25, జనవరి 2025, శనివారం

వాహన మెంచి వాడుట

 ఉ. వాహన మెంచి వాడుట ప్రవర్ధన మొందెడు దేహ రక్షకే 

సాహస యాత్ర జేసి కొన సాగుట కోసము గాదు గాన స

మ్మోహము వీడి మత్తునకు మూల్య మొసంగక జాగరూకులై

స్నేహ విశిష్ట యోచనల సేమము నెంచుట మేలు  భారతీ!౹౹ 5


శా. క్షేమమ్మైన ప్రయాణ మార్గములు సంక్లిష్టమ్ము లై యొప్పు తా

మేమాత్రమ్ము ప్రమత్తులై చనినచో నింటిల్లిఁ గూలార్చు ని

ద్రామోహమ్ములు చోదకత్వమున విధ్వంసమ్ము సృష్టించు సం

క్షేమమ్మున్ మది నెంచుచు న్నడపగా శ్రేయమ్మునౌ భారతీ౹౹6

కామెంట్‌లు లేవు: