🔔 *ఆరోగ్యం*🔔
*నిద్రకు ఉపయోగపడే పోషకాలు*
కడుపు నిండా తిని శారీరక శ్రమ చేస్తే మంచి నిద్ర పడుతుంది. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. కొన్ని పోషకాల లోపం కూడా నిద్రలేమికి కారణం.```
*1. మెగ్నీషియం:* ```
నిద్రను నియంత్రించడంలో కీలకం. లోపిస్తే నిద్ర పట్టదు. ఆకుకూరలు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, బీన్స్, కొన్ని రకాల చేపల్లో ఎక్కువగా ఉంటుంది.```
*2. పొటాషియం:* ```
నాడులు, కండరాల నియంత్రణకు అవసరం. లోపిస్తే నిద్రకు ఇబ్బంది. అరటిపండులో రోజుకు అవసరమైన 10% ఉంటుంది. పొట్టు తీయని ధాన్యాలు, మాంసం, బీన్స్, ఆకుకూరలు, ఉడికించిన ఆలుగడ్డలో లభిస్తుంది.```
*3. విటమిన్ డి:* ```
ఎముకల దృఢత్వానికి అవసరం. లోపిస్తే నిస్సత్తువ, పగటి మగత వచ్చి రాత్రి నిద్రకు ఆటంకం. రోజూ కాసేపు ఎండలో ఉంటే శరీరమే తయారు చేసుకుంటుంది.
*సందేహాలు ఉంటే దగ్గరలోని మంచి డాక్టర్ గారిని సంప్రదించండి.
*పిప్పి పన్ను నొప్పి (Tooth Decay Pain):
తిన్న ఆహారం జీర్ణం కావడానికి దంతాలు ముఖ్యం. దంతాల్లో ఇన్ఫెక్షన్, పుచ్చిపోవడం వస్తే నొప్పి తీవ్రంగా ఉంటుంది. పాడైన దంతాన్ని తిరిగి బాగు చేయలేము కానీ ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవచ్చు.
*తేనె ప్రయోగం:*
పిప్పి పన్ను మీద లేదా గుంతలో తేనె చుక్కలు వేయడం వల్ల నొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. తేనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ. రోజుకు 4-5 సార్లు వేయాలి. దంతాలు నొప్పిగా ఉన్నప్పుడు తేనెతో బ్రష్ చేసుకోవడం వల్ల నొప్పి, నోటి దుర్వాసన తగ్గుతాయి. రోజుకు రెండుసార్లు చేయవచ్చు.
https://youtu.be/SZieisuTSUs
*వాపు ఉన్నప్పుడు వేడి నీటితో కాపడం పెడితే ఉపశమనం ఉంటుంది. వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతూ ఉపవాసం చేయడం వల్ల కూడా వాపు తగ్గుతుంది. నాణ్యమైన తేనెనే వాడాలి.
నొప్పి తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. సర్వేజనా సుఖినోభవంతు.```
*సూర్యుడి చేత వండబడిన పచ్చి ఆహారం గురించి:-*```
*పచ్చి ఆహారం వల్ల కలిగే మేలు:
*సూర్యుడి చేత వండబడిన పచ్చి ఆహారం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మనం తినే ఆహారంలో 70% పచ్చి ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
చాలామంది ఉదయం ఇడ్లీ, దోశ, కాఫీ, టీ, పాలు మానేసి పచ్చి కూరగాయల జ్యూస్ తాగడం, తరువాత మొలకెత్తిన విత్తనాలు తినడం, సాయంత్రం పండ్లు, పండ్ల జ్యూస్ లు తాగడం చేస్తుంటారు. కొందరు మూడు పూటలా, మరికొందరు మధ్యాహ్నం ఆహారం లేకుండా రెండు పూటలా పచ్చి ఆహారాన్నే తీసుకుంటారు.
ఉడికించిన ఆహారం కంటే పచ్చి ఆహారం తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అయితే కేవలం పచ్చి ఆహారమే తింటే శక్తి, పోషకాలు లభించవు, త్వరగా నీరసిస్తాం అనే అపోహ కొందరిలో ఉంది. ఇది సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు.
మానవులు తప్ప భూమ్మీద జీవరాశులన్నీ పచ్చి ఆహారాన్నే తింటాయి. ఉప్పు, నూనెలు వేసి ఉడికించిన ఆహారం తీసుకోవు. అయినా వాటికి కావాల్సిన శక్తి, బలం, పోషకాలు లభిస్తున్నాయి. ఆరోగ్యంగా, ఎవరిపై ఆధారపడకుండా, బ్రతికినంత కాలం అవయవాలన్నీ వాడుకుని జీవిస్తున్నాయి.
మానవులు మాత్రమే ఉడికించిన ఆహారం తిని అనారోగ్యాల బారిన పడుతున్నారు. పచ్చి ఆహారం తింటే పోషకాలు లభించడమే కాక, అనారోగ్యాలు తక్కువగా వస్తాయి, రోజంతా చురుకుగా పని చేసుకోగలరని నిపుణులు చెబుతున్నారు.
రెండు లేదా మూడు పూటలు పచ్చి ఆహారం తీసుకోవడం వల్ల పోషకాలు అందడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి