🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
*మన మహర్షుల చరిత్రలు.*.
🌷🌷🌷
*🌹ఈరోజు 41 వ దేవద్యుతి మహర్షి గురించి తెలుసుకుందాము🌹*
☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁
☘️దేవద్యుతి మహర్షి గురించి చదువుదాం పూర్వం సరస్వతీనదీ తీరంలో యక్షప్రగ్రుణ అనే పేరుతో ఒక పర్వతం ఉండేది.
🍁అక్కడ చక్కటి పుణ్యాశ్రమాలున్నాయి. అక్కడ సుమిత్రుడనే ఋషి కుమారుడు దేవద్యుతి తపస్సు చేసుకుంటున్నాడు.
☘️అతడు మండువేసవిలో పంచాగ్నిలోను, శీతాకాలంలో నీళ్ళలోను నిలబడి,
🍁గాలి నీరు కందమూలాలు తిని కాలక్షేపం చేస్తూ కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నాడు.
☘️అతని తపస్సు ప్రభావానికి అతని తేజస్సు మూడు లోకాల్లోనూ వ్యాపించింది.
🍁 దేవద్యుతుడి తపస్సుకి ముని సంఘాలన్నీ తల్లడిల్లిపోయాయి .
ఆ ఋషి ఎప్పుడూ
☘️పురుష సూక్తి విధానంలో రోజూ
మంచి పువ్వులో పూజ చేస్తుండేవాడు.
షోడషోపచారాలో పూజ చేస్తున్న దేవద్యుతికి
🍁 వైశాఖ శుద్ధ ఏకాదశినాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే దేవద్యుతుడు సాష్టాంగ ప్రణామం చేసి స్తోత్రం చేశాడు.
☘️వాసుదేవా! సురాంతకా! వనజనాభా! భక్తవత్సలా! కృష్ణా! కృపాసముద్రా! శ్రీహరా! జగన్మయా!
🍁నన్ను దయచూడు. పరతత్త్వం నువ్వే. నీవు నిర్గుణుడవు, శుద్ధ బుద్ధాత్ముడవు, చిన్మయుడవు నువ్వు నన్నెప్పుడు కాపాడు తండ్రీ ! అని వేడుకున్నాడు.
☘️దేవద్యుతి విష్ణుమూర్తిని చేసిన స్తుతిని ' యోగసారస్తుతి 'అంటారు.
🍁అది విని విష్ణుమూర్తి దేవద్యుతుణ్ణి కరుణించి అదృశ్యమయ్యాడు.
☘️హరి కృప పొందిన దేవద్యుతుడు పిశాచి రూపంతో బాధపడుతున్న చిత్రసేనుడనే వాడిని
🍁 ప్రయాగ స్నానం చేయించి పిశాచి జన్మ పోయేలా చేశాడు . ఇద దేవద్యుతి కథ!
☘️ఇదండీ దేవద్యుతి మహర్షి గురించి మనకు అందిన సమాచారం రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి.
సేకరణ: శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి