9, అక్టోబర్ 2023, సోమవారం

గృహ దేవత .

 🎻🌹🙏 గృహ దేవత ...!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸మనం నివసించే గృహాలలోను, భవంతులలోను వాటినినిర్మించే ముందే‌ ఒక దైవీక శక్తి ఆ ప్రదేశాల్లో నివసిస్తూ రక్షణ కల్పిస్తూం టుందనిచెప్తారు.ఆ దేవతనే "గృహ దేవత" అంటారు.


🌿గృహదేవత, ఆ గృహంలో వసించేవారి అభీష్టాలను నెరవేరు స్తుందని చెబుతారు .ఈ దేవతకి ఒక ప్రత్యేక రూపమంటూ ఏమీ లేదు, వెలిగే దీపాలలో జ్వాలా రూపంగా అనుగ్రహిస్తుంది.


🌸ఈ గృహ దేవతని సంధ్యాసమ యాల్లో, ధాన్యం, పుష్పాలు , జల్లి పూజించే వారని తమిళ సంగం కాల కావ్యాలు చెప్తున్నాయి.


🌿జ్యోతి వెలుగులో దేవతలున్నందున, యీ దీపాన్ని 'కామాక్షి దీపం' అని పిలిచేవారు.


🌸దేవాలయాలలో అర్చనలు చేస్తున్నప్పుడు 'ఇష్ట కామ్యార్ధ సిద్ద్యర్ధం' అని అనడం వింటూంటాం, అభీష్ట సిధ్ధిఅనిఅర్ధం.కోరుకున్నవాటినిఅనుగ్రహించి, మానవాళినిసంతోష పెట్టే దేవి

'కామ్య యక్షి' అని పిలువ బడుతోంది.


🌿ఆ దేవి యే గృహ దేవత, ఆ దేవి రూపమే దీప జ్వాల,ఆ జ్వాలా దీపాన్నే

'కామ్య యక్షి' దీపం అంటారు....కాలక్ర మేణా,పలుకుబడి లో "కామాక్షి దీపం "గా మారింది.కామాక్షి దీపం ప్రమిదను వివిధ లోహ రూపంగా తయారు చేసి పీఠంమీదఅమర్చుతారు.


🌸విశేష పండుగ రోజుల లోఆ దీపాన్ని గోవుపేడవుండల మీద అమర్చేఆచారం కూడా వున్నది.ఆవు పేడలో లక్ష్మీ దేవివుంటుందని దానినికామాక్షీ దీపానికి పీఠంగాఏర్పరుస్తారు .


🌿ప్రాచీనకాలంలో యీ కామాక్షి దీపాన్ని దేవతల రూపంతో నిర్మించే ఆచారం వుండేది కాదు.తరువాత కాలంలో‌జ్యోతి స్వరూపాన్ని 'దీపలక్ష్మి' అని అనడమేకాకుండా, ఆ దీపానికి

గజ లక్ష్మీ రూపం అమర్చడం కూడా ఒక సంప్రదాయం గామారింది.


🌸ఈ నాడు గృహస్తులు వారివారి ఇష్ట దైవాలను అమర్చుకుంటున్నారు, 


🌿వివాహ సమయంలో యీ కామాక్షి దీపాన్ని నూతన వధువుకు సారెగా యిచ్చే ఆచారం కూడా ఏర్పడింది.వివా హమై అత్తవారింట్లో ప్రవేశించే ముందు పెళ్లి కూతురు చేతిలో యీ దీపం పెట్టి, అత్తింటివారు కొత్త కోడలిని లోపలికి ఆహ్వానిస్తారు....


🌸కామాక్షి దీపాన్ని కేవలం వెలుగును యిచ్చే ఒక సామాన్య దీపంగా భావించకూడదు. ఆ సింహాసనంలోకాంతి రూపంలో ఆశీనురాలైవున్న జ్యోతి స్వరూపిణియైన అమ్మవారిగా భావించాలి.


🌿ఆ జ్యోతి స్వరూపాన్ని పుష్పాలతో అలంకరించి ధూప , దీప , నైవేద్యాలతో పూజించాలి. అందులో ఊదువత్తులు వెలిగించి పెట్టడం కాని, కర్పూరం వెలిగించడం కాని చెయ్యకూడదు.ఇరవై నాలుగు గంటలుకామాక్షి దీపాన్ని వెలిగించివుంచడం మంచిది, 


అలా చేయలేని పక్షంలో...


🌸ప్రాతః, సాయంకాలసమయాలలో దీపం వెలిగించి, పువ్వులతో అలంకరించి, పూజించాలి.కామాక్షి దీపం సదా ప్రకాశించే గృహాలలో, ఎల్లప్పుడూ , సిరిసంపదలతో సంతోషం తాండవిస్తుంది.


🌿కామాక్షి దీపాన్ని ఆవునేతితో వెలిగిస్తే, ఆ గృహంలో దైవీక శక్తి

తాండవిస్తుంది... 🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మహాభారతములో - ఆది పర్వము* *ద్వితీయాశ్వాసము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ద్వితీయాశ్వాసము*


                      *18*


*క్షీరసాగర మధనం*



*ఇలా ఉండగా దేవ దానవులు వాసుకిని కవ్వపు త్రాడుగా చేసి మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని మధించడం మొదలుపెట్టారు. ముందుగా పుట్టిన భయంకరమైన హాలాహలం శంకరుడు గ్రహించి లోకాలను రక్షించాడు. ఆ తరువాత పుట్టిన ఉచ్చైశ్వం, ఐరావతం ఇంద్రుడు స్వీకరించాడు. కౌస్థుభ మణిని, లక్ష్మీదేవిని విష్ణుమూర్తి స్వీకరించాడు. ఆ తరువాత కల్పవృక్షం, కామధేనువు, అప్సర కాంతలు, సుర మొదలైనవి లభించాయి. చివరగా ధన్వంతరి అమృత కలశంతో అవతరించాడు. అమృత కలశాన్ని రాక్షసులు లాక్కుని వెళ్ళారు. అమృతం కోసం దేవ దానవులు కలహించారు. విష్ణుమూర్తి మోహిని అవతారంలో రాక్షసులను వంచించి అమృతాన్ని గ్రహించి అమృతాన్ని దేవతలకు మాత్రం పంచసాగాడు. ఇది గ్రహించిన  రాహువు, కేతువు దేవతల వేషంలో అమృతం సేవించారు. సూర్య చంద్రులు ఇది గ్రహించి విష్ణుమూర్తికి చెప్పారు. విష్ణుమూర్తి వారి శిరస్సును చక్రా యుధంతో ఖండించాడు. అప్పటికే గొంతు వరకూ దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి మిగిలిన శరీరం పడిపోయింది. అది మొదలు వారు సూర్య చంద్రులపై వైరం పెంచుకున్నారు. వంచించ బడినట్లు గ్రహించిన రాక్షసులు బలి చక్రవర్తితో ఆలోచించి దేవతలతో యుద్ధం చేసారు. యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు. దేవతలు మంధర పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకం చేరారు.*

తోకలేని పిట్ట

 తోకలేని పిట్ట కోసం 


కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ... 

పోస్ట్ ! అన్న కేక వినగానే .. 

ఉరుకులు పరుగులతో అందుకొనే ఉత్తరాల్లో .. 

స్నేహితుల కమ్మని కబుర్లు 

ప్రేమికుల మధుర భావాలు 

దంపతుల అన్యోన్య సరాగాలు 

తోబుట్టువుల ఆప్యాయతానురాగాలు 

పిల్లలకు పెద్దల మార్గదర్శకాలు 

వెరసి .. 

మనుషుల మధ్య చక్కని చిక్కని అనుబంధాలు 

ఇలా ఎన్నో ఎన్నెన్నో సశేష విశేషాలు .. 

ప్రబంధ యుగం నాటి హంస రాయబారాలు 

రాజుల కాలం నాటి పావుర ద్యుతాలు 

అలనాటి తాళపత్రాల లేఖల నుండి 

ఈనాటి అత్యాధునిక ఎస్ఎంఎస్ , వాట్సాప్ 

ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఈమెయిల్ .. వరకు 

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగింది 

ఉత్తర ప్రస్థానం .. తపాలా చరితం ...

( నేడు ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా )

సూర్య గ్రహణ వివరణ

 *సూర్య గ్రహణ వివరణ: 14-10-2023 భాద్రపద బహుళ అమావాస్య శనివారము: కంకణ ఆకార సూర్య గ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇతర ప్రాంతాలు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, న్యూమెక్సికో, టెక్సన్, మెక్సికో, బిరైజ్, ఫనమ, కొలంబియా, బ్రెజిల్, USAలోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, క్యూబా, సల్విడార్, జమైకా, ekwadar, వెనిజులా, పెరు దేశలందు కనిపిస్తోంది. (భారతీయులు నివసిస్తారు కనుక చెప్పడం జరిగింది) భారతదేశంలో కనిపించదు. 

 NB. గ్రహణం కనిపించె ప్రాంతాలలొ నివసించె వారు గ్రహణ పట్టు విడుపు నియమాలు ఆచరించాలి 

గర్భిణీ స్త్రీలు, దేవాలయాలు, పట్టువిడుపు స్నానాలు etc., 

ఇందు వాసరః* *09-10-2023* *రాశి ఫలితాలు*

 *సోమ వారం*

  *ఇందు వాసరః*  *09-10-2023*

 *రాశి ఫలితాలు*

*మేషం*

సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో పనిఒత్తిడి పెరుగుతుంది.

*వృషభం*

ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు.

*మిధునం*

ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు లాభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు అదిగమిస్తారు.

*కర్కాటకం*

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

*సింహం*

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితానిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజం అవుతాయి.

*కన్య*

దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి.

*తుల*

విలువైన వస్తులాభాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.

*వృశ్చికం*

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో కొంత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

*ధనస్సు*

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.

*మకరం*

చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. బంధు మిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి.

*కుంభం*

సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలుంటాయి.

*మీనం*

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు వాహన లాభాలు అందుకుంటారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

🕉️

ఈ లోకంలో నీకు నిష్కృతి కలిగిస్తుంది!!?

 *1951*

*కం*

ఏ కష్ట మొనరె నీకని

మేకల కోడులను జంపి మేయుచునుండన్.

భీకర తవ పాపఫలము 

లే కరణిని నిష్కృతమగు

నిహమున సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నీకు ఏ కష్టం కలిగించాయని కోళ్ళనూ మేకలనూ చంపి తింటున్నావు?? ఏ విధంగా భీకరమైన ఈ పాపఫలం ఈ లోకంలో నీకు నిష్కృతి కలిగిస్తుంది!!??

*సందేశం*:-- ఏ అపకారం చేయకపోయినా కోళ్ళను,మేకలనూ చంపి తినే వారి పాపఫలములు ఏదో ఒక రూపంలో అనుభవించవలసి వస్తుంది. ఒక తల్లి యొక్క పిల్లలను చంపితే మనకు అటువంటి పరిస్థితి ఎందుకు రాదనుకొనగలము!?? అప్పుడు అది కర్మ ఫలము కాదా!!??.ఒకరిని చంపేటప్పుడు బాధ కలగకపోయినా మనకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బాధకలుగుతుంది కదా!! అనే ఆలోచన మనుషుల కు ఎందుకు కలుగదు?

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీ ఉత్తరస్వామిమలై ఆలయం

 🕉 మన గుడి : నెం 202






⚜ ఢిల్లీ : RK పురం


⚜ శ్రీ ఉత్తరస్వామిమలై ఆలయం



💠 దక్షిణ భారత దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఉత్తర స్వామి మలై మందిర్ R.K.పురం సెక్టార్-7లో ఉంది.  

మురుగన్‌కు అంకితం చేయబడిన ఈ ఆలయం ప్రత్యేకమైన శిల్పకళను కలిగి ఉంది, 


💠 తమిళ, తెలుగు, కన్నడ & మలయాళీ కమ్యూనిటీలకు చెందిన హిందువులు కలిసి పూజించే కొన్ని ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.  మందిరంలో ప్రధాన దైవం మురుగన్.


💠 ఉత్తర స్వామి మలై మందిర్ ఒక కొండపై ఉంటుంది.

దీనిని స్థానికంగా మలై మందిర్ అని పిలుస్తారు.

అధికారికంగా ఉత్తర స్వామి మలై ఆలయం అని పిలుస్తారు.


💠 ఒక కొండ శిఖరం పైన ఈ ఆలయం ఉన్న ప్రదేశం నుండి దాని పేరు వచ్చింది - ఒక చిన్న కొండ పైభాగం ('మలై' అనేది కొండకు తమిళం పెరు). 

దీనికి చాలా ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది!  స్వామినాథన్ (లేదా మురుగన్) ఒక రాత్రి తన భక్తుల కలలో కనిపించాడు మరియు అతని నివాసంగా దట్టమైన ఏకాంత ప్రదేశంలో ఒక చిన్న కొండను సూచించాడు. 

అలా 1961లో మలై మందిర్ ఆవిర్భావం జరిగింది.

దీని నిర్మాణం దక్షిణ భారత ఆలయ వాస్తుశిల్పంలోని చోళ శైలి నుండి ప్రేరణ పొందింది.


💠 ప్రధాన స్వామినాథ స్వామి ఆలయంతో పాటు, ఈ సముదాయంలో శ్రీ కర్పగ వినాయగర్ , శ్రీ సుందరేశ్వర్ (శివుడు) మరియు దేవి మీనాక్షి ఆలయాలు ఉన్నాయి. 

ఈ అనుబంధ దేవాలయాలు తమిళనాడులోని మధురైలోని చారిత్రాత్మకమైన మీనాక్షి అమ్మన్ ఆలయంలో చూడగలిగే విధంగా, తమిళ నిర్మాణ శైలిలో పాండ్య శైలి నుండి ప్రేరణ పొందాయి .


⚜ చరిత్ర ⚜


💠 8 సెప్టెంబర్ 1965 అప్పటి భారత ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. భక్తవత్సలం ఆలయానికి పునాది రాయి వేశారు .


💠 7 జూన్ 1973 స్వామినాథ స్వామికి ప్రధాన ఆలయం - శ్రీ స్వామినాథ స్వామి ఆలయం - ప్రతిష్ఠించబడింది మరియు మహాకుంభాభిషేకం నిర్వహించబడింది .


💠13 జూన్ 1990 లో  శ్రీ కర్పగ వినాయకుడు, శ్రీ సుందరేశ్వరుడు మరియు దేవి మీనాక్షి ఆలయాలు ప్రతిష్ఠించబడ్డాయి మరియు మహాకుంభాభిషేకాలు నిర్వహించబడ్డాయి.


💠 కంచి కామకోటి పీఠానికి చెందిన శంకరాచార్యులు మరియు తిరుపనందల్‌కు చెందిన అరుళ్నంది తంబిరాన్ స్వామివారి ఆశీర్వాదంతో, స్వామినాథ స్వామి యొక్క ప్రధాన విగ్రహం కోసం రాయిని కనుగొన్నారు.

తిరుచెందూర్ సముద్రతీరంలో ఉన్న శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రస్తుతం ఉన్న మూలవిగ్రహం అరవై సంవత్సరాల క్రితం అదే శిలలోని మరొక భాగం నుండి చెక్కబడినట్లు కనిపిస్తుంది . 


💠 మూలవిగ్రహం చేయడానికి ఆ రాయిని మహాబలిపురం తీసుకువచ్చారు . 

శ్రీ స్వామినాథ విగ్రహాన్ని చెక్కడానికి దాదాపు ముప్పై నెలల సమయం పట్టింది. 

ఏప్రిల్ 1970లో, శంకరాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామివారి ఆశీర్వాదం కోసం విగ్రహాన్ని కాంచీపురం తీసుకువెళ్లారు. ఆయన పని తీరుకు సంతోషించి మూల విగ్రహానికి ప్రత్యేక అభిషేకం , అర్చనలు చేశారు . తర్వాత ఉత్తర స్వామిమలైకి తీసుకొచ్చి ధాన్య వాసంలో ఉంచారు .


💠 7 జూన్ 1973న జరిగిన మహా కుంభాభిషేకం ఈ దశాబ్దంలో జరిగిన అతి పెద్ద కార్యక్రమంగా గుర్తించబడింది.

మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఆ కార్యక్రమం వీక్షించారు. 


💠ఇక్కడి యాగశాలలో 47 హోమ కుండాలు మరియు 64 కలశాలను ఏర్పాటు చేశారు మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి 100 మందికి పైగా శివాచార్యులు మరియు వేద పండితులు హోమాలు, పూజలు మరియు ఇతర క్రతువులను నిర్వహించారు. 


💠 ఈ ఆలయం 90 అడుగుల ఎత్తైన కొండపై రూ.కోటి వ్యయంతో నిర్మించారు. 


💠 స్వామినాథ స్వామి ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 

బ్రహ్మస్థాన ప్రతిష్ట చేసిన ఏకైక దేవాలయం ఇదే. మానవ రూపంలో వివరించబడిన దేవతలు సాధారణంగా బ్రహ్మస్థానంలో లేదా గర్భ గ్రహం మధ్యలో ఉండరు . 

స్కంద భగవానుడు మాత్రమే దీనికి మినహాయింపు. 

ఈ క్షేత్రం సహస్రార క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది మరియు ఏడవ పాడై వీడుగా కవులచే గానం చేయబడింది. 

తిరుచెందూర్, 

తిరుప్పరంకుండ్రం, 

స్వామి మలై, 

పళని, 

పజముదిర్చోలై మరియు తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య భగవానుని ఆరు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు మూలధార, స్వాదిస్థాన, మణిపూరక, అనాహత, విశుధి మరియు అజ్ఞా చక్రాలు  అనే ఆరు కేంద్రాలను  సూచిస్తాయి.. బ్రహ్మరంధ్ర క్షేత్రంలోని సహస్రారం ఏ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో లేదు...  ఇక్కడి ఉత్తర స్వామి మలై  ఆ శూన్యాన్ని భర్తీ చేసింది.


💠 బద్రి, ద్వారక, కంచి, పూరి మరియు శృంగేరి అనే ఐదు మఠాల శంకరాచార్యులు దర్శించిన ఏకైక క్షేత్రం ఈ ఉత్తర స్వామి మలై. 

దేవత క్రింద సర్వ వశీకరణ యంత్రం పొందుపరచబడిన ఏకైక ఆలయం కూడా ఇదే . ఈ యంత్రం ఈ గొప్ప పుణ్యక్షేత్రానికి కులం, మతం, జాతి, మతం లేదా జాతీయతతో సంబంధం లేకుండా అందరినీ ఆకర్షించే బలమైన అయస్కాంత క్షేత్రం.


💠 ఈ ఆలయం నైరుతి ఢిల్లీలోని సెక్టార్ 7, RK పురంలో ఉంది మరియు ధౌలా కువాన్ మెట్రో స్టేషన్ నుండి 3 కిలోమీటర్ల దూరం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - దశమి - ఆశ్రేష - ఇందు వాసరే* (09.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


కామక్రోధాదులూ అహంకారమూ మహాబలీయమైనవి. వాటిని జయించినవాడు ఈ సృష్టిలోనే

లేడు. సత్వరజస్తమోగుణాలే జీవుడికి శరీరధారణ కారణాలు. మరొక విడ్డూరం చెబుతాను విను 

ఒకప్పుడు మహావిష్ణువుతో కలిసి అరణ్యాలలో పర్యటిస్తున్నాను. హాస్యవినోదాలతో కాలక్షేపం

చేస్తూ చటుక్కున నేను స్త్రీగా మారిపోయాను. రాజపత్నిని అయ్యాను. ఎందరెందరో పుత్రుల్ని

ప్రసవించాను. ఈ మాయాబలవిమోహం విన్నావా ఎప్పుడన్నా?

జనమేజయా! ఈ ప్రశ్నకు నేను నిజంగా నివ్వెరపోయాను. ఇదేమిటీ వింత? పురుషుడవు

రాజపత్నివి కావడమేమిటి, మగబిడ్డలను కవడం ఏమిటి? చాలా విడ్డూరంగా ఉందే. ఈ మాయాతత్త్వాన్ని

సమగ్రంగా తెలియజెప్పమన్నాను. నారదుడు చెప్పాడు.

(అధ్యాయం- 27, శ్లోకాలు-50

సాత్యవతేయా! నీకేమిటి, నాకే విడ్డూరమైన సంగతి ఇది. బ్రహ్మాదిస్తంభపర్యంతం ఈ జగత్తు

అంతా మాయామోహితమనడానికి ఇదొక దృష్టాంతం వివరిస్తున్నాను చెవులు ఇటు పడెయ్.

నారదుడు స్త్రీగా మారిపోవడం

అతిమనోహరమైన శ్వేతద్వీపంలో ఉంటున్న నారాయణుడిని దర్శించడానికని ఒకప్పుడు నేను 

వెళ్ళాను. సప్తస్వరాన్వితంగా సామవేదం గానంచేస్తూ మహతి మ్రోగించుకుంటూ వెళ్ళాను. చతుర్భుజుడూ

శంఖచక్రగదాన్వితుడూ కౌస్తుభోద్భాసితోరస్కుడూ పీతాంబరపరీధానుడూ ముకుటాంగదవిరాజితుడు

శ్రీ మహావిష్ణువు రమాదేవితో విలాసంగా క్రీడిస్తూ కనిపించాడు. నన్ను చూస్తూనే లక్ష్మీదేవి

అంతర్హితురాలయ్యింది. సర్వలక్షణసంపన్న, సర్వభూషణవిరాజిత, రూపయౌవన విలాసగర్విత,

వరచామీకరప్రభ (బంగారు వన్నె) అయిన ఆ నారీతిలకం నన్ను చూసి చటుక్కున ఇంటిలోకి

వెళ్ళిపోయింది. కారణం ఏమిటి చెప్మా అనిపించి వాసుదేవుణ్ణి అడిగేశాను.

పద్మనాభా! నన్నుచూసి లక్ష్మీదేవి అంతర్గృహంలోకి వెళ్ళిపోయింది. ఏమిటి కారణం? నేను

విటుణ్ణి కాను. ధూర్తుణ్ణి అంతకన్నా కాదు. కేవలం తపస్విని. జితేంద్రియుణ్ణి. జితక్రోధుణ్ణి,

జితమాయాగుణుడిని, ఇలాంటి నన్ను చూసి లోపలికి వెళ్ళిపోవలసిన పని ఏమివచ్చింది?

విష్ణుమూర్తి చిద్విలాసంగా నవ్వి- నారదా! ఇది ఇంతేనయ్యా. పతి తప్ప మరింక ఏ మగవాడైనా

పత్నికి పరాయివాడే. పరపురుషుడి ఎదుట నిలబడకూడదు అనేది పతివ్రతల నీతి.

నారదైవం విధా నీతి ర్న స్థాతవ్యం కదాచన!

పతిం వినాన్యసాన్నిధ్యే కస్య చిద్యోషయా క్వచిత్ (28-13)

దేవుడు ఎక్కడ ఉంటాడు?

 రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా... 

భగవంతుడు అంటే ఏమిటి? 

అంటే.....

ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు. 


కాబట్టి ఓపిక చేసుకుని... 

🌷ఈ చిన్న కథను చదవండి🌷


ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి. 

అవి... 


1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

2.దేవుడు ఎక్కడ ఉంటాడు? 

3.దేవుడు ఏం చేస్తాడు? 


ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా  సరైన సమాధానం దొరకలేదు.


తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, 

శాస్త్రకారులను, 

మేధావులను ఆహ్వానించాడు.

తాను మూడు ప్రశ్నలు వేస్తానని, 

వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. 

సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. 

దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.


ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.

రాజాస్థానం చేరుకొన్నాడు. 

రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.


పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు.

‘చెప్పేవాడు గురువు,    వినేవాడు శిష్యుడు. 

గురువు పైన ఉండాలి,శిష్యుడు క్రింద ఉండాలి’ 

అని కండీషన్ పెట్టాడు . 


దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. 

పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. 


‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి. 


🌷మొదటి ప్రశ్న

దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.


వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.


మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.

‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.


ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.


🌷మరి ఇక రెండవ ప్రశ్న.... 


దేవుడు ఎక్కడ ఉంటాడు? 

అన్నాడు రాజు.


‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి. 

పాలు తెచ్చారు.

‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.


‘పాలను బాగా మరుగబెట్టాలి. 

వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. 

పెరుగు సిద్ధం అవుతుంది. 

దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.


‘సరిగ్గా చెప్పారు మహారాజా! 

అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, 

మనస్సు అనే తోడు వేసి, 

స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, 

సాధన అనే కవ్వంతో చిలికితే 

జ్ఞానం అనే వెన్న వస్తుంది.

ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి.

సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.


🌷ఇక చివరి ప్రశ్న. 

దేవుడు ఏం చేస్తాడు? అని.


నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.

క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. 

పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.

సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, 

దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.


సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. 

పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. 


*మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము..*

*మంచిని నేర్చుకుందాము..  *

*మంచిని ఆచరించుదాము... *

*మంచిని అందరికి పంచుదాము... *

*మంచి పేరుతో మరణిద్దాము...*

         🙏శుభం భూయాత్! 🙏

💐💐💐💐