శ్లోకం:☝️
*రత్నైః కల్పితమాసనం*
*హిమజలైః స్నానం చ దివ్యాంబరం*
*నానారత్నవిభూషితం*
*మృగమదామోదాంకితం చందనం l*
*జాతీచంపకబిల్వపత్ర-*
*రచితం పుష్పం చ ధూపం తథా*
*దీపం దేవ దయానిధే*
*పశుపతే హృత్కల్పితం గృహ్యతాం ll*
- శివమానసపూజ - 1
భావం: ఓ దయానిధి! పశుపతి! నేను మానసికంగా సమర్పిస్తున్న - రత్న సింహాసనం, చల్లని నీటితో స్నానం, దివ్యమైన వస్త్రాలు, రకరకాల రత్నాలతోను, చందనం సుగంధ ద్రవ్యాలతోను జాజి, చంపక పుష్పాలు, బిల్వపత్రాల మాలతోను అలంకారం, ధూపం, దీపం మొదలగు ఉపచారాలను స్వీకరించుము.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి