🕉️🌹🪔🛕🪔🌹🕉️
🌹 *ఆదివారం*🌹
🕉️ *నవంబరు 17, 2024*🕉️
🚩 _*కార్తీక పురాణం*_🚩
_*16 వ అధ్యాయము*_
మరియు
ఈరోజు నుండి
_*వృశ్చిక సంక్రమణం*_
ప్రారంభం
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*స్తంభ దీప ప్రశంస*
☘☘☘☘☘☘☘☘️☘️
*వశిష్టుడు చెబుతున్నాడు -*
*"ఓ రాజా ! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన , దాన , వ్రతాదులను చేయుట , సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో , అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువకుండ , తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ధ పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి , భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు , నారికేళ ఫలదానము జేసిన యెడల - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.
సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపముగాని , స్తంభ దీపము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశర్యములు కలిగి , వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు శాలిధాన్యంగాని , నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీప ముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును , లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.
*దీప స్తంభము విప్రుడగుట*
ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మాతంగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని , దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని , నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ ఆశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాలపై దీపములు వెలిగించి , కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి *"ఓ సిద్దులారా ! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా ! రేపు కార్తీకశుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభముపాతి , దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కునివత్తము , రండు"* అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి , అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి , దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి *"ఓయీ నీ వేవడవు ? నీవీ స్తంభమునుండి ఎలా వచ్చితివి ? నీ వృత్తాంతమేమి"* అని ప్రశ్నించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి *"పుణ్యాత్ములారా ! నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక , దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచె నా కాళ్ళు కడిగించి , ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి , నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను , పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని , నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై , పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి , లక్ష జన్మలముందు కుక్కనై , పదివేల జన్మలు కాకినై , ఐదువేల జన్మలు తొండనై , ఐదు వేల జన్మలు పేడపురుగునై , తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని , నన్ను మన్నింపు"* డని వేడుకొనెను.
ఆ మాటలాలకించిన , మునులందరు నమితాశ్చర్యమొంది *"ఆహా ! కార్తీకమాస మహిమ మెంత గొప్పది అదియునుగాక , కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు , రాళ్లు , స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్తంభమునకు ముక్తికలిగిన"* దని మునులు అనుకోనుచుండగా , ఆ పురుషుడా మాటలాలకించి *"మునిపుంగవులారా ! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా ? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును ? అది నశించుటెట్లు ? నాయీ సంశయము బాపు"* డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరులందరును తమలో నోకడగు అంగీరసమునితో *"స్వామి ! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన , వివరించు"* డని కోరిరి. అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు.
*ఇతి స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షోడశాధ్యాయము - పదహారో రోజు పారాయణము సమాప్తం.*
🌷 *సేకరణ*🌷
🌹🪔🕉️🕉️🪔🌹
*న్యాయపతి*
*నరసింహా రావు*
🙏🙏🕉️🕉️🙏🙏
🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏
🚩 *ఈ రోజు నుండి వృశ్చిక సంక్రమణం ప్రారంభం🚩*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
వృశ్చిక సంక్రమణంను *'వృశ్చిక సంక్రాంతి'* అని కూడా పిలుస్తారు, ఇది తుల రాశి నుండి వృశ్చిక రాశి వరకు సూర్యుడి కదలికను సూచిస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్లో ఈ పరివర్తన తుల రాశిచక్రం నుండి స్కార్పియో రాశిచక్రం వరకు సూర్యుని కదలికకు అనుగుణంగా ఉంటుంది. భారతీయ జ్యోతిషశాస్త్ర రాశి వ్యవస్థలో , వృశ్చిక రాశి 8 వ స్థానాన్ని ఆక్రమించినట్లు గుర్తించబడింది. వృశ్చిక సంక్రాంతిలో సూర్య భగవంతుని యొక్క ఈ గ్రహ మార్పు శక్తిని తిరిగి పొందడానికి సహాయపడుతుంది మరియు సంవత్సరంలో ఒక నిర్దిష్ట సమయంలో సంభవిస్తుంది. వృశ్చిక సంక్రాంతి పండుగ తమిళ క్యాలెండర్లో *'కార్తిగై మసం'* మరియు మలయం క్యాలెండర్లో *'వృశ్చిక మాసం'* ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజు హిందూ సమాజ అనుచరులకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది మరియు వృశ్చిక సంక్రాంతి యొక్క ఆచారాలు అపారమైన భక్తితో మరియు ఉత్సాహంతో పాటిస్తారు.
*వృశ్చిక సంక్రాంతిపై ఆచారాలు :*
వృశ్చిక సంక్రాంతి రోజు సూర్య భగవానుని ఆరాధించడానికి అంకితం చేయబడింది. హిందూ భక్తులు సూర్య భగవాన్ తన దైవిక ఆశీర్వాదం కోరుతూ ప్రార్థిస్తారు. వృశ్చిక సంక్రాంతి రోజు సంక్రమణ స్నాన , విష్ణు పూజలకు అనుకూలమైనది. ఈ రోజులో 'దేవుని' యొక్క కర్మ గరిష్ట ప్రయోజనాలను పొందడానికి నిర్దిష్ట సమయములో చేయాలి. వృశ్చిక సంక్రాంతి సందర్భంగా 'శ్రద్ధ' మరియు 'పిత్రు తార్పాన్' ఆనాటి ముఖ్యమైన ఆచారాలు.
వృశ్చిక సంక్రాంతిలో , సంక్రాంతి క్షణానికి ముందు పదహారు ఘాట్లు (1 రోజు = 60 ఘాటిలతో) శుభ సమయం ప్రారంభమైంది. పుణ్య కార్యకలాపాలను నిర్వహించడానికి ఉత్తమ సమయం శుభ సమయం ప్రారంభం నుండి అసలు సంక్రాంతి క్షణం వరకు చేయాలి. ఒక ఆవును బ్రాహ్మణ వృశ్చిక సంక్రాంతికి దానం చేస్తే పరిశీలకునికి అపారమైన ధర్మాలు లభిస్తాయని నమ్ముతారు. హిందూ మత గ్రంథాలు , 'విష్ణు సహస్రనామ' , 'ఆదిత్య హ్రదయం' వంటి పుస్తకాలను చదవడం చాలా అనుకూలమైనదని నమ్ముతారు. భక్తులు సూర్య భగవానుని స్తుతిస్తూ స్తోత్రాలు లేదా వేద మంత్రాలను పఠిస్తారు.
*వృశ్చిక సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత:*
హిందూ సౌర క్యాలెండర్ ప్రకారం , సంవత్సరంలో 12 సంక్రాంతిలు ఉన్నాయి మరియు వీటిలో ప్రతి సంక్రాంతి కొత్త హిందూ నెల ప్రారంభానికి గుర్తుగా ఉంది. వీటిలో వృశ్చిక సంక్రాంతి హిందువులకు , ముఖ్యంగా భారతదేశంలోని తూర్పు ప్రాంతాలలో నివసించేవారికి చాలా పవిత్రమైన రోజు. హిందీలో 'సాన్' అనే పదం 'పుష్కలంగా' సూచిస్తుంది మరియు *'క్రాంతి'* అనే పదం 'సమూల మార్పు'ను సూచిస్తుంది. అందువల్ల సంక్రాంతి పండుగ మన జీవితంలో మంచి మార్పులను తెస్తుంది.
*ఆధ్యాత్మిక బృందం నుంచి వచ్చినది భాగస్వామ్యం చేయడమైనది* 🙏
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి