7, ఫిబ్రవరి 2026, శనివారం

గంజి ఉపయోగాలు*

 



          *గంజి ఉపయోగాలు*

                ➖➖➖✍️


*నేటి తరానికి గంజి విలువ గంజి ఉపయోగాలు తెలియ చేద్దాము.....*


ప్రస్తుతం మనం అన్నం వండినప్పుడు గంజిని పారబోస్తుంటాం. 


కానీ పూర్వీకులు ఆ గంజిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగేవారు. 


దీనివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 


మన పూర్వీకులు మనకన్నా బలిష్టంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. 


ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. బి, ఇ, సి విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.


*1. అతిసారం, కడుపునొప్పి లాంటివాటితో ఇబ్బంది పడుతుంటే చిన్న గ్లాసులో పలచటి గంజి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పిండి పదార్థం బైండింగ్ ఏజంట్ గా పనిచేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. డీహైడ్రేషన్, అలసటను తగ్గిస్తుంది.


*2. మహిళలకు నెలసరి నొప్పులను తగ్గిస్తుంది.


*3. ఇందులో ఉండే రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాల ఉపశమనానికి ఉపయోగపడతాయి. 


*4. బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే ఉపయోగం. ఇందులో క్యాలరీలు తక్కువ. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.


*5. గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దీనివల్ల వారు కోల్పోయే విటమిన్స్, మినరల్స్ తిరిగి పొందుతారు. 


*6. విరేచనాలు అవుతుంటే గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.✍️

-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

కామెంట్‌లు లేవు: