హరిః ఓం 🙏
మనసు అదుపులో ఉంటే....
మనసు చంచలమైనది నిత్యం కోరికలతో నిండి ఉంటుంది . అలాంటి మనసుని అభ్యాస వైరాగ్యాల ద్వారా మాత్రమే అదుపు చేయడం సాధ్యమవుతుందని గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు.
అందుకే సుఖదుఃఖాలలో వడుదుడుకులలోను మనసుని సమస్థితిలో ఉంచుకోవాలి. స్వీయ నియంత్రణకు అడ్డుపడే ఆలోచనలను నిరంతరం తొలగించుకుంటూ ఉండాలని పతంజలి యోగ శాస్త్రం బోధించింది.
మనసును స్వాధీనంలో ఉంచుకున్న వారి మీద బయట శక్తి ఏది పనిచేయదు. అంతర్ముకులైన ధీరులే అంతరాత్మను దర్శించగలరని కఠోపనిషత్తు బోధిస్తుంది. అందుకే మనసుని అంతర్ముఖం చేసుకుని పరమాత్మను దర్శించినప్పుడే మనకు శాశ్వతమైన ఆనందం, మనశ్శాంతి కలుగుతాయి.
దీనికి జపం, దైవచింతన, జ్ఞానాన్వేషణ తోడ్పడతాయి.
శుభోదయం
🧘♀️🧘♂️🧘♀️
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి