్పతికి మానసిక క్షోభ కలిగించారు. మీరు ఇద్దరూ చేసిన లైంగిక అపచారానికి సుఖమే అనుభవించారు. అనుభవానికి వచ్చిన సుఖంతో , అంది ఆనందంతో సంతృప్తి చెందండి!"* బ్రహ్మ ఆగి , ఇద్దర్నీ చూశాడు.
చంద్రుడు తదేకంగా బ్రహ్మనే చూస్తున్నాడు. ఎందుకో... విచిత్రంగా ఆయన చేస్తున్న హిత వాక్యాలు తనకు తానే చెప్పుకుంటున్నట్టు అనిపిస్తోంది చంద్రుడికి.
ఎందుకో తనకు తెలీదు గానీ , బ్రహ్మవాక్కులు సహేతుకంగా , సమంజసంగా అనిపిస్తున్నాయి తారకు.
బ్రహ్మ చూపులు తార మీద వాలాయి. గర్భంలో శిశువును దాచుకున్న తార బొద్దుగా ఉన్న తామర మొగ్గను గుర్తుకు తెస్తోందాయనకు.
*"బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం , ఆనందం ద్విముఖం' అంటూ ఆనాడు నిన్ను ఆశీర్వదించాను. ఆ దీవెన అంతరార్థం నీకు ఇప్పటికి అవగాహన అయి ఉంటుంది. విధి నీకు ప్రసాదించిన భర్తను చేరుకో. చంద్ర బంధాన్ని ఒక మధుర స్వప్నంలా భావించి , విస్మరించు. నీ భర్తను సేవించు ; తరించు !"*
తార మౌనంగా బ్రహ్మ పాదాలకు నమస్కరించింది. బ్రహ్మ దీవిస్తూ అన్నాడు. *"పతి సమాగ ప్రాప్తిరస్తు !”*
*"చంద్రా ! తార నీ గురుదేవుని ఆస్తి. క్షేమంగా , భద్రంగా నీ చేత్తో ఆయనకు అప్పగించు. అదే ప్రాయశ్చిత్తంగా నిన్ను ప్రక్షాళన చేస్తుంది.”* చంద్రుడు మౌనంగా నమస్కరించాడు. మెల్లగా తార వైపు తిరిగాడు. తార కళ్ళు తదేకంగా అతన్నే చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో నీళ్ళు తొణుకుతూ , ఘనీభవించడానికి సిద్ధమవుతున్నట్టున్నాయి.
చంద్రుడు చిరునవ్వుతో తారను చూస్తూ , చేతిని చాచాడు. తార చెయ్యి కొమ్మ కోసం అన్వేషించే తీగలా సాగి , చంద్రుడి చేతిని సమీపించింది. చంద్రుడి చేతి వేళ్ళు ఆమె చేతిని పట్టుకున్నాయి. ఇద్దరి కళ్ళు ఏవో నిశ్శబ్ద సంకేతాలను నింపుకుంటున్నట్టు పరస్పరం చూస్తూ ఉండిపోయాయి. ఆ చూపుల్లో - వేయి ఆప్యాయతలు , లక్ష అనురాగాలు , కోటి అనునయాలు. చంద్రుడు కదిలాడు. తార అతనితో పాటు కదిలింది. పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న తారాచంద్రుల్ని చిరునవ్వుతో చూస్తూ అలాగే నిలబడిపోయాడు బ్రహ్మ.
తార బృహస్పతి వెనుకనే ఆశ్రమంలోపలికి నడిచింది. మహేంద్రుని రథంలోంచి దిగుతూంటే , పుంజికస్థలా , విద్యార్థులూ , తన వైపు ఆనందంగా చూస్తున్నారు. వాళ్ళ చూపుల్ని తప్పించుకుంటూ , భర్త వెనకాలే అడుగులు వేసింది.
బృహస్పతి తిన్నగా దేవతార్చన చేసే చోటికి వెళ్ళాడు. చేతులు జోడించి , దైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మౌనంగా , మెల్లగా వెనుదిరిగాడు. ఎదురుగా తార బొమ్మలా నిలబడి ఉంది.
*"తారా ! నీ ఇంటికి నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను...”* బృహస్పతి భావోద్వేగంతో అన్నాడు.
చంద్రుడు తనను అప్పగించిన అనంతరం తనతో మొదటిసారిగా మాట్లాడిన భర్తను దీనంగా చూసింది తార. పెనుగాలికి వణికే చిగురాకుల్లా ఆమె పెదవులు వణికాయి. కళ్ళల్లో కమ్ముతున్న అశ్రువులు చూపుల్ని మసకబారుస్తున్నాయి. తార తటాలున ముందుకు వంగి , బృహస్పతి పాదాలు తాకి , నమస్కరించే ప్రయత్నం చేసింది. అయితే పూర్ణగర్భం ఆమెను అడ్డుకుంటోంది.
బృహస్పతి రెండు చేతుల్తో పట్టుకుని లేవనెత్తాడు. తార కళ్ళు ఆయన ముఖంలోకి చూశాయి. పోగొట్టుకున్న పెన్నిధిని తిరిగి పొందిన ఆనందం తాండవం చేస్తోంది ఆయన వదనంలో.
*“తప్పు చేశాను... మీకు ద్రోహం చేశాను... నన్ను... నన్ను... క్షమించండి...”* తార గద్గద కంఠంతో అంది. గర్భం నునుపు చేసిన ఆమె బుగ్గల మీద కన్నీళ్ళు ఆమెలోని దుఃఖం లోతును కొలుస్తున్న కొలమానాల్లా గీతలు గీశాయి.
బృహస్పతి సున్నితంగా ఆమె బుగ్గల్ని తుడిచాడు. చిరునవ్వు నవ్వాడు. *“ద్రోహం చేసింది నువ్వు కాదు - చంద్రుడు ! మనకు పీడకలలు వస్తాయి. జరిగిందంతా నీకు వచ్చిన పీడకల అనుకో తారా !"*
*"స్వామీ...”*
*"ఈ బృహస్పతి వంశాన్ని - అంగిరస గోత్రాన్ని అభివృద్ధి చేయి !"* బృహస్పతి నిండుగా ఉన్న గర్భ చిహ్నాన్ని ప్రేమగా చూస్తూ అన్నాడు. *"గర్భం ధరించి నువ్వు దూరం కావడం సహించలేక పోయాను.”*
*తార కన్నీళ్ళతో చూసింది.*
తిథివార నక్షత్రాలు శుభప్రదంగా వున్న సమయంలో పూర్వాభాద్ర నక్షత్రంలో పురుష శిశువును ప్రసవించింది. బృహస్పతి ఆశ్రమంలో ఆనందం వెల్లి విరిసింది. గురుదేవులకు వంశోద్ధారకుడు జన్మించినందుకు ఇంద్రుడు సంబరపడిపోయాడు.
నారదుడి మూలంగా ఆనోటా , ఈ నోటా పడిన తారకు శిశుజనన వార్త చంద్రునికి తెలిసిపోయింది. నామకరణ మహోత్సవానికి ఇంద్రాదులతో బాటు బ్రహ్మా , నారదుడూ విచ్చేశారు. అంగిరసుడూ , శ్రద్ధా పౌత్రుడిని చూసి , దీవించడానికి వచ్చారు.
*"నాయనా , బృహస్పతి... బాలునికి నామ నిర్ణయం చేశావా ?"* అంగీరస మహర్షి కుమారుణ్ణి ప్రశ్నించాడు.
ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నట్టు , ద్వారం ముందు నుంచి చంద్రుడి కంఠం బిగ్గరగా వినిపించింది. *"నా పుత్రుడికి నామ నిర్ణయం చేసే అధికారం బృహస్పతులు వారికి ఎక్కడిది ? ఆ బాలుడు , నా కుమారుడు !"*
బాలకుణ్ణి వొడిలో పడుకోబెట్టుకుని కూర్చున్న తారా , పక్కన కూర్చుని 'జాతకర్మ' నిర్వహిస్తున్న బృహస్పతీ అదిరిపడి చూశారు.
*"ఆవేశంగా లోపలకి వస్తున్న చంద్రుణ్ణి చూస్తూ , లేచి నిలబడ్డాడు. ఆయన కళ్ళు నిప్పుకణికల్లా అయ్యాయి. "గురుద్రోహీ ! అవతలకి నడు ! అర్ధాంగిని అపహరించుకు వెళ్ళావు. ఇప్పుడు నా వంశాంకురాన్ని దోచుకోవాలని వచ్చావు. తగిన శిక్ష అనుభవిస్తావు నువ్వు !"*
చంద్రుడు ఎగతాళిగా నవ్వాడు. *"ఆచార్యా ! ఆ బాలుణ్ణి మీ వంశాంకురంగా భావిస్తే , ఈ చంద్రుడి వంశాన్ని మీ వంశంగా చెప్పుకున్న దౌర్భాగ్యాన్ని మూటకట్టుకుంటారు. బాలుడు ఈ చంద్రుడికి జన్మించిన వాడు !"*
*"ముమ్మాటికీ కాదు ! ఆ శిశువులో ప్రవహిస్తోంది ఈ బృహస్పతి రక్తం !"*
*"మీ ఇష్టం ! ఆ అపోహలోనే ఉంటే నేనెందుకు కాదంటాను ? నా కుమారుణ్ణి నేను తీసుకెళ్తాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు !"* అంటూ చంద్రుడు ముందుకు రాబోయాడు.
*"ఆగు చంద్రా ! అక్కడే ఆగు !"* బృహస్పతి హుంకరించాడు._
ఇంద్రుడు ఆవేశంతో కూర్చున్న చోటి నుండి లేచాడు. *"గురుదేవా ! మీరు శాంతించండి. ఆ గురుద్రోహికి ఈ మహేంద్రుడు గుణపాఠం చెప్తాడు !"*
*“ఇంద్రా , చంద్రా ! ఆశ్రమాన్ని యుద్ధరంగం చేయకండి !"* బ్రహ్మదేవుడు ఇద్దర్నీ వారిస్తూ అన్నాడు. *"బృహస్పతీ ! నువ్వు కూడా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి !"*
*"పితామహా ! ఇది నా వంశానికి సంబంధించిన అంశం. చంద్రుడు..."*
*"చంద్రుడు కానీ , నువ్వు కానీ - ఆ శిశువు ఎవరి శిశువో చెప్పలేరు. గర్భం ధరించిన స్త్రీ మాత్రమే తాను ఏ పురుషుడి వల్ల గర్భాన్ని ధరించిందో చెప్పగలదు... అంటూ బ్రహ్మ సాభిప్రాయంగా అందర్నీ కలియజూశాడు.*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 59*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*శ్రీరామకృష్ణుల నుండి పొందిన సందేశం.....*
వైష్ణవ మత సిద్ధాంతాన్ని శ్రీరామకృష్ణులు క్లుప్తంగా ఇలా చెప్పారు: "భగవన్నామ స్మరణ, భూతదయ, ఆరాధన భక్తుల పట్ల మర్యాద అనే మూడింటినీ అనుసరించమని ఈ మతం బోధిస్తోంది. భగవంతుడు, ఆయన దివ్యనామమూ అభిన్నమని గ్రహించి సదా ప్రగాఢ ప్రేమతో భగవన్నామాన్ని ఉచ్చరించాలి; భక్తుడూ భగవంతుడూ ఒక్కరే, కృష్ణుడూ భక్తుడూ ఒక్కరే అన్న విషయం గ్రహించి సాధువులనూ భక్తులనూ స్తుతిస్తూ ప్రణమిల్లాలి. లోకమంతా శ్రీకృష్ణునికి సొంతమనే ప్రగాఢ విశ్వాసంతో భూతదయ....”
'భూతదయ' అని చెబుతూవున్న శ్రీరామకృష్ణుల మాటలు తడబడ్డాయి. అట్లే ఆయన పారవశ్య స్థితిలో మగ్నులయ్యారు. కాస్త బాహ్యస్మృతిలోకి రాగానే, "భూతదయా?....? అల్పుడా! హీనమైన పురుగుకు సమమైన వాడివి నువ్వు ;నువ్వు భూతదయ చూపడమా? దయ చూపడానికి నువ్వు ఎవడవు? కాదు, ఎన్నటికీ కాదు మనిషిని మహేశ్వరుని రూపంలో గాంచి సేవ మాత్రమే. చేయాలి. అదే నువ్వు చేయవలసింది" అన్నారాయన.
శ్రీరామకృష్ణుల పలుకులు అందరూ విన్నారు. కాని వాటి గూఢార్థాన్ని వారెవరూ అర్థం చేసుకోలేకపోయారు. నరేంద్రుడొక్కడే శ్రీరామకృష్ణుల భావ స్రవంతిని సరిగా అర్థం చేసుకొన్నాడు. గదిలో నుండి బయటకు రాగానే అతడు, “ఈ రోజు గురుదేవుల మాటలలో ఒక అద్భుత కాంతి గోచరమయింది. నిస్సార మైనదిగా, వట్టిపోయినదిగా పేర్కొనబడే వేదాంత జ్ఞానాన్ని, భక్తిమార్గంతో జత చేర్చి ఎలాంటి సరళమైన, మధురమైన సారభూతమయిన మార్గాన్ని ఆవిష్కరించారు ఆయన !
అద్వైత జ్ఞానాన్ని సంతరించుకోగోరితే సంసారాన్నీ, లోకులనూ ఆసాంతం పరిత్యజించి అరణ్యాలకు పోవాలి; ప్రేమ, భక్తి లాంటి కోమలమైన భావనలను హృదయంలో నుండి కూకటివేళ్లతో సహా పెకలించివేయాలంటూ చెప్పుకొచ్చారు. పర్యవసానం? ఆ మార్గంలో పయనించే వ్యక్తి సంసారాన్నీ, దాన్లోని ప్రతి వ్యక్తినీ తన మార్గంలోని ఆటంకాలుగా ఎంచి, అతణ్ణి ద్వేషించి తన వినాశనాన్ని తానే వెతుక్కొంటున్నాడు.
కాని శ్రీరామకృష్ణులు ఈ రోజు పారవశ్య స్థితిలో వెల్లడించిన పలుకుల నుండి, అరణ్యంలోని వేదాంత జ్ఞానాన్ని ఇంటికి తీసుకురావచ్చు, దైనందిన జీవితంలో ప్రతి దశలోను దానిని అనుసరించవచ్చునని స్పష్టమవుతున్నది. చేస్తున్న దానిని అట్లే కొనసాగించనీ, దాన్లో హాని లేదు. కాని భగవంతుడే ప్రాణులుగాను, లోకంగాను ఉన్నాడనే భావనను మాత్రం దృఢంగా నిలుపుకొంటే చాలు. జీవితంలో ప్రతి క్షణమూ మనం ఎవరితో వ్యవహరిస్తున్నామో, ఎవరి పట్ల ప్రేమ కనబరుస్తున్నామో, గౌరవమర్యాదలు చెల్లిస్తున్నామో, దయ చూపుతున్నామో వారందరూ భగవంతుని అంశలే.
ఈ విధంగా అందరినీ శివరూపంగా భావించినప్పుడు అతడు ఇతరులకన్నా తనను గొప్ప వ్యక్తిగా ఎలా అనుకోగలడు? ఇతరుల పట్ల కోపమూ, ద్వేషమూ ఎలా వహించగలడు? ఏ విధంగా దయ చూపించగలడు? ఈ రీతిలో మానవుని మాధవునిగా గాంచి అతనికి సేవ చేయగా చేయగా అతడి హృదయం పావనమవుతుంది; సత్వరమే అతడు తనను మహా చైతన్యస్వరూపుడైన భగవంతుని అంశంగా, పవిత్రునిగా, జాగృతి చెందినవానిగా, ముక్తునిగా గ్రహిస్తాడు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 48*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 48*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా*
*త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా |*
*తృతీయా తే దృష్టి ర్దరదలితహేమాంబుజ రుచిః*
*సమాధత్తే సంధ్యాం దివసనిశయో రన్తరచరీమ్ ‖*
ఇక్కడనుండి 57 వ శ్లోకం వరకు అమ్మవారి నేత్రాలను వర్ణిస్తున్నారు శంకరులు.
అహః సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా = అమ్మా నీ కుడి కన్ను సూర్యాత్మకము కనుక సూర్యుడినీ పగలునూ సృష్టిస్తున్నది.
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా = త్రియామ అంటే రాత్రి. రజనీనాయకుడు రజని అంటే రాత్రిఅధిపతి చంద్రుడు ఉండే కన్ను కనుక నీ ఎడమ కన్ను రాత్రిని సృష్టిస్తున్నది.
తృతీయా తే దృష్టి ర్దరదలిత హేమాంబుజరుచిః = మరి నీ మూడవ కన్ను అరవిరిసిన బంగారు పద్మము వలెనూ,
సమాధత్తే సంధ్యాం దివసనిశయో రన్తరచరీమ్ = పగలు రాత్రుల మధ్య వుండే ఉభయ సంధ్యాకాంతులతో ప్రకాశిస్తున్నది. ఉభయ సంధ్యలలో శ్రోత్రియులు అగ్నికార్యమును నిర్వర్తిస్తారు కనుక నీ సంధ్యా నేత్రము ఆ అగ్ని ప్రకాశమును వెలువరిస్తున్నది.
అమ్మవారు ఈ విధముగా దిన, రాత్ర, వార, మాస, ఋతు, అయన, సంవత్సర, యుగ కల్పాదులతో కూడుకొన్న కాలమానమును నిర్దేశిస్తున్నారు.
కంచి మహాస్వామి వారు ఈ త్రినేత్రములను, సత్త్వ రజస్తమో గుణముల వర్ణములతోను, త్రివేణీ సంగమముతోనూ పోల్చారు. కుడికన్ను తెల్లని సూర్యకాంతిని ప్రసరిస్తుంది కనుక, ఆ కాంతులు సత్త్వ గుణమును, శివుని తెల్లని జటాజూటము నుండి జాలువారిన గంగామాత తోను రాత్రిని సూచించే ఎడమ కన్ను కృష్ణవర్ణమైన (తమోగుణం) యమునతోనూ, రజోవర్ణమైన ఎర్రని కాంతులను వెలువరించే ఫాల నేత్రము శోణా నదితోనూ (వారు ఈ వ్యాఖ్యలో అంతర్వాహినియైన సరస్వతిని సంభావించలేదు) పోల్చారు. శోణా నదిలో దొరికే ఎర్రని శిలలు అమ్మవారి ఇష్టపుత్రుడైన విఘ్నేశ్వరునిగా పూజింపబడుతాయి. ఆ విధముగా అమ్మవారి త్రినేత్రములను విష్ణు,శివ,అంబికలు గా వర్ణించారు.
ఇక యోగపరంగా చూస్తే , మన వెన్నెముకనంటి యున్న పింగళ నాడి (సూర్యనాడి) కుడివైపున, చంద్ర నాడి అయిన ఇడా నాడి ఎడమవైపున, ఈ రెండిటి మధ్యనున్న అగ్నిరూపమైన సుషుమ్న నాడి భ్రూమధ్య స్థానము నందు కలుస్తాయి. ఆ సంధియే సంధ్య. అందుకే సంధ్యావందనంలో పరమేశ్వరుడిని భ్రూమధ్య స్థానంలో ధ్యానిస్తారు. భ్రూమధ్యం బుద్ధిశక్తి కేంద్రం. నిజానికి మనం అందరం మూడు కళ్ళ వాళ్ళమే.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కృష్ణార్పణం
హరే కృష్ణ!!
🙏🙏🙏
*కృష్ణార్పణం..!*
➖➖➖
```ఒక పేద, అమాయకపు కృష్ణభక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకొంటూ జీవనాన్ని సాగించేది.
ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ ‘కృష్ణార్పణం‘ అన్న మాట విన్నది... అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికీ ‘కృష్ణార్పణం’ అనడం మొదలుపెట్టింది.
ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకొనేముందు కృష్ణార్పణం, భుజించేముందు, భోజనం తరువాత, బయట కెళ్ళేముందు, ఇంటికొచ్చిన తరువాత.. కృష్ణార్పణమే..! చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడూ ‘కృష్ణార్పణం’ అనటమే!
ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది.
ఆ ఊళ్లోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతోంది. ప్రతీరోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్తపడుతోంది. ఎవరికీ అర్ధం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరిమీదా. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్తపడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసినదానికి ఉగ్రులై ఆదేశపు రాజు గారి దగ్గరకు తీసుకుపోయారు.
రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు.
ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారం లోకి వెళ్తూ ‘కృష్ణార్పణం’ అంది.
మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది... నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా...
ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు.
ఆమె కటికనేల పై పడుకొనే ముందు ‘కృష్ణార్పణం’ అనుకుంది.
రెండవరోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది.
ఇక మూడవరోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు.
ఈ లోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది.
అప్రయత్నంగా “కృష్ణార్పణం”అనగానే గాయం మాయమయ్యింది.
అదిచూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు.
అదేసమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు... “మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్ధమవ్వట్లేదు” అని వాపోయారు.
రాజు గారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు. “నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిం”దని.
“నాకు తెలియదు” అంది.
సరే ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె ‘కృష్ణార్పణం’ అనే అన్నాను అని బదులిచ్చింది.
సభలోని వారందరూ హతాశులయ్యారు.
ఆమెని ‘నీకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా?’ అని అడిగితే “తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనటం తప్పాండీ? ఆ మంత్రం నేను జపించకూడదా? ఐతే తెలియక చేసిన తప్పును క్షమించండి.” అని ఏడుస్తూ బేలగా అన్నది.
సభికులందరి కళ్లూ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి.
ఆమెకు ‘కృష్ణార్పణం’ అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళమీద పడ్డారు.
ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలెట్టింది. ‘అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను.. స్వామివారి మీద చెత్తపోసాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్షేముంటుంది’ అనుకొంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగునపోయింది.
చిరునవ్వులు రువ్వుతూన్న నందకిశోరుణ్ణి చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆరోజు నుంచీ శుద్ధిగా భోజనం వండి తినే ముందు ‘కృష్ణార్పణం’అనడం మొదలుపెట్టింది.
శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు.
సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్నితండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమ పూర్వకంగా స్వీకరిస్తాడు.
ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటారా?
https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B
🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌
🙏🏻🙏🏻🙏🏻🌱🌱🌱🙏🏻🙏🏻🙏🏻


