10, అక్టోబర్ 2021, ఆదివారం

జవాబులతోపాటుగా

 ఆసక్తితో జవాబులను ప్రయత్నించాలి అని అనుకన్నా యితర గృహ సమస్యలతో వీటిపై సమయాన్ని కేటాయించలేకపోయిన సభ్యబృందానికి, పై ప్రశ్నల జవాబులను వాటి వివరణలతో సహా పొందుపరచడమైనది. గమనించగలరు. 


జవాబులతోపాటుగా వివరణలు చదువాలని మనవి.


రావణుడిని చంపాలనుకొన్న శూర్పనఖ కుమారుడెవరు ?

_________________________


(1) కడుపులో అమృతభాండం కలవాడెవరు ?


(అ) విష్ణువు

(ఆ) వశిష్టుడు

(ఇ) రావణుడు✅

(ఈ) నలకుబరుడు


రావణవధ జరగాలంటే అతని కుక్షిలోవున్న అమృతకలశాన్ని చేధించాలనే విభీషనుడి సలహతో శ్రీరాముడు బాణంసంధించి రావణుడి నాభిలోని అమృతభాండాన్ని శిథిలం చేయడంతో రావణవధ జరిగిపోయిందని మనం చిత్రసీమలో చూశాం.నిజానికి ఈ ఘట్టం మూలకథలో లేదు. తరువాత జరిగిన మార్పులలో చోటుచేసుకొంది.శ్రీరామాంజనేయయుద్ధం, శ్రీకృష్ణార్జునయుద్ధం (గయోపాఖ్యానం) పురాణపురుషులు శాకాహారులని చెప్పడం ఇలాంటిదే.అయితే ప్రతి మార్పు మంచిసందేశాన్ని లోకానికి అందించాయి.


(2) శ్రీరాముడి సోదరి పేరేమిటి ?


(అ) దశరథి

(ఆ) శాంత✅

(ఇ) సుకన్య

(ఈ) రూప


వివరణ: - అయోధ్యరాజు దశరథుడు, అంగరాజు ఇద్దరూ రోమపాదుడు బాల్యమిత్రులు. రోమపాదుని భార్య వర్షిణి. ఈమె కౌసల్యకు సోదరి.దశరథకౌసల్యల తనయ శాంత. పిల్లలులేని రోమపాదునికి శాంతను దశరథుడు దత్తత ఇవ్వడం జరిగింది.


(3) "లక్షణ" దుర్యోధనుని కూతురు.లక్షణను పెండ్లాడిన శ్రీకృష్ణుని కొడుకెవరు ?


(అ) సాంబుడు✅

(ఆ) ప్రద్యుమ్నుడు

(ఇ) సుధేష్ణుడు

(ఈ) చారుచంద్రుడు


వివరణ : - శ్రీకృష్ణజాంబవతుల కొడుకే సాంబుడు.దుర్యోధనుడు తనకూతురైన లక్షణ వివాహాం చేయాలని స్వయంవరం ప్రకటించగా, సాంబుడు లక్షణను ఎత్తుకుపోతాడు.సాంబుని కౌరవులు అడ్డగించి సాంబుని బంధిస్తారు.దీంతో కోపించిన బలరాముడు హస్తినకు వస్తాడు. దుర్యోధనుడు గురువైన బలరాముడిని ఆహ్వానించి మర్యాద చేస్తాడు. బలరాముని సూచనతో సాంబలక్షణల వివాహన్ని దుర్యోధనుడు జరిపిస్తాడు.యాదవ వంశ వినాశనానికి సాంబుడే కారణం.


(4) గంధమాదనపర్వతం ఎక్కడుండేది ?


(అ) కిష్కింధ

(ఆ) దండకారణ్యం

(ఇ) నేటి గోండ్వానాప్రాంతం✅

(ఈ) శ్రీలంక


(5) కాశీవిశ్వేశ్వరుని సతి పేరేమిటి ?


(అ) అపర్ణ

(ఆ) మీనాక్షి

(ఇ) కాత్యాయని

(ఈ) అన్నపూర్ణ✅


వివరణ : - కాశీఅన్నపూర్ణ దేవికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. హిందూగ్రంథాల ప్రకారం ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతోసహా అన్నీమాయేనని అంటాడు. భక్తుల ఆకలినితీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలునచ్చక కాశీవిడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది. దాంతో ఆహారందొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది. ప్రజల కష్టాలనుచూడలేని అమ్మవారు తిరిగివచ్చి అందరి ఆకలినితీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తనమాటలను వెనక్కి తీసుకుని భిక్షపాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారాన్నిఅడిగినట్లు చెబుతారు. అప్పటినుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్మకం.


(6) ఇంద్రుడి ఉద్యానవనం పేరేమిటి ?


