13, మార్చి 2026, శుక్రవారం

మహాకవిభారవి

 *

☘️ మహాకవిభారవి 🙏


*చాటుమాటుగానే తప్ప బహిరంగంగా పొగడని వ్యక్తిని భారవి తండ్రి అంటారు. భారవి సంస్కృతంలో గొప్ప కవి. అతడి కిరాతార్జునీయం పంచకావ్యాల్లో ఒకటి. దేశమంతా భారవి మహాకవి అని ప్రస్తుతిస్తున్నా, తండ్రి మాత్రం 'వాడి మొహం, వాడిదో కవిత్వమా?' అని బహిరంగంగా తక్కువ చేసి మాట్లాడుతుండేవాడు. ఇది సహించలేని భారవి ఓ రాత్రి తండ్రిని చంపటానికి బండ తీసుకొని మచ్చు మీద ఎక్కి కూర్చున్నాడు తండ్రి నెత్తిన వెయ్యటానికి . తండ్రిగదిలోకి ప్రవేశించబోతుండగా ఆయన తల్లి అంది లోకమంతా భారవిని పొగుడుతుంటే మీరు మాత్రం వాడికి ఏమీ తెలియదు అని చెప్తున్నారు అని అనగానే భారవి తండ్రి పిచ్చిదానా నాకు మనసులో సంతోషమే  కొడుకు ప్రయోజకుడైనందుకు తానెంత గర్విస్తున్నా అతడికి దిష్టి తగులుతుందనో, అతడు విర్రవీగి చెడిపోతాడనో అలా చులకనగా విమర్శిస్తున్నానని చెప్తున్న తండ్రి మాటలు విని పశ్చాత్తాప పడతాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారవి చెప్పిన ఒక్క సూక్తి గణనీయమయింది. అది 'సహసా విదధీత నక్రియా' మనేది. తొందరపడి ఏపనీ చేయగూడదని దాని భావం. భారవిక వి దిగివచ్చి తండ్రి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు తగిన శిక్ష వేయమంటాడు ఏమీ వద్దన్నవినడు అప్పుడు తండ్రి అత్తగారింటి కి వెళ్లి ఆరు నెలలు ఇల్లరిక వుండు పో అంటాడు అప్పుడే మహాకవికి రోజు రోజుకి అత్తవారింట మర్యాదలు తగ్గినవి అత్తగారిఊరి బయట పొలం కాపలా ఉంటూ కిరాతార్జునీయం రచన చేసినాడు *

〽️〽️〽️〽️〽️

మాగాయ ఆవకాయ

  *మాగాయ ఆవకాయ మధ్య గల భేదము ఏమిటని అడిగారు*. 

మహాత్ములు ఇలా చెప్పారు

 *మాగాయ:-*


భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ "తొక్కలే" అని వదిలించుకుని....


అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...


పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి... 


సిద్ధిని పొందిన ఋషిలా ముక్కలు ఎండి స్థిరత్వాన్ని పొందాక...


బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం  

నరుల పట్ల కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా...

 బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని... 


అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా, తను విడిచి వెళ్లిన ఊటలోకి మళ్ళీ తానే దూకి,


మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు

ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...


ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి విశేషాలతో విరాజిల్లినట్లుగానే...

నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...


'మానవసేవే మాధవసేవ' అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ!


  *ఆవకాయ:-*


"సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా" అనుకునే వివాహితునిలా...తొక్క టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,


"సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు" అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...

ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, నూనె, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని, 


బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా... 

తనతోపాటు శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...


"నేను నేనుగానే ఉండి, ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను" అని....

చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ.


*అయ్యా! ఆధ్యాత్మిక మార్గంలో ఇతి మార్గం, (న+ ఇతి) నేతి మార్గం అని చదివాను. ఏమీ అర్ధం కాలేదు. కాని ఆవకాయ, మాగాయి ఉదాహరణలతో మొత్తం బ్రహ్మజ్ఞానం అంతా కరతలామలకం అయిపోయింది. ధన్యోస్మి మహాప్రభో ధన్యోస్మి. పునరావృత్తి రహితమైన స్థితి ఈ రెండు ఊరగాయలు కల్పిస్తాయని తెలిస్తే వ్యాసులవారు, ఆదిశంకరులు కోనసీమలోనే అవతరించి ఉండేవారు.* 

<<<<<<<<<<<<<>>>>>>>>>

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - దశమి - పూర్వాషాఢ -‌‌ భృగు వాసరే* (13.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పార్వతి దేవి స్తుతి 🙏

  🌸పార్వతి దేవి స్తుతి 🙏


సీ .శాంకరి !శాంభవి! శర్వాణి !శారద!

కరుణతో కాపాడు కాళికాంబ!

భవునిరాణి !భవాని! బాధలు దూరము 

చేసియు చాముండి! చింత తీర్చు

కళ్యాణి !భగవతి! కామాక్షి !నిర్మల!

బహుభుజ భార్గవి! వందనములు

మాతంగి !మాతృక! మాలిని! మలయమ్మ!

మమ్ము కావుము దేవి మమత తోడ

తే శంభుప్రియగౌరి ! పార్వతి !శరణు శరణు

సర్వమంగళ !సావిత్రి! జయము జయము

 సింహరథ సింహ వాహిని !శీఘ్రముగను

శైలముదిగిరాశ్యామల !శంభురాణి!

 

సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

పంచాంగం 13.03.2026 Friday,

  ఈ రోజు పంచాంగం 13.03.2026 Friday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస కృష్ణ పక్ష దశమి తిథి భృగు వాసర పూర్వాషాఢ నక్షత్రం వ్యతిపాత యోగః వణిజ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు. 

  


శ్రాద్ధ తిథి: దశమి


 

నమస్కారః , శుభోదయం

13-03-2026శుక్రవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

 13-03-2026శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.

---------------------------------------


వృషభం


చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------


మిధునం


ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


సింహం


బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.

---------------------------------------


కన్య


చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు.

---------------------------------------


తుల


కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది.

---------------------------------------


వృశ్చికం


నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------


ధనస్సు


ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------


మకరం


విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

---------------------------------------


కుంభం


సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------


మీనం


కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యను పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

నిద్రలేమికి

 నిద్రలేమికి సులభ పరిష్కారాలు  -


    ప్రస్తుతపరిస్థితుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధానకారణం మనయొక్క జీవితములో ఎదుర్కొనే ఒత్తిళ్లు కావచ్చు మిగిలిన సమస్యలు ఏవైనా కారణం కావచ్చు. నిద్ర మనిషి జీవితంలో అత్యంత ప్రధానం అయినది. నిద్ర తక్కువ అవ్వడం రోగాలు రావడానికి ప్రధాన కారణం . నిద్ర తక్కువైన మనిషికి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చును.


        కావున వీలయినంత వరకు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది . అలాంటి విశ్రాంతి కేవలం మంచి నిద్రతోనే లభిస్తుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పబోయే యోగాలు చాలా మంచిఫలితాన్ని ఇస్తాయి .


 *  నిద్రపట్టనప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేడిచేసి ఒక గుడ్డలో వేసి మూటకట్టి వాసన చూస్తున్న త్వరలో మంచినిద్ర వచ్చును.  మంచి గసగసాలనే వాడండి. మార్కెట్లో తొటకూర విత్తనాలను గసగసాలుగా అమ్ముతున్నారు.


 *  వెలక్కాయ చిప్పను బియ్యపు కడుగు నీటితో అరగదీసి ఆ గంధాన్ని కణతలకు , నుదురుకు వ్రాసి పడుకున్న నిద్రపట్టును .


 *  ఉదయం , సాయంత్రం సర్పగంధి వేళ్ళ చూర్ణం పావుస్పూన్ అరకప్పు నీళ్ళలో వేసి తాగుచున్నచో మంచిఫలితం కనిపించును. రక్తపోటు ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేయును .


 *  రాత్రి సమయంలో మజ్జిగ లో రెండు నీరుల్లిపాయ ముక్కలను కలుపుకుని లోపలికి తీసుకొండి. మంచి నిద్ర వచ్చును.


 *  నిద్రపోవడానికి ముందు కప్పు వేడిపాలల్లో అరచెంచా మిరియాల కషాయం కలుపుకుని తాగుచున్న సుఖనిద్ర కలుగును.


 *  అశ్వగంధ చూర్ణము కూడా బాగా పనిచేయును . ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణం ఒక చిన్న గ్లాసు పాలల్లో కలిపి నిద్రపొవడానికి ముందు ప్రతినిత్యం సేవించవలెను .


       పైన చెప్పిన యోగాలలో మీకు అత్యంత సులభమైన యోగాన్ని తీసుకుని పాటించవచ్చు. సర్పగంధ వేళ్ళ చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ సామానులు అమ్మే దుకాణాలలో లభ్యం అగును.


          ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

  

12, మార్చి 2026, గురువారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 12 మార్చి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

1️⃣6️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*  

         

                    *162 వ రోజు*                    

*విరాట పర్వము ప్రథమాశ్వాసము*


*ప్రధమాశ్వాసం*```


పాండవుల అరణ్యవాసం ముగిసిందని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు “మహర్షీ! మా తాతలు పాండవులు వనవాసానంతరం అజ్ఞాత వాసమును అతి రహస్యంగా, చాతుర్యంగా, కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు వివరంగా చెప్తారా?” అని అడిగాడు. 


వైశంపాయనుడు “జనమేజయా ! పాండవులు తమ వనవాస కాలాన్ని పూర్తి చేసారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి.. 

“అయ్యా! ఇన్నాళ్ళు మాతో పాటు మీరూ అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నముగా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి” అని నమస్కరించాడు. 


ధౌమ్యుడు “ధర్మరాజా! నీవు ధర్మ స్వరూపుడవు నీ వలెనే పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము పోగొట్టుకొనుటకు నిషాధాచలము మీద, హరి అధితి గర్భములో వామన మూర్తిగానూ, ఔర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేసారు. కాలం కలసి వచ్చిన తరువాత పూర్వ వైభవం పొందారు. నీవు కూడా అలాగే నీ అజ్ఞాత వాసానంతరం పూర్వ వైభవం పొందగలవు” అన్నాడు. 


బ్రాహ్మణులందరూ పాండవులను దీవించి తమతమ ప్రదేశాలకు వెళ్ళారు.```


*పాoడవులు ద్రౌపది వారివారి పనులను నిర్ణయించు కొనుట*```


ధర్మరాజు తమ్ములను చూసి “మనం అయిదుగురం,ద్రౌపది అజ్ఞాతవాసం గడిపే ఉపాయం చెప్పండి” అన్నాడు. 


అర్జునుడు “అన్నయ్యా! మనకు యమ ధర్మరాజు ఇచ్చిన వరం ఉన్నది కదా! మనం ఎక్కడకు వెళ్ళినా ఎవరూ గుర్తుపట్టలేరు. కుఱుదేశం చుట్టూ పాంచాల, చేధి, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, శూరసేన, కళింగ, మగధ దేశములు సుభిక్షంగా మనకు నివాస యోగ్యంగా ఉన్నాయి. ఈ దేశాలలో మనకు అనుకూలంగా ఉన్న దేశంలో మనం అజ్ఞాతవాసం గడుపుదాం” అన్నాడు. 


ధర్మరాజు “నాకు తెలిసి విరాటరాజు సద్ధర్మవర్తి,మంచివాడు, బలవంతుడు అతని పాలనలో మనం అజ్ఞాత వాసం గడపటం ఉచితమని నాకు అనిపిస్తుంది. విరాట రాజు కొలువులో ఎవరెవరు ఏమి పనులు చేయగలరో నాకు వివరంగా చెప్పండి” అన్నాడు. 


అర్జునుడు “అన్నయ్యా ! నీవు మహనీయ మూర్తివి. సుకుమారుడవు, ఎంతో ప్రాభవం అనుభవించిన వాడివి. అటువంటి వాడవు ఎలా ఇతరులను సేవించ గలవు?” అన్నాడు. 


అర్జునా “నాకు శ్రౌతము, స్మార్తము, శకునము, జ్యోతిషము మొదలగునవి తెలియును. ఈ విద్యలు ప్రదర్శిస్తూ నేను కాలం గడపగలను. నేను జ్యూద ప్రియుడనని నీకు తెలుసు కదా. విరాటరాజును జ్యూదముతో అలరిస్తాను. ఆయన నా గురించి అడిగితే నేను పూర్వం ధర్మరాజు వద్ద స్నేహంగా ఉండేవాడినని చెప్తాను” అన్నాడు. ```


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

13మార్చి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

   *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌹 _*శుక్రవారం*_ 🌹

 *🪷13మార్చి2026🪷*  

  *దృగ్గణిత పంచాంగం*  

                    

           *స్వస్తి శ్రీ విశ్వావసు* 

           *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : నవమి* ‌ఉ 06.28 వరకు ఉపరి *దశమి* 

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : పూర్వాషాఢ* రా 03.03 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*

*యోగం : వ్యతీపాత* ఉ 10.32 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : గరజి* ఉ 06.28 *వణజి* రా 07.23 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:* 

 *ఉ 06.30 - 08.30 సా 05.00 - 06.00*               

అమృత కాలం  : *రా 09.47 - 11.32*

అభిజిత్ కాలం  : *ప 11.53 - 12.41*

*వర్జ్యం    : ఉ 11.15 - 01.00*

*దుర్ముహూర్తం  : ఉ 08.41 - 09.29 మ 12.41 - 01.29*

*రాహు కాలం  : ఉ 10.47 - 12.17*

గుళికకాళం      : *ఉ 07.47 - 09.17*

యమగండం   : *మ 03.17 - 04.47*

సూర్యరాశి : *కుంభం*        

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 06.26* 

సూర్యాస్తమయం :*సా 06.26*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.17 - 08.41*

సంగవ కాలం     :*08.41 - 11.05*

మధ్యాహ్న కాలం    :*11.05 - 01.29*

అపరాహ్న కాలం  :*మ 01.29- 03.53*

*ఆబ్ధికం తిధి :ఫాల్గుణ బహుళ దశమి*

సాయంకాలం     :*సా 03.53- 06.17*

ప్రదోష కాలం     :*సా 06.17 - 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.53*

నిశీధి కాలం       :*రా 11.53 - 12.41*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.40 - 05.28*

౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


     *పార్వతీ పరమా దేవీ* 

    *బ్రహ్మవిద్యాప్రదాయినీ*


             *🪷ఓం శ్రీ🪷*

 *🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం* *23వ భాగం*

 

🌹🌹🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 12 మార్చి 2026*


         *శ్రీ మహావిష్ణు పురాణం*               

                *23వ భాగం* 


*నారాయణుని కపిల మహర్షి అవతారం*```


స్వాయంభువ మనువు రెండవ పుత్రిక దేవహూతి వివాహం కర్దమ మహర్షితో జరిగింది. దేవహూతి కర్దమ దంపతులు  కర్దమ ఆశ్రమంలో సంసార జీవితం సుఖసంతోషాలతో గడుపుతున్నారు. దేవహూతి చేసే పతి సేవలకు ప్రసన్నుడై కర్దముడు ఆమెతో  “దేవహూతీ! వివాహం జరిగిన రోజు నుండి భక్తి శ్రద్థలతో నాకు సేవలు చేసి నన్ను సంతోషపరిచావు. నీ పతిభక్తికి మెచ్చి సమస్త జీవుల భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోగల దివ్యదృష్టి నీకు అనుగ్రహిస్తున్నాను. మనస్సులో వేరే కోరిక ఉంటే అడుగుము. తీరుస్తాను" అన్నాడు.


భర్త పాదాలకు నమస్కరించి దేవహూతి “స్వామీ! మీవంటి బ్రహ్మ మానస పుత్రుని భర్తగా పొందటం నా అదృష్టం. మీ  సేవాభాగ్యాన్ని పొందటం మించిన కోరికలు నా మనస్సులో లేవు" అని పలికింది.  కానీ ఆమె మనస్సులో సంతానం పొంది సంతానవతి కావాలి అనే కోరిక ఉంది. కానీ సంతానం కలిగిన వెంటనే సన్యాసాశ్రమం తీసుకుంటాను అని కర్దమ మహర్షి వివాహానికి పెట్టిన నియమం గుర్తుకు వచ్చి తన కోరికను మనస్సులో దాచుకుంది.


కర్దమ మహర్షి దేవహూతి మనస్సులో గల కోరికను గ్రహించాడు. ఆయనకు కూడా తొందరగా బ్రహ్మదేవుని ఆదేశం పాటించి సంతానం పొంది సన్యాసాశ్రమం తీసుకోవాలి అని ఉంది. అందుకని తనే ఆమె మనస్సులోని కోరిక తీర్చాలి అని నిశ్చయించుకున్నాడు.


దేవహూతిని బిందు సరోవరానికి తీసుకెళ్లి  "దేవహూతీ!  ఈ బిందు సరోవరం శ్రీమహావిష్ణువు కరుణారస బిందువులతో ఏర్పడింది. ఇందులో స్నానం చేసినవారికి శుభ ఫలితాలు లభిస్తాయి. నీవు ఈ సరోవరంలో స్నానం చేసి శుచివై రమ్ము" అని ప్రేమగా చెప్పాడు.  


భర్త మాట పాటించి దేవహూతి బిందు సరోవరంలో స్నానం చేసి వచ్చింది.


కర్థమ మహర్షి తన తపశక్తితో దివ్య విమానం సృష్టించాడు. కర్దముడు దేవహూతి దివ్య సుందరాకార స్త్రీ పురుషులుగా మారి విమానం ఎక్కి విహారానికి బయలుదేరి వెళ్లారు. నూరు సంవత్సరాలు లోకాలన్ని విహరిస్తూ  దాంపత్య సుఖాలు ఆనుభవించారు. ఆశ్రమానికి వచ్చేముందు  తొమ్మిది దివ్య రూపాలు ధరించి దేవహూతిని కలిసి గర్భాధానం చేసాడు.


ఫలితంగా ఆశ్రమం తిరిగి వచ్చిన దేవహూతికి క్రమంగా తొమ్మిది మంది ఆడపిల్లలు జన్మించారు.  వారికి వరుసగా కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అని నామకరణం చేసారు. దేవహుతికి పిల్లలు పుట్టిన కొంత కాలానికి కర్దమ మహర్షి దేవహూతికి తను వివాహానికి పెట్టిన నిబంధన గుర్తు చేస్తూ "నీవు అనుమతి ఇస్తే నేను సన్యాసాశ్రమం తీసుకుంటాను"  అన్నాడు.


దేవహూతి భర్తకు నమస్కరించి "స్వామీ! మీ నియమం నాకు గుర్తుంది. మీ అనుగ్రహం చేత జన్మించిన ఆడపిల్లలు రేపు వివాహాలు చేసుకుని అత్తారింటికి వెళ్లి పోతారు. మీరు సన్యాసాశ్రమం తీసుకుని వెళ్లి పోతే నేను ఒంటరిదానను అవుతాను. 


పున్నామ నరకం తప్పించడానికి పుత్రుడు కావాలి అంటారు. మీరు నన్ను వరం కోరుకోమని అడిగినప్పుడు కోరలేదు. ఇప్పుడు కోరుకుంటున్నాను. నాకు పుత్ర సంతానం అనుగ్రహించండి.  శ్రీమన్నారాయణుడు మనకు పుత్రుడిగా జన్మిస్తానని మీకు వరము ఇచ్చాడు అని చెప్పారు.

కనుక నారాయణుడు నా గర్భాన జన్మించేలా అనుగ్రహించండి. పుత్రుడు కలిగాక, తండ్రిగా ఆడపిల్లల వివాహాలు జరిపించండి. పిదప మీ అభీష్టం మేరకు సన్యాసం స్వీకరించండి" అని కోరింది. 


భార్య కోరికలో ధర్మముందని గ్రహించి కర్దమ మహర్షి అంగీకరించాడు.


"దేవీ! నీ కోరిక తప్పక తీరుస్తాను. త్వరలో శ్రీమన్నారాయణుడు నీ గర్భం నుంచి కపిలుడిగా జన్మిస్తాడు. సాంఖ్య శాస్త్రాచార్యుడిగా లోక ప్రసిద్ది చెందుతాడు. శ్రీహరి నాకిచ్చిన వరం నెరవేరడానికి నీవు ధృడచిత్తంతో, భక్తి శ్రద్థలతో అష్టాక్షరి నారాయణ మంత్రంతో శ్రీహరిని సేవించుము. శ్రీహరి నీ గర్భాన జన్మించి నీకు తత్త్వోపదేశం చేసి తరింపచేస్తాడు" అని అష్టాక్షరి మంత్రం ఉపదేశించాడు.


దేవహూతి శుభ ముహూర్తంలో అష్టాక్షరి మహామంత్ర దీక్ష తీసుకుని భక్తి శ్రద్థలతో నారాయణుని పూజించ సాగింది. 


ఆమె దీక్షకు ప్రసన్నుడైన నారాయణుడు ఒక రోజు రాత్రి కలలో కనిపించి "తల్లీ! నీ దీక్షకు ప్రసన్నుడయ్యాను. త్వరలో నీకు కుమారుడిగా జన్మిస్తాను"  అని పలికి అదృశ్యమయ్యాడు. దేవహూతి భక్తితో నమస్కరించింది. కొంతకాలానికి దేవహూతి గర్భవతి అయ్యింది. కర్దమ మహర్షి, దేవహూతిలు నారాయణ నామ స్మరణ చేస్తూ గడప సాగారు.


*తరువాతి కథ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