14, ఫిబ్రవరి 2023, మంగళవారం

కొలుతునిన్ను శంభుని తనయా!

 *శుభ బుధవారం*


శాంతికి తెల్లని వస్త్రము 

క్రాంతిని కనులందు నిలుపు కరిముఖవదనా

భ్రాంతిని విడనాడుటకై

శాంతముతో కొలుతునిన్ను శంభుని తనయా!

*శుభ గురువారం*


సాయేకద రక్ష మనకు

సాయేకద సర్వజనుల సకలంబగునే

సాయే తలచిన బ్రోచును

సాయేమరి భక్తజనుల సర్వము కృష్ణా

*శుభ శుక్రవారం*


అమ్మలగన్నమ్మయనుచు

మమ్ములకాపాడరావె మాగృహలక్ష్మీ!

నమ్మితిమమ్మా నిన్నే

యిమ్మా యడగక వరములు యిలవేలుపువై!!


✍🏼 *గోగులపాటి కృష్ణమోహన్* 🙏🏽


కామెంట్‌లు లేవు: