హనుమంతుడు కార్యసాధకుడు, భక్తితో కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
కార్యసిద్ధి కొరకు ఆంజనేయ స్వామి శ్లోకాలు
మీరు కోరుకున్న కార్యం నెరవేరడానికి, సంబంధిత శ్లోకాన్ని నిష్ఠతో పఠించండి:
* విద్యా ప్రాప్తికి:
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
* ఉద్యోగ ప్రాప్తికి:
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
* కార్య సాధనకు:
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!
* గ్రహదోష నివారణకు:
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
* ఆరోగ్యమునకు:
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
* సంతాన ప్రాప్తికి:
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
* వ్యాపారాభివృద్ధికి:
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!
* వివాహ ప్రాప్తికి:
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!
ముఖ్య గమనిక:
ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షిణల సంఖ్య నియమాన్ని అనుసరించి ప్రదక్షిణలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారని ప్రతీతి. చివరిన ఆకు పూజ చేయిస్తే లేక వడమాల వేయిస్తే ఇంకా మంచిది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి