23, జులై 2025, బుధవారం

స్త్రీలలో కనిపించే ఏడు గుణాలు*

 *స్త్రీలలో కనిపించే ఏడు గుణాలు*

*<>><<>><♾️🔘♾️><<>><<>*


*నారీణాం కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ.....*




స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే అంటున్నాడు భగవానుడు.


 దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు. లేదా ఈ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు. ఇవి స్త్రీలకు సహజగుణాలు కూడా. 


ప్రతి వస్తువులోను ఒక్కొక్క విభూతిని చెప్పి, స్త్రీలలో మాత్రం ఏడు విభూతులుగా నేనున్నాను అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్ఠతను చాటుతుంది. ఏమిటా ఏడు విభూతులు...


 1) కీర్తి...


సత్కర్మలు, దానధర్మాలు, పూజాపునస్కారాలు, యజ్ఞయాగాదులు మోదలైన కర్మల ద్వారా, త్యాగభావన ద్వారా కీర్తిని సంపాదించటం, భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం ఇవి స్త్రీ సహజగుణాలు. 


 2) శ్రీ...


శ్రీ అంటే సంపద. అంతేకాదు సంపదతో బాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవటం కూడా స్త్రీ యొక్క సహజగుణమే. శ్రీ అంటే లక్ష్మి. 


 3) వాక్కు...


వాక్కు అంటే సరస్వతి. విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించటం, చల్లగా, తియ్యగా, మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే. 


 4) స్మృతి...


జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొనే జ్ఞాపకశక్తి, జ్ఞానాన్ని మరచిపోకుండా ఉండటం.


 సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవటం స్మృతి. ఇదీ భగవంతుని విభూతియే. 


 5) మేధా...


ధారణా శక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకొనే శక్తి. జ్ఞానవిషయాలు, తత్త్వవిచారణ చేయటానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం. ఇది కూడా భగవంతుని విభూతియే.


 6) ధృతి...


ధర్మ కార్యాలలో, దైవకార్యాలలో ధైర్యంతో, పట్టుదలతో పాల్గొనటం, మోక్ష సిద్ధి కొరకు పట్టుదల. ఇంద్రియ, మనస్సులను నిగ్రహించగల బలం. ఇది కూడా స్త్రీలలో అధికమే.


 7) క్షమా...


 అత్తమామలను ఆదరించటంలోను, *భర్తకు* అనుకూలంగా నడుచుకోవటంలోను, *పిల్లల పోషణలోను, బావలు, మరుదులు, తోటికోడళ్ళు మొదలైన వారితో నేర్పుతో వ్యవహరించటంలోను ఎంతో ఓర్పు* ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజగుణమే. ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి.


 విశేషార్థం...


'నార' అంటే భగవత్ సంబంధమైన.. అని. భగవత్ కార్యాలలో, లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా, స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవత్ విభూతులే...

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం -‌ చతుర్దశి - ఆర్ధ్ర -‌‌ సౌమ్య వాసరే* (23.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

22, జులై 2025, మంగళవారం

Panchaag


 

ఉన్నదానితో

 🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥

*ఉన్నదానితో సంతృప్తి చెందకుండా*

ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. 

అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే.. నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంట పడింది. వంగి, చేతుల్లోకి తీసుకున్నాడు. 

కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి. అవి చాలు. 

ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. 

దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు! 

చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్లూ సంతోషంగానే ఉన్నారు తప్ప, ఎవరినీ చెయ్యి చాచడం లేదు. సాధువుకు సంతోషం వేసింది. 

ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు. 

తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు, తన సైన్యంతో పక్కరాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు. 

అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే, రాజు వారికి ఆగమని సైగ చేసి, రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు.

ఓ సాధు పుంగవా.. రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను.

నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి’’ అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. 

రాజు ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటి దీనర్థం’ అన్నట్లు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ‘ఓ మహారాజా.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. 

దీని అవసరం నాకు లేకపోవడంతో, అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను. 

అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. 

ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను’’ అని చెప్పాడు. 

రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు. 

నిరంతరం.. లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే, ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. 

*ఆ భాగ్యం లేని వాడు.. ఎంత ఉన్నా.. ఏమీ లేనివాడే!*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సర్వేజనా సుఖినోభవంతు*

*లోకా సమస్త సుఖినోభవంతు*

 *శుభం భూయాత్*

*ఓం శాంతి శాంతి శాంతిః*

🙏🙏🙏🙏🙏

కరివేన నిత్యాన్నదాన సత్రం satraalu

 🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️

https://youtu.be/B6OYzjvhf14?si=sv7KPJSeWoezT5Ee   


*అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం, ఈక్రింది సెల్ నెంబర్లను ప్రకటించారు 🙏*


1. *శ్రీశైలం* :-

8333907 784--8333907 787


2.*కర్నూలు* *సెంట్రల్* *ఆఫీస్* :-

8333907 783---8333907 80


3. *మహానంది* :-

8333907 802,---8333907 803


4.*త్రిపురాంతకం* :-

8333907 794,----8333907795


5. *_విజయవాడ_* *వృద్ధాశ్రమం* :-

8333907813,--8333907 807.


 6.*కాణిపాకం* :-

8333907812,--8333907 813.


7. *భద్రాచలం* :-

8333907 796--8333907 797.


8. *యాదగిరిగుట్ట* :-

8333907 815,---8333907813.


9. *అలంపూర్* :-

8333907 805,---8333907806.


10. *అరుణాచలం* :-

8333907 816, 8333907 817.


 *11,రామేశ్వరం* :- 

8333997 793,--8333907 813


12. *షిర్డీ* :- 

8333907 798,--8333907 800.


13. *కాశీ* :- 

8333907 790,---8333907791.


14. *బృందావనం* ( *మధుర* ),

8333907 789,--8333907 813.


15. *నైమిశారణ్యం* :-

8333907 804,---833390 813.


16. *తిరుపతి* :-

8333907 807,---8333907810.


 *అత్యవసర* *సేవల* *కొరకు* ,8333907813,---8333908808.


🚩లోకా సమస్తా సుఖినో భవంతు.

అదియే సత్యము...

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *సత్యస్య వచనం శ్రేయః*

             *సత్యాదపి హితం వదేత్|*

             *యద్భూతహిత మత్యన్తం*

             *ఏతత్సత్యం మతం మమ||*

 

      *--- _సుభాషితరత్నావళిః_ ---*


తా𝕝𝕝 సత్యము చెప్పుట శ్రేయస్కరము.... సర్వభూతహితముగా పలుకు సత్యము మంచిది.... ఎందుచేతననగా *దేనివలన సర్వభూతహితమగునో అదియే సత్యము....*


 ✍️VKS ©️ MSV🙏

కవితా రథి - దాశరథి.

 అసలు సిసలు కవితా రథి - దాశరథి.


  దాశరథి కృష్ణమాచార్యులు కేవలం సినీగేకవి మాత్రమే కాదు. ఒక అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా నిజాంకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ వీరుడు. 

22-7-1925 వరంగల్ జిల్లాలో వెంకటమ్మ, వెంకటాచార్యులకు జన్మించాడు. నిజాం నిరంకుశ పాలనలో విద్యాభ్యాసం చేశాడు. "మా నిజాం రాజు జన్మజన్మల బూజు" అంటూ అక్షరానికి ఉద్యమ స్వరూపం ఇచ్చిన వ్యక్తిత్వం ఆయనది. నిరంతరం తిమిరంతో సమరం చేస్తూ కాంతికిరణాలను ప్రసారంచేసే కవి సూర్యుడు. అగ్నిధార, రుద్రవీణ, మార్పు నా తీర్పు, తిమిరంతో సమరం వంటి ఆయన అనేక కవితా సంకలనాలు నాటికి నేటికి చెక్కుచెదరని సంపదులుగా తెలుగు నాట వెలసాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మొదటి ఆస్థాన కవిగా గౌరవం ఆయనకే దక్కింది. 

    'ఖుషి ఖుషిగా నవ్వుచు చలాకి మాటలు రువ్వుచు' సినీ రంగంలో ప్రవేశించి... 'గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుది' లాంటి హుషారు గొలిపే గీతాలతో జనాలను ఈలలు వేయించారు. 'నడిరేయి ఏ జాములో'' అంటూ 'వేయి వేణువులు మ్రోగే వేళ ననుపాలింపగా నడచీ వచ్చితివా' అని బుద్ధిమంతుడిలా భక్తి గీతాలు అందించారు. 'దివి నుండి భువికి దిగివచ్చి' 'నన్ను వదిలి నీవు పోలేవులే అన్న యుగళ గీతాలు నేటికీ మన మధ్య నుండి పోలేవులే. 'ఏ ధివిలో విరిసిన పారిజాతమో' అంటూ బాలు గారి గళాణినికి ఎంతో గుర్తింపు తెచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే 'మదిలో వీణలు మ్రోగే', 'నేనె రాధనోయి,' లాంటి వీనుల విందైన వీణ పాటలంటే దాశరథే అన్న ప్రత్యేక ముద్ర వేయించుకొన్నారు. 'తల నిండ పూదండ దాల్చిన రాణి,' అన్న లలిత గీతం ఘంటసాల గళం నుండి పరిమళాలు వెదజల్లింది. 

అందుకే ఆ పేరులో 

'దాశరథి' అంటే శ్రీరామచంద్రుడుగ

'దా' లేకుండా 'శరథి' అంటే సముద్రం లాంటివాడు, కవితలనె అమ్ముల పొది,

'శ' లేకుండా 'రథి' అంటే అతిరధి మహారధి, మార్గదర్శియని '

ర' కూడా లేకుండా 'థి'అంటే బుద్ధిశాలి, జ్ఞాని అని అర్థం.

ఇంతటి మహాకవిని ఆయన శత వసంతాల జన్మదినాన తలుచుకోవడం తెలుగు వారికి గర్వ కారణం.

               💐 శుభదినం 💐 


                          - కడియాల

హరిహరనాధుడు



హరిహరనాధుడు-తిక్కన.

శ్రీయనగౌరినాబరగు చెల్వకుఁజిత్తముబల్లవింప భ

ద్రాయతమూర్తియై హరిహరంబగురూపముఁదాల్చి విష్ణురూ

పాయనమశ్శివాయ యనిగొల్చెడు భక్తజనంబు వైదిక 

ధ్యాయిత కిచ్చమెచ్చుపరరూపముగొల్తు నభీష్ఠ సిధ్ధికిన్!!

ఆం-మహాభారతం-విరాట ప్రారంభపద్యం!

  తిక్కన శివకేశవాభేదవాది.తన సమకాలంలో విజృభించే శైవ వైష్ణవ మతముల ఘర్షణ నణగింపనెంచి యతడు హరిహరనాధుని నెలకొలిపి ,హరిహరాద్వైతమును ప్రచారమొనరించెను.తద్వారా చేతనైనంతమేరకు మతఘర్షణలనణగింపయత్నించెను.అతని ఫలించెనోలేదో తెలియదుగాని నాటి యతని సామాజిక సంస్కరణ దృష్టికిప్రతీకగా ఈపద్యము హరిహరాభేదసూచకమై ఆంధ్రవాఙ్మయము నలంకరింపజేసినది.

       ఇందు శివకేశవాభేదము ప్రస్ఫుటముగా ప్రతిపాదింపబడినది.

                  స్వస్తి!🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

21, జులై 2025, సోమవారం

తెలుగు లిపి పరిణామం -- నన్నయ పాత్ర🙏

 🙏తెలుగు లిపి పరిణామం -- నన్నయ పాత్ర🙏

భాషా చరిత్రలో కూడా నన్నయకు సముచిత స్థానం ఉంది 

మౌర్యుల తరవాత బ్రాహ్మీ లిపి దేశమంతా విస్తరించింది. మెల్లమెల్లగా, ఉత్తరాది లిపికి, దక్షిణాది లిపికి మధ్య తేడాలు కనిపించడం మొదలయ్యింది. ఇంతకు ముందు భారత లిపులలో, హల్లులో అకారాన్ని అంతర్గతం చెయ్యడానికి తలకట్టు, పైన గీత వంటి ఒక గుర్తు ప్రతి హల్లు రూపానికి ఉంటుంది . ఈ పద్ధతి మౌర్యుల కాలం తర్వాత వ్యవస్థీకృతం అయ్యింది. ఒరియా లిపిలో గొడుగు, తెలుగులో తలకట్టు, నాగరి లిపిలో పైన అడ్డంగా గీసే గీత – ఇవన్నీ హల్లుకి అ-కార సంపర్కాన్ని తెలియజేసేవే. అందుకే కాబోలు, దక్షిణాది ఉత్తరాది లిపుల మధ్య తేడాలు కూడా ఈ కాలంలోనే ప్రస్ఫుటమైన ముద్రతో వచ్చాయి. నిలువు గీతలున్న అక్షరాల్లో గీత పరిణామం ఒకే పొడుగుకి చెయ్యడం, క, గ అక్షరాల్లో నిలువుపాటి గీతలను కాస్త సాగతీసి వాటిని గుండ్రంగా చెయ్యడం, ఇవన్నీ ఈ కాలంలో లిపి స్వరూపంలో వచ్చిన మార్పులు.

తమిళ బ్రాహ్మీ లిపి 

ఉత్తరాది లిపులకంటే దక్షిణాది లిపులలో ఎన్నో మార్పులు వచ్చాయి. భట్టిప్రోలు శాసనాల లిపిలో ప్రత్యేకత హల్లు నుంచి అంతర్గతమైన అ-కారాన్ని తీసేసి, అకారాన్ని సూచించడానికి మిగిలిన అచ్చుల లాగానే ఒక ప్రత్యేకమైన గుర్తుని హల్లుకి జత చెయ్యడం. అంటే భట్టిప్రోలు శాసనలిపిలో ‘క’ మిగిలిన లిపులలో ‘క్’ అనే వ్యంజన రూపానికి సమానమైనది. ఇది కాక, ఘ, జ, మ, ల స (శ) లకు కూడా బ్రాహ్మీ కంటే వేరు రూపాలున్నాయి.


ఈ కాలంనాటి దక్షిణాది లిపులలో ముఖ్యంగా చెప్పుకోవలసినది తమిళ బ్రాహ్మీ శాసనలిపులు. ఈ శాసనాలన్నీ కూడా నాలుగైదు వాక్యాల దానాల పట్టాల వంటివి. ఇవి ఏ కాలానికి చెందినవనే విషయంపై ఇంకా ఏకాభిప్రాయం లేదు. ఈ తమిళ బ్రాహ్మీ లిపికి కూడా రెండు ప్రత్యేకతలున్నాయి: 1. నాలుగు కొత్త అక్షరాలు (న, ఱ, ఱ (ఇది డ్జ) ళ ) – ఇవి బహుశ ద్రావిడ భాషల లోని శబ్దాల కోసం అవసరమై ఉండొచ్చు. 2. అచ్చులను రాసే పద్ధతి భట్టిప్రోలు శాసనాలలో లాగానే, బ్రాహ్మీ లిపికి వేరుగా ఉంటుంది.

భాషాపరంగా కన్నడ తమిళ భాషలు దక్షిణ ద్రావిడ కుటుంబానికి చెందినవి. కాని, చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది. శాతవాహనుల కాలములోనే భట్టిప్రోలు లిపి కర్ణాట దేశానికి వ్యాప్తి చెందింది. ఆంధ్రదేశము, వేంగీ విషయము, కమ్మనాడు, పుంగనూరు వాస్తవ్యుడైన పంప అనే బ్రాహ్మణపండితుడు జైనమతావలంబియై వేములవాడను పాలించిన అరికేసరి అను చాళుక్య రాజు ఆశ్రయముపొంది విక్రమార్కవిజయము అనబడు తొలి కన్నడ గ్రంథము వ్రాశాడు. ఇతడే కన్నడ సాహిత్యానికి ఆది కవి.తెలుగు కన్నడ లిపులు ముడిపడి ఉండడానికి ఇలాంటి కారణాలు కొన్నిఉన్నాయి. .


తెలుగున నన్నయ్య కావ్యవ్యాకరణచ్చంద సంప్రదాయములకేకాక, తెలుగు లిపి సౌందర్యము నావిష్కరించుటయందు ప్రథమాచార్యుడు. నన్నయకు పూర్వము తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది. దానిని వేంగీచాళుక్య లిపి అని దానిపేరు.నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే వ్రాయబడినవి. ఆ లిపి చతురస్రముగాను, తలకట్లు గీతలకొరకు గంటము వ్రాతకు సాధనముగా ఏర్పడినది. తాటాకుపైనగాని గంటముతో వ్రాయునప్పుడు తలకట్లు అడ్డుగీతలుగా వ్రాసిన తాటాకు చినిగిపోవును. తలకట్టు-అనగా ఆకారమునకేగాక, ఆ దీర్ఘము వ్రాయవలసివచ్చినప్పుడు, ఆ దీర్ఘమును ఇప్పటివలె ా వ్రాయక --- అని నిలువుగీతగా రాసేవారు. ఒ కార చిహ్నమగు కొమ్ము ొ ా అని గీతగానే ఉండేది. -జ్క, ణ్బ, న + తవత్తు, ం + ప వత్తు, ఞ + చ వత్తు -అను రీతిగా వ్రాసెడివారు. ఇట్టివి తాటియాకుపైన వ్రాయుట కష్టసాధ్యము.

ఉదాహరణకు : పఞ్చాఙ్గము అని పూర్వము వ్రాసేవారు తాటాకు ఇది వ్రాయడం కష్టం కావున -పంచాంగము అని ఇటువంటి మార్పులతో నన్నయ గారు వ్రాశారు. ఇటువంటి ఉదాహరణలు భారతములో ఎన్నైనా చూపవచ్చు. 


నన్నయ వీటిని పరిశీలించి, పైగా తెలుగు లిపిని చతురస్ర స్వరూపమునుండి గుండ్రదనమునకు మార్పు చేసి పలు మార్పులు చేసాడు. అవే తలకట్టునకు ా గాక ప్రస్తుత తలకట్టు లాగా, కొమ్ముల మార్పు ప్రస్తుత వరుసగా, ర్గ సంయుక్తాక్షరములు అనునవి పంకచంక-ఖండ-నంద-డింబ-అనురీతి పూర్ణబిందువులుగా వ్రాయుట, రకార సంయుక్తాక్షరములను ర్క, ర్త, ర్చ మొదలగునవి అర్క-అక౯, కర్త-కత౯, కర్చ-కచ౯ గా వ్రాయుట మొదలుచేసాడు. ౯ ఈ చిహ్నమునకే వలపలగిలక అని పేరు. ఈ వలపలగిలక వలన రకార సంయుక్తాక్షరములుగా నుండక ఏకాక్షరములుగా ఉండును. ఇందువలన లిపికి సమత ఏర్పడినది, అంతకుముందున్న ఒక అక్షరము శకటరేఫముకన్నా భిన్నమైనది, ష్జగా పలుకునదానిని "డ"గా మార్చాడు. ఈ మార్పుల వలన తెలుగు లిపికి గుండ్రనిదనము, సౌందర్యము చేకూరినవి. తెలుగులిపినందు ఈమార్పులు చేయుటయేకాక నన్నయ, తాను వ్రాసిన నందంపూడి శాసనము లో తాను ప్రతిపాదించిన సంస్కరణలిపిని ప్రవేశపెట్టి - ఆవెనుక తాను వ్రాసిన మహా భారతమును ఆ లిపిలోనే వ్రాసినాడు. తెలుగు అక్షరములకు అంతకుముందులేని రమ్యతను-లేక మనోహరత్వమును తాను ప్రతిపాదించుటచేత - నన్నయ తెలుగులిపి సౌందర్యమును వ్యక్తపరిచాడు. అక్షర రమ్యత లిపి సంబంధమైనది అనే విషయాన్ని గమనించగలరు 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

నిజాన్నిచెప్పేవాడికి

 **నిజాన్నిచెప్పేవాడికి చాలా ధైర్యం ఎక్కువ **

**నిజాన్ని దాచేవాడికి చాలా భయం ఎక్కువ ఆయుష్షు తక్కువ **

@@@@@@ @@@@

**అబద్దానికి అర్ధాయుష్షు నిజానికి నిండునూరేళ్లు అన్నారు పెద్దలు **

**కానీ నిజాన్ని కోడిపిల్లలా తన్నుకెళ్తున్నాయి కొన్ని గద్దలు **

**ఆచరించలేనివారు చెప్పేవి సుద్దులు **

**మంచిమాటలు ఎల్లప్పుడూ వెన్నముద్దలు **

**కొందరికి పుట్టుకతోనే వస్తాయి మంచిబుద్ధులు ***

**స్వచ్ఛమైన స్నేహంలో తప్పకుండా ఉండాలి హద్దులు **

**నిజానికి నిస్వార్ధపరులంటే మక్కువ **

**అందుకే నిజాన్నిచెప్పేవాడికి ధైర్యం ఎక్కువ **

**అబద్దాలాడే నాయకులకు ఆయుష్షు చాలా తక్కువ **

**మద్యపానం మధ్యలోనే పోతుంది ప్రాణం అని తెలుసుకో మహానుభావ **

**మధ్యనిషేధం అని మధ్యతరగతి కుటుంబాలలో విషాదం నింపిన గత ప్రభుత్వం పాపాలు జనాల కంటిపాఫలను తెరిపిస్తున్నాయి **

**నిజాలు కోట్లమందికి తెలుస్తున్నాయి **

**నిజాన్ని జీర్ణించుకోలేని గొంతులు వంతులవారీగా అరుస్తున్నాయి **

**కోర్ట్ ని అలుసుగా తీసుకున్నవారి కంట్లో పచ్చిపులుసు పడ్డట్టుంది ** 😂

**నిజం నీడలాంటిది దాన్నుంచి ఎవరు తప్పించుకోలేరని అందరికి అర్ధం అయింది **

**అవునా కాదా?**

**బొమ్మిన వెంకటరమణ **

**83746 01678**

**మనసున్న వారు మాత్రమే స్పందించి నన్ను అభినందిస్తున్నారు **