(అ) ఇంద్రవనం

(ఆ) బృందావనం

(ఇ) నందనవనం✅

(ఈ) పారిజాతవనం


(7) కాశీలో ఒకతను హరిశ్చంద్రమహరాజును దాసునిగా పొందాడు. ఎవరతను ?


(అ) కాలకౌశికుడు

(ఆ) వీరదాసుడు

(ఇ) కాలకౌక్షేయుడు

(ఈ) వీరబాహువు✅


వివరణ :- విశ్వామిత్రుని కోరికపై యమధర్మరాజే వీరబాహువుగా అవతరించి, హరిశ్చంద్రమహరాజును దాసునిగా కొన్నాడు.


(8) శ్రీకృష్ణుడు చంపిన కువలయాపీడము ఏమిటి ?


(అ) బకం

(అ) రాక్షసి

(ఇ) సర్పం

(ఈ) ఏనుగు✅


వివరణ : - కంసుని దగ్గరున్న మధించిన ఏనుగుపేరు కువలయపీడం. ఎంతటి బలశాలినైనా చంపగలశక్తి దీనికుంది. మధురానగరంలో శ్రీకృష్ణ బలరాములు విహరిస్తున్నపుడు వారిని చంపాలనే ఉద్దేశ్యంతో కంసుని ఆనతితో మావటి ఆ కువలయాపీడాన్ని వారి పైకి ఉసిగొల్పాడు. కాని శ్రీకృష్ణుని చేతిలో చచ్చింది.


(9) ద్రౌపతి వస్త్రాపహరణం ధర్మసమ్మతం కాదని వాదించిన దుర్యోధనుడి తమ్ముడెవరు ?


(అ) వికర్ణుడు✅

(ఆ) దుశ్చలుడు

(ఇ) విరోచనుడు

(ఈ) వికర్ణకుడు


వివరణ: - వికర్ణుడు దుర్యోధనునికి రెండవతమ్ముడు, అంటే కౌరవులలో మూడవవాడు. నిండుసభలో ద్రౌపదిమానభంగం తప్పని వాదించినవాడు ఇతనే.మహభారతయుద్ధంలో కౌరవనాశనం తప్పదని ఇతనికి తెలుసు. అయినా రక్తబంధానికి కట్టుబడి భీమునిచేతిలో పదనాల్గవరోజున మరణించాడు. వికర్ణుని చంపినందుకు భీముడు ఎంతగానో దు:ఖించాడు.


(10) రావణుడిని చంపాలని తపస్సు చేసిన రావణుడి మేనల్లుడు (శూర్పనఖ కొడుకు) ఎవరు ?


(అ) ఘంటాకర్ణుడు

(ఆ) జంబుమాలి

(ఇ) జంబుకుమారుడు✅

(ఈ) జంబుకేయుడు


వివరణ : - విద్యుజిహ్వుడు కాలకేయవంశానికి చెందినవాడు.ఇతని భార్య రావణసోదరి శూర్పనఖ. కాలకేయులతో జరిగిన యుద్ధంలో రావణునిచేత పొరబాటున విద్యుజిహ్వుడు మరణించాడు. అప్పుడు శూర్పనఖ ఆరునెలల గర్భిణి. శూర్పనఖ తనకు జరిగిన పతీవియోగం గురించి రావణుడిదగ్గర వాపోగా, రావణుడు మారీచసుబాహువులను తోడుగా ఇచ్చి, దండకారణ్యంలో హాయిగా బ్రతకమని చెప్పాడు. శూర్పనఖకు జన్మించినవాడే జంబుకుమారుడు. యుక్తవయస్కుడైన జంబూకుమారుడు తన మేనమామే తండ్రి మరణానికి కారణమని తెలుసుకొని, రావణసంహారానికి శక్తి కావాలని పంచవటిలో తపస్సు వెళ్ళాడు. అప్పటికే పంచవటిలో శ్రీరాముడు సీత, లక్ష్మణులతోవున్నాడు.ఒకరోజు దర్భలకోసం లక్ష్మణుడు ఆ అడవిలో బాగా గుబురుగా పెరిగిన కత్తితో నరుకుతాడు. ఆ పొదలలో తపంలోవున్న జంబూకుమారిడి తల తెగిపడుతుంది.అంతటి జంబూకుమారుడి జీవితం ముగుస్తుంది.

___________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

సంస్కృత మహాభాగవతం

 *10.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*


*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*13.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*గుణేష్వావిశతే చేతో గుణాశ్చేతసి చ ప్రజాః|*


*జీవస్య దేహ ఉభయం గుణాశ్చేతో మదాత్మనః॥12711॥*


నాయనలారా! వాస్తవముగా జీవుడు నా స్వరూపమే. కాని అభినివేశకారణముగా చిత్తము గుణములయందు (విషయములయందు) ప్రవేశించును. సర్వదా వాటిని చింతించుటవలన గుణములు ఆ చిత్తమునందు లోతుగా పాదుకొనును. ఈ విధముగా గుణములు, చిత్తము, ఈ రెండును జీవుని దేహమునకు (ఉపాధికి) సంబంధించినవి.


*13.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*గుణేషు చావిశచ్చిత్తమభీక్ష్ణం గుణసేవయా|*


*గుణాశ్చ చిత్తప్రభవా మద్రూప ఉభయం త్యజేత్॥12712॥*


కావున ఆత్మకు చిత్తముతోగానీ, విషయములతోగానీ ఎట్టి సంబంధమూ లేదు. (గుణములచే నిర్మితమైనది స్థూలశరీరము. చిత్తము వలన ఏర్పడినది సూక్ష్మశరీరము. అనాత్మ పదార్థముల అభినివేశకారణముగా జీవుడు కర్మలయందు చిక్కుకొనును. వాసనామయ శరీరమునుగూడ నిర్మించుకొనును. వీటి అన్నింటికిని అజ్ఞానమే కారణము). విషయములను పదేపదే అనుభవించు చుండుటవలన చిత్తము ఆ విషయములయందు చొచ్చుకొనిపోవును. చిత్తముయొక్క సంకల్పవికల్పముల వలననే ఈ విషయములు ఉత్పన్నములగును. సాధకుడు తన చిత్తమును పెడదారి పట్టకుండగను, విషయముల చింతన చేయకుండగను నిరోధింపవలెను. నిరంతరము నాయందే చిత్తమును నిలిపి ఉంచవలెను. గుణములను నా స్వరూపముగా భావించి నా యందే అర్పించవలయును. ఈ విధముగా రెండింటీని నా యందే త్యజింపవలెను.


*13.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*జాగ్రత్స్వప్నః సుషుప్తం చ గుణతో బుద్ధివృత్తయః|*


*తాసాం విలక్షణో జీవః సాక్షిత్వేన వినిశ్చితః॥12713॥*


జాగ్రత్-స్వప్న-సుషుప్తి' అను మూడు అవస్థలును క్రమముగా సాత్త్విక, రాజస, తామస గుణములను అనుసరించుచుండెడి బుద్ధియొక్క వృత్తులు మాత్రమే. జీవుడు వీటి అన్నింటికి సాక్షిభూతుడు అనియు, ఈ మూడు ఆవస్థలకును అతీతుడు అనియును సిద్ధాంతరూపముగా ఆమోదింపబడినది.


*13.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*యర్హి సంసృతిబంధోఽయమాత్మనో గుణవృత్తిదః|*


*మయి తుర్యే స్థితో జహ్యాత్త్యాగస్తద్గుణచేతసామ్॥12714॥*


గుణముల వృత్తులయందు చిత్తము తిరుగాడుచున్నంతవరకు జీవునకు సంసారబంధము నివృత్తి కానేరదు. కావున, గుణములను, చిత్తమును ఈ రెండింటిని నాయందే త్యజించి, తురీయమగు నాయందు నిష్ఠుడై యుండవలెను.


*13.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*అహంకారకృతం బంధమాత్మనోఽర్థవిపర్యయమ్|*


*విద్వాన్ నిర్విద్య సంసారచింతాం తుర్యే స్థితస్త్యజేత్॥12715॥*


*నేను-నాది* అను అహంకారమే బంధములకు మూలము. అది జీవుని - పరమపురుషార్థములను దూరమొనర్చును. కావున విద్వాంసుడు (జ్ఞాని) తురీయావస్థయందు స్థితుడై బంధకారకమైన సంసారచింతను త్యజింపవలెను.


*13.30 (ముప్పదియవ శ్లోకము)*


*యావన్నానార్థధీః పుంసో న నివర్తేత యుక్తిభిః|*


*జాగర్త్యపి స్వపన్నజ్ఞః స్వప్నే జాగరణం యథా॥12716॥*


*దేహమే ఆత్మ* యని భావించెడి నానాత్వభ్రమ తొలగనంతవరకు, జీవుడు మేల్కొనియున్నను అజ్ఞానమనెడి నిద్రలో మునిగి యున్నవాడే అగును. అజ్ఞాని స్వప్నజగత్తులో సంభవించునట్టి సుఖదుఃఖములను సత్యములని భావించునట్లు, జాగ్రదవస్థయందుగూడ క్షణికములైన సాంసారిక సుఖ దుఃఖములు యదార్థములని భ్రమించుచుండును.


*13.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*అసత్త్వాదాత్మనోఽన్యేషాం భావానాం తత్కృతా భిదా|*


*గతయో హేతవశ్చాస్య మృషా స్వప్నదృశో యథా॥12717॥*


వాస్తవముగా ఆత్మకు దప్ప అన్యమైన దేహాది నామరూపాత్మకమైన ప్రపంచమునకు మరి దేనికిని *ఉనికి* లేదు. కావున స్వప్నావస్థలోనున్న వాని క్రియలన్నియును మిథ్యలైనట్లే, భేదబుద్ధి కారణముగా కలుగునట్టి వర్ణాశ్రమాది భేదములు, స్వర్గాది ఫలములు, వాటి కారణములగు కర్మలు ఇవన్నియును మిథ్యలే. ఆత్మజ్ఞానము కలిగినంతనే ఈ నానాత్వభ్రమ తొలగిపోవును.


*13.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యో జాగరే బహిరనుక్షణధర్మిణోఽర్థాన్ భుంక్తే సమస్తకరణైర్హృది తత్సదృక్షాన్|*


*స్వప్నే సుషుప్త ఉపసంహరతే స ఏకః స్మృత్యన్వయాత్త్రిగుణవృత్తిదృగింద్రియేశః॥12718॥*


జాగ్రదవస్థయందు సమస్త ఇంద్రియములద్వారా బాహ్యముగ గోచరించెడి క్షణభంగురములైన పదార్థములను అన్నింటిని అనుభవించువాడు (విశ్వుడు) స్వప్నావస్థలో హృదయమునందే, జాగ్రదావస్థలో చూచిన పదార్థములను పోలినవాటి వలనే వాసనామయ విషయములను అనుభవించును (తైజసుడు). ఇక సుషుప్తి అవస్థలో ఆ విషయములను అన్నింటినీ ఉపసంహరించుకొని వాటి లయమును కూడా అనుభవించును (ప్రాజ్ఞుడు). ఈ ముడింటిని అనుభవించినది ఒక్కడే. జాగ్రదవస్థయొక్క ఇంద్రియములకు, స్వప్నావస్థలోని మనస్సునకు, సుషుప్తియొక్క సంస్కరింపబడిన బుద్ధికి కూడా అతడే స్వామి. ఏలనన, త్రిగుణాత్మకములగు ఈ త్రివిధ అవస్థలకు అతడే సాక్షిగా ఉండును. స్వప్నము చూసిన నేనే, గాఢనిద్ర (సుషుప్తి) లో ఉన్నాను. ప్రస్తుతము మెలకువతో (జాగ్రదవస్థలో) ఉన్నది కూడా నేనే - అను ఇట్టి స్మృతి యొక్క బలమువలన ఒకేఒక ఆత్మ అవస్థలన్నింటిలోనూ ఉండునని స్పష్టముగ ఋజువగుచున్నది.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*445వ నామ మంత్రము* 10.10.2021


*ఓం మత్యై నమః*


అనంతకోటి జీవరాశులలో మతి (బుద్ధి) స్వరూపిణిగా ఉన్న పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మతిః* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం మత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి చక్కని బుద్ధిని (మతిని) కలుగజేసి, అనంతమైన బ్రహ్మజ్ఞానసంపదను సంప్రాప్తింపజేసికొను దిశగా వారి సాధనను కొనసాగునటులు అనుగ్రహించును.


*యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా|*


*నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ:॥*


'అనంతకోటి జీవరాశులలో బుద్ధిరూపములో విలసిల్లు పరమేశ్వరికి నమస్కరిస్తున్నాను' 


'వేదప్రమాణమునందు ఆసక్తిగలదియు, మంగళప్రదమైనదియు, శ్రేష్ఠమగు అనుభవరూపమగు ఏ మతి (బుద్ధి) గలదో అదియే శివా (పార్వతీ) స్వరూపురాలు. ఆమె కేశవుడు మొదలగువారిచే సేవింపబడుతున్నది. ఆమె అత్యంత కైవల్య సుఖమును కలిగించునది. అటువంటి దేవికి నమస్కరించుచున్నాను' అని సూతసంహితయందు గలదు.


 అనంతకోటి జీవరాశులలో ఆ పరమేశ్వరి బుద్ధిరూపంలో ఉన్నది గనుకనే కంటికి దృశ్యశక్తి, నాసికకు ఘ్రాణశక్తి, నాలుకకు రసశక్తి, చర్మానికి స్పర్శశక్తి, చెవులకు శ్రవణశక్తి - ఇలా ఆయా ఇంద్రియాలలో ఆయాశక్తుల రూపాలలో ఉంటూ ఇంద్రియములను పనిచేయిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన మనసునందు బుద్ధిరూపంలో ఉన్నప్పుడు ఆయా జీవుల కర్మవాసనలననుసరించి ప్రవర్తించుట జరుగుతుంది.


సాధకులు అంతర్ముఖంగా సాధనచేయునపుడు జీవాత్మ, పరమాత్మల ఐక్యత అను అద్వైతభావనాజ్ఞానము కలిగించి సాధనాపటుత్వము ద్వారా పరబ్రహ్మతత్త్వమును పొందు దిశగా సాధనకొనసాగింపజేయును గనుకనే పరమేశ్వరి *మతిః* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కలిసుందాం

 *కలిసుందాం..రా…!!!*

          

*మహా అయితే ఇంకో పదీ.. పదిహేను, ఇరవై... సంవత్సరాలు బ్రతుకుతాం.*


*కావున కుటుంబంలో ఎవరు తప్పుచేసినా క్షమిద్దాం, ఆనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!*


*పోయాక ఫోటోను ప్రేమించే కన్నా, ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న. బంధుత్వాలు తెంచుకోవడం నిముషం పడుతుంది. అదే నిలుపుకోవాలంటే?*


*తాము గడిపిన భయంకర అవస్థలు తమ పిల్లలకు రాకూడదని, తమ పిల్లలు కూడా నలుగురిలో ఉన్నతంగా బ్రతకాలనే తాపత్రయంతో కన్నవాళ్ళు తాము సామాన్య జీవితాన్ని గడుపుతూ ఆస్థులు కూడబెట్టి తమపిల్లలకు ఇస్తే, తమ తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే, కొందరు, తమ తల్లిదండ్రులు కాలం చేశాక, మరికొందరు వివిధ రకాల కారణాలతో రక్త సంబంధీకులందరూ ఒకరికొకరు శాశ్వతంగా దూరమవుతున్నారు.*


*బ్రతికి ఉండగా మాట్లాడుకోకుండా, కనీసం మొహాలుకూడా చూసుకోకుండా తమ జీవితాంతం వరకు ఒకరి నొకరు ద్వేషించుకుంటూ, ఆ ద్వేషాలు తమ వారసత్వంగా తమ పిల్లలకు కూడా బదిలీ చేస్తూ, తామూ అశాంతితో జీవిస్తూ తనవారిని కూడా అశాంతి పాలు చేస్తున్నారు.*


*ఎవరి కోసం..?*

*ఎందుకోసం..??*

*దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి..???*


*జీవితాంతం ఒకేరక్తం పంచుకున్న అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, అన్నాచెల్లెళ్ళు పరస్పరం అశాంతితో ద్వేషించుకుంటూ ఒకరినొకరు చూడకుండా జీవిస్తూ శాశ్వతంగా దూరమై, ఇంటిలోని ఆనందాన్ని పంచుకోకుండా, వివాహాలకు కూడా పిల్చుకోకుండా, హాజరుకాకుండా, చివరకు ఎవరో ఒకరు కాలం చేశాక తట్టుకోలేని శోకతప్తులై గుండెలు బాదుకొని కుమిలి కుమిలి ఏడిస్తే ఆ చనిపోయిన వారిని తిరిగి పొందగలమా? ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు.*


*కొంతమంది తమ తల్లిదండ్రులనుకూడా ఈ ఆస్థిపంపకాల విషయంలో అసంతృప్తితో దూరం చేసుకుంటున్నారు. అలా జరిగితే ఆ వయసులో కన్నవారు పడే వేదన వర్ణనాతీతం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?*


*పంతాలు, పౌరుషాలు ప్రక్కన పెట్టి అందరూ కూర్చుని సామరస్యంగా ఆవేశాలకు పోకుండా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అభిమానాలు కలకాలం పరిమళిస్తూ అనుబంధాలు పెంపొందే అవకాశం ఉంటుందేమోనని మా నమ్మకం*


*దీనికి కావల్సింది ప్రశాంతంగా ఆలోచించడం, విచక్షణ, పట్టుదలలు సడలించుకోవడం. ఈ విషయంలో పెద్దవారు చొరవ తీసుకోవాలి...*


*ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు. రెండిటికీ పెద్దగా తేడా ఏమీ ఉండదు.*


*ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే? కాబట్టి ఆలోచించండి, అందర్నీ కలుపుకుని, ఉన్నంతకాలం ఆప్యాయత, అనురాగాలు, ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..*


      🌹లోకాసమస్త సుఖినోభవంతుః🌹🙏🙏🙏

*ప్రతీది నాకు ఆదర్శమే

 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

 

*శుభోదయం*


*ప్రతీది నాకు ఆదర్శమే* 

.................................................


✍పడగొట్టిన వాడి పైన పగ పట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకొనే 🕸 *సాలె పురుగు* నాకు ఆదర్శం.


✍ఎన్ని సార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేసే 🌊 *అలలు* నాకు ఆదర్శం.


✍మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొని వచ్చే 🌱 *మొక్క* నాకు ఆదర్శం.


✍ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే 🏹 *బాణం* నాకు ఆదర్శం.


✍ప్రత్యర్ధి పెద్దదైన సరే సూర్యుడిని సైతం కప్పి ఉంచే ⛅ *మేఘాలు* నాకు ఆదర్శం.


✍అసాధ్యం అని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే 🔶 *గాలిపటం* నాకు ఆదర్శం.


✍తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే 🌹 *పువ్వు* నాకు ఆదర్శం.


✍ఎంతటి వేడిని అయిన తాను భరిస్తూ మనకు మటుకు చల్లని నీడనిచ్చే🌴 *చెట్టు* నాకు ఆదర్శం.


✍ఎప్పుడు విడిపోయిన ఇద్దర్ని కలపడానికి తాపత్రయ పడే 📍 *సూది* నాకు ఆదర్శం.


✍తన మూలంగా లోకం చీకటి అవకూడదు అని రోజంతా వెలుగునిచ్చే 🌞 *సూర్యుడు* నాకు ఆదర్శం.


✍తను ఎంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే 💧 *చినుకు* నాకు ఆదర్శం.


✍చుట్టూ చీకటే ఉన్నా చల్లని వెన్నెల పంచే 🌝 *చంద్రుడు* నాకు ఆదర్శం.


✍ఒక్క సారి అన్నం పెడితే జన్మంత విశ్వాసంగా ఉండే 🐩 *శునకం* నాకు ఆదర్శం.


✍జీవించేది కొంత కాలమైన అనుక్షణం ఆనందంగా ఉండే 🦋 *సీతాకోకచిలుక* నాకు ఆదర్శం.


✍ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే తాగే *హంస* నాకు ఆదర్శం.


🙏🌹🙏🌹

బాలా త్రిపుర సుందరి

 బాలా త్రిపుర సుందరి అమ్మవారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. మన తెలుగు నేలన ఈ మధ్యకాలంలో నడయాడిన గొప్ప బాల ఉపాసకుల లో తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అగ్రగణ్యులు... వారి జీవితంలోని ఒక సంఘటన.


*దుష్టులపై కూడా సద్గరుని అనుగ్రహం‌*


*దొంగలు దొరలయ్యారు*


ఒకసారి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కొన్ని రోజులు ఖాజీపాలెంలో రాత్రి వేళ పురాణమును చెప్పి ప్రతిరోజూ అర్థరాత్రి సమయాన కాలినడకన చందోలు చేరుతుండేవారు.


అది అడవి మార్గం. ఆ మార్గంలో దోపిడిదొంగలు అధికం. అనుకున్నట్లే శాస్త్రిగారిని దొంగలు వెంబడించసాగారు. శాస్త్రిగారు ముందు నడుస్తుంటే, దొంగలు వెనుక కర్రలతో పరుగులు పెడుతూ ఉన్నారు. ఆయన నడక మాములుగా ఉంటే, ఆయనను దోచుకునేందుకు సిద్దమైన దొంగలు పరుగెడుత్తుతూనే ఉన్నారు. కానీ ఆయనను అందుకోలేక పోతున్నారు.


చివరకు ఒకచోట శాస్త్రిగారు ఆగి వెనుదిరిగి " ఎవరు మీరు?" అని ప్రశ్నించారు.


వెంటనే వారందరూ కర్రలు క్రింద పడేసి నేలమీద సాగిలాపడి, లెంపలు వేసుకుంటూ "అయ్యా! మీ ఒంటిపై తళతళలాడుతున్న ఆభరణాలు దోచుకుందామని దుర్బుద్ధితో వెంబడించాము. మేము దొంగలం. కానీ అదేమి చిత్తమో, మీ మహిమోగానీ, ఏ అడుగుకు ఆ అడుగులో మిమ్ము దోచుకుందామని మైలుదూరము పైగా వెంబడించాము. మిమ్మల్ని కేకలు వేసి భయపెట్టేందుకు మాకు మాట పెగల్లేదు. చేతుల్లో ఉన్న కర్రలు, కత్తులతో మీపై దాడి చేద్దామంటే చేతులు రావు. అసలు ఏమీ తోచకుండానే ఇంత వరకు వెంబడించాము. తమరు దయతలచి క్షమిస్తే మా దారి మేము పోతాము" అని దీనంగా పలికారు. 


"మీరు ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా గౌరవముగా జీవిస్తే నాకు సంతోషంగా ఉంటుంది" అని పలికారు శాస్త్రిగారు.


అంతట ఆ దొంగలు " దొరవారూ! మీ ఆన మేరకు మేమందరం నేటితో ఈ నీచవృత్తి వదిలేస్తాము. మా చుట్టుప్రక్కల గల దారిదోపిడీగాండ్లందరినీ హెచ్చరిస్తాము. మిమ్మల్ని కన్నెత్తి చూచేవాడుండడు. ప్రొద్దుపోయింది. పోయి రండి" అని గౌరవముగా వంగి నమస్కారాలు చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ దోపిడీ దొంగలు.


ఆ దొంగలు దోపిడీలు మానుకొని పనులు చేసుకుని జీవించసాగారు.

ఆ అమ్మాయి లలితాదేవి,వారింట్లో తిరుగుతూ ఆయన కోసం వారింటికి వచ్చిన వారికి నాన్నగారు జపంలో ఉన్నారు అని చెప్పేది.

*సద్గురు కృప మాసపత్రిక నుంచి*


*2018 మే సంచిక*

 రావణుడిని చంపాలనుకొన్న శూర్పనఖ కుమారుడెవరు ?

_________________________


(1) కడుపులో అమృతభాండం కలవాడెవరు ?


(అ) విష్ణువు

(ఆ) వశిష్టుడు

(ఇ) రావణుడు

(ఈ) నలకుబరుడు


(2) శ్రీరాముడి సోదరి పేరేమిటి ?


(అ) దశరథి

(ఆ) శాంత

(ఇ) సుకన్య

(ఈ) రూప


(3) "లక్షణ" దుర్యోధనుని కూతురు.లక్షణను పెండ్లాడిన శ్రీకృష్ణుని కొడుకెవరు ?


(అ) సాంబుడు

(ఆ) ప్రద్యుమ్నుడు

(ఇ) సుధేష్ణుడు

(ఈ) చారుచంద్రుడు


(4) గంధమాదనపర్వతం ఎక్కడుండేది ?


(అ) కిష్కింధ

(ఆ) దండకారణ్యం

(ఇ) నేటి గోండ్వానా ప్రాంతం

(ఈ) శ్రీలంక


(5) కాశీవిశ్వేశ్వరుని సతి పేరేమిటి ?


(అ) అపర్ణ

(ఆ) మీనాక్షి

(ఇ) కాత్యాయని

(ఈ) అన్నపూర్ణ


(6) ఇంద్రుడి ఉద్యానవనం పేరేమిటి ?


(అ) ఇంద్రవనం

(ఆ) బృందావనం

(ఇ) నందనవనం

(ఈ) పారిజాతవనం


(7) కాశీలో ఒకతను హరిశ్చంద్రమహరాజును దాసునిగా పొందాడు. ఎవరతను ?


(అ) కాలకౌశికుడు

(ఆ) వీరదాసుడు

(ఇ) కాలకౌక్షేయుడు

(ఈ) వీరబాహువు


(8) శ్రీకృష్ణుడు చంపిన కవలయాపీడము ఏమిటి ?


(అ) బకం

(అ) రాక్షసి

(ఇ) సర్పం

(ఈ) ఏనుగు


(9) ద్రౌపతి వస్త్రాపహరణం ధర్మసమ్మతం కాదని వాదించిన దుర్యోధనుడి తమ్ముడెవరు ?


(అ) వికర్ణుడు

(ఆ) దుశ్చలుడు

(ఇ) విరోచనుడు

(ఈ) వికర్ణకుడు


(10) రావణుడిని చంపాలని తపస్సు చేసిన రావణుడి మేనల్లుడు (శూర్పనఖ కొడుకు) ఎవరు ?


(అ) ఘంటాకర్ణుడు

(ఆ) జంబుమాలి

(ఇ) జంబుకుమారుడు

(ఈ) జంబుకేయుడు

___________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

మంత్ర పుష్పం

 *మంత్ర పుష్పం - సందర్భం*

                ➖➖➖✍️


*హిందూ ఆలయాలలో పూజల చివరిలో పూజారి గారు అక్కడ ఉన్న అందరికి తలో ఒక పుష్పం ఇచ్చి వేదం లోని 'మంత్రపుష్పం' చదువుతారు.*


*ఆ తరువాత ఆ పుష్పాలను భక్తుల నుండి స్వీకరించి గర్భగుడిలోని దైవానికి సమర్పిస్తారు.* 


*వేదంలో భాగమైనది మంత్ర పుష్పం. ఇది దైవం గురించి దైవ విశిష్టతను, భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం గురించి తెలుపుతుంది.* 


*మంత్రపుష్పం చదవనిదే, ఏ పూజ, పునస్కారం పరిసమాప్తి కాదు. మంత్రపుష్పం చివరిలో చదవాల్సిందే తప్పనిసరిగా.*


*మూలం : వేదం.*

 

*మంత్ర పుష్పం - 1.*


*ఓం ధాతా పురస్తాద్య ముదా జహార*

*శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః చతస్రః*

*తమేవం విద్వానమృతమిహ భవతి*

*నాన్యః పంథా అయనాయ విద్యతే*


*తెలుగు భావం:*

*అన్ని దిక్కుల నుండి రక్షించువానిని ముందు బ్రహ్మ పూజించి సుఖించెను.*

 

*‘ఆ ఆది దైవమును తెలిసిన చాలును అదే అందరికి అమృత మార్గము వేరేది లేద’ని ఇంద్రుడు ప్రకటించెను.* 

 


*మంత్ర పుష్పం - 2.*


*సహస్ర శీర్షం దేవం*

*విశ్వాక్షం విశ్వశంభువం*

*విశ్వం నారాయణం దేవం*

*అక్షరం పరమం పదం*


*తెలుగు భావం:* 

 *అంతటా తలలున్న దైవము* 

*అంతటా కనులున్న దైవము*

*అన్ని లోకాల శుభ దైవము*

*విశ్వమంతానిండిన దైవము*    

*నశించని నారాయణుడే*

*ముక్తి నీయు పరంధాముడే*


*మంత్ర పుష్పం - 3.*


*విశ్వతః పరమాన్నిత్యమ్*

*విశ్వం నారాయణగ్ం హరిమ్*

*విశ్వమే వేదం పురుషస్త*

 *ద్విశ్వ ముపజీవతి*


*తెలుగు. భావం:*

*విశ్వము కన్నా ఉన్నతుడు*

*అందరిలోనుండు ఆత్మయు*

*శాశ్వత పోషకుడు హరే.*

*సర్వాత్మడు పరమాత్ముడే.*

*ఈ విశ్వ లోకాల కారకుడోయి*

*ఆ దైవమే విశ్వానికి తోడోయి.*

 

*మంత్రపుష్పం - 4.*


*పతిం విశ్వస్యాత్యే శ్వరగ్ం*

*శాశ్వతగ్ంశివమచ్యుతమ్*

*నారాయణం మహాజ్ఞ్యేయమ్*

*విశ్వాత్మానం పరాయణం*


*తెలుగు భావం:*

*పతిలా పోషించువాడు*

*లోకాలకు ఈశ్వరుడు*

*శాశ్వితుడు శుభకరుడు*

*సకలలోక ఉన్నతుడు*

*సకల జీవ నాయకుడు*

*అతడు నారాయణుడు*

*అతడు మహా దేవుడు *

*లోకమంత ఆత్మ వాడు*

*పూజింప తగు దేవుడు*

 

*మంత్ర పుష్పం - 5.*


*నారాయణ పరో*

*జ్యోతి రాత్మా*

 *నారాయణః పరః*

*నారాయణ పరమ్*

*బ్రహ్మ తత్వం*

*నారాయణః పరః*

*నారాయణ పరో*

*ధ్యాతా ధ్యానం*

*నారాయణః పరః*


*తెలుగు భావం:*


*నారాయణుడే పరమలోకము*

*నారాయణుడే జ్యోతిరూపము*

 *నారాయణుడే ఆత్మ రూపము*

*నారాయణుడే పరబ్రహ్మము*

*నారాయణునే ధ్యానిoచుము*✍️


        *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                      🌷🙏🌷

relation of Hinduism with science

 : We get 50% of molecular DNA from the mother and 50% from the father.

But we get 100% mitochondrial DNA from the mother. Mitochondria and their DNA only come from the mother to the baby. Mitochondria produce ATP. ATP is the source of energy in our body. So, we receive power from our mother. And our mother gets it from her mother and our father also gets it from his mother.


Do you now realize the relation of Hinduism with science that the god of power is mother - Adi Shakti or Maa Shakti, our mother. Our scientific understanding over the ages and years very clear. 

All the Vedic pujas and yagnas and the perfect mantra of Maa Durga work on a subtle level to excite and empower us. 


*Wish you and your family a very happy Navratri once again.* 🙏🏻

[: The contribution of father is only one cell that to half of chromosomes rest of all including blood bones skine strength is the gift of mother


Don't neglect mother

Without mother no existence


Respect mother love mother

god of power

 We get 50% of molecular DNA from the mother and 50% from the father.

But we get 100% mitochondrial DNA from the mother. Mitochondria and their DNA only come from the mother to the baby. Mitochondria produce ATP. ATP is the source of energy in our body. So, we receive power from our mother. And our mother gets it from her mother and our father also gets it from his mother.


Do you now realize the relation of Hinduism with science that the god of power is mother - Adi Shakti or Maa Shakti, our mother. Our scientific understanding over the ages and years very clear. 

All the Vedic pujas and yagnas and the perfect mantra of Maa Durga work on a subtle level to excite and empower us. 


*Wish you and your family a very happy Navratri once again.* 🙏🏻