23, అక్టోబర్ 2026, శుక్రవారం

శుక్రవారం రాశి ఫలితాలు

  శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

23-10-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.          

---------------------------------------


వృషభం


నూతన వాహనం కొనుగోలు చేస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది.కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది.        

---------------------------------------


మిధునం


ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాల విస్తరణలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కుటుంబసభ్యులతో వివాదాలు తప్పవు.           

---------------------------------------


కర్కాటకం


వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాలకు హాజరు అవుతారు.    

---------------------------------------


సింహం


ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి.  సన్నిహితుల నుండి విమర్శలు ఎదురవుతాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాదాలకు సంభందించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.      

---------------------------------------


కన్య


దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు పడుతుంది  ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు బంధుమిత్రులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.       

---------------------------------------


తుల


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు . నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి . వ్యాపార, ఉద్యోగాలలో  సమస్యలు కొంత బాధిస్తాయి .అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.          

---------------------------------------


వృశ్చికం


కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన   పనులు సమయానికి పూర్తి చేస్తారు సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కారమౌతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.         

---------------------------------------


ధనస్సు


మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.              

---------------------------------------


మకరం


సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. నూతన కార్యక్రమాలు  చేపడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటాయి.విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.            

---------------------------------------


కుంభం


ఉద్యోగమున ఉన్నత అధికారులతో చర్చలు కలుస్తాయి.ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూ క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.                

---------------------------------------


మీనం

 

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధన పరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

---------------------------------------

కామెంట్‌లు లేవు: