23, అక్టోబర్ 2026, శుక్రవారం

జీవితం అంటేనే

  జీవితం అంటేనే ఒక సర్దుబాటు మనము ఈ ప్రపంచంలో ఒకే రూపంలో ఉన్న ఇద్దరు మనుషుల్ని అక్కడక్కడ కొంచెం తేడాతో చూడగలుగుతాం కానీ ఒకే మనస్తత్వం ఉన్నవాళ్లు ఎవరు ఉండరు.


ఒక కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు గాని అక్క చెల్లెలు గాని ఎవరి భావాలు వాళ్ళవి ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి ఈగోలు వాళ్ళవి.


అన్న సాత్వికంగా ఉన్నాడు అని తమ్ముడు ఉండాల్సిన అవసరం లేదు.


కాబట్టి ప్రతి వాళ్లు ఒక విషయం ఆలోచించాలి వివాహం అయిన తర్వాత జీవితం పూలబాట అని ఆశపడకూడదు నేను వివాహం చేసుకున్న తర్వాత నా భర్త నా భార్య మనస్తత్వం నేను అర్థం చేసుకొని సర్దుకొని పోవాలి అనే భావంతో ఉండాలి.


అప్పుడే సంసారం మూడు పూవులు ఆరు కాయలు అవుతుంది.


భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే వారి సంతానం వృద్ధి లోకి వస్తారు.


వివాహం అయిన తర్వాత ఆడపిల్ల తల్లిదండ్రులు తమ కూతురు సంసారంలో అనవసర జోక్యాలు చేసుకోకూడదు.


కూతురికి కష్టం వస్తే అంత మటుకు ఆదుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి.


అప్పుడే కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటుంది చిన్న వయసులో వివాహం చేసుకుంటే వారికి పుట్టే సంతానం వారికి వృద్ధాప్యం వచ్చినప్పుడు చేదోడుగా ఉంటుంది.

ఈ విషయం ప్రతి వాళ్లు ఆలోచించి తమ పిల్లలకు యుక్త వయసులో వివాహం చేయటానికి శతవిధాల ప్రయత్నించాలని కోరుకుంటున్నాను.


చిన్నచిన్న విషయాలను పెద్దవిగా తీసుకొని మన వివాహ వ్యవస్థను పాడు చేయకండి


మన గ్రూపులో ప్రొఫైల్స్ పెట్టిన పెడుతున్న వారికి అనతి కాలంలోనే వివాహాలు జరగాలని ఆశిస్తున్నాను

కామెంట్‌లు లేవు: