*నేడు దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి! ఆ మహాకవి వర్ధంతి సందర్భంగా అక్షర నివాళులు!*
అక్షరాల్లో ఆవేశం…
పదాల్లో ధిక్కారం…
కవిత్వంలో చైతన్యం…
పాటల్లో పరవశించే తెలుగుతనం…
నిజాం నిరంకుశ పాలనను తన కలంతో ప్రశ్నించి, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి అక్షర రూపమిచ్చిన కవి.
"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహాకవి, బహుభాషావేత్త దాశరథి కృష్ణమాచార్య.ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం అన్యాయంపై తిరుగుబాటు… ప్రతి పదం ప్రజా చైతన్యానికి ప్రతీక.
తెలంగాణ సాహితీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘనమైన అక్షర నివాళులు. 🙏
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి