1, జనవరి 2021, శుక్రవారం

తంజావూరుబొమ్మ

 ఇంటింటా మన తెలుగు వారి బంగారు #తంజావూరుబొమ్మ


వంద మాటలు చెప్పలేనిది ఒక్క చిత్రం చెబుతుంది అంటారు. అందుకే ఇంటి అలంకరణలో అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడైనా చిత్రపటాలదే పైచేయి.  రంగులతో జీవకళ ఉట్టిపడేలా గీసిన సీతారాములు, వేంకటేశుడు, వినాయకుడు, యశోద కృష్ణ,  రాధాకృష్ణులు, రాజస్థానీ పల్లెపడుచు... ఇలా దేని అందం దానిదే. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆ చిత్ర పటాలన్నీ అచ్చమైన బంగారంతో మెరుస్తూ గృహాలంకరణ ప్రియుల్ని అలరిస్తున్నాయి. తమిళనాటే కాక మన తెలుగింటి పూజ గదులలో కూడా హారతులు అందుకుంటున్నాయి. బంగారంతో గీసిన చిత్రపటాలు అందంగా ప్రతి ఇంట్లో  కొలువుదీరుతున్నాయి. గృహప్రవేశం, పెళ్లిరోజు, పెళ్లి వేడుకల్లో సంపన్నులు ఇచ్చిపుచ్చుకునే కానుకల్లో అందమైన ఈ చిత్రాలదే అగ్రస్థానం. అత్యంత పలుచని బంగారు రేకుతో సునిశితమైన నైపుణ్యంతో ఏ చిత్రకారుడో కుంచెతో గీసినట్లే రేకుని చెక్కుతూ చేస్తోన్న ఈ చిత్రాలు ఓ పట్టాన చూపు తిప్పుకోనీయవు. దేవీదేవతల రూపాలతోబాటు జంతువులూ పక్షులూ చెట్లూ... ఇలా ప్రకృతి అందాలకీ బంగారు సొబగులు అద్దేస్తున్నారు కళాకారులు. ఆపై వీటిని బంగారు రంగు ఫ్రేముల్లో బంధించి ఆ పటం మొత్తం బంగారమేనా అన్న భ్రమని కలిగిస్తున్నారు. కొందరు అచ్చంగా 24 క్యారెట్ల బంగారురేకుతోనే చిత్రాలు గీయిస్తుంటే మరికొందరు బంగారుపూత పూసిన వెండి రేకులతోనూ ఈ పెయింటింగుల్ని రూపొందిస్తున్నారు. వాతావరణ మార్పులకి ఫ్రేముకి ఉండే రంగు కొద్దిగా మాయొచ్చేమోగానీ లోపలి గీసిన పెయింటింగు మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరదు సరికదా, ధగధగా మెరిసే ఆ సువర్ణ పటాన్ని హాల్లోని ఓ గోడకు తగిలిస్తే చాలు... ఇంటికి వచ్చినవాళ్లు అక్కడే ఆగి అలా చూస్తుండిపోతారు. బంగారమా... మజాకానా..!


చరిత్ర

భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక చారిత్రక ప్రదేశాల్లో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా కర్ణాటక సంగీతానికి చేసిన సేవలకూ,  తంజావూరు చిత్రలేఖనానికి (పెయింటింగ్) చాలా ప్రసిద్ధి. ఇంకా వీణ, తంజావూరు బొమ్మలు, తవిల్‌ ఇక్కడి ప్రముఖమైన విషయములు. రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి బృహదీశ్వరాలయము ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడనే ప్రఖ్యాత సరస్వతీ మహల్‌ గ్రంథాలయము ఉంది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.ఈ నగరము ఒకప్పుడు చోళ రాజులకు బలమైన రాజధాని కేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత విజయ నగర రాజులు ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని ఏలినారు. 


తంజావూర్ చిత్రలేఖనాలు మన దక్షిణ భారతానికే సొంతమైన ప్రాచీన సంప్రదాయ కళ...భారతీయ చిత్రలేఖన చరిత్రలో తంజావూరుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తంజావూరు కృష్ణదేవరాయ యొక్క సోదరుడు మరియు వారసుడు అచ్యుతారాయ (1529–42) పాలనలో స్థాపించబడింది. అత్యంత విజయవంతమైన తంజావూర్ నాయక పాలకుడు అయిన రఘునాథ, కళలను, కళాకారులను గొప్పగా  పోషించడమే కాక, తంజావూర్ కళాకారుల కోసం  ప్రత్యేకమైన పాఠశాలను స్థాపించడంలో సహాయపడ్డాడు. తరువాత తంజవూర్ శైలి చిత్రాలను మరాఠాల క్రింద అభివృద్ధి చేశాడు. ఈ పాఠశాల యూరోపియన్ పద్ధతుల ద్వారా బాగా ప్రేరణ పొందింది. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం వరకు తమిళనాడులో అత్యంత ప్రాచుర్యం పొందింది. 


క్రీ.శ 1565 లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం ఫలితంగా ఆ సామ్రాజ్య చిత్రకారులు మధురై, తంజావూరు ప్రాంతాలకి వలస వెళ్ళారు. వారిలో కొందరు తంజావూర్ నాయకుల ఆధ్వర్యంలో పనిచేశారు. నాయక రాజులు ప్రధానంగా శాస్త్రీయ నృత్యం సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం ఈ కాలంలో బాగా ప్రోత్సహించారు. తదనంతరం, తంజావూర్ నాయకులను ఓడించిన మరాఠా పాలకులు ఈ కళాకారుల వ్యక్తిగత అభిరుచులను గ్రహించారు.ఇది ప్రత్యేకమైన తంజావూర్ శైలి చిత్రలేఖనాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడింది. దేవాలయాలను అలంకరించడంతో పాటు తంజావూరు కళాకారులు మరాఠా రాజులు మరియు ప్రభువుల ప్రధాన భవనాలు, ప్యాలెస్‌లు, చట్రామ్‌లు మరియు నివాసాలను చిత్రించడం,  అలంకరించడం ప్రారంభించారు. ఈ చిత్రాలలో  11 వ శతాబ్దపు చోళ గోడ చిత్రాలు బృహదీశ్వర ఆలయంలో ఉన్నాయి. అలాగే నాయక రాజుల కాలం నుండి వచ్చిన చిత్రాలు 16 వ శతాబ్దానికి చెందినవి. 


మన తెలుగువారి హస్తకళ

తంజావూరు కళాకారుల పూర్వీకులు మన తెలుగు వారు కావడం మనకెంతో గర్వకారణం. ఈ కళాకారులు ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజులు, నాయుడులుగా గుర్తించారు. వారు తెలుగులోనే  మాట్లాడేవారు. కళాకారులు వాళ్ళ ఆసక్తి, ఆవశ్యకత ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి వివిధ విషయాలపై వైవిధ్యమైన నాణ్యత కల చిత్రాలను విస్తృతంగా  అందించారు. అప్పటి కళాకారులకి ఈ హస్తకళ చాలా పవిత్రమైనది. వీరిలో చాలామంది  వారి చిత్రాలకు ఎప్పుడూ సంతకం చేయలేదు. సి. కొండయ్య రాజు ( C. Kondiah Raju) కోవిల్పట్టికి చెందిన ప్రసిద్ధ క్యాలెండర్ కళాకారుడు, రాజు సమాజం నుండి ఆధునిక కాలంలో కళాకారుడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ వారసులలో ఒకరు.


తయారుచేసే విధానం

తంజావూర్ చిత్రాలు స్పష్టమైన రంగులు, మెరిసే బంగారు రేకులు, గాజు పూసలు, విలువైన రత్నాలతో పొదగబడి ఉంటాయి. తంజావూర్ పెయింటింగ్ కి సాధారణంగా అరబిక్ జిగురు, కలప (టేకు) తో అతికించిన కాన్వాస్‌ ఉపయోగిస్తారు. కళాకారుడు కాన్వాస్‌పై ప్రధాన చిత్రం పెన్సిల్ తో గీసాక సుద్ద పొడి లేదా సున్నపురాయి పేస్ట్ తో ఆ చిత్రంపై పూత పూసి ఎండబెడతారు. స్తంభాలు, తోరణాలు, సింహాసనాలు, దుస్తులు మొదలైన ఎంచుకున్న ప్రదేశాలలో బంగారు పూత వేసి రకరకాల రంగుల రత్నాలు పొదుగుతారు. చివరగా మిగిలిన చిత్రాన్ని రంగులు స్కెచ్‌తో దిద్దుతారు. ఈ విధంగా అందమైన తంజావూరు చిత్రం పూర్తి అవుతుంది. పరిమాణం, వాడిన వస్తువులని బట్టి ధర నిర్ణయిస్తారు. వీటి ధర అధికమే అయినా ప్రస్తుతం గిరాకీ కూడా బావుంది. శిక్షణలో ఉన్నవారికి ఆసక్తి ఉన్నవారికి కేవలం మక్కుతో ఉన్న ఫ్రేములు కూడా లభ్యం అవుతున్నాయి.


చిత్రాల సేకరణ

చెన్నై గవర్నమెంట్ మ్యూజియం,  తంజావూర్ ఆర్ట్ గ్యాలరీలో తంజావూర్ చిత్రాల చక్కటి సేకరణలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌లోని బ్రిటిష్  విక్టోరియా & ఆల్బర్ట్ మ్యూజియమ్‌లలో సాంప్రదాయ శైలులలో పెద్ద తంజావూర్ పెయింటింగ్‌లు ఉన్నాయి. కోపెన్‌హాగన్ యొక్క నేషనల్ మ్యూజియంలో 17 వ శతాబ్దపు తంజావూర్ చిత్రాల చక్కటి సేకరణ ఉంది.  1806 లో ప్రచురించబడిన ఓరియంటల్ డ్రాయింగ్స్ అనే పుస్తకంలో బ్రిటిష్ చరిత్రకారుడు చార్లెస్ గోల్డ్ ప్రకారం టాంజోర్ పెయింటింగ్స్‌ను 'మూచీస్ లేదా ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా' చిత్రించారు. 


ప్రస్తుతం

తంజావూర్ పెయింటింగ్స్ నేటి వరకు కూడా కొనసాగుతున్నాయి. ఎగ్జిబిషన్లు, వర్క్‌షాప్‌లు మరియు శిక్షణా శిబిరాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు సంస్థలచే క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.  సాంప్రదాయ విషయాలతో పాటు, విస్తృతమైన ప్రజాదరణ పొందిన ఆధునిక ఇతివృత్తాలు తంజావూర్ చిత్రాలలో చిత్రీకరించబడుతున్నాయి. ఈ సాంప్రదాయిక కళ ఇంకా తన పట్టును కొనసాగించడం సంతోషకరమైన పరిణామం. తంజావూర్ పెయింటింగ్స్ శైలి మరియు సౌందర్యం చాలా మంది సమకాలీన కళాకారులను ప్రేరేపిస్తూనే ఉన్నాయి.

#TanjorePaintings

శ్రీమాతా

 *శ్రీ లలితా నామ వైభవం-6*


 ‘శ్రీమాతా’ – అంటే మంగళప్రదురాలైన అమ్మా! అని అర్థము. గుర్తు పట్టవలసిన విషయము లోకములో ఉన్న ఏకైక సంథానమయిన అమ్మ అన్నమాటకు పరిచయము లేదు. కడుపులో ఉండగా నాభీగొట్టముతో ప్రారంభమైన అనుబంధము బయటికి వచ్చాక తెగిపోతుంది. హృదయసంబంధము అలాగే ఉంటుంది. అమ్మ అంటే పోషణ – రక్షణ – మంగళము. అమ్మలేకపోతే సృష్టి ఆగిపోతుంది. అమ్మవారి సృష్టిశక్తి, మాతృత్వము ఒక పురుష వీర్యమును స్త్రీ శరీరము పుచ్చుకునేట్టుగా నిర్మాణము చేయడములో ఉన్నది. ఆ తల్లి అనుగ్రహముతో పిల్లవాడు పూర్తిగా తయారు అయ్యేవరకు పెరగాలి. లోపల పిల్లవాడు నొక్కుడు పడకుండా, తల్లి శరీరము పిగిలిపోకుండా, మళ్ళీ పిల్లవాడు బయటికి వచ్చాక సంకుచితమవ్వాలి. ఇంతమంది జన్మించడానికి స్త్రీ ఉపాధుల యందు అంత మార్పుతో నిర్మాణము చేసి, లోపల పసిగుడ్డును కాపాడి జాగ్రత్త చేసింది శ్రీమాత. కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే అమ్మ స్తన్యములో కోలోస్ట్రం అనే పసుపు పచ్చని ముద్ద ఒకటి ఊరుతుంది. ఏమీ తెలియని వాడిని జగన్మాత ఆవహించి ‘ నీ పోషణకోసము, రక్షణకోసము మీ అమ్మ స్తన్యములయందు నేను ప్రకాశిస్తున్నాను’ అని చెపుతుంది. అమ్మ స్తన్యములలో ఊరిన ఆ పదార్థమును పిల్లవాడు చప్పరిస్తే లోపలున్న ఊపిరితిత్తులు, జీర్ణాశయము అన్నీ పనిచేస్తాయి. కడుపులో ఉండగా నల్లటి మలము గడ్డలుగా పెరుగుతుంది. దానిని బయటికి పంపడము ఎవరికీ సాధ్యముకాదు. కోలోస్ట్రం మ్రింగగానే నల్లటి మలము బయటికి వెళ్ళిపోతుంది. మలినములు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అమ్మ కడుపులో, పక్కలో దూరి పడుకోవడములో పిల్లవాడు ఎంతో భద్రత అనుభవిస్తాడు. ఆ అమ్మతనము అంతా హృదయము పరవశించిపోయే శ్రీమాతాతత్త్వము. అమ్మవారి వంకచూసి ‘శ్రీమాతా’ అని పిలవడానికి భయపడనవసరము లేదు. ఉపాసన చేయడానికి నియమ నిబంధనలు లేవు. అమ్మగా అమ్మవారిని చూడాలి. అమ్మని ఒక మొగవాడిగా చూస్తే దోషము. ఏ అమ్మా క్షమించదు. కొడుకుగా నిలబడి నమస్కారము చేస్తే ఆదుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధముగా ఉంటుంది. ఆవిడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త గర్భాలయము ఇచ్చింది, పాలు పట్టింది, (స్వల్పకాలికలయము) నిద్రపుచ్చింది. ముగ్గురూ అమ్మలో ఉన్నారు కనక మొదటి దైవము అమ్మ.  భగవంతుడు ఒక్కడే అయినా కర్తవ్యనిష్ఠ కలిగినప్పుడు బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రునిగా మూడురూపములతో ప్రకాశిస్తాడు. శ్రీమాత ఈ ముగ్గురూ మూడురకములైన కార్యములను నిర్వహించడానికి మూడురకములైన శక్తులను ఇచ్చింది.  ఉపనిషత్తు – ‘యతోవా ఇమాని భూతాని జాయన్తి’ అంటుంది. దేనినుండి సమస్తము ఉత్పన్నము అయినదో – ‘దేనినుండి’ అన్నమాట ఏది ఉన్నదో అదే అమ్మవారు. దేనినుండి సమస్తము పుట్టాయో అన్న ఉపనిషత్ వాక్యము మారిస్తే అదే శ్రీమాత. అన్ని ప్రాణులను సృజించుట వెనక అమ్మదయ ఉన్నది.  శ్రీమాత ఎవరు? అన్న విషయము జాగ్రత్తగా అవలోకనము చేస్తే ‘శ్’  ‘ర్’  ‘ఈ’ అన్న మూడు అక్షరములు కలిస్తే ‘శ్రీ’ అవుతుంది. ఆ మూడూ సత్త్వ, రజ, తమో గుణములను చూపిస్తాయి. లోకమంతా వీటిలోనే ఉన్నది. ఇవి బయటికి రాకుండా కలసిపోయి అవ్యక్తమైపోయి ఒక దానిలోకి వెళ్ళి ఉండిపోతే ‘శ్’  ‘ర్’  ‘ఈ’ కలసి శ్రీ – కలసిపోయి మాత – ఆవిడలోకి వెళ్ళిపోతాయి. సృష్టికి ముందర ఆవిడ ఒక్కత్తే ఉన్నది. ఆమెను పూర్వజా అంటారు. ఆవిడలో ఉన్న మూడుగుణములు ఆవిడలోనుంచే పైకి వచ్చాయి. ఈ మూడుగుణములు తీసి శుద్ధసత్త్వము ఆమెయే ఇవ్వాలి. అమ్మా! ఈ గుణముల వలన లోపలనుండి కలిగే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యములన్న శత్రువులు అని గుర్తించి  ఆవి ఉండటము వలన బాధ, కష్టము కలుగుతున్నాయి అమ్మా! అని నిజాయితీగా అంటే చాలు అమ్మవారు ఆ మూడూ ఉపసంహారము చేసి బాధలను తీర్చేస్తుంది.   భాస్కరరాయలవారు అంటారు --  ‘లోకములో ఒక తల్లికీ తండ్రికీ జన్మించిన బిడ్డడు అమ్మా! అనే పిలుస్తాడు. బిడ్డడిని విడచి ఉండమంటే ఏ తల్లీ అంగీకరించదు. నేను వేరొకజన్మ లేకుండా చేసుకోవడానికి తురీయాశ్రమమునకు వెళ్ళిపోతాను అంటే అంగీకరించదు. శ్రీమాతా అని పిలిస్తే వేరొకజన్మలో అమ్మా! అని ఎవరినీ పిలవనవసరము లేని స్థితిలో మోక్షము ఇస్తుంది. శివజ్ఞానము ఇస్తుంది. ఆ జ్ఞానము కలగగానే పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యస్థితి పొందడము జరుగుతుంది.


*శ్రీ మాత్రే నమః*

చిన్న జీయర్ స్వామీ

 చిన్న జీయర్ స్వామీ నేతృత్వంలో వేర్వేరు పేర్లతో కొనసాగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. వాటిలో నాకు తెల్సినవి కొన్ని


#విద్య: ప్రకాశం జిల్లా మార్టూరులో ‘జీవన్ వికాస్’ పేరుతో పేదపిల్లలకోసం పదోతరగతి వరకు పాఠశాల నడిపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి (గిరిజనులకు), ఉట్నూరు మండలం బీర్సాయిపేట, ప్రకాశం జిల్లా కఠారివారాపాలెం (గంగపుత్రులకు) లలో జీయర్ గురుకులాలు నడుస్తున్నాయి.


#వేద_విద్యాలయాలు: శ్రీరామనగరంతో పాటు విశాఖ, సీతానగరం, కరీంనగర్ (ఎల్‌ఎండి) లలో వేదపాఠశాలలు నడుస్తున్నాయి.


#అంధులకు_విద్య: శ్రీరామనగరంలో అంధులైన విద్యార్థుల కోసం జూనియర్, డిగ్రీకాలేజీలు నడుస్తున్నాయి. విశాఖ జిల్లా వారిజలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల నడుస్తున్నాయి.


#ప్రజ్ఞ: ప్రజ్ఞ పేరుతో విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దేందుకు శ్రీరామనగరంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


#అన్నదానం: బదరీనాథ్ అష్టాక్షరీ క్షేత్రం, హృషీకేష్, శ్రీరంగం, మేల్కొటే, తిరుమల, భద్రాచలం, నడిగడ్డపాలెం, సీతానగరం, శ్రీరామనగరంలలో రోజూ ఉచిత అన్నదానం జరుగుతోంది.


#ఆదర్శగ్రామం: ఆదిలాబాద్ జిల్లాలో యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ఆదర్శ గ్రామాలను రూపొందించే మహత్తర కార్యక్రమం కొనసాగిస్తున్నారు. 11 గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్మాణం చేశారు.


#ప్రకృతి విలయాలు: ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు స్వామి వెంటనే స్పందిస్తున్నారు. భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు రంగంలోకి దిగి బాధితులకు చేయూత ఇస్తున్నారు. గుజరాత్‌లోని వల్లభాపూర్‌లో 88 శాశ్వత గృహాలు నిర్మించి ఇచ్చారు. నేపాల్ భూకంపబాధితులకు తాత్కాలిక సాయం అందిస్తూ, 1.50 కోట్ల ఖర్చుతో విద్యాలయం నిర్మిస్తున్నారు. తమిళనాడులో సునామీ రాగా, నాగపట్నంలో 50 మందికి పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు. మత్స్యకారుల జీవనం కోసం పడవలు అందించారు. జపాన్‌లో సునామీ సందర్భంగా 11 లక్షల రూపాయలు అందించారు.


#ఉగ్రవాద_నివారణ_కోసం: ఉగ్రవాద నివారణ కోసం మానస సరోవరం తీరంలో బ్రహ్మయజ్ఞం 2002 లో నిర్వహించారు. కార్గిల్  కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు.


#వృద్ధాశ్రమం: గుంటూరు జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.


#జిమ్స్: జీయర్ ఇంటిగ్రెటివ్ మెడికల్ సర్వీసెస్ (జిమ్స్) పేరుతో శ్రీరామనగరంలో హోమియో మెడికల్ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి నడిపిస్తున్నారు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి విధానాల్లో వేర్వేరుగా చికిత్స అందిస్తున్నారు.


#వైద్య_శిబిరాలు: గ్రామీణులకు ఉచితంగా వైద్య చికిత్స అందించేందుకు తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 2500 పైగా ఉచిత క్యాన్సర్ శిబిరాలు నిర్వహించి రెండు లక్షల మంది మహిళలకు చికిత్స అందించారు. 1300 వరకు ఉచిత వైద్య శిబిరాలు, 900 పైగా కంటి చికిత్స శిబిరాలు, 1000 కిపైగా దంత వైద్య శిబిరాలు నిర్వహించారు.


#అవయవదానం: అవయవదానం గొప్ప దానమని భావించిన చిన్నజీయర్ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎవరైనా అవయవదానం చెయవచ్చు. అనుకోకుండా ఎవరైనా చనిపోతే, ఆరుగంటల వ్యవధిలో వారి అవయవాలను సేకరించి, అవసరమైన వారికి అమరుస్తారు. ఇందుకోసం ముందుకు వచ్చేవారు 040-6636 9369/98492 45948 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తీసుకోవచ్చు

2019 లో విశాఖపట్నం లొ 90 మందికి పైగా జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యములో అవయవదానం 


#పశువైద్య_శిబిరాలు: పశువులకు ఉచితంగా చికిత్స అందించేందుకు తరచూ పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఈ తరహా శిబిరాలను నిర్వహిస్తూ, ఏటా రెండు లక్షల పశువులకు చికిత్స అందిస్తున్నారు


#ఆలయాల_జీర్ణోద్ధరణ: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు చిన్న జీయర్ శ్రీకారం చుట్టారు.


#గోసేవ: సీతానగరం, శ్రీరామనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసి దాదాపు 500 గోవులను రక్షిస్తున్నారు.


#ఖైదీల్లో_పరివర్తన: ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు జీయర్‌స్వామి ప్రయత్నిస్తున్నారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా రూపుదిద్దుతున్నారు. వారి కుటుంబాల పోషణకోసం కుట్టుమిషన్లు, సైకిళ్లు తదితర వస్తువులను అందిస్తున్నారు.


#భక్తినివేదన: భక్తినివేదన పేరుతో ఆధ్యాత్మిక మాసపత్రిక నడిపిస్తున్నారు.


#పురస్కారాలు: వేదవిద్యావ్యాప్తికి పాటుపడుతున్నవారికి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైదిక గ్రంథాలను ముద్రిస్తున్నారు.


ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఒకటా.. రెండా.. చెబుతూపోతే కొండవీటి చాంతాడంత ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్), జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (సొసైటీ), వికాసతరంగిణి-భారత్, వికాస తరంగిణి-విదేశాలు స్థాపించారు. ఆకలిగొన్నవారికి ఆహారం అందించేందుకు ప్రధాన కేంద్రాల్లో అన్నదానాల కార్యక్రమం కొనసాగుతోంది. యువతీయుకులకు హోమియో, ఆక్యుప్రషర్‌లలో అవసరమైన ప్రాథమిక శిక్షణ ఇస్తూ, సమాజంలో అవసరమైన వారికి సేవలను అందిస్తున్నారు.

భారతీయుడా గ్రహించు...

 క్రైస్తవం 

మనం తరచుగా వింటుంటాం…హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని ! 

ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, 

కొన్ని వాస్తవాలు చూడండి.


మీకే అర్థం అవ్తుంది....


-------------

**


*ఒక క్రీస్తు*

*ఒక బైబిలు*

*ఒక మతం*


*కాని ఇది తెలుసా?*


*లాటిన్ కాథోలిక్  - సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ రెండు వర్గాలు - మార్తోమ చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ మూడు వర్గాలు - పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ నాలుగు వర్గాలు -  సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ ఐదు వర్గాలు - సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ ఆరు వర్గాలు - ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ ఏడు వర్గాలు - జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు.*


*ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు !*


-------------

 *ముస్లింలు*


*ఒక అల్లహ్*

*ఒక ఖురాన్*

*ఒక ప్రవక్త*

*గొప్ప ఐక్యత…!*


*ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు !*

*మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో !*


*సున్నీ మసీదుకు - షియా వెళ్ళడు.*


*ఈ రెండు వర్గాలు - అహమ్మదియా మసీదుకు వెళ్ళరు.*


*ఈ మూడు వర్గాలు - సూఫీ మసీదుకు వెళ్ళరు.*


*ఈ నాలుగు వర్గాలు - ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు...*


*ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం.*


-----    -----   

   *🕉హిందువులు🕉*


*1280 ధర్మ గ్రంథాలు,*

*10,000 భాష్యాలు,*

*ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు,*

*ముక్కోటి దేవతలు,*

*భిన్నమైన ఆచార్యులు,*

*వేలాది ఋషులు,*

*వందలాది భాషలు...*


*కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. మతం పేరుతో హిందువులు ఒకరికొకరు ఎప్పుడు చంపుకోలేదు!*


 *కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు.*


*ఇలా కొనసాగితే  కొన్ని సం. తర్వాత మన సనాతన ధర్మం* 

*కేవలం పుస్తకాలలో మాత్రమే* *మిగులుతుందేమో...?*


*ఆలోచించండి..... ఈ మేసేజ్ పంపించాల్సిన ఆవశ్యకతను మళ్ళీ  చెప్పక్కర్లేదనుకుంటాను.... అందరికి షేర్ చేయండి...*


*ఇది భారతీయుడా గ్రహించు...*

🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

31, డిసెంబర్ 2020, గురువారం

శాంతాకారం

 శాంతాకారం - శ్లోకంలోని అద్భుత భావన!*


*శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం*
*విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!*
*లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం*
*వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!*

ఇందులో సృష్టిక్రమం..
సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం..
ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.

*శాంతాకారం*
సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.
శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.
అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.
ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.
శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.

*భుజగ శయనం*
భుజగశయనుడు..అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.
ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.
కాలానికి లొంగి ఉన్నవి లోకాలు.
కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.

*పద్మనాభం*
సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.
సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం.
దానికి నాభి (కేంద్రం) విష్ణువే.
అందుకే ఆయన *పద్మనాభుడు*

*సురేశం*
విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు,
విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.
నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.
జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు
(సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).
ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.
ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.
అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.

*విశ్వాధారం*
కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు.
సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.
కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే *విశ్వాకారుడు* కూడా.
నదిలో అలలన్నిటికీ జలమే *ఆధారం*
అలల *ఆకారం* అంతా జలమే.
జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే..
విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.

*గగన సదృశం*
ఇది ఎలా సంభవం?
ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది.
సమస్తమూ ఆకాశము నందే ఉన్నది.
అదేవిధంగా ఆకాశంతో సహా,
సమస్త విశ్వమూ ఎవరియందు,
ఎవరిచే వ్యాప్తమై ఉందో,
అతడే పరమాత్మ.
అందుకే ఆయన *గగనసదృశుడు*(గగనం వంటివాడు).
ఇదే భావాన్ని *ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః* అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది.
ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది.

*మేఘవర్ణం*
నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే..
తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.
ఆ సాకారం *మేఘవర్ణం*(మబ్బువన్నె)గా ఉన్నది.

*శుభాంగం*
మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది.
అందుకే అది నీలమేఘశ్యామం.
ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే.
కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు.
తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు.
అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.

*లక్ష్మీకాంతం*
ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి.
ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి,
ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది.
అందుకే ఆ శుభ స్వరూపం *లక్ష్మీకాంతం*

*కమలనయనం*
ఐశ్వర్య దేవతకు ప్రీతికరం.
కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’.

*యోగిహృద్యానగమ్యం*
ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు.
యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు.
ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.

*వందే విష్ణుం  భవ భయహరం*
విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.
ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.

*సర్వలోకైకనాథమ్*
సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.

14నామాలతో *విశ్వానికీ – విష్ణువునకు* ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.

ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.

ఇంత స్పష్టంగా శ్రీహరి గొప్పతనాన్ని,
ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ 
యోగపూర్వక ధ్యానం ద్వారా,
మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.

(జై శ్రీమన్నారాయణ)🙏 

శ్రీలలితా సహస్రనామ వివరణ🌹

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*66. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితా*


సంపత్కరీ అను దేవత ఒక యేనుగును అధిరోహించి తనచుట్టూ అటువంటి యెనుగుల గుంపులతో సేవించబడుతూంది. ఆమె వైభవం వూహించటకు శక్యంకాదు లలితా త్రిపుర సుందరీదేవి తన గజబలములకు యీ సంపత్కరీ దేవిని అధికారిణిగా నియమించింది. లలితా దేవియొక్క అంకుశమునుండి ఈ సంపత్కరీదేవి పుట్టినది.


ఈ సంపత్కరీదేవి “రణ కోలాహలము" అనే పేరున్న మత్తగజముపై అధిరోహించి వుంది. ఆ దేవి ననుసరించి కోట్లకొలదీ యేనుగులు వచ్చాయి


భద్రగజములు, మందగజములు, మృగగజములు అనుభేదములుగల యేనుగులను సంపత్కరీ దేవి మచ్చిక చేసికొని అధిరోహిస్తుంది. అలాంటి గజసమూహము చేత శ్రీ లలితాదేవి సేవించబడుతున్నది


సంపత్కరీ' అనునది ఒక విద్యకు పేరు. సుఖ సంపత్కరి ఐక్య సంపత్కరి అనే విశేషములు గలది. ఇట్టి ఐక్యసంపత్కరీ విద్యలచేత దేవి సేవించబడుతుంది


శ్రీ చక్రములో త్రికోణముకుపైన వుండి పూజింపబడే 'కామేశ్వరీదేవే' 'సంపత్కరీ*

అనే దేవత


కం|| గజ సైన్యపు, సంపత్కరి

నిజాయుధపు, యంకుశమున, నిండై కొలువన్ గజ సింధుర బంధురములు,

యజరామర, మూర్తిగొలువ, నధికోత్సహితుల్!!

   

        లలితానామసుగంధం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*67. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృతా


అశ్వారూఢ" అనే దేవతచే అధింపబడ్డ కోటానుకోట్ల గుఱ్ఱములచే పరవేష్టిం

బడి వుం


లలితాదేవి పాశమునుండి' మిక్కిలి చురుకైన విక్రమముతో “అశ్వారూఢ" అనే దేవత పుట్టింది.ఆమె "అపరాజిత” అనే గుఱ్ఱము పైనెక్కి బయలుదేరగా ఆమెను అనుసరించి కోటానుకోట్ల సంఖ్యలు గల గుఱ్ఱములు వాయువేగంగా ఆమెను అనుసరించి వచ్చి అవన్నీ “శ్రీదేవిని” సేవిస్తున్నాయి


ఇంద్రియములను గుఱ్ఱములుగా చెబుతారు. ఇంద్రియములపై అధిష్టించి ఆ యింద్రిములను స్వాధీనపరుస్తుంది గనుక, ఆ దేవి"అశ్వారూఢ" ఇంద్రియములను; వాటి వాటి పనులలో నడిపించు మనసునకు ఆత్మజ్ఞానం కావాలి. అజ్ఞానం చేత ఇంద్రియాధీనం అయిన మనసు కట్టుబడ


లలితాదేవిని ఉపాసించేవారు ఇంద్రియములను జయించి ఆత్మ జ్ఞానము తెలుసుకున్నవారై పరమాత్మలో ఐక్యం కాగలుగుతారు. భండాసుర వధలకై బయులుదేరిన అలితాదేవికి ఒకవేపు గజదళాధిపతియైన "సంపత్కరి" అశ్వదళాధిపతియైన"అశ్వారూఢ" మరొకవేపునా ఉన్నారు


కం|| అశ్వారూఢా, దేవి

అశ్వంబులు కోటి కోట్లకధిపతి దానై

విశ్వంబును గెలువ గలు

విశ్వంభరి చెంతను పరివేష్టిత మగుగా


        లలితానామసుగం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*68.చక్రరాజ రధారూఢ, సర్వాయుధ పరిష్కృతా


చక్రరాజ' అనే పేరుగల రధముపై సమస్తమైన ఆయుధములతో అలంకరిం

బడి శ్రీమాత వున్న


చక్రరాజ "కిరిచక్ర" "గేయచక్ర" అనే రధములు రధశాస్త్రమలో వర్ణించబడ్డాయి. శ్రీదేవి “చక్రరాజము" అనే రథమునందు వున్న


దానికి “ఆనందధ్వజము" దానికి తొమ్మిది పర్వములు


గేయచక్రరథమునకు" ఏడుపర్వములు, దానియందు "మంత్రినాధ” అనే దేవత వుంది! "కిరిచక్రమునకు "ఐదుపర్వములు. దానిపై "దండనాధ" అనబడే దేవివుం


'చక్రరాజ రధ' మెక్కడవుంటుందో అక్కడే గేయచక్రరథము గేయచక్రరథ మెక్కడ వుంటుందో అక్కడే కిరిచక్రరథమూ వుంటా


సర్వాయుధములతో అలంకరించబడిన "చక్రరాజము" అనే రధంలో దేవిభండాసురుని సంహరించుటకై నెలకొని వున్నది


"శ్రీ" చక్రమే “చక్రరాజమగుటచేత చక్రపుగుర్తులు, యంత్రపు గుర్తులు, మంత్రముల గుర్తులు, యోగ సంకేతములూ దానిలో వుంటా


ఆ “చక్రరాజ" రధములో 'పర్వములు' అని చెప్పబడినవి. శ్రీచక్రమందు

ఆవరణలుగా వుంటవి


కం|| శాత్రవ మర్ధవిరాజి

ఆత్రిపురాంబిక, రధమది యార్తుల గాయన్త

చిత్రంబగు యుద్ధము

జైత్రం బగు చక్రరధము సరగున విడిసెన్!


        లలితానామసుగం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*69. గేయచక్రరధారూఢ మంత్రిణీ పరిసేవితా


లలితాదేవి గేయచక్రము అనే పేరు గల రధముపై ఎక్కిన మంత్రిణి యగు "శ్యామలా దేవి చేత సేవించబడుతూవుం


ప్రసిద్ధమైన చక్రముగల రధము అనగా "సూర్యమండలము


సూర్యలోకములో నివసించే శ్రీవిద్యను వుపాసించు యోగినులు వారు ఎల్లప్పుడూ ఆ మాతను ధ్యానిస్తూ వుంటారు


శ్రీచక్రమున మధ్యబిందువు చుట్టూవుండే త్రికోణమే "గేయచక్రము" అదిత్రిపురాశక్తి బుద్ధి తత్వముల పరిణామమే మంత్రిణి దేవికీ యీశక్తికీ భేదము లేదు. ఈ దేవిని ఉపాసించుట వలన పరబ్రహ్మసాక్షాత్కారము అవుతుంది. మంత్రిణి


శ్యామలా దేవి గేయచక్రరధముపై కూర్చొని శ్రీమాతకుకుడి భాగమున వుంటుంది


గానము చేయడానికి యోగ్యత గలది. ఈ మంత్రిణీ దేవికి గేయా శ్యామలాంబా సంగీత యోగినీ అనే ఇతర పేర్లు వున్నవి. ఆమె చక్రము సప్తస్వరములతో వుంటుంది. దానికి 'గిరిచక్రము' గీతి చక్రము అని కూడా పే


శ్రీశ్యామలాదేవి సంగీత మాతృకయగుట వలన ఆమె కూర్చున్న రథము 'గేయచక్రము. ఆమె వీణ గలిగినది. ఆమె ఆసనము "గేయము


కం|| మంత్రిణియగు నాశ్యామల, తంత్రములను వల్లెవేయు తగునారధము

యంత్రంబుల, సంజనితపు

మంత్రాన్వితయై, మరికుడి, పార్శ్వము నడచెన్


       లలితానామసుగం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


 *70.కిరిచక్రరాజరధారూఢ దండనాధ పురస్కృతా


వారాహముల చేత లాగబడుతూన్న రథమునందు ఎక్కిన 'దండనాధ' యైన వారాహీ దేవిచేత పరమేశ్వరి సేవించబడుతున్న


కిరిచక్రరథము' అనగా వారాహములవలే వుండిన చక్రముల గల రధమని గూడా అర్ధము. ఎల్లప్పుడూ చేతియందు దండమును ధరించినది కనుక 'దండనాధ' అని పేరు సృష్టి స్థితి, లయ' ఈ మూడింటినీ కూడా “కిరిచక్రము" అనబడును. ఆ రథముపై ఎక్కినప్పుడు యీమె దండధరుడైన యమునకు కూడా లొం


శ్రీ చక్రములో “వసుకోణచక్రము"నకు “కిరిచక్రము" అనిగుర్తు. ఆత్రికోణ చక్రములోని "మహాత్రికోణ, నైరృతి" కోణములో పూజింపబడే 'భగమాలినీ' ‘వారాహీదేవి అంటారు. మనిషిలో వుండే ఇంద్రియములు అనే సైన్యమును అదుపులో వుంచి నడిపిస్తూ వుంటుంది యీ దే


శ్రీమాతకు యిటువంటి దండనాధులు పన్నెండుమంది వుంటారు. అందరిలో "వారాహీ దేవి” ముఖ్యురాలు. శ్రీచక్రమున మహాత్రికోణములో వుండి నైరుృతి కోణములో పుండి పూజింపబడే "భగమాలినీ” అను దేవియే వారాహీదేవి


మన ఆత్మలో వున్న మనసే దండనాయిక. ఈ దండనాయిక ఇంద్రియములనే సైన్యమును అదుపులో వుంచి నడిపిస్తుం


కం|| వారాహీపరమేశ్వరి

భారము వహియింప నెడమ పార్శ్వము సందు

వీరతలన్ వెలసినదై

పూరిత శక్తికిరిచక్ర, పూని వెలసెనూ


         లలితానామసుగంధం

                   M s.s.k !,న్,ది..విగదుది*



                

చిరవిభవా ! శతకము "

 .

          🙏  హరిః  ఓమ్‌  🙏


🌸🌻పద్యాల🌻తోరణం🌻🌸

          🌹శు భో ద యం 🌹


    ప్రాతఃస్మరణీయులు శ్రీమాన్‌    

    కూచిమంచి తిమ్మకవివరేణ్య

                     విరచిత

       " చిరవిభవా ! శతకము "

                    🌼🌹🌼


-8- చంపకమాల :


శరశరదిందు కుంద 

హరిచందన హార తుషార తారకా


దర ఘనసారవర్ణ వరదండ

శుకాంబుజపాణి వాణి యా


దరమునఁ బ్రోచుచోఁ గవికదంబము నిన్బ్రణుతించు ధన్యమై


చిరవిభవా ! భవా ! విజితచిత్తభవా ! యభవా ! మహాభవా🙏



టీకా :


( తెల్లని ..)శర(..ము) = ఱెల్లు , 

శరత్‌(..కాలపు) , + ఇందు = చంద్రుడు , 

కుంద = మొల్ల పూవు , 

హరిచందన(..ము) = వెన్నెల ,  

హార(..ము) = ముత్యాల దండ ,  

తుషార(..ము) = మంౘు ,  

తారకాదర = నక్షత్ర కాంతి , ఘనసార(..ము) = కర్పూరము మొ॥

వర్ణ(..ము గలిగి ) , వరదండ = జపమాల , 

శుక(..ము) = చిలుక , + అంబుజ(..ము) = పద్మము ,  పాణి = హస్తము(..నందు గల) , వాణి = సరస్వతీదేవి , 

(యా)ఆదరమునఁ ,  బ్రోచుచోఁ = కాచుట వలన , (గ)కవి(..యొక్క) , కదంబము = 

(కావ్య..) సముదాయము , ధన్యమై , 

నిన్ = నిన్ను , (బ్ర)ప్రణుతించు = కీర్తించును ..

శివా ! ..

[ ఈ మకుటార్థము 

ప్రతి పద్యమునకును అన్వయము ..

చిరవిభవా ! = శాశ్వతమైన విభవము గలవాడా ! ,  భవా ! = శివా ! 

< విజిత = జయించబడిన , 

చిత్తభవా ! = మన్మథుని గలవాడా > = 

మన్మథుని జయించినవాడా ! (య)అభవా ! = (జనన మరణ 

చక్రబంధ క్రమమున ..) జన్మ లేనివాడా !

మహాభవా ! = ౘచ్చి , పుట్టునటువంటిది కాని గొప్ప పుట్టుక కలవాడా = శాశ్వతుడా..]🙏



భావము : !


చిరవిభవా ! భవా ! 

విజితచిత్తభవా ! యభవా ! మహాభవా ! 

తెల్లని .. ఱెల్లు - శరత్కాలపు చంద్రుడు - మొల్ల పూవు - వెన్నెల - ముత్యాల 

దండ - మంౘు - నక్షత్ర కాంతి - కర్పూరము మొ॥వాటి వర్ణము గలిగి .. జపమాల - చిలుక - పద్మము .. హస్తములందు గల సరస్వతీదేవి 

ఆదరమున కాచుట వలన కవియొక్క 

కావ్యసముదాయము ధన్యమై - నిన్ను కీర్తించును ..

శివా ! ..🙏

పసుపు


*🌻పసుపు-పరిహారాలు🌻*



పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు.

అవేమిటంటే...


1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క...


వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.

పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.

దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే

పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు అలా కాకుండా ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి.


1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.


2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.


3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.


4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.


5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.


6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.


7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.


8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.


9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.

10. వ్యాపారం జరుగని దుకాణాల్లో దక్షణావృత శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది

🙏🏻🌷🙏🏻

కలియుగం


_*కలియుగం అంటే ఏమిటి ?*_


_*కలి ఎవరు ?*_


_*కలి మనలో ఎలా ప్రవేశిస్తుంది?*_


_*కలి నుండి మనం ఎలా తప్పించు కోగలం ?*_


*ముఖ్యమైన యుగాలు 4.*


*1. కృతయుగం* 


*2. త్రేతాయుగం* 


*3. ద్వాపరయుగం* 


*4. కలియుగం* 


*కలియుగం అంటే ఏమిటి?* 


*ఇప్పుడు మనం ఉన్న యుగమే కలియుగం .*


*యుగాల సృష్టిలో 4వది 'కలి'. ద్వాపర యుగం లో అన్నా చెల్లెళ్లకు పుట్టిన వాడే ఈ కలిపురుషుడు ఇతని కాలాన్నే కలియుగం అంటాము.*


*ఈ యుగం మిగతా యుగాలకంటే చాలా భిన్నం గా ఉంటుంది.* 


*ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమై పోయి, తిరిగి యుగాలు ప్రారంభ మవుతాయి .*


*కలి ప్రభావం ?*


**************


*కలియుగంలో కలి* 

*పురుషుని ప్రభావం చాల దారుణంగా ఉంటుంది.*


*కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల దేవతలకు హవిస్సులందవు.* 


*వేదము అవమానింప బడుతుంది.* 


*పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు.* 


*ధర్మాత్ములు, భూమాత, గోమాతలు అవ మానింప బడతారు.* 


*అసత్యం, బంగారం, డబ్బు చాల ముఖ్యమనుకోవడం.* 


*కష్టపడిన వారికి ఫలితం తక్కువ.* 


*కష్టపడని వారికి ఫలితం ఎక్కువ.*


*శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు.* 


*మనుషులలో నీతి నిజాయితీలు ఉండదు.* 


*దాన-ధర్మాలు ఉండవు.* 


*తల్లిదండ్రులు, అత్తమామలు, అక్కాచెల్లెళ్లు, అనే అనుబంధాలు తగ్గిపోతూ వుంటాయి.* 


*చివరికి కలి వైపరీత్యం వల్ల యుగాంతంలో కరువులు, వరదలు, యుద్దాలు, ఆకలి చావులు వచ్చి, యుగం అంతమై పోతుంది.* 


*కలి పురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తాడు.*


*1. జూదం ఆడే వారిలోకి*


*2. మద్యం సేవించే వారి లోకి*


*3. వ్యభిచారం చేసే వారి లోకి*


*4. జీవహింస చేసే వారిలోకి*


*ఇంకా*


*5. జూదంలో నుంచి అసత్యం లోకి,*


*6. మద్యం ద్వారా మదం, అహంకారాల లోకి*


*7. వ్యభిచారం నుంచి కామవాంఛకు,*


*8. హింస లోంచి కోపం లోకి ఎగ బాకుతాడు కలి.* 


************************

*కలి పురుషుడు ఈ యుగం లోకి ఎలా వచ్చాడు?*


***********************

*1. పరీక్షిత్తు మహారాజు - ఎద్దు (ధర్మ దేవత):*


****************************************


*పరీక్షిత్ మహారాజు కలిని అంత మొందించ బోవడం:-*


***************************


*ధర్మ బద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్తు మహారాజుకు (చక్రవర్తి) దేశం లో ఒక రోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది.*


*తనదేశంలో బాధతో ఉండేవారు అనేది ఉండదు . మహారాజు గారు ఆ గోమాత దగ్గరకి వెళ్ళాడు .*


*ఆ గోమాత.. ఒక ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయము చెప్పింది*


*ఆ ఆవు ఎద్దుని ఊరడిస్తూ ఉంది .(ఆ గోమాత మన భూమి ఎద్దు ధర్మ దేవత) ఏమైందని రాజు అడుగగా ఎద్దు కలి ఈ యుగం లోకి ప్రవేశించాడని, అతను తన కాళ్ళను నిర్దాక్షిణ్యంగా విరిచేడని చెప్పింది.*


*అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, ఎవరికీ అవసరం లేని గడ్డి తిని, మనుషులు తాగలేని నీటిని తాగే నిన్ను ఎవరు హింసించారు.*


*ఎవరికీ అపకారం చేయని నీ కాళ్లు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు.*


*ఎద్దు కాలు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు పరీక్షిత్ మహారాజు.*


*కామక్రోధావేశుడై, రాజులా కనిపించే కఠినాత్ముడు, కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు..*


*నా కాళ్లు అతడే విరగ్గొట్టాడు. అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ రాజుకు తెలిసింది.*



*దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి.. నన్ను ఎందుకిలా చిత్ర హింసలకు గురి చేస్తున్నావు? అని ప్రశ్నిస్తాడు. ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అంటాడు.*


*ఇది వదిలి నేనెక్కడుండాలి?*


*నేను ఎక్కడ ఉంటె నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా?* 



*నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటా నన్నాడు కలి.*


*జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తా నన్నాడు పరీక్షిత్తు.*


*తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్ర హించా డాయన.*


*పరీక్షిత్ మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపం, క్రౌర్యం..* 


*ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి.*



*ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదే నన్నాడు.* 


*అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది. కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలి పురుషుడు.*



*మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడు అని మనం చెప్పవచ్చు.* 


*2. కలి ప్రభావంతో పరిక్షిత్తు మహారాజు పరిస్థితి:*


******************************************


*పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి, బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించ గలిగాడు.* 



*ఆ ప్రభావంతో క్రూర,మృగాల బాధ తప్పించ డానికి మాత్రమే వేటాడే రాజు, హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలని పించింది.*



*జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది.* 



*అప్పుడే దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్లడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది.* 


*శమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు.* 


*ఇంటికి వెళ్లి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది.*


*అలా కలిని నియంత్రించ గలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనై చివరికి మరణాన్ని కొనితెచ్చు కుంటాడు.*



*3. కలి ప్రభావం - నల దమయంతుల కథ:* 


*************************************


*నల-దమయంతుల - స్వయం వరం:-* 


***********************

*దమయంతి స్వయంవరం ముగిసి, నలమహారాజును ఆమె వరించిన తరువాత అదే స్వయంవరానికి వచ్చిన అష్ట దిక్పాలకులు తిరిగి వెళ్లే టప్పుడు కలి పురుషుడు ఎదురవుతాడు.* 


*దమయంతిని వివాహ మాడడానికి వెళ్తున్నా నంటాడు. ఇంకెక్కడి వివాహం?.. స్వయంవరం ముగిసింది..*


*ఆమె నలుని వరించిందని చెబుతారు దిక్పాలకులు.* 


*ఇది తెలిసి కలిపురుషుడు నలమహారాజుపై క్రోధంతో వాళ్లెలా సుఖంగా ఉంటారో చూస్తానని ప్రతిన బూనుతాడు. కాని ధర్మబద్ధుడై, నిరంతరం దైవచింతన కలిగి, అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకునే నలమహారాజు దగ్గరికి కలి పురుషుడు వెళ్లలేకపోతాడు.*



*కాని ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్లు సరిగా కడుక్కోక హడావుడిగా వెళ్లిన నలుడిలోకి ప్రవేశించ గలుగుతాడు కలి.*


*ఇక అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పుతాడు.*


*మనసుపై నియంత్రణ కోల్పోతాడు. దాయాదులతో జూదమాడి రాజ్యం, సర్వ సంపదలు అన్నీ కోల్పోతాడు.* 


*భార్య దమయంతి ఎంత చెప్పినా వినిపించుకోడు. వెంటనే ఆమె సారథిని పిల్చి, పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపించి వేస్తుంది.* 


*రాజ్యం దాయాదులకు అప్పగించి, నలదమయంతు లిద్దరూ అరణ్యాలకు బయల్దేరుతారు.*


*ఆకలి దప్పులతో బాధపడుతుంటారు. ఓరోజు పక్షులు తను కట్టుకున్న పంచెను కూడా లాక్కెళ్లి పోతాయి.*


*తను లేకుంటే భార్య సుఖపడుతుందని భావించిన నలుడు ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోతాడు.*


*ఒకసారి*

*నల మహారాజా!*


*రక్షించు! అనే అరుపులు వినిపిస్తాయి. అరణ్యం కాలిపోతుంటే మంటల మధ్యలో కర్కోటకుడనే మహాసర్పం అరుస్తూ కనిపిస్తుంది. దాన్ని కాపాడి నదిలో వేయబోతుంటే కాటేస్తుంది. దాంతో అందమైన నల మహారాజు మరుగుజ్జు అయిన కురూపిగా మారిపోతాడు.* 


*నీకు సాయం చేసిన నన్నే కాటేశావెందుకంటాడు నలుడు. నీ అసలు రూపం నీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. నీకు మాత్రమే తెలిసిన అశ్వహృదయం విద్యతో రుతుపర్ణ మహారాజును ఆశ్రయించు.*


*నీకు అవసరం అయినప్పుడు నన్ను తల్చుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది. దాని సహాయంతో నీ స్వస్వరూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు.* 


*************************


*నలుడు బాహుకుడనే పేరుతో రుతుపర్ణ మహారాజు దగ్గర వంటవాడిగా చేరుతాడు. అశ్వ హృదయ విద్య ద్వారా మొండి గుర్రాలను లొంగదీసుకోగలుగుతాడు.* 


*ఒక్క రాత్రిలోనే ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లగలడు.*


*అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెదుకుతూ ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం చేరుతుంది. అక్కడ రాజమాత చూసి, తన దగ్గర పెట్టుకుంటుంది.*


*నల దమయంతుల జాడ తెలుసు కోవడానికి దమయంతి తండ్రి వేగులను పంపుతాడు. అలా సుబాహుపురం చేరిన వేగు ద్వారా రాజమాతకు ఆమె దమయంతి అని తెలుస్తుంది. తన పెద్దమ్మ దగ్గరే చేరానని అర్థమైన దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది.*


*ఆమె కొంతమంది బ్రాహ్మణులను పిల్చి అన్ని రాజ్యాలకు పంపిస్తుంది.*


*అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను వదిలి వెళ్లడం ధర్మమేనా? అలాంటి పురుషుడున్నాడా? అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది.* 



*అలా రుతుపర్ణుడి రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా? అని అడుగుతాడు బాహుకుడి రూపంలో ఉన్న నలుడు.* 


*ఇది తెలిసిన దమయంతి ఆయనే నలమహారాజని నమ్ముతుంది. అందుకే దమయంతి ద్వితీయ స్వయం వర ఆహ్వాన మంటూ రుతుపర్ణుడికి మాత్రమే పంపించ మని తండ్రిని కోరుతుంది.*



*రుతుపర్ణుడు బాహుకుడిని వెంటబెట్టుకుని స్వయంవరానికి వెళ్తాడు.* 


*దారిలో నీకు అశ్వహృదయం విద్య తెలిస్తే నాక్కూడా మరో విద్య తెలుసునని, దాని ద్వారా చెట్టుకు ఎన్ని కొమ్మలు రెమ్మలు ఉన్నాయో సరిగ్గా లెక్క చెప్పవచ్చు నంటాడు రుతుపర్ణుడు. ఆ విద్యను నలుడికి ఉపదేశిస్తాడు.* 



*దాని మహిమ వల్ల కలిపురుషుడు, చెడులక్షణాలూ ఉండజాలవు. కాబట్టి నలుడి నుంచి కలి పురుషుడు బయటకు వస్తాడు. తనను సంహరించ ప్రయత్నించిన నలుడిని క్షమించమని నలుడి కాళ్లపై పడతాడు.*


*కర్కోటకుడు కాటు వేసినప్పటి నుండే నేను మంటలతో చచ్చిపోతున్నాను. నేనింక నీ జోలికి ఎప్పుడూ రాను. ఆ తాండ్ర చెట్టు దగ్గరే పడిఉంటానని వేడుకుంటాడు.*


*అప్పుడు మహారాజు స్వయంవరం చేరుకుంటాడు. హడావుడేమీ లేకపోవడంతో ఆశ్చర్యానికి లోనవుతారు.* 


*అప్పుడు దమయంతి సభలోకి వచ్చి అదే ప్రశ్న మళ్లీ వేస్తుంది.* 


*అది ధర్మం కాదు గానీ కలి ప్రభావం వల్ల అలా చేశానని చెబుతాడు నలుడు.* 


*ద్వితీయ స్వయంవరం కూడా నిన్ను చేరడానికేనని చెబుతుంది దమయంతి.*


*నలుడు కర్కోటకుడిని తలచుకుంటాడు. దివ్యవస్త్రం వస్తుంది.* 


*అది ధరించగానే విషప్రభావం నశించి, కురూపి రూపం పోయి, నలమహారాజులా మారిపోతాడు.*


*అప్పుడు కలి వచ్చి, రాబోయే కాలంలో నీ చరిత్రను పద్యరూపంలోనో, గద్యరూపంలోనో, మరే రూపేణా విన్నా, పాడినా, తలచినా వారి జోలికి వెళ్లనని వరమిస్తాడు*


*కలి నుండి మనం ఎలా తప్పించు కోగలం*


*****************************


_*ఈ కాలం పేరే కలి కాలం కలి ఎలాగైనా వెంటాడి తీరుతాడు. ఈ యుగం లో ధర్మం అడుగంటి ఉంటుంది. కావున ఎవరికైనా చిన్న సాయం చేసినా, కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం .*_


_*మనస్ఫూర్తిగా రోజు ఒక్క సారైనా దైవ స్మరణ చేసిన చాలు కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం .*_


_*దాన ధర్మం లు చేయడం,*_ 


_*పెద్దల శ్రాద్ధ కర్మలు మర్చి పోకుండా చేయడం, నోరు లేని జీవాలను ఆదరించడం,*_


_*కాశీకి వెళ్లినట్టు మనసులో తలచుకొన్న చాలు. కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం.*_


_*దైవ సంబంధమైన చర్చల్లో భజనలలో, పాల్గొన్నాచాలు. కలి పురుషునికి దూరంగా ఉండవచ్చు.*_


_*ప్రతి ఒక్కరు నిత్యం ఒక్కసారైనా క్రింది పద్యాన్ని స్మరిస్తే కలి భయం ఉండదు.*_


_*"కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్యచ!*_


_*ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనం!*_


_*దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః*_🙏

శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

6వ అధ్యాయము 

ధ్యాన యోగము


సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు ।

సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ।। 9 ।।


సుహృత్ — శ్రేయోభిలాషుల యందు; మిత్రా — మిత్రులు; అరి — శత్రువులు; ఉదాసీన — తటస్థుల యందు; మధ్య-స్థ — మధ్యస్థులు; ద్వేష్య — ఈర్శాపరులు; బంధుషు — బంధువులు; సాధుషు — సాధువులు; అపి — కూడా; చ — మరియు; పాపేషు — పాపులు; సమ-బుద్ధిః — సమానమైన భావము (ఒక్క లాగే చూసే); విశిష్యతే — సర్వశ్రేష్ఠమైనవాడు.


భావము 6.9: శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను - యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధి తో ఉంటూ, శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా, మరియు, పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా - ఉన్న యోగి మానవులలో సర్వ శ్రేష్ఠుడు గా పరిగణించబడుతాడు.


వివరణ: 

మిత్రుల పట్ల, శత్రువుల పట్ల వేరే వేరే విధంగా స్పందించటం మానవ సహజ స్వభావం. కానీ, ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావము వేరుగా ఉంటుంది. భగవంతుని విజ్ఞానము కలిగిఉన్న, ఉన్నతమైన యోగి, ఈ సమస్త సృష్టిని భగవంతుని కన్నా అబేధముగా చూస్తాడు. ఈ విధంగా, వారు అన్ని ప్రాణులను సమ దృష్టి తో చూడగలుగు తారు. ఈ సమత్వ దృష్టి కూడా చాల స్థాయి లలో ఉంటుంది:


1. "అన్ని ప్రాణులు దివ్య ఆత్మలు, కాబట్టి భగవంతుని అంశలే." అందుకే వారు సమానంగా చూడబడుతారు. “ఆత్మవత్ సర్వ భూతేషు యః పశ్యతి స పండితః” "నిజమైన పండితుడు అందరినీ జీవాత్మలుగా చూస్తాడు, కాబట్టి తన లాంటి వారిగానే చూస్తాడు."


2. అంతకన్నా ఉన్నత మైన దృష్టి ఇది: "భగవంతుడు అందరిలో ఉన్నాడు, కాబట్టి అందరూ గౌరవింపబడతగిన వారే."


3. అత్యున్నత స్థాయి లో, యోగి ఈ విధమైన దృష్టి ని పెంపొందించుకుంటాడు: "ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపాలే." జగత్తు అంతా యదార్థంగా భగవంతుని స్వరూపమే అని వైదిక వాజ్ఞయం పదే పదే పేర్కొంటున్నది: ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ (ఈశోపనిషత్తు 1) "సమస్త విశ్వము తనలో ఉన్న చర-అచర వస్తువులతో పాటుగా కూడా, ఆ భగవంతుని ప్రాదుర్భావమే (manifestation), దాని అంతటా ఆయన నిండి ఉంటాడు. "పురుష ఏవేదం సర్వం” (పురుష సూక్తం); “భగవంతుడు ఈ ప్రపంచంలో ప్రతి చోటా నిండి ఉన్నాడు, ప్రతిదీ ఆయన శక్తి స్వరూపమే." కాబట్టి అత్యున్నత యోగి ప్రతివారినీ భగవత్ సాక్షాత్కారముగా చూస్తాడు. ఈ విధమైన జ్ఞానదృష్టి కలిగిఉండి, హనుమంతుడు అంటాడు: "సీయా రామ మయ సబ జగ జానీ” (రామాయణం)", నేను ప్రతివారిలో సీతా రాముల ముఖాన్నే చూస్తాను." అని.


6.31 శ్లోక వ్యాఖ్యానం లో ఈ వర్గాలు మరింత విశదంగా వివరించబడ్డాయి. ఈ మూడు వర్గాలను సూచిస్తూ, అందరు వ్యక్తుల పట్ల సమత్వ దృష్టి కలిగిన యోగి, ఇంతకు క్రితం శ్లోకం లో చెప్పబడిన యోగి కన్నా ఉన్నతమైనవాడు అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు. యోగ స్థితి ని గురించి వివరించిన శ్రీ కృష్ణుడు, తదుపరి శ్లోకం నుండి మొదలిడి, ఈ స్థాయిని చేరుకోగలిగే అభ్యాస విధానాన్ని వివరిస్తున్నాడు.