22, మార్చి 2026, ఆదివారం

వ్యశేమ దేవహితం

 *వ్యశేమ దేవహితం యదాయుః* (కృ.య.తై.ఆరణ్యకం 1-1-1)


దేవ - దేవతలారా! ప్రకృతి ప్రసాదించిన (తం) జీవిత కాలాన్ని (ఆయుః) మేము అర్థవంతంగా, పవిత్రంగా మరియు ఇతరులకు మేలు చేసే విధంగా (హి) గడపాలి (వ్యశేమ) అని అర్థం. మనకు లభించిన జీవితాన్ని వృధా చేయకుండా, ఉన్నతమైన ఆశయాల కోసం వినియోగించాలనే గొప్ప సందేశాన్ని ఈ శాస్త్ర వాక్యం ఇస్తుంది.


ఒక్కోశాస్త్ర వాక్యాన్ని శ్రవణం చేసి (గురువు ద్వారా విని యుక్తులతో వాటి తాత్పర్యాన్ని స్పష్టంగా గ్రహించి నిశ్చయం చేసుకున్న) తరువాత మననం (logical గా ఆలోచిస్తూ విన్న అర్ధాన్ని సాధక‑బాధకాలు, లోకాలౌకిక విషయాలతో పరిశీలన) చేస్తూ ఉంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. తరువాత అనుభవంలోకి (నిదిధ్యాసన) తెచ్చుకుంటే జీవితం సార్థక మయినట్లే కదా! ఇంత చిన్న మంత్రంలో ఎంత అర్థం ఉందో కదా!

కామెంట్‌లు లేవు: