22, మార్చి 2023, బుధవారం

*బ్రహ్మ ముడి

 🙏🤝 *బ్రహ్మ ముడి*🤝🙏

               ➖➖➖


*వివాహంలో "బ్రహ్మముడి" ని ఎందుకు వేస్తారు..?*


*మన శరీరంలో మూలాధార చక్రానికీ, స్వాధిష్టాన చక్రానికీ, మధ్యలో  ‘బ్రహ్మ గ్రంధి’ ఉంటుంది. ఇది ప్రత్యుత్పత్తి కి సంబంధించిన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.*


*పురోహితుని రూపంలో ఉన్న సాక్షాత్తూ బ్రహ్మ దేవుడు వేసే ముడులే, బ్రహ్మ ముడులనీ, బ్రహ్మ గ్రంధులను కలపడానికి వేసే ముడులు కాబట్టి బ్రహ్మ ముడులు అని పెద్దలు చెబుతారు.*


*వధూవరులు ఇద్దరినీ రెండు దేహాలూ, ఒకటే ఆత్మ, ఒకటే ప్రాణంగా చేసే ప్రక్రియే, బ్రహ్మ ముడి!* 


*కంద పిలక, తమలపాకు, వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరపుకాయ, చిల్లరనాణెం కలిపి , వధూవరుల కొంగుకు కట్టి, ఇద్దరి కొంగులను కలిపి ముడి వేస్తారు.*


*కంద ఒకచోట పాతితే దిన దినమూ వృద్ధి చెందుతూ, ఎకరం ఎకరముల వరకూ వ్యాపిస్తూ పోతుంది. కందలాగా అనుదినమూ వారి బంధము వృద్ధి చెందుతూ, వంశవృద్ధిని చెయ్యాలని కందను కడతారు.*


*క్షయం లేనిది ఖర్జూరపుకాయ. దంపతుల బంధమూ, వంశమూ, క్షయం లేకుండా ఉండాలని ఖర్జూరపుకాయను కడతారు.*


*అందాన్ని, ఆరోగ్యాన్ని, పవిత్రతనూ, పెంపొందించే ఔషధం పసుపు. ఆయురారోగ్యములతో, పవిత్రంగా ఉండాలని పసుపుకొమ్ములను కడతారు.*


*ఇకపోతే, ఆకు-వక్క అనేది విడివిడిగా ఉన్నా, కలిస్తే ఎర్రగా పండుతాయి. దంపతులు ఇరువురూ ఒకటే ప్రాణం గా ఉంటూ, వారి కాపురాన్ని నూరేళ్ళ పంటగా పండించుకోవాలని ఆకు, వక్క కడతారు.*


*మనకు తెలిసినదే, చిల్లర నాణెం లక్ష్మీస్వరూపం. అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందాలని చిల్లర నాణెం కడతారు.*


*ఇన్ని పరమార్ధాలు ఉన్న… కంద పిలక, పసుపుకొమ్ము, ఖర్జూరపుకాయ, ఆకు, వక్క, చిల్లరనాణెం కలిపి పురోహితుడి రూపంలో ఉన్న సాక్షాత్ బ్రహ్మ దేవుడే వేదమంత్రాల నడుమ పెద్దల ఆశీర్వచనములతో ముడి వేస్తే,              ఆ కాపురానికి తిరుగులేదని మన ప్రగాఢ నమ్మకం, విశ్వాసం.*


🙏🌹🙏🌹🙏🌹

కామెంట్‌లు లేవు: