3, జూన్ 2021, గురువారం

తెలుగు

 *తెలుగు చమత్కారం*💥💥💥

🙂 🙂 🙂 🙂 🙂 🙂


'ఓ పల్లెటూరి కిరాణా వ్యాపారి టీచర్ దగ్గరకొచ్చి ' సింతపండు' అని రాసినందుకు నా కొడుకుని దండించారట. ' చింతపండుని సింతపండు అంటే దాని పులుపేమైనా తగ్గిపోతుందా ? ఎలా రాసినా పర్వాలేదు.


కొంచెం కిరణాపద్దులు రాయడం నేర్పండి చాలు' అంటాడు. మునిమాణిక్యం వారి రచనలలోని సన్నివేశం ఇది.భాష ప్రయోజనం భావ వ్యక్తీకరణకే. కానీ కొన్ని పదాలు వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చూడండి.


'వాడెదవ' అంటే తిట్టనుకునేరు .చెరకుగడ చివరిభాగం.


tip of the sugar cane అన్నాడు బ్రౌన్.


'సమాజం' అనబోయి 'సమజం' అన్నారనుకోండి.ప్రజా సమూహం కాస్తా 'పశువుల మంద' అయిపోతుంది.

'రామబాణం' అంటే మనకు తెలిసిన అర్ధమే కాదు. 'తాటాకు గ్రంధాలను తొలిచే పురుగు' అనే అర్ధం కూడా ఉంది. (ఈ అర్ధం బాగుంది కదా!)

'శ్రీ' అంటే విషం అనే అర్ధం కూడా ఉందండోయ్.


'దస్తూరి' అంటే చేతిరాత అనే కాదు 'సుంకం' అని కూడా .(customary fee - బ్రౌన్)


'ముండపులుసు' అనేది దూషణ అనుకునేరు. ' మృతుని ఇంటికి దూరపు బంధువులు వచ్చినపుడు భోజనం చేసివెళతారట. ఆ భోజనంలో తాలింపు లేకుండా ఉప్పు, కారం, చింతపండు, వేసి పచ్చిపులుసు చేస్తారట అదే ముండపులుసు.


( తెలంగాణా జాతీయాలు, వేముల పెరుమాళ్ళు )


కొన్ని కుటుంబాల్లో పిల్లల్ని 'దొంగ బడవా' అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ మాటకు ' ముండలను తార్చేవాడు' 'లుచ్చా' అనే అర్ధాలిచ్చాడు బ్రౌన్.


ఒకాయన ఉదయాన్నే ఓ పండితుడి ఇంటికి వెళ్లి అతని కుమారుణ్ణి " మీ నాన్నగారున్నారా ? " అని అడిగాడట.


తండ్రికి తగ్గ ఆ కొడుకు " పెరట్లో పుష్పిక విముక్తికై నిష్టీవన కార్యక్రమంలో ఉన్నారు " అన్నాడట ఆ పెద్ద మనిషి అదేదో పూజా కార్యక్రమం అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఇంతకీ ఆ పండితుడు పళ్ళు తోముకుంటున్నాడు. పుష్పికం అంటే పళ్ళ పాచి ( దంత మలం అని శబ్దరత్నాకరం ) నిష్ఠివనం అంటే ఉమ్మేయడం.


ఒక మీటింగులో ఓ వక్త మాట్లాడుతూ " మన మంత్రిగారు సభాజనమును బాగా ఆకట్టుకుంటారు " అన్నాడట . 'సభాజనము' అంటే చుట్టాలను కౌగాలించుకుని సంతోష పెట్టడం( శబ్దరత్నాకరం)


సొంతవిషయాలను పదేపదే చెబుతుంటే ' నీ సొద ఆపు అంటాం . విసుగెత్తించే ప్రసంగం అనే అర్ధం మాండలికాల్లో ఉంది కానీ "


శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెల పోగు " అనేది నిఘంటు అర్ధం.


ఫలానా రాజకీయ నాయకుడికి ప్రజలు 'బ్రహ్మరధం' పట్టారు అంటారు. గొప్ప సత్కారం అనే అర్ధమే తీసుకుంటాం. కానీ బ్రహ్మరథం అంటే 'చనిపోయిన సన్యాసులను తీసుకుపోయే వాహనం' అని సూర్యరాయాంధ్ర నిఘంటువు లో ఉంది.


' గ్రామీణ ప్రాంతం' అంటున్నాం. 'గ్రామీణ' అంటే వేశ్య అనే అర్ధం కూడా ఉంది.


గందానికి లేని ఒత్తు తగిలించి 'గంధం' అని రాస్తున్నాం.


'బోగి పండుగ' ను 'భోగి పండుగ' అనకపోతే మనకి పండగలా అనిపించదు.


గొడుగు అంటే తెలుసు. మరి 'గిడుగు' అంటే? కర్ర లేని గొడుగు.


పంగనామం అంటే తెలుసు మరి 'బుంగనామం' ఏమిటి ? తెల్ల నామానికి ఎర్ర నామానికీ ఎడము లేకుండా ఉండే నామం.


బాధితులకు నష్ట 'పరిహారం' ఇవ్వాలంటారు. 'పరిహారం' అంటే విడిచిపెట్టడం అనే అర్ధం కూడా ఉంది


'ఇలాగే ప్రయోగించండి' అని చెప్పడానికో, చర్చ కోసమో కాదు ఇది. ఆసక్తి ఉండాలే కానీ నిఘంటువులు తిరగేస్తే ఇలాంటి విశేషాలెన్నో చూడొచ్చని చెప్పడానికి.



( డాక్టర్ కె ఆనంద్ కిషోర్, పూర్వ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గారి వాల్ నుండి)

పేదరికం పోగొట్టేందుకు

 ఒకసారి #కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు


వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు.

 చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు.

 సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు

మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.

మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు.

ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. 

తెల్లారింది. 

చూస్తే భార్య లేదు. 

అంతేకాదు ఆ కుండ కూడా లేదు.

 పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. 

భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. 

కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. 

నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది.

తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.

మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని.

 ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు

అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో.

లేదు అర్జున. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం 

అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు. 

ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు.

 ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.


దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. 

అతని హృదయం ద్రవించింది.

 కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు. 

అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది.

 ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు.

నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం.

 ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది...దొరికింది నా చేతికి చిక్కింది” 

అని గావుకేకలు పెట్టాడు.

 అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. 

గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేలా సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.

ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు 

అని ప్రాధేయపడ్డాడు. 

ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. 

తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. 

పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు. 

కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది 

అని ప్రశ్నించాడు అర్జునుడు.

అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను

అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ 🙏🙏🙏🙏 


🍁🍁 నేను నా ఆలోచనలు 🍁🍁

వృద్ధులకు శుభవార్త

 *వృద్ధులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం* 


* సీనియర్ సిటిజెన్స్‌కు మోడీ గవర్నమెంట్ బూన్ - మెడికల్ కన్సల్టింగ్ పూర్తిగా ఉచితం *


 సీనియర్ సిటిజన్లు మరియు ఇతర పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన కన్సల్టింగ్ పథకాన్ని ప్రారంభించింది.

 వృద్ధులు, ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటిస్ మొదలైనవారు OPD కోసం ఆసుపత్రికి వెళ్లరు.  తలనొప్పి, శారీరక నొప్పి వంటి చిన్న రోగాలకు వారు ఇంట్లో చికిత్స పొందుతారు మరియు ఆసుపత్రికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు.


 మీరు ఇప్పుడు క్రింది లింక్ ద్వారా Google Chrome లో కన్సల్టెన్సీ మరియు చికిత్సను యాక్సెస్ చేయవచ్చు. 


 గమనిక:

 * 1 *.  రోగి నమోదును ఎంచుకోండి.


 * 2 *.  మీ మొబైల్ నంబర్‌ను టైప్ చేయండి.  రిజిస్ట్రేషన్ కోసం మొబైల్‌లో OTP టైప్ చేయండి.


 * 3 *.  రోగి వివరాలు మరియు జిల్లా నమోదు చేయండి.  ఇప్పుడు, మీరు ఆన్‌లైన్‌లో డాక్టర్‌తో కనెక్ట్ అవుతారు.  ఆ తరువాత, మీరు వీడియో ద్వారా మీ ఆరోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించవచ్చు.  డాక్టర్  ఔషధాన్ని ఆన్‌లైన్‌లో సూచిస్తారు. 

 మీరు మెడికల్ ఫార్మసీ షాపులో చూపించి medicine ఔషధం తీసుకోవచ్చు.


 *ఈ సేవ పూర్తిగా ఉచితం.*

                                      

 మీరు ఈ సేవను ప్రతిరోజూ ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు, ఆదివారం సహా ఉపయోగించవచ్చు.


 దయచేసి దీన్ని మీ సంప్రదింపు, సమూహ జాబితాలోని సీనియర్ సిటిజన్లకు పంపండి.


 ఇది కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్:


 *https: //www.eSanjeevaniopd.in*


  https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd


 ఇది సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన దశ ....

 దయచేసి ప్రయోజనం పొందండి మరియు మీకు తెలిసిన అందరూ సీనియర్ సిటిజన్లకు ఫార్వార్డ్ చేయండి.

 

 🙏🙏🙏🙏🙏

అష్టమస్థాన పరిక్ష. 4

 ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరిక్ష గురించి సంపూర్ణ వివరణ  - 4 . 


      అంతకు ముందు పోస్టులలో అష్టమస్థాన పరీక్షలలో ప్రధమం అయిన నాడీ పరీక్ష గురించి వివరించాను. ఇప్పుడు మిగిలిన వాటిగురించి వివరిస్తాను. 


 *  స్పర్శ పరీక్ష  - 


    స్పర్శ అనగా రోగిని తాకి పరీక్షించడం . రోగిని తాకి చల్లదనము , గరుకుదనము , చమట , ఆవిరి మున్నగు వాటిచే వ్యాధులను గుర్తించుట . 


  వాతము  - 


        వాతము నందు శరీరము యొక్క స్పర్శ ఆరిపోయి చల్లదనం కమ్ముచుండును. 


  పిత్తము  - 


        పిత్తము నందు శరీరము వేడిగా ఉండును . 


  శ్లేష్మము  - 


       శ్లేష్మము నందు శరీరము చల్లగా ఉండును. 


      

                 జ్వరము నందు శరీరము పోగలుగా , తాపము చెంది ఉష్ణముగా మరణముగా ఉండును. చనిపోవు వానికి శరీరము కొయ్యబారి పోవును . 


 *  రూపము  - 


        రోగి యొక్క శరీర స్థితిని బట్టి రోగ కారణము నిర్ణయించు పద్దతి. రోగి వాత సంబంధ దోషము కలిగి ఉన్న శరీరము నలుపురంగుతో , పిత్తము నందు పసుపుపచ్చ , శ్లేష్మము నందు తెలుపు వర్ణములు కలిగి ఉండును. ఆయా వ్యాధులను బట్టి రోగి యొక్క ఆకారము తెలుపు మున్నగు రంగులను కలిగి ఉండును. పాండు వ్యాధి నందు శరీరం తెల్లగా పాలిపోయి ఉండును. క్షయరోగము నందు ఆరిపోవును . శరీరము నందు కొవ్వు శాతం తగ్గిపోవును . కామెర్ల వ్యాధి నందు శరీరం పచ్చగా ఉండును. ఇలా వ్యాధిని బట్టి తెలుసుకొనవలెను . 


  *  శబ్దము  - 


         శబ్దము అనగా రోగి యొక్క మాట్లాడు ధ్వనిని బట్టి రోగనిర్ధారణ చేయుట . వాతము నందు శబ్దము హెచ్చుతగ్గులతో నిలకడలేకుండా ఉండును. పిత్తము నందు అధికంగా ఉత్సహముగా ధ్వని ఉండును. శ్లేష్మము నందు హీనస్వరము కలిగి ఉండును. భ్రమ , అపస్మారము , పైత్యజ్వరము , సన్నిపాతము మున్నగు వ్యాధులలో రోగి అతిగా ధ్వని కలిగినవాడై ఉండును. వికృతముగా అరుచును. రహస్యములు పైకి చెప్పువాడై ఉండును. కఫము నందు భయము , సిగ్గు , దుఃఖం మున్నగు వాటి యందు శబ్దము క్షీణించి ఉండును.   


       పైన చెప్పినవిధముగా వాత, పిత్త , కఫ దోషాల గురించి తెలుసుకోవచ్చు . మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు. 


  

                 తరవాతి పోస్టు నందు అష్టమస్థాన పరీక్ష యందలి మిగతావిషయాల గురించి వివరిస్తాను . 


       గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

_*WHO ARE YOU?*_

 _*WHO ARE YOU?*_ 


🤔🤔🤔


During one of his travels, *Kalidasa* felt very thirsty and looked around for water. He saw *a woman* drawing water from a well.


He went up to her and asked her for water. She agreed to give him water, but asked him, *“Who are you? Introduce yourself.”* 


Now Kalidasa thought that an ordinary village woman was not worthy of knowing who Kalidasa was. So he said, *“I am a traveller.”* 


But his lady replied, “In this world there are only *2 travellers* – the *Sun* and the *Moon.* Both Rise and Set every day and keep travelling perpetually.”


Then Kalidasa said, “Alright then, *I am a guest.”* The lady promptly replied, “In this world there are only *2 guests* – *Youth* and *Wealth* … both are temporary and hence can only be called as guests.”


Intrigued Kalidasa said, “I am a *Tolerant person* (sahansheel vyakti).” Now the lady replied, “In this world only 2 truly know the meaning of Tolerance – *Bhoomi (Earth)* and *Tree* . How much ever you stamp the earth or throw stones at the tree (for the fruits), both continue to nurture us.”


Now Kalidasa was completely perplexed. He said, “Fine. *I am a stubborn person (hatavaadi).”* The lady smiled and said, “There are only *2 truly stubborn* personalities – our *nails* and our *hair.* We keep cutting them non-stop, but they continue to grow.


Kalidasa realised that he had been *outsmarted* . He fell at the feet of the lady and when he touched her feet and then got up, whom did he see?


 *Mata Saraswati* – the Goddess of Learning and Wisdom. She said, “Kalidasa, you are wise. But only if you know yourself do you become a *Manushya* (human being). A person without any awareness of self has not reached the pinnacle of being a Human.


 *Note:* 

The Guru who recounted this story in His Pravachan said, *“Children should become a Manushya* & know themselves. More than teaching them how to earn more money and become rich, parents should teach them to become aware of themselves and become better Human beings..

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*తీవ్ర సాధన..తీరిపోయిన సందేహం..*


*(నలభై ఏడవరోజు)*


శ్రీ స్వామివారు సాధన చేసుకునే సమయంలో..నేలమాళిగ లోపల కూర్చుని, దానిమీద ఒక చెక్క పలకను మూతగా పెట్టుకొని..ధ్యానం చేసుకునేవారు..


లోపల ఊపిరాడుతుందా?..స్వామివారికి ఏ ఆపదా కలుగదు కదా?..కనుక్కుందాము అని శ్రీధరరావు ప్రభావతి గార్లకు తోచింది..ఒకసారి ఆశ్రమానికి వెళ్లి, ఆయనతో నేరుగా మాట్లాడి తెలుసుకుందామని అనుకుని..గూడు బండి సిద్ధం చేయించుకొని ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆశ్రమానికి చేసురుకున్నారు..ప్రహరీ ద్వారం తీసే ఉన్నది..దంపతులిద్దరూ లోపలికి అడుగు బెట్టేసరికి.. శ్రీ స్వామివారు బావి వద్ద నిలబడి..సూర్యనికి నమస్కారం చేసుకుంటున్నారు..ఒక్క రెండు మూడు నిమిషాల లోనే వీళ్ళిద్దరిని చూసి..సంతోషంతో నవ్వుతూ..


"అమ్మా!..మీరిద్దరూ మనసులో తల్లడిల్లిపోతున్నారా?..నాకు ఆ జగన్మాత ఆశీస్సులు ఉన్నంతవరకూ ఏ ఆపదా రాదు..మాలాటి అవధూతలకు ఇటువంటి కఠోర సాధన అవసరం..దానిని మేము చేసి తీరాలి..మోక్షానికి దగ్గర మార్గాలు లేవు!..మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి..సరే..మీరిద్దరూ సందేహంతో ఇక్కడిదాకా వచ్చారు..ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను..నాతో రండి.." అన్నారు..


అత్యంత ఆశ్చర్యం తో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ప్రభావతి శ్రీధరరావు గార్లు..తాము ఎందుకోసం వచ్చిందీ ముందుగానే చెప్పేసారు శ్రీ స్వామివారు..ఇక తమ ఇద్దరికీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు..స్వామివారి వెనకాలే ప్రధాన గది వద్దకు వెళ్లారు..


"శ్రీధరరావు గారూ..నేను ఈ క్రింద ఉన్న గది లోపలికి వెళ్లి కూర్చుంటాను..మీరు పైన ఆ చెక్క పలకతో మూసివేసి..ఒక ప్రక్కగా కూర్చోండి..తరువాత మీకు అన్నీ అవగతం అవుతాయి..సరేనా?.." అని చెప్పి..శ్రీ స్వామివారు లోపలికి దిగి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..శ్రీధరరావు గారు ప్రక్కనే ఉన్న చెక్క పలకను ఆ నేలమాళిగ పైన మూతగా పెట్టి..ఆ గదిలోనే ఒక మూలనున్న చాప పరచుకొని దానిమీద ప్రభావతి గారి తో సహా కూర్చున్నారు..


సుమారు ఓ పదిహేను ఇరవై నిమిషాల తరువాత..ఈ దంపతులిద్దరికీ ఏదో మైకం లాగా వచ్చేసింది..తమకు తెలీకుండానే నిద్రలోకి జారిపోయారు..ఆ గదిలోనే చాప మీద వాలిపోయారు.. గంట..రెండు గంటలు..ఇలా కాలం గడిచిపోతోంది.. ఉదయం తొమ్మిది, తొమ్మిదున్నర గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లిన ఆ దంపతులకు మెలకువ వచ్చేసిరికి..సమయం చూసుకుంటే..సాయంత్రం నాలుగు దాటుతోంది..ఒక్కసారిగా ఇద్దరికీ గుండె గుభేల్ మంది..


దాదాపు ఏడు గంటల పాటు తాము దిక్కుతెలీనంత గా నిద్రపోయారు.. తమ ఒళ్ళు తమకు తెలీదు..క్రింద నేలమాళిగ లో కూర్చున్న ఆ స్వామివారు ఎలా ఉన్నారో?..ఏమిటో?..అనుకుంటూ..గబ గబా లేచి చాప చుట్టి పక్కన పెట్టి..నేలమాళిగ పైన మూతగా పెట్టిన చెక్క పలకను తొలగించి.."స్వామీ..స్వామీ!.." అంటూ శ్రీధరరావుగారు.." నాయనా!..నాయనా!." అంటూ ప్రభావతి గారు పిలిచారు ఆతృతగా..


అరవవద్దు అన్నట్లు చేతితో సైగ చేస్తూ..శ్రీ స్వామివారు లేచి నిలబడ్డారు.. తన రెండుచేతులు ఆసరాగా పెట్టుకుని..ఆ గోతిలాంటి గది నుంచి ఒక్క ఉదుటున బైటకు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసిన తరువాత గానీ వీళ్ళిద్దరికీ ఆత్రుత తగ్గలేదు..


కానీ..చిత్రం..కనీసం గాలికూడా చొరబడని ఆ చిన్న గోతి లాంటి గదిలో దాదాపు ఏడు గంటల పైగా ధ్యానం లో ఉన్న శ్రీ స్వామివారి శరీరం పై ఒక్క చెమట బిందువు లేదు..ఉదయం ఎంత స్వచ్ఛంగా ఉన్నారో..ఇప్పుడూ అంతే స్వచ్ఛతతో..చిరునవ్వుతో..వున్నారు..ఆ ముఖం లో దేదీప్యమైన కాంతి కనబడుతోంది..అప్రయత్నంగా దంపతులిద్దరూ చేతులు జోడించి నమస్కరించారు..


శ్రీ స్వామివారు చప్పున..నమస్కరించవద్దన్నట్లు వీరిని వారించి.."అమ్మా..మీ ఇద్దరి సందేహమూ తీరిపోయిందా?..ఇది సాధనలో ఒక భాగం అమ్మా..అవధూత సంప్రదాయం లో ఇటువంటి తీవ్ర సాధన కూడా ఒక భాగం..ఆ సాధన సక్రమంగా చేస్తే..అణిమాధ్యష్ట సిద్ధులూ వశం అవుతాయి..కానీ వాటిని సక్రమంగా సమాజహితానికి వాడుకోవాలి..అప్పుడే ఆ సాధనకు ఫలితం..స్వార్ధానికి ఉపయోగిస్తే..తాత్కాలిక భోగాలు లభించి..చివరకు పతనం అవుతారు.."


"శిరిడీ లోని సాయిబాబా..అరుణాచలం లోని శ్రీ రమణులు ఉత్తమ సాధకులకు అత్యుత్తమ ఉదాహరణలు..వారు తమను తాము తరింపచేసుకొని..తమతో పాటు ఈ సమాజానికి మార్గదర్శనం చేసారు.. ప్రస్తుతం శ్రీ పరమాచార్య వారూ వారి పంథాలో వారు జాతిని ఉద్ధరిస్తున్నారు..


(శ్రీ స్వామివారు ఈ మాటలు చెప్పేనాటికి అంటే..1974 సంవత్సర ప్రాంతంలో..మన ఆంధ్రప్రాంతంలో కొంతమందికి మాత్రమే శిరిడీ లో ప్రకటమైన శ్రీ సాయిబాబా గురించి అవగాహన ఉన్నది..నేటి లాగా విపరీత ప్రాచుర్యం లేదు..అలాగే శ్రీ రమణమహర్షి గురించి కూడా..కానీ..శ్రీ స్వామివారు ఆ ఇద్దరినీ ఉదహరించారు..అవధూత లు "ద్రష్ట" లు అనడానికి..వారికి కుల, మత, జాతి విబేధాలు లేవు అనడానికి..ఇదొక నిదర్శనం..)


"శ్రీధరరావు గారూ తపస్సులో అనేక మార్గాలున్నాయి..ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పంథా..మీరు నా గురించి ఏ విషయం లోనూ చింత పడవద్దు..అన్నీ సక్రమంగా జరిగిపోతాయి..అమ్మా!..ఏ నిమిషంలో మీకు సందేహం వచ్చినా..నిరభ్యంతరంగా నా వద్దకు రండి..ఇప్పటికే కాలాతీతమైనది..వెళ్ళిరండి!.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని బైట ఉన్న తమ బండి వద్దకు వచ్చారు..చిత్రం..అప్పటికి కూడా బండి తోలే మనిషి..నిద్ర లోనే వున్నాడు..ఎద్దులు కూడా జోగుతున్నాయి..వీళ్ళు లేపేదాకా ఆ పనివాడు లెయ్యలేదు.."మొద్దు నిద్ర పట్టింది స్వామీ!..ఎప్పుడూ ఎరగను!..ఎద్దులకు నీళ్లు కూడా పెట్టలేదు.."అంటూ ఎద్దులను అదిలించి..బండి సిద్ధం చేసాడు..దంపతులిద్దరూ శ్రీ స్వామివారు తమకోసం చూపిన ఈ చిత్కళ ను తలుచుకొని మనసులోనే నమస్కరించి ఇంటికి బయలుదేరారు..


మరో అనుభవం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*సమాధి గది నిర్మాణం..సూచన..*


*(నలభై ఐదవరోజు)*


శ్రీ స్వామివారు దగ్గరుండి ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు..మీరాశెట్టి దంపతులు ఆర్ధిక సహాయం చేస్తున్నారు..పనివాళ్ళు ను శ్రీధరరావు గారు ఏర్పాటు చేస్తున్నారు..చక చకా నిర్మాణం జరుగుతున్నది..


ఒకరోజు మధ్యాహ్నం తరువాత, మీరాశెట్టి గారు మొగలిచెర్ల లోని శ్రీధరరావు గారింటికి వచ్చారు..మామూలు కుశల ప్రశ్నల తరువాత..తీరుబడిగా కూర్చున్నాక..


"స్వామివారు ఈరోజు ఒకమాట చెప్పారు..ప్రధాన గదిలో.. భూగృహం లాగా కట్టించమన్నారు.. అందులో కూర్చుని తాను తపస్సు చేసుకుంటానని చెప్పారు.." అని మీరాశెట్టి గారు శ్రీధరరావు దంపతులతో చెప్పారు..


ఆ మాట విని ప్రభావతి గారు  ఆశ్చర్యంగా.."ప్రత్యేకంగా భూగృహం నిర్మించమని చెప్పారా?..ఇందులో ఏదో అర్ధం దాగివుంది.." అని..శ్రీధరరావు గారి వైపు చూసి.."శ్రీవారూ!  మీరు వెళ్లి పూర్తివివరం కనుక్కోండి..మీరాశెట్టి గారూ మీరు కూడా తొందరపడి భూగృహం పని మొదలుపెట్టకండి..అన్ని సంగతులూ కూలంకషంగా మాట్లాడి ఆపైన చూద్దాము.." అన్నారు..


"అందుకే గదమ్మా నేను ఇక్కడిదాకా పరిగెత్తుకొచ్చింది..నాకు వివరం చెప్పలేదు..ఇప్పుడు లోపల మళ్లీ గొయ్యి త్రవ్వి..అందులో చిన్న గది లాగా తయారు చేయడం అనేది నాకు మనసుకు సరిగ్గా తోచడం లేదు..మీరిద్దరూ ఒకసారి ఆయనతో మాట్లాడండి.." అని శ్రీధరరావు గారితో ప్రభావతి గారితో చెప్పారు మీరాశెట్టి గారు..


అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు..శ్రీధరరావు గారు ఆలస్యం చేయలేదు..పని వాడికి చెప్పి గూడుబండి సిద్ధం చేయించి..నాలుగు గంటల కల్లా ప్రభావతి గారిని కూడా వెంటబెట్టుకొని మీరాశెట్టి గారితో సహా ఫకీరు మాన్యం చేరారు..


వీళ్ల రాక కోసమే ఉన్నట్లు..శ్రీ స్వామివారు పాక వెలుపల..ఆశ్రమానికి అభిముఖంగా నిలబడి వున్నారు..ముగ్గురూ శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి కలిశారు..


"నాయనా..లోపల భూగృహం కట్టించమని చెప్పారట..ఎందుకోసం?..మీ తపస్సుకు ఈ గది సరిపోతుందని మీరే చెప్పారు కదా!..మీరిచ్చిన కొలతల ప్రకారమే నిర్మాణం జరుగుతున్నది..మధ్యలో ఈ భూగృహ ప్రస్తావన ఎందుకు?.." ప్రభావతి గారు గబ గబా అడిగేసారు..


శ్రీ స్వామివారు పక పకా నవ్వారు.."మీరాశెట్టి మిమ్మల్ని వెంటబెట్టుకొచ్చాడా?..సరే!..రండి..ఈ సందేహం కూడా నివృత్తి అవ్వాలి గదా!.." అన్నారు శ్రీ స్వామివారు ..


వీళ్ళందరినీ వెంటబెట్టుకొని ఆ గది ముందు వైపు నిలబడి గంభీరంగా చూస్తూ..


"అమ్మా!..నేను సాధకుడిని..తీవ్ర సాధన నా లక్ష్యం..ఇక్కడ గది లాగా కట్టిస్తున్నారు..బాగానే వుంది..దానికి తలుపులు కూడ వస్తాయి..నేను లోపల కూర్చుని ధ్యానం చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు..కానీ తరచూ హఠయోగ ప్రక్రియలో సమాధి స్థితి కి వెళుతుంటాను..ఆ సమయంలో ఒక్కొక్కసారి చిన్నపాటి అలికిడికి కూడా సమాధి స్థితి భగ్నం అవుతుంది..ఇతమిద్దంగా ఇలా జరుగుతుంది అని నేను మీకు వివరించలేను..అది అనుభవించేవారికే అవగతం అవుతుంది..అందుకని నేను ముందుగా ప్రతిపాదించిన గదిలోనే..నాలుగు అడుగుల లోతు.. నాలుగడుగుల వెడల్పు తో చిన్న గది "నేలమాళిగ" లాగా కట్టించమన్నాను..నా తపోసాధన కొఱకు జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా?.."


"మరో విషయం కూడా మీకు తెలియచేయాల్సిన అవసరం ఉంది..నా తదనంతరం ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది..ఇప్పుడు నిర్మించబోయే ఆ భూగృహమే నా సమాధి అవుతుంది..నేను అందులోనే వుండబోతాను..ఎందరో తమ తమ కోర్కెలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు..ఆ సమాధినే దర్శించి తరిస్తారు..ఇక్కడ నేను ధారపోస్తున్న తపశ్శక్తి మహిమాన్వితం అయినది..అది ఈ క్షేత్రం లో కొన్ని వందల ఏళ్ల పాటు నిక్షిప్తమై ఉంటుంది..ప్రతి పనికీ ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది..నాకు నిర్దేశింపబడిన కర్మను నేను పూర్తిగా నెరవేర్చి..మోక్షానికి వెళతాను..నేను చేస్తున్న ఈ తపో యజ్ఞానికి సహాయం చేసిన మీ అందరి పేర్లూ కూడా చిరస్థాయిగా నిలచిపోతాయి.." 


శ్రీధరరావు దంపతులతో పాటు మీరాశెట్టి గారు కూడా నివ్వెరపోయి వింటున్నారు..ఇంతా ఈ ఆశ్రమ నిర్మాణమే ఓ కొలిక్కి రాలేదు..మరి ఈ స్వామివారేమో..తన తదనంతరం ఇక్కడ సమాధి ఉంటుంది అని చెపుతున్నారు..ఇంతా చేస్తే శ్రీ స్వామివారు ముప్పై యేళ్ళ వయసుకూడా లేని యువకుడు..అప్పుడే మోక్షం గురించిన ఆలోచనలు చేస్తున్నారే.. పరి పరి విధాల ఆలోచించి ఆయోమయానికి గురయ్యారు..


"మీరు చెప్పినట్టు ఆ నేలమాళిగను సిద్ధం చేయిస్తాము..మీరు నిశ్చింతగా తపస్సు కొనసాగించండి..మోక్షం..సమాధి..ఇవన్నీ ఇప్పుడెందుకు స్వామీ!..మీలాటి సిద్ధపురుషులు కొంతకాలం పాటు మా మధ్యలో వుండి.. మాకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయాలి..ఇప్పుడిప్పుడే ఇటువంటి ఆలోచనలు చేయకండి.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామివారు ఒక్కసారిగా పెద్దగా నవ్వి.."కాలమహిమను ఎవ్వరూ తప్పించలేరు..ముందు ముందు అన్నీ మీకు అర్ధం అవుతాయి.." అన్నారు..


శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి..ఇవతలికి వచ్చేసారు..మీరాశెట్టి గారు అటునుంచి అటే తమ గ్రామానికి వెళ్లిపోయారు..శ్రీధరరావు దంపతులు మాత్రం శ్రీ స్వామివారి మాటలనే తలుచుకుంటూ మౌనంగా మొగలిచెర్ల కు చేరారు..


తపోసాధన..సందేహం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

శివ శబ్ద మహిమl

 శివ శబ్ద మహిమ


#శివ_శబ్ద_మహిమ


ఒకసారి ఓ పల్లెటూరి వానికి ఒక సందేహం కలిగింది. అతడు ఒక యోగి దగ్గరకు వెళ్లాడు. శివా అని పిలిచినంతనే పుణ్యం వస్తుంది అంటారు కదా. నిజంగా వస్తుందా అని అడిగాడు. అతడీ ప్రశ్నను కైలాసవాసుడే విన్నాడు. యోగి దగ్గరకు సన్యాసిగా వచ్చి ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను అన్నాడు. యోగి చిరునవ్వుతో అంతకన్నా కావాల్సింది ఏముంది స్వామీ అన్నాడు. ఓ జానపదుడా ఇదిగో ఈ నీకు కనిపించే ఈ చీమ చెవి దగ్గర ‘ఓం నమశివాయ’ అని అరువు అని చెప్పాడు. చీమ చెబుతుందా అన్నాడు జానపదుడు. ముందు అయితే చెప్పింది చేయి అన్నాడు సన్యాసి. జానపదుడు అట్లాగే చేశాడు. చీమ కాస్తా ప్రాణాలు కోల్పోయింది. రామ రామ! ఎంత ఘోరం జానపదుడు అనుకొన్నాడు. అట్లానే సీతాకోక చిలుక, లేడి దగ్గర శివనామం చెప్పించి వాటినీ హరీ అనిపించాడు. అంతలో అక్కడికి ఓ దంపతులు అప్పుడే పుట్టిన శిశువును తీసుకొని వచ్చి అయ్యా! ఈ శిశువును ఆశీర్వదించండి అన్నారు. సన్యాసి ఎప్పటిలాగా శివనామం చెప్పమన్నాడు. జానపదుడు గడగడా వణికి, అయ్యా! అన్నాడు. మరేం ఫర్లేదు చెప్పు అని ప్రోత్సహించాడు సన్యాసి. ‘నమఃశివాయ’ అని జానపదుడు అనగానే ఆ శిశువు ‘అయ్యా! పరమ పుణ్యచరితా! మరొక్కసారి నమశివాయ అనవా’ అన్నాడు. ఇదేమి చిత్రం అని చూస్తుంటే ఆ శిశువు ఇలా చెప్పాడు. ‘అయ్యా! చీమ దగ్గరనుంచి ఇప్పటిదాకా ఆ శివనామం చెపితేనే మనిషిగా మారాను. మరి ఇప్పుడు మరోసారి శివనామం వింటే నేను దివ్యునిగా మారిపోతాను కదా. సందేహం ఎందుకు’ అన్నాడు. శివశబ్దంలోని మహిమ తెలుసుకొన్న జానపదుడు ఆగకుండా శివనామాన్ని జపిస్తూ కదులుతున్నాడు.


ఓంనమఃశివాయ

ధన్వంతరి అమృత్* 🌿

 🌿 *ధన్వంతరి అమృత్* 🌿

💪 *(రోగనిరోధక శక్తి వృద్ధిని)*💪


*ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలలో 📖 వైరస్ మరియు మానవ శరీరానికి హాని కలిగించే సూక్ష్మ క్రీములను🦠 నాశనం చేసి మనిషి సంపూర్ణ ఆయురారోగ్యాలతో 🧬 ఉండేలాగా ఒక అద్భుతమైన మందు 🔬 ధనవంతరీ మనకు అందించారు దానిపేరే..* 

*..."ధన్వంతరి అమృత్"...*


ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో🚨 ఇది అద్భుతమైన *మందు* గా పనిచేస్తోంది.. 


📌 *రోగనిరోధక శక్తిని 💪, తెల్ల రక్తకణాలలో🩸 పోరాడే శక్తిని పెంపొందించుకోవడంలో ఇంకా ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో చాలా సహాయపడుతుంది. ప్లేట్‌లెట్స్ 🧫 సంఖ్య పెరగగలదు.*

*ముఖ్యంగా 🧘‍♂️శ్వాస బాగా తీసుకోగలరు🧘‍♀️..*


*మందు తయారి పదార్థాలు*


1) రుద్ర జడ  

2) జఠామాంసి  

3) సునాముఖి 

4) బ్రహ్మీ పత్రం 

5) చిన్న మోము తమల 

6) జాతి ఫల 

7) లవంగాలు 

8) పచ్చ కర్పూరం 

9) మిరియాలు 

10) అల్లం 

11) శొంఠి 

12) దాల్చిన చెక్క 

13) మోర్రంగడ్డ చెక్క

14) రతాలం

15)  పెండలం చెక్క

16) సుగంధి వేర్లు పొడి


*మందు వాడే విధానం*


*పరగడుపున* ☀️ (అంటే పొద్దున నిద్రలేచి, దంతథావనం కాగానే, వేరేమీ తీసుకోకుండా) మరియు *మధ్యాహ్నం*🌞 ఇంకా *రాత్రి* 🌙 ఆహారం తీసుకోవటానికి 4️⃣0️⃣ నిముషాలు ముందు *ఒక గ్లాస్ వేడి నీటిలో 40 ml* ఈ మందు కలుపుకొని రోజుకి మూడు పూటలా తాగవలెను. ఇలా 5️⃣ రోజులు వాడి, తరువాత 20ml రోజుకు ఒకసారి రోజూ తీసుకోవాలి. అవసరమైతే మరొకసారి తీసుకోవొచ్చు... 


*ధన్వంతరి అమృత్* ఎలా పని చేస్తుంది?



వేడి నీటితో కలిపి తీసుకున్న ఈమందు నేరుగా 40 నిముషాల తరువాత మానవ రక్త కణాల్లోకి చేరి శరీరానికి ప్రమాదకరమైన వైరస్, బాక్టీరియాలని, మృతకణాలని, చెడు రక్తకణాలని.. మూత్రం ద్వారా బయటకి నెట్టేస్తుంది. 

ఆ తరవాత బిపి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తూ గొంతులో మరియు ఊపిరి తితుల్లో ఉన్న వైరస్ ని నాశనం చేసి స్వచ్ఛమైన ఆక్సీజన్ మనకు అందే విధంగా తోడ్పడుతుంది. 

ఈ ప్రాసెస్ వల్ల మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెరిగి సంపూర్ణ ఆరోగ్యవoతులు అవుతారు...


*వెల స్వల్పము ఫలం అధికము.* 💓


🍃🍃🍃🍃🍃🍃🍃🍃


*DHANWANTARI AMRUTH*

Ancient- Ayurvedic Medicinal- Decoction


🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


** *Dhanwantari Amruth* is a preventive & cure to lead a healthy life.


** Get Excellent relief from After - Effects.

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


*ధన్వంతరి అమృత్* ని మా సంస్థ అయిన *SreeDeva Enterprises* ద్వారా పొందవచ్చు. 

*ధన్వంతరి అమృత్* కావలసినవారు క్రింద ఇచ్చిన నెంబర్ కి మెసేజ్ / కాల్ చెయ్యగలరు. 

*1 లీటర్ ధర - హైదరాబాద్ లో ₹999 మాత్రమే (Delivery charges extra)*

*1 లీటర్ ధర - మిగిలిన ప్రాంతాల్లో ₹999 మాత్రమే (Shipping charges extra)*

GPay / Phone Pe ఈ నెంబర్ కి *(+91-9581546773)* చెయ్యొచ్చు.

Delivery of product takes 3 - 4 working days.


మీ ఆదరణ తోడైతే *ధన్వంతరి అమృత్ మరియు దంతవైద్య* తో పాటు మరికొన్ని ఇంట్లో చెయబడే ఆయుర్వేద ఉత్పత్తులను మీముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంటాము. 🙏


*📞- 9581546773*


*https://wa.me/qr/BNRF2NKJYSUEH1*

స్వంత అనుభవం - చిన్న చిట్కా.*

 *కరోన విస్తృతంగా విస్తరిస్తున్న సమయంలో నా స్వంత అనుభవం - చిన్న చిట్కా.*


నాకు గత 12 సంవత్సరాలుగ ప్రతీ మూడు నెలలకు ఒకసారి జలుబు గొంతు నొప్పి దగ్గు లాంటివి వచ్చేవి. తిరగని హాస్పిటల్ లేదు చేయని పరీక్ష లేదు. వాడని మందులు లేవు.


ఫిబ్రవరి 2020 లో అప్పుడే కొరోనా మహమ్మారి దేశంలో వ్యాప్తి చెందతోంది. అనుకోకుండా నాకు తీవ్ర మైన దగ్గు, స్వల్పంగా జ్వరం, దగ్గులో రక్తం పడటం లాంటి సమస్యలు  ఎదురయ్యాయి. ముందు ఎక్సరే. అందులో ఏం తేలలేదు. ఆ తరువాత సిటీస్కాన్ లో ఊపిరితిత్తులలో ఫంగస్  మరియు ఇన్ఫెక్షన్ ఉందని మందులు ఇచ్చారు. తగ్గలేదు. ఆ తరువాత   హైదరాబాదు చెస్ట్ హాస్పిటల్ లో చూపించాను.  క్షయ పరీక్షతో సహా అన్ని పరీక్షలులు చేసారు. మందులు యిచ్చారు. కానీ ఫలితం శూన్యం. అప్పుడప్పుడే కరోనా రోగులు చేరుతున్నారు. 


అనుకోకుండా నా కూతురుకి తీవ్రమైన దగ్గు జ్వరం. SR Nagar Sowmya Hospital లో వారం తరువాత కోలుకుంది.  కాని నాకు మాత్రం దగ్గు తగ్గలేదు. దాదాపు ప్రాణాల మీద ఆశ వదులు కున్నాను. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. చాలా రోజుల తరువాత  మా తాతగారితో మాట్లాడి నా బాధ మొత్తం ఆయనతో ఫోన్ లో చెప్పాను.


ఆయన నాకు 10 సంవత్సరాల వయసులో తలనొప్పి (పార్శపు నొప్పి) వస్తే కేవలం మూడు తమలపాకులతో శాశ్వతంగా తగ్గించాడు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఖరీదైన వైద్యం అది. ఆయన నా సమస్యకు ఒక్క చిట్కా చెప్పాడు. విన్నప్పుడు హైదరాబాదులో ఇంగ్లీషు వైద్యానికి అలవాటు పడ్డ నాకు ఆ ఏమి పనిచేస్తుందిలే అనిపించింది. కాని మరో మార్గం లేదు కనుక తప్పనిసరిగా ఆయన చెప్పిన వైద్యం మొదలు పెట్టాను.


అది ఏమిటంటే ఒక్క వెల్లుల్లి పాయ గడ్డను తీసుకుని మెత్తగా నూరి ఒక్క పల్చటి బట్టలో కట్టుకొని రాత్రి మొత్తం వాసన చూస్తు నోటి ద్వారా ఊపిరితిత్తుల నిండా పీల్చడం.


అదే‌ నా జీవితంలో జరిగిన అద్భుతం. మూడు రోజులలో ఊపిరితిత్తులలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పటిదాకా మరలా జలుబు, జ్వరం, దగ్గు లాంటివి రాలేదు. చాలామందికి చెప్పగా, వాడిన ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా అద్భుతంగా పనిచేసింది.


ఫ్రెండ్స్, కొరోనా మరల విజృంభించే సమయంలో కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి గురికావద్దు. మన ఇంట్లో లేక బంధువులు, స్నేహితుల కుటుంబాలలో ఎవరికైనా జలుబు, దగ్గు లాంటి లక్షణాలు వచ్చిన వెంటనే వెల్లుల్లి గడ్డ మెత్తగా నూరి ముక్కు ద్వారా, నోటి ద్వారా గట్టిగా పీల్చమని చెప్పండి. కొరోనా కూడా మనని ఏమీ చెయ్యలేదు. ఇది నా స్వానుభవం. వాడిన తరువాత నాకు కృతజ్ఞతలు చెప్పడం, పదిమందితో మీ అనుభవం పంచుకోవడం మరువకండి.


మర్రి విష్ణువర్ధన్ రెడ్డి, LL B                                                                                                                                                                           9059119195.


Dr Purushotham

9700675350


ఒక్క నాటు వైద్యుడి సలహాతో నేను వెల్లుల్లి రెమ్మల వాసన చూడడం వల్ల కేవలం మూడు రోజులలో కొరోనా నుండి బయట పడ్డాను.దానికి శాస్త్రీయమైన కారణాలు వెతికే ప్రయత్నంలో చాలా విషయాలు,  మరియు ఆనందయ్య మందుపై కొందరు మేధావులు అడిగిన చాలా ప్రశ్నలకు ‌సమాధానాలు దొరికాయి. వెల్లుల్లి వాసన చూడటం గురించి కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఉంది.


పచ్చి వెల్లుల్లిలో చాలా బలమైన యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరస్ మరియు యాంటీ పంగల్ లాంటి గుణాలే కాకుండా రక్తం గడ్డకట్టకుండా చేసె లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.  పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా కొన్ని యాసిడ్ ల వల్ల కడుపులో మంట లాంటి లక్షణాలు వస్తాయి. అలాగే వెల్లుల్లి జీర్ణం అయ్యి రక్తంలో కలిసే సరికి కొంత శక్తి తగ్గడం చాలా సమయం పడుతుంది. వండి తినడం వల్ల కూడా వెల్లుల్లి ఆయుర్వేద గుణాలను కోల్పోతుంది. ఆశ్చర్యం ఏమిటంటే 1968లో వచ్చిన Influenza నుండి ఖాట్మాండ్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఈపచ్చి వెల్లుల్లి వాసన చూడడం వల్లనే రోగం నుండి బయటపడటం.


*పచ్చి వెల్లుల్లి వాడటం రెండు రకాలు*


1) ఐదు పచ్చి వెల్లుల్లి రెమ్మలను మెత్తగా దంచి పలుచని బట్టలో కట్టి రెండు మూడు గంటలు వాసన చూడడం వల్ల కరోనా రాకుండా కాపాడుకోవడమే కాకుండా జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలనుండి మరియూ కరోనా నుండి కూడా కేవలం నాలుగు గంటల నుండి రెండు రోజులలో ఖచ్చితంగా కోలుకుంటారు.


2) రెండు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని ముక్కలు చేసి మీ అరికాళ్ళలో నాలుగు రెమ్మలు సాక్షుల సహాయంతో‌ వుంచుకొని మరో రెండు రెమ్మల ముక్కలు రెండు చంకలలో పెట్టుకుని ఒక్క రెమ్మ నాలుక కింద పెట్టుకొని రెండు తోక మిరియాలు ఒక్కదాని వెనక ఒక్కటి నోట్లో వేసుకొని నమలడం (రెండు కలిపి అరగంట నమలాలి) ద్వారా, కేవలం నాలుగు గంటల‌ నుండి రెండు రోజులలో కొరోనా నుండి ఎలాంటి మందులు లేకుండా 100% బయట పడవచ్చు. మానవ పాదాల అరి కాళ్లలో రంధ్రాల సాంద్రత ఎక్కువగా ‌ఉంటుంది.  మీరు అరికాళ్ళలో వెల్లుల్లి ‌ముక్కలు వుంచిన పది నిమిషాలలో మీ నోట్లో నుండి వెల్లుల్లి వాసన రావడం మీరే గమనించవచ్చు.  కంటిలో మందు వేస్తే ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ఎలా పెరుగుతుంది అనే మేధావులకు ఇది సవాలు చేసే సమాధానం.


సంవత్సరం పాప నుండి అందరూ వాడే ఎలాంటి చెడు ఫలితాలులేని గొప్ప ఔషధం. ఖచ్చితంగా నాలుగు గంటల నుండి రెండు రోజుల్లో కొరోనా నుండి కోలుకుంటారు. మీకు ఇంకా  ఆధారాలు కావాలంటే ఈ వ్యాసం చదవండి.


https://thehimalayantimes.com/opinion/opinion-raw-garlic-smell-therapy-for-covid-19.


దయచేసి ఈ అమూల్యమైన సమాచారాన్ని అందరికీ చేరేటట్లు చూడండి. కొరోనా నుండి దేశాన్ని మనందరం కాపాడుకుందాం.