13, ఆగస్టు 2024, మంగళవారం

కోcతినిc దల్లిగాc దలcచెc

 *కోcతినిc దల్లిగాc దలcచెc గోమలి కెంతటి భాగ్యమబ్బెనో*

ఈ సమస్యకు నాపూరణ. 


*త్రిజట*

చేతలు గొప్పవై నిలిచె - చిన్నగ కన్పడె గాని చూచినన్ 


కోcతినిc - దల్లిగాc దలcచె - గోమలి కెంతటి భాగ్యమబ్బెనో 


సీతకు మొక్కులిచ్చుచును క్షేమము జెప్పెను, రాము వార్తలున్ 


పూతచరిత్రకున్ దెలిపె, పోవును కష్టము లన్ని నేటితో. 


అల్వాల లక్ష్మణ మూర్తి.

జీవనాధారం

 జై శ్రీమన్నారాయణ..



మనిషికి పని జీవనాధారం. పని కేవలం జానెడు పొట్ట నింపుకోవడానికి మాత్రమే కాదు. తెలివికి, సృజనకు అది పట్టం కడుతుంది. పని ద్వారా పొందే ఫలితం మానవుడికి గొప్ప సంతృప్తినిస్తుంది. లోకంలో పనిని ఎంతగానో ప్రేమించేవారు ఉంటారు. సృష్టిలో ఏ పనైనా ముఖ్యమైనదే. పనిలో చిన్నది, పెద్దది అన్న తారతమ్యం ఉండదు. వివిధ రంగాల్లో మానవ కార్యనిర్వహణ జగతిని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. లోక కల్యాణ కారకమవుతుంది.


మనిషి కాయకష్టం చేయడానికి కావాల్సిన శక్తిని ఆహారంతో అందించే రైతు ప్రపంచంలో ప్రథమపూజ్యుడు. మరణపు అంచులకు చేరుకున్న వ్యక్తిని పునర్జీవింపజేసే వైద్యుడు నరలోక నారాయణుడు. సరిహద్దు రేఖ దాటకుండా శత్రువులను కట్టడి చేస్తూ, ఆ క్రమంలో పాణత్యాగానికైనా సిద్ధపడే సైనికుడు ప్రాతఃస్మరణీయుడు.


ఏ పనికైనా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు నాంది పలుకుతాయి. పనిపట్ల చూపే శ్రద్ధ జీవికి జీవితాన్నిస్తుంది. కార్యదక్షత మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలంటారు అనుభవజ్ఞులు. విద్య ఏర్పరచే పనిబాట సర్వత్రా గౌరవనీయం, పూజనీయం అవుతుంది...

దేవాలయాలు - పూజలు 9*

 *దేవాలయాలు - పూజలు 9*


సభ్యులకు నమస్కారములు.


గత వ్యాసాలలో తెలుసుకున్నట్లుగా ఇష్ట దేవతలను దర్శించుకోవడానికి, పూజలలో, భజనలలో పాల్గొనడానికి మరియు జీవిత గమనంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులను స్వామి వారికి/అమ్మవారికి నివేదించుటకు, గతంలో మ్రొక్కుకున్న మ్రొక్కులను తీర్చుకొనుటకు దేవాలయాలకు వెళ్ళడం హైందవ ధర్మము, సంస్కృతి మరియు సంప్రదాయము. *పూజలు, ప్రార్థనలు శ్రద్ధ మరియు భక్తి సమన్వితంగా చేయాలి*. 


*జ్ఞాత్వా కర్మాణి కుర్వీత*.

అర్థం తెలుసుకుని కార్యక్రమాలు చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది.

నిష్టా గరిష్ట పూజలవలన మనలో (అర్చకులు మరియు భక్తులు) ఉన్న అనుశాసన బద్ధమైన స్థూల క్రియా కలాపాల ద్వారా

 *అంతరంగ సూక్ష్మ శక్తులు జాగృతమవుతాయి*. అందువలన మానవీయ అంతఃకరణలో సత్ప్రవర్తనలు, సద్భావనలు, సుసంస్కార జాగరణ, వికాసన అన్ని సంభవిస్తాయి. *కాబట్టి నిర్దేశించబడిన పూజా ప్రక్రియను తేలికగా తీసుకోరాదు, ఉపేక్షించరాదు*. 


దేవాలయాలలో గాని గృహాలలో గాని *పూజాదికాలను బొమ్మలాటగా, కాలక్షేపపు తంతుగా నిర్వహించి, శుభాలను, పుణ్యాలను సులువుగా పొందుదాం అన్న భావన వద్దు.*


 ఆ ఆలోచన రానీయవద్దు. భగవంతుడు లేనిదెక్కడ భగవంతుడు సర్వాంతర్యామి. మనలోనూ ఉన్నాడు. అతనికి తెలుసు మనం ఎంత శ్రద్ధగా, దీక్షగా ఉన్నామో. అంతరాత్మను మభ్యపెట్టలేము గదా!. పూజలు, భజనలు ప్రదర్శనల కొరకు, అట్టహాసాల కొరకు చేయరాదు. 

*నలుగురిని ఆకర్షించుటకు చేయరాదు*.


దేవాలయాలలో అర్చక స్వాములు నిర్వహించే పూజలలో అనేక సంప్రదాయాలు కలవు. పూజా సమయాలు వివిధ ప్రాంతాలలో, అక్కడి సామాజిక, భౌగోళిక పరిస్థితి, మార్పులు బట్టి వివిధంగా ఉంటాయి. సాధారణంగా దేవాలయాలలో పూజలు ప్రాతః సంధ్య మరియు సాయం సంధ్యలలో నిర్వహింపబడుతాయి. అర్చక స్వాములు దేవాలయ ద్వార ప్రవేశ తదుపరి గర్భాలయ శుద్ధితో ప్రారంభమై దిగువ పేర్కొనబడిన *షోడశోపచారాల* సుసంపన్న పూజా విధానము ఉంటుంది.

1) ఆవాహన

 2)ఆసనం

 3) పాద్యం

 4)అర్ఘ్యం 

5) ఆచమనం

 6) స్నానం

 7) వస్త్రం

(పుండ్ర ధారణ- బొట్టు)

 8) ఉపవీతం

 (యజ్ఞోపవీతం లేదా మంగళ సూత్రం) 

9) అనులేపన/గంధం

 10) పుష్పం 

11) ధూపం

 12) దీపం/ జ్యోతి 

13) నైవేద్యం 

14) తాంబూలం 

15) నీరాజనం.

16)మంత్రపుష్పం 

అపరాధ క్షమాప్రార్థన....

(ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు)


సంప్రదాయ పదహారు (16) పూజలను సంస్కృతంలో షోడశోపచారాలు అని పిలుస్తారు. *షోడశ* అంటే పదహారు, ఉపచారాలు అంటే సేవలు.


శాస్త్రాలలో పూజా సమయాలు గూడా నిర్దేశింపబడినవి. 

1) *ఉదయము* 

5-30 నుండి 11.00 ల లోపు పూజల వలన అనుకున్న పనులు నెరవేరుతాయి.

2) *మధ్యాహ్నము* 11.00 నుండి 2.00 ల వరకు జీవితంలోని ఒడి దుడుకులు సవరింపబడుతాయి.

3) *సాయంత్రము* 6.00 ల నుండి 9.00 వరకు ఆరోగ్య ప్రాప్తి, అనారోగ్య హరణ.

4) రాత్రి 9.00 నుండి 

మధ్యరాత్రి కాలంలో పూజలు అనర్థదాయకము మరియు హితవు కాదు.

(శివరాత్రి ఉత్సవం తప్ప)


ధన్యవాదములు.

*(సశేషం)*

భోజనం చెయ్యడం

 

  *భోజనం చెయ్యడం… ఒక శాస్త్రం !*

                ➖➖➖✍️


```          

గత పదిహేనేళ్లుగా జరుగుతున్న పెళ్లిళ్లు చూడండి...


పేరుకు పెళ్లే కానీ వేదిక మీద ఏమి జరుగుతుందో మనకు కనిపించదు ! 


వారికి నలువైపులా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చుట్టుముట్టి ఉంటారు.  


మంగళ వాయిద్యాలను బట్టి తాళికట్టే శుభవేళ అయిందని అర్ధం చేసుకోవడమే !


ఆ తరువాత వీలయితే స్టేజ్ ఎక్కి వధూవరుల మీద నాలుగు అక్షింతలు విసిరివెయ్యడం... తదుపరి పెళ్లిపెద్దలు చెప్పినా చెప్పకపోయినా భోజనశాలలోకి దూరడం, బరువైన పింగాణీ ప్లేటును పట్టుకుని యాచకుల్లా వరుసలో నిలబడటం, కావలసిన పదార్ధాలు వడ్డించుకోవడం, చెమటలు కక్కుకుంటూ నిలబడి తినడం, ఎక్కడో దూరాన ఉన్న మంచినీళ్ళకోసం పరుగెత్తడం సర్వసాధారణం.  


అతిధులు ఎవరు వస్తున్నారో, ఎవరు తింటున్నారో ఎవ్వరూ గమనించరు.  


తోసుకుంటూ వెళ్లడం, ఒక్కోసారి బట్టల మీద ఆహారపదార్ధాలు ఒలకడం కూడా చాలామందికి అనుభవమే.  


మనల్ని పెళ్ళికి పిలిచిన కుటుంబం వారు అక్కడ ఒక్కరు కూడా ఉండరు.  


అతిధుల్లో తొంభైతొమ్మిది శాతం మంది మనకు పరిచయం ఉండరు.   


కొంతమంది విలువైన ఆహార పదార్ధాలను ఎంత తిన్నారో అంతకు రెట్టింపు పారేస్తారు.  


ఎవరు ప్లేటును చెత్తబుట్టలో వేస్తున్నప్పుడైనా చూడండి... దానిలో మరో మనిషికి సరిపోయే పదార్ధాలు ఉంటాయి. 


మా చిన్నతనంలో.. అనగా సుమారు ముప్ఫయి అయిదు - నలభై ఏళ్ళక్రితం ఇలా ఉండేది కాదు!


పెళ్లిళ్లకు వెళ్తే భోజనాలు నేలమీదనే. కూర్చోడానికి పంక్తిచాపలు ఏర్పాటు చేసేవారు. అందరూ వరుసలో చిరుచాపల మీద కూర్చున్న తరువాత అరిటాకులు లేదా మద్ది ఆకులతో కుట్టిన విస్తర్లు వేసేవారు. ఆ తరువాత ముందుగా పచ్చడి, పప్పు, కూరలు, లడ్డు లేదా బాదుషా, అరటికాయ బజ్జీలు, కమ్మని పొడి, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు వడ్డించేవారు. ఆ తరువాత పులుసు, సగ్గుబియ్యం పాయసాన్ని అభికరించేవారు. అభికరించడం అంటే గరిటెతో పులుసు, పాయసాన్ని విస్తరిలో ఒక చుక్క పడేట్లుగా అంటించేవారు. అనగా ఆ విందులో ఆ రెండు పదార్ధాలు కూడా ఉన్నాయని అర్ధం! ఆ తరువాత నెయ్యి కొమ్ముచెంబులతో పోసేవారు. (వేసేవారు కాదు).


అప్పుడు అక్కడున్న ఒక పెద్దాయన ఔపోసన పట్టి "ఇక కానివ్వండి" అనగానే అందరూ భోజనాలకు ఉపక్రమించేవారు.  


ముద్ద నోటిలో పెట్టుకునే ముందు చాలామంది కళ్ళకు అద్దుకునేవారు. 


ఇక వడ్డించే వారు (యువతీయువకులు) యమా హుషారుగా పోటీలు పడి పదార్ధాలను మళ్ళీ మళ్ళీ తెస్తూ "ఇంకొంచెం వేసుకో మామా... ఈ కూర కాస్తేసుకో బాబాయి.. బావా...ఈ గుత్తి వంకాయ వేసుకుంటే ఇక ఇక్కడినుంచి కదలవు" అని చిన్నా పెద్దా తేడా లేకుండా సరదాగా ఆటలు పట్టిస్తూ వడ్డనలు చేసేవారు.  


వీరు వడ్డనలు చేస్తుంటే పెళ్లి పెద్ద.. అతిధులమధ్య తిరుగుతూ... ఎలా ఉన్నాయి వంటలు ? అని ప్రశ్నిస్తూ కుశలప్రశ్నలు వేస్తూ "వడియాలు కాసిని తెండ్రా... అదిగో పెదనాన్నకు రెండు అప్పడాలు వేయి.. తాతకు నెయ్యి ఇంకొంచెం పొయ్యారా" అంటూ ఆప్యాయతను వడ్డించేవాడు కుటుంబ పెద్ద.  


అక్కడ మనతో భోజనం చేసేవారంతా మన బంధువర్గంలోనివారే అయ్యుంటారు.  

  

90 శాతం మంది భోజనాలు ముగించాక....ఇంకా ఎవరైనా భోజనం చేస్తూ కనిపిస్తే...అతిధులు కొందరు పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం, చింతామణి నాటకాలలోని పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా ఆలపించేవారు. అయిదారు పద్యాలు అయ్యాక అంతలో ఒకాయన "భోజనకాలే హరినామస్మరణ... గోవిందా గోవిందా" అనేవాడు. అప్పుడు మాత్రమే అందరూ లేచేవారు.   


మనం కూర్చున్న వరుసలో ఇంకా ఎవరైనా పెరుగన్నంలోనే ఉంటే వారు పూర్తిగా భుజించాకే లేచేవారు.  


భోజనాలు చేసిన తరువాత వారు తిన్న విస్తళ్ళన్నీ కడిగారా అన్నట్లుగా శుభ్రంగా ఉండేవి. ఒక్క మెతుకు కూడా కనిపించేది కాదు.  


చేతులు కడుక్కోగానే అక్కడే ఏర్పాటు చేసిన నులకమంచాల మీద కూర్చుని పళ్ళాలలో సిద్ధంగా ఉంచిన తమలపాకులు, వక్కపొడి, సున్నం ఎవరికి కావలసిన మోతాదులో వారు తీసుకుని మళ్ళీ పెళ్లిపనులలో మునిగిపోయేవారు.  


ఈ భోజనం చెయ్యడం అనే మహత్తర కళ అతి కొద్దిమందికే తెలుసు. కొందరు తింటుంటే చూడముచ్చటగా ఉంటుంది. సున్నితంగా మునివేళ్లతో కలిపి తింటారు. కొందరు చపాతీ పిండిని పిసికినట్లు చెయ్యి మొత్తం ముంచి కసకసా అన్నం మీద కక్ష కట్టినట్లుగా పిసుకుతారు. చేతివేళ్ళమధ్యలోని అన్నం బయటకి వస్తుంది. చూస్తుంటే కంపరం కలుగుతుంది. కొంతమంది తిన్న తరువాత విస్తరి ఎలా ఉంటుందంటే... అది కొత్త విస్తరి అంటే నమ్మాలి. ఒక్క మెతుకు కనిపించదు. పదార్ధాల తాలూకు అవశేషం కూడా కనిపించదు. అలా ఎలా తింటారో నాకు ఆశ్చర్యం కలుగుతుంది.  


మరికొందరు తిన్న తరువాత విస్తరి చూస్తే ఆ అన్నాన్ని మనుషులు తిన్నారా లేక ఎలుకలు తిన్నాయా అన్నట్లు చిందరవందరగా, విస్తరిని ఎత్తేసేవారికి కూడా అసహ్యం కలుగుతుంది.  


కొందరు భోజనం చేస్తున్నప్పుడు గ్లాసులు గ్లాసులు నీళ్లు తాగుతుంటారు.  


కొంతమంది పెరుగన్నం తిన్నదాకా గ్లాస్ ముట్టుకోరు. నిజానికి భోజనం చేసే మధ్యలో మంచినీరు తాగకూడదు. కొందరు వడ్డించిన పదార్ధాలన్నీ భుజిస్తారు.  


కొందరు అన్నీ వేయించుకుంటారు.

సగం కూడా తినకుండా వ్యర్ధంగా వదిలేస్తారు.  


భోజనం చేసే పద్ధతిని బట్టి కూడా వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వెయ్యవచ్చు.  


కావలసిన పదార్ధాలను మాత్రమే వడ్డించుకుని, శుభ్రంగా తినేవారు జీవితంలో పొదుపరులు అని, అవసరం లేనివాటిని కూడా వడ్డించుకుని మొత్తం అవతలపారేసేవారు అతిపెద్ద దుబారా మనుషులుగా అంచనా వెయ్యవచ్చు అంటారు పెద్దలు.  


భోజనం చేయడము ఒక పెద్ద శాస్త్రం. ఎప్పుడైతే… బఫె సిస్టం వచ్చిందో... అప్పటినుంచి పెళ్ళిభోజనం అనే మాటకు విలువ లేకుండా పోయింది. అలనాటి మధుర దృశ్యాలు మాయమై పోయాయి.  


ఒకప్పటి పెళ్ళిభోజనం అంటే షడ్రసోపేతమైన విందు. పదార్ధాలు నాలుగైదే ఉన్నా అది కడుపుకు మహాపసందు. కడుపారా తిని త్రేన్చుతాము.  


ఇప్పటి పెళ్ళిభోజనం అంటే మొక్కుబడి. వందల రకాల పదార్ధాలు కనిపిస్తుంటాయి. నాలుగు రకాలు కూడా తినలేము. మనల్ని తినమని అడిగేవారే ఉండరు. భోజనం చేశారా అని అడిగే దిక్కు ఉండదు...


సంఖ్య ఎక్కువ అయింది.. నిజమే. కూచోబెట్టి పెట్టే అవకాశం లేదు. వచ్చిన వాళ్లకు అంత టైమూ లేదు.. 


కానీ ఏదో ఒకటి చేయాలి. పెళ్లి మన పద్ధతుల్లో కేవలం బంధువులతో... 


ఆపై అందరికీ ఇదుగో ఈ పైన చెప్పుకున్నట్లుగా బావుంటుందేమో. ✍️```          

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

  *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

సాక్షులుంటారు

 💝 *పద్దెనిమిది మంది సాక్షులుంటారు మనం చేసే ప్రతీ పనికీ. బహుపరాక్.*

❤️ *చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత .*

💕 *కానీ .....*

💓 *’నేను ఒక్కడినే కదా ఉన్నాను,*

*నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .*

💝 *మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి ముగాసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి .*

💖 *అవి:~నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి.*

💞 *వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి.*

💓 *ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును. కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .*

❤️ *దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .*

🛑 *ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .*

💞 *అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .*

💕 *ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .*

💝 *అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .*

💖 *ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.*

 💞 *అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు.*

❤️ *అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .*

💖 *కానీ ఆవేశం, కోపం,క్షణికావేశం తో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .*

💓 *ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం.*

💞 *కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలగడమే వివేకం*

 💖 *నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం.*

💞 *అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే…ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం.*

💝 *ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .*

❤️ *ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటివారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు దగ్గరవుతాడు.*


          💐హర హర మహాదేవ శంభో శంకర 💐

గురుర్గురుతమః

 👆శ్లోకం 

గురు ర్గురుతమో ధామః                                          సత్యస్సత్య పరాక్రమః|                         

నిమిషో నిమిష స్స్రగ్వీ                                            

 వాచస్పతి రుదారధీః||          


ప్రతిపదార్ధ: 


 గురుర్గురుతమః - గురువులకు గురువు; గురువులందు సర్వశ్రేష్ఠుడు;

గురుః -సర్వ విద్యలూ నేర్పు భగవానుడు;

గురుతమః -ఆచార్యులకు పరమాచార్యుడు. (శంకరాచార్యులు 'గురుః', 'గురుతమః' అను రెండు నామములుగా పరిగణించిరి. పరాశర భట్టు 'గురుతమ గురువు' అనే ఒకేనామముగా పరిగణించిరి.

ధామ -పరమపదము, అత్యుత్తమ నివాస స్థానము; సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము; ప్రళయమున చరాచరాధార భూతుడు; మార్గదర్శి; పరంజ్యోతి, దివ్య ప్రకాశము; సకల కామితార్ధములకును నిలయము.

సత్యః -మంచి చేయునది; మేలు చేయువాడు.సత్యస్వరూపుడు.

సత్యపరాక్రమః -నిజమైన, అనన్యమైన, తిరుగులేని పరాక్రమము కలవాడు; సత్ప్రవర్తనకు అండగా నిలుచు పరాక్రమము గలవాడు.

నిమిషః -యోగనిద్రలో నున్నవాడు; తన భక్తుల శత్రువులపై కటాక్షవీక్షణలు పడనీయనివాడు (భక్తుల శతృవులయందు దయచూపనివాడు)

అనిమిషః -ఎల్లపుడు కనులు తెరచియుండువాడు; భక్తుల రక్షణలో సదా మెలకువగా నుండువాడు.

స్రగ్వీ -వైజయంతీ మాలను ధరించినవాడు; సూర్య చంద్రాది సమస్తలోకమును మాలగా ధరించినవాడు.

వాచస్పతిః -వాక్కునకు ప్రభువు; గురువులకు గురువు, విద్యలకు విద్య; వేదములకు మూలము.

ఉదారధీః -ఉదారమగు (కరుణాపూరితమగు) బుద్ధి (గుణము) కలిగినవాడు.

వాచస్పతి ఉదారధీః --- పరమశ్రేష్టమగు దివ్యజ్ఞానము. (శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించారు.)

తరువాత తెలిసింది

 బడికి వెళ్లడం మొదలయ్యాక తెలిసింది

     ....... ఆట విలువ....

కాలేజీలో చేరిన తరువాత తెలిసింది..

      ........ స్కూలు విలువ....

ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తెలిసింది

        ........ చదువు విలువ.....

పదవి విరమణ చేశాక తెలిపింది

         ....... ఉద్యోగం విలువ....

మరణానికి దగ్గర అవుతున్నప్పుడు తెలిసింది

         ........ జీవితం విలువ....

ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడు తెలియదు

         ....... దాని అసలు విలువ....🙏Good Morning 🙏శుభోదయం

ఆగష్టు,13, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

     🍁 *మంగళవారం*🍁

  🌹 *ఆగష్టు,13, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*               


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి : అష్టమి* ఉ 09.31 వరకు ఉపరి *నవమి*

వారం :*మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : విశాఖ* ఉ 10.44 వరకు ఉపరి *అనూరాధ*


*యోగం : బ్రహ్మ* సా 04.34 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం : బవ* ఉ 09.31 *బాలువ* రా 10.03 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 11.30 మ 02.00 - 03.00*

అమృత కాలం :* రా 01.10 - 02.52*

అభిజిత్ కాలం :*ప 11.47 - 12.38*


*వర్జ్యం : మ 02.59 - 04.41*

*దుర్ముహుర్తం : ఉ 08.23 - 09.14 రా 11.04 - 11.50*

*రాహు కాలం :మ 03.23 - 04.58*

గుళిక కాలం :*మ 12.12 - 01.47*

యమ గండం : ఉ 09.02 - 10.37

సూర్యరాశి : *కర్కాటకం*

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.51*

సూర్యాస్తమయం :*సా 06.33*

*ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.51 - 08.23*

సంగవ కాలం :*08.23 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.28*

అపరాహ్న కాలం :*మ 01.28 - 04.01*

*ఆబ్ధికం తిధి : శ్రావణ శుద్ధ నవమి*

సాయంకాలం :*సా 04.01 - 06.33*

ప్రదోష కాలం :*సా 06.33 - 08.49*

నిశీధి కాలం :*రా 11.50 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.06*

______________________________

           🌹 *ప్రతినిత్యం*🌹

*_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


  *🚩శ్రీ  మారుతి స్తోత్రం*🚩

"ఓం నమో వాయ పుత్రాయ భీమ రూపాయ ధీమతే!

నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే!

మోహ శోక వినాశాయ సీతాశోక వినాశినే!

భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే!       

గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ!

వనౌకసాం వరిష్టాయ వశినే వనవాసినే!

తత్త్వ జ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే!

ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ తే!

జన్మ మృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయ చ!

నేదిష్టాయ భూత ప్రేత పిశాచ భయ హారిణే!

యాతనా నాశనాయాస్తు నమో మర్కట రూపిణే!

యక్ష రాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహృతే!

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రతే!

హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే!బలినా మగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే!

లాభదోసి త్వమే వాసు హనుమన్ రాక్షసాంతక!

యశో జయం చ మే దేహి శతౄన్ నాశయ నాశయ!స్వాశ్రితానా మభయదం య ఏవం స్తౌతి మారుతిం!

హా నిః కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్!! 


           🍁 *ఓం శ్రీ*🍁

 🌹 *ఆంజనేయాయ నమః* 🌹

🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

_ఆగష్టు 13, 2024_*

 🌹 ॐశుభోదయం ॐ 🌹  

*ఓం శ్రీ గురుభ్యోనమః* 

   *_ఆగష్టు 13, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*శ్రావణ మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *నవమి*

మర్నాడు తె5.35

వారం: *భౌమవాసరే*

(మంగళవారం)

నక్షత్రం: *విశాఖ* ఉ7.30

యోగం: *బ్రహ్మం* మ2.30

కరణం: *బాలువ* సా5.13

&

*కౌలువ* తె5.35

వర్జ్యం: *ఉ11.45-1.26.*

దుర్ముహూర్తము: *ఉ8.16-9.07*

&

*రా10.56-11.41.*

అమృతకాలం: *రా9.55-11.37.*

రాహుకాలం: *మ3.00-4.30*

యమగండం: *ఉ9.00-10.30.*

సూర్యరాశి: *కర్కాటకం*

చంద్రరాశి: *వృశ్చికం*

సూర్యోదయం: *5.45*

సూర్యాస్తమయం: *6.24*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷

మత్స్యావతార చరితము

 మత్స్యావతార చరితము


విభుడీశ్వరుండైన విష్ణుదేవుండు 

వేద భూసుర సుర విమలసాధువుల 

ధర్మార్థ గోవుల ధరయందు గావ 

ఘనరూపములయందు , గాలిచందమున,

తనురూపములయందు, తగిలితానుండు.

ఎక్కువతక్కువ నెన్నడొందకను 

నిర్గుణత్వంబున నెఱయు ఘనుండు, 

గురుతయు దొరతయు గుణముల నొందు .

అట్టి యాపరమాత్మ యవనిని బ్రోవ 

మనుజేశ ! చోద్యమే మత్స్యంబు నగుట !

విష్ణుని మహిమలు విభవోన్నతములు 

వినుము దెల్పెదనీకు వివరంబుగాను.

ఆలకింపు మికను నానందముగను "


బాదరాయుణుడిట్లు పలికియు న్నంత

మత్స్యావతారపు మాహాత్మ్య మంత

వీనులవిందుగా వివరించె నిటుల


     ----- మత్స్యావతారము -----


గతమందు జరిగిన కల్పాంతవేళ 

ధరయందు వెల్గొందు ద్రవిడదేశమును 

సత్యవ్రతుండను సత్త్వశోభితుడు 

పరిపాలనముజేసె ప్రజమోద మంద 


✍️గోపాలుని మధుసూదనరావు