30, ఆగస్టు 2021, సోమవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*401వ నామ మంత్రము* 30.8.2021


*ఓం వివిధాకారాయై నమఃః*


నామరూపాత్మకంగా జగత్తంతా వివిధ ఆకారములతో వ్యాపించి ఉన్న పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వివిధాకారా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం వివిధాకారాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు ఆ తల్లి సర్వాభీష్టసిద్ధిని అనుగ్రహించును.


జగన్మాత సర్వదేవతా స్వరూపిణి. జగత్తంతా వివిధ ఆకారములతో, వివిధ నామాలతో వ్యాపించి ఉన్నది. అన్ని రూపాలు ఆ పరమేశ్వరివే. పంచవింశతి (ఇరువది ఐదు) తత్త్వములు ఆ జగన్మాత రూపములే. 

  

*ఇరువది ఐదు తత్త్వములు*: 1. ప్రకృతి, 2. పురుషుడు, 3. బుద్ధి (మహత్తత్త్వము), 4. అహంకారము, 5. మనస్సు, పంచజ్ఞానేంద్రియములు (1. శ్రోత్రము, 2. చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక), పంచ కర్మేంద్రియములు (1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ), పంచ మహాభూతములు (1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము), పంచ తన్మాత్రలు (రూపము, 2. రసము, 3. గంధము, 4. స్పర్శ, 5. శబ్దము).


శక్తి పీఠాలలో వివిధ నామాలతో మరియు వివిధ రూపాలతో విరాజిల్లుచున్నది పరమేశ్వరి గనుకనే ఆ తల్లి *వివిధాకారా* యని అనబడినది.


కొండలలో కొండదేవతగా, గ్రామాలలో గ్రామదేవతగా, ఎవరు ఏరూపంతో, ఏ నామంతో కొలిస్తే అలాగే అమ్మవారు వారి మనో నేత్రాలలో దర్శనమిస్తుంది గనుకనే ఆ పరమేశ్వరి *వివిధాకారా* యని అనబడినది.


ఆభరణములు ఎన్నో ఆకారాలు, ఎన్నో నామాలతో ఉంటాయి. కాని వాటిలో ఉండేది బంగారమే అని అనినట్లే, ఎన్ని నామాలు, ఎన్ని రూపాలతో ఆ పరమేశ్వరి ఉన్నను, వాటి అన్నిటిలోని దేవతా మూర్తి ఆ పరమేశ్వరియే. గనుకనే ఆ అమ్మవారు *వివిధాకారా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం వివిధాకారాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*984వ నామ మంత్రము* 30.8.2021


*ఓం త్రిగుణాయై నమః*


సత్త్వరజస్తమో గుణ స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రిగుణా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం త్రిగుణాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి వారికి ఆయురారోగ్యసంపదలు, శాంతిసౌఖ్యములు ప్రసాదించును.


పరమేశ్వరి సత్త్వరజస్తమస్సులనెడు త్రిగుణములకు ఆశ్రయముగా కొందరు చెప్పగా, 


*యోగీశ్వరీ శరీరాణి కరోతి వికరోతి చ| నానాకృతి క్రియారూపా నానావృత్తిః స్వలీలయా| త్రిథా య ద్వర్తతే లోకే తస్మా త్సా త్రిగుణోచ్యతే॥* (సౌభాగ్యభాస్కరం, 1074వ పుట)


'యోగీశ్వరి (శ్రీమాత) తన లీలచే సకల శరీరములను సృష్టించుచున్నది మరియు లయింపజేయుచున్నది. కాని ఆ తల్లి మాత్రము నామ, రూప, క్రియాత్మకములై మూడువిధములుగా విలసిల్లుచున్నది. ఈ నామ, రూప, క్రియ అనునవియే త్రిగుణములు' అను భావమతో వాయుపురాణమునందు చెప్ఫబడినది. కనుక ఎలా భావించినను పరమేశ్వరి *త్రిగుణా* యని అనబడుచున్నదని చెప్పక తప్పదు.


విష్ణుపురాణంలో ఈ విధంగా చెప్పబడినది.


*సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తిరపరా| తవ గుణాశ్రయా నమస్తస్యై శాశ్వతాయై సురేశ్వరి॥* (సౌభాగ్యభాస్కరం, 1075వ పుట)


"అమ్మా పరమేశ్వరీ! అన్నిభూతములయందును, అనంతకోటి జీవరాశుల యందును నిక్షిప్తమై యుండు నీ శక్తి త్రిగుణాత్మకము. త్రిగుణాశ్రయురాలైన ఓ సురేశ్వరీ! నీకు వందనము.


సృష్టి, స్థితి, లయలు అను మూడును పరమేశ్వరి నిర్వహించు పంచకృత్యములలోనివే. ఈ మూడును ఉత్తత్తి, స్థితి, నాశనము అను మూడు గుణములను కలిగినది యగుటచే, జగన్మాత *త్రిగుణా* యని అనబడుచున్నది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం త్రిగుణాయై నమః* అని యనవలెన.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలి ??*

 *కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలి ??*


శ్రావణమాసం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్వదినం శీకృష్ణాష్టమి.


 "కృష్ణం వందే జగద్గురుమ్" అని సకల జాతులవారూ ఆ పరమాత్మను స్తుతిస్తారు. ధర్మమునకు హాని, అధర్మమునకు అభ్యుత్థానం జరిగినపుడు, ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు తనను తానే సృజించుకొంటాడు. 



సకల లోకేశ్వరుడు, ఆకర్షణ స్వరూపుడు అయిన కృష్ణుడి యెుక్క ఆవిర్భావం జరిగిన రోజు శ్రావణమాసం, కృష్ణ పక్షం, అష్టమి. 



ఒకప్పుడు వేలకొలది రాక్షసులు ద్వాపరయుగం చివరి పాదంలో మహారాజుల వంశములో జన్మించారు. కంసుడు, జరాసంధుడు, శిశుపాల, దంతవక్త్రాదులు, కలిపురుషుని అంశతో దుర్యోధనాదులు జన్మించారు. వీరి పరిపాలనను భూమి తట్టుకోలేక పోయింది. గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రక్షించమని ప్రార్థించింది. బ్రహ్మ ఆమెను ఓదార్చి, ఆమెతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీహరి వారికి అభయం యిచ్చి కనబడకుండా వారితో త్వరలో భూమి మీద అవతరించి దుష్టశిక్షణ చేస్తానని వరమిచ్చాడు. 


అలా వరమిచ్చిన స్వామి వారు శ్రావణమాసంలో బహుళాష్టమీ తిథినాడు సరిగ్గా అర్ధరాత్రి పూట, సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు ఈ ఐదుగురు ఉచ్ఛ స్థితిలో నుండగా శ్రీకృష్ణుడనే నామంతో అవతరించాడు. 


125 సంవత్సరాలు ఈ అవతారంలో భూమి మీద నివసించి అనేక లీలలు చేసి చూపించాడు. భూభారం తొలగించాడు. అన్నింటినీ మించి ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ అందించని మహాద్భుత గ్రంథాన్ని "భగవద్గీత" ను లోకానికి అర్జునుడనే శిష్యుని మిషతో అందించాడు. 


జగద్గురుడంటే శ్రీకృష్ణుడే అని ఆదిశంకరుల వంటివారు అన్నారంటే దానికి కారణం భగవద్గీతయే. 


భగవంతుడు 22 అవతారాలు ఎత్తుతాడనీ, వాటిలో 21 అంశావతారాలనీ, ఒక్క శ్రీకృష్ణావతారమే పరిపూర్ణావతారమనీ శ్రీమద్భాగవతం చెబుతోంది.


 "ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయమ్" అని వ్యాసుడన్నాడు.


 ఇంతటి శ్రీకృష్ణావతారాన్ని లోకానికి అందించిన పవిత్రమాసం శ్రావణ మాసం. 



ఈ తిథినాడు శుచిగా ఉండి, శ్రీకృష్ణుడిని పది తులసీదళాలతో పూజిస్తూ, 

1) కృష్ణాయ నమః,

 2) విష్ణవే నమః

3) అనంతాయ నమః

 4) గోవిందాయ నమః

5) గరుడధ్వజాయ నమః 

6) దామోదరాయ నమః 

7) హృషీకేశాయ నమః 

8) పద్మనాభాయ నమః 

9) హరయేనమః

10) ప్రభవే నమః 


అనే దశ మంత్రాలను ఉచ్చరించాలి. 


తరువాత ప్రదక్షిణాదులు చేసిన వానికి శ్రీకృష్ణానుగ్రహం కలుగుతుంది. 


శ్లో|| దశాహం కృష్ణదేవాయ పూరికాదశచార్పయేత్||

అష్టమి మెుదలుకొని వరుసగా పదిరోజులు శ్రీకృష్ణుని తులసీదళాలతో అర్చిస్తూ పది పూరీలు నివేదించిన వానికి సారూప్యం(కృష్ణుని వంటి రూపం) అనే ముక్తి లభిస్తుంది. 


* కృష్ణుడు మనం భక్తితో సమర్పించిన ఎటువంటి అలంకారాన్నైనా, ఫలమునైనా, పుష్పమునైనా, పత్రమునైనా స్వీకరిస్తాడు. 


* కృష్ణుని విగ్రహానికి షోడశోపచార పూజలు చేయాలి, తులసీదళాలతో పూజించాలి. 


* మంచి ఉద్యోగం కోసం కృష్ణాష్టమి నాడు తులసీదళాలతో పూజించాలి. 


* కృష్ణుడికి తాజా వెన్న సమర్పించాలి. కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ఆవు పాలతో చేసిన పాయసం నివేదిస్తే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. సాయంత్రం కృష్ణ మందిరానికి వెళ్లి కృష్ణ దర్శనం చేసుకోవాలి. 


* కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టే కార్యక్రమం చేయాలి. 


* ఈరోజు తప్పకుండా గోసేవ చెయ్యాలి 


🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Bhagwan Shri Krishna

 Bhagwan Shri Krishna


1) Krishna was born *5252 years ago* 

2) Date of *Birth* : *18 th July,3228 B.C*

3) Month : *Shravan*

4) Day : *Ashtami*

5) Nakshatra : *Rohini*

6) Day : *Wednesday*

7) Time : *00:00 A.M.*

8) Shri Krishna *lived 125 years, 08 months & 07 days.*

9) Date of *Death* : *18th February 3102BC.*

10) When Krishna was *89 years old* ; the mega war *(Kurukshetra war)* took place. 

11) He died *36 years after the Kurukshetra* war.

12) Kurukshetra War was *started on Mrigashira Shukla Ekadashi, BC 3139. i.e "8th December 3139BC" and ended on "25th December, 3139BC".*  

12) There was a *Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3139BC" ; cause of Jayadrath's death.*

13) Bhishma died on *2nd February,(First Ekadasi of the Uttarayana), in 3138 B.C.*


14) Krishna is worshipped as:

(a)Krishna *Kanhaiyya* : *Mathura*

(b) *Jagannath*:- In *Odisha*

(c) *Vithoba*:- In *Maharashtra*

(d) *Srinath*: In *Rajasthan*

(e) *Dwarakadheesh*: In *Gujarat*

(f) *Ranchhod*: In *Gujarat*

(g) *Krishna* : *Udupi in Karnataka*

h) *Guruvayurappan in Kerala*


15) *Bilological Father*: *Vasudeva*

16) *Biological Mother*: *Devaki*

17) *Adopted Father*:- *Nanda*

18) *Adopted Mother*: *Yashoda*

19 *Elder Brother*: *Balaram*

20) *Sister*: *Subhadra*

21) *Birth Place*: *Mathura*

22) *Wives*: *Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana*

23) Krishna is reported to have *Killed only 4 people* in his life time. 

(i) *Chanoora* ; the Wrestler

(ii) *Kansa* ; his maternal uncle

(iii) & (iv) *Shishupaala and Dantavakra* ; his cousins. 

24) Life was not fair to him at all. His *mother* was from *Ugra clan*, and *Father* from *Yadava clan,* inter-racial marriage. 

25) He was *born dark skinned.* He was not named at all throughout his life. The whole village of Gokul started calling him the black one ; *Kanha*. He was ridiculed and teased for being black, short and adopted too. His childhood was wrought with life threatening situations.

26) *'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.*

27) He stayed in Vrindavan *till 10 years and 8 months*. He killed his own uncle at the age of 10 years and 8 months at Mathura.He then released his biological mother and father. 

28) He *never returned to Vrindavan ever again.*

29) He had to *migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King ; Kala Yaavana.*

30) He *defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).*

31) He *rebuilt Dwaraka*. 

32) He then *left to Sandipani's Ashram in Ujjain* to start his schooling at age 16~18. 

33) He had to *fight the pirates from Afrika and rescue his teachers son ; Punardatta*; who *was kidnapped near Prabhasa* ; a sea port in Gujarat. 

34) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax house'' and later his cousins got married to *Draupadi.* His role was immense in this saga. 

35) Then, he helped his cousins establish Indraprastha and their Kingdom.


36) He *saved Draupadi from embarrassment.*


37) He *stood by his cousins during their exile.*

38) He stood by them and *made them win the Kurushetra war.*


39) He *saw his cherished city, Dwaraka washed away.* 

40) He was *killed by a hunter (Jara by name)* in nearby forest. 

41) He never did any miracles. His life was not a successful one. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even more bigger challenges. 

42) He *faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.*


43) He is the *only person, who knew the past and future ; yet he lived at that present moment always.*


44) He and his life is truly *an example for every human being.*🌷🙏🏻


*Jai Shri Krishna*🙏

లీలామానుష విగ్రహుడు

 శుభమస్తు, శుభోదయం, జగన్నాటక సూత్రధారి, జగద్గురువు, లీలామానుష విగ్రహుడు, శ్రీ కృష్ణ భగవానుని అభయహస్తం సదా సర్వదా అహర్నిశలూ ఈ పవిత్ర భువిపై సకల జీవజాలం, ప్రశాంత వాతావరణంలో అఖండ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధితో అరమరికలు లేని రీతిలో నిత్య సత్య ఒండొరుల ఆదరాభిమాన చైతన్య స్ఫూర్తి ప్రధాన ఇతివృత్తమై తమ తమ జీవనయానాన్ని సాగించే విధాన అండగా నిలవాలని, ఆశిద్దాం, ఆ రీతిలో ఆ గీతాచార్యుల ఆశీస్సులు విశాల విశ్వ జీవరాశికి ఎల్లవేళలా అందాలని భావిద్దాం ! గుళ్లపల్లి ఆంజనేయులు 

శ్రీకృష్ణ జననం

 శ్లోకం:☝️ శ్రీకృష్ణ జననం

    *నిశీథే తమ ఉద్భూతే*

        *జాయమానే జనర్దనే |*

    *దేవక్యాం దేవరూపిణ్యాం*

        *విష్ణుః సర్వగుహాశయః |*

    *ఆవిరాసీద్యథా ప్రాచ్యాం*

        *దిశీందురివ పుష్కలః ||*


  *తమద్భుతం బాలకమమ్బుజేక్షణం*

*చతుర్భుజం శంఖగదార్యుదాయుధమ్ |*

  *శ్రీవత్సలక్షం గలశోభి కౌస్తుభం*

*పీతామ్బరం సాంద్రపయోదసౌభగమ్ ||*

  - శ్రీమద్భాగవతం - దశమ స్కంధము


భావం: జననమరణ చక్రమునుండి సకల ప్రాణులను ఉద్ధరించెడి శ్రీహరి అవతరింపనున్న ఆ అర్ధరాత్రివేళ నలుదెసలయందు చీకట్లు అలముకొనియుండెను. అంతట సకల జీవరాసులలో అంతర్యామియై వెలుగొందుచుండెడి శ్రీమహావిష్ణువు దివ్యాంశశోభితయైన దేవకీదేవి గర్భమున, తూర్పుదిశయందు పరిపూర్ణ కళలతో తేజరిల్లిచుండెడి నిండుపున్నమి చంద్రునివలె ఆవిర్భవించెను. అప్పుడు ఆ పరమపురుషుడు అద్భుత బాలకుడై విరాజిల్లుచుండెను. ఆ స్వామి నేత్రములు కమలములవలె శోభిల్లుచుండెను. ఆ ప్రభువు చతుర్భుజములయందును శంఖ చక్రములు, గదా పద్మములను ధరించియుండెను. ఆయన వక్షస్థలమునందలి శ్రీవత్స చిహ్నము పరమరమణీయముగా నుండెను. కంఠమునగల కౌస్తుభమణి మిలమిల మెఱయుచుండెను. దట్టముగానున్న మేఘమువలె ఒప్పుచున్న ఆ శ్యామసుందరుడు ధరించియున్న పీతాంబర కాంతులు మనోజ్ఞముగా ఉండెను.

*అందరికీ శ్రీకృష్ణాష్టమీ శుభాకాంక్షలు* 🙏

రాబోయే ఎన్నికలు

 మీరు స్వేచ్ఛగా ఉన్నప్పుడు చదవండి!

 కానీ సహనంతో మరియు శాంతితో ప్రస్తుత దేశ భద్రత పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని అవగాహనతో చదవండి ..


 # రాబోయే ఎన్నికలు #


  బిజెపి 

   Vs

  కాంగ్రెస్ + లెఫ్ట్ + బిఎస్పి + ఎస్పి + టిడిపి + ఆర్జెడి + శివసేన + టిఎంసి + డిఎంకె + ఆప్ + జెడియు + ఎన్‌డిటివి + ఎబిపి న్యూస్ + స్క్రోల్ + ది వైర్ + అవార్డు రిటర్నింగ్ గ్యాంగ్ + జెఎన్‌యు + పాకిస్తాన్ + చైనా 


  మోడిని తొలగించాలని కోరుకునే వారి మధ్య వ్యత్యాసాన్ని కారణాల్ని చూడండి:


 హిందువులు జీఎస్టీపై, చిన్న చిన్న పరిపాలనా లోపాలపై కోపంగా ఉన్నారు అందుకే కాంగ్రెస్‌ను తీసుకురావాలని కోరుకుంటారు

 మరియు ముస్లింలు భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని కోరుకుంటారు, కాబట్టి సెక్యులర్ ముసుగు వేసుకున్న కాంగ్రెస్ ను , ఈ కలగూర గంప పార్టీలను తీసుకురావాలని కోరుకుంటారు!


 కారణం ఏమైనప్పటికీ ... అందరికీ ఒకే ఉద్దేశ్యం మోడి ని వ్యతిరేకించడం. 


 అవినీతి నాయకుల మాటలకు మెచ్చి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు భారతదేశంలో చాలా మంది ఉన్నారు! అలాగే విజ్ఞతతో అభిమానించే వారు ఉన్నారు.

 మంచిది !!

 ఇది ప్రజాస్వామ్యం ... వ్యతిరేకించడం లేదా మద్దతు ఇవ్వడం!

 ఇది మీ స్వంత హక్కు !!

 అయితే .... మోడిని వ్యతిరేకిస్తూ మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు ?? 


 ఇది చాలా తీవ్రమైన ప్రశ్న !!!

 కాబట్టి .... నిర్ణయం కూడా తీవ్రంగా తీసుకోవాలి!


 ములాయం, లాలు, మాయావతి, సోనియా, రాహుల్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, వామపక్షవాదులు వంటి రాజకీయ నాయకులు .... నరేంద్ర మోడీ కంటే మంచివా రా???

 వారి రికార్డులు బాగున్నాయా ???


 నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవీకాలం గుజరాత్ కన్నా మమతా బెనర్జీ, అఖిలేష్ తదితర పదవీకాలం బాగా కనబడుతుందా?

 మీరు పోల్చి చూసుకోండి.... 


 లాలు & ములాయం రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ... వారి ఇంటి పరిస్థితి దయనీయంగా ఉంది.

 సైకిళ్ళు, లాంతర్లు కొనడానికి వారికి డబ్బు లేదు!

 ఈ నాయకులు ... కులం పేరిట రాజకీయాలు నడిపేవారు ... నేడు వాళ్ళు బిలియనీర్లు !!!


 రామ్‌గోపాల్ చార్టర్డ్ విమానంలో,ఆడిలోశివపాల్ తిరుగుతున్నారు.

 వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడినుండి వచ్చింది ??

 నరేంద్ర మోడీ కంటే ఈ వ్యక్తులు గొప్పవాళ్ళా ???


 సోనియా కొడుకు-కుమార్తె మరియు అల్లుడు ఈ రోజు బిలియనీర్లు!

 వారు నరేంద్ర మోడీ కంటే బాగున్నారా ???


 వామపక్షవాదులు ఏలుతున్న కేరళ స్మగ్లర్లతో నిండిపోయింది వీళ్ళు నరేంద్ర మోడీ కంటే గొప్పవారా ???


 ఐదేళ్లపాటు ... కేజ్రీవాల్ ప్రకటనలు నడుపుతూ వైఫై, సిసిటివి, 150 కాలేజీలు, 500 పాఠశాలలు మొదలైన వాటిని Delhi ప్రజలకు హామీ ఇచ్చారు. అమలు చేశాడా?

 ఈ ఐఐటి పండితుడు నరేంద్ర మోడీ కంటే గొప్పవాడా ???


 మాయావతి సహచరుడు కాశీరామ్‌తో కలిసి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ... ఆమె ఇంట్లో దీపం వెలిగించటానికి డబ్బు లేదు. ఆమె సైకిల్ ద్వారా ప్రచారం చేసేది!

 ఈ రోజు ... ఆమె చెప్పులు కూడా విమానంలో వస్తాయి ... ఆమె సోదరుడు తన పేరుతో ఎన్నో కంపెనీలను కలిగి ఉన్నాడు ...

 అతను నరేంద్ర మోడీ కంటే గొప్పవాడా ???


  మోడిని వ్యతిరేకించే వారు ఆలోచించి నిర్ణయించుకోండి ... ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే విషయాన్ని.


 బెటర్ ఆప్షన్ ఉంటే చెప్పండి !!

 దేశం గురించి కొంచెం ఆలోచించండి !!

 ఇంకా ఎంత నాశనం చేయాలి ??

 ఇంకా ఎంత దోచుకోవాలి ??


  నేను మోడిని ఎందుకు ఇష్టపడుతున్నానో నాకు తెలియదు, కాని ఇతర పార్టీలను ఇష్టపడకపోవడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి ...


 మంచి రోజులు వస్తాయో లేదో నాకు తెలియదు కానీ భారతదేశంలో మంచి రోజుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నాయకుడు మోడీ.


 ● #మోడీ, భరత్-మాతకు మళ్ళీ #విశ్వగురు హోదా# తేవడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహించండి. 


 భవిష్యత్తు కోసం ఆయనకు అన్ని ప్రణాళికలు ఉన్నాయని నేను ఖచ్చితంగా నమ్ముతూన్నాను!


 నేను మోడీ మద్దతుదారుని గా గర్వపడుతున్నాను.

 దేవుడు మీకు వివేకం ఇచ్చాడు ... !


 కాబట్టి ... పూర్తి నిజాయితీతో ఆలోచించండి!

 మీ కోసం మాత్రమే కాదు ... మీ దేశం కోసం-


 మీరు అంగీకరిస్తే, దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయండి ... దేశ ప్రయోజనార్థం!


  భారత్ మాతా కి జై

కృష్ణాష్టమి విశిష్టత.

 కృష్ణాష్టమి విశిష్టత.


కృష్ణాష్టమి అంటే ఏమిటి? ఏవిధంగా ఏ రోజు పూజ చేసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి, ఏమేమి నైవేద్యాలు పెట్టాలి.ఏమి దానం చేయాలి.


కృష్ణాష్టమి ని ఇంకా ఏయే పేర్లతో పిలుస్తారు.


శ్రీకృష్ణ జనన అంతరార్ధం.


కృష్ణుడి చిన్ని చిన్ని పాదాలను మాన్ ఇంట్లో కి వస్తున్నట్టుగా ఎందుకు వేస్తాం.దీని వెనుక ఉన్న అంతరార్ధం.


ఎందుకు ఏ రోజు ఉట్టి కొడతాం.ఆ ఉట్టిలో ఏమి వేస్తారు.

దీని వెనుక ఉన్న అంతరార్ధం.


https://youtu.be/LSYkN_wTZ10


కృష్ణ తత్వం అంటే ఏమిటి. కృష్ణుడి జీవితం నుంచి మనం ఏమి ఆదర్శంగా తీసుకోవాలి.


కృష్ణడుకి ఇష్టమైన పూలు ఏమిటి?ఈ పూల పేరు మీదుగా ఒక సేవ కూడా ఉంది.


కృష్ణుడు తో పాటు ఈ రోజు వీరిని కూడా పూజించాలి.పూజించడం ద్వారా సకల పాపాలు తొలగుతాయి.


ఈరోజు ఈ ఒక్క పని చేయడం వల్ల సువర్ణదానం,గోదానం చేసిన ఫలితం దక్కుతుంది.


సంతానం లేని వారు,వివాహం కానీ వారు (వివాహం ఎంత ప్రయత్నించినా కానీ వారు)ఈ రోజు ఏమి చేయాలి,ఏ మంత్రం చదవాలి.


అపమృత్యు దోషం,జాతకంలో దోషాలు,ఏలినాటి శని,ఎన్నో సమస్యలతో బాధపడేవారు ఈ రోజు ఇలా చేయండి.


ఈ రోజు ఈ ఘట్టాలను తప్పనిసరిగా చదవాలి లేదా వినాలి.


ఏఏ ప్రాంతాలలో కృష్ణాష్టమి పండుగను బాగా జరుపుకుంటారు.వారు ఏవిధంగా, ఎన్ని రోజులు జరుపుకుంటారు.


వీటి అన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.


మీ

Guru deva datta audios

జీవని.

🚩🚩🚩🙏🚩🚩🚩

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 34

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                   శ్లోకం : 34  

                           SLOKAM : 34

                                                


तत्त्वं प्रसीद भगवन् कुरु मय्यनाथे

विष्णो कृपां परमकारुणिकः खिल त्वम् ।

संसारसागरनिमग्नमनन्त दीन-

मुद्धर्तुमर्हसि हरे पुरुषोत्तमोऽसि ॥ ३४ ॥    


తత్త్వం ప్రసీద భగవన్ కురు

                             మయ్యనాథే

విష్ణో కృపాం పరమకారుణిక: 

                                   కిల త్వం I    

సంసారసాగరనిమగ్నమనంత దీనం  

ఉద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోఽసి ॥ 34


స్వామీ!    

    అనంతమైన సంసారసాగరంలో మునిగి బాధపడుతున్న ఈ దీనుని కటాక్షించుము.     

    పరమ కారుణ్యమూర్తివైన నీవు తప్ప నన్ను మరెవ్వరూ రక్షింపలేరని నిన్నే నమ్మి ఉన్నాను.    

    పురుషోత్తముడివైన నీవే నన్ను ఆదుకోవాలి.


O Supreme Lord, O Viṣṇu !   

    You are the most compassionate. 

    So now please show me Your favor and bestow Your mercy upon this helpless soul. 


O unlimited Lord!    

    kindly uplift this wretch who is drowning in the ocean of material existence.    


O Lord Hari!    

    You are the Supreme Personality of Godhead.  


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*భక్తి విశ్వాసాలు..*


చెన్నై లో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం గారు అప్పటికి ఐదు ఆదివారాలు క్రమం తప్పకుండా మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని తిరిగి వెళుతున్నారు..ఆదివారం నాడు ఉదయం తొమ్మిదిన్నర కు బస్ దిగి..మందిరం లో ఉన్న కుళాయిల దగ్గరకు వెళ్లి..శుభ్రంగా కాళ్ళూ చేతులూ కడుగుకొని..అర్చన టికెట్ కొనుక్కొని..అర్చన చేయించుకొని..మధ్యాహ్నం హారతి చూసుకొని..అన్నదాన సత్రానికి వెళ్లి..భోజనం చేసి..తిరిగి రెండుగంటలకు వెళ్లే బస్ లో బయలుదేరి సాయంత్రం రైలులో చెన్నై వెళుతున్నారు..వారితో అంతకు ముందు పరిచయం లేని కారణంగా మేమూ అందరి భక్తుల మాదిరి భావించాము..


ఆ ప్రక్కవారం మాత్రం..శనివారం నాటి సాయంకాలమే సుబ్రహ్మణ్యం గారు వచ్చారు..వస్తూ వస్తూ తనతో పాటు తన భార్యా కూతురు తో సహా వచ్చారు..రాత్రికి బస చేయడానికి ఒక రూము కావాలని నన్ను అడిగారు..2008..2009 ప్రాంతాల్లో..రూముల కొరకు ఇప్పుడున్నంత వత్తిడి మాపై లేని కారణంగా..వారికి రూము కేటాయించాము..అప్పుడే వారి గురించి వివరాలు తెలిసింది..


సుబ్రహ్మణ్యం గారు దత్త భక్తులు..తన భార్య ఆరోగ్యం, కూతురు వివాహం..ఈ రెండూ ఆయనకు సమస్యలుగా ఉన్నాయి..భార్యకు తరచూ కడుపులో నొప్పి లాగా వస్తోంది..డాక్టర్లకు చూపించారు..మందులూ వాడారు..తాత్కాలిక ఉపశమనం కలుగుతున్నది కానీ..వ్యాధి పూర్తిగా నయం కావడం లేదు..ఆ సమస్యతో సతమతం అవుతూ వున్నారు..ఈలోపల కూతురికి వివాహం కొరకు సంబంధం వచ్చింది..ఇరువైపులా అన్ని విషయాలూ మాట్లాడుకున్నారు..నిశ్చయ తాంబూలాలు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు..అంతా సవ్యంగా ఉన్నది అనుకునే సమయానికి..అబ్బాయి తరఫు వాళ్ళు ఈ సంబంధం తమకు వద్దు అని వెనక్కు వెళ్లారు..సుబ్రహ్మణ్యం గారిని ఆ విషయం తీవ్రంగా కలచి వేసింది..మనసుకు శాంతి లేకుండా పోయింది..


ఆ ప్రక్కరోజు, నెల్లూరు రావడానికి రైలులో ప్రయాణిస్తుంటే..శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి శిష్యుడొకరు వారికి పరిచయం కావడం జరిగింది..వారి వద్ద ఉన్న మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకాన్ని చూసి..కుతూహలం కొద్దీ తీసుకొని..దానిని చదవడం జరిగింది..మొగలిచెర్ల కు వెళ్లి వస్తే బాగుండు అని మనసుకు తోచి..ఒక ఆదివారం నాడు రైలులో సింగరాయకొండ వచ్చి..అక్కడనుంచి కందుకూరు మీదుగా మొగలిచెర్ల వచ్చేసారు..అలా మిగిలిన నాలుగు వారాలూ ఒక్కరే వచ్చారు..ఈ విషయం విన్న భార్యా కూతురు కూడా తామూ వస్తామన్నారు..వాళ్ళనూ వెంటబెట్టుకొని వచ్చేసారు..


ఆరోజు సాయంత్రం ఆ కుటుంబం శ్రీ స్వామివారి పల్లకీ సేవ లో పాల్గొన్నారు..ఆ రాత్రికి మందిరం లోనే నిద్ర చేసారు.. ఆదివారం నాడు శ్రీ స్వామివారి విగ్రహానికి అర్చన చేయించుకొని..సమాధి వద్ద..తమ సమస్యలు తీర్చమని మనసారా మ్రొక్కుకొని, నమస్కారం చేసుకొని..మంటపం లో కొద్దిసేపు కూర్చుని..తిరిగి వెళ్లిపోయారు..


చిత్రంగా ఆ రెండు రోజులూ సుబ్రహ్మణ్యం గారి భార్యకు కడుపులో నొప్పి రాలేదు..ఆ ప్రక్కరోజు..అమ్మాయికి సంబంధం మాట్లాడిన మధ్యవర్తి సుబ్రహ్మణ్యం గారి వద్దకు వచ్చి..అమ్మాయికి మరో సంబంధం చూశాననీ..వివరాలు ఇచ్చాడు..మరో రెండు రోజులకల్లా ఆ సంబంధం కుదరడమూ జరిగిపోయింది..అబ్బాయి విదేశం లో ఉద్యోగం చేస్తున్నందున..త్వరగా ముహూర్తం చూసి పెళ్లి చేయమని వాళ్ళు కోరారు..నెల లోపే వివాహం జరిగిపోయింది..ఈ పెళ్లి తతంగం జరిగినంత కాలమూ..ఆవిడ ఆరోగ్యం ఏ ఇబ్బందీ పెట్టలేదు..అప్పుడే కాదు..మరెన్నడూ ఆవిడ కడుపులో నొప్పితో బాధ పడలేదు..సుబ్రహ్మణ్యం గారి రెండు సమస్యలూ తీరిపోయాయి..


శ్రీ స్వామివారి ని నమ్మి కొలిచినందుకే తన కష్టాలు గట్టెక్కాయని సుబ్రహ్మణ్యం గారు తరచూ అందరితో చెప్పుకునేవారు..అమ్మాయి కాపురానికి వెళ్లిన ప్రక్క ఆదివారం నాడు, శ్రీ స్వామివారి మందిరం వద్ద సుబ్రహ్మణ్యం గారు అన్నదానం చేసారు..ఆ తరువాత నుంచీ , ప్రతిసంవత్సరమూ శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి ఆ దంపతులు వచ్చి వెళ్లడం ఒక ఆనవాయితీగా మారిపోయింది..


భక్తి విశ్వాసాల ఫలితం ఎలా ఉంటుందో మరోసారి ఋజువు అయింది..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114...సెల్..94402 66380 & 99089 73699).