1, మే 2026, శుక్రవారం

సీస పద్యముసీస పద్యము

 🌸పార్వతి దేవి స్తుతి🙏

సీస పద్యము 


శాంకరి శాంభవి శర్వాణి శారద

కరుణతో కాపాడు కాళికాంబ

భవునిరాణి భవాని బాధలు దూరము 

చేసియు  చాముండి చింత తీర్చు

కళ్యాణి భగవతి కామాక్షి నిర్మల

బహుభుజ భార్గవి వందనములు

మాతంగి మాతృక మాలిని మలయమ్మ

మమ్ము కావుము దేవి మమత తోడ

తే  శంభుప్రియగౌరి  పార్వతి శరణు శరణు

సర్వమంగళ సావిత్రి జయము జయము

 సింహరథ సింహ వాహిని శీఘ్రముగను

శైలముదిగిరాశ్యామల శంభురాణి

 

సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

కామెంట్‌లు లేవు: