29, జనవరి 2026, గురువారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 29 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                    1️⃣1️⃣9️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము*       

     

                  *119 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


*కౌశికుడు ధర్మవ్యాధుని అనునయించుట*```


కౌశికుడు ధర్మవ్యాధునితో “అయ్యా! నీవు వ్యాధుని జన్మ ఎత్తిననూ బ్రాహ్మణుని వలె ప్రవర్తిస్తున్నావు. నీవు నిజంగా బ్రాహ్మణుడివే. ఎందుకనగా పుట్టుకతో బ్రాహ్మణుడైనా శూద్రుని వలె ప్రవర్తించిన అతడు శూద్రుని కంటే నీచుడు ఔతాడు. జన్మతః శూద్రుడైనా సత్యమూ, శౌచమూ, ధర్మము అవలంబించిన అతడు సద్బ్రాహ్మణునితో సమానమని పెద్దలు చెప్పారు కదా! నీ కర్మల వలన శూద్రుడిగా జన్మించినందుకు బాధపడ వలదు. మనం చేసే కర్మల వలన సుఖదుఃఖాలు ఏర్పడతాయి. ప్రాజ్ఞులు రెండింటిని సమానంగా చూస్తారు. సత్కర్మలచే పాపాన్ని పోగొట్టుకుంటారు. మూఢులు అప్రియానికి కలత చెంది, ప్రియములు జరిగినప్పుడు ఆనందిస్తారు. అందువలన హృదయతాపం హెచ్చుతుందే కాని తగ్గదు. ధీరులు రెండింటినీ సమ దృష్టితో చూస్తారు. జరిగిన దానికి జరగబోవుదానికి దుఃఖించక అన్నిటినీ సమదృష్టితో చూడటం ప్రాజ్ఞుల ధర్మం. దుఃఖము వలన విచక్షణ కోల్పోతారు. కనుక అన్నింటినీ సమదృష్టితో చూసి శుభములు పొంది ఆనందంగా ఉండుము. అన్ని భూతములందు సమత్వము కలిగి ధీరుడవై ఉండుము నీకు మేలు జరుగుతుంది” అని అనునయ వాక్యాలు చెప్పాడు. 


ధర్మవ్యాధుడు “మహానుభావా! తమరు చెప్పినట్లే నేను దు॰ఖమును వదిలినాను. నాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను” అన్నాడు. 


కౌశికుడు “మహాత్మా! నీవు పుణ్యమూర్తివి. నీ దర్శనంతో నాకు ఎన్నో ధర్మాలు తెలిసాయి నా జన్మ ధన్యం అయింది. ఇక నాకు శలవు ప్రసాదించండి” అని అడిగాడు. 


ఆ తరువాత కౌశికుడు తన తల్లితండ్రులను చేరుకుని వారిని సేవించి తరించాడు. కనుక ధర్మరాజా! నీవు అడిగినట్లు పతివ్రతా ధర్మము, మాతాపితల శుశ్రూష, హీనకులములో పుట్టినా ఎలా ధర్మాత్ముడు కాగలడో వివరించాను 

కదా” అన్నాడు మార్కండేయ మహర్షి.

```

      *అగ్నిదేవుని తపసు*```


ధర్మరాజు “మహర్షీ! నీ దయవలన ఎన్నో విషయములు తెలుసుకున్నాను. పూర్వము అగ్ని దేవుడు ఎందుకు తపస్సు చేసాడు? అంగీరసుడు అగ్నిగా మారటానికి కారణం ఏమిటి? అగ్నులు ఎన్ని విధాలు? వివరిస్తారా?” అని అడిగాడు. 


మార్కండేయ మహర్షి “ధర్మనందనా! అగ్ని దేవుడు హవ్యవాహనుడు. యజ్ఞ యాగాదులలో వేసే హోమద్రవ్యాలను అగ్ని దేవుడు దేవతలకు చేరుస్తాడు. ఇలా చేసి విసుగు చెందిన అగ్ని దేవుడు హవిస్సులను అందించడం మాని అడవులకు వెళ్ళి తపస్సు చేయనారంభించాడు. అతని దేహం కృశించి పోయింది. అగ్ని మనసులో “నేను ఇలా నా విధులను విడిచి తపసు చేసుకుంటున్నాను ఏమిటి? నేను లేకపోతే లోకం స్థబించదు కదా! అలా స్తంభించిన బ్రహ్మదేవుడు వేరొకరిని నా పదవిలో పెట్టడా! ఇక నేను ఇక్కడ ఉండక వెంటనే పోవలయును” అని తలచి తపము చాలించి తన స్వస్థలముకు వెళ్ళుచుండగా బ్రహ్మదేవుడు తన పదవిలో నియమించిన అంగీరసుడనే అగ్ని మూడు లోకాలలో అగ్ని కార్యములు నిర్వర్తించడం చూసి భయపడ్డాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: