23, జూన్ 2025, సోమవారం

తక్కువగా మాట్లాడగ

 *2156*

*కం*

తక్కువగా మాట్లాడగ

నెక్కువ విలువొందగలవు నెక్కడనైనన్.

ఎక్కువ విలువలుగల నీ

వెక్కువగా మాటలాడ వికృతమె సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తక్కువ గా మాట్లాడటం వలన ఎక్కడనైనా ఎక్కువ విలువలు పొందగలవు. ఎక్కువ విలువలు కలిగినవాడవైననూ ఎక్కువగా మాట్లాడటం వలన వికృతంగా నే ఉంటుంది.

*సందేశం*:-- మౌనం మనిషి విలువలు పెంచుతుంది. ఎంతటి విలువైన వారైననూ ఎక్కువగా మాట్లాడితే మనుషులు తక్కువ గానే విలువ ఇస్తారు. 

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సమయం (టైమ్) లేదు*

 *సమయం (టైమ్) లేదు*


*ప్రతి ఒక్కరి నోటా, ఒకటే మాట. అదే టైమ్ లేదు*


పన్నెండు గంటల రైలు ప్రయాణం కేవలం రెండు గంటల్లో ఫ్లైట్ లో పూర్తి చేస్తున్నాడు.

అయినా టైమ్ లేదు అంటున్నాడు.


పన్నెండు మందితో ఉండే కుటుంబం ఇద్దరికి చేరిపోయింది,

అయినా టైమ్ లేదు అంటున్నాడు. 


నాలుగు వారాలు పట్టే సందేశం ఇప్పుడు నాలుగు సెకన్లలో వస్తోంది, అయినా టైమ్ లేదు అంటున్నాడు.  


ఒకప్పుడు దూరంలోని మనిషి ముఖం చూడటానికి సంవత్సరాలు పట్టేది,

ఇప్పుడది కేవలం ఒక సెకన్లో చూస్తున్నాడు. మాట్లాడు తున్నాడు. అయినా టైమ్ లేదు అంటున్నాడు.  


ఇంటి పైకి కిందకి వెళ్ళడానికి పట్టే శ్రమ ఇప్పుడు లిఫ్ట్ వల్ల క్షణాల్లో ముగుస్తోంది,

అయినా టైమ్ లేదు అంటున్నాడు.  


కట్టెల పొయ్యి, రాతి రోళ్ళతో చేసే వంటలు, గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ మిక్సి లుతో క్షణాల్లో చేసేస్తున్నాడు. అయినా టైమ్ లేదు అంటున్నాడు.  


బ్యాంక్ లో గంటల తరబడి క్యూలో కూర్చున్న మనిషి,

ఇప్పుడు మొబైల్ లో కొన్ని సెకన్లలో లావాదేవీలు చేస్తున్నాడు,

అయినా టైమ్ లేదు అంటున్నాడు.  


వారాలు పట్టే ఆరోగ్య పరీక్షలు

ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి,

అయినా టైమ్ లేదు అంటున్నాడు.  


ఒక చేతిలో స్కూటీ హ్యాండిల్, ఇంకో చేతిలో ఫోన్ –

ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు సమయం లేదు అంటున్నాడు.


కారు నడుపుతూనే ఒక చేతిలో స్టీరింగ్, ఇంకో చేతిలో వాట్సాప్. ఎందుకంటే సమయం లేదు అంటున్నాడు


ట్రాఫిక్ జామ్ అయితే రెండు లైన్లు దాటుతూ మూడో లైన్ తయారు చేస్తాడు –

ఎందుకంటే సమయం లేదు అంటున్నాడు.


నాలుగుమందితో కూర్చున్నా అసహనంగా ఫోన్‌లో వేలు వేస్తాడు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలి – సమయం లేదు అంటున్నాడు.


ఒక్కడిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, కానీ ఎవరైనా ఎదురుగా ఉంటే అసౌకర్యంగా ఫోన్ చూస్తాడు ఎందుకంటే సమయం లేదు అంటున్నాడు.


పుస్తకం చదవడానికి సమయం లేదు,

తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు,

మిత్రుడిని కలవడానికి సమయం లేదు,

ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు…


కానీ – ఐపీఎల్ కోసం సమయం ఉంది,

నెట్‌ఫ్లిక్స్ కోసం సమయం ఉంది,

రీల్స్ కోసం సమయం ఉంది,

రాజకీయాలపై చర్చల కోసం సమయం ఉంది,

కానీ తనకోసం సమయం లేదు…


ప్రపంచం సులభమైంది, వేగం పెరిగింది,

సాంకేతికత దగ్గరైంది, దూరాలు తగ్గాయి,

ఆధునికత పెరిగింది, అవకాశాలు వచ్చాయి –

కానీ మనిషికి *సమయం లేదు* అంటూ తనను తానే మర్చిపోయాడు.


నిశ్శబ్దంగా కూర్చుని తనతో మాట్లాడుకోవడానికి,

తనను అర్థం చేసుకోవడానికి,

లేదా కేవలం ఒక్క నిమిషం హాయిగా నవ్వడానికి –

సమయం లేదు అంటున్నాడు.


మరొక్క రోజు సమయమే వెళ్లిపోతుంది.

ఆఖరి క్షణంలో అర్థమవుతుంది –

సమయం ఉండింది…

కానీ మనమే “సమయం లేదు” అంటూ జీవించడాన్ని మరిచిపోయాము.


కాబట్టి, ఈరోజే నిర్ణయం తీసుకోండి –

తనకోసం కొద్దిగా సమయం కేటాయించండి,

బంధాల కోసం కొంత సమయం పెట్టండి.


మనసు కోసం, ప్రశాంతత కోసం, జీవితపు గర్భం కోసం –

కొంత సమయం వెచ్చించండి.


ఎందుకంటే "సమయం లేదు" అనేది నిజం కాదు. 


అది కేవలం అలవాటు మాత్రమే…


దానిని మార్చాలి.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      శ్లో𝕝𝕝 *యాదృశేన హి వర్ణేన* 

               *భావ్యతే శుక్లమంబరమ్l*

               *తాదృశం కురుతే రూపమ్*

               *ఏతదేవమవేహి మేll*


         *మహాభారతమ్ - శాన్తి పర్వమ్*

  

తా𝕝𝕝 *తెల్లటి వస్త్రానికి ఏ రంగు వేస్తే అది ఆ రంగుతోనే ప్రకాశిస్తుంది. అదేవిధంగా మనం ఎటువంటి స్నేహం చేస్తే అటువంటి లక్షణాలే వస్తాయి.*

                         

 ✍️VKS ©️ MSV🙏

తక్కువగా మాట్లాడగ

 *2156*

*కం*

తక్కువగా మాట్లాడగ

నెక్కువ విలువొందగలవు నెక్కడనైనన్.

ఎక్కువ విలువలుగల నీ

వెక్కువగా మాటలాడ వికృతమె సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తక్కువ గా మాట్లాడటం వలన ఎక్కడనైనా ఎక్కువ విలువలు పొందగలవు. ఎక్కువ విలువలు కలిగినవాడవైననూ ఎక్కువగా మాట్లాడటం వలన వికృతంగా నే ఉంటుంది.

*సందేశం*:-- మౌనం మనిషి విలువలు పెంచుతుంది. ఎంతటి విలువైన వారైననూ ఎక్కువగా మాట్లాడితే మనుషులు తక్కువ గానే విలువ ఇస్తారు. 

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

22, జూన్ 2025, ఆదివారం

శృంగార భాగవతము*

 *శృంగార భాగవతము*


          "లలితస్కంధము కృష్ణమూలము" అనే భాగవత పద్యాన్ని పోతనగారు శ్లేషలో రచించారు. ఆ విషయము చర్చించే

ముందు ఈ పద్యము లాంటి పూర్వరచనలను కొన్నిటిని పరిశీ లింతము...

శ్లో"

ధృతిప్రవాళః, ప్రసహాగ్ర్య పుష్ప,  

స్తపోబల,శ్శౌర్య నిబద్ధమూలః రణేమహాన్ రాక్షసరాజ వృక్ష,

స్సమ్మర్థితో రాఘవమారుతేన|| -వాల్మీకి రామాయణము.

ఇది యుద్ధకాండలో రావణుడనే రాక్షసవృక్షాన్ని రాఘవుడనే

మారుతము సమ్మర్దించడం గురించి చెప్పబడిన శ్లోకము.

         ఈ సందర్భాన హుళక్కిభాస్కరకవి ఇలా చెప్పాడు..


సారాస్కంధము, శౌర్యమూలము, విరాజద్బాహుశాఖంబు, దు

ర్వారోదార ధృతి ప్రవాళ,మతిదీవ్యత్కోప పుష్పంబు, బా

పారంభైక ఫలంబునై పరగు దైత్యాధీశ వృక్షంబు,దా

నీ రూపంబున రామహస్తి విఱిచెన్ హేలాసముల్లాసియై. -భాస్కరరామాయణము.


      వీటి సంగతి అలా స్మరణలోఉంచుకుందాము. నన్నయ భట్టు భారతాన్ని పారిజాత తరువుతో పోలుస్తూ ఇలా చెప్పాడు-

అమితాఖ్యానకశాఖలం బొలిచి వేదార్థామలచ్ఛాయ మై

సుమహావర్గచతుష్కపుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో

త్తమ నానాగుణకీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యాన జా

త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసురప్రార్థ్యమై.

                                           -భారత,ఆదిపర్వ,౧.౬౬

పైన చెప్పినవి వృక్షాలతో పోల్చి చెప్పిన వర్ణనలే.

బమ్మెరవారుకూడా భాగవతాన్ని కల్పవృక్షంతో పోలుస్తూ ఈ

పద్యము చెప్పారు- లలితస్కంధము కృష్ణమూలము శుకా లాపాభిరామంబు మం జులతాశోభితమున్ సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్ సుందరో

జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబు నై వెలయున్భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్ద్విజ శ్రేయమై -భాగవతం ౧.౨౦

        పై పద్యానికి పూర్వవ్యాఖ్యాతలు శ్లేషార్థాలు చెప్పారు.

కల్పవృక్షాన్ని భాగవతంతో పోల్చి చెప్పిన పద్యం ఇది. దీనికి

లలితాత్రిపురసుందరీ పరంగాకూడా అర్థం ఉందని విన్నాను.

ఈ పద్యానికి శృంగారపరమైన అర్థం చెప్పినవారూ ఉన్నారు.

  కల్పవృక్షం కామితఫలాన్నిస్తుంది. భాగవతకల్ప వృక్షము కోరిన ఫలరసాలను అందిస్తుంది.

  భావుకుడు శృంగార రస ఫలాన్ని భావిస్తే దాన్నే ప్రసాదిస్తుంది బమ్మెరవారి భాగవతాఖ్య కల్పతరువు.

            శృంగారపరంగా పై పద్యాన్ని ఇలా సమన్వయించవచ్చు. (ఈ సమన్వయానికి డా.యం.భానుప్రకారావు గారి సిద్ధాంత గ్రంథము ఆధారము)..

భాగవతాఖ్య కల్పతరువు= భాగవతమనే కల్పవృక్షము,

లలితస్కంధము= కామోత్కంఠితలైన గోపికాది స్త్రీజన కళా స్థానాలుగ పరిగణించబడే అంస భాగాలుకలదీ,

కృష్ణమూలము= ఆ గోపికలకు శ్రీకృష్ణుడు ఆలంబనంగాకలదీ,

శుకాలాపాభిరామంబు= ఉద్దీపన విభావాలయిన శుకపికాల కలస్వనాలతో అందగించినదీ,

మంజులతా శోభితమున్= నాయికా సదృశమైన పూలతీవలతో సుమనోజ్ఞంగా విరాజిల్లుతున్నదీ,

సువర్ణ సుమనః= మంచి రంగు కలిగినవీ, మన్మథబాణాల వంటివీ అయిన పూలు కలిగినదీ,

సుజ్ఞేయమున్= పై ఆలంబన ఉద్దీపనాలతో ఆస్వాదించతగినదీ,

సుందరోజ్జ్వలవృత్తంబు= ఆదరణీయమైన,

శృంగారరస నిర్భరమైన కథ కలిగినదీ,

మహిఫలంబు= అఖండ రసానందమే ఫలముగా కలిగినదీ,

విమలవ్యాసాలవాలంబునై= స్వచ్ఛమైన శృంగార రస భేదాలకు నిలయమైనదై,  

సద్ద్విజశ్రేయమై= సహృదయులకు మేలు కలిగించేదిగా,

ఉర్విన్=జగత్తులో/భూమిపై

వెలయున్= విరాజిల్లుతుంది.


బమ్మెరవారు భాగవతాన్ని పరిచయం చేసిన పద్యములోనే హృద్యంగా మార్మికంగా శృంగార రసాన్ని సూచించారు.


            బమ్మెరపోతనవారికి చందన మందార వందనాలు

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి.)

.

యవీయానాత్మనః పుత్రః

శిష్యశ్చాపి గుణోదితః 

పుత్రవత్తే త్రయశ్చిన్త్యా 

ధర్మశ్చేదత్రకారణమ్

(వా.రా. 4.18.14)


*అర్థం:*

తమ్ముడు, కుమారుడు, సద్గుణవంతుడైన శిష్యుడు - వీరు ముగ్గురు కూడా పుత్రులే అని భావించాలి. ఇది ధర్మం.


'శ్రీ గాయత్రీ అష్టకం' స్తోత్రం తో శుభోదయం.

*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష* 

ధర్మో రక్షతి రక్షితః

జ్ఞానప్రసూనాలు

 *🌄 జ్ఞానప్రసూనాలు🔥*


*17/06/2025*




1.పొందినవాడికి చెప్పే అవసరం లేదు. పొందనివాడికి విన్నా ప్రయోజనం లేదు.


2.శరణాగతి బుద్ధిని కూడా భగవంతుడు ప్రసాదించవల్సిందే. వేణే మార్గం లేదు.


3.తాను ఈశ్వరుడు అయ్యి కూడా

ఈశ్వరుణ్ణి కానేమో అనుకుని ఈశ్వరుడు కావడానికి తాను చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన అయ్యింది.


4.భక్తికి, భయానికి తేడా ఏమంటే-'నీ ఇష్టం' అని సంతకం పెట్టేసి స్థిమితంగా ఉండడమే శరణాగతి (భక్తి) సంతకం పెట్టకపోతే అది భయం.


5.మనం తినే ఆహార పదార్థాలలో మేలైన ఆహార పదార్ధంగా దేవుణ్ణి భోంచేయాలని చూస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే 'నవ విధ భక్తులు' ఏర్పడ్డారు. అట్లా కాకుండా తానే ఓ ఆహార పదార్ధంగా భగవంతుని ముందు నిలబడేవాడే నిజమైన భక్తుడు.


6.ప్రియురాలిగా ఉన్నప్పుడే కవిత్వాలుగాని పెళ్లామయ్యాక ఇక కవిత్వాలు ఉండవండి. దేవుణ్ణి పొందే వఱకే కీర్తనలు, స్తోత్రాలుగాని దేవుణ్ణి పొందేక ఇక మాటలు ఉండవండి.


7.ప్రసాదం అంటే -మొత్తం తానుంచుకుని కొద్దిగా దేవునికి ఇవ్వడం కాదు. మొత్తం దేవునికి ఇచ్చివేసి అందులో కొద్దిగా తాను తీసుకోవడం.


8.నేను ప్రపంచంలోకి వచ్చాను, ఉంటాను, తిరిగి ఈ ప్రపంచం నుండి నిష్క్రమిస్తాను" అని ఉన్న అనుభవవంలో నుంచి "నాలో ఈ ప్రపంచం పుట్టింది, ఉంటుంది,

తిరిగి నాలో కలిసిపోతుంది" అన్న అనుభవంలోకి మారటమే ఆధ్యాత్మిక ముఖ్య ప్రయోజనం.


9.తన శరీరంలో తన ప్రమేయం లేకుండా శ్వాసాది క్రియలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. కేవలం తాను 'ఉంటాడు'. అలానే దేవునిలో కూడా ఆయన ప్రమేయం లేకుండా సృష్టి స్థితి లయాలనేవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. కేవలం తాను 'ఉంటాడు'. జీవుడికైనా దేవుడికైనా 'ఉండటం' అనేదే స్వరూపం. దేవుడు కర్తగా అనిపించడమే గాని, కర్త కాడు. అయస్కాంతం యొక్క సన్నిథి మాత్రము చేతనే ఇనుప ముక్కల్లో కదలిక కలిగినట్లు దేవుని సమక్షంలో జగత్తు చైతన్యవంతమై ప్రవర్తిల్లుతోంది.


10.నిద్ర అనేది బ్లాక్ హోల్ లాంటింది. తనతో సహా సర్వ ప్రపంచం అందులోకి వెళ్లి లయమై పోతోంది. తిరిగి మేలుకొన్నాక కనబడే ప్రపంచం, నిద్రలోకి వెళ్లేముందు ఉన్న ప్రపంచం మాత్రం కాదు. నిద్రపోయి, లేచిన ప్రతిసారీ నీవు చూచేది మరో క్రొత్త ప్రపంచాన్నే.


11.వ్యక్తిని తూస్తే ఎంత తూకమో వ్యక్తి + జగత్తు కూడా అంతే తూకం. వ్యక్తి + జగత్తు + ఈశ్వరుడు కూడా అంతే తూకం. ఈమూడు లేకపోయినా కూడా ఉండేది అంతే తూకం. ఈతూకమే దైవం

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి) 

జ్యేష్ఠో భ్రాతా పితా చైవ 

యశ్చ విద్యాం ప్రయచ్ఛతి

త్రయస్తే పితరో జ్ఞేయా 

ధర్మ్యే చ పథి వర్తినః


(వా.రా.4.18.13)

*అర్థం:*

అన్నగారు, జన్మనిచ్చిన తండ్రి, విద్యనిచ్చిన గురువు, ఈ ముగ్గురు తండ్రులే అని ధర్మ మార్గంలో నడిచే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి.


శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం తో శుభోదయం 


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

లోభం వలన

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝 *లోభాత్క్రోధః ప్రభవతి*

              *లోభాత్కామః ప్రవర్తతేl*

              *లోభాన్మోహశ్చ మాయా చ*

              *మానః స్తంభః పరాసుతాll*


         *_మహాభారతం - శాంతి పర్వమ్_*


తా𝕝𝕝 *లోభం వలన కోపం కలుగుతుంది. లోభం వల్లనే కామం ఏర్పడుతుంది. ఈ లోభం వల్లనే మోహం, మాయ, అభిమానం, తీవ్రత, పరాధీనత మొదలైన దోషాలు సంభవిస్తాయి.*

                

 ✍️VKS ©️ MSV🙏

భద్రపరుచుకోండి

 *ఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది* 

☎️దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం : https://goo.gl/gDaGJ4

🕉️ఎ పి లో జిల్లాల వారి దేవాలయాల వివరాలు : https://goo.gl/Qzhzis

🕉️రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం : https://goo.gl/VnNaj5

🕉️జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు : https://goo.gl/X9NBUe

🕉️శక్తిపీఠాలు సమాచారం : https://goo.gl/LtvStS

🕉️గ్రూప్ టెంపుల్స్ : https://goo.gl/N9xD8M

🕉️ఆరుపడైవీడు క్షేత్రాల కోసం : https://goo.gl/HqGR8P

🕉️పంచారామ క్షేత్రాల వివరాలు : https://goo.gl/ygX5hW

🕉️పంచభూత క్షేత్రాల వివరాలు : https://goo.gl/pqtgxj

🕉️తిరుమల గురించి : https://goo.gl/mb2DGD

🕉️శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF

🕉️కాశి గురించి : https://goo.gl/DZzKa1

🕉️రామేశ్వరం గురించి : https://goo.gl/yyH424

🕉️అరుణాచలం గురించి : https://goo.gl/eFbKNE

🕉️మదురై గురించి : https://goo.gl/1Ntthd

🕉️శ్రీశైలం గురించి : https://goo.gl/ZUfFHo

📀కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి : https://goo.gl/A5UU7v

🕉️ప్రసిద్ధ శైవ క్షేత్రాలు : https://goo.gl/mn2K3y

🕉️మహాభారతం పుస్తకాలూ : https://goo.gl/v1XuqV

🕉️భాగవతం పుస్తకాలూ : https://goo.gl/9fMcDp

🕉️టెంపుల్ క్విజ్ ఆడండి : https://goo.gl/nrhsBK


➡️అందరికి షేర్ చేయండి 🙏