17, నవంబర్ 2024, ఆదివారం

సమస్య పూరణ

 *సుద్దులc జెప్పు పెద్దలనుc జూచి జనుల్ పరిహాస మాడరా*

ఈ సమస్యకు నాపూరణ 


హద్దులు మీరి యక్రమము నార్జన చేయుచు సుద్దపూసలై


పద్దులు కూడ బెట్టుటకె, పట్టుగ  కష్టము జేయనేరరే 


గద్దెను నెక్కుటే ప్రథమ కార్యము, నేతల దుష్కృతంబులౌ 


సుద్దులc జెప్పు పెద్దలనుc జూచి జనుల్ పరిహాస మాడరా! 


అల్వాల లక్ష్మణ మూర్తి.

కామెంట్‌లు లేవు: