🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏
🌻🙏శుభోదయం🙏*🌻
-------------------
🌺 *మహనీయుని మాట*🌺
-------------------------
"మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన. ఇది మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"ఎదురు తిరిగి గొడవ పడడానికి తెలివితేటలతో పని లేదు.కానీ పరిస్థితిని అర్థం చేసుకుని గొడవ వద్దని తెలుసుకోడానికి తెలివితేటలు చాలా అవసరం."
🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం,ఫిబ్రవరి.8,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం - శిశిర ఋతువు
మాఘ మాసం - బహుళ పక్షం
తిథి:సప్తమి తె5.34 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రo:స్వాతి తె5.52 వరకు
యోగం:గండ రా1.18 వరకు
కరణం:భద్ర సా4.46 వరకు తదుపరి బవ తె5.34 వరకు
వర్జ్యం:ఉ9.52 - 11.36
దుర్ముహూర్తము:సా4.23 - 5.08
అమృతకాలం:రా8.18 - 10.02
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.35
సూర్యాస్తమయం:5.54
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
°°°°°°°°°°°°°°°°°°°°°°
*భక్తి -- భజన*
°°°°°°°°°°°°°°°°°°°°°°
భజన యేదో కాలక్షేపానికి చేసే కర్మ కాదు...
భక్తి పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం తోనే ఉండాలి.
కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు, దేవుడా, దేవుడా అని దేవుళ్ళాడుతూ, సుఖాలు వచ్చిన ప్పుడు, మన కోర్కెలు తీరినప్పుడు దేవుని నామమే గుర్తుకు రావట్లేదు చాలా మందికి. ఇది సరియైన పధ్ధతి కాదు.
భక్తి, భజనలవల్లనే మనస్సు ప్రేమమయంగా మారుతుంది. నియమంగా భజన కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి.
ఇది వ్యక్తి గత సాధన, సామూహిక సాధన కూడా. భజనలు కృత్రిమంగా చేయకూడదు.
మనింట్లో భజన ఎంత శ్రధ్ధగా జరుపుకొంటారో, అందరి భజనలు కూడా అలాగే జరగాలని, భావించాలి.
మన భావమే భగవంతుని కి ముఖ్యం, భగవంతుని భజన చేస్తే నాకేమి వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు.
ఇటువంటి మంచి కార్యాల వల్ల, మీ కష్ట నష్టాలు ఎంత వరకూ తగ్గి పోతున్నాయో మీకు తెలీదు.
ప్రేమతో విశ్వాసం తో భజన లలో పాల్గొనండి, అమూల్యమైన టైమును, సమయమును బైట ప్రపంచంలోని వింతలు, విశేషాల తో వృధా కాలక్షేపాలతో గడిపితే ఎంతో సిగ్గు చేటు.
శాంతి సౌఖ్యాలకోసం విచారిస్తున్నారు కానీ అందుకొనుటకు ప్రయత్నాలు చేయటం లేదు.
మాటలలో ఉన్న గొప్పలు చేతలో లేవు, నామస్మరణ, భజనే మనకు నిజమైన ఆత్మ భోజనం.
*భక్తులందరూ చేరి భగవంతుడా యనుచు చెవులకింపుగ నుతి చేయు దినమే సుదినము.!!*
*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకాః సుఖినోభవంతు 🙏
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి