9, ఆగస్టు 2020, ఆదివారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*శ్రీమాత్రేనమః*



*633వ నామ మంత్రము*

*ఓం ఉమాయై నమః*

అర్ధనారీశ్వరతత్త్వంతో విరాజిల్లు ఉమామాతకు నమస్కారము.

శ్రీ లలితా సహస్ర నామావళి యందలి *ఉమా* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం ఉమాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరాత్పరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు అనిర్వచ నీయమైన ఆత్మానందమును చేకూర్చి ఆ జగదీశ్వరి నామస్మరణమందు ధ్యానముండునట్లుజేసి తద్వారా తరింపజేయును.

పరాశక్తి  పార్వత రాజపుత్రిక పార్వతీదేవిగా అవతరించ వలయునని బాల్యమునుండియే కఠోర తపమాచరించబోగా ఆమె తల్లియైన మేనాదేవికి బాధ కలిగి *ఉ* ఇక తపస్సు చాలు ఆపుము, అనినా, ఆమె తపస్సు  మాననందున *మా* (అమ్మా అని కూతురిని పిలిచే ఆప్యాయమైన పిలుపు)  ఇంక వద్దు తపస్సు అని అనురాగంగా అన్నదని కాళిదాసు మహాకవి తన కుమారసంభవమందు చమత్కరించారట. అలా మొదట అన్న *ఉ* రెండవసారి అన్న *మ* తో చేరి *ఉమ* అను సార్థకనామాంకిత అయినదని అంటారు.

అలాగే ఈ *ఉమ* అను నామములో *అ* కార *ఉ* కార *మ* కారములు ప్రణవరూపమగుటచే శ్రీమాత ప్రణవస్వరూపిణి గనుక ఆ తల్లికి *ఉమ* అను నామము సార్థకమయినది.

కేశోపనిషత్తులో ప్రతిపాదింపబడిన  అమ్మవారే లతితాదేవి  *ఉమ*  అనియు మరికొందరు విజ్ఞులు *ఉ* కారము శివునికి, *మ* కారము శక్తికి, ఆ శక్తే పార్వతి గనుక శివుని అర్ధనారీశ్వరతత్త్వమును తెలియజేసేదే ఈ *ఉమ* నామమని అంటారు. అందుకు జగన్మాత *ఉమా* నామాన్వితురాలుగా ఈ నామంలోని భావము అయిఉన్నది.

అటువంటి *ఉమా* నామాన్వితురాలైన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం ఉమాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319
*****************

Cheruvela bhargava sarma bhargava.advocate@gmail.com

Sat, 8 Aug, 12:51 (21 hours ago)
to bhargava
*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*57వ నామ మంత్రము*

*ఓం చింతామణి గృహాంతస్థాయై నమః*

చింతామణులచే నిర్మింపబడిన గృహంలో నివసించు పరమేశ్వరికి నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చింతామణి గృహాంతస్థా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చింతామణి గృహాంతస్థాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసన చేయు భక్తులకు ఆ జగన్మాత కరుణచే అన్నిటికన్నా ముఖ్యమైన సుఖసంతోషములు అందుకు కావలసిన ఆయురారోగ్యములు ప్రసాదించి ఆత్మానందానుభూతితో జగన్మాత పాదసేవా పరాయణత పెంపొందించి తరింపజేయును.

చింతామణి అనేది ఒక రత్నము. ఆ మణి ఒకటి ఉంటే ఎన్నోకోరికలను తీరుస్తుంది. అటువంటి చింతామణులతో నిర్మించిన గృహంలో జగన్మాత నివసిస్తోంది. మానవుని శరీరంలో చింతామణి గృహం సహస్రారంలో ఉంటుంది. సాధకుడు తన సాధనలో మూలాధారం నుండి సహస్రారం చేరుకుంటే సిద్ధిపొందినట్లే. ఇంక ఏకోరికలూ ఉండవు. నిష్కాముడై బ్రహ్మత్త్వానికి చేరుకుంటాడు. 

దీనినే మహాజ్ఞానులు, సిద్ధులు ఏం చెప్తారంటే *శ్రీచక్రంలో బిందు మండలమున శ్రీదేవి వసిస్తుంది. మూలాధారగత కుండలినీ శక్తి జాగృతమై బిందుమండలము చేరినచో ఉపాసకుడు జగన్మాత సన్నిధికి చేరినట్లే. అంటే సంకల్పసిద్ధుడైనట్లే. అదే చింతామణి తత్త్వము*   ముఖ్యంగా జీవునికి ఉండే అన్ని చింతలను దూరంచేసి బ్రహ్మానందభరితుడిని చేస్తుంది. అంతటితో ఆ జీవుడు నిష్కాముడౌతాడు. సుమేరుశృంగ మధ్యమందు, మహాపద్మాటవిలో చింతామణిగృహంలో ఉండి సాధకుని సిద్ధింపజేస్తుంది. *కల్పవృక్షం* అంటే చింతామణితో కూడిన సంకల్పం. *కామధేనువు* అంటే చింతామణితో కూడిన వాక్కు అని విజ్ఞులు చెపుతున్నారు. అటువంటి సంకల్పం, అటువంటి వాక్కును సాధకునికి కలుగజేస్తుంది జగన్మాత. అందుకే ఆ తల్లి *చింతామణి గృహాంతస్థా* అను నామముతో స్తుతింపబడుచున్నది.

కోరినవి ఇచ్చే చింతామణి గృహంలో శ్రీమాత వసించుతూ, ఆ ఇంటి ఇల్లాలైన జగన్మాత ఎంతటి అనుగ్రహప్రదాయనియో మనం ఊహించితే వర్ణనాతీతమేగదా. అంతటి చింతామణి గృహాంతస్థకు నమస్కరించునపుడు *ఓం చింతామణి గృహాంతస్థాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*భగవంతుడు*


ఒక క్షణములో జరిగి మరో క్షణములో మరుగు పడే ఘటనలకు యధాతథంగా ఎటువంటి ఆధ్యాత్మిక మూలము ఉండదు.
*భగవంతుడనగా ఎవరు*
శ్రీ పరాశర మహర్షి నిర్వచనము ప్రకారము... *భగొస్యాస్తితి భగవానితి విష్ణుస్య మీర్యతే భగము*. ఆరు లక్షణముల సముదాయము కలది భగము.
ఆరు లక్షణములు.... *ఐశ్వరస్య సమగ్రస్య్య వీరస్య్య యశ సశ్రియః, జ్ఞాన వైరాగ్య యోశ్చివ షణాం భగ ఇతిరణా* అనగా సమగ్ర ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము మరియు వైరాగ్యము మొదలైన ఆరింటిని కలిపి భగమని వ్యవహారము..ఇట్టి భగము కలవాడు విష్ణువు...అనగా విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు.
మానవుడు భగవంతుని చేరుకునే కొద్ది, భగవంతుడు మానవుణ్ణి సమీపిస్తూ ఉంటాడు . మానవ మనస్సుకు ఏయే రూపము బోధగమ్యము కాగలదో, ఆయా రూపాలను ధరించి భగవంతుడు భక్తుని అభిష్టాను సారము మెలుగుతుంటాడు. అందులో మన ప్రమాణ నిరూపణల, తర్క వితర్కాలకు తావులేదు.
ఆయన (భగవంతుని) యందలి పూర్ణ విశ్వాసముతో స్వరూప నిష్ట కల్గిన మహాత్ములు తొలుత గావించిన వర్ణల ఆధారంగా ధ్యేయ కార్యాన్ని మల్చుకొని అనంతరీయ సాధకులు, అదే పరమానుభవాన్ని స్వాత్మ గోచరంగా చేసుకో గల్గుచున్నారు.
భగవంతుని యొక్క సగుణ రూపాలు, భగవద్ అవతారాల లీలా విలాసాలు హిందువుల మనో మందిరాలలో, పురాణాల వల్ల సుస్థిరంగా నిలిచి పోయాయి. *భగవాను డొక్క ప్రత్యేక వ్యక్తి కాదని పరమ పురుషుడని భావించాలి*.
ఆ పరమ పురుషునకు ఒక ఆద్య రూపం ఉన్నప్పటికీ, *పురుష శబ్దము* శరీర వాచకము కనుక సర్వాత్మకుడైన ఆయనకు, ఏ రూపములో ఆవాహన చేస్తే ఆ రూపములో సాక్షాత్కరింప గలడని చెప్పబడినది. ఆయనను మానవీకరించి, భగవద్ అవతారాలను మానావాకృతిమంతాలుగా భావిస్తున్నాము. భగవంతుని యొక్క ఆ ఆద్య రూపాన్ని భక్త జనుల కోసము, వాస్తవికత ఉట్టిపడే చిత్రీకరణ కౌశలంతో, ప్రతీకాత్మకంగా గోచరీభవింప జేస్తున్న పురాణాలలోని వర్ణనలు చదువు తుంటే, భగవంతుడు సాకారంగా గోచరిస్తున్నాడు.
భగవంతుని మానవ మనస్సుకు అంత సన్నిహితంగా తీసుకున్న వచ్చి, మానవుని లోని నిరుపమాన భక్తి సంపదను పెంపొందించి, మానవాళి అభ్యుదయానికి గ్రంధావళిగా, *ప్రపంచములోని ఏ సారస్వతము మన పురాణ వాంగ్మయానికి సాటిరాదు*.
ధర్మానికి భక్తి ఫలమవడం నిజము కనుక భక్తిని సాధింప గొరువారు, మొట్ట మొదటిగా వారి వారి వర్ణాశ్రమాల ప్రకారము స్వధర్మాన్ని పాటించాలి. *ధర్మానుష్టానములో ఒక రహస్యమున్నది, ఏది భగవంతునికి సంతోషమో అదే ధర్మము*.
భగవద్ సంతోషమే ధర్మ సిద్ది అని తెలుసుకోవాలి. *ఎటువంటి ధర్మ మైనా భక్తి హీనమవుతే నిరర్థక మవుతుంది*. అందువల్ల ధర్మాన్ని భక్తి పూర్వకంగా ఆచరించాలి.
లోకమంటే పరమేశ్వరుని వ్యక్త రూపమే తప్ప వేరేమీ కాదు. *లోకారాధనమే ఈశ్వరా ధానము కనుక మానవ సేవయే మాధవ సేవ*.
భగవంతుని పూజలు మరియు ధ్యానము మొక్కుబడిగానో, భయముతోనో, కోరికలతోనో, ప్రెరేపణలతో చేయకుండా ఇష్టముగా సంతోషములతో చేస్తే భగవంతుణ్ణి కరిగిస్తుంది *మనకు శుభాలను, ధర్మానికి బలాన్నిస్తుంది*.
*******************

पूरा विपक्ष जलील हो रहा है

पूरा विपक्ष जलील हो रहा है कि आज के भूमि पूजन में हमको नहीं बुलाया और इकबाल अंसारी को बुला लिया। इकबाल अंसारी जलील हो रहा है कि जिनके खिलाफ वो पुश्तों से लड़ रहा है उन्हीं की जीत में उसे लहंगा उठा कर नाचना पड़ रहा है।

इसे राजनीति नहीं निर्ममता कहते हैं, ऐसा करने वाला कोई कूटनीतिज्ञ नहीं कहलाता उसे बेरहम कहा जाता है।

जिसने विधानसभा का कभी मुंह तक नहीं देखा और जब घुसा तो सीधे मुख्यमंत्री बन कर।

जिसने कभी संसद की चौखट तक नहीं देखी लेकिन जब घुसा तो सीधे प्रधानमंत्री बन कर।

जिसने मामूली कारसेवक बन कर अयोध्या में कारसेवा की लेकिन फिर उस अयोध्या को पलट कर नहीं देखा... और अब जा रहा है सीधे अपना अभीष्ट पूरा करने

कभी देखा है इससे पहले इतना जिद्दी इंसान ?

मोदी को प्यार करिये जितना कर सकते हों, मोदी से नफरत करिये जी भर कर लेकिन उससे भी ज्यादा डरिये उससे।

पिछले तीन महीने में उसकी आँखों में सुलगती हुई ज्वाला और छत्रपति शिवाजी महाराज की तरह बढ़ी हुई दाढ़ी आने वाले तूफान का संकेत है, लिख कर रख लीजिये।

मोदी के पलक झपकाने के भी अपने मायने होते हैं, बेसबब ये इंसान अपनी पलक तक नहीं झपकाता। 🌹जय श्री राम 🌷
*****************
English translation:

The whole opposition is burning up

The entire opposition is getting angry that in today's Bhoomi Poojan we have not been invited and Iqbal Ansari has been called. Iqbal Ansari is finding that he is having to dance by lifting the kilt in the victory of the people against whom he is fighting with the muslims.

It is called ruthlessness, not politics, no diplomat who does so is called ruthless.

Who never looked at the assembly and when he entered directly became the Chief Minister.

Who never looked at the doorstep of the Parliament, but when he entered directly, he became the Prime Minister.

The one who did the service in Ayodhya as a minor kar sevak, but then did not see that Ayodhya overturned… and now is going directly to fulfill his desired.

Has anyone seen such a stubborn person before?

Love Modi as much as you can, hate Modi, but be more afraid of him.

In the last three months, keep the flame burning in his eyes and his beard like Chhatrapati Shivaji Maharaj is a sign of the coming storm.

Modi's wink also has its own meaning, this person does not even blink his eyelid. Ajay Shri Ram 4


తెలుగు అనువాదం:

ప్రతిపక్షం మొత్తం మండిపోతోంది


నేటి భూమి పూజన్‌లో మమ్మల్ని ఆహ్వానించలేదని, ఇక్బాల్ అన్సారీని పిలిచామని మొత్తం ప్రతిపక్షాలు కోపంగా ఉన్నాయి. ముస్లింలతో ఎవరితో పోరాడుతున్నా ప్రజల విజయంలో కిలోట్ ఎత్తడం ద్వారా అతను నృత్యం చేయవలసి ఉందని ఇక్బాల్ అన్సారీ కనుగొన్నాడు.

దీనిని క్రూరత్వం అంటారు, రాజకీయాలు కాదు, అలా చేసే దౌత్యవేత్తను క్రూరంగా పిలుస్తారు.

ఎవరు అసెంబ్లీ వైపు చూడలేదు మరియు అతను నేరుగా ప్రవేశించినప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు.

పార్లమెంటు తలుపు వైపు ఎవరు చూడలేదు, కానీ అతను నేరుగా ప్రవేశించినప్పుడు, అతను ప్రధాని అయ్యాడు.

మైనర్ కర్ సేవకుడిగా అయోధ్యలో సేవ చేసినవాడు, కాని అప్పుడు అయోధ్య తారుమారు అయినట్లు చూడలేదు… మరియు ఇప్పుడు అతను కోరుకున్నది నెరవేర్చడానికి నేరుగా వెళుతున్నాడు.

ఉంది  ఎవరైనా ఇంతకుముందు ఇంత మొండి పట్టుదలగల వ్యక్తిని చూశారా?

మోడిని మీకు వీలైనంతగా ప్రేమించండి, మోడిని ద్వేషించండి, కాని ఆయనకు మరింత భయపడండి.

గత మూడు నెలల్లో, అతని కళ్ళలో మంటను కాల్చండి మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి గడ్డం రాబోయే తుఫానుకు సంకేతం.

మోడీ వింక్ కూడా దాని స్వంత అర్ధాన్ని కలిగి ఉంది, ఈ వ్యక్తి తన కనురెప్పను కూడా రెప్ప వేయడం లేదు. అజయ్ శ్రీ రామ్ 4

బెల్లం వాడకం ఆరోగ్యానికి మంచిది.

పంచదార  కన్నా  బెల్లం  వాడకం  ఆరోగ్యానికి  మంచిది.

కాని  కాఫీ, టీ  వంటి  వాటిల్లో పంచదార వాడితినే బాగుంటుంది.

బెల్లం తినడం వల్ల కలిగే 18
 ప్రయోజనాలు
               * * *
1.బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది

2.భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే  మనం ఆరోగ్యం గా ఉండవచ్చు.

3.జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది

4 బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి  చేసి మెటబొలిజం ని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి.

5.బెల్లం లో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది.

6.చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్ల ను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలు ని నివారిస్తుంది.

7.బెల్లం యొక్క గుణం వేడిచేయడం.కావున దీనిని మనం జలుబు, దగ్గు, రొంప
లాంటివాటికి ఉపశమనం ఇస్తుంది.జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డు లో కూడా వాటిని కలిపి సేవించవచ్చు.

8.శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే,బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసట గా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి.

9.బెల్లం శరీర ఉష్ణోగ్రత ని నియంత్రణ లో ఉంచుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.

10.మోకాళ్ళ నొప్పుల కి విశ్రాంతి, బెల్లం ముక్క తో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

11.బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియుమాట హయిగా వస్తాయి.

12.బెల్లాన్ని నల్లనువ్వుల తో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.

13.శీతకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకుని సేవించండి.

14.బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

15.భోజన ము తర్వాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుంది

16.ఐదు గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లం ఉండలు గా చేసి తీసుకొంటే జాండిస్ (పీలియావ్యాధి)పచ్చ కామెర్లు  వారికి లాభసాటిగా ఉంటుంది.

17.బెల్లం హాల్వా తీసుకొంటే  జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

18.అయిదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలో ని ఆవాల నూనె( మస్తర్డ్ ఆయిల్) తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయమవుతాయి.
 
 మంచి మాటలు,మంచి విషయాలు, మన మంచి మిత్రులకు షేర్ చేద్దాం..
********************

108 ప్రశ్నలు –జవాబులతో. - రామాయణం

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి...
🙏✍💐🏹

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? 
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102.  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106.  శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
=తన మెడలోని ముత్యాలహారం.

*శ్రీ రామ జయం!*
🙏👍✍🏹

తీర్దం_యొక్క_విశిష్టత_ఏమిటి?



దేవాలయంలో తీర్ధం ఏవిధంగా తీసుకోవాలి? తీర్దం_యొక్క_విశిష్టత_ఏమిటి?

గుడి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు. శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువున్నిసాలగ్రామ శిలలకు రుద్ర నమకచమకాలతో, పురుష సూక్తం ,పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పుజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నపనము చేసిన జలము కుడా కలిపి ( తులసీదళ సహితమై ,పవిత్రమునూ, పాపహరమునూ అగునీరము తీర్ధము అనబడును) ఇస్తారు.
శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు. ఈ తీర్ధమును అర్చన పూర్త అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికీ, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.

తీర్ధమును ఎలా తీసుకోవాలి?
మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత ,అనంతా ,గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి. తీర్దం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు.తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానియకుండా తాగాలి.
తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి‌. అలా మూడు సార్లు ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.
1) మొదటిసారి తీర్థం శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది.
2) రెండోసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.
3) మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి.

తీర్థాల రకాలు:-
1)జలతీర్ధం
2)కషాయ తీర్ధం
3)పంచామృత తీర్ధం
4)పానకా తీర్ధం
జల తీర్ధం:
ఈ తీర్ధం సేవించడం ద్వార అకాల మరణం, సర్వ రోగాలు నివారించాభాడుతాయి. అన్నికష్టాలు తొలగి ఉపసమానాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .

2)కషాయ తీర్ధం:
ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు. రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కని కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.

3) పంచామృత అభిషేక తీర్థం:
పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.

4) పానకా తీర్ధం:
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునిడికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.

పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది . దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది . రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు.ఎముకలకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది.
జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ది చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇతరమైన రకాలు
ఇవేకాకుండా తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు. వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.

రామాయణమ్ 24


...
 బ్రహ్మదేవుని కుమారుడు కుశుడు,
ఆయన కుమారుడు కుశనాభుడు, 
ఆయన కుమారుడు గాధి
గాధి కుమారుడు విశ్వామిత్రుడు! .
.
విశ్వామిత్రుడు ఒక రాజు ,ఒకసారి ఈయన తన సైన్యాన్ని వెంటపెట్టుకుని విహారానికి బయలుదేరాడు! అలా వెడుతూ ,వెడుతూ అరణ్యమధ్యములో ఉన్న వశిష్ట మహర్షి ఆశ్రమం చేరుకుంటాడు.
.
ఒకరినొకరు కుశలప్రశ్నలు వేసుకొన్న తరువాత వశిష్ట మహర్షి కౌశికునితో నీకు ,నీ సైన్యానికి ఆతిధ్యం ఇస్తాను స్వీకరించు! అని అంటాడు! అప్పుడు విశ్వామిత్రుడు మీరిచ్చిన కందమూలఫలములు నాకు తృప్తికలిగించినవి ఇక వేరే ఆతిధ్యమెందులకు మహర్షీ వలదు నాకు అని వినయంగా బదులు పలుకుతాడు.
.
(ఒక అక్షౌహిణీ సైన్యానికి విందు ఇవ్వటం మాటలుకాదు ! ఆశ్రమాలలో ఉండే మునుల వద్ద అంత వ్యవస్థ ఉండదు కాబట్టి మహర్షిని ఇబ్బంది పెట్టడం ఎందుకని వద్దంటాడు).
.
వశిష్ట మహర్షి పట్టిన పట్టు వదలక విందు స్వీకరించాల్సిందే అని అంటాడు .అప్పుడిక తప్పనిసరి పరిస్థితుల్లో సరేనంటాడు విశ్వామిత్రుడు!.
.
క్షణాలలో అంత సైన్యానికీ కూడా  
పంచభక్ష్య పరమాన్నాలతో ,షడ్రసోపెతమైన విందు ఏర్పాటు చేస్తాడు మహర్షి వశిష్ఠుడు. అంతకు ముందెన్నడూ అంత అద్భుతమైన వంటకాలను రాజుగాని ఆయన పరివారం గాని రుచిచూసి ఉండలేదు! ఆశ్చర్యం కలుగుతుంది విశ్వామిత్రునకు ! ఇది ఎలా సాధ్యం ? ముక్కుమూసుకుని మూలన కూర్చున్న మునులకు ఇంత వ్యవస్థ ఎలా సమకూరింది? .
.
ఉండబట్టలేక ఆ విషయాన్ని వశిష్ట మహర్షి వద్ద ప్రస్తావిస్తాడు ! అందుకు జవాబుగా ఆయన తన ఆశ్రమంలోని ఒక "ఆవు" ను చూపిస్తాడు . ఈ ఆవా? ఎంతో అమాయకంగా ఉన్న ఈ ప్రాణా? నమ్మబుద్దికాలేదు విశ్వామిత్రుడికి! .
.
అప్పుడు వశిష్ఠుడు చెపుతాడు ! దీని పేరు "శబల" ఇది దివ్యధేనువు! దీనికున్న శక్తులు అపారం! .
.
శబలను చూసి ముచ్చటపడతాడు విశ్వామిత్రుడు! మహర్షీ ఈ ఒక్క ఆవును నాకిచ్చేయి నీకు లక్ష గోవులను ఇస్తాను అని అంటాడు విశ్వామిత్రుడు ,అందుకు ఒప్పుకోడు వశిష్ఠుడు.
లక్షగోవులతో పాటు నీవు కోరినంత ధనమిస్తానని చెపుతాడు కౌశికుడు ,అందుకూ ఒప్పుకోక ,రాజా నా ఆశ్రమ వ్యవస్థ మొత్తానికీ ఇది ఒక్కటే ఆధారం దీనిని నేను ఎలా వదులుకోను ! దయచేసి ఆ ఆలోచన విరమించుకో అని బదులు పలుకుతాడు వశిష్ట మహర్షి!.
.
వాయు భక్షణ చేస్తూ దొరికిన కందమూల ఫలాలు భక్షించే మీ వద్ద ఇంత అమూల్యమైన వస్తువులెందుకు? 
రాజ్యం లో శ్రేష్టమైన వన్నీ రాజు వద్దనే కదా ఉండాలి ! అయినా నిన్నడిగేది ఏమిటి? నా రాజ్యంలో ఉన్నవన్నీ నావే ! అని బలవంతంగా ఈడ్చుకుపోసాగాడు ఆ ఆవుని విశ్వామిత్రుడు!.
.
అప్పుడు శబల అతని బంధనాలనుండి తప్పించుకొని మహర్షి వద్దకు వచ్చి హే భగవన్! నీవు నన్ను ఆతనికి ఇచ్చివేశావా ! అని అడుగుతుంది ! ...లేదు! నిన్ను నేను ఎవరికీ ఇవ్వలేదు అని చెప్పి అమ్మా శబలా నీ రక్షణ నీవే చూసుకో అని అనుమతిస్తాడు!.
.
ఆ అనుమతి రావడమే తరువాయి ! అప్పటివరకూ అమాయకంగా అగుపించిన శబల  సబల అయ్యింది. కంట నిప్పుల వర్షం కురిసింది ! ఆవిడ శరీరంలోని ప్రతి భాగం నుండి అసంఖ్యాక మైన వీరులు పుట్టుకొచ్చారు!.
.
ఆవిడ హుంకారం నుండి" పహ్లవులు",కాంభోజులు,
పొదుగునుండి శస్త్ర పాణులైన బర్బరులు,శకృత్ ప్రదేశమునుండి శకులు( పృష్ఠ భాగము..వెనుక ప్రదేశం).యవనులు పుట్టలో నుండి బయటకు వచ్చే చీమలబారుల్లాగా జన్మించి క్షణాలో విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేశారు! .
.
అది చూసిన ఆయన కొడుకులు నూర్గురు సాయుధులైన వారు వశిష్ఠుడు మీదికి దండెత్తగా ,మహర్షి చేసిన హుంకారానికి ఒక్జడు తప్ప అందరూ హతులవుతారు.
.
అప్పుడు విశ్వామిత్రుడు ఎలా ఉన్నాడంటే అలలు ఆగిపోయిన సముద్రంలాగ,కోరలు పీకిన పాములాగ,గ్రహణం పట్టిన సూర్యుడిలాగా ఉన్నాడట! .
.
నిర్వేదంతో రాజ్యాన్ని బ్రతికి ఉన్న కొడుకుకు అప్పగించి అడవులకు వెళ్ళి శివుడిగూర్చి తీవ్రమైన తపస్సుచేసి లోకంలో ఉన్న సకల అస్త్రములు తన స్వాధీనం లోకి వచ్చేటట్లుగా వరం పొందుతాడు .
.
ఆ అస్త్రబలం చూసుకొని మరల వశిష్టాశ్రమం మీద దండెత్తుతాడు విశ్వామిత్రుడు!.
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.