19, సెప్టెంబర్ 2026, శనివారం

హనుమాన్ బాహుక్



**🙏🌹*హనుమాన్ బాహుక్*🙏🌹 

              *🌷ఎనిమిదవ రోజు🌷*


దూత రామరాయకో, సపూత పూత పౌనకో, తూ 

అంజనీకో నందన ప్రతాప భూరి భాను సో |

సీయ - సోచ - సమన దురిత - దోష దమన, 

సరన ఆయే అవన, లఖనప్రియ ప్రాన సో ॥ 

దనముఖ దుసహ దరిద్ర దరిబేకో భయో, 

ప్రకట తిలోక ఓక తులసీ నిధాన సో ॥ 

జ్ఞాన - గునవాన బలవాన సేవా సావధాన । 

సాహెబ సుజాన ఉర అను హనుమానసో ॥


వివరణ : శ్రీ హనుమంతుడు శ్రీరామచంద్ర ప్రభునకు దూత,

వాయుదేవునికి యోగ్యుడైన కుమారుడు, అంజనాదేవికి ఆనందము కలిగించే వాడు, అసంఖ్యాక సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడు, సీతశోక వినాశకుడు, పాపములను, అవగుణములను తొలగించువాడు, శరణాగత రక్షకుడు, లక్ష్మణునకు ప్రాణసమానమైన వాడును. అట్టివాడు ఈ తులసీదాసుయొక్క దుస్సహ దారిద్య్ర రూపియగు రావణుని నాశనము చేయుటకై ముల్లోకములందును ఆశ్రయరూపుడై ప్రకటమగుచున్నాడు.


కనుక ఓ జనులారా! మీరు జ్ఞానవంతులు, గుణవంతులు, బలవంతులు, సేవాభావులు కావాలి అనుకుంటే ఎల్లవేళల జాగరూకుడై యుండు హనుమంతునివంటి సమర్థుడగు దేవుని హృదయమున ఉంచు కొనండి. హనుమంతుడు సర్వశక్తి సమన్వితు డగుటవలన ఏ కోరికలు కలవారయినను ఆతనినే ప్రార్థించి పొందవచ్చు అని అర్దం.


ఈ శ్లోకం లో హనుమంతుడు చేసిన అన్నీ గొప్ప పనులను చెపుతూ ఆ హనుమంతుడు నన్ను అంటే తులసి దాసును దుస్సాహంగా రావణుడు ఎలా లోకాన్ని ఇబ్బంది పెట్టాడో అలా ఇబ్బంది పెట్టే నా సమస్యను తీర్చుగాక అని అంటూ,ఓ జనులారా మీరు జ్ఞానవంతులు, గుణవంతులు, బలవంతులు, ధైర్యవంతులు కావాలంటే ఆ స్వామి హనుమను హృదయంలో ఉంచుకోండి మీ కష్టాలు పోతాయి కోరికలు తీరుతాయి అని మనకు సూచిస్తున్నారు.


🙏🌹*జై శ్రీరామ్ జై హనుమాన్*🙏🌹


          *🍁సేకరణ🍁*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*



కామెంట్‌లు లేవు: