22, మార్చి 2026, ఆదివారం

వివాహం




                  *వివాహం..!*

      *అమ్మాయిలు-అబ్బాయిలు*

                *తల్లితండ్రులు*

                ➖➖➖✍️



*🌺వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న అమ్మాయిలు / అబ్బాయిలు మరియు వారి తల్లితండ్రులు ఈ క్రింది (సూచనలను) వాస్తవాలను తప్పక గ్రహించాలి.....*



*🔹వధువు / వరుడు గ్రహించాల్సిన అంశాలు....*

```

*వివాహం అంటేనే సర్దుకు పోవడం..!

*వివాహం అంటే స్వర్గం అని భావించకండి..!

*వివాహం బాధ్యతలతో కూడిన జీవితం..!


*ఆకతాయిగా తిరిగే అవకాశం అమ్మాయిలకు/అబ్బాయిలకు వివాహం తరువాత కుదరదు అనే వాస్తవాన్ని గ్రహించండి..!


*వివాహం తరువాత నాది,నీది అనే స్వార్థం వీడాలి..!


*వివాహం తరువాత ఫ్రెండ్స్ ని/సహ ఉద్యోగులను బయటి వరకే వుంచడం మంచిది..!


*మీరు కోరుకున్న అన్ని అంశాలు 

మీ జీవిత భాగస్వామిలో వుండటానికి అంగట్లో వస్తువు కాదని గ్రహించాలి..!


*మీరు పరస్పరం ఇరువురి తల్లి తండ్రులకు, బంధువులకు గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి..!


*సంతానం ను పొందటం బాధ్యత..!


*’విడాకులు’ అనే ఆప్షన్ మీ బ్రెయిన్ లో వుంటే వివాహం చేసుకోకపోవడమే మంచిది..!


*వివాహం తరువాత మీ భాగస్వామి మీ బానిస కాదు అని గ్రహించండి. ఒకరికి ఒకరు తోడు అని గ్రహించండి..!


*జీవిత భాగస్వామిని మించిన నేస్తం ఎవరు లేరని గ్రహించండి..!


*ముఖ్యంగా అమ్మాయిలు మీ అత్త గారి కుటుంబ విషయాలను మీ తల్లి తండ్రులకు చెప్పకండి..!


*భార్య భర్తలు తగువు ఆడటం సహజం..!

మళ్ళీ కలవటం మామూలే..!

మీరు పడే గొడవలను మీ తల్లి తండ్రుల దృష్టికి తీసుకువెళ్ళవద్దు..!

```


*🔹వధువు బాధ్యతలు :*```


*వంట పని, ఇంటి పనులు, అబ్బాయి తల్లి తండ్రుల బాగోగులు, కుటుంబంలో ఇంకా మీ కంటే చిన్న వారు వుంటే వారి బాధ్యత కూడా మీదే. అత్త వారి కుటుంబమే మీ కుటుంబం అని మరువకండి..!


*ప్రతి విషయం ను మీ పుట్టినింటితో పోల్చుకోవద్దు..!```



*🔹వరుడు బాధ్యతలు...*```


వధువు తన తల్లి తండ్రులను వదిలి మిమ్మల్ని, మీ తల్లి తండ్రులను నమ్మి వచ్చిందనే విషయం మరువకండి..!


*కుటుంబానికి కావాల్సిన ఆర్థిక వనరులు మీ బాధ్యత..!


*పెళ్లి అయిన కొత్తలో నా పెళ్ళాం మంచిది అని తొందరపడి కుటుంబం లో వున్న అన్ని విషయాలు విడమరిచి చెప్పకండి.


*మీ తల్లి తండ్రులు వలె మీ భార్య తల్లి తండ్రులను కూడా గౌరవించటం నేర్చుకోండి. ```



*🔹అమ్మాయి తల్లి తండ్రులు...* ```

అమ్మాయికి నేరుగా ఫోన్ చేసి సుత్తి వేయకండి. వియ్యంకులను గౌరవించటం నేర్చుకోండి..!


*కొత్తగా వెళ్లిన కుటుంబం లో కొన్ని ఇబ్బంది గా మొదట్లో అనిపిస్తాయని, సర్డుకోవడానికి సమయం పడుతుంది అని గ్రహించండి..!


*భార్య భర్తల గొడవలో అమ్మాయి తల్లి తండ్రులు తల దుర్చారాదు. 

*మీ అమ్మాయికి తల్లి తండ్రులు ఇకపై అత్త మామలో అనే విషయాన్ని అమ్మాయికి చెప్పండి.


*మీకు కూడా ఒక కోడలు వస్తుందని గ్రహించండి..!


*మీ అమ్మాయి చెప్పేవన్నీ నమ్మి ఆవేశపడకండి.```



*🔹అబ్బాయి తల్లి తండ్రులు...*

```

*మీ కోడలికి మీ అమ్మాయి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మరువకండి.


*మీ వంశమును నిలబెట్టే సంతానం మీ కోడలి గర్భం ద్వారా జరుగుతుంది. అలాంటి మీ ఇంటి కోడలిని అపురూపము గా చూసుకోవాలి అని మరువకండి..!


*మీ కోడలు బాగోగులు కుటుంబ పెద్దగా పూర్తిగా మామ గారివే!

*మీ కూతురు, కొడుకు మీ ముందు కన్నీరు పెట్టినా పర్వాలేదు. కానీ మీకోడలు ఎప్పుడూ కన్నీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే..!


*మీ కోడలిని మీరు ఎలా చూసుకుంటారో, మీ కూతురుని వాళ్ళ అత్త గారు అలాగే చూసుకుంటారని అబ్బాయి తల్లి గ్రహించాలి. మీ కూతురు కంటే మీకు మీ కోడలే ముఖ్యం అని అర్థం చేసుకోండి. ఇదే పద్ధతి లో మీ కూతురు కి వర్తిస్తుంది అని గ్రహించండి.


పాటిస్తే అందరూ హాయిగా ఉంటారు…✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

కామెంట్‌లు లేవు: