12, నవంబర్ 2020, గురువారం

మహాభారతము ' ...75 .

 మహాభారతము ' ...75 . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


సర్వాలంకార శోభితులమై ప్రణయం జరుపుకుందామని కోరిన లోపాముద్ర, కోరిక తీర్చే అవకాశం లేక, అగస్త్యుడు, ' భార్యామణీ ! నీకోరిక నీకు సమంజసంగానే తోచవచ్చు. కానీ, సర్వసంగ పరిత్యాగిని. మునులలో శ్రేష్ఠునిగా కొనియాడ బడుతున్నవాడను. నావద్ద నీవు అనుకున్నట్లు అలంకరించుకునే, ధనంలేదు. హంసతూలికా తల్పాలు యేర్పరచలేను. అవి లేకపోవడం, మన దాంపత్యానికి అవరోధం అవుతుందని నేను అనుకోలేదు. ' అని నిరాశగా అన్నాడు. భర్త తనకోరిక తీర్చలేనందుకు నొచ్చుకున్నాడని తెలిసి లోపాముద్ర, ' స్వామీ ! మీరు తపోధనులు. మీరు తలుచుకుంటే, మీ తప:శక్త్తి ద్వారా యివన్నీ సమకూర్చలేరా? ఆలోచించండి. మన సుఖానికి ఆ మాత్రం తపశ్శక్తి వినియోగించలేరా ? ' అని అడిగింది.


' నీవు చెపుతున్నది నీపరిధిలో చాలా చిన్నవిషయం దేవీ ! కానీ తపస్సు అనేది చిన్న విషయం కాదు. ఎన్నో నియమనిష్టలతో కూడుకున్నది. ఈ చంచలమైన వానికోసం తప;ఫలాన్ని వుపయోగిస్తే, అనుకున్న లక్ష్యం సాధించలేము. ఈ విషయంలో నాపై అలుగకుండా, , నీకు వేరేయేదైనా ఉపాయం తోస్తేచెప్పు. ' అనగానే లోపాముద్ర, ' మహామునీ ! నా ఋతుకాలం చాలావరకు అయిపొయింది. ఈ పరిస్థితులలో మీతో సంసారజీవనం చేయనందుకు నన్ను అర్ధం చేసుకుని క్షమించండి. మీరు సర్వజ్ఞులు. మీకెలా తోస్తే అలా చెయ్యండి. నన్నుమటుకు యీవిషయంలో బలవంతపెట్టకండి. ' అని చెప్పివేసింది. 


అగస్త్యునికి ఆమె నిర్ణయం తెలిసిపోయింది. ఇక ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం వృధా అని గ్రహించి, ' అవసరమైన ధనాన్ని సంపాదించుకుని వస్తాను. అప్పటిదాకా, సతీధర్మాన్ని ఆచరిస్తూ, ఆశ్రమం కనిపెట్టుకుని వుండు. ' అనిచెప్పి, అగస్త్యుడు, దగ్గరలో వున్న శ్రుతర్వుడు అనే రాజు వద్దకువెళ్లి, ' మహారాజా ! నేను కార్యార్ధినై వచ్చాను. నీవు గొప్ప ధనవంతుడవని విన్నాను. నీదగ్గర మిగులు ధనం వున్నచో, ఆ యిచ్చే దానంవలన యెవరికీ యిబ్బంది కలుగని పక్షంలో, నాకు నీ శక్తికి తగినట్లు ధనం సహాయం చెయ్యి. ' అని సూటిగా అడిగాడు. ' అన్నాడు అగస్త్యుడు.  


శ్రుతర్వుడు యెంతో భక్తి తో అలాగే అని చెప్పి, మంత్రిని పిలిపించి, మిగులు ధనం ఏ మాత్రం ఉంటుందో, కోశాధికారిని అడిగి తెలుసుకొమ్మని పురమాయించాడు. ఆశ్చర్యకరంగా, వారి కోశాగారంలో అసలు మిగులుధనమే లేదు. బొటాబొటీ ఖర్చుల నిమిత్తం మాత్రమే రాజ్యంలో సొమ్ము వున్నది. అది గ్రహించి, యెంతో కొంత సొమ్ము యిస్తానన్నా కూడా అగస్త్యుడు వద్దని, తనవలన ప్రజలు యిబ్బంది పడగూడదని, ధనం తీసుకోకుండా తిరస్కరించాడు. అగస్త్యుడు, శ్రుతర్వుడు అలోచించి ప్రక్కరాజ్యం ప్రభువైన బద్నశ్వుడు అనేరాజును కలిశారు. అమితాశ్చర్యంగా, ఆ రాజువద్దకూడా, మిగులు ధనంలేదు. ఆ తరువాత, ముగ్గురూ అలోచించి యింకొకరాజైన త్రదస్య రాజును కలిశారు. ఆయనదీ అదే పరిస్థితి. అప్పుడు మిగిలిన ముగ్గురు రాజులూ కలిసి అలోచించి, అగస్త్యుని, వట్టిచేతులతో తిప్పి పంపకూడదని అలోచించి, ' మహర్షీ ! దగ్గరలో ఇల్వలుడు అనే ఒక రాక్షసుడు వున్నాడు. వాడి వద్ద విపరీతమైన ధనం వున్నదని ప్రతీతి. అతనిని అడిగి మీ అవసరాలు తీర్చుకుందురు . ' అని ముగ్గురు రాజులూ అగస్త్యుని తీసుకుని ఇల్వలుని వద్దకు వెళ్లారు.   


ధర్మరాజా ! మనం అగస్త్య మహర్షి గురించి, యెందుకు చెప్పుకుంటున్నామో గుర్తుంది కదా ! అగస్త్యుడు వాతాపిని యెందుకు చంపాడు ? అని తెలుసుకోవడానికే కదా ! మనం అక్కడకే వస్తున్నాము. ఈ ఇల్వలుడు అనే రాక్షసుడు యెవరోకాదు. వాతాపి అనేవాడి, సోదరుడే ! వీరు అందరు రాక్షసాగ్రేసరులవలె, దితికుమారులే ! ఇల్వలునికి బ్రాహ్మణద్వేషం కలిగే ఒక సంఘటన జరిగింది.  


ఒకనాడు,ఒక గొప్ప తపోనిష్ఠగల బ్రాహ్మణుడు, ఇల్వలుని మార్గంలో వెళుతుండగా, ఆయనకు నమస్కరించి, ఇల్వలుడు, ' విప్రోత్తమా ! నాకు ఇంద్రునితో సరిసమానమైన కుమారుడు కలిగేటట్లు దీవించండి. ' అనిప్రార్ధించాడు. ఇది ఇల్వలునికి మించిన కోరికగాభావించి ఆ బ్రాహ్మణుడు ఆవిధంగా దీవించడానికి ఒప్పుకోలేదు. అప్పటినుంచి, కనబడిన ప్రతిబ్రహ్మణుని చంపివేయాలని నిర్ణయించుకున్నాడు.   


ఇంకేముంది? ఆ ఆలోచన రావడమే ఆలశ్యం, కామరూప విద్య తెలిసిన తనతమ్ముడు వాతాపిని ఒక జంతువురూపం ధరింపజేసి, దానినివండి, విప్రులను దారికాచి,భోజనానికి పిలిచి, వారు తమ పితృదేవతల మారు రూపాలని చెప్పి, వారిని సత్కరించి, ఆ వండిన భోజనం పెట్టేవాడు. వారు తృప్తిగా భోజనం చెయ్యగానే, తనకు తెలిసిన క్షుద్రవిద్యతో, ' వాతాపీ ! రా ! ' అని ప్రేమగా తనతమ్ముని పిలిచేవాడు. వెంటనే, బ్రాహ్మణుని ఉదరంలో ఆహారంగా వున్న వాతాపి, ఆ బ్రాహ్మణుని ఉదరాన్ని చీల్చుకుని, బైటకు వచ్చేవాడు. ఆ బ్రాహ్మణుడు విగతజీవుడయ్యేవాడు. ఈ విధంగా లెక్కలేనంతమంది బ్రాహ్మణులను చంపి, బ్రహ్మహత్యా పాతకం మూటగట్టుకుని వున్నారు, ఆ సోదరద్వయం.


ఇలాంటి పరిస్థితులలో అగస్త్యునితో కలిసి, ఆ ముగ్గురురాజులూ, ఇల్వలుని దర్శించడానికి, అతని సహాయం కోరడానికి వచ్చారు.


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

సుభాషితాలు

---------------    ---------   సుభాషితాలు --------------

 

కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స

త్త్వరితాకంపిత భూమిచక్రము, మహోద్యద్విస్ఫులింగచ్ఛటా

పరిభూతాంబర శుక్రమున్, బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం

తరనిర్వక్రముఁ, బాలితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్.

 

భావము:- దయాసాగరుడైన నారాయణుడు మొసలిని చంప మని తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం భూమండలాన్ని కంపింప జేసే వేగం కలది. గొప్ప అగ్నికణాల జల్లుతో ఆకాశ మండలాన్ని కప్పివేసేది. అనేక విధమైన బ్రహ్మాండభాండాల సమూహాలలోను ఎదురు లేనిది. దేవతలను అందరిన కాపాడేది.

 

కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్తురవివేకు ల్జీవనభ్రాంతులై

    కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్‌ వారిచే నేగతుల్‌

    వడసెం బుత్రులులేని యా శుకునకున్‌ వాటిల్లెనే దుర్గతుల్‌

    చెడునే మోక్షపదం బపుత్రకునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!

 

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కొడుకులు లేరు అని జీవితము మీది అనురాగముతో అవివేకులై జనులు ఏడ్చెదరు. ధృతరాష్ట్రునికి ౧౦౦ మంది కొడుకులు కలిగికూడా ఏ గతులు పొందినవాడయ్యెను. కొడుకులు లేని శుకమహర్షికి దుర్గతులు కలుగలేదు కదా ప్రభో!

 

సంతత పుణ్యశాలి యొక జాడను సంపద వాసిపోయి తా

నంతట పోకనెట్టుకొని యెప్పటియట్ల వసించియుండు; మా

సొంతము నందు చందురుని యన్ని కళల్ పెడబాసి పోయినన్

కాంతి వహింప డోటు తిరుగంబడి దేహము నిండ! భాస్కరా!

 

తాత్పర్యం: భాస్కరా! పుణ్యాత్ముడు తన సంపద అంతా పోయినా బాధపడక ఎప్పటిలా ఉంటాడు. చంద్రుడు నెల చివర కళలన్నీ పోయినా మళ్ళీ కాంతివంతునిగా వెలుగొందును కదా!

 

అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ

విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూత కృ

ద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభా ధగ

ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

 

           భావం: సత్యము మాట్లాడువాఁడవు, శరణన్న వారిని రక్ష్మించువాడవు, దయచేతఁ బాపములఁ బోగొట్టువాడవు, బ్రాహ్మణుల సంతోషింపజేయువాడవు, గంగానది పుట్టిన పాదపద్మములు గలవాడవు, మణులచే నిగ నిగ మెఱయు సొమ్ములు గలవాడవు, భద్రాచల రామా!

 

   పనులెన్ని కలిగి యున్నను

   దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై

   వినగోరుము సత్కథలను;

   కాని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!


                 తా :--ఓ కుమారా! నీకెంత తీరికలేకున్ననూ, ఎన్ని పనులున్ననూ, మంచి బుద్ధిగలవాడివై ప్రతీ రోజు జ్ఞానమునిచ్చే మంచి కథలను వినవలెను. నీవట్లు చేసినచో నీ ప్రజ్ఞ పెరిగి, నిన్ను బుద్ధిమంతులందరూ సంతోషముతో మెచ్చుకొంటారు.

 

శైలే శైలే న మాణిక్యం, మౌక్తికం న గజే గజే

సాధవో నహి సర్వత్ర, చందనం న వనే వనే

 

తా:-- ప్రతి పర్వతము పైనా రత్నము దొరకదు,ప్రతి ఏనుగు కుంభ స్థలము లో ముత్యాలు వుండవు,ప్రతి

అరణ్యము లో చందన వృక్షాలు వుండవు,అలాగే అన్ని చోట్లా సజ్జనులు దొరుకుట దుర్లభము.

ఉత్తమ జాతి ఏనుగుల కుంభ స్థలము లలో ముత్యాలు దొరుకుతాయని ప్రతీతి.పూర్వం సమర్థులైన వేటగాళ్ళు

 

అడవులలో మాటు వేసి ఏనుగును చంపిన సింహపు అడుగుజాడలలో నుండి ముత్యాలు గ్రహించే వారట.సింహము ఏనుగును తన పంజా తో చీల్చినప్పుడు దాని పంజాలో ముత్యాలు యిరుక్కొని అవిసింహము గుహలోకి వెళ్ళే టప్పుడు క్రింద రాలి పడతాయని, అవి వేటగాళ్ళుసింహపు అడుగు జాడలను బట్టి పోయి సంగ్రహించి అమ్ముకునే వారని ప్రతీతి. (సింహము ముందు ఏనుగు కుంభ స్థలమునే కొడుతుంది.)

 

గుణ దోషౌ బుధో గృణ్హన్ ఇందు క్ష్వేడా వివేశ్వరః

శిరసా శ్లాఘ్య తే పూర్వం పరం కంఠే నియచ్ఛతి

 

శివుడు గరళమును కంఠము నందుంచుకొని, చంద్రకళను శిరమున ధరించినట్లుగా

పండితుడైనవాడు పరుల దోషములను లోపలే వుంచుకొని, గుణలేశములను శిరసావహిస్తాడు.

 

సతాం ధనమ్ సాధుభి రేవ భుజ్యతే

దురాత్మభి రుదుశ్చరితా త్మనామ్ ధనం

శుకాదయ శ్చూత ఫలాని భుజంతే

భవంతి నింబా: ఖలు కాకభోజనాః

 

మంచివారి సంపదలు మంచివారికే అనుభవానికి వస్తాయి. దురాత్ముల ధనములు దుష్ట

చరిత్రులకే వినియోగ పడతాయి. మామిడిపండ్లను చిలుకలు ఆరగిస్తాయి.వేపపండ్లు

కాకులకే భుక్తం అవుతాయి.ఇది లోకములో జరుగుతూనే వున్నది.కదా!

 

భాను స్సకృద్యుక్త తురంగ యేవ

రాత్రి దివం గంధ వహః ప్రయాతి

శేష స్సదై వాహితః భూమిభారః

షష్టామ్ శవృత్తే రపి ధర్మ యేష:

 

తా:---ఎప్పుడో పూన్చిన గుఱ్ఱములతో సూర్యుడు అవిశ్రా౦తముగా తిరుగుచునే వున్నాడు

వాయుదేవుడునూ అలాగే వీచుచున్నాడు. ఆదిశేషుడున్నూ భూమిని అటులనే మోయుచున్నాడు దేశ సంపదలలో ఆరవ పాలునకధికారి యైన రాజు కూడా స్వసుఖమును దలఁపక లోకశ్రేయమునకై పాటుపడుట సనాతన ధర్మమై యున్నది.

 

హర్తకు గాదు గోచర మహర్నిశ మున్ సుఖపుష్టి చేయు స

త్కీర్తి ఘటించు విద్య యను దివ్య ధనంబకిలార్థ కోటి కిం

పూర్తిగా నిచ్చినన్ బెరుగు బోదు యుగాంతపు వేళనైన భూ

భర్తలు తద్ధనాదికుల పట్టున గర్వము మాన్పు టొప్పగన్

 

           అర్థము:-విద్యా ధనమును దొంగలు   దొంగిలింప లేరు,అది ఎల్లప్పుడు సుఖమునే కలుగజేయును, కోరిన వారికి

ఎంత యిచ్చిననూ పెరుగుతుందే తప్ప తరిగిపోదు ధనము లాగ.ప్రళయ కాలమప్పుడు గూడ నశించదు,

ఇట్టి విద్యా ధనము గలవారి యెడ సామాన్య ధనము గల రాజులూ దురాగ్రహము విడిచి 

పెట్టవలెను విద్యావంతులను ఎవరూ ఎదుర్కొనలేరు. (భర్తృహరి సుభాషితం)

 

శ్రోత్రం శ్రుతి నైవ న కుండలేన 

దానేన పాణిర్నతు కంకణే న 

విభూతి కాయః ఖలు సజ్జనానాం 

పరోపకారేణ న చందనేన 

అర్థము:-- సజ్జనులు చెవులను కుండలములు ధరించుటకు గాక వేద శాస్త్రములు విని సార్థక మొనరించు కుందురు. చేతులను కంకణ ములను ధరించుటకు గాక దానము చేయుటకు ఉపయోగింతురు. శరీరమును చందనాదుల పూతలచే గాక పరోపకారము చేయుట చేతనే ప్రకాశిం ప జేసు కొందురు.

 

కాలము గడిచిన మగుడదు

కాలము కంటేను ధనంబుగలుగదు ధాత్రిన్

కాలమమూల్య పదార్థము

కాలము గడుపకుము వ్యర్థగతిని కుమారా!


🌹🌹🌹 భావం.🌹🌹🌹🌹

"టైములేదు" అని మనం ఎంతో కాలాన్ని వ్యర్థం చేస్తూ వుంటాం. బద్ధకం,

సోమరితనం కప్పి పుచ్చుకుంటాం. ఇది మంచి పద్ధతి కాదని అయ్యనకోట పార్థసారధి

చెప్పిన పద్యం ఇది".


(1)గడిచిన క్షణం తిరిగి రమ్మంటే రాదు.

(2)నిజం ఆలోచిస్తే కాలాన్ని మించిన ధనం లేదు.

(3)కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సంపద లభిస్తుంది.

(4)కాలం విలువను మనం కొలువలేము.

(5)కాబట్టి కాలం విలువ తెలుసుకొని ప్రవర్తించకపోతే జీవితం వ్యర్ధమవుతుంది

సాధించ వలసింది సాధించలేము.

(6)కాబట్టి కాలం విలువ తెలుసుకొని మెలుగుదాం

ఓడిపోతే

 *ఓడిపోతే* గెలవడం నేర్చుకోవాలి , 

*మోసపోతే* జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి , 

*చెడిపోతే* ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి , 

*గెలుపును* ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే 

*ఓటమిని* ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే 

*గొప్ప వారు* నేస్తమా ! 


 *రాత్రికి* పడు కుంటే తెల్లారి లేస్తామన్న 

*నమ్మకంలేని* బతుకులు మనవి ! *ప్రాణం* ఉంటే ఏంటి ? పోతే ఏంటి ?  

*ధర్మంగా* ఒక్కరోజు బతికినా చాలు ఈ 

*జన్మకు* అర్థమే మారిపోతుంది .


   ఎవరో *వస్తారు* ఏదో *చేస్తారు* ఇవన్నీ వట్టి *మాటలే మిత్రమా* ! నీ కోసం ఎవరు *రారు* ఏది *చేయరు* నీ కోసం నువ్వనుకున్నది *నువ్వే* చేయ్ అది *ప్రయత్నం* అయినా *పోరాటం* అయినా .


      *అసూయ అహంకారం* ఇదొక భయంకరమైన *మానసిక వ్యాధి* ఈ వ్యాధి *సోకిన* వారు సుఖపడరు *ఇతరులను* సుఖపడనివ్వరు . ఇది సత్యం.

*మిత్రులందరికీ శుభోదయం* 🙏🙏🙏

వృద్ధాప్యంలో జరిపే శాంతులు*

 వృద్ధాప్యంలో జరిపే శాంతులు*🍁


పురుషునికి 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి మరియు 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి చేయడం మనం సర్వ సాధారణంగా చూస్తుంటాము.


కాని భాస్కరభట్టు అభిప్రాయం ప్రకారం 50 సంవత్సరాల వయసు మొదలుకొని ప్రతి 5 సంవత్సరాలకు అరిష్టం తొలగిపోవడానికి వయోవస్థా శాంతులు జరిపించాలి (భట్ట భాస్కరీయ మతానుసారిణ్యః వయోవస్థా శాంతయః పంచాశత్ వర్షమారభ్య పంచభిః పంచభిః వర్షైర్యుక్తాః।(అన్యమతేన - షష్టితమ వర్షమారభ్య దశభిర్దశభిర్వర్షైః శాంతిరుక్తాః))


శ్లో॥ వైష్ణవీ వారుణీ చైవ తతశ్చోగ్రరథీ తథా ।మహారథీ భీమరథీ ఐంద్రీచైవ విశేషతః ॥1॥

చాంద్రీదార్శనికీ రౌద్రీ సౌరీ మృత్యుంజయీ తథా।మహామృత్యుంజయీ శాంతిః క్రమశశ్చ ప్రకీర్తితాః ।అరిష్ట పరిహారార్థం శాంతిం కుర్యాత్ప్రయత్నతః ॥2॥


వాటి వివరాలు క్రింద తెలిపినట్లుగా...

1. వైష్ణవీ శాంతి ----50 వ సంవత్సరము.

2. వారుణీ శాంతి ----55 వ సంవత్సరము.

3. ఉగ్రరథ శాంతి ---60 వ సంవత్సరము.

4. మృత్యుంజయ శాంతి ---65 వ సంవత్సరము.

5. భౌమరథీ శాంతి ---70 వ సంవత్సరము.

6. ఐంద్రీ శాంతి ---75 వ సంవత్సరము.

7.సహస్ర చంద్ర దర్శన శాంతి ---80 వ సంవత్సరము.

8. రౌద్రీ శాంతి ---85 వ సంవత్సరము.

9.కాలస్వరూప శౌరి శాంతి ---90 వ సంవత్సరము.

10. త్ర్యంబక మహారథి శాంతి ---95 వ సంవత్సరము.

11. శతాబ్ది -- మహామృత్యుంజయ శాంతి ---

100 వ సంవత్సరము. 

🌷🌷🌷సర్వంశివసంకల్పం🌷🌷🌷

Maha praanadeepam

 : *Maha praanadeepam* :


ఓమ్ మహా ప్రాణ దీపమ్ శివమ్ శివమ్

మహోంకార రూపమ్ శివమ్ శివమ్

మహా సూర్య చంద్రాగ్ని నేత్రమ్ పవిత్రమ్

మహా గాఢ తిమిరాంతకమ్ సౌరగాత్రమ్

మహాకాంతి బీజమ్ - మహా దివ్య తేజమ్

భవానీ సమేతమ్ - భజే మంజునాధమ్

ఓమ్ నమశ్శంకరాయచ -మయస్కరాయచ

నమశ్శివాయచ -శివతరాయచ - భవయరాయచ

మహ ప్రాణదీపమ్ - శివమ్, శివమ్

భజే మంజునాధమ్ - శివమ్, శివమ్

అద్వైత భాస్కరమ్ - అర్దనారీశ్వరమ్

త్రిదశ హృదయంగమమ్    -చతురుదధి సంగమమ్

పంచభూతాత్మకమ్ - షట్చత్రునాశకమ్

సప్తస్వరేశ్వరమ్    - అష్టసిద్దీశ్వరమ్

నవరస మనోహరమ్ - దశదిశా సువిమలమ్

ఏకాదశోజ్జ్వలమ్ - ఏకనాథేశ్వరమ్

ప్రస్తుతి వశంకరమ్ -ప్రణత జనకింకరం

దుర్జన భయంకరమ్ -సజ్జన శుభంకరమ్

ప్రాణిభవతారకమ్ - ప్రకృతి హిత కారకమ్

భువన భష్యభవనాయకమ్ -భాగ్యాత్మకమ్ రక్షకమ్

ఈశమ్ సురేశమ్ - వృషేశమ్ పరేశమ్

నటేశమ్ గౌరీశమ్ - గణేశమ్ భూతేశమ్

మహామధుర పంచాక్షరీ మీ మంత్ర మార్షమ్

మహాహర్ష వర్ష ప్రవర్షమ్ సుశీర్షమ్

ఓమ్ నమోహరాయచ స్వరహరాయచ పురహరాయచ

రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ

నిత్యాయచ నిర్ణిద్రాయచ

మహ ప్రాణదీపమ్-శివమ్, శివమ్

భజేమంజునాధమ్-శివమ్, శివమ్

ఢంఢంఢ  ఢంఢంఢ  ఢంఢంఢ  ఢంఢంఢ

ఢక్కా నినాద నవతాండవాడంబరమ్

తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి

సంగీత సాహిత్య సుమకమల బంభరమ్

ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార

మంత్ర బీజాక్షరమ్ మంజునాధేశ్వరమ్

ఋగ్వేద మాద్యమ్ -యజుర్వేదవేద్యమ్

సామప్రగీతమ్ - అధర్వ ప్రభాతమ్

పురాణేతిహాస ప్రసిద్దమ్ విశుద్దమ్

ప్రపంచైక సూత్రమ్ - విబుద్ధమ్ సుసిద్ధమ్

నకారమ్ మకారమ్ - శికారమ్ వకారమ్

యకారమ్ నిరాకార సాకార సారమ్

మహాకాల కాలమ్ మహానీల కంఠమ్ - మహనంద

నందమ్ మహట్టాట్ట హాసమ్

జటాజూట రంగైక గంగా సుచిత్రమ్

జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రమ్ సుగోత్రమ్

మహాకాశ భాస్వన్మహాభానులింగమ్

మహాబభ్రు వర్ణమ్ సువర్ణమ్ ప్రవర్ణమ్

సౌరాష్ట్ర సుందరమ్ - సోమనాథేశ్వరమ్

శ్రీశైల మందిరమ్ - శ్రీమల్లికార్జునమ్

ఉజ్జయిని పుర - మహాకాళేశ్వరమ్

వైధ్యనాధేశ్వరమ్ -మహాభీమేశ్వరమ్

అమరలింగేశ్వరమ్ రామలింగేశ్వరమ్ -కాశీవిశ్వేశ్వరమ్

పరమ్ ఘృశ్మేశ్మరమ్

త్ర్యయంబకాధీశ్వరమ్ - నాగలింగేశ్వరమ్

శ్రీ కే్దారలింగేశ్వరమ్

అప్లింగాత్మకమ్ - జ్యోతిలింగాత్మకమ్

అఖిల లింగాత్మకమ్ - అగ్ని సొమాత్మకమ్

అనాదిమ్ అమేయమ్ అజేయమ్ అచింత్యమ్

అమోఘమ్ అపూర్వమ్ అనంతమ్ అఖండమ్ // అనాదిమ్ //

ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్

ఓమ్ సోమాయచ - సౌమ్యాయచ

భవ్యాయచ - భాగ్యాయచ

శాంతాయచ - శౌర్యాయచ

యోగాయచ - భోగాయచ

కాలాయచ - కాంతాయచ

రమ్యాయచ - గమ్యాయచ

ఈశాయచ - శ్రీ చాయాయచ

శర్వాయచ - సర్వాయచ

కార్తీక మాసం లో ముఖ్యమైన రోజులు..

 కార్తీక మాసం లో ముఖ్యమైన రోజులు.....

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నవంబర్ 16నుండి కార్తీక మాసం ప్రారంభం.

 నవంబర్ 16కార్తీక మొదటి సోమవారం, భగినీహస్త భోజనం, 

నవంబర్ 18బుధవారం నాగులచవితి, 

నవంబర్ 20శుక్రవారం తుంగభద్ర పుష్కరములు ప్రారంభం,

 నవంబర్ 21శనివారం శ్రవణా నక్షత్ర కోటి సోమవారం పూజ, నవంబర్ 23రొండవ సోమవారం,

 నవంబర్ 25బుధవారం కార్తీక శుద్ధ ఏకాదశి,

 నవంబర్ 26గురువారం చిల్కు ద్వాదశి, 

నవంబర్ 28శనివారం శనిత్రయోదశి,

 నవంబర్ 29ఆదివారం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం, నవంబర్ 30మూడవ కార్తీక సోమవారం, పౌర్ణమి, 

డిసెంబర్ 4 శుక్రవారం సంకష్టహర చతుర్థి,

 డిసెంబర్ 7నాలుగవ సోమవారం, 

డిసెంబర్ 10గురువారం ఉపవాస ఏకాదశి, డిసెంబర్ 11శుక్రవారం గోవత్స ద్వాదశి, డిసెంబర్ 12శనివారం -శనిత్రయోదశి, 

డిసెంబర్ 13ఆదివారం మాసశివరాత్రి,

 డిసెంబర్ 14ఐదవ సోమవారం, అమావాస్య సోమవార వ్రతం, డిసెంబర్ 15పోలిస్వర్గం, కార్తీక మాసం పూజలు పూర్తి, డిసెంబర్ 20ఆదివారం సుబ్రహ్మణ్యషష్ఠి పూజ,

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

జై గురు దత్త 🙏🙏

భగవద్గీతలో యోగములు

 



🙏భగవద్గీతలో యోగములు🙏* 

☘️🌿☘️🌿☘️🌿☘️🌿☘️
భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి "యోగము" అనే పేరు ఉంది. 
ఇక్కడ "యోగం" అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.

*అర్జునవిషాద యోగము*  యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు, మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.

*సాంఖ్య యోగము* 
ఆత్మ స్వరూపము గుణగణాల వర్ణన.

*కర్మ యోగము* 
కర్మ చేయడంలో నేర్పు, దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము.

*జ్ఞాన యోగము*  
నర, నారాయణూల జన్మలు, భగవంతుని జన్మలోని శ్రేష్టమైన గుణాలు.జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ.

*కర్మసన్యాస యోగము*  కర్మలను ఫలితాలను సన్యసించి భగవంతునికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ.

*ఆత్మసంయమ యోగము*  ధ్యానము, ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము, ఆహారనియమాలు, సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన.యోగి గుణగాణాల వర్ణన, భగవంతుని సర్వవ్యాఇత్వము, యోగభ్రష్టత ఫలితాల వర్ణన.

*జ్ఞానవిజ్ఞాన యోగము*  భగవంతుని, ఉనికి, గుణగనాలు, ప్రకృతి, మాయని జయించడము.మోక్షగామి గుణగణాల వర్ణన.

*అక్షరపరబ్రహ్మ యోగము*  బ్రహ్మతత్వము, ఆధ్యాతకత, కర్మతత్వము, ఆది దైవతము, ఆది భూతముల వర్ణన.జీవుని జన్మలు, జీవ ఆవిర్భావము, అంతము, పుణ్యలోక ప్రాప్తి, అత్యకాలములో భగవన్నామస్మరణ ఫలం.

*రాజవిద్యారాజగుహ్య యోగము* 
మోక్ష ప్రాప్తి వివరణ.భగవతత్వము, స్వర్గలోకప్రాప్తి, దేవతారాధనా వాటిఫలము, భక్తుల గుణగణాల వర్ణన.

*విభూతి యోగము* 
భగవంతుని చేరే మార్గము.భగవంతుని విశ్వ వ్యాపికత్వము వర్ణన.

*విశ్వరూపసందర్శన యోగము* :- విశ్వరూపము గురించిన విస్తారమైన వర్ణన.

*భక్తి యోగము* :- 
భక్తి యోగ వర్ణన.భగవంతుని ప్రియము పొందలిగిన భక్తుని గుణగణాల వర్ణన.

*క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము* :- ప్రకృతి పురుషులు, క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానము తెలిపేది.

*గుణత్రయవిభాగ యోగము* :- సత్వగుణము, రజోగుణము, తామసగుణము వివరణ, వారి ఆహారవ్యవహారాల వర్ణన.

*పురుషోత్తమప్రాప్తి యోగము* :- భగవంతుని స్వరూపము తత్వము పురుషోత్తముని చేరే మార్గము వివరణ.

*దైవాసురసంపద్విభాగ యోగము* :- 
దైవీగుణసంపద, అసురీగుణసంపద కవారి ప్రవృత్తి, ప్రవర్తన ఆలోచనాదుల వర్ణన.

*శ్రద్దాత్రయవిభాగ యోగము:-* సత్వ, రాజసిక, తామసికములనబడే మూడు విధములుగా గుర్తించిన శ్రద్ధలను గురించిన వివరణ.

*మోక్షసన్యాస యోగము* :- మోక్ష ప్రాప్తికి కావలసిన జ్ఞానము, సన్యాసము గురించిన వర్ణన. 

దైవము ఇచ్చే అవకాశము....

 దైవము ఇచ్చే అవకాశము.....


ఒక ఊరిలో నారాయణ అనే పండితుడు ఉండేవాడు. ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా, నిష్టాగరిష్టుడిగా అందరి మన్ననలూ పొందినవాడు."అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు" అని ఊరంతా చెప్పుకుంటారు. నారాయణ కూడా అంతటి భక్తిశ్రద్ధలు దేవునిపట్ల కనబరిచేవాడు. నిరంతరం దైవనామస్మరణతో తనేంటో తన పూజాపునస్కారా

లేంటో అన్నట్టు ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడుకాదు. తనకు కష్టమొచ్చినా, సుఖమొచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు. మొత్తానికీ ఊరందరిదీ ఒకదారి ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్టు బ్రతకసాగాడు.


ఒకనాటి ఉదయం... ఆ ఊరి కరణం నారాయణ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆ రోజు మౌనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్టు చూసాడు."స్వామీ వాతావరణం బాగాలేదు. గాలివాన వచ్చేలా ఉంది. ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతున్నాం. కనుక, తమరు త్వరగా కాసిని సామాను సర్దుకుని సురక్షిత స్థలానికి బైలుదేరండి" అని ఆందోళనగా చెప్పాడు కరణం. నారాయణ ఆ మాటలకు చీమకుట్టినట్టు కూడా చలించలేదు. గోడకు ఉన్న దేవుడి పటాన్ని చుపిస్తూ "అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. భయంలేదు" అన్నాట్టు సైగచేశాడు. కరణానికి ఏమీ అర్ధం కాక, బుర్రగోక్కుని త్వరగా తెమలండి" అనేసి, మిగతావారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు.


అతడెళ్ళిన కాసేపటికి ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే కుంభవృష్ఠిగా మారింది. చెరువులూ, వాగులూ నిండసాగాయి. ఊరిజనం ఎడ్లబళ్ళు కట్టుకుని గుంపులు గుంపులుగా ఊరు వదలి తరలిపోసాగారు.


ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది- "నారాయణ స్వామీ! వానపెద్దదైంది. చెరువు కట్టకి గండి పడేలాఉంది. త్వరగా రండి పోదాం" అని అరిచాడో గ్రామస్థుడు. పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఓ సారి చూసి, తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. ఎడ్లబండి మీద ఉన్న జనం మరికొంతసేపు నారాయణ కోసం కేకలు వేసి, వరదనీటీ ఉదృతి పెరగడంతో కదిలి వెళ్ళిపోయారు.


ఊరంతా ఖాళీ అవుతుంది. ఊరిబైట చెరువుకు భయపడ్డట్టుగానే గండి పడింది. నీరు ఒక్కసారిగా ఊళ్ళోకి ప్రవేశించి ఇళ్ళను ముంచెత్తసాగింది. నారాయణను ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది. అతడు దేవుడి పటం చేతపట్టుకుని రెండో అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ నిలబడి భగవధ్యానం చేయసాగాడు అక్కడక్కడా చిక్కుకున్ని ఉన్న జనాన్ని, వీలైతే పశువుల్ని పడవల్లోకి ఎక్కించి తరలించసాగారు ఊరిపెద్దలు.


ఒకపడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది. వాళ్ళు నారాయణను చూసి, "స్వామీ! రండి పడవలో తీసుకుపోతాం" అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చెలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ "నాకేం భయం లేదు" అన్నట్టూ సైగ చేశాడు. వారికి అతడేమంటున్నాడో అర్ధం కాలేదు. పడవ వెళ్ళిపోయింది. వరద పోటేత్తింది. ఊరు మునిగి పోయింది. రెండో అంతస్తులోకి కూడా చొచ్చుకు వచ్చిన నీరు నారాయణను లాక్కెళ్ళింది. వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు.


అలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకుపోయి, భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్ధమైంది.


 తీవ్రమైన దుఃఖంతో పాటూ దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతడ్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసునంతా వెళ్ళగ్రక్కుతూ, " దేవుడా! నీవే దిక్కని నమ్మానే? ఆపద్భాంధవుడవని కీర్తించానే? కానీం నువ్వేం చేశావు? నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కూ మొక్కూ లేకుండా చావాల్సి వచ్చిందే? భక్తుడి పట్ల దేవుడిగా నీకున్న భాద్యత ఇదేనా?" అని నిష్టూరమాడాడు.


నారయాణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు."అదేంటి? నువ్వెలా చనిపోయావు? నిన్ను రక్షించడానికి నేను మూడు అవకాశాలు కల్పించాను కదా?" అని అడిగాడు. నారాయణ అమాయకంగా, మూడు అవకాశాలేంటి?" అన్నాడు. దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు.


 "మార్ఖుడా! నా భక్తుడవనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు మూడు అవకాశాలు ఇచ్చాను. ఒకసారి కరణాన్ని పంపించాను. రెండోసారి ఎడ్లబండి పంపించాను. మూడోసారి పడవను పంపించాను. అయినా అవేమీ నువ్వు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకుని, శంఖుచక్రాలు పట్టుకుని గుర్రమెక్కి రాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి".

నారాయణ సిగ్గుతో తలవంచుకున్నాడు.

Retirees please

 Retirees please save this article


 A study in the United States says more than 51% of elderly people fall due to climbing stairs.


 Every year there are 20,000 deaths in the US due to climbing stairs.

 Experts advise that after 65 years of age do NOT do the following 10 actions:


 * 1.  *Climbing up the stairs/ ladder*


 * 2.  *Turn too fast / turn around*


 * 3.  *Bend over your feet*


 * 4.  *Putting on pants  standing*


 * 5.  *Sit ups*


 * 6. *Turning left and right*


 * 7.  *Step backward*


 * 8.  *Bend to lift heavy items*


 * 9.  *Suddenly standing from the bed*


 10. *Straining too hard*


 Share with many people: a movement which annually causes 20,000 people to die in the US.


 After 65 years old

 try not to do these 10 actions.


  *THERE ARE 4 KINDS OF SIMPLE KNOWLEDGE*


 1. Food choking.

 2. Wrong pillow.

 3. Leg cramps.

 4. Tingling feet.


 This is knowledge that can    help you and others 


 How to help as follows:


 1. *CHOKING ON FOOD*

       You only need to "raise

       your hand".

       By raising your hands

       above your head, the

       food stuck in your

       throat  will go down by

       itself.


 2. *WRONG PILLOWS*

      Sometimes when you

      wake up, you  feel pain

      in the neck.  What to do

      when the pillow is

      wrong?  You only need

      to lift your feet, then

      pull your toes and

      massage in a clockwise

      or counterclockwise

      direction.


 3. *FEET CRAMPS*

       When feeling cramps in

       your left leg, raise    your

       right hand high, when

        cramping is in your

        right leg, raise your left

        hand high, it will

        immediately feel better.


 4. *TINGLING FEET*

       When the left foot is

       tingling, swing your

       right palm with all your

       strength, when the right

       foot is tingling, swing

       your left palm with all

       your strength.

 

Don't just save this info.  Please share.  

Who knows... you can save someone else.

May be useful..


 *Info for pre elderly*

Roots of Joe Biden

 *Roots of Joe Biden*

During the campaigning of election Joe Biden had said that his relatives of Indian origin stay in Mumbai. Nobody paid attention to him. Now these details have emerged. Time will tell us whether they are true or not.

*********

In seventeenth century,in a village called Mouje Rajapur in Konkan region of Maharashtra, a Brahmin called Vinayakrao Bhide used to stay with his wife Vatsalaabai and three children. He was an astrologer and even owned a small piece of land. His income was meager and he always had difficulty in making 2 ends meet. One day he got fed up and told his wife that he may get good income if they shift to Surat in Gujarat. 

His family shifted to Surat and settled there. His income improved and he became known to many as an astrologer. His youngest son Ramchandra was very smart looking fair boy and had brown eyes. The British officer of Surat Mr Rutherford and his wife Margaret saw Ramchandra and liked him because they did not have a child. They requested Vinayakrao for adaptation  of their son. After a long thought the Bhide family agreed but put one condition for adaptation. They told Rutherford to add Bhide in the surname of their son. Rutherford agreed and Ramchandra became Ramchandra Rutherford Bhide. 

Rutherford family shifted to England with Ramchandra and settled there. Later on Ramchandra had his own family and he dropped Rutherford from his surname. His children became Biday later on. Their children then went to US and became Biden. Mr Joe Biden is from this family. 

I am from Bhide family and my great grandfathers mother in law is sister of Vinayakrao Bhide. On Mahashivratri day every year we break a coconut for Biden family and on every Parashuram Jayanti they send their contribution of Rs 51 as per tradition. 

We are also eagerly awaiting for Joe Biden to visit Rajapur at our family’s ancient house. 

- *Uday Joshi*