4, నవంబర్ 2023, శనివారం

కాలభైరవుని

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*_శూలటంకపాశదండపాణిమాదికారణం_*

*_శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్_*

*_భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం_*

*_కాశికాపురాధినాథకాలభైరవం భజే....._*


_ *_శ్రీ కాలభైరవాష్టకమ్ - 03_* _


 *భా*:  

శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించిన వాడు,  నల్లని మేను కలవాడు, సనాతనుడు, నాశనము లేనివాడు, మొదటి వాడు, రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు, విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడే వాడు, *కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను*

మానస సరోవరం

 



*ఇది 186008 ఎత్తులో ఉన్న కైలాష్ మానస సరోవరం దీన్ని వీక్షించి శివానుగ్రహం పొందండి ఇది టిబెట్ సరిహద్దులోని అందమైన దృశ్యం ఈ దృశ్యం అసలైనది మరియు ఈ దృశ్యం మధ్యాహ్నం 3:00 గంటలకు దయచేసి దీన్ని చూడండి మరియు దీన్ని తొలగించవద్దు మీ స్నేహితులకు పంపండి.*

రాశి ఫలితాలు 04-11-2023 స్థిర వాసరః శనివారం

 రాశి ఫలితాలు

04-11-2023

స్థిర వాసరః శనివారం 


******

మేషం

చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. 

---------------------------------------

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలలో  సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావలసిన సోమ్ము అందుతుంది. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ పరంగా  అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

---------------------------------------

మిధునం

నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

---------------------------------------

కర్కాటకం 

సమాజంలో  గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.  ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ధన సంబంధిత విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలొ హోదాలు పెరుగుతాయి.

--------------------------------------

సింహం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

--------------------------------------

కన్య

ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున  శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు  అనుకూలస్తాయి. బంధు మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.  ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

---------------------------------------

తుల 

కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. ఉద్యోగమున సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు  ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం  ఉంటుంది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

---------------------------------------

వృశ్చికం

కుటుంబ సభ్యులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు   నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

---------------------------------------

ధనుస్సు 

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  సంతాన  వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. విద్యార్దులు మరింత కష్టపడవలసి వస్తుంది. ఉద్యోగాలలో  అదనపు బాధ్యతలు విసుగు కలిగిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

మకరం

ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ముందుకు సాగడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా   వ్యవహరించాలి. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.  

-------------------------------------

కుంభం

ధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో  సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలలో  శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. 

---------------------------------------

మీనం 

మంచి ఆలోచన జ్ఞానంతో  ముందుకు సాగుతారు. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు.  దూరప్రాంతాల బందువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ  విషయంలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

 ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 04.11..2023

శని వారం (స్ధిర వాసరే) 

**************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే సప్తమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

స్ధిర వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  కృష్ణ పక్షే సప్తమ్యాం

స్ధిర వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.03

సూ.అ.5.26

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

కృష్ణ పక్షం సప్తమి రా. 1.23 వరకు. 

శని వారం. 

నక్షత్రం పునర్వసు ప.9.42 వరకు. 


అమృతం ఉ. 7.08 ల 8.50 వరకు. 

పునరమృతం తె. 4.48 ల మరునాడు ఉ. 6.32 వరకు. 

దుర్ముహూర్తం ఉ.6.03 7.34 వరకు. 

వర్జ్యం రా.  ల‌ 10.34 వరకు .

యోగం సాధ్యం మ. 3.30 వరకు.

కరణం విష్ఠి ప.12.42 వరకు.

కరణం బవ రా.1.01 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం ఉ.9.00 ల 10.30  వరకు. 

గుళిక కాలం ఉ.6.00 ల 7.30  వరకు. 

యమగండ కాలం మ.1.30 ల 3.00 వరకు. 

.***********

పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ సప్తమి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

శోభాయమానం

 శ్లోకం:☝️

*ఏకేనాపి సుపుత్రేణ*

  *విద్యాయుక్తేన భాసతే ।*

*కులం పురుషసింహేన*

  *చంద్రేణేవ హి శర్వరీ ॥*


భావం: ఒకే చంద్రుని వలన రాత్రి శోభాయమానం అయినట్లు, కేవలం ఒక్క విద్యావంతుడైన సుపుత్రుడి వలన మొత్తం వంశం శోభాయమానం అవుతుంది.

పంచాంగం 04.11.2023 Saturday

 ఈ రోజు పంచాంగం 04.11.2023  Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: సప్తమి తిధి స్థిర వాసర: పునర్వసు నక్షత్రం సాధ్య యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


సప్తమి రాత్రి 01:01 వరకు.

పునర్వసు ఉదయం 07:57 వరకు.

సూర్యోదయం : 06:19

సూర్యాస్తమయం : 05:39

వర్జ్యం : సాయంత్రం 04:48 నుండి 06:34 వరకు.

దుర్ముహూర్తం : ఉదయం 06:19 నుండి 07:56 వరకు.


రాహుకాలం : పగలు 09:00  నుండి 10:30 వరకు 


యమగండం : మద్యాహ్నం  01:30 నుండి 03:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

వేదాలు

 *వేదాలు*


వేదం సృష్టితత్త్వాన్ని, సృష్టికి మానవుడికి ఉన్న సంబంధాన్ని, మానవుడికి సృష్టికర్తతో గల అనుబంధాన్ని వ్యక్తం చేసింది. 


వేదం ఏ ఒక్కరో రచించిన గ్రంథం కాదు. సృష్టితత్త్వాన్ని, పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలని ఆరాటపడిన మహర్షి సముదాయానికి అంతర్నేత్రానికి గోచరించిన ఒక దర్శనం. హృదయస్థానంలో వినిపించిన ఒక నాదం (శ్రుతి). 


వేదం *అపౌరుషేయం* అని కూడా పెద్దలు గుర్తించారు. *అపౌరుషేయం* అంటే మానవ మాత్రుడి రచన కాదు అని అర్ధం.


అనాదిగా అలా దిగి వచ్చిన వేదం వ్యాసమహర్షి కాలానికి చిక్కువడిన దారాల రాశిగా ఉంటే, ఆ చిక్కును విడదీసి, వేదవిభాగ నిర్ణయంచేసి, వేదం మనకు అక్కరకు వచ్చేలా చేశాడు ఆ మహర్షి. ఆనాటి నుండి అతడికి *వేదవ్యాసుడు* అనే పేరు వచ్చింది. సకల వేదాల సారాన్ని 555 సూత్రాలుగా “బ్రహ్మసూత్రాలు” రచించాడు. అయినా, ఆ మహర్షికి తృప్తి కలుగలేదు. 


వేదమనే విత్తనంలో నుంచి విశాలమైన పురాణ మహావృక్షాలను అంకురింప చేశాడు. అందుకే పురాణాలకు *వేదోపబృంహణాలు* అని పేరు. *ఉపబృంహణం* అంటే విత్తనాలు నుంచి మొలక రావడం. విత్తనంలో ఏమి ఉన్నదో మొలకలో, మొక్కలో, చెట్టులో అదే ఉంటుంది.


ఇలా వేదవాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురాణాలను రచించాడు వ్యాసమహర్షి. 


- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

సుభాషితమ్

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*_శూలటంకపాశదండపాణిమాదికారణం_*

*_శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్_*

*_భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం_*

*_కాశికాపురాధినాథకాలభైరవం భజే....._*


_ *_శ్రీ కాలభైరవాష్టకమ్ - 03_* _


 *భా*:  

శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించిన వాడు,  నల్లని మేను కలవాడు, సనాతనుడు, నాశనము లేనివాడు, మొదటి వాడు, రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు, విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడే వాడు, *కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను*

శరీర గంథం..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*మొగలిచెర్ల ప్రయాణం..శరీర గంథం..*


*(పదిహేడవ రోజు)*


శ్రీ స్వామివారు ఇంత హఠాత్తుగా మొగలిచెర్ల కు బైలుదేరుతారని ఊహించలేకపోయిన శ్రీధరరావు దంపతుల మనసులోని భావాలను పసికట్టినట్లు..శ్రీ స్వామివారు ప్రభావతి గారివైపు తిరిగి..


"అమ్మా!..నీ మనసులో అనేక సందేహాలున్నాయి..క్రమంగా అన్నీ తీరిపోతాయి..నన్ను మొదటి సారి చూసినప్పుడే "నాయనా" అని పిలిచావు..ఆ క్షణం లోనే నువ్వు నా దృష్టిలో నాకు తల్లిగా మారిపోయావు..ఆ పార్వతీదేవి తన ఒడిలో ఇంతకాలం నాకు చోటిచ్చి..కన్నబిడ్డలా కాపాడింది..ఇక ముందు ముందు రోజుల్లో..నువ్వే నాకు తల్లి స్థానం లో వుండబోతున్నావు..నేనూ నీకు బిడ్డనయ్యాను..నీ పెద్దకుమారుడిని అనుకో!..నీ బిడ్డ నీ ఇంటికి రావడానికి ముహూర్తాలు చూడాలా తల్లీ?.." అన్నారు..


"శ్రీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు!.." అన్న శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదం ప్రభావతి శ్రీధరరావు గార్ల చెవుల్లో ఘంటానాదం లా వినబడింది..ఆ మహాతల్లి దీవెన ఈ నిమిషంలో ఈ స్వామివారి రూపంలో సాక్షాత్కారం అయింది..మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయంలో ఈ ఉదయం..తమను తాకుతూ వెళ్లిన కాంతిపుంజం ఇదేనేమో.. ఎప్పుడూ లేనిది ఆ నరసింహుడు తృళ్లి తృళ్లి నవ్విన కారణమూ ఇదేనేమో?..అని ప్రభావతి గారు తలపోస్తున్నారు..సరే..కొండంత లక్ష్మీనారసింహుడి ఆదేశం ఇదే అయితే..తమ పూర్వజన్మ సుకృతం వలన ఈ యోగిపుంగవుడు తమకు ఈ వయసులో దొరికిన కుమారుడిగా భావించి తరిద్దామని ఆవిడ నిర్ణయించుకున్నారు..


"అదేమీలేదు నాయనా..యోగులకొరకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో తెలీక సతమతం అవుతున్నాను.." అన్నారు ప్రభావతి గారు.


"దిగంబరిని..సర్వసంగపరిత్యాగిని..నాకు ఏర్పాట్లు ఏముంటాయి తల్లీ..మీ ఇంట్లో ఏ లోటు ఉండదని నాకు తెలుసు..అవధూత లక్షణాలు మీకు కొత్త కదా..అవసరం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెపుతాను..శ్రీధరరావు గారూ కాలాతీతమవుతోంది..ఇక బైలుదేరుదాం.."అన్నారు..


శ్రీధరరావు గారి వెంట ఉన్న వారి పిన్నమ్మ కౌసల్యమ్మ గారు, రమణయ్య గార్లు జరుగుతున్న ఈ తతంగమంతా విస్తుబోయి చూస్తున్నారు..తమతో పాటు ఈ దిగంబర యోగి అదే బండిలో ఎలా కూర్చుని వస్తాడు?..తామెలా సర్దుకోవాలి?..ఈ భార్యాభర్తలు వెఱ్ఱి వెంగళప్పల్లా అన్నిటికీ తలూపుతూ వున్నారే.. తాము సరే..మొగలిచెర్ల గ్రామస్థులు వివిధ రకాలుగా అనుకోరా?..వీళ్ళిద్దరికీ ఆ ఆలోచనే లేదే!..భగవంతుడా..ఇదేం చోద్యం?..అని పరి పరి విధాల మనసులోనే మధనపడుతూ వున్నారు..


మరి, వారి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహించారో.. ఏమో..గబుక్కున పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లి..ఒక వస్త్రాన్ని మొలచుట్టూ కట్టుకొని, మరొక వస్త్రాన్ని భుజాల మీదుగా చుట్టూరా వేసుకొని..బైటకు వచ్చి కౌసల్యమ్మ గారితో.."ఇప్పుడు సరిపోయిందా?" అన్నారు నవ్వుతూ..కౌసల్యమ్మ గారు నిర్ఘాంతపోయారు..తన మనసులో సందేహం..ఒక్కక్షణం లో పసిగట్టి పరిష్కరించిన శ్రీ స్వామివారి కి నమస్కారం చేశారు..


అందరికంటే ముందుగా శ్రీ స్వామివారే బండిలోకి ఎక్కి కూర్చున్నారు..వారి ప్రక్కన శ్రీధరరావు గారు, ఆయన ప్రక్కన ప్రభావతి గారు, ఇటు చివరన కౌసల్యమ్మ, రమణయ్య గార్లు కూర్చున్నారు..బండి మెల్లిగా మొగలిచెర్ల వైపు బయలుదేరింది..ప్రభావతి గారి మనసులో మరో సందేహం మొదలైంది..ఇంటిదగ్గర తన అత్తగారు..శ్రీధరరావు గారి తల్లి గారున్నారు..పెద్దావిడ వున్నారు..ఇంతకాలం తామిద్దరూ మాట్లాడుకుంటుంటే శ్రీ స్వామివారి గురించి కర్ణాకర్ణిగా వినీవున్నారు.. రెండు మూడు సార్లు తమతో "ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అందరినీ నమ్మకండి నాయనా!.."అని సున్నితంగా హెచ్చరించి వున్నారు..మరి ఇప్పుడు ఏకంగా శ్రీ స్వామివారిని ఇంటికే తీసుకొస్తే..ఆ పెద్దావిడ ఏమంటారో?..అని అనుకుంటూ కళ్ళుమూసుకున్నారు..


"అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా.." శ్రీ స్వామివారి కంఠం లోంచి వచ్చిందామాట..ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు ప్రభావతి గారు..శ్రీ స్వామివారు ఎటో చూస్తున్నారు.."అన్నీ సవ్యంగానే జరుగుతాయి.."మళ్లీ అదేమాట ఆయన నోటినుంచి వచ్చింది..


ఇంతలో ఒక గాలి తెర శ్రీ స్వామివారు కూర్చున్న వైపునుంచి మిగిలిన వాళ్ళందరినీ తాకుతూ వెళ్ళింది..ఒకరకమైన దుర్గంధం బండి అంతా వ్యాపించింది..అందరూ గబుక్కున తమ ముక్కు మూసుకున్నట్లు చేతులడ్డంపెట్టుకున్నారు..శ్రీధరరావు గారు శ్రీ స్వామివారి వైపు చూసారు.."ఎంత యోగి అయినా..ఈ వాసన ఏమిటి?..ఇలాటి కంపు ఎలా భరిస్తాం?." అని ప్రభావతి గారు అనుకున్నారు..


ఫక్కున నవ్వారు శ్రీ స్వామివారు.."అమ్మా!..వారం రోజులుగా సమాధి నిష్ఠలో వున్నాను..స్నానం కూడా చేయలేదు..అసలు ఆ ధ్యాసే కలగ లేదు..మరి నా శరీరం నుండి దుర్గంధం కాక మరేమోస్తుంది?.." అన్నారు..ఈ సారి దంపతులిద్దరే కాక మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు..తమ మనసులోని ప్రతి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహిస్తున్నారు..ఇంతలో మరో గాలి తెమ్మెర మళ్లీ వీచింది..ఈసారి అత్యంత సుగంధ పరిమళం చుట్టూ వ్యాపించింది.."ఎంత మంచి వాసన!..ఎక్కడిదో!.." అప్రయత్నంగా రమణయ్య గారు పైకి అనేశారు..శ్రీ స్వామివారు తన చేతి వ్రేళ్ళకు పెరిగిన గ్రోళ్లను చూసుకుంటున్నారు..


తమవెంట వస్తున్నది ఎవరో పిచ్చివాడు కాదనీ..సమస్తమూ తెలిసిన ఒకానొక సిద్ధపురుషుడే ఈ దిగంబర యోగి గా మారి, తమను, మొగలిచెర్ల గ్రామాన్ని పునీతం చేయడానికి సాధారణ మానవునిలా మారి తమవెంట వస్తున్నాడని..తమ జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన చేయడానికి తమ ఇంట అడుగుబెడుతున్నాడనీ.. ప్రభావతీ శ్రీధరరావు దంపతులకు స్పష్టంగా తెలిసివచ్చింది.."స్వామీ లక్ష్మీ నృసింహా!..నీదే భారం తండ్రీ!..శరణు!!.."అని అనుకున్నారు..


శ్రీ స్వామివారి తో సహా అందరూ మొగలిచెర్ల గ్రామం లోని శ్రీధరరావు గారి ఇంటికి చేరారు..


ఫకీరు మాన్యం..మన్నేరు నది..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4x


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం  - సప్తమి -  పుష్యమి - స్థిర వాసరే* (04.11.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/nXwfd_QK8AA?si=RFX4dr5-GZaglJcZ



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*