శీర్షిక : బతుకమ్మ
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
అక్కచెల్లి కలిసి... ||ఉయ్యాలో||
తల్లికూతురు కలిసి ||ఉయ్యాలో||
ఇరుగుపొరుగు కలిసి... ||ఉయ్యాలో||
వీధివాడకలిసి ||ఉయ్యాలో||
అత్త కోడళ్ళతో... ||ఉయ్యాలో||
ఆడబిడ్డలతో ||ఉయ్యాలో||
అతివలంతా చేరి - ||ఉయ్యాలో||
ఆడుదురు బతుకమ్మ ||ఉయ్యాలో||
తంగేడు పూలను... ||ఉయ్యాలో||
తెల్లనీ గునుగును... ||ఉయ్యాలో||
ముత్యాల పూలనూ.. ||ఉయ్యాలో||
నేలచామంతినీ... ||ఉయ్యాలో||
పల్లెములో పేర్చి... ||ఉయ్యాలో||
బతుకమ్మను కూర్చి... ||ఉయ్యాలో||
అతివలంతా చేరి ||ఉయ్యాలో||
ఆడుదురు బతుకమ్మ ||ఉయ్యాలో||
పట్టుచీరలు కట్టి.. ||ఉయ్యాలో||
బంగారు నగలేసి ||ఉయ్యాలో||
కాళ్ళకూ పట్టీలు.. ||ఉయ్యాలో||
నిండుగాజులు పెట్టి.. ||ఉయ్యాలో||
నడుముకు నిండుగా ||ఉయ్యాలో||
వడ్డాలము తొడిగి ||ఉయ్యాలో||
అతివలంతా చేరి ||ఉయ్యాలో||
ఆడుదురు బతుకమ్మ ||ఉయ్యాలో||
నాటి రాజుల కథలు... ||ఉయ్యాలో||
పురాణ గాధలు ||ఉయ్యాలో||
దేవుళ్ళ పాటలు... ||ఉయ్యాలో||
జానపద గీతాలు ||ఉయ్యాలో||
పాటకు తగ్గట్టు ||ఉయ్యాలో||
చప్పట్లు కొట్టుతూ ||ఉయ్యాలో||
అతివలంతా చేరి ||ఉయ్యాలో||
ఆడుదురు బతుకమ్మ ||ఉయ్యాలో||
అమ్మింటి ముచ్చట్లు ||ఉయ్యాలో||
అత్తింటి కష్టాలు.. ||ఉయ్యాలో||
బాల్యపు గుర్తులు ||ఉయ్యాలో||
ఆటలూ పాటలూ ||ఉయ్యాలో||
ముచ్చటించుకుంటు.. ||ఉయ్యాలో||
మురుపమెంతో పడుతు ||ఉయ్యాలో||
అతివలంతా చేరి ||ఉయ్యాలో||
ఆడుదురు బతుకమ్మ ||ఉయ్యాలో||
పెత్తరమాసతో ||ఉయ్యాలో||
ఎంగిళ్ళ పండుగ ||ఉయ్యాలో||
సద్దులతో ముగియు ||ఉయ్యాలో||
బతుకమ్మ పండుగ ||ఉయ్యాలో||
తొమ్మిది సద్దులు.. ||ఉయ్యాలో||
నైవేద్యమే పెట్టి ||ఉయ్యాలో||
అతివలంతా చేరి ||ఉయ్యాలో||
ఆడుదురు బతుకమ్మ ||ఉయ్యాలో||
చెరువు కట్ట కాడ... ||ఉయ్యాలో||
దేవునీ ముంగిట ||ఉయ్యాలో||
వీధి కూడళ్ళలో... ||ఉయ్యాలో||
ఇంటి వాకిట్లలో ||ఉయ్యాలో||
బతుకమ్మను ఆడి... ||ఉయ్యాలో||
చెరువులో వేయంగ ||ఉయ్యాలో||
అతివలంతా చేరి ||ఉయ్యాలో||
ఆడుదురు బతుకమ్మ ||ఉయ్యాలో||
చెరువులో మురికిని... ||ఉయ్యాలో||
నీటిశుబ్రతకునూ ||ఉయ్యాలో||
బతుకమ్మ పూవులు ||ఉయ్యాలో||
మేలెంతో చేయునూ ||ఉయ్యాలో||
పకృతి మేలుకు, ||ఉయ్యాలో||
సంస్కృతి జాగృతికి ||ఉయ్యాలో||
అతివలంతా చేరి ||ఉయ్యాలో||
ఆడుదురు బతుకమ్మ ||ఉయ్యాలో||
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, జర్నలిస్టు
9700007654
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి